Jump to content

Parakala prabhakar


Recommended Posts

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా

రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించిన పరకాల

ప్రతిపక్ష నాయకుని వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపం చెందిన డాక్టర్ పరకాల

గత కొన్ని రోజులుగా తనపై చేస్తున్న నిందాప్రచారంపై కలత 

తక్షణం రాజీనామా ఆమోదించాలని లేఖలో ముఖ్యమంత్రిని కోరిన డాక్టర్ పరకాల ప్రభాకర్

నవ్యాంధ్రప్రదేశ్  పునర్ నిర్మాణంలో పరకాల కీలక భూమిక

నాలుగేళ్లుగా ప్రభుత్వానికి అండగా నిలబడిన డాక్టర్ పరకాల ప్రభాకర్
ముఖ్యమంత్రికి రాసిన లేఖలో డాక్టర్ పరకాల ప్రభాకర్ : 

విపక్షానికి చెందిన కొంతమంది నాయకులు నేను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలలో ఉండడాన్ని పదే పదే ఎత్తి చూపుతున్నారు

కేంద్రంపై, బీజేపీపై జరుగుతున్న ధర్మ పోరాటం మీద ప్రజలలో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. 

ప్రభుత్వంలో నా ఉనికిని, మీ చిత్తశుద్ధిని శంకించడానికి వాడుకుంటున్నారు.

బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి మీరు చేస్తున్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారు. 

నా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు, రాజకీయ  ప్రయోజనాలనూ, ప్రాతిపదికనూ  ఆపాదించ పూనుకోవడం, వాటిని తెరవెనుక మంతనాలకు బేరసారాలకూ మీరు వినియోగిస్తారని ఆరోపించడం ప్రతిపక్ష నాయకుల నీచ స్థాయి  ఆలోచనలకు తార్కాణం. 

నా కుటుంబం లోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉన్నందు వల్ల, నాకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి  ఉన్నందు వల్ల మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడతాను అని కొందరు ప్రచారం చేయడం చాలా బాధిస్తోంది.  

పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్ధులై ఉండగలరనీ, వారి వారి అభిప్రాయాల పట్ల వారికున్న అంకిత భావానికి బాంధవ్యాలు అడ్డు రాలేవనే  ఇంగితం కూడా వీరికి భగవంతుడు ప్రసాదించకపోవడం దురదృష్టకరం. 

నేను ప్రభుత్వంలో  కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు మీరు చేపట్టిన ధర్మపోరాట దీక్షమీదా, మీ చిత్తశుద్ధి మీదా నీలినీడలు పడకూడదని నా కోరిక.  

నా వల్ల మీకూ, ప్రభుత్వ ప్రతిష్ఠకూ నలుసంతయినా నష్టం జరగరాదని నా దృఢ అభిప్రాయం. 

అందుచేత నేను ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నాను. 

మీ మీదా, ప్రభుత్వం మీదా బురదజల్లడానికీ, లేనిపోని ఆరోపణలు చెయ్యడానికీ నా పేరూ, నా కుటుంబ సభ్యుల పేర్లూ ఎవ్వరూ వాడుకోకూడదు. 

గత నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగ చేసినందుకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడనై  ఉంటాను.

Link to comment
Share on other sites

పరకాల ప్రభాకర్ రాజీనామా లేఖలో ఏముందంటే..
19-06-2018 15:03:59
 
636650174534228563.jpg
విజయవాడ: ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను కలచివేశాయని, అందుకే రాజీనామా చేస్తున్నానని పరకాల ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపిన పరకాల.. జగన్ కొన్ని రోజులుగా తనపై చేస్తున్న నిందా ప్రచారంపై కలత చెందానని, తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తూ.. నాలుగేళ్లుగా ప్రభుత్వానికి అండగా ఉన్న డాక్టర్ పరకాల ప్రభాకర్.. అకస్మాత్తుగా రాజీనామా చేయడానికి కల కారణాలను తన లేఖలో పొందుపరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరకాల రాసిన లేఖలో ఏముందంటే..
 
 
‘‘విపక్షానికి చెందిన కొంతమంది నాయకులు నేను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలో ఉండడాన్ని పదేపదే ఎత్తి చూపుతున్నారు. కేంద్రంపై, బీజేపీపై జరుగుతున్న ధర్మ పోరాటం మీద ప్రజలలో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో నా ఉనికిని.. మీ చిత్తశుద్ధిని శంకించడానికి వాడుకుంటున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి మీరు చేస్తున్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారు. నా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలనూ, ప్రాతిపదికనూ ఆపాదించి వాటిని తెరవెనుక మంతనాలకు, బేరసారాలకూ మీరు వినియోగిస్తారని ఆరోపించడం ప్రతిపక్ష నాయకుల నీచ స్థాయి ఆలోచనలకు తార్కాణం. నా కుటుంబంలోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉన్నందు వల్ల, నాకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందు వల్ల మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడతానని కొందరు ప్రచారం చేయడం చాలా బాధిస్తోంది.
 
 
పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్ధులై ఉండగలరనీ, వారి వారి అభిప్రాయాల పట్ల వారికున్న అంకిత భావానికి బాంధవ్యాలు అడ్డు రాలేవనే ఇంగితం కూడా వీరికి భగవంతుడు ప్రసాదించకపోవడం దురదృష్టకరం. నేను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు మీరు చేపట్టిన ధర్మపోరాట దీక్ష మీదా, మీ చిత్తశుద్ధి మీదా నీలినీడలు పడకూడదని నా కోరిక. నా వల్ల మీకూ, ప్రభుత్వ ప్రతిష్ఠకూ నలుసంతయినా నష్టం జరగరకూడదని నా దృఢ అభిప్రాయం. అందువల్ల నేను ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నాను. మీ మీదా, ప్రభుత్వం మీదా బురద జల్లడానికీ, లేనిపోని ఆరోపణలు చెయ్యడానికి నా పేరూ, నా కుటుంబ సభ్యుల పేర్లూ ఎవ్వరూ వాడుకోకూడదు. నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగ చేసినందుకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడనై ఉంటాను.’’ అని ఆ లేఖలో ఉంది.
 
 
పరకాల ప్రభాకర్ సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్రమోదీ కేబినెట్‌లో నిర్మలా సీతారామన్ మంత్రిగా ఉండడంతో దాన్ని పరకాల ప్రభాకర్‌కు ఆపాదిస్తూ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిందారోపణలు చేసిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

3 minutes ago, Jaitra said:

News channels debates ki velli,he should tear apart bjp and ysrcp

Expecting lot emo. He will remain silent till 2019 elections. 

Post elections if TDP wins he will get key post.

Link to comment
Share on other sites

Parakala Prabhakar Resigned 
#BreakingNews: YS Jagan Effect | Parakala Prabhakar Resigns to AP Govt Advisor Post | Mahaa News 
https://www.youtube.com/watch?v=ECi4hxOuRbk 

https://www.mirchi9.com/politics/parakala-prabhakar-resigns/ 

https://telugu.samayam.com/latest-news/state-news/ap-govt-me dia-advisor-parakala-prabhakar-resigned/articleshow/64647170 .cms 

Parakala in his resignation Letter told that the Chief Minister that he can not allow the agitation of the government to be overshadowed due to him and urged the Chief Minister to immediately accept his resignation. â��Matured People will have their own Political Opinions and the relations will not come in their way. Itâ��s a pity that the Opposition Parties do not have such minimum common sense. But I would not want that to tarnish the image of the government or this agitation,â�� Parakala said in his resignation letter. 

Read more at: https://www.mirchi9.com/politics/parakala-prabhakar-resigns/ 

Tight Slap to Jagan/YSRC and BJP also who are not doing coutter attack on this baseless allegation on the Country's Defense Minister


CBN: Man with Vision & Mission 
facebook.com/NamoNaraYanam 
https://www.youtube.com/watch?v=wBIfjgfl4Ng 

Link to comment
Share on other sites

allegations are very degrading.....its hitting their family and personal integrity.....worst level ki digi comment chesaru on the integrity of Indian Defense minister and her family

Link to comment
Share on other sites

పరకాల ప్రభాకర్ రాజీనామా ఆమోదించం: సోమిరెడ్డి
19-06-2018 15:22:19
 
636650185532670793.jpg
అమరావతి: ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ రాజీనామాను ప్రభుత్వం అంగీకరించదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ముద్దాయిలు చేసే ఆరోపణలకు పరకాల ప్రభాకర్ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం మొండిచేయి చూపినా జగన్ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. కేంద్రంతో లాలూచీ రాజకీయాలతోనే జగన్ టీడీపీని తిడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై పోరాడేతత్వం జగన్‌కు లేదని.. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఎలా రాణిస్తారని మంత్రి ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

పరకాల రాజీనామా ఆమోదించం: సీఎంవో
19-06-2018 15:46:08
 
636650199822038259.jpg
అమరావతి: ప్రతిపక్ష నేతల ఆరోపణలకు మనస్తాపం చెంది ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన పరకాల ప్రభాకర్ రాజీనామాను ఆమోదించే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఎవరో ఆరోపణలు చేస్తే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మలా సీతారామన్‌ సమర్థించగా.. విశాలాంధ్ర మహాసభ పేరిట సమైక్య ఉద్యమాన్ని పరకాల నడపలేదా? అని ప్రశ్నించింది. ఆ విషయాలు విపక్షాలకు తెలియవా? అని టీడీపీ వర్గాలు నిలదీశాయి.
Link to comment
Share on other sites

Gentleman,  brave ga attack chesadu. Hope this is good move by CBN and should accept the resignation. Then, we have to give a big task to parakala to demand Governor Narasimhan resignation strongly and effectively. 

 

Naa meedha aaropanalu vachayi, resign chesanu. Meeru naa kanna daarunanaga Operation Garuda ni naduputhunnaru. Resign cheyandi ani poratalu cheyali. 

Link to comment
Share on other sites

2 minutes ago, Uravakonda said:

 

 

Naa meedha aaropanalu vachayi, resign chesanu. Meeru naa kanna daarunanaga Operation Garuda ni naduputhunnaru. Resign cheyandi ani poratalu cheyali. 

endhi ee concept intha fancy ga undhi....bemmi.gif

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...