Jump to content

ముస్లిం బాలికను పెంచవద్దని హిందువుపై దాడులు..


Recommended Posts

ముస్లిం బాలికను పెంచవద్దని హిందువుపై దాడులు..
29-06-2018 17:01:57
 
636658926066307226.jpg
 
హైదరాబాద్: అనాథను అక్కున చేర్చుకుంటే... అయినవారి నుంచి ఆదరణ కరువైంది. పిల్లలు లేరని మక్కువ చూపితే మతం వేరంటూ వేధింపులు మొదలయ్యాయి. హిందువు అయి ఉండి ముస్లిం బాలికను ఎలా పెంచుకుంటావంటూ హిందూవులు, హిందువు ఇంట్లో ముస్లిం ఎలా పెరుగుతుందంటూ ముస్లింలు దాడులకు దిగారు. ఏళ్ల తరబడి వేధింపులు, దాడులు జరుగుతున్నా... ఆ దంపతులు ఆ చిన్నారిని వదలలేదు. దీంతో హత్యాయత్నం చేశారు. మానవత్వం చూపితే మాటలతో హింసించారు. మతసామరస్యం పాటిస్తే కత్తిపోట్లకు గురిచేశారు. ఇది పాపాలాల్ పరిస్థితి.
 
11 ఏళ్ల క్రితం గోగుల్ చాట్ వద్ద బాంబు పేలుడు జరిగిన తర్వాత అక్కడ ఒక అనాథ బాలిక కనిపిస్తే పెంచుకుందామని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఆ బాలిక ముస్లిం బాలిక అని తెలిసి... హిందూ, ముస్లిం పెద్దల నుంచి పాపాలాల్‌కు మాటలు తూటాలు పేలాయి. నానా రకాలుగా హింసించడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పాపాలాల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం తనపై దాడి చేసి కొట్టారని, కత్తులతో దాడి చేశారని తెలిపారు. పాప (సానియా ఫాతిమా)ను ఏదైనా అనాథ ఆశ్రమంలో చేర్చించాలని వేధిస్తున్నారని పాపాలాల్ వాపోయారు.
 
పాప (సానియా ఫాతిమా) మాట్లాడుతూ స్కూలుకు వచ్చి కూడా తనను వేధింపులకు గురిచేశారని, తాను ఇండియన్ ముస్లిం కావడంవల్ల ఒక స్కూల్లో తనను చేర్చుకోలేదని, అయితే పాపాలాల్ దంపతులు తనను చదివిస్తూ, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారని పాప తెలిపింది. అయినా తమకు వేధింపులు ఆగడంలేదని, తమకు రక్షణ కావాలని, వేధింపులను ఆపాలని కోరుతోంది. అనాథగా ఉన్న తనను అక్కున చేర్చుకున్నవారని అనవసరంగా వేధింపులకు గురిచేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొంది.
 
పాపాలాల్ భార్య జయశ్రీ మాట్లాడుతూ అనాథ పాపను తెచ్చి పెంచుకుంటున్నందుకు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని 11 ఏళ్లుగా పాపను పెంచుకుంటున్నప్పటికీ ఒకవైపు తమను, మరోవైపు స్కూలుకు వెళుతున్న సానియా ఫాతిమాను అల్లరిమూక వేధింపులకు గురిచేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాపకు, తమ కుటుంబానికి ప్రభుత్వం పోలీస్ రక్షణ కల్పించాలని జయశ్రీ కోరారు. తాము హిందువులం అయినంత మాత్రాన ముస్లిం పాపను పెంచుకుంటే తప్పేమిటని ఆమె ప్రశ్నించారు. పాపను తెచ్చుకున్న తర్వాత తమకు ఇద్దరు పిల్లలు పుట్టారని, అయినా ఫాతిమాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని జయశ్రీ చెప్పారు.
 
అసలేం జరిగిందంటే...
అది 2017 ఆగస్టు 25. పెయింటర్‌ పాపాలాల్‌ హైదరాబాద్‌ కోఠిలోని నరసింహస్వామి ఆలయానికి రంగులు వేస్తున్నాడు. అంతలో సమీపంలోని గోకుల్‌ చాట్‌లో బాంబు పేలుడు సంభవించింది. పెద్ద శబ్దం వినిపించడంతో పాపాలాల్‌ పరుగు పరుగున వెళ్లాడు. అటూ ఇటూ పరుగులు తీస్తున్న జనం మధ్యలో ఏడుస్తున్న మూడేళ్ల పాపను చూశాడు. చిన్నారిని ఎత్తుకొని బాలిక తల్లిదండ్రుల కోసం వెతికాడు. ఎవరూ కనిపించకపోవడంతో ఇంటికి తీసుకెళ్లాడు. తల్లిండ్రులెవరని బాలికను అడిగితే.. తల్లి పేరు ఫాతిమాబేగం అని, తండ్రి పేరు బషీర్‌ అని వచ్చీరాని మాటలతో చెప్పింది. పాపాలాల్ ఆ బాలికను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పాడు. వారేమో అనాథాశ్రమం నిర్వాహకులకు కబురు పెట్టారు. వారు వచ్చి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పాపాలాల్ చేతిని ఆ చిన్నారి ఎంతకీ వదలిపెట్టలేదు. దీంతో కరిగి కన్నీరైన పాపాలాల్‌.. బాలికను తానే పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. చిన్నారిని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికి పెళ్లయి ఆరేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో భార్య జయశ్రీ కూడా పాపాలాల్‌ ఆలోచనకు మద్దతు పలికింది. చిన్నారిని దేవుడిచ్చిన బిడ్డగా భావించి అంజలి అని పేరు పెట్టుకున్నారు. ఇంటికి దగ్గర్లోని చేర్పించాడు. మరుసటి ఏడాదే పాపాలాల్‌కు కూతురు పుట్టింది. దీంతో అంజలిని తమ పాలిట అదృష్టలక్ష్మిగా భావించారా దంపతులు. ఇప్పుడా బాలికకు 14 ఏళ్లు!
Link to comment
Share on other sites

vallu penchukunte villa ki emi noppi, matham kanna manavatvam goppadi, manavatvame punadi ga mathalu vacchayi avi marchipokudadu,manchi ni manchi ga cheduni  chedu ga chusthe saripothundi adi evaru chesina, parati dani lo matham enduku chudtam...

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

vallu penchukunte villa ki emi noppi, matham kanna manavatvam goppadi, manavatvame punadi ga mathalu vacchayi avi marchipokudadu,manchi ni manchi ga cheduni  chedu ga chusthe saripothundi adi evaru chesina, parati dani lo matham enduku chudtam...

Well said bro..

Love and forgiveness are also pillars for a religion to grow and get respect.. Once we kept many people away from society and temples.. There exactly other religions took advantage.. That's how we lost many people into Hinduism.. Still our guys didn't learn..

Link to comment
Share on other sites

I don't see any heroism in this. If you raise a kid as your own for 11 years, any body would do the same. I would do the same. it is a natural thing.

but on the actual subject, whats wrong with these idiots (both so called Hindus and Muslims). why is adapting a kid from other religion a wrong thing?

Link to comment
Share on other sites

8 minutes ago, swarnandhra said:

I don't see any heroism in this. If you raise a kid as your own for 11 years, any body would do the same. I would do the same. it is a natural thing.

but on the actual subject, whats wrong with these idiots (both so called Hindus and Muslims). why is adapting a kid from other religion a wrong thing?

gokul chat bomb blast jarigindi akkada 3 years papa edusthu undi ayana cheyyi pattunnadi tisuku vacchi penchukunnadu dani gurichi cheppanu brother naku hero kanna ekkuva gane kanapadtutunnadu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...