Jump to content

Is Janasena Pawan Kalyan losing Trust In AP ?

Recommended Posts

As expected Many more dislikes than likes by PK gundas, orey jaffa gallara velli ground level lo work chesi try to get deposits in 2019 guys.  papam emipotharoo 2019 tarvtha ,prp kanna utter flop ra ee jansena  velli next kapsena nayakudevaro ipati nunde bajana cheyandi.. lolll

Link to comment
Share on other sites

10 hours ago, Nandamuri Rulz said:

Jindal katha endi... Miss ayya

Jindal gaaditho TDP vaallu beram aadaru anta..aa report veediki chepparu anta..

Inthaki aa Jindal gaadu plan chesina plant Nellore district ki..

Veediki Plant ekkada promise chesaro kuda thelidhu..

Link to comment
Share on other sites

5 hours ago, niceguy said:

Jindal gaaditho TDP vaallu beram aadaru anta..aa report veediki chepparu anta..

Inthaki aa Jindal gaadu plan chesina plant Nellore district ki..

Veediki Plant ekkada promise chesaro kuda thelidhu..

oh my pawanovich

Link to comment
Share on other sites

1 hour ago, Rear Window said:

Asalu vaadi meeda trust vaste nee kadaa povadaniki

Exactly, Chiranjeevi atleast had some positive vibes across all generations to some extent, veediki votehaku ippude vachina or inka rani vallu tappa no one will slide with him.

2019 results kosam eagerly waiting , mabbulu motham vidipovali

Link to comment
Share on other sites

2 hours ago, BalayyaTarak said:

Exactly, Chiranjeevi atleast had some positive vibes across all generations to some extent, veediki votehaku ippude vachina or inka rani vallu tappa no one will slide with him.

2019 results kosam eagerly waiting , mabbulu motham vidipovali

There will be some percentage of “pichidi fans” who will blindly vote. These thugs will do damage at ground level to influence neutral voters. Here are their strategies

1. What ever PK does as accusations, they will spread them as “truths”

2. There will be black sheep everywhere who acts as coverts and share the information and start degrading TDP... best example is the recent chit chat from MPs

Link to comment
Share on other sites

బీజేపీ డైరెక్షన్‌లో జగన్‌ పవన్‌
06-07-2018 02:07:31
 
636664396527740705.jpg
  • రాష్ట్రానికి అన్యాయంపై మౌనం
  • వారి వైఖరి ప్రజలకు అర్థమైంది
  • వైసీపీ, జనసేన కలిసి పోటీ చేయొచ్చు
  • 2019 ఎన్నికల్లో టీడీపీదే అధికారం
  • బాబును గెలిపిస్తే మోదీని ఓడించినట్లే
  • పవన్‌వి అవగాహన లేని వ్యాఖ్యలు
  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’చర్చలో సబ్బం హరి
విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌, పవన్‌ బీజేపీ డైరెక్షన్‌లోనే పని చేస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా బీజేపీని వారు నిలదీస్తారని ఆశించడం అనవసరం. కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే వారి లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేయవచ్చు’’ అని మాజీ ఎంపీ, సీనియర్‌ నాయకుడు సబ్బం హరి అభిప్రాయపడ్డారు. గురువారం సాయంత్రం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ప్రత్యేక చర్చలో ఆయన పాల్గొన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్‌ చేసిన రాజకీయాలనే రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ నడుపుతోందన్నారు. ‘‘భవిష్యత్తు అవసరాల కోసం ఏపీలో బీజేపీ రాజకీయ క్రీడను ప్రారంభించింది. అందులో భాగంగానే పవన్‌, జగన్‌ ఆడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వైసీపీ కలవదు.
 
పవన్‌, జగన్‌ కలిసి పోటీ చేసి... ఎన్నికల అనంతరం బీజేపీకి మద్దతు ఇస్తారు. అందుకు అనుగుణమైన వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుంది’’ అని సబ్బం హరి పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం నల్లేరుపై నడకేనని అభిప్రాయపడ్డారు. ఆర్జీస్‌ ఫ్లాష్‌ టీమ్‌ ‘ఆంధ్రజ్యోతి’ కోసం నిర్వహించిన సర్వే ఫలితాలు నూటికి నూరు శాతం నిజమని తెలిపారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే జగన్‌కు మేలని చాలామంది భావిస్తున్నారని, అయితే జనసేనకు ఇచ్చిన సీట్లలో గంపగుత్తగా టీడీపీకిఓట్లు పడి చంద్రబాబుకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
 
బాబు సఫలం...
బీజేపీపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిందని, అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు సఫలమయ్యారని సబ్బం హరి తెలిపారు. ‘‘రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నా బీజేపీని ఒక్క మాటా అనని ఆ రెండు (వైసీపీ, జనసేన) పార్టీల మౌనాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నాలుగేళ్లపాటు న్యాయం జరగకపోయినా చంద్రబాబు కేంద్రంతో సఖ్యతతో మెలగబట్టే కొంతవరకైనా అభివృద్ధి పనులను చేయించుకోగలిగారు. ఈ విషయం తెలియక చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు’’ అని అన్నారు. దక్షిణాదిలోని అనేక రాష్ర్టాల్లో ముందస్తుగా ‘జమిలి’ ఎన్నికలు జరిగేలా బీజేపీ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని తెలిపారు. అయితే... చంద్రబాబు ఒప్పుకోకపోతే ఏపీలో ఇది సాధ్యం కాదన్నారు. ‘‘చంద్రబాబు గెలిస్తే... మోదీ ఓడిపోయినట్లు. చంద్రబాబును ఓడిస్తే మాత్రం మోదీని గెలిపించినట్లే’’ అని తెలిపారు.
 
పవన్‌ది అవగాహన రాహిత్యం
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్ర పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని సబ్బం హరి పేర్కొన్నారు. టీటీడీలో పింక్‌ డైమండ్‌ లేదని మాజీ ఈవోలంతా నిర్ధారించారని గుర్తు చేశారు. అయినా పవన్‌ పదేపదే అదే విషయాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారన్న వ్యాఖ్యలు కూడా అవగాహన రాహిత్యంతో కూడుకున్నవేనన్నారు. తనవల్లే అశోక్‌ గజపతి రాజు గెలిచారని, తన వల్లే టీడీపీ అధికారం అనుభవిస్తోందన్న పవన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమని తెలిపారు. ‘‘1983 నుంచి ఇప్పటిదాకా అశోక్‌ గజపతి రాజు ప్రతి ఎన్నికలో గెలుస్తున్నారు. 30 ఏళ్లుగా గజపతులు అనుభవించిన పదవులు ఎవరి దయతో వచ్చాయో చెప్పాలి.
 
1983లో ఆయన గెలిచినప్పుడు పవన్‌ స్కూల్‌లో ఉండి ఉంటారు. తనవల్లే అశోక్‌గజపతిరాజు పదవులను అనుభవిస్తున్నారన్న మాటలను ఉత్తరాంధ్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అక్కడ పవన్‌పై వ్యతిరేకత వచ్చింది’’ అని పేర్కొన్నారు. ఇప్పట్లో కాంగ్రెస్‌ కోలుకోదని... ఈ తరమంతా పోయి, కొత్త తరం వస్తేగానీ ఆదరణ లభించే అవకాశం లేదన్నారు. 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా తాను ఎన్నికల బరిలో దిగుతానని సబ్బం హరి స్పష్టం చేశారు. ఏ పార్టీ తరఫున అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. గతంలో చంద్రబాబు, వెంకయ్య తనను ఇప్పటికే ఆహ్వానించారని... జగన్‌, పవన్‌ పిలిచినా మాట్లాడతానని తెలిపారు. ఏ పార్టీలో చేరేదీ ఎన్నికల ముందు చూస్తారని చెప్పారు.
Link to comment
Share on other sites

'ఆంధ్రజ్యోతి' సర్వే నిజం.. 2019లో జరిగేది అదే: సబ్బం
06-07-2018 02:07:31
 
636664396527740705.jpg
  • రాష్ట్రానికి అన్యాయంపై మౌనం
  • వారి వైఖరి ప్రజలకు అర్థమైంది
  • వైసీపీ, జనసేన కలిసి పోటీ చేయొచ్చు
  • 2019 ఎన్నికల్లో టీడీపీదే అధికారం
  • బాబును గెలిపిస్తే మోదీని ఓడించినట్లే
  • పవన్‌వి అవగాహన లేని వ్యాఖ్యలు
  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’చర్చలో సబ్బం హరి
విశాఖపట్నం  (ఆంధ్రజ్యోతి): ‘జగన్‌, పవన్‌ బీజేపీ డైరెక్షన్‌లోనే పని చేస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా బీజేపీని వారు నిలదీస్తారని ఆశించడం అనవసరం. కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే వారి లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేయవచ్చు’’ అని మాజీ ఎంపీ, సీనియర్‌ నాయకుడు సబ్బం హరి అభిప్రాయపడ్డారు. గురువారం సాయంత్రం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ప్రత్యేక చర్చలో ఆయన పాల్గొన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్‌ చేసిన రాజకీయాలనే రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ నడుపుతోందన్నారు. ‘‘భవిష్యత్తు అవసరాల కోసం ఏపీలో బీజేపీ రాజకీయ క్రీడను ప్రారంభించింది. అందులో భాగంగానే పవన్‌, జగన్‌ ఆడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వైసీపీ కలవదు.
 
పవన్‌, జగన్‌ కలిసి పోటీ చేసి... ఎన్నికల అనంతరం బీజేపీకి మద్దతు ఇస్తారు. అందుకు అనుగుణమైన వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తుంది’’ అని సబ్బం హరి పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం నల్లేరుపై నడకేనని అభిప్రాయపడ్డారు. ఆర్జీస్‌ ఫ్లాష్‌ టీమ్‌ ‘ఆంధ్రజ్యోతి’ కోసం నిర్వహించిన సర్వే ఫలితాలు నూటికి నూరు శాతం నిజమని తెలిపారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే జగన్‌కు మేలని చాలామంది భావిస్తున్నారని, అయితే జనసేనకు ఇచ్చిన సీట్లలో గంపగుత్తగా టీడీపీకిఓట్లు పడి చంద్రబాబుకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
 
బాబు సఫలం...
బీజేపీపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిందని, అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబు సఫలమయ్యారని సబ్బం హరి తెలిపారు. ‘‘రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నా బీజేపీని ఒక్క మాటా అనని ఆ రెండు (వైసీపీ, జనసేన) పార్టీల మౌనాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నాలుగేళ్లపాటు న్యాయం జరగకపోయినా చంద్రబాబు కేంద్రంతో సఖ్యతతో మెలగబట్టే కొంతవరకైనా అభివృద్ధి పనులను చేయించుకోగలిగారు. ఈ విషయం తెలియక చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు’’ అని అన్నారు. దక్షిణాదిలోని అనేక రాష్ర్టాల్లో ముందస్తుగా ‘జమిలి’ ఎన్నికలు జరిగేలా బీజేపీ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని తెలిపారు. అయితే... చంద్రబాబు ఒప్పుకోకపోతే ఏపీలో ఇది సాధ్యం కాదన్నారు. ‘‘చంద్రబాబు గెలిస్తే... మోదీ ఓడిపోయినట్లు. చంద్రబాబును ఓడిస్తే మాత్రం మోదీని గెలిపించినట్లే’’ అని తెలిపారు.
 
పవన్‌ది అవగాహన రాహిత్యం
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్ర పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని సబ్బం హరి పేర్కొన్నారు. టీటీడీలో పింక్‌ డైమండ్‌ లేదని మాజీ ఈవోలంతా నిర్ధారించారని గుర్తు చేశారు. అయినా పవన్‌ పదేపదే అదే విషయాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారన్న వ్యాఖ్యలు కూడా అవగాహన రాహిత్యంతో కూడుకున్నవేనన్నారు. తనవల్లే అశోక్‌ గజపతి రాజు గెలిచారని, తన వల్లే టీడీపీ అధికారం అనుభవిస్తోందన్న పవన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమని తెలిపారు. ‘‘1983 నుంచి ఇప్పటిదాకా అశోక్‌ గజపతి రాజు ప్రతి ఎన్నికలో గెలుస్తున్నారు. 30 ఏళ్లుగా గజపతులు అనుభవించిన పదవులు ఎవరి దయతో వచ్చాయో చెప్పాలి.
 
1983లో ఆయన గెలిచినప్పుడు పవన్‌ స్కూల్‌లో ఉండి ఉంటారు. తనవల్లే అశోక్‌గజపతిరాజు పదవులను అనుభవిస్తున్నారన్న మాటలను ఉత్తరాంధ్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అక్కడ పవన్‌పై వ్యతిరేకత వచ్చింది’’ అని పేర్కొన్నారు. ఇప్పట్లో కాంగ్రెస్‌ కోలుకోదని... ఈ తరమంతా పోయి, కొత్త తరం వస్తేగానీ ఆదరణ లభించే అవకాశం లేదన్నారు. 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా తాను ఎన్నికల బరిలో దిగుతానని సబ్బం హరి స్పష్టం చేశారు. ఏ పార్టీ తరఫున అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. గతంలో చంద్రబాబు, వెంకయ్య తనను ఇప్పటికే ఆహ్వానించారని... జగన్‌, పవన్‌ పిలిచినా మాట్లాడతానని తెలిపారు. ఏ పార్టీలో చేరేదీ ఎన్నికల ముందు చూస్తారని చెప్పారు.
Link to comment
Share on other sites

పవన్‌కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే
05-07-2018 19:40:59
విశాఖ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సవాల్ చేశారు. గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  ముదపాక భూముల విషయంపై...పవన్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తాను రూ. 100 కోట్లు కూడబెట్టానని పవన్‌ ఆరోపించారని, తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తిని అమ్ముకున్నానేతప్ప కూడబెట్టలేదని అన్నారు. ఎమ్మెల్యేగా ఒక్క రూపాయి అక్రమంగా కూడబెట్టానని పవన్ నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని, చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే పవన్ క్షమాపణ చెప్పాలని బండారు సవాల్‌ విసిరారు.
 
బీజేపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను పవన్‌ చదువుతున్నారని బండారు విమర్శించారు. 900 ఎకరాలు ఆక్రమించామని తమపై అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను తిట్టాలని, జగన్‌ను తిట్టొద్దని బీజేపీ చెప్పిందా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రజాసేవ చేస్తానని వచ్చి... తనను చంపేస్తానని బెదిరిస్తారా? అంటూ బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. ఫార్మాసిటీలో కాలుష్య పరిశ్రమలు తాను తెచ్చానని పవన్‌ అన్నారని, కానీ వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనుమతులు వచ్చాయని ఈ సందర్భంగా బండారు గుర్తుచేశారు.
Link to comment
Share on other sites

పవన్‌కల్యాణ్ ఓ దొంగ’
10-07-2018 13:41:01
 
636668268606349876.jpg
విజయవాడ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్, వైసీపీ అధినేత జగన్‌పై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పవన్, జగన్, కన్నా లక్ష్మీనారాయణ చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు అన్నారు. పవన్‌కల్యాణ్ ఓ దొంగ అంటూ ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసిందేనన్నారు. ‘పీఆర్పీని ముంచి మంత్రిపదవి తీసుకున్న చరిత్ర మీది కాదా?’ అని నిలదీశారు. ప్రధాని మోదీ ముగ్గురు దొంగలతో కలిసి అధికారం కోసం ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రాష్ట్రానికి సైతాన్‌లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తాను రక్షించుకొనేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతిస్తే కన్నా లక్ష్మీనారాయణపై తాను పోటీ చేస్తానన్నారు. అలాగే జగన్‌పై మా కుమార్తె పోటీ చేస్తుందని జలీల్‌ఖాన్ చెప్పుకొచ్చారు.
Link to comment
Share on other sites

పవన్.. కళ్లుండి చూడలేని కబోది: మంత్రి గంటా
10-07-2018 13:30:05
 
636668262045202698.jpg
విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆధారాల్లేకుండా అవాకులు, చవాకులు పేలడం సరికాదని అన్నారు. కళ్లుండి చూడలేని కబోదిలా పవన్‌ మాట్లాడుతున్నారని మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, వైసీపీని పవన్‌ ఎందుకు విమర్శించడంలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్‌తో పవన్‌ కుమ్మక్కయ్యారని అర్థమవుతోందని గంటా అన్నారు. బీజేపీ, వైసీపీ స్క్రిప్ట్‌నే పవన్‌ చదువుతున్నారని మంత్రి విమర్శించారు.
Link to comment
Share on other sites

చిరంజీవి కేంద్రమంత్రి ఎలా అయ్యారో పవన్ చెప్పాలి: బుద్దా వెంకన్న
10-07-2018 13:03:00
 
636668245794221836.jpg
 
అమరావతి: తన అన్నయ్య చిరంజీవి కేంద్రమంత్రి ఎలా అయ్యారో తమ్ముడు పవన్ కల్యాణ్ చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి లోకేష్‌పై పవన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివే ముందు పవన్ ఆలోచించుకోవాలని బుద్దా వెంకన్న సూచించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంఘవిద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా అడిగితే సామాన్యులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను రుజువు చేయగలరా..? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...