Jump to content

Govt Discussed on 20000 Jobs Notification | Minister Kalva Srinivasulu


Recommended Posts

గ్రూప్‌-1, 2 పోస్టుల భర్తీకి పాతపద్ధతే!
22-12-2018 03:42:22
 
అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1, 2 సర్వీసెస్‌ పోస్టులపై నెలకొన్న సందిగ్థత తొలగిపోయింది. పాత పద్ధతిలోనే ఆయా సర్వీసుల్లో పోస్టుల భర్తీ కొనసాగనుంది. ఈ మేరకు స్పష్టత ఇస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబరు 19న ఇచ్చిన జీవో 153కి అనుగుణంగానే గ్రూప్‌-1, గ్రూప్‌-2 సర్వీసెస్‌ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌-1, 2లలో మార్పులు చేస్తూ ప్రభుత్వం 2012 డిసెంబరు 13న జీవో 622 జారీ చేసింది. గ్రూప్‌-2 సర్వీసె్‌సలోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-1లో విలీనం చేసి, వీటిని గ్రూప్‌-1(బీ) కింద పరిగణించాలని సూచించారు. దీనినిబట్టి గ్రూప్‌-1(ఏ), గ్రూప్‌-1(బీ)గా మారుతుంది. అయితే ఈ సంస్కరణలపై నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
 
దీంతో 2014లో విడుదలైన గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్ల వరకు పాత విధానమే అమలు చేయాలని ప్రభుత్వం ఏపీపీఎస్సీకి సూచించింది. అంటే జీవో 622 అమలును నిలిపివేసింది. అప్పటికి ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కారం అయింది. కానీ ఇప్పుడు మళ్లీ గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లు విడుదలకు ఏర్పాట్లు చేస్త్తున్న ఏపీపీఎస్సీ అక్టోబరు 22న ప్రభుత్వానికి లేఖ రాసింది. జీవో 622ని అమలు చేయాలా? వద్దా? అని కోరింది. దీంతో గ్రూప్‌-2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గతంలో మాదిరిగానే ఉంచాలని, గ్రూప్‌-1లోని పోస్టులను గత విధానంలో భర్తీ చేయాలని ఉంచాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. ఈ నెలాఖరులో 182 పోస్టులతో గ్రూప్‌-1, 337 పోస్టులతో గ్రూప్‌-2 నోటిఫికేషన్లు రానున్నాయి.
 

Advertisement

Link to comment
Share on other sites

  • Replies 146
  • Created
  • Last Reply
ఎక్స్‌టెన్షన్‌’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
22-12-2018 03:40:48
 
  • 109 పోస్టులకు ప్రకటన జారీ
అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఏపీ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీ్‌సలోని 109 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1(సూపర్‌వైజర్‌) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ శుక్రవారం ప్రకటన జారీ చేసింది. హోంసైన్స్‌/సోషల్‌ వర్క్‌లో ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ జ్ట్టిఞ://ఞటఛి.్చఞ.జౌఠి.జీుఽలో డిసెంబరు 28 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజును జనవరి 17వ తేదీ రాత్రి 11.59లోపు చెల్లించాలి. 2018 జూలై 1 నాటికి 18 ఏళ్లు పూర్తయి 42 ఏళ్లు మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు మరో 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
 
కొత్తగా ఏర్పడిన 100 పోస్టులతోపాటు క్యారీ ఫార్వర్డ్‌లో 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల సంఖ్య 25 వేలకు మించినట్లయితే స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 2019 ఆగస్టు 2న మెయిన్స్‌ నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్‌లో నిర్వహించే స్ర్కీనింగ్‌ టెస్ట్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో నిర్వహించే మెయిన్స్‌లో 300 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. ఇంటర్వ్యూకు 30 మార్కులు కేటాయించారు. దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు అప్లికేషన్‌ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.80 చెల్లించాలి. నెగిటివ్‌ మార్కుల విధానం అమలు చేస్తారు.
Link to comment
Share on other sites

1051 కొలువుల కబురు

 

గ్రూప్‌-3 ఉద్యోగాలకు ప్రకటన జారీ
వచ్చే వారం మరిన్ని నోటిఫికేషన్లు

21ap-main3a_2.jpg

* గ్రూప్‌-3 మొత్తం పోస్టులు: 1051
* దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఈనెల 27
* దరఖాస్తుకు తుది గడువు: జనవరి 19
* ప్రాథమిక పరీక్ష జరిగే తేదీ: ఏప్రిల్‌ 21
* ఆన్‌లైన్‌లో ప్రధాన పరీక్ష తేదీ: ఆగస్టు 2

ఈనాడు, అమరావతి: నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ గ్రూప్‌-3 (పంచాయతీ కార్యదర్శి- గ్రేడ్‌-4) ఉద్యోగాల ప్రకటన వెలువడింది. ఆర్థికశాఖ అనుమతించిన 1000 పంచాయతీ కార్యదర్శుల పోస్టులతోపాటు అదనంగా 51 (గతంలో భర్తీకాకుండా ఉన్న పోస్టులు) భర్తీ చేసేందుకు శుక్రవారం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతోపాటు మహిళా శిశు సంక్షేమశాఖకు చెందిన ఎక్స్‌టెన్షన్‌  ఆఫీసర్‌ గ్రేడ్‌-1 ఉద్యోగ నియామకాల ప్రకటనా విడుదలైంది. కమిషన్‌ ఛైర్మన్‌ ఉదయ భాస్కర్‌ వివరాలను వెల్లడించారు

మహిళా శిశు సంక్షేమశాఖలో ఎక్స్‌టెన్షన్‌
ఆఫీసర్‌-గ్రేడ్‌-1 పోస్టులు: 109
దరఖాస్తుల స్వీకరణ: ఈ నెల 28 నుంచి
దరఖాస్తుకు తుది గడువు: జనవరి 18
ప్రాథమిక పరీక్ష తేదీ: తరువాత ప్రకటిస్తారు
ప్రధాన పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 25

ఈ నోటిఫికేషన్లు సిద్ధం
అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ కమిషనరు (దేవాదాయ), ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌ పోస్టుల భర్తీ ప్రకటనలూ సిద్ధంగా ఉన్నాయి.

పూర్వ పద్ధతిలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 భర్తీ
గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఉత్కంఠ వీడింది. 2012లో నిర్ణయించిన ప్రకారం గ్రూప్‌-2 కింద గుర్తించిన ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-1 పోస్టుల్లో 1బి కింద భర్తీ చేయాల్సి ఉంది. దీనిని అభ్యర్థులు వ్యతిరేకించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి పూర్వ పద్ధతిలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలను (2016) విడివిడిగా భర్తీ చేశారు. ఈ నిర్ణయాన్ని 2016 నోటిఫికేషన్లకే వర్తించేలా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కొత్తగా భర్తీ చేయనున్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ నిర్ణయాన్ని కమిషన్‌ కోరింది. పరిశీలన జరిపిన ప్రభుత్వం పూర్వ పద్ధతిలోనే విడివిడిగా భర్తీ చేయాలని శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని కమిషన్‌ సభ్యుడు రంగ జనార్దన వెల్లడించారు. వచ్చేవారం గ్రూప్‌-1, 2, ఇతర ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేస్తామని పేర్కొన్నారు.

 

జిల్లాల వారీగా గ్రూప్‌-3 పోస్టులు

* శ్రీకాకుళం: 114
* విజయనగరం: 120
* విశాఖపట్నం: 107
* తూర్పుగోదావరి: 104
* పశ్చిమగోదావరి: 25
* కృష్ణా: 22
* గుంటూరు: 50
* ప్రకాశం: 172
* నెల్లూరు: 63
* చిత్తూరు: 141
* అనంతపురం: 41
* కర్నూలు: 90
* కడప: 2 (క్యారీ ఫార్వర్డ్‌)

Link to comment
Share on other sites

31లోపు గ్రూప్‌-1 నోటిఫికేషన్‌?
27-12-2018 03:42:25
 
  • ఎగ్జామ్‌ స్కీమ్‌లో మార్పులకు సర్కారు ఆమోదం
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఎగ్జామినేషన్‌ స్కీమ్‌లో మార్పులు చేస్తూ ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. గతంలో స్ర్కీనింగ్‌ టెస్ట్‌లో.. ఒక పేపర్‌ 150 మార్కులకు ఉండగా.. ఇప్పుడు ఒక్కో పేపరులో 120 మార్కుల చొప్పున రెండు పేపర్లలో పరీక్ష(మొత్తం 240 మార్కులు) నిర్వహిస్తారు. గతంలో మెయిన్స్‌లో.. ఇంగ్లీషు క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ గాను, మరో 5 పేపర్లు(ఒక్కోటి 150 మార్కులకు) నిర్వహించేవారు.
 
ఇప్పుడు ఇంగ్లీషుతో పాటు తెలుగు పేపర్‌ కూడా 150 మార్కులకు ఇచ్చి .. ఈ రెండింటిలోనూ తప్పనిసరిగా క్వాలిఫై కావాలనే నిబంధన పెట్టారు. మిగిలిన 5 పేపర్లకు 150 మార్కుల చొప్పున కేటాయించారు. సిలబ్‌సలోనూ చేసిన స్వల్ప మార్పులకూ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సర్కారు జీవో ఇవ్వడంతో ఇక గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్‌ అయ్యింది. ఈ నెల 31లోగా నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.
Link to comment
Share on other sites

డీఎస్సీ ‘సోషల్‌’కు 37,269 మంది
27-12-2018 03:42:41
 
బుధవారం నిర్వహించిన డీఎస్సీ-సోషల్‌ స్టడీస్‌ పరీక్షకు 37,269 (89.33ు) మంది అభ్యర్థులు హాజరయ్యారని పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు.
Link to comment
Share on other sites

ఏపీలో కొలువుల జాతర 

09350628APPSC130A.jpgఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ఐదు నోటిఫికేషన్లు విడుదల చేసింది. శాసనసభ అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు-2, ఐఅండ్‌పీఆర్‌ శాఖలో అసిస్టెంట్‌ పీఆర్‌వో పోస్టులు-15, అకౌంట్స్‌ విభాగంలో డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 పోస్టులు 20, వ్యవసాయశాఖ అధికారి పోస్టులు -27, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో 237 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఇవాళ సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 1051 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఎపీపీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లాల వారీగా పోస్టుల సంఖ్యను ప్రకటనలో తెలిపింది. దీంతో సర్కారు కొలువుల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు.

 

Link to comment
Share on other sites

ఎస్సీ గురుకులాల్లో 320 కాంట్రాక్టు పోస్టులు
29-12-2018 02:25:35
 
అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు ఎస్సీ గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీకి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది, కాంట్రాక్టు పద్ధతిలో 205 టీచర్‌ పోస్టులను, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టులను మంజూరుచేస్తూ ఆదేశాలిచ్చింది. మరో 105 నాన్‌ టీచింగ్‌ పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ విధానంలో కొత్తగా ప్రారంభించిన రెసిడెన్షియల్‌ స్కూళ్లలో నియమించనుంది. పశ్చిమగోదావరి జిల్లా ఆరుగొలను, గుంటూరు జిల్లా యడ్లపాడు, ప్రకాశం జిల్లా కురిచేడు, కడప జిల్లా బి.మఠం, అనంతపురం జిల్లా రోళ్లలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
Link to comment
Share on other sites

2,585 మంది పోలీసులకు ప్రమోషన్లు
29-12-2018 02:25:54
 
అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2,585 మంది పోలీసులకు ప్రమోషన్లు ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. 2,019 మంది కానిస్టేబుళ్లను హెడ్‌ కానిస్టేబుళ్లుగా, 566 మంది హెడ్‌ కానిస్టేబుళ్లకు ఏఎ్‌సఐలుగా పదోన్నతులు కల్పించనున్నారు. డీజీపీ ఠాకూర్‌ సిఫారసులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలపడంతో హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Link to comment
Share on other sites

ఆర్‌పీఎఫ్‌’ రాసే అభ్యర్థులకు 7న కానిస్టేబుల్‌ పరీక్ష
29-12-2018 02:26:48
 
అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి జనవరి 6న పరీక్ష జరుగనుంది. అదేరోజు రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) పరీక్ష కూడా ఉండడంతో అవకాశం కోల్పోతామని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగించే నిర్ణయం డీజీపీ ఠాకూర్‌ తీసుకున్నారు. ఆర్‌పీఎఫ్‌ పరీక్ష రాసే అభ్యర్థులు ఆ హాల్‌టికెట్‌ను 5వ తేదీలోపు పోలీసు రిక్రూట్‌మెంటు బోర్డుకు మెయిల్‌ చేస్తే వారికి 7న కానిస్టేబుల్‌ పరీక్ష రాసే అవకాశం లభిస్తుందని శుక్రవారం రాత్రి వెల్లడించారు. వారికి వేరే పరీక్షపత్రం ఉంటుందని తెలిపారు.
Link to comment
Share on other sites

ఏపీలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ జారీ

31brk143a.jpgఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 446 గ్రూప్‌-2 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 110 పాత పోస్టులతో పాటు 336 కొత్త పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఇందులో సచివాలయంలోని  జీఏడీ విభాగానికి సంబంధించి జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయిలో 150 పోస్టులు ఉన్నాయి. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3 పోస్టులు 3, డిప్యూటీ తహశీల్దార్‌, ఈవోపీఆర్‌డీ, ఆబ్కారీశాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లు, రిజిస్ట్రేషన్‌శాఖ, దేవాదాశాఖలో గ్రేడ్‌-2, గ్రేడ్‌ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...