Jump to content

Model police stations


Recommended Posts

  • 3 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...

East Godavari District @egodavarigoap Aug 20

 
 

మరింత పురోగతి మరియు అద్భుతమైన రాష్ట్రం కొరకు ఆధునిక సాంకేతికతో నూతనంగా తూర్పుగోదావరి జిల్లా పోలీస్ స్టేషన్ నిర్మించబడింది.

DlCi5QFV4AIb_xl.jpg
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 4 weeks later...
  • 5 weeks later...
 
 

రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో, 1కోటి,40లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మోడల్ #పోలీస్_స్టేషన్ ను సందర్శించిన మంత్రివర్యులు @paritalasunith1 అమ్మ @JaiTDP ✊✊✊#AndhraPradesh @ParitalaSreera1 #ThankYouCMSir @ncbn @naralokesh @AndhraPradeshCM @TDPLiveUpdates

Dr7axZvU4AAtBrO.jpg
Dr7ayH4U0AAf1xp.jpg
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 4 weeks later...
  • 4 weeks later...
  • 1 month later...
నవ్యాంధ్ర నయా పోలీస్‌

ఆధునిక పోలీసింగ్‌ ప్రజలకు భరోసా
ఆదర్శ పోలీసుస్టేషన్లతో ఆదరణ
నిఘా కెమెరాలతో భద్రత
గేదెల భరత్‌కుమార్‌
ఈనాడు, అమరావతి

27election15a.jpg

* చుట్టూ ఆహ్లాకరమైన పచ్చదనం, మధ్యలో అత్యాధునిక భవనం... లోపల అడుగు పెడుతూనే సాదర స్వాగతం. ముందు తాగడానికి మంచి నీళ్లు. సమస్యలేంటో అడిగి తెలుసుకుని.. సంబంధిత విభాగ బాధ్యులకు అప్పగించడం....
-ఏ కార్పొరేట్‌ కార్యాలయంలోనో అందించే సేవలనుకుంటున్నారా?
కాదు మన రాష్ట్రంలోని ఆదర్శ పోలీసుస్టేషన్లలో మారిన పరిస్థితులివి. కొత్త పోలీసింగులో సరికొత్త సంగతులివి.


* ఆ కుటుంబం ఇంటికి తాళం వేసి ఊరెళ్లింది. రాత్రి వేళ చుట్టుపక్కల అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో దొంగలు పడ్డారు. బీరువాలు పగులగొట్టి... సొత్తు సర్దేశారు. అంతలోనే పోలీసులు ఆ ఇంటి దగ్గరికి వచ్చి దొంగలందర్నీ పట్టుకొన్నారు.
-ఇదెలా సాధ్యం? అనేగా మీ ప్రశ్న.
మన పోలీసులు ప్రవేశపెట్టిన ‘లాక్డ్‌ హౌస్‌ మోనటరింగ్‌ సిస్టమే’ దీనికి సమాధానం.


* రోజూ కాలేజీకి వెళ్లొచ్చే ఆడపిల్లను ఒక ఆకతాయి వెంట పడి విసిగిస్తున్నాడు. ఎవరికి చెబితే ఏమవుతుందోనని ఆ అమ్మాయి తనలోనే మధన పడుతోంది.. ఇంతలోనే పోలీసులు ఆ ఆకతాయిని పట్టుకున్నారు.
-ఎవరూ చెప్పకుండానే పోలీసులకు ఆ ఆకతాయి వ్యవహారం ఎలా తెలిసిందంటారా?
నిరంతర నిఘా కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీకెమెరాలే పోలీసులకు సమాచారం అందించాయి...

స్టేషన్ల ఆధుని‘కత’

27election15b.jpg

రాష్ట్ర విభజన తర్వాత సరైన భవనమే లేని పోలీసు శాఖకు ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక ప్రధాన కార్యాలయం నిర్మించింది. సాంకేతిక సేవల విభాగాలన్నీ ఒకే చోట ఉండేందుకు సాంకేతిక సౌధం అందుబాటులోకి తెచ్చింది.
* భవనాల్లో ఆధునిక వసతులే కాదు... స్టేషన్లో సిబ్బంది ఆహార్యం, విధుల నిర్వహణ తీరు.. మొత్తం మారిపోయాయి. 2017లో గుంటూరులోని నగరంపాలెం, పాత గుంటూరుల్లో ఈ తరహా స్టేషన్లను ప్రారంభించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 40 స్టేషన్లను ఆధునికీకరించారు. దశలవారీగా అన్నింటినీ ఇలా మార్చనున్నారు. పోలీసుస్టేషన్‌లో అడుగుపెట్టగానే రిసెప్షన్‌లో సాదరంగా ఆహ్వానిస్తారు. సమస్య  తెలుసుకొంటారు. తర్వాత కేసు నమోదు చేస్తారు. ఫిర్యాదుదారుల్లో భరోసా కల్పిస్తారు.

* నిర్మించ తలపెట్టిన భవనాలు : 40
* ఇప్పటివరకూ పూర్తయినవి : 16
* తుది దశలో ఉన్నవి : 24
* ఒక్కో భవన నిర్మాణానికి వెచ్చిస్తున్న మొత్తం: రూ.1.40 కోట్లు

నిఘా కెమెరాలు.. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు

27election15d.jpg

డిరోడ్డులో నేరం చేసి తప్పించుకున్నా.. ఆధారాలు సేకరించడం కష్టంగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా సాక్ష్యాధారాలు ఇట్టే సంపాదించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అసలు నేరం జరగక ముందే నియంత్రించగలిగేలా అత్యాధునిక నిఘా కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసింది.

* రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలనుకున్న నిఘా కెమెరాలు : 14,770
* ప్రస్తుతం ఉన్నవి : 11,000
* వినియోగంలోకి వచ్చినవి : 8,500
* ఉపయోగం : నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, కేసుల ఛేదన

మరింత బలంగా రక్షణ

27election15e.jpg

* ఫిన్స్‌(ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ నెట్‌వర్క్‌ సిస్టం)ను ఉపయోగించి ఎక్కడికక్కడ నేరస్థుల సమాచారం తెలుసుకోవచ్చు. అనుమానాస్పద వ్యక్తులు కన్పిస్తే... ఈ ఫిన్స్‌లో వేలిముద్ర తీసుకుంటారు. దీంతో అతనిపై గతంలో ఏమైనా కేసులున్నాయా? అనేది ఫోన్‌లో డిస్‌ప్లే అవుతుంది. దీన్ని బట్టి అతను ఎంత ప్రమాదకారో గుర్తించి చర్యలు తీసుకుంటారు.
* బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందికి శరీరంపై ధరించే కెమెరాలను ప్రభుత్వం అందజేసింది. వివాదాస్పద ఘటనల్లో ఇవి ఉపయోగకరంగా మారాయి.
* ఫాల్కన్‌ వాహనాలు... నడిచే కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు. మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా ముఖ్యమైన కార్యక్రమాలు జరిగినప్పుడు వీటిని తరలించి నిఘా కెమెరాల్లోని దృశ్యాలను ఈ వాహనంలోనే కూర్చొని వీక్షించొచ్చు. నేరం జరిగిన స్థలానికి వేగంగా చేరుకునేందుకు గత అయిదేళ్ల వ్యవధిలో రూ.150 కోట్లతో 4,427 వాహనాలను కొనుగోలు చేశారు.

మీ ఇంటి భద్రతకు మాది పూచీ

27election15f.jpg

ఏపీ పోలీసులు ప్రవేశపెట్టిన లాక్డ్‌ హౌస్‌ మానటరింగ్‌ సిస్టమ్‌ (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) ఇళ్లలో దొంగతనాలకు అడ్డుకట్టవేసింది. మొబైల్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. ఎక్కడికైనా ఊరెళ్లినప్పుడు ఈ యాప్‌లో పోలీసులకు ఓ వినతి పెడితే చాలు పోలీసులే భద్రత కల్పిస్తారు. ఇంట్లో నిఘా కెమెరాలను అమర్చి.. దాన్ని స్థానిక పోలీసుస్టేషన్‌కు అనుసంధానిస్తారు. ఇంట్లో దొంగలెవరైనా ప్రవేశించినా, అపరిచిత వ్యక్తులు లోపలికి వెళ్లినా.. వెంటనే అప్రమత్తమై అక్కడికి వెళ్లి పట్టుకుంటారు. కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, పశ్చిమగోదావరి, రాజమహేంద్రవరం, చిత్తూరుల్లో దొంగతనం జరుగుతుండగానే ఇలా పట్టుకున్నారు. ఈ తరహా దొంగతనాలు 24% తగ్గించగలిగారు.

* ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని పోలీసు శాఖ వద్ద వివరాలు నమోదు చేసుకున్న వారు: 6,79,124
* ఇప్పటివరకూ ఎన్ని ఇళ్లల్లో వినియోగించారంటే : 33,015
* నియంత్రించగలిగిన దొంగతనాలు : 27,353

మహిళలకు ‘‘శక్తి’’

27election15c.jpg

హిళల భద్రతకు అండగా ఉండటం, వారిలో భరోసా నింపటం, హక్కులు, చట్టాల పట్ల అవగాహన కల్పించటమే లక్ష్యంగా ప్రభుత్వం శక్తి బృందాలను ఏర్పాటు చేసింది. మెరికల్లాంటి మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి, వారికి గస్తీ విధులు, కరాటే, జూడో, సైబర్‌ నేరాల పరిశోధన ఇలా విభిన్న అంశాల్లో తర్ఫీదిచ్చింది. తొలుత విజయవాడలో ప్రయోగాత్మకంగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టి తిరుపతి, విశాఖపట్టణాలకు విస్తరించారు. వీరు కళాశాలలు, బస్టాండ్లు, తదితర బహిరంగ ప్రదేశాల్లో నిఘా పెడుతుంటారు. మహిళల్లో అవగాహన కల్పిస్తారు. సమస్యల  పరిష్కారానికి కృషి చేస్తారు.

ప్రవాసాంధ్రులకు అండ

ప్రవాసాంధ్రులకు ఏదైనా సమస్య వస్తే గతంలో పరిష్కారం కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి మారింది. గతేడాది సెప్టెంబరులో సీఐడీ విభాగంలో ఏపీ ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబరు, మెయిల్‌, వాట్సాప్‌ల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇలా వివిధ దేశాల నుంచి వచ్చిన 121 ఫిర్యాదులు పరిష్కరించారు.

సైబర్‌ నేరాలపై దృష్టి

పెరుగుతున్న సైబర్‌ నేరాల ఛేదనకు సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. రాజమహేంద్రవరం, కర్నూలు, తిరుపతిల్లో సైబర్‌ నేరాల ప్రాంతీయ విశ్లేషణ ప్రయోగశాలలను నెలకొల్పింది. విజయవాడ, విశాఖపట్నంల్లో భుత్వం సైబర్‌ నేరాల పోలీసుస్టేషన్లు, ప్రయోగశాలలను ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది బేసిక్‌ సైబర్‌ క్రైమ్‌ రెస్పాండర్‌ కిట్లు అందించింది. వీటి ద్వారా ఎక్కడ సైబర్‌ నేరం జరిగిన సులువుగా ఛేదించేలా చర్యలు చేపట్టింది. ఐటీ శాఖతో సమన్వయం చేసుకుని అత్యంత ఆధునికమైన సైబర్‌ భద్రత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
27election15g.jpgపోలీసులు కనిపించకూడదు.. పోలీసింగ్‌ కనిపించాలి!
(ఇన్‌విజిబుల్‌ పోలీస్‌.. విజిబుల్‌ పోలీసింగ్‌)
...శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న ఈ సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒడిసిపట్టింది. అత్యాధునిక సాంకేతికతను జోడించి మొత్తం పోలీసింగ్‌నే  కొత్త పంథాలోకి తీసుకెళ్లింది.

పోలీసులకు కార్పొరేట్‌ సంస్థలను తలదన్నేలా మౌలిక వసతులను సమకూర్చటమే కాదు.... ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం అనేక ఆవిష్కరణలు, సంస్కరణలు తీసుకొచ్చింది.
పోలీసులంటే భయం కాదు... భరోసా ఉండాలని చాటింది.  స్టేషన్ల రూపురేఖలు మార్చటం మొదలుకొని.. ప్రవాసాంధ్రుల సమస్యలకు పరిష్కారం చూపటం వరకూ కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...