Jump to content

పీవీ నరసింహారావు జయంతి నేడు


Husker

Recommended Posts

పాండిత్యం, చాతుర్యం, వినయం, వివేకం, అణకువ, పోరాట పథం ఇవన్నీ ఒక్కచోట ఉండటం బహు అరుదు, అలాంటి అరుదైన వ్యక్తి పి.వి.నరసింహారావు. మృదుస్వభావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కీ. శే. పాములపర్తి వెంకట నరసింహారావు రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రంలో హోం, విదేశాంగ, రక్షణ మంత్రిగా రాణించారు. పదవులకు వన్నె తెచ్చారు. హిందీయేతర రాష్ట్రాల నుంచి ప్రధాని పీఠాన్ని అధీష్టించిన తొలివ్యక్తిగా పీవీ నిలిచారు.

సంస్కరణలకు ఆద్యుడిగా పీవీని పేర్కొంటారు. సామాజిక సమస్యలకు భూమిపై పెత్తనం మూలకారణమని భావించిన పీవీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూసంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అనుకోకుండా ప్రధాని పదవి వరిస్తే, ఆ అవకాశాన్ని దేశ దశ, దిశా మార్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించారు. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి మరీ ఆర్థిక సంస్కరణలను అమలుచేశారు. నాడు ప్రధానిగా పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేటి బలమైన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కారణమయ్యాయి.

పీవీ ఆర్థిక సంస్కరణలను తాను రాష్ట్రంలో కొనసాగించానని చంద్రబాబు అంటూవుంటారు. సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి, పెట్టుబడుల గమ్యస్థానంగా ఇండియాను మార్చిన ఘనత పీవీ నరసింహారావుదేనని చంద్రబాబు అంటారు. మాజీ ప్రధాని, తెలుగు ఆణిముత్యం పీవీ నరసింహారావుకు జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చేందుకు... దేశ రాజధాని ఢిల్లీలో పీవీ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో 2014లో చంద్రబాబు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి పంపారు. ఫలితంగా ఢిల్లీలోని యమునా నది తీరంలో ఉన్న ఏక్తా స్థల్ వద్ద పీవీకి స్మారక చిహ్నం నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఈ రోజు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం.

Image may contain: 2 people

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...