Jump to content

ఏదో జరుగుతోంది!


Recommended Posts

  • ఢిల్లీ కేంద్రంగా కుట్ర రాజకీయాలు
  • నాకు, రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్లాన్‌
  • పారదర్శక పాలన అందిస్తున్నాం
  • అన్యాయంపైనే పోరాడుతున్నాం
  • ఏం చేసుకుంటారో చేసుకోండి!
  • పరాకాష్ఠకు బీజేపీ, వైసీపీ కుట్రలు
  • కేంద్రం కోవర్టుగా విపక్ష వైసీపీ
  • బుగ్గన భేటీలే నిదర్శనం: బాబు
అమరావతి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ, బీజేపీ కుట్రలు పరాకాష్ఠకు చేరాయి. నన్ను లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో చేద్దామని ఢిల్లీలో పథక రచన జరుగుతోంది. ఆ మేరకు నాకు సంకేతాలు అందుతున్నాయి. ఢిల్లీ పెద్దలు ఏదో ఒకటి చేయాలన్న తహతహలో ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అమరావతిలో టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్‌ భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై సమీక్షించారు. తాజా రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ఢిల్లీలో ప్రధానిని కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ కూడా అక్కడే ఉన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆయన కలిశారు. వైసీపీ ఎమ్మెల్యే, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ అధ్యక్షుడు బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను వెంటపెట్టుకొని రాంమాధవ్‌ను కలిశారు. వీటి వెనుక మనల్ని ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన దాగి ఉందని వింటున్నాం. రకరకాల కుట్రపూరిత ఆలోచనలు, ప్రణాళికలను ప్రచారంలో పెడుతున్నారు. ఏం చేసినా, చేయాలనుకొన్నా ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ రాష్ట్రానికి న్యాయం చేయడంలేదనే మనం విభేదించాం. దానిపైనే పోరాడుతున్నాం. అందులో రాజీ లేదు. ప్రజలు మనతో ఉన్నారు. ఏదో చేస్తారని లొంగిపోవడానికి సిద్ధంగా లేం. ఏం కుట్రలు చేసుకుంటారో చేసుకోనివ్వండి’’ అని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
 
కోవర్టులుగా మారి రాష్ట్రానికి ద్రోహం
బీజేపీ నేతలకు వైసీపీ నాయకులు కోవర్టులుగా మారి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ఢిల్లీలో బుగ్గన బీజేపీ నేతలను కలవడమే దీనికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బీజేపీకి వంతపాడుతున్న వైసీపీ నేతలు రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. ‘‘ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ చేసిన ద్రోహంతో రాష్ట్ర ప్రజలు కుతకుతలాడుతున్నారు.. వైసీపీ నేతలేమో బీజేపీతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు. పీఏసీ చైర్మన్‌గా ఉన్న బుగ్గన కేంద్రానికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన సభాపతికి నివేదిక ఇవ్వాలి. సిఫారసులు ఏవైనా స్పీకర్‌కే అందించాలి. ఆ అంశాలను స్పీకర్‌ సభ ముందు పెడతారు. కానీ... బుగ్గన కేంద్రానికి రిపోర్ట్‌ చేయడమేమిటి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. వీరి నిర్వాకాలను ఐదు కోట్ల మంది ఆంధ్రులు గమనిస్తున్నారన్నారు. ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, కడప ఉక్కు ఫ్యాక్టరీ కావాలని విశాఖపట్నం రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని మనం పోరాడుతున్నాం. వైసీపీ మాత్రం బీజేపీతో లాలూచీ పడింది. కేంద్రానికి నివేదికలు ఇస్తూ, ఫిర్యాదులు చేస్తారా? మీ వల్ల ఏమవుతుందో అది చేసుకోండి! మేమేమీ భయపడంలేదు’’ అని స్పష్టం చేశారు. పారదర్శకమైన పాలన అందిస్తున్నామని.. ఇక్కడ భయపడేవారు ఎవరూలేరని తెలిపారు. వైసీపీకి ఏమాత్రం నైతికత లేదని... సిగ్గు వదిలేసి మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. కేసుల మాఫీ కోసం జగన్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘‘కడపలో స్టీల్‌ ప్లాంటు పెట్టకపోతే కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదు? మోదీని ఎందుకు నిలదీయడంలేదు? జగన్‌కు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యంకాదా? కర్ణాటకలో గాలి జనార్దనరెడ్డిని, ఏపీలో ఆయన సోదరుడు జగన్మోహనరెడ్డిని పక్కన పెట్టుకుని అవినీతిపై పోరాటం చేస్తామంటే ప్రజలు బీజేపీని నమ్ముతారా?’ అని ప్రశ్నించారు.
 
Link to comment
Share on other sites

BJP has a strict sketch in place or else they wouldn't be so confident about CBN's failure in 2019. 

They have some kind of hidden strategy in place or else with the way BJP is perceived in the state, they can never imagine CBN's failure and a

favorable situation for them in 2019.

 

Link to comment
Share on other sites

4 minutes ago, dusukochadu said:

BJP has a strict sketch in place or else they wouldn't be so confident about CBN's failure in 2019. 

They have some kind of hidden strategy in place or else with the way BJP is perceived in the state, they can never imagine CBN's failure and a

 favorable situation for them in 2019.

 

The confidence which BJP has is simply called 'mega pothu gambiryam'. :)

Link to comment
Share on other sites

19 minutes ago, dusukochadu said:

BJP has a strict sketch in place or else they wouldn't be so confident about CBN's failure in 2019. 

They have some kind of hidden strategy in place or else with the way BJP is perceived in the state, they can never imagine CBN's failure and a

favorable situation for them in 2019.

 

ya,i too suspect something

Link to comment
Share on other sites

1 hour ago, Jaitra said:

ya,i too suspect something

Anni possible angles lo bhutaddam esukuni pulka strategies formulate seyyatam tappa em eekaleru le annai...janalanu eellu congress kanna ekkuva underestimate chestu adhikaara madham tho eltunnaru..vaalla place ento 2019 lo prajalu vaallaku baaga chupedataru..

Link to comment
Share on other sites

1 hour ago, dusukochadu said:

BJP has a strict sketch in place or else they wouldn't be so confident about CBN's failure in 2019. 

They have some kind of hidden strategy in place or else with the way BJP is perceived in the state, they can never imagine CBN's failure and a

favorable situation for them in 2019.

 

Just a mere intimidation tactics from BJP. They have nothing to lose in south or AP. If you consider ground as zero level, BJP is already 1000ft underground wrt south 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...