Jump to content

మోత్కుపల్లి తిరుమల యాత్రకు వైసీపీ మద్దతు


koushik_k

Recommended Posts

హైదరాబాద్‌: టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులును వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. మోత్కుపల్లి తిరుమల యాత్రకు వైసీపీ మద్దతు తెలుపింది. ఈ నెల 11న కూడా మోత్కుపల్లి ఇంటికి విజయసాయిరెడ్డి వచ్చారు. అయితే మీడియాను చూసి మోత్కుపల్లిని కలవకుండానే ఆయన వెళ్లిపోయారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తిరుమల వెంకన్నను దర్శించుకుని చంద్రబాబును ఓడించమని కోరతానన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెబుతారని మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే చంద్రబాబును ఓడించాలని ఏపీ ప్రజలు పిలుపునిచ్చారు. చంద్రబాబుపై నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లిని నేడు విజయసాయి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
 
 
ఇటీవల మోత్కుపల్లి నర్సింహులును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కలిశారు. మోత్కుపల్లికి ముద్రగడ సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయాలపై మోత్కుపల్లితో ముద్రగడ మంతనాలు జరిపారు. ఆంధ్రాలో మా జాతిని అణగదొక్కడమే ధ్యేయంగా చంద్రబాబు పెట్టుకున్నారని, మనందరం ఏకమై ఆయనకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, రాష్ట్రానికి రావాలని ఆయన మోత్కుపల్లిని కోరారు. అంతేకాకుండా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మీడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు. టీడీపీ నుంచి మోత్కుపల్లిని బహిష్కరించిన తర్వాత ముద్రగడ, విజయ్‌సాయిలు కలవడం వెనుక భారీ వ్యూహం దాగి ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
Link to comment
Share on other sites

మోత్కుపల్లి, విజయసాయి భేటీపై నవ్వి ఊరుకున్న చంద్రబాబు
14-06-2018 19:02:37
 
636645997697839819.jpg
విజయవాడ: మోత్కుపల్లి నరసింహులు, ఎంపీ విజయసాయిరెడ్డి భేటీపై సీఎం చంద్రబాబు స్పందించారు. అయితే ఈ సమావేశ సమాచారాన్ని నిఘావర్గాలు చంద్రబాబుకు చేరవేశాయి. విషయం తెలుసుకున్న చంద్రబాబు నవ్వి ఊరుకున్నారు. గురువారం మోత్కుపల్లిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. మోత్కుపల్లి తిరుమల యాత్రకు వైసీపీ మద్దతు తెలిపింది. నాయకులను వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజమని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అనుభవం ఉన్న దళిత నేత మోత్కుపల్లిని సస్పెండ్ చేయడం దారుణమని, చంద్రబాబు దళిత వ్యతిరేక బుద్ధి బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును అధికారం నుంచి దింపాలని మోత్కుపల్లి చెప్పారని, విజయసాయిరెడ్డి తెలిపారు.
 
 
టీడీపీలో మోత్కుపల్లి ఓ వెలుగు వెలిగారు. టీటీడీపీలో సీనియర్ నేతగా ఉన్న సమయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. చంద్రబాబు కూడా మోత్కుపల్లి ధైర్యాన్ని కొనియాడిన సందర్బాలు లేక పోలేదు. ఏమైందో ఏమో కానీ ఆయన ఒక్కసారి చంద్రబాబును టార్గెట్ చేసుకుని తీవ్రమైన ఆరోపలు చేస్తున్నారు.
 
 
అయితే మోత్కుపల్లి ఇంటికి విజయసాయిరెడ్డి వెళ్లడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏపీలో యాత్ర చేస్తానని మోత్కుపల్లి ప్రకటించటం, ఈ యాత్రకు వైసీపీ మద్దతు ఇవ్వడాన్ని టీడీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. కొన్ని వర్గాలను రెచ్చగొట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని ఇందులో భాగంగానే మోత్కుపల్లి, విజయసాయి భేటీ జరిగిందని టీడీపీ చెబుతోంది. రాష్ట్రంలో యాత్రల ద్వారా కులపరమైన విబేధాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ కూడా వెనుక ఉండి ప్లాన్ చేస్తోందని టీడీపీ అనుమానిస్తోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...