Jump to content

బెజవాడ బాగుందా: ప్రజలను ప్రశ్నించిన సీఎం చంద్రబాబు


Recommended Posts

  • క్యాంటీన్ల ప్రారంభ సభలో నగర ప్రజలను ప్రశ్నించిన సీఎం చంద్రబాబు
  • స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పురస్కారం అందుకున్న వీఎంసీ ఇంకా ఆదర్శంగా తయారు కావాలని పిలుపు
విజయవాడ: ‘విజయవాడ నగరం బాగుందా? మార్పు కనిపిస్తుందా?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. బుధవారం అన్న క్యాంటీన్లను ప్రారంభించిన అనంతరం విజయవాడలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ‘నగరంలోని ప్రధాన రహదారుల్లో సెంట్రల్‌ డివైడర్లు ఏర్పాటు చేసి.. వాటిలో మొక్కలు నాటించాం. నగరమంతటా ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసి.. అవి రాత్రి మాత్రమే వెలిగి పగలు వాటికవే ఆగిపోయేలా సెన్సార్లు ఏర్పాటు చేశాం. నగర రహదారులను ఆనుకుని ఉన్న గోడలపై ఆకర్షణీయమైన డిజైన్లలో రంగులు వేయించడం వల్ల నగరానికే అందం వచ్చింది.’ అని వివరించారు. హేపీ సండేతో ఆదివారం నగరవాసులు సంతోషంగా గడుపుతున్నారని, విజయవాడ నగరంలో గణనీయమైన మార్పులు తీసుకురావడం వల్లే స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో జాతీయస్థాయిలో ఐదో స్థానంలో నిలిచిందన్నారు. ఈ విజయం నగరవాసులదేనని ప్రశంసించారు. నగరంలో ఇంకా మార్పులు తీసుకురావాలని, దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శంగా విజయవాడను తీర్చిదిద్దాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
 
మహిళల ఉత్సాహం 
నగర పరిస్థితుల గురించి వివరిస్తూ కార్యక్రమానికి హాజరైన మహిళలకు ముఖ్యమంత్రి పలు ప్రశ్నలు వేశారు. వాటికి మహిళలు కరతాళ ధ్వనులతో ఉత్సాహంగా స్పందించారు. తన ప్రశ్నలకు వారు సానుకూల సమాధానాలివ్వడంతో ముఖ్యమంత్రి సంతృప్తి చెందారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆనందంగా స్వాగతం పలుకుతుంటే తనకు కొత్త శక్తి వస్తున్నదని చెప్పారు. అయితే నగరవాసుల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. నగరంలో రహదారులతోపాటు డ్రెయినేజీలను కూడా అభివృద్ధి చేసి, పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...