Jump to content

Ease of Doing Business


Recommended Posts

4 yes back cheukunte kaneesam CM camp office kuda ledu capital Inka saresari...alanti stage nunchi with centre and opposition parties -ve propoganda tho AP at no.1 anedi mamul vishayam kadule....hope everyone realizes the importance....anduke anedi

Father of AP CBN :no1:

 

Link to comment
Share on other sites

  • Replies 113
  • Created
  • Last Reply
ఏపీ నెం 1 తెలంగాణ నెం 2
సులభ వాణిజ్య ర్యాంకుల్లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాలు
  వెంట్రుకవాసి తేడాతో బలంగా పోటీపడ్డాయని ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్‌ ప్రశంస
  సంస్కరణల్లో తెలంగాణ, ఝార్ఖండ్‌కు 100% మార్కులు
10ap-main1a.jpg

విధానాల సంస్కరణల్లో తెలంగాణ, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు 100% మార్కులు సాధించాయి. ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌లు 99.73% పొందాయి.

పారిశ్రామివేత్తల నుంచి తీసుకున్న సమాచారం (ఫీడ్‌బ్యాక్‌)లో ఏపీ అందరికంటే అధికంగా 86.50% మార్కులు సాధించి మొత్తంమీద మొదటి ర్యాంకును చేజిక్కించుకొంది. ఈ విభాగంలో తెలంగాణ 83.95% మార్కులతో రెండో ర్యాంకులో నిలిచింది.

మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ర్యాంకులకోసం పోటీపడ్డాయి. ఇందులో 95%కిపైగా మార్కులు సాధించిన 9 రాష్ట్రాలను అగ్రగాములుగా  ప్రకటించారు.

ఈనాడు, దిల్లీ: సులభ వాణిజ్య ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు మరోసారి సత్తాచాటాయి. 2017 సంవత్సరానికి కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం మంగళవారం ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ 1, తెలంగాణ నెంబర్‌ 2 స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది తెలంగాణతో కలిసి మొదటి ర్యాంకు పంచుకున్న ఆంధ్రప్రదేశ్‌ ఈసారి 98.42% మార్కులతో ఒంటరిగానే ఆ స్థానంలో నిలిచింది. 98.33% మార్కులతో తెలంగాణ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకొంది. హరియాణా, ఝార్ఖండ్‌, గుజరాత్‌లు వరుసగా 3, 4, 5 ర్యాంకులు పొందాయి. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం కార్యదర్శి రమేష్‌ అభిషేక్‌, ప్రపంచబ్యాంకు కంట్రి (ఇండియా) డైరెక్టర్‌ జునాయిద్‌ అహమ్మద్‌లు ఈ ర్యాంకింగ్‌లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ స్పష్టమైన విధానాలతో  నిలకడైన పనితీరు కనబరుస్తోందని జునాయిద్‌ కితాబిచ్చారు. రెండు తెలుగురాష్ట్రాలు వెంట్రుకవాసి తేడాతో బలంగా పోటీపడటం శుభపరిణామమన్నారు. ఈసారి ఈ ర్యాంకులను ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ పేరుతో కాకుండా ‘స్టేట్‌ బిజినెస్‌ రిఫామ్స్‌ అసెస్‌మెంట్‌’ పేరుతో ప్రకటించారు.

మూడేళ్లుగా మదింపు...
కేంద్ర పారిశ్రామిక విధాన ప్రోత్సాహక విభాగం(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌- డీఐపీపీ), ప్రపంచబ్యాంకు కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా తీసుకొస్తున్న వాణిజ్య సంస్కరణలను గత మూడేళ్లుగా మదింపుచేస్తూ వస్తున్నాయి. ప్రభుత్వాల పరిధిలోని వివిధ నియంత్రణ సంస్థల పనితీరును సంస్కరించి మరింత వేగంగా, సమర్థంగా, పారదర్శకంగా సేవలు అందించేలా చేయడమే ఈ కసరత్తు ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన సంస్కరణల సంఖ్యను గత మూడేళ్లలో 285 నుంచి 372కి పెంచారు. కార్మికులు, పర్యావరణం, అనుమతుల మంజూరు, సింగిల్‌విండో విధానం, నిర్మాణ అనుమతుల మంజూరు, కాంట్రాక్ట్‌ల అమలు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌, క్షేత్రస్థాయిపరిశీలన విభాగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలను ప్రధానంగా ర్యాంకింగ్‌లకు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సంస్కరణల్లో ఎన్నింటిని అమలుచేశామన్న విషయాలను రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పిస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఉపయోగించుకున్న వారి నుంచి కూడా స్థూలంగా డీఐపీపీ వివరాలు సేకరిస్తోంది. వీటన్నింటి ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న సంస్కరణలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయా? లేదంటే అర్హులకు నిజంగా చేరాయా? అని తెలుసుకోడానికి ఈ విధానాన్ని పాటిస్తున్నారు.

10ap-main1b.jpg

మొత్తం 372 సంస్కరణల్లో 78 సంస్కరణల అమలుపై డీఐపీపీ సర్వే చేసింది. దేశంలో సుమారు 50వేల మందితో ముఖాముఖి మాట్లాడించి ఆయా ప్రభుత్వాల తీరుపై అభిప్రాయాలు సేకరించింది. 23 రాష్ట్రాల్లో సుమారు 5వేల మందికిపైగా ప్రైవేటు సెక్టార్‌ వినియోగదారులు, ఇంజినీర్లు, లాయర్లు, ఎలక్ట్రిక్‌ కాంట్రాక్టర్ల ద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకొంది. ఈ 78 సంస్కరణల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అప్‌లోడ్‌ చేసిన సాక్ష్యాలకు అరమార్కు, పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన సమాచారానికి మరో అరమార్కు ఇచ్చారు. ర్యాంకులకోసం ఈసారి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవడంవల్ల ప్రభుత్వ సంస్కరణలు వాస్తవంగా అమలవుతున్నాయా? లేదా? అన్న విషయం తెలిసి వచ్చినట్లు డీఐపీపీ కార్యదర్శి పేర్కొన్నారు. 2015, 2016 సంవత్సరాలతో పోలిస్తే 2017లో చాలా రాష్ట్రాలు సంస్కరణల్లో ముందడుగు వేశాయి. 15 రాష్ట్రాలు 90%కిపైగా మార్కులు సాధించాయి.  సులభవాణిజ్యంలో మంచి ర్యాంకు సాధించడానికి ఈసారి తెలంగాణ రాష్ట్రం త్రిపురకు సాయంచేసింది. అలాగే పశ్చిమబెంగాల్‌ నాగాలాండ్‌కు చేయూతనందించింది. వెనుకబడిన రాష్ట్రాలకు అవగాహన కల్పించడానికి డీఐపీపీ ఈసారి 30 కార్యశాలలు నిర్వహించింది.

Link to comment
Share on other sites

ఏపీ నెంబర్ 1
11-07-2018 00:42:35
 
636668736685321346.jpg
  • సులభతర వ్యాపార నిర్వహణలో అగ్రస్థానం
  • విధానాలు, సంస్కరణ అమలులో భేష్‌
  • ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు
  • పెట్టుబడిదారులకు నవ్యాంధ్ర తొలి చాయిస్‌
  • ర్యాంకింగ్స్‌ ప్రకటించిన కేంద్రం, ప్రపంచ బ్యాంకు
  • స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ
  • ఆ తర్వాతి స్థానాల్లో హరియాణా, జార్ఖండ్‌, గుజరాత్‌
 
 
ఉత్కంఠ భరిత పోటీలో రాష్ట్రానిదే విజయం
అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్‌... సులభతర వ్యాపార నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లోనూ అగ్రస్థానంలో నిలిచింది. ‘జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానం ఏపీ’ అని సాధికారికంగా స్పష్టమైంది. రాష్ట్రాల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఏపీనే అంతిమ విజయం వరించింది. గత ఏడాది ఏపీ, తెలంగాణ రెండూ సమానమైన మార్కులతో అగ్రస్థానాన్ని పంచుకోగా... ఈసారి తెలంగాణను నవ్యాంధ్ర వెనక్కి నెట్టింది.
 
 
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): అత్యంత సులభతరమైన వ్యాపార విధానాల ర్యాంకింగ్‌లో తెలుగు రాష్ట్రాలు మళ్లీ తమ సత్తా చాటాయి. 2016 జూలై నుంచి ఈ సంవత్సరం జూలై వరకు వివిధ ప్రమాణాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాను ప్రపంచ బ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డిఐపిపి) మంగళవారం విడుదల చేశాయి. ఈ సారి ఈ జాబితాలో 98.42 శాతం స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌ సులభతర వ్యాపారానికి దేశంలో అత్యంత అనువైన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో సంస్కరణలకు 99.73 శాతం, పారిశ్రామికవేత్తల అభిప్రాయాల క్రోడీకరణ కింద 86.50 శాతం స్కోరు లభించింది.
 
ఈ రెండు స్కోర్ల ఆధారంగా ఎపి తుది స్కోరును ఖరారు చేశారు. గత ఏడాది ఎపితో కలిసి మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ, ఈసారి 98.33 శాతం స్కోరుతో రెండో స్థానం దక్కించుకుంది. సంస్కరణల అమలులో నూరు శాతం స్కోరు సాధించినా, పారిశ్రామికవేత్తల అభిప్రాయాల క్రోడీకరణలో 83.95 శాతం మాత్రమే లభించడంతో తెలంగాణ రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. హరియాణా 98.07 శాతం మార్కులతో మూడో స్థానంలో నిలిచింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడులను పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాలు ఈ సారి కూడా మొదటి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.
 
నిజానికి ఈ సారి తెలంగాణ, జార్ఖండ్‌ మొదటి రెండు స్థానాల్లో నిలుస్తాయని భావించారు. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌ వన్‌ స్థానం లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ ర్యాంకింగ్‌ దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ‘వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బిఆర్‌ఎపి) పేరుతో మొత్తం 340 పాయింట్ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్‌ గత మూడేళ్ల నుంచి ఈ ర్యాంకింగ్‌ల జాబి తా విడుదల చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వ్యాపారానికి అనువైన పరిస్థితులు కల్పించడంతో పాటు పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం నెలకొల్పేందుకు ఈ ర్యాంకింగ్‌ తలపెట్టారు.
 
నిర్ణయాంశాలు
ఈ ర్యాంకులు నిర్ణయించేందుకు అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. అందులో నిర్మాణ రంగానికి అవసరమైన అనుమతులు, కార్మిక చ ట్టాల సరళీకరణ, పర్యావరణ అనుమతులు, భూముల కేటాయింపులు, సమాచారం అందుబాటు, వివిధ అనుమతుల కోసం ఏక గవాక్ష విధానం (సింగిల్‌ విండో పర్మిషన్‌) అమలు వంటి విషయాలు అత్యంత ముఖ్యమైనవి. వీటికి సంబంధించి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేసిన సంస్కరణల ఫలితాలు (రీఫార్మ్స్‌ ఎవిడెన్స్‌ స్కోరు), వాటిపై పారిశ్రామిక, వాణిజ్య సంస్థల నుంచి వచ్చిన స్పందన (ఫీడ్‌ బ్యాక్‌) ఆధారంగా ఈ ర్యాంకులు రూపొందిస్తారు.
 
అనూహ్య ఫలితాలు
దేశంలో అత్యంత పారిశ్రామిక రాష్ట్రంగా పరిగణించే మహారాష్ట్ర ఈసారి సులభతర వ్యాపార ఇండెక్స్‌లో 13వ స్థానంలో నిలవడం ఆశ్చర్యపరిచింది. దక్షిణాదిలో అత్యంత పారిశ్రామిక రాష్ట్రంగా పరిగణించే తమిళనాడు కూడా ఈ దఫా 15వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
 
త్వరలో ప్రపంచ బ్యాంక్‌ ర్యాంకులు
మరోవైపు ప్రపంచ బ్యాంక్‌ సులభతర వ్యాపారానికి సంబంధించి త్వరలో దేశాల ర్యాంకింగ్‌ ప్రకటించబోతోంది. గత ఏడాది ఈ ర్యాంకింగ్‌లో భారత్‌ ఒకేసారి 30 స్థానాలు ముందుకు ఎదిగి 100వ స్థానంలో నిలిచింది. వీలైనంత త్వరలో కనీసం టాప్‌-50 దేశాల జాబితాలో చేరాలని మోదీ సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో త్వరలో వెలువడే జాబితాలో భారత దేశం స్థానం ఎలా ఉంటుందోననే ఆసక్తి వ్యక్తమవుతోంది.
 
ర్యాంకింగ్‌ ముఖ్యాంశాలు
  • సంస్కరణల అమలు ఫలితాల విషయలో తెలంగాణ, జార్ఖండ్‌ నూరు శాతం స్కోరు సాధించాయి.
  • బొగ్గు, ఇనుప ఖనిజ నిక్షేపాలతో ఇప్పటికే అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ఉన్న జార్ఖండ్‌ సంస్కరణల అమలు ఫలితాల పరంగా 100 శాతం స్కోరు సాధించింది.
  • కీలకమైన 12 రంగాలకు సంబంధించి అమలు చేస్తున్న నియంత్రణ ప్రక్రియ, విధి, విధానాల ఆధారంగా సంస్కరణల అమలు ఫలితాలు అంచనా వేశారు.
  • రాష్ట్రాలు చెప్పుకుంటున్న సంస్కరణల అమలు ఫలితాలపై డిఐపిపి ఈ సారి ప్రభుత్వంతో పాటు, వ్యాపార సంస్థల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంది.
Ap-545.jpg
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలు, నిర్ధేశించిన లక్ష్యాలతోనే రాష్ట్రానికి తొలి ర్యాంకు సాధ్యమైంది
- ప్రవీణ్‌ ప్రకాశ్‌, రెసిడెంట్‌ కమిషనర్‌, ఎపి భవన్‌
Link to comment
Share on other sites

అంతర్జాతీయ కొలమానాలతో ముందుకెళ్లాం

ఈనాడు, దిల్లీ, అమరావతి: సులభవాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌ తొలి ర్యాంకు సాధించడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టేనని ఏపీభవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ అన్నారు. ఆయన ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ సీఎం సూచన మేరకు జాతీయస్థాయిలో కాకుండా అంతర్జాతీయస్థాయి కొలమానాలు పెట్టుకొని అధికారులు పనిచేశారన్నారు. ‘‘రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తే వారికి సాయం చేసేందుకు ప్రత్యేక అధికారులను పెడుతున్నాం. ఎంఓయూ దగ్గర నుంచి పరిశ్రమ నెలకొల్పేంతవరకూ ప్రతి అడుగులో వారికి ఏపీ అధికారులు చేయూతనందిస్తున్నారు. ఈ ర్యాంకుకు సంకేతం అదే’’ అని వివరించారు.

మరిన్ని ప్రపంచస్థాయి పెట్టుబడులు...
రాష్ట్రంలో మరిన్ని ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సులభతర వాణిజ్య ర్యాంకు ఎంతో దోహదం చేస్తుంది. పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్‌ అత్యంత అనుకూలమని మరోసారి రుజువైంది. ప్రస్తుతం వచ్చిన ర్యాంకుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన ‘బెంచ్‌ మార్క్‌‘ను కూడా త్వరలో చేరుకోగలం.

- ఎన్‌.అమరనాథరెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి

ముఖ్యమంత్రి ఆకాంక్ష మరింత సాకారమయ్యే అవకాశం
ప్రభుత్వశాఖలన్నీ కలిసి చేసిన కృషి ఫలితమిది. ముఖ్యమంత్రి, మంత్రి, పరిశ్రమలశాఖ కార్యదర్శి నుంచి జిల్లాస్థాయి వరకు, ఇతర ప్రభుత్వశాఖల అధికారులు ఎంతో భాగస్వాములై ర్యాంకు సాధించడానికి దోహదపడ్డారు. పారిశ్రామిక రంగంలో ప్రపంచ స్థాయి పెట్టుబడులు రాబట్టాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మరింత సాకారమయ్యే అవకాశం ఉంది.

- సిద్ధార్థ జైన్‌, పరిశ్రమల శాఖ కమిషనర్‌

చిన్న తప్పిదంతో తగ్గిన స్కోర్‌...
కార్మికశాఖ పారిశ్రామిక సంస్థలకు అందించే వివిధ అనుమతుల్లో ఒప్పంద కార్మికుల సేవల వినియోగానికి సంబంధించిన అంశం ఒకటి స్కోర్‌ తగ్గడానికి కారణమైంది. సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ప్రారంభానికి ముందు అది పెట్టుబడుదారుల నుంచి నేరుగా దరఖాస్తులు తీసుకొని అనుమతులిచ్చేది. పోర్టల్‌ వచ్చాక ఆన్‌లైన్‌ అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నా ఒప్పంద కార్మికుల సేవల వినియోగంపై నేరుగా దరఖాస్తు చేసుకోవాలంటూ కార్మికశాఖ వెబ్‌సైట్‌లో చేసిన చిన్నపాటి సూచన సంస్కరణల కేటగిరిలో స్కోర్‌ తగ్గేందుకు కారణమైంది. గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తమై సరి చేశారు. ఈ మేరకు అందులో ఇదే విషయాన్ని ప్రస్తావించినా పరిశీలన కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. పరిశ్రమలశాఖ మంత్రి, కార్యదర్శి, కమిషనర్‌ దిల్లీకి వెళ్లి కేంద్ర పారిశ్రామిక, వాణిజ్య మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.

Link to comment
Share on other sites

Guest Urban Legend
1 hour ago, chanu@ntrfan said:

 

super 

ntha sepu eenadu abn meedha burdadha challatam ye pani ga pettukunna ycheap paper ni ilage dobbali 

Link to comment
Share on other sites

by the way manam 4th place lo unnam FDI released numbers lo.....great progress....2nd position ki vastam chala fast ga italne velte.....1st MH will take time...

 

India lo food parks&food export growth percentage lo No#1 ayyam......Food parks&araku/tribal unit export,processing units(for aqua like linde unit) is making huge difference to farmers direct.....

 

Link to comment
Share on other sites

విధిలేకే ఇచ్చారు 
సులభతర వాణిజ్యంలో మొదటిస్థానాన్ని కేంద్రం అడ్డుకోవాలని చూసింది 
చెప్పినదానికంటే ఎక్కువే అభివృద్ధి చేశాం 
ఈ 1,500 రోజుల్లో మనం ఎంత చేశామో ప్రజల్లో అవగాహన కల్పించాలి 
పార్టీ నేతలకు ముఖ్యమంత్రి ఉద్బోధ 
ఈనాడు - అమరావతి 
12ap-main1a.jpg

సులభతర వాణిజ్యంలో రాష్ట్రానికి మొదటి స్థానం రాకుండా కేంద్రం అడ్డుకోవాలని చూసిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘ఎంత అడ్డుకుందామని ప్రయత్నించినా కేంద్రం ఏం చేయలేకపోయింది. అక్కడికీ కొన్ని అంశాలు తొలగించారు. విధిలేని పరిస్థితుల్లోనే మనకు సులభతర వాణిజ్యంలో మొదటిస్థానం ఇచ్చారు. సమర్థమైన, నీతివంతపాలనకు ఇదే నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంపై లేని నమ్మకాన్ని పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌పై చూపించారు’’ అని పేర్కొన్నారు. ఉండవల్లిలో ప్రజాదర్బార్‌ హాలులో గురువారం నిర్వహించిన తెదేపా కార్యశాలకు హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కర్నూలులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. కాదంటే కేంద్రం, రాష్ట్రం- రెండు ప్రభుత్వాలు కలిసి నెలకొల్పుదామన్నారు. ‘అదీ కాదంటే మేమే ఏర్పాటు   చేస్తాం. పదేళ్లపాటు పన్ను రాయితీలు ఇవ్వండి. ఎలా సాధ్యం కాదో చేసి చూపిస్తాం. విశాఖ ఉక్కుతీరునే రైల్వేజోన్‌ సాధించేదాకా వదిలేది లేదు’ అన్నారు.

మొత్తం సచివాలయాన్నే దిల్లీకి తెస్తా.. 
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా రూ.2,250కోట్లు ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘డీపీఆర్‌-1లో రూ.470కోట్లు రావాలి. డీపీఆర్‌-2 ఇచ్చి ఏడాదైంది. దీనికి చాలా కొరీల్రు వేశారు. అన్నిటికి ఓపిగ్గా సమాధానం చెబుతున్నాం. ఇంకా కొన్నిటికి సమాధానాలు చెప్పాలని కేంద్ర మంత్రి గడ్కరీ నిన్న అన్నారు’’ అని తెలిపారు. ‘‘మీరు(గడ్కరీ) చెబితే మా అధికారుల్ని మళ్లీ పంపిస్తా. వారం అక్కడే ఉంటారు. అన్నిటికీ సమాధానాలిస్తారు. వారు చేయలేకపోయారంటే నేనే వస్తా.. మొత్తం సచివాలయాన్ని తెస్తా.. మీరేం కావాలన్నా అన్నిటికి వివరాలిస్తా’’ అని స్పష్టం చేశానని వివరించారు. ‘‘ఫిబ్రవరికే పూర్తి చేయాలని మంత్రి చెబితే నేను సిద్ధమన్నా.. వెంటనే డబ్బులిస్తే పనిచేయడానికి గుత్తేదారులు సిద్ధంగా ఉన్నారని వివరించా. భూమి విలువ పెరిగిందని అంటే.. దానికి కేంద్రం తెచ్చిన 2013 భూసేకరణ చట్టమే కారణమని ఆయనకు తెలియజేశా’’నని పేర్కొన్నారు. ‘‘కొంతమంది భాజపా, వైకాపా నాయకులు ప్రాజెక్టు పూర్తి కాకూడదనే లక్ష్యంతో అడ్డం పడుతున్నారు. మీరు(గడ్కరీ) ఉండి చేయండి.. అన్నీ జియో ట్యాగింగ్‌ చేస్తాం.. అంతేగాని ఎవరో ఆరోపణలు చేస్తే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం సరికాద’’ని స్పష్టంగా చెప్పానన్నారు.

12ap-main1b.jpg

వచ్చే అయిదారు నెలల్లో 100 సభలకు హాజరవుతా 
జులై 15 నాటికి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 1,500 రోజులు అవుతుందని జులై 16 నుంచి గ్రామదర్శిని-గ్రామ వికాసం ద్వారా ప్రజల్లోకి వెళ్దామని చంద్రబాబు నేతలకు చెప్పారు. ‘‘75 నుంచి 100 రోజుల కార్యక్రమం తీసుకుని పనిచేద్దాం. మనం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న పరిస్థితి ఏంటి? ఈ 1,500 రోజుల్లో ఏం చేశాం.. అనే దానిపై చర్చ జరగాలి. ప్రజలకు అవగాహన కలిగేలా చెప్పాలి. విభజన నష్టాన్ని గుర్తు చేయాలి. వచ్చే అయిదారు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 సభలకు నేను హాజరవుతా. రైతులు, పొదుపు సంఘాల మహిళలు, ఉపాధికల్పన, సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదికగా వీటిని నిర్వహిస్తాం. గ్రామాలకు వెళ్లేముందు చాటింపు వేయించండి. ఊరంతా తిరగండి. వినతులు తీసుకోండి. మనం ఏం చేశామో చెప్పండి. ఇంకా ఏం కావాలో తెలుసుకోండి. చెప్పినదానికంటే ఎక్కువే చేశాం. ఎక్కడైనా విఫలమయ్యారంటే దానికి మీరే కారణం. పార్టీది కాదు. ఓటరు జాబితాలు పరిశీలించండి. మన ఓట్లు తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే’’ అని స్పష్టం చేశారు.

ఆరోపణలు తిప్పికొట్టండి 
నోటికొచ్చినట్లు చేసే ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టాలని చంద్రబాబు నాయకులకు పిలుపునిచ్చారు. ‘‘కుట్రలు, కుతంత్రాలు బయటపెట్టాలి. అలాగే అంటుంటారులే అని ఊరుకోవద్దు. ప్రజలు, కార్యకర్తలకు అనుమానం వచ్చే పరిస్థితి రానీయొద్దు. నాయకులతో భేదాభిప్రాయాలు లేకుండా కూర్చోబెట్టి మాట్లాడండి. ఎన్నికల దాకా రాజకీయ విమర్శలే చేయండి.. అలాగని మనల్ని మనం విమర్శించుకోకుండా.. అవతలివాళ్ల తప్పుల్ని ఎత్తిచూపండి. సులభతర వాణిజ్యంలో రాష్ట్రానికి మొదటిస్థానం వచ్చినా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తేలిగ్గా తీసుకుంటున్నారు’’ అన్నారు.

వారంలోగా చంద్రన్న పెళ్లి కానుక బకాయిలు 
* చంద్రన్న పెళ్లికానుక బకాయిలన్నీ వారం లోపు చెల్లిస్తాం. ఇక నుంచి పెళ్లిరోజే కానుక అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. 
* ఇప్పటికే ఇల్లు కట్టుకుని బిల్లులు కాని వారికి డాక్యుమెంటేషన్‌ చేయించే బాధ్యత ఎమ్మెల్యేలు, తెదేపా నేతలే తీసుకోవాలి. గృహనిర్మాణం పథకంలోని లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలి. 
* దళితతేజం తీరునే బీసీ, ఎస్టీ, మైనార్టీలకోసం ఇదే తరహా ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నాం. 
* కర్నూలు ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష, విశాఖరైల్వేజోన్‌ కోసం నిరాహారదీక్ష, అనంతపురంలో కరవు నిధుల కోసం ఆందోళనలు చేసిన పార్లమెంటు సభ్యులకు అభినందనలు.

పోలవరంపై దిల్లీకి..
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించుకోడానికి జలవనరులశాఖ సన్నాహాలు చేసుకుంటోంది. దిల్లీ వచ్చి తమ అధికారులతో కూర్చుని సందేహాలు నివృత్తి చేసి సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి గడ్కరీ సూచించడంతో ఇందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే వారంలో ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరమైన డాక్యుమెంట్లు, ఆధారాలు సిద్ధం చేసుకుంటున్నారు. పది రోజులైనా దిల్లీలో కూర్చుని ఈ వ్యవహారాన్ని తేల్చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం అధికారులను ఆదేశించారు. ఏపీ జలవనరులశాఖ అధికారులు 2017 ఆగస్టులోనే పోలవరం ప్రాజెక్టుపై డీపీఆర్‌ 2ను కేంద్ర జలసంఘానికి సమర్పించారు. ఆ తర్వాత నుంచి కేంద్ర జలసంఘం వద్ద అనుమానాల నివృత్తి ప్రక్రియ సాగుతూనే ఉంది. జలసంఘంలో పునరావాసం, భూసేకరణపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న వారు, నిబంధనలు, చట్టాలు తెలుసున్న వారు తక్కువ కావడంతో వారికి ప్రతి అంశంపైనా అవగాహన కల్పిస్తూ సమాధానం ఇవ్వాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.

డీపీఆర్‌ను రెండుగా విడగొట్టి... 
పోలవరం సవరించిన అంచనాలను రెండు భాగాలుగా విడగొట్టాలని గడ్కరీ సూచించిన విషయం తెలిసిందే. పనులకు సంబంధించిన అంచనాలు ఒక భాగం, భూసేకరణ- పునరావాసానికి సంబంధించిన అంచనాలు మరో భాగంగా విడగొట్టాలని సూచించారు. ఇలా చేయడం వల్ల పనులకు సంబంధించి పెరిగిన అంచనాలపై త్వరగా ఒక అవగాహనకు రావడం కుదురుతుందనే అభిప్రాయం కేంద్రమంత్రిలో వ్యక్తమయింది. తొలుత ఆ మేరకు అనుమమతులు ఇచ్చినా పోలవరం ప్రాజెక్టుకు నిధుల ఇబ్బంది లేకుండా అందించే అవకాశం ఉంటుందనే కోణంలోనూ దీన్ని పరిశీలించబోతున్నారని సమాచారం.

గడ్కరీ ప్రశ్నల పరంపర... 
పాత డీపీఆర్‌ ప్రకారం 57,000 ఎకరాలే ముంపులో ఉంటుందని పేర్కొని ఆ తర్వాత ఆ విస్తీర్ణం పెరిగినా అంతా ప్రభుత్వ భూమే అని పేర్కొన్నారని, ఆ తర్వాత ఇందులో పరిహారం చెల్లించే భూమి ఉందని చెబుతున్నారని తమ అధికారులు అంటున్నట్లుగా గడ్కరీ ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే ముంపులో చిక్కుకుంటుందని తెలిసిన ప్రభుత్వ భూమికీ ఆనక పట్టాలు ఇచ్చారనే అంశమూ ఆయన ప్రస్తావించగా ముఖ్యమంత్రి, పశ్చిమగోదావరి కలెక్టర్‌ ఆ విషయాన్ని ఖండించారు. అలా జరగలేదని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. పనులకు సంబందించి ఎప్పటికప్పుడు పని పరిమాణం ఎందుకు పెరుగుతోందని గడ్కరీ ప్రశ్నించారు. మీరే ప్రాజెక్టు నివేదిక తయారు చేసి మీరే ఎందుకు మారుస్తున్నారంటూ ప్రశ్నించారు. కన్సల్టెన్సీ సాయం తీసుకోవాల్సిందని కూడా ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

అలాగే ముంపులో చిక్కుకుంటుందని తెలిసిన ప్రభుత్వ భూమికీ ఆనక పట్టాలు ఇచ్చారనే అంశమూ ఆయన ప్రస్తావించగా ముఖ్యమంత్రి, పశ్చిమగోదావరి కలెక్టర్‌ ఆ విషయాన్ని ఖండించారు. అలా జరగలేదని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

Idi A2&Sakshi gallu chesina dushpracharam.....project avvakunda chetha XXXXXXX land meda complaints icharu

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
ఏపీ పారిశ్రామిక విధానం భేష్‌!
12-08-2018 01:40:03
 
636696348034632292.jpg
  • ప్రపంచబ్యాంకుకు పారిశ్రామికవేత్తల వెల్లడి
  • కేంద్రం వాదనకు బ్రేక్‌
అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు అద్భుతంగా ఉన్నాయని.. సరళీకృత విధానాల వల్ల త్వరితగతిన పరిశ్రమలకు అనుమతులు మంజూరవుతున్నాయని రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించిన పారిశ్రామికవేత్తలు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందానికి ఇటీవల వెల్లడించారు. రాష్ట్రంలో అమలులో ఉన్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంపై సర్వే నిర్వహించిన ప్రపంచ బ్యాంకు బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి 424 అంశాలపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో రాష్ట్రంలో అమలులోని పారిశ్రామిక విధానాలకుగాను 329 మార్కులు వస్తే.. పెట్టుబడిదారులు వెల్లడించిన అభిప్రాయాల మేరకు 33.7 మార్కులొచ్చాయి. సింగిల్‌ డెస్క్‌ విధానంలో దరఖాస్తులకు అనుమతులు సులువుగా.. సకాలంలోనే లభిస్తున్నాయని పెట్టుబడిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
 
ముఖ్యంగా కార్మిక చట్టాల అమలులో సరళీకృత విధానాలు బాగా అమలవుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ నూరు శాతం మార్కులు ఇచ్చారు. వాస్తవానికి .. ఈ అంశంలోనే కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాన్ని పక్కకు తప్పించి.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో వెనక్కు నెట్టే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో కార్మిక చట్టాలు కఠినంగా ఉన్నాయంటూ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కార్మిక చట్టాలు సరళీకృతంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. కేవలం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న సంస్థలకు మినహా.. మిగిలిన పరిశ్రమలకు సరళీకృత కార్మిక చట్టాలు అమలు కావడంలేదంటూ కేంద్రం దబాయించే ప్రయత్నం చేసింది. దీంతో.. ఆంధ్రప్రదేశ్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో నాలుగో స్థానానికి పడిపోయింది. అయితే.. క్షేత్రస్థాయిలో పెట్టుబడిదారుల అభిప్రాయాలేమిటో చూడాలంటూ ఏపీ పరిశ్రమల శాఖ అధికారులు పట్టుబట్టారు.
 
దీంతో.. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అమలులో ఉన్న సరళీకృత పారిశ్రామిక విధానాలపై ప్రపంచ బ్యాంకు అధ్యయనం చేసిన ఫలితాలను కేంద్రం పరిశీలించింది. దీనిలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో మాత్రమే సులభసరళి పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోందని పెట్టుబడిదారులు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులు సంతృప్తి వ్యక్తం చేసిన అంశాల్లో ముఖ్యమైనవి ఇవే..
 
  • ఆన్‌లైన్‌ సమీకృత విధానంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ చేసుకున్న దరఖాస్తుదారులందరికీ సరళీకృత చట్టాలు అమలువుతున్నాయి.
  • సెల్ఫ్‌ సర్టిఫికేట్‌తోనే అనుమతులు ఇస్తున్నారు.
  • ఫ్యాక్టరీ లైసెన్సును 10 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఇవ్వడం వల్ల.. వ్యాపారంపై దృష్టి సారించేందుకు వెసులుబాటు కలుగుతోంది.
  • ఫ్యాక్టరీలో వివిధ శాఖలు వాటికి ఇష్టం వచ్చినప్పుడు కాకుండా ఏకకాలంలో చేయడం వల్ల.. త్వరితగతిన అనుమతులు లభిస్తున్నాయి.
  • పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌లో సమగ్ర సమాచారం ఉండడం వల్ల.. ఒకే దఫా దరఖాస్తులో సమగ్ర సమాచారాన్ని అందించేందుకు వీలు కలుగుతుంది.
  • వ్యక్తిగతంగా పరిశ్రమలశాఖ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు అందించాల్సిన అవసరం లేదు. పైగా థర్డ్‌ పార్టీచే పరిశీలన చేయడం వల్ల అనుమతులు త్వరగా వస్తున్నాయి.
Link to comment
Share on other sites

41 minutes ago, sonykongara said:
ఏపీ పారిశ్రామిక విధానం భేష్‌!
12-08-2018 01:40:03
 
636696348034632292.jpg
  • ప్రపంచబ్యాంకుకు పారిశ్రామికవేత్తల వెల్లడి
  • కేంద్రం వాదనకు బ్రేక్‌
అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు అద్భుతంగా ఉన్నాయని.. సరళీకృత విధానాల వల్ల త్వరితగతిన పరిశ్రమలకు అనుమతులు మంజూరవుతున్నాయని రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించిన పారిశ్రామికవేత్తలు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందానికి ఇటీవల వెల్లడించారు. రాష్ట్రంలో అమలులో ఉన్న ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంపై సర్వే నిర్వహించిన ప్రపంచ బ్యాంకు బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి 424 అంశాలపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో రాష్ట్రంలో అమలులోని పారిశ్రామిక విధానాలకుగాను 329 మార్కులు వస్తే.. పెట్టుబడిదారులు వెల్లడించిన అభిప్రాయాల మేరకు 33.7 మార్కులొచ్చాయి. సింగిల్‌ డెస్క్‌ విధానంలో దరఖాస్తులకు అనుమతులు సులువుగా.. సకాలంలోనే లభిస్తున్నాయని పెట్టుబడిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
 
ముఖ్యంగా కార్మిక చట్టాల అమలులో సరళీకృత విధానాలు బాగా అమలవుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తూ నూరు శాతం మార్కులు ఇచ్చారు. వాస్తవానికి .. ఈ అంశంలోనే కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాన్ని పక్కకు తప్పించి.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో వెనక్కు నెట్టే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో కార్మిక చట్టాలు కఠినంగా ఉన్నాయంటూ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కార్మిక చట్టాలు సరళీకృతంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నా కేంద్రం పట్టించుకోలేదు. కేవలం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న సంస్థలకు మినహా.. మిగిలిన పరిశ్రమలకు సరళీకృత కార్మిక చట్టాలు అమలు కావడంలేదంటూ కేంద్రం దబాయించే ప్రయత్నం చేసింది. దీంతో.. ఆంధ్రప్రదేశ్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో నాలుగో స్థానానికి పడిపోయింది. అయితే.. క్షేత్రస్థాయిలో పెట్టుబడిదారుల అభిప్రాయాలేమిటో చూడాలంటూ ఏపీ పరిశ్రమల శాఖ అధికారులు పట్టుబట్టారు.
 
దీంతో.. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అమలులో ఉన్న సరళీకృత పారిశ్రామిక విధానాలపై ప్రపంచ బ్యాంకు అధ్యయనం చేసిన ఫలితాలను కేంద్రం పరిశీలించింది. దీనిలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో మాత్రమే సులభసరళి పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోందని పెట్టుబడిదారులు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులు సంతృప్తి వ్యక్తం చేసిన అంశాల్లో ముఖ్యమైనవి ఇవే..
 
  • ఆన్‌లైన్‌ సమీకృత విధానంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ చేసుకున్న దరఖాస్తుదారులందరికీ సరళీకృత చట్టాలు అమలువుతున్నాయి.
  • సెల్ఫ్‌ సర్టిఫికేట్‌తోనే అనుమతులు ఇస్తున్నారు.
  • ఫ్యాక్టరీ లైసెన్సును 10 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఇవ్వడం వల్ల.. వ్యాపారంపై దృష్టి సారించేందుకు వెసులుబాటు కలుగుతోంది.
  • ఫ్యాక్టరీలో వివిధ శాఖలు వాటికి ఇష్టం వచ్చినప్పుడు కాకుండా ఏకకాలంలో చేయడం వల్ల.. త్వరితగతిన అనుమతులు లభిస్తున్నాయి.
  • పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌లో సమగ్ర సమాచారం ఉండడం వల్ల.. ఒకే దఫా దరఖాస్తులో సమగ్ర సమాచారాన్ని అందించేందుకు వీలు కలుగుతుంది.
  • వ్యక్తిగతంగా పరిశ్రమలశాఖ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు అందించాల్సిన అవసరం లేదు. పైగా థర్డ్‌ పార్టీచే పరిశీలన చేయడం వల్ల అనుమతులు త్వరగా వస్తున్నాయి.

ee policy lu vidhaanaalu rupa kapana chesindhi sr.emploees, vaalla lo chaalaa mandhi last govt lo kuudaa vunnaaru,

only difference is CBN who is experienced, who is focusing n driving emp's in right direction with his orders support and giving them free hand in making bold decisions. +CBN's reputation and relations with industrialists. What not? who can replace him? can any dare to name to replace CBN? any other Indian (out of 1.3 billion), if can not find from Andhra?  we should elect him again if we are wise. ? :adore:

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...