Jump to content

పరకాల ప్రభాకర్‌ రాజీనామా


Recommended Posts

అమరావతి : ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. రెండు పేజీల తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పంపించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపం చెందినట్లు లేఖలో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనపై నిందా ప్రచారం చేస్తుండటంతో కలత చెందానని.. తక్షణం తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో కోరారు. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి అండగా నిలిచి- నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో తనవంతు భూమిక పోషించే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

విపక్షానికి చెందిన కొందరు నాయకులు తాను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతల్లో ఉండడాన్ని పదే పదే ఎత్తి చూపుతున్నారని.. కేంద్రంపై, భాజపాపై జరుగుతోన్న ధర్మ పోరాటం మీద ప్రజల్లో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వంలో తన ఉనికిని, ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని శంకించేలా ప్రకటనలు చేస్తున్నారని ఆవేదన చెందారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి.. కేంద్రంపై చేస్తోన్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారని విమర్శించారు. తన వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలను ఆపాదించడం సరికాదన్నారు. తన కుటుంబంలోని వ్యక్తులు వేరే పార్టీలో ఉన్నందువల్ల, తన కంటే భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందువల్ల రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీ పడతానని కొందరు ప్రచారం చేయడం తనకు బాధిస్తోందని పరకాల తన లేఖలో ఆవేదన చెందారు.

పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్ధులై ఉండగలరని, వారి వారి అభిప్రాయాల పట్ల వారికున్న అంకిత భావానికి బాంధవ్యాలు అడ్డు రాలేవనే ఇంగితం కూడా వీరికి భగవంతుడు ప్రసాదించకపోవడం దురదృష్టకరమన్నారు. తాను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష మీద, చిత్తశుద్ధి మీద నీలినీడలు పడకూడదన్నది తన కోరిక అని పరకాల పేర్కొన్నారు.

తన వల్ల ముఖ్యమంత్రికి... ప్రభుత్వ ప్రతిష్ఠకు స్వల్ప నష్టం కూడా జరగరాదని దృఢ అభిప్రాయంతో ఉన్నానని.. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నానని పరకాల తెలిపారు. సీఎంపైన, ప్రభుత్వం మీద బురదజల్లడానికీ, లేనిపోని ఆరోపణలు చెయ్యడానికీ తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లూ ఎవ్వరూ వాడుకోకూడదన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...