Jump to content

Lagadapati rg flash team survey


Recommended Posts

  • Replies 356
  • Created
  • Last Reply
ఆర్‌జి ఫ్లాష్ సర్వే చెప్పిన సంచలన విషయాలు..
16-06-2018 19:17:09
 
636647734939093032.jpg
అమరావతి: ప్రత్యేక హోదా పోరాటంతో రగులుతున్న ఏపీ రాజకీయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికెన్ని సీట్లు వస్తాయి? ఏపీ ఎవరి పక్షాన నిలబడుతుంది? ఎవరికెన్ని ఓట్లు పడతాయ్? కొత్తగా వస్తున్న జనసేన సేన ప్రభావం ఎంత? ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందా అంటే జనం సమధానం ఏంటి? ఏపీలో రాజకీయాన్ని శాసిస్తామంటున్న బీజేపీకి ఆంధ్రులు వేస్తున్న మార్కులెన్ని? నిఖార్సుగా జనం నాడి పట్టి చూపించే ఆర్జీ ఫ్లాష్ టీమ్... ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి కోసం సర్వే చేసింది. మాజీ ఎంపీ లగడపాటి తరుపున సర్వేలు చేసే ఆర్జీ ఫ్లాష్ టీమ్... శ్రీనివాస్ నేతృత్వంలో ఏపీ పల్స్‌ని ఒడిసి పట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో అసలు పరిస్థితి ఏంటో వివరంగా చూద్దాం !
 
 
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం సర్వే చేసిన ఆర్జీ ఫ్లాష్ టీమ్ ఐదు ప్రశ్నలు అడిగింది. స్పష్టమైన సమాధానం రాబట్టింది. ఆ ప్రశ్నలేంటంటే..
 
1. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ?
2. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు ?
3. ఏపీకి మోడీ అన్యాయం చేశారా ?
4. ప్రత్యేక హోదా పోరాటం సమర్థంగా చేస్తున్నది ఏ పార్టీ ?
5. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుకు మీరెన్ని మార్కులు వేస్తారు ?
 
 
1. ఏపీకి మోదీ అన్యాయం చేశారా ?
 
  • అవును 83.67%
  • కాదు 16.33%
ఏపీకి మోదీ అన్యాయం చేసారా అంటే అని సర్వేలో ప్రశ్నిస్తే ఏపీ ఠక్కున స్పందించింది. అవును అంటూ 83 శాతానికిపైగా అవును అని చెప్పారు. లేదు...అన్యాయం చేయలేదు అంటున్నవాళ్ల శాతం 16శాతం మాత్రమే ! అంటే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కానీ కోటాలు, కేటాయింపుల విషయంలో కానీ మోదీ అన్యాయం చేశారు అని అంటున్నవాళ్లు 83 శాతం ఉన్నారంటే కేంద్రం మీద పీకల్లోతు వ్యతిరేకత ఉన్నట్టే !
 
 
2. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నది ఏ పార్టీ ?
 
  • టీడీపీ 43.83 %
  • వైసీపీ 37.46%
  • జనసేన 9.65 %
  • సీపీఐ-సీపీఎం 1.08 %
  • ఇతరులు 4.87 %
ప్రత్యేక హోదా ఇప్పుడు ఏపీలో రాజకీయ ముడి సరుకు అయిపోయింది. అన్ని పార్టీలూ హోదా డిమాండ్ వినిపిస్తున్నాయ్. టీడీపీ సభలు సమావేశాలు పెడుతుంటే... వైసీపీ ఎంపీల రాజీనామాలు అని గత మూడునాలుగు నెలలుగా చెబుతోంది. ఇలాంటి టైమ్ లో జనం నాడి పట్టింది... ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే. హోదా కోసం టీడీపీ సమర్థంగా పోరాడుతోంది అంటున్నవాళ్లు 43.84 శాతం కాగా, ఏపీ ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడుతోంది అంటున్నవాళ్లు 37.46 శాతం మంది ఉన్నారు. ఇక జనసేన ప్రత్యేక హోదా పోరాటం చేస్తోంది అంటున్నవాళ్లు 9.65 శాతం మంది. అంటే ఈ నంబర్లు చూస్తే... ప్రత్యేక హోదా విషయంలో పేటెంట్ కోసం సాగుతున్న పోరాటంలో టీడీపీ 7 శాతం ముందంజలో ఉంది.వైసీపీ పోటీ ఇస్తోంది అనిపిస్తోంది.
 
 
3. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుకి ఎన్ని మార్కులు ?
  • బావుంది 53.69 %
  • బాగా లేదు 46.31 %
లోటు బడ్జెట్ తో రాజధాని కూడా లేకుండా పీకల్లోతు కష్టాల్లో ప్రస్థానం మొదలు పెట్టిన ఏపీకి చంద్రబాబు నాయకత్వం కావాలని ఏపీ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు నాలుగేళ్లు గడిచాయ్. ఎన్నికల ఏడాదిలో అడుగు పడింది. మరి ఇప్పుడు బాబు పనితీరుకి ఏపీ ఎన్ని మార్కులు వేస్తోంది అని ఆరా తీసింది సర్వే. చంద్రబాబు సమర్థంగా పనిచేస్తున్నారు అని 53 శాతానికిపైగా జనం అభిప్రాయ పడ్డారు. లేదు పనిచేయడం లేదు అని అంటున్న వాళ్లు 46 శాతం ఉన్నారు. అంటే చంద్రబాబు పనితీరుపై వ్యతిరేకత 46 శాతం ఉంది. ఇందులో ఇప్పుడు వైసీపీ జనసేన కాంగ్రెస్ ఇతరులు పంచుకోవాల్సి ఉంటుంది.
 
 
4. ఏ పార్టీకి ఓటు వేస్తారు ?
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని సర్వే అడిగితే.. జనం నుంచి స్పష్టమైన సమాధానం వచ్చింది.
  • టీడీపీ 44.04
  • వైసీపీ 37.46
  • జనసేన 8.90
  • కాంగ్రెస్ 1.18
  • బీజేపీ 1.01
  • లెఫ్ట్ 0.95
  • ఇంకా నిర్ణయించుకోలేదు 5.4
  • ఇతరులు 1.07
5. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...
  • టీడీపీ 110
  • వైసీపీ 60
  • ఇతరులు 05
ఈ క్షణంలో ఎన్నికలు జరిగితే టీడీపీకి 110 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. వైసీపీకి 60 సీట్లు వస్తాయని... ఇతరులు మరో 5 సీట్లు సాధించే అవకాశం ఉందని తేల్చింది. జగన్ పార్టీ 2014లో 174 సీట్లలో పోటీ చేసింది. 67 సీట్లు గెలిచింది. అంటే ఇప్పుడు 7 సీట్లు కోల్పోయింది ! అటు తర్వాత టీడీపీ 8 సీట్లు మెరుగు పడింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ 102 సీట్లు సాధించింది. బీజేపీ అప్పట్లో 13 సీట్లలో పోటీ చేసింది. నాలుగు సీట్లు గెలిచింది. ఇప్పుడు ఇక కొత్తగా వచ్చిన జన సేన ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని తేలిపోయింది. ఇతరుల కోటాలో 5 సీట్లు మాతమ్రే కనిపిస్తున్నాయ్. 2014లో నవోదయపార్టీ మాత్రమే ఒక్క సీటు గెలవగల్గింది.
 
 
జగన్ పాదయాత్ర చేసిన జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో కూడా సర్వే లెక్క తీసింది. క్రిష్ణా జిల్లా వరకూ జగన్ పాదయాత్ర పూర్తయిన తర్వాత తీసుకున్న జనాభిప్రాయం ఇది. అనంత నుంచి క్రిష్ణా జిల్లా వరకూ చూస్తే టీడీపీకి వైసీపీకి మధ్య భారీ ఓట్ల తేడా కనిపిస్తోంది. టీడీపీ డామినేషన్ క్లియర్ గా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీకే ఓటు వేస్తామని 46.81 శాతం మంది చెప్పగా... 36.45 శాతం మాత్రమే జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే తేడా పదిశాతం కనిపిస్తోంది. ఈ జిల్లాల్లో జనసేనకి ఓటేస్తామంటున్నవాళ్లు 7.73 శాతంగా ఉన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...