Jump to content

టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసే యోచనలో డీఎస్?


KING007

Recommended Posts

టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసే యోచనలో డీఎస్?
27-06-2018 13:45:37
 
636657039387246965.jpg
నిజామాబాద్: కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఒకానొక దశలో సీఎం స్థాయి వ్యక్తిగా వెలుగొందారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ కీలక నేతలతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. టీఆర్‌ఎస్‌లో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న ఆయన ఎట్టకేలకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయనెవరో కాదు టీఆర్ఎస్ నేత డీ శ్రీనివాస్. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ టీఆర్‌ఎస్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ నేతలు డీఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్‌కు గ్రూపులు కట్టే అలవాటుందని.. అవినీతి చేసే అవకాశం లేకపోవడంతోనే టీఆర్‌ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారని నేతలు కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
 
టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న డీఎస్ తన కొడుకును బీజేపీలోకి పంపించారని ఆరోపించారు. కొడుకు ఎదుగుదల కోసం బీజేపీ పెద్దల దగ్గర మోకరిల్లారని డీఎస్‌పై లేఖలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. డీఎస్ కూడా ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం గులాం నబీ ఆజాద్‌తో రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం. మరోవైపు ఈరోజు ఉదయం నిజామాబాద్‌లో తన అనుచరులతో సమావేశమైన డీఎస్ టీఆర్ఎస్ నేతల ఆరోపణలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో డీఎస్‌ పెద్ద కుమారుడు సంజయ్‌ పాల్గొన్నారు. అయితే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తనను ఒకసారి కలవాలని డీఎస్‌కు కబురు పంపినట్లు తెలుస్తోంది. డీఎస్ విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా మరికాసేపట్లో డీఎస్ మీడియా ముందుకు వచ్చి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

TRS to expel D Srinivas! Anyways he doesn’t count– MP Kavitha

Since past few months, TRS leaders from Nizamabad district have been quite anti against former APCC Chief, and current TRS party member D Srinivas. Things have gone from bad to worse after D Srinivas distanced himself strategically from the party after his son joined BJP in September 2017. The Nizamabad district TRS leaders have taken this issue to MP Kavitha, and CM KCR.

Meanwhile, TRS MP Kavitha too shared a similar opinion. Talking to the media after a meeting with TRS leaders in Nizamabad, Kavitha said ‘the Nizamabad TRS Committee has taken a unanimous decision to cancel D Srinivas’ party membership. We have sent the same to party president KCR. We have also recommended disciplinary action against him’.

The MP also went on to say, there is absolutely no use of a politician like D Srinivas in the party. It doesn’t matter whether he is in or out of the party.

TRS party sources confirmed that the expulsion orders of D Srinivas from TRS party will be carried out by today evening.

https://www.telugu360.com/trs-to-expel-d-srinivas-anyways-he-doesnt-count-mp-kavitha/

:roflmao::roflmao::roflmao: aa red lizard gaadu ee news chusado ledo. 

Link to comment
Share on other sites

10 minutes ago, koushik_k said:

Mlc ivvalsinavadiki rajya sabha icchadu anavasaramga Ipdu kcr anubhavinchaka tappadu

Aadiki lancham ichinde RS Mp seat. Vache elections lo ministry post kuda yera vesadu. Daani vallane trs loki vochadu. Vochaka telisindi trs lo abaddalu tappithe future undadu ani. Anduke distance ayyadu. Jumped ayina candidates andaru ippudu distant mode lone unnaru. :ready2fight:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...