Jump to content

Ramana Deekshitulu-anil(christian charity)

Recommended Posts

‘రమణ దీక్షితులు విషయంలో సిగ్గు పడుతున్నా..’
20-06-2018 17:23:29
 
గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై హిందూ ధర్మరక్ష సమితి జిల్లా అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రమణ దీక్షితులు ఫాదర్ దీక్షితులుగా మారారని విమర్శించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రమణ దీక్షితులకు గతంలో మద్దతు పలికినందుకు సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు. రమణ దీక్షితులను తిరుమల కొండపైకి రాకుండా నిషేధించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాగా, హైదరాబాద్‌లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రమణ దీక్షితులు.. క్రిస్టియన్ ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రమణ దీక్షితుల ఆరోపణల వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

క్రిస్టియన్ ప్రతినిధులతో రమణ దీక్షితులు!
20-06-2018 15:46:31
 
636651064049852156.jpg
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు క్రిస్టియన్ చారిటీ సంస్థలతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీపై మరోసారి ఆరోపణలు చేసేందుకు నగరంలోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రమణ దీక్షితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని క్రిస్టియన్ ప్రతినిధి బోరుగడ్డ అనిల్ ఆర్గనైజేషన్ చేసినట్లు తెలుస్తోంది. సైమన్ అమృత్ ఫౌండేషన్ పేరుతో మత ప్రచార కార్యక్రమాలను అనిల్ నిర్వహిస్తున్నాడు. అయితే.. మీడియా సమావేశంలో రమణ దీక్షితులు వెనుక అనిల్ ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది. మరోవైపు అనిల్‌పై అనేక నేరారోపణలు ఉన్నాయి. గతంలో అమరావతిలో భూ వివాదంలో డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప పేరు చెప్పుకొని పలు నేరాలకు పాల్పడ్డాడు. కొన్ని సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తితో రమణ దీక్షితులుకి సంబంధం ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
24 ఏళ్లపాటు శ్రీవారికి ప్రధాన అర్చకులుగా సేవలందించిన రమణ దీక్షితులు.. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంతో టీటీడీ ఆయనకు రిటైర్మెంట్ ప్రకంటించింది. అప్పటి నుంచి రమణ దీక్షితులు తన ఆరోపణలను మరింత ముమ్మరం చేశారు. లోటస్‌పాండ్ వెళ్లి జగన్‌ను కలిశారు. నాడే అన్యమతస్తుల ఇంటికి ఎలా వెళ్తారనే విమర్శలు వచ్చాయి. అయినా రమణ దీక్షితులు తనను తాను సమర్థించుకున్నారు. తన పొట్ట ఎవరు నింపితే వారిని కలుస్తానని ప్రకటించుకున్నారు. ఇప్పుడు నేరుగా మత ప్రచార సంస్థ నిర్వాహకులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించడం వివాదాస్పదమవుతోంది.
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

@Nandamuri Rulz:sucks:

Link to comment
Share on other sites

టీటీడీ పరీక్షలకు రమణదీక్షితులు మనవడు గైర్హాజరు
20-06-2018 15:46:19
 
636651063935793745.jpg
 
తిరుపతి: టీటీడీ పరీక్షలకు మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు మనవడు వినీత్ గైర్హాజరయ్యారు. టీటీడీలో మిరాసీ అర్చక కుటుంబాల పిల్లలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రవేశిక, వర, ప్రవరలో ఉత్తీర్ణులైన వారికే అర్హత లభిస్తుంది. కానీ ప్రవేశిక, వర, ప్రవర పరీక్షలకు రమణ దీక్షితులు మనవడు వినీత్‌ డుమ్మా కొట్టారు. సర్టిఫికెట్లు లేక వినీత్‌ అర్హత సాధించలేకపోయాడు. ఇంటర్వ్యూల సమయంలో రమణ దీక్షితులు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతున్నారు. రమణ దీక్షితుల తీరుపై మిరాసీ కుటుంబాలు మండిపడ్డాయి.
Link to comment
Share on other sites

నేరచరితులతో టీటీడీ మాజీ అర్చకుడికి పనేంటి ?
20-06-2018 22:45:13
 
636651315270322371.jpg
మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు క్రిస్టియన్ మైనార్టీ సంస్థల నిర్వాహకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం వివాదాస్పదమవుతోంది. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టిన రమణదీక్షితులు టీటీడీపై మళ్లీ ఆరోపణలు చేశారు. అయితే మనవడిని అర్చకుడిగా నియమించనందునే దీక్షితులు టీటీడీపై ఈ ఆరోపణలు చేశారనే విమర్శలు వస్తున్నాయి. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు క్రిస్టియన్ చారిటీ సంస్థలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నార్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీపై మరోసారి ఆరోపణలు చేసేందుకు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రమణదీక్షితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎప్పటిలానే టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల జోరు కొనసాగించారు. తాను చేస్తున్న ఆరోపణలపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేశారు.
 
అయితే ఇంతవరకూ రొటీన్‌గానే ఉన్నా ఇక్కడే కథ మలుపు తిరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మీడియా సమావేశాన్ని ఆర్గనైజ్ చేసింది..బోరుగడ్డ అనిల్ అనే క్రిస్టియన్ చారిటీ సంస్థల నిర్వాహకుడు. ఇతను క్రిస్టియన్ చారిటీ సంస్థతో పాటు సైమన్ అమృత్ ఫౌండేషన్‌ పేరుతో మత ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాడు. సైమన్ అమృత్ ఫౌండేషన్ సంస్థకు సీఈవో, ఫౌండర్‌గా వ్యవహరిస్తున్న బోరుగడ్డ అనిల్‌కు..నేర చరిత్ర కూడా ఉంది.
 
అమరావతిలో ఓ భూవివాదంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప పేరు చెప్పుకుని నేరాలకు పాల్పడ్డట్టు అనీల్‌పై కేసులున్నాయి. కొన్ని సెటిల్‌మెంట్లు చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు..గుంటూరు జిల్లా తాడికొండ స్టేషన్‌లో అనీల్‌పై రౌడీ షీట్ కూడా ఉంది. జగన్ బావమరిదిని అని చెప్పుకుంటూ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానంటూ వసూళ్లకు పాల్పడినట్టు కూడా ఇతనిపై ఫిర్యాదులున్నాయి. గుంటూరు వల్లూరివారి తోటలో.. భీంసేన పేరుతో ఓ కార్యాలయం కూడా ప్రారంభించాడు అనీల్. ప్రస్తుత కేంద్రమంత్రి అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ యూత్ అధ్యక్షుడినని చెప్పుకుంటున్న అనీల్.. ఐఏఎస్, ఐపీఎస్‌ల వద్ద వసూళ్లకు దిగినట్టు కూడా ఆరోపణలున్నాయి. ఇంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తితో రమణ దీక్షితులుకి సంబంధం ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
24 ఏళ్లపాటు శ్రీవారికి ప్రధాన అర్చకులుగా సేవలందించిన రమణ దీక్షితులు.. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంతో టీటీడీ ఆయనకు రిటైర్మెంట్ ప్రకటించింది. అప్పటి నుంచి రమణ దీక్షితులు తన ఆరోపణలను మరింత ముమ్మరం చేశారు. లోటస్‌పాండ్ వెళ్లి జగన్‌ను కలిశారు. నాడే అన్యమతస్తుల ఇంటికి ఎలా వెళ్తారనే విమర్శలు వచ్చాయి. అయినా రమణ దీక్షితులు తనను తాను సమర్థించుకున్నారు. తన పొట్ట ఎవరు నింపితే వారిని కలుస్తానని ప్రకటించుకున్నారు. ఇప్పుడు నేరుగా మత ప్రచార సంస్థ నిర్వాహకులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించడం వివాదాస్పదమవుతోంది.
 
క్రిస్టియన్ మిషనరీలతో కుమ్మక్కై రమణ దీక్షితుల బ్రహ్మణుల మనోభావాలను కించపరిచారని..హిందూ ధర్మ రక్ష సమితి జిల్లా అధ్యక్షుడు దర్శనపు శ్రీనివాస్ ఆరోపించారు. రమణ దీక్షితులకు మద్దతు తెలిపినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పారు. ఫాదర్ దీక్షితులుగా మారిన రమణ దీక్షితులను తిరుమల కొండపైకి రాకుండా నిషేదించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
 
మరోవైపు తన మనవడిని టీటీడీలో అర్చకుడిగా తీసుకోలేదనే కోపంతో రమణదీక్షితులు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టారని తిరుపతి తిరుమలలోని అర్చక కుటుంబాలు మండిపడుతున్నాయి. మిరాశీ కుటుంబాలకు చెందిన అర్చకుల వారసులను టీటీడీలోకి తీసుకోవటానికి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. వేదపాఠశాలలో వైఖానస ఆగమాన్ని చదివిన వారిని మాత్రమే అర్చకులుగా టీటీడీ చేర్చుకుంటుంది. అయితే మిరాశీ అర్చకుల వారసులు ఇతరులు కొందరికి ప్రభుత్వం పెట్టిన ప్రవేశిక, వర, ప్రవర పరీక్షలు పాస్ అయివుంటే కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తన మనవడిని కూడా అర్చకుడిగా తీసుకోవాలని టీటీడీని డిమాండ్ చేశారు రమణదీక్షితులు. అయితే అర్చకత్వంలో ఎలాంటి అర్హత సాధించని రమణదీక్షితులు మనవడు వినీత్‌ను అర్చకుడిగా తీసుకునేందుకు టీటీడీ అధికారులు ఒప్పుకోలేదు. దీంతో టీటీడీపై అతను కక్ష కట్టాడని అర్చక కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.
 
తన వ్యక్తిగత స్వార్ధంతో క్రిస్టియన్ మిషనరీలతో కలిసిన రమణ దీక్షితులు..హిందువుల మనోభావాలను దెబ్బతిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రమణ దీక్షితులు ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని ఏడుకొండవాడిని క్షమాపణ అడగాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...