Jump to content

Flextronics company coming to Andhra Pradesh


Recommended Posts

రాష్ట్రానికి మరో పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ
25-06-2018 20:23:29
 
అమరావతి: రాష్ట్రానికి మరో పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ రానుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కంపెనీ సిద్ధమైంది. రూ. 585 కోట్ల పెట్టుబడితో స్థాపించనున్న ఈ కంపెనీ వల్ల 6,600 మందికి ఉపాధి లభించనుంది. కంపెనీ స్థాపన విషయమై రేపు అమరావతికి కంపెనీ ప్రతినిధులు రానున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖతో సదరు కంపెనీ ఒప్పందం చేసుకోనుంది.
Link to comment
Share on other sites

రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్న, అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ... పేరు సస్పెన్స్.. రేపు ప్రభుత్వంతో ఏంఓయు..

   
electronics-25062018.jpg
share.png

ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు ప్రారంభించబోతుంది. సుమారుగా 585 కోట్లు పెట్టుబడి ఆ కంపెనీ రాష్ట్రంలో పెట్టనుంది. ఈ కంపెనీ వల్ల, సుమారుగా 6,600 మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది. 30 కి పైగా దేశాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగస్తులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. రేపు అమరావతికి కంపెనీ ప్రతినిధులు రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ తో భేటీ కానున్నారు. కంపెనీ ప్రతినిధులు సమావేశం అనంతరం, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖతో ఈ కంపెనీ ఒప్పందం చేసుకోనుంది. అయితే, ఈ కంపెనీ పేరు మాత్రం ప్రభుత్వం బయట పెట్టటం లేదు. పక్క రాష్ట్రాల నుంచి గట్టి పోటీ ఉండటంతో, ఒప్పందం జరిగే వరకు, పేరు బయటకు చెప్పం అంటుంది ప్రభుత్వం.

 

ఎలక్ట్రానిక్స్ రంగంలో 2 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు.దేశంలో బెంగుళూరు,ముంబయి,ఢిల్లీ ఇలా అనేక నగరాలు,అమెరికా,దావోస్ దేశాల్లో పర్యటించి మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యలను వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు.ఎలక్ట్రానిక్స్ పాలసీ,రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల గురించి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని ఆహ్వానించారు.అందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ అయిన ఫాక్స్కాన్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది.రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మొబైల్ ఫోన్ కూడా తయారు కాలేదు.అలాంటిది ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న ప్రతి పది ఫోన్లలో 2 ఆంధ్రప్రదేశ్ లోనే తయారు అవుతున్నాయి.ఒక్క ఫాక్స్కాన్ కంపెనీలోనే సుమారుగా 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.దీనితో పాటు సెల్కాన్,కార్బన్,డిక్సన్ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయి.

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పూర్తి స్థాయి అభివృద్ధి,బ్యాటరీ తయారీ నుండి పూర్తి స్థాయి వస్తువు తయారీ వరకూ ఒకే చోట జరగాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఈఎంసి 1,2 మంచి ఫలితాలను ఇస్తున్నాయి.మొత్తంగా ఒక్క ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోనే ఇప్పటి వరకూ 18 వేల ఉద్యోగాలు వచ్చాయి.ఇటీవల కాలంలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో 15 వేల కోట్లు ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ అంగీకరించింది.తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏర్పాటు రిలయన్స్ ఏర్పాటు చేయనుంది.రోజుకి 10 లక్షల జియో ఫోన్లు,సెట్ టాప్ బాక్సులు ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు రిలయన్స్ తయారు చేయనుంది.ఒకే చోట 25 వేల మందికి ఉద్యోగాలు రిలయన్స్
కల్పించబోతుంది.రిలయన్స్ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు.

ఆరు నెలల క్రితం ముంబై పర్యటన లో భాగంగా రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ తో సుదీర్ఘంగా 2 గంటల పాటు మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు గురించి వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు,రాయితీలు,పాలసీలు,క్లస్టర్ మోడల్ లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల గురించి మంత్రి నారా లోకేష్ చెప్పిన తరువాత అంబానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం అయ్యారు.త్వరలోనే డిపిఆర్ పూర్తి చేసుకొని ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనుంది.ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చెయ్యడంలో మంత్రి నారా లోకేష్ మరో సారి సఫలీకృతుడు అయ్యారు.

దేశంలోని వివిధ నగరాల నుండి పోటీ ఉన్నా ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒక్కటైన కంపెనీ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.బెంగుళూరు,తిరుపతిలో ఆ కంపెనీ ప్రతినిధులతో పలుమార్లు సమావేశం అయ్యి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితుల గురించి వివరించి.అనేక సార్లు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి వారిని ఆంధ్రప్రదేశ్ కి వచ్చేందుకు ఒప్పించారు.నిత్యం తన ఎలక్ట్రానిక్స్ టీం ని ఆ కంపెనీ ప్రతినిధులతో టచ్ లో ఉండేలా చెయ్యటం,వారికి అవసరం అయిన సమాచారాన్ని అత్యంత వేగంగా అందించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఉండే తేడా స్పష్టంగా అర్థం అయ్యేలా వివరించారు.ఈ కంపెనీ రాకతో ప్రపంచంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న మరిన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చే అవకాశలు ఉన్నాయి.దీనితో పాటు ఈ కంపెనీకి చెందిన సప్లైయర్ కంపెనీలు కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్ కి వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి

Link to comment
Share on other sites

రాష్ట్రానికి ఫ్లెక్స్‌ట్రానిక్స్‌!
రూ.585 కోట్ల పెట్టుబడులు
6,600 మందికి ఉద్యోగావకాశాలు
నేడు ముఖ్యమంత్రి, ఐటీ మంత్రితో సంస్థ ప్రతినిధుల భేటీ

ఈనాడు, అమరావతి: ప్రపంచంలోని ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల్లో ఒకటైన ‘ఫ్లెక్స్‌ట్రానిక్స్‌’ రాష్ట్రానికి రానుంది. రూ.585 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సుమారు 30 దేశాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ రాకతో రాష్ట్రంలోనూ 6,600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సంస్థ ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, సమాచార, సాంకేతిక(ఐటీ) మంత్రి లోకేశ్‌తో సమావేశం కానున్నారు. అనంతరం ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖతో రాష్ట్రంలో పెట్టుబడులపై ఒప్పందం చేసుకోనున్నారు. సంస్థ ప్రతినిధులతో  మంత్రి లోకేశ్‌ బెంగుళూరు, తిరుపతిలో ఇప్పటికే పలుసార్లు సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకున్న సానుకూలతలను వివరించారు. అవసరమైన సమాచారాన్ని అధికారులు అందించేలా ఏర్పాట్లు చేశారు. కంపెనీ రాకతో ప్రపంచంలో మరిన్ని అగ్రగామి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే జోరుగా...
ప్రపంచంలోనే పెద్ద కంపెనీల్లో ఒకటైన ఫాక్స్కాన్‌తోపాటు సెల్కాన్‌, కార్బన్‌, డిక్సన్‌ కంపెనీలు ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించాయి. ఎలక్ట్రానిక్స్‌ రంగ అభివృద్ధికి ప్రత్యేకంగా తయారీ క్లస్టర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఫాక్స్కాన్‌ కంపెనీలో సుమారు 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఏడాది విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రిలయన్స్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. తిరుపతి విమానాశ్రయానికి సమీపంలో 150 ఎకరాల్లో రోజుకు 10లక్షల జియో ఫోన్లు, సెటాప్‌ బాక్సులు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు తయారు చేసే కంపెనీని రిలయన్స్‌ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల ఒకేచోట 25 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

ఈ ఫ్లెక్స్ ట్రానిక్స్ గాడికి ఎన్ని ఎకరాలు ఇస్తున్నారో, కమీషన్ కింద చెంద్రబాబు ఎంత తీసుకుంటున్నారో దేవుడు త్వరలోనే మీకు తెలియచేయగలరు ... కొంచం ఓపిక పట్టగలరు ...

గాలి కబుర్లు పోగెయ్యటానికి కొంచం సమయం పడుతుందని గమనించగలరు ???

Link to comment
Share on other sites

రాష్ట్రానికి ఫ్లెక్స్‌ట్రానిక్స్‌!
26-06-2018 02:51:05
 
636655782656302279.jpg
  • ప్రపంచంలోనే 5 అతి పెద్ద ఎలక్ర్టానిక్స్‌ సంస్థల్లో ఒకటి
  • ఆ సంస్థను ఒప్పించిన సర్కారు.. తిరుపతి సమీపాన యూనిట్‌
  • 585 కోట్లు..6,600 కొలువులు.. నేడు ఒప్పందం ఖరారు
అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఎలక్ర్టానిక్స్‌ దిగ్గజ కంపెనీ ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ రానుంది. ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ర్టానిక్స్‌ తయారీ కంపెనీల్లో ఇది ఒకటి. ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు గత కొంతకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు ఈ కంపెనీని తమ దగ్గర పెట్టాలంటూ పోటీకి వచ్చాయి. అయితే పలు దఫాలుగా లోకేశ్‌, ఒక దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి రాష్ట్రానికి ఈ కంపెనీ వచ్చేలా ఒప్పించగలిగారు. తిరుపతి సమీపంలో ఈ కంపెనీ తన యూనిట్‌ నెలకొల్పనుంది. సుమారు రూ.585కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ను పెడుతున్నారు. దీనివల్ల 6,600ల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మంగళవారం నాడు ఆ కంపెనీ ప్రతినిధులు అమరావతికి రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారు. అనంతరం మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఒప్పందం చేసుకుంటారు.
 
30 దేశాలు.. 2 లక్షలమంది ఉద్యోగులు
ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ 30 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రెండు లక్షల మందికి పైగా ఉద్యోగస్థులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎలక్ర్టానిక్స్‌ రంగంలో రెండు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి లోకేశ్‌...ఆ దిశగా దేశంలోని బెంగళూరు, ముంబై, ఢిల్లీలతో పాటు అమెరికా, దావో్‌సలలో పర్యటించారు. రాష్ట్రంలో ఎలకా్ట్రనిక్స్‌ తయారీ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఎలక్ర్టానిక్స్‌ పాలసీ, రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎలక్ర్టానిక్స్‌ తయారీ క్లస్టర్‌ల గురించి వివరించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అందులో భాగంలోనే ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ ప్రతినిధులతో లోకేశ్‌ పలుసార్లు చర్చించారు. బెంగళూరు వెళ్లి వారితో మాట్లాడారు. తిరుపతికి ఆ కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించి అన్నింటిపైనా భరోసా ఇచ్చారు. దీంతో ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించింది.
 
పదిలో రెండు ఏపీలోనే..
ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ రాష్ట్రానికి వస్తే...దానితో పాటు ఆ ఎలక్ర్టానిక్స్‌ కంపెనీకి విడిభాగాలను సరఫరా చేసే చిన్న చిన్న కంపెనీలు కూడా వచ్చేందుకు అవకాశాలున్నాయి. అయా కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ చేసిన ముమ్మర ప్రయత్నాల వల్ల ఇప్పటికే ఫాక్స్‌కాన్‌ రాష్ట్రానికి వచ్చింది. ఈ ఒక్క కంపెనీలోనే 14వేల మంది మహిళలకు ఉపాధి లభించింది. ఈ కంపెనీతో పాటు సెల్‌కాన్‌, కార్బన్‌, డిక్సన్‌ లాంటి కంపెనీలు ఉత్పత్తులను ప్రారంభించాయి. ఫలితంగా, విభజన నాటికి ఒక్క సెల్‌ఫోన్‌ కూడా తయారుకాని పరిస్థితి నుంచి...ఇప్పుడు దేశంలో తయారయ్యే ప్రతి 10సెల్‌ఫోన్లలో రెండు రాష్ట్రం నుంచే తయారయ్యే స్థాయికి రాష్ట్రం చేరుకొంది.
Link to comment
Share on other sites

Lokesh NaraVerified account @naralokesh 17m17 minutes ago

 
 

Electronics major Flex is coming to AP marking a historic moment in the State’s pursuit to become the electronics hub of India. An MoU to this effect has been signed today in the presence of Hon’ble CM. This is yet another mega investment for AP that will create thousands of jobs

DgnMnBbVQAAb_hP.jpg
Link to comment
Share on other sites

ఏపీతో ఒప్పందం కుదుర్చుకున్న ఫ్లెక్స్‌ట్రానిక్స్ కంపెనీ
26-06-2018 17:34:48
 
636656312887239938.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ఫ్లెక్స్‌ట్రానిక్స్ కంపెనీ రాబోతోంది. ప్రపంచంలో ఐదు పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఒకటైన ఫ్లెక్స్‌ట్రానిక్స్ కంపెనీ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఫ్లెక్స్‌ట్రానిక్స్ చాల పెద్ద సంస్థ అని ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. 2014లో ఏపీలో ఒక్క ఎలక్ట్రానిక్ సంస్థ కూడా లేదని, ఇప్పుడు అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, దీంతో యువతీ, యువకులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్‌లోనే 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేష్ తెలిపారు. ఒక్క ఫ్లెక్స్‌ట్రానిక్స్ యూనిట్ ఏర్పాటుతో 6,600 మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు.
Link to comment
Share on other sites

Lokesh Capability ni question chesina vaallandariki... G*** meeda tanni maree kallu teripistunna Lokesh. 

G** meeda tanni leputunnaa kaani... abbe maaku aanatam ledu ani mekapotu Gambhiryam pradarsinche edavailu kuda unnaru. Vaallaki tuppu ela vadulutundo raaboye rojullo chudhdham

Link to comment
Share on other sites

10 hours ago, Saichandra said:

felxtronics ane vyakthi lokesh snehithudu ani evaro ips sulabh complex lo kanapadi cheppaadu naaku

aadiki Flextronics ki,Efftronics ki difference teliyakapoyi undochu. 

Link to comment
Share on other sites

N Chandrababu NaiduVerified account @ncbn 6m6 minutes ago

 
 

ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థ ‘ఫ్లెక్స్’ రాష్ట్రంలో రూ.585 పెట్టుబడులు పెట్టేలా ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖతో నేడు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ సంస్థ రాకతో రాష్ట్రంలో 6600 మందికి ఉపాధితోపాటు, మరిన్ని ప్రపంచ స్థాయి కంపెనీల రాకకు మార్గం సుగమమైంది.

DgoJSkmU8AE-NA8.jpg
Link to comment
Share on other sites

పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌
ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతాం
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
రూ.585 కోట్లతో తిరుపతిలో యూనిట్‌ ఏర్పాటుకు ఫ్లెక్స్‌ అవగాహనా ఒప్పందం
ఆగస్టు 15న తాత్కాలికంగా శ్రీసిటీ నుంచి ఉత్పత్తి ప్రారంభం: లోకేష్‌
26ap-main1a.jpg

ఈనాడు, అమరావతి: ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్‌ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామని, ఇందుకోసం పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రిని, ఐటీ మంత్రి లోకేష్‌ను ఫ్లెక్స్‌ (ఫ్లెక్స్‌ట్రానిక్స్‌) గ్లోబల్‌ ఆపరేషన్స్‌ ప్రెసిడెంట్‌ ఫ్రాంక్వా బార్బియర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ థామస్‌ మన్నియన్‌, ఇతర ప్రతినిధులు కలిశారు. తిరుపతి సమీపంలో రూ.585 కోట్లతో యూనిట్‌ ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేశారు. ఈ యూనిట్‌లో 6,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. చంద్రబాబు, లోకేష్‌ సమక్షంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల ప్రధాన ఆకర్షణ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రియల్‌ టైం గవర్నెన్స్‌, కాగితరహిత పాలనపై ఫ్లెక్స్‌ ప్రతినిధులకు వివరించారు. ‘ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల తయారీ రంగంలో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో మీ(ఫ్లెక్స్‌) సంస్థ ఒకటి. 30కిపైగా దేశాల్లో 2 లక్షలకుపైగా ఉద్యోగులున్న మీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం అభినందనీయం’ అన్నారు.

నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టాకే  ఎలక్ట్రానిక్స్‌ రంగంపై దృష్టి: లోకేష్‌
దేశంలో ఏటా 480 బిలియన్‌ డాలర్ల ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉత్పత్తవుతున్నాయని, ఇందులో 50శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే తయారుకావాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని ఐటీ మంత్రి లోకేష్‌ వివరించారు. ఇందుకు అనుగుణంగానే ప్రపంచంలోనే పెద్ద సంస్థలైన ఫాక్స్‌కాన్‌, డిక్సన్‌ తదితర సంస్థలను రాష్ట్రానికి వచ్చేలా కృషి చేశామని అన్నారు. వీటిద్వారా 18వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, మొత్తంగా రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యమని తెలిపారు. ఎకో సిస్టమ్‌ భాగస్వామ్య సంస్థల్ని కూడా రాష్ట్రానికి రప్పించేలా చర్చిస్తున్నామన్నారు. 2014 ముందు ఏపీలో ఒక్క ఎలక్ట్రానిక్స్‌ సంస్థ లేదని తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. ఆగస్టు 15న తాత్కాలికంగా శ్రీసిటీ నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని వివరించారు. ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా ఫ్లెక్స్‌ విజయవంతమై రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నామన్నారు. బార్బియర్‌ మాట్లాడుతూ భారత్‌లో ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల వినియోగం బాగా పెరుగుతున్నందున, ఈ రంగంలో అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందన్నారు. ఈ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు, ప్రోత్సాహకాలు బాగున్నాయన్నారు. లోకేష్‌తో రెండుమూడుసార్లు సమావేశమయ్యాక ఆయనపై నమ్మకం ఏర్పడిందని వివరించారు. అనంతరం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రాన్ని ఫ్లెక్స్‌ ప్రతినిధులు సందర్శించారు. ప్రత్యేకతలను ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) బాబుని అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీ వ్యవస్థ అద్భుతంగా ఉందని, వినూత్న విధానాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...