Jump to content

స్మశానంలో బసచేసిన టీడీపీ ఎమ్మెల్యే

Recommended Posts

స్మశానంలో బసచేసిన టీడీపీ ఎమ్మెల్యే
23-06-2018 16:36:22
 
636653685968295714.jpg
పాలకొల్లు: తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న ఆలోచన చేశారు. ఆ ఆలోచనను స్మశానంలో అమలు చేశారు. రాత్రి అక్కడే టిఫిన్ తిన్నారు. అక్కడే మంచంపై నిద్రించారు. స్మశానంలో ఎమ్మెల్యే ఎందుకు నిదురపోయారు. అధికార పార్టీ ఎమ్మల్యే ఎందుకు ఇలా చేశారు అనే అనుమానం రావచ్చు. కానీ ఎమ్మెల్యే దృఢనిశ్చయంతో రాత్రంతా సశ్మానంలో బస చేయడానికి కారణం లేకపోలేదు. పాలకొల్లు స్మశానవాటికకు ఏడాది క్రితం రూ. 3 కోట్ల నిధులు కేటాయించారు. కానీ స్మశానవాటిక అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
 
స్మశానవాటిక నిర్మాణ పనులు జరుగకపోవడానికి కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలే. దీంతో అందరిలో భయాన్ని పొగొట్టేందుకు నిద్రకు ఉపక్రమించారు ఎమ్మెల్యే. ఈ విషయం తెలియగానే అధికారులు ఉరుకులుపరుగులు పెట్టారు. పనులు యుద్ధప్రాతిపదికన చేయడానికి ఓ కదలిక వచ్చింది. రాత్రంతా స్మశానంలో జాగారం చేసిన ఎమ్మెల్యే ఉదయం అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఆ తర్వాత కప్పు కాఫీ తాగుతూ దినపత్రికలు చదివారు. అధికారులతో చర్చించారు. ఇంతకాలం స్మశానవాటిక అభివృద్ధిని పెద్దగా పట్టించుకోని అధికారులు కార్మికులను వెంటపెట్టుకుని వచ్చారు.
Link to comment
Share on other sites

28 minutes ago, sonykongara said:

Kudos to him

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

nimmala ramanaidu :no1:       pavan gadu ikkada nilapadali bhale untundi . 

akkada babji ani manchi candidate unnaru 2014 independentga kuda  votes baga ochayii 2004 tdp mla . ..js tkt isthe west lo js ki manchi fight iche seat ide avvachu

Link to comment
Share on other sites

2 hours ago, Godavari said:

akkada babji ani manchi candidate unnaru 2014 independentga kuda  votes baga ochayii 2004 tdp mla . ..js tkt isthe west lo js ki manchi fight iche seat ide avvachu

Inka Palakollu dreams lone vunnara JS vaallu after 2009 Usharani shock?

Link to comment
Share on other sites

2 hours ago, Godavari said:

akkada babji ani manchi candidate unnaru 2014 independentga kuda  votes baga ochayii 2004 tdp mla . ..js tkt isthe west lo js ki manchi fight iche seat ide avvachu

bjp lo unnadu ga ycp vallu lagalani chusthunaru

Link to comment
Share on other sites

రెండో రోజూ శ్మశాన వాటికలోనే.. 
పనులను పర్యవేక్షించిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల 
weg-gen5a.jpg

పాలకొల్లు, న్యూస్‌టుడే: పాలకొల్లు హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనుల్లో కదలిక వచ్చింది. పనులు వేగంగా జరిగేందుకు పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు శుక్రవారం రాత్రి అక్కడే నిద్రించారు. శనివారం రెండో రోజు అక్కడే గడిపారు. తెల్లవారు జామున లేచి ముందుగా కొద్దిసేపు నడిచి, యోగా చేశారు. అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఆయనను కలిసేందుకు వచ్చిన తెదేపా శ్రేణులతో నడుచుకుంటూ పోలీసుస్టేషన్‌ ప్రాంతంలో రహదారి వెంట ఉన్న దుకాణంలో ఫలహారం చేశారు. ఉదయం పనుల్లోకి కార్మికులు వచ్చే వరకు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో వర్షం పడటంతో తడుస్తూనే పనులను వీక్షించారు. అక్కడ నుంచే కారులో ఏలూరులో జరిగిన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. సాయంత్రం వచ్చి నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ మార్కెటు యార్డులో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు నూతన పింఛన్లు పంపిణీ చేశారు. అక్కడ నుంచి హిందూ శ్మశానవాటిక ప్రాంతానికి వచ్చి ఎంత పని జరిగిందో చూశారు. రాత్రికి అక్కడే ఫలహారం చేసి నిద్రించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ హిందూ శ్మశానవాటిక పనులను వేగంగా పూర్తిచేసి సకాలంలో ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే ప్రత్యేక దృష్టి పెట్టానన్నారు. మొక్కలు నాటితే ఇతర పనులు పూర్తయ్యేలోగా పెరిగి ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుందన్నారు. పట్టణంలో జరుగుతున్న ఎన్టీఆర్‌ కళాక్షేత్రం, రామగుండం, శంభునిచెరువు ఉద్యానాల వంటి పనుల్లో వేగం పెరిగేందుకు అవసరమైతే అక్కడ బస చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.

Link to comment
Share on other sites

టిడిపి ఎమ్మెల్యేను ప్రశంసిస్తూ, కేరళ సిఎం వరుస ట్వీట్లు...

Super User
25 June 2018
Hits: 143
 
ramanaidu-25062018.jpg
share.png

తెలుగుదేశం ఎమ్మల్యేను, కేరళ సియం ప్రశంసించటం ఏంటి అనుకుంటున్నారా ? మన రాష్ట్ర ఎమ్మల్యే చేసిన పని, ఇప్పుడు టాక్ అఫ్ ది కంట్రీ అయ్యింది. అనేక రాష్ట్రాల్లో వార్తలు కూడా వచ్చయి. పాలకొల్లు శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు పై, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రశంసలు కురిపించారు. ఆత్మలు, దయ్యాలు లేవంటూ నిరూపించేందుకు కొన్ని రాత్రులు శ్మశానంలో నిద్రించిన ఆయనను విజయన్‌ ఎంతగానో మెచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న పినరయి విజయన్‌ ఆయనను పలు విధాలుగా ప్రశంసిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ''మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న యోధుడు రామానాయుడు. దెయ్యాల గురించి భయపడుతున్న పనివాళ్ళలో విశ్వాసాన్ని నెలకొల్పేందుకు మరిన్ని రాత్రులు శ్మశానంలో గడపాలని నిర్ణయం తీసుకున్నారు. రామానాయుడు చేస్తున్న ఈ ప్రయత్నం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశం యావత్తు ఆయన సాహసంపై దృష్టి నిలిపింది.'' అని విజయన్‌ ట్వీట్‌ చేశారు.

ramanaidu 25062018 2

అభివృద్ధి పనులు వేగవంతంగా జరగడానికి, కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి పాలకొల్లు ఎమ్మెల్యే డాక్ట ర్ నిమ్మల రామానాయుడు నేరుగా శ్మశాన వాటికలోనే ఒక రాత్రి నిద్ర చేశారు. పాలకొల్లు పట్టణంలోని హిందూ స్మశాన వాటికను రూ.3 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి పనులు మందగమనంతో ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే నిమ్మల పనుల నత్తనడక పై ఆరా తీశారు. శ్మశానంలో పనులు, మరో వైపు తవ్వకాల్లో ఎముకలు బయటపడడం తదితర కారణాలతో కార్మి కులు భయాందోళనలకు గురవుతున్నట్టు ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. వాస్తవానికి అభివృద్ది పనుల్లో 50 శాతం ఈ మాసాంతానికే పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ పనుల పురోగతి లేకపోవడంతో ఎమ్మెల్యే నిమ్మల స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు.

ramanaidu 25062018 3

కార్మికుల్లో నెలకొన్న భయాం దోళనలను పోగొట్టడానికి, మనోస్థైర్యం ఇవ్వడాని కి ఎమ్మెల్యే సాహతోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఆయన శ్మశాన వాటికలోనే అల్పాహారం తీసుకున్నారు. అనంతరం అక్కడే మడత మంచం పై నిద్రకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధులు తేవడంలోనే ఆనందం లేదని వాటిని సద్వినియోగం చేసి అభివృద్ధి జరిగినప్పుడే సం తృప్తి కలుగుతుందన్నారు. శ్మశానంలో నిద్రించడం పట్ల ఆయన స్పందిస్తూ తనకు ఏవిధమైన భయాందోళనలు లేవని, సాటి మనిషిగా కార్మికుల్లో ధైర్యాన్ని నింపి పనులను వేగవంతం చేయించడానికే రాత్రి బసకు ఉపక్రమించానని చెప్పారు.

Advertisements
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...