Jump to content

AP No1 EODB Rankings


Nekkanti

Recommended Posts

నవ్యాంధ్రే నంబర్‌ వన్‌
05243110BRK145-EB.JPG

దిల్లీ: సులభతర వాణిజ్య ర్యాంకులను కేంద్రం విడుదల చేసింది. వాణిజ్య సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా రూపొందించిన ఈ ర్యాంకుల జాబితాను డీఐపీపీ కార్యదర్శి రమేశ్‌ అభిషేక్‌ ప్రకటించారు. ఈ ఏడాది ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో నిలవగా.. రెండో స్థానంలో తెలంగాణ, మూడోస్థానంలో హరియాణా, నాలుగో స్థానంలో జార్ఖండ్‌, ఐదో స్థానంలో గుజరాత్‌ రాష్ట్రాలు నిలిచాయి. అయితే, ఆయా రాష్ట్రాలను నాలుగు విభాగాలుగా కేంద్రం గుర్తించింది. 95శాతం పైబడి సంస్కరణల్ని అమలు చేసిన రాష్ట్రాలను ‘టాప్‌ అచీవర్స్‌’గా, 90 నుంచి 95 శాతం మేర సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను ‘అచీవర్స్‌’గా , 80 నుంచి 90 శాతం సంస్కరణలు అమలుచేసిన రాష్ట్రాలను ‘ఫాస్ట్‌మూవర్స్‌’గా, 80 శాతం లోపు సంస్కరణలుఅమలు చేసిన రాష్ట్రాలను ‘ఆస్పైరర్స్‌’గా గుర్తించారు. సంస్కరణల అమలులో వంద శాతం స్కోర్‌ సాధించిన రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఝార్ఖండ్‌, గుజరాత్‌ నిలిచాయి.

అయితే, టాప్‌ అచీవర్స్‌ జాబితాలో 9 రాష్ట్రాలు, అచీవర్స్‌ జాబితాలో ఆరు, ఫాస్ట్‌ మూవర్స్‌ జాబితాలో మూడు, ఆస్పైరర్స్‌ జాబితాలో 18 రాష్ట్రాలు నిలిచాయి. మరోవైపు, సంస్కరణల అమలు స్కోర్‌లో ఎక్కువ పురోగతి సాధించిన రాష్ట్రాల జాబితాలో అసోం, తమిళనాడులకు చోటు లభించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌, నిర్మాణరంగ అనుమతుల్లో రాజస్థాన్‌, కార్మిక చట్టాల్లో బంగాల్‌, పర్యావరణ రిజిస్ట్రేషన్లకు కర్ణాటక, భూమి లభ్యతలో ఉత్తరాఖండ్‌, పన్నుల చెల్లింపులో ఒడిశా, పర్యవేక్షణ అమలులో మధ్యప్రదేశ్‌, ఐటీ పారదర్శకతలో మహారాష్ట్ర వంద శాతం స్కోర్‌ను సాధించాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...