Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

koushik_k

బాబుకే నష్టం..బీజేపీకి కాదు!: అమిత్ షా

Recommended Posts

బాబుకే నష్టం..బీజేపీకి కాదు!: అమిత్ షా
14-06-2018 03:09:36
 
  • అభివృద్ధిలో రాజీ లేదు
  • కన్నాతో అమిత్‌ షా
న్యూఢిల్లీ, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ‘చంద్రబాబు రాజకీయంగా ఏమన్నా కూడా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడంలో రాజీపడే ప్రసక్తే లేదు. పెండింగ్‌ అంశాలు ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సూచించారు. ఎన్డీఏ నుంచి చంద్రబాబు ఎందుకు బయటికి వెళ్లారో ఆయనకే తెలియాలని, దానివల్ల ఆయనకే నష్టం కానీ బీజేపీకి కాదని అన్నట్లు సమాచారం. బుధవారం ఢిల్లీలో కన్నాతో పాటు పార్టీ నేతలు పురంధేశ్వరి, జీవీఎల్‌ నరసింహారావు, విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ తదితరులు అమిత్‌ షాతో సమావేశం అయ్యారు. భేటీ తర్వాత కన్నా విలేకరులతో మాట్లాడారు. 
 
విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి చేసినవి, చేయాల్సిన వాటిపై చర్చించామని తెలిపారు. సమయం చూసి కొందరు కావాలనే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లారని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో విషబీజాలు నాటారని విమర్శించారు. బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అమిత్‌ షాకు చెప్పానన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు నిజం గ్రహించిన రోజు టీడీపీ మట్టిగొట్టుకుపోతుందని మండిపడ్డారు. అమరావతి, నీరు ప్రగతి, ప్రాజెక్టులు, చివరకు మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. దమ్ముంటే వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అవినీతి జరిగిందని నిరూపించలేకపోతే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని కన్నా లక్ష్మీనారాయణ సవాల్‌ చేశారు.

Share this post


Link to post
Share on other sites

True 0 - 0 is again 0 but not the other way around.  

Share this post


Link to post
Share on other sites
3 minutes ago, phani2 said:

In AP context, these both are Jogi Jogi story

hahahahaha truely said.........

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×