Jump to content

AP to promote roof-top solar energy in a big way


Recommended Posts

10 వేలకే సౌరపలక 
సబ్సిడీపై అందించేందుకు ఏపీఎస్పీడీసీఎల్‌ ప్రణాళిక 
ప్రయోగాత్మకంగా తిరుపతి, విజయవాడల్లో అమలు 
వారంలో దరఖాస్తుల ఆహ్వానం 
11ap-main8a.jpg

ఈనాడు, తిరుపతి: ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్తు పలకలను చౌక ధరకే ఏర్పాటు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) ప్రణాళికలు రూపొందించింది. తక్కువ విద్యుత్తు వాడుతున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీకి అదనంగా మరికొంత ఏపీఎస్పీడీసీఎల్‌ భరించి ప్రజలకు చేరువ చేసేందుకు సిద్ధమైంది. ముందుగా తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. మరో వారంలో వినియోగదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకునే సౌర పలకలకు నెడ్‌క్యాప్‌ 30 శాతం సబ్సిడీ అందిస్తూ వస్తోంది. ఒక కిలోవాటు విద్యుత్‌కు సంబంధించి సౌర పలకల ఏర్పాటుకు సుమారు 70వేలు అవుతుంది. ఇందులో 30 శాతం సబ్సిడీ పోనూ రూ.49వేలు చెల్లించాల్సి వచ్చేది. దీంతో వినియోగదారులు ముందుకు రాకపోవడంతో.. నెడ్‌క్యాప్‌ సబ్సిడీకి అదనంగా ఏపీఎస్పీడీసీఎల్‌ మరికొంత నిధులను భరించేందుకు సిద్ధమైంది. ఇటీవలే కొత్తగా సౌర పలకలు సరఫరా చేసేవారి నుంచి టెండర్లు పిలిచారు. ఒక్కో కిలోవాట్‌ విద్యుత్తును ఉత్పత్తి చేసే సౌర పలకలను రూ.60వేలకు ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నెలకు 100 యూనిట్ల విద్యుత్తును వినియోగించే వినియోగదారులు..1 కిలోవాట్‌ సౌరపలకలకు రూ.10వేలు చెల్లిస్తే సరిపోతుంది. 0.5 కిలోవాట్‌ పెట్టుకుంటే రూ.5వేలకే అందిస్తారు. నెడ్‌క్యాప్‌ ఇచ్చే 30శాతం సబ్సిడీ పోనూ మిగతా మొత్తాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ భరించనుంది. 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ వినియోగించే వారికి ఒక్కో కిలోవాట్‌ సౌర పలకలను రూ.15వేలకు అందిస్తారు. 0.5 కిలోవాట్‌కు రూ.7500కే ఇవ్వనున్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...