Jump to content

Amazon Fulfillment Center,Vijayawada


Recommended Posts

విజయవాడలో అమెజాన్‌ సెంటర్‌
13-07-2018 03:56:27
 
  • 16 నుంచి సేవలు ప్రారంభం
విజయవాడ (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు వేగంగా వస్తువులను డెలివరీ చేసేందుకు వీలుగా విజయవాడలోనే పూర్తిస్థాయి ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఇ- కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రారంభించింది. ఈ సెంటర్‌ వివరాలను సంస్థ ఫుల్‌ఫిల్‌మెంట్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ అఖిల్‌ సక్సేనా గురువారం విలేకరులకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్‌ ఏర్పాటు చేసిన తొలి సెంటర్‌ ఇదని ఆయన తెలిపారు. దేశంలో ఇలాంటివి 50కిపైగా ఉన్నాయని, విజయవాడలో ఈ నెల 16 నుంచి సేవలు మొదలవుతాయని చెప్పారు. వాస్తవానికి ఈ సెంటర్‌ను తొలుత విశాఖలో నెలకొల్పాలని భావించినా.. విజయవాడ నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లు అధికంగా ఉండటంతో బెజవాడవైపే మొగ్గు చూపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన వారు ఇకపై ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయగానే వేగంగా వస్తువుల డెలివరీ ఉంటుందని సక్సేనా వివరించారు
Link to comment
Share on other sites

విజయవాడలో అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్ ప్రారంభం...

Super User
13 July 2018
Hits: 21
 
amazon-13072018-1.jpg
share.png

వినియోగదారులకు వేగంగా వస్తువులను డెలివరీ చేసేందుకు వీలుగా విజయవాడలోనే పూర్తిస్థాయి ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఇ- కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రారంభించింది. ఈ సెంటర్‌ వివరాలను సంస్థ ఫుల్‌ఫిల్‌మెంట్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ అఖిల్‌ సక్సేనా గురువారం విలేకరులకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్‌ ఏర్పాటు చేసిన తొలి సెంటర్‌ ఇదని ఆయన తెలిపారు. దేశంలో ఇలాంటివి 50కిపైగా ఉన్నాయని, విజయవాడలో ఈ నెల 16 నుంచి సేవలు మొదలవుతాయని చెప్పారు. వాస్తవానికి ఈ సెంటర్‌ను తొలుత విశాఖలో నెలకొల్పాలని భావించినా.. విజయవాడ నుంచి ఆన్‌లైన్‌ ఆర్డర్లు అధికంగా ఉండటంతో బెజవాడవైపే మొగ్గు చూపినట్లు ఆయన పేర్కొన్నారు.

 

amazon 13072018 2

ఈ ప్రాంతానికి చెందిన వారు ఇకపై ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయగానే వేగంగా వస్తువుల డెలివరీ ఉంటుందని సక్సేనా వివరించారు. ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ విజయవాడ శివార్లలోని నిడమానారులో వచ్చింది. 20 వేల స్క్వేర్ ఫీట్ లో, 15 వేల క్యూబిక్ ఫీట్ స్టోరేజ్ స్పేస్ తో, ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ ను అమెజాన్ ప్రారంభించింది. విజయవాడ ఎయిర్ పోర్ట్ కు దగ్గరగా ఉండటంతో, నిడమానూరుని ఎంచుకున్నట్టు సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ సెంటర్ , సోలార్ పవర్ సిస్టం ద్వారా పవర్ జెనరేట్ చేసుకుంటామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.

amazon 13072018 3

విజయవాడలో ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ ఏర్పాటుచేయడంతో, వేలమంది చిన్న, మధ్య తరహా వ్యాపారులు స్థానికంగా తయారుచేసిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విక్రయించుకునే వీలవుతుందన్నారు. ప్యాకేజింగ్‌, రవాణా, లాజిస్టిక్స్‌, హాస్పిటాలిటి వంటి సహాయక వ్యాపారాలు వృద్ది చెందుతాయన్నారు. ఈ సెంటర్‌ ద్వారా అమెజాన్‌ తన స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 3.2 మిలియన్‌ క్యూబిట్‌ ఫీటుకు పెంచుకుంది. దీంతో వినియోగదారులకు త్వరితగతిన సరుకులను అందజేయనుంది. యువతకు వేలకొద్దీ ఉద్యోగవకాశాలను కూడా ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ సృష్టించనుందని అమెజాన్‌ ఇండియా తెలిపింది.

Link to comment
Share on other sites

విజయవాడలో అమెజాన్‌ కేంద్రం

12114913BRK-85A.JPG

విజయవాడ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ నవ్యాంధ్రలో కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇప్పటివరకూ హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తాజాగా విజయవాడలోనూ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసే ఏపీ ఖాతాదారులకు ఈ కేంద్రం ద్వారానే వస్తువులను సరఫరా చేయబోతోంది. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో 50 కేంద్రాలను నెలకొల్పిన అమెజాన్‌ ఈ ఏడాది మరో అయిదు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు అఖిల్‌ సక్సేనా తెలిపారు. సులభతర వాణిజ్యం చేసేందుకు ఏపీ ప్రభుత్వం మంచి ప్రోత్సాహం అందిస్తోందని అందుకే తమ సఫలీకృత కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

Link to comment
Share on other sites

  • 3 months later...
ఆంధ్రప్రదేశ్‌కు అమెజాన్‌!
31-10-2018 04:46:12
 
అమరావతి (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు స్థానికంగా ఉన్న వనరులతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నారు.. కానీ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలు రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌, డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కేవలం శిక్షణకే పరిమితం కాకుండా క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో ఎంపిక చేసి ఏపీ విద్యార్థులకు ఉపాధిని కల్పించనున్నాయి. రాష్ట్ర విద్యార్థుల ప్రతిభను ప్రపంచ శ్రేణి ఆన్‌లైన్‌ విక్రయ సంస్థ అమెజాన్‌ గుర్తించింది. దాని ప్రతినిధులు నవంబరు 14న రాష్ట్రానికి వచ్చి విద్యార్థుల ప్రతిభను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఇంజనీరింగ్‌ విద్యార్థులకు వెబ్‌ సర్వీసెస్‌ నైపుణ్యాభివృద్ధిలో అమెజాన్‌ శిక్షణ అందిస్తోంది. అమెజాన్‌ ప్రతినిధులు వచ్చి పరిశీలన జరిపిన అనంతరం ఇక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై నిర్ణయం తీసుకోనుంది.
 
రూటుమార్చిన నైపుణ్యాభివృద్ధి సంస్థ
స్థానికంగా అందుబాటులో ఉన్న నైపుణ్యాభివృద్ధి సంస్థల్లో విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పిస్తున్న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ).. ఇప్పుడు కొత్త పంథా అనుసరిస్తోంది. ప్రపంచ శ్రేణి సంస్థలతో శిక్షణ ఇప్పించే చర్యలు చేపట్టింది. సాఫ్ట్‌వేర్‌ అకౌంటింగ్‌లో ప్రసిద్దిగాంచిన ట్యాలీ సంస్థతో ఒప్పందం చేసుకుని ట్యాలీ ఈఆర్‌పీ - జీఎ్‌సటీలో కామర్స్‌ విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తోంది. ఇంతకాలం ట్యాలీ కోసం ఎంతో వ్యయప్రయాసలు పడ్డ కామర్స్‌ విద్యార్థులకు ఇది వరంగా మారింది. అంతే కాకుండా.. ప్రపంచ శ్రేణి సంస్థ కోర్సేరాలో పైథాన్‌, గూగుల్‌ ఐటీ, డేటా సర్వీసె్‌సలలో శిక్షణ అందిస్తోంది. జోహో, ఇన్‌స్టా ఈఎంఐలో మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోనూ తర్ఫీదు ఇస్తోంది. ఇవేగాక ఉడాసిటీ, గూగుల్‌, ఆటో డెస్క్‌, ఉడేమీ, ఆడోబ్‌ సంస్థలు రాష్ట్ర విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్నాయి.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...