Jump to content

ఆనం పార్టీ మారడం ఖాయం - జూలై 8న వైసీపీ తీర్థం..?


koushik_k

Recommended Posts

  • జూలై 8న వైసీపీ తీర్థం..?
  • విఫలమైన టీడీపీ బుజ్జగింపులు
  • తెగదెంపులకే రామనారాయణ నిర్ణయం
  • సన్నిహితులతో విస్తృత సమాలోచనలు
  • ఇన్నాళ్ల సస్పెన్స్‌కు తెర
  • ఆత్మకూరు/ వెంకటగిరి నుంచి పోటీ యోచన
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి త్వరలో టీడీపీని వీడనున్నట్లు సమాచారం. వైసీపీలో చేరేందుకు ఆయన దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. జూలై 8న వైఎస్‌ జయంతి సందర్భంగా ఆ పార్టీలో చేరతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభిమానులు, సన్నిహితులను కలుస్తున్నారు. వారితో చర్చలు జరిపి, పార్టీ మారడానికి కారణాలు వివరించి, వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
 
మంగళ, బుధవారం నాటి పరిణామాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. రామనారాయణను టీడీపీలో కొనసాగించేందుకు ఆ పార్టీ నేతలు జరిపిన బుజ్జగింపు యత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన పార్టీ మారితే తలెత్తే పరిణామాలను అంచనా వేస్తోంది. కాగా, రామనారాయణ ఆత్మకూరు లేదా వెంకటగిరి నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగుతారని అనుచరులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ మాజీ మంత్రివర్యులు నాలుగో సారి పార్టీ మారుతున్నారు. ఈ పరిణామం జిల్లాలో ఎలాంటి రాజకీయ సమీకరణలకు తెరతీస్తుందో చూడాలి.
 
నెల్లూరు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారే విషయమై సస్పెన్స్‌ వీడింది. ఆయన వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారయ్యింది. రెండు రోజులుగా ఆయన జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానులు, సన్నిహితులతో సమాలోచనలు జరిపారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం తన పరిస్థితిని వివరిస్తూ ఎందుకు పార్టీ మారాలో వారికి వివరిస్తూ మద్దతు కూడగట్టుకునే పని ప్రారంభించారు. టీడీపీ కూడా ఆనం పార్టీ మారితే ఎదురయ్యే పరిణామాలను సరిద్దుకునే ఏర్పాట్లు చేసుకుంటోంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజున ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.
 
 
కొన్ని నెలలకు ముందే నిర్ణయం
పార్టీ మారాలనే నిర్ణయాన్ని ఆనం రామనారాయణరెడ్డి కొన్ని నెలలకు ముందే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని బలపరిచేలా వరుస సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏడాదిన్నర క్రితం ఆనం సోదరులు టీడీపీలో చేరారు. ఆనం రామనారాయణ రెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. పార్టీలో చేరిన రోజు నుంచి ఆనం సోదరులు అసంతృప్తిగానే ఉన్నారు. పార్టీలో చేరే సందర్భంగా ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే అసంతృప్తి వీరిని వెంటాడింది. ఆనం రామ నారాయణరెడ్డి పలు సందర్భాల్లో ఆ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. ఇటీవల జరిగిన మినీ మహానాడు వేదికలపై నుంచి కూడా ఆయన బహిరంగంగా తెలుగు దేశం పార్టీని, ప్రభుత్వ విధానాలను విమర్శించా రు. దీంతో ఈయనకు తెలుగుదేశంలో కొన సాగే ఉద్దేశం లేదనే విషయం బలపడింది. మహానాడుకు, ఇటీవల ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ఆయన హాజరుకాకపోవ డంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డా యి. ఈ అనుమానాలను నిజం చేస్తూ ఆయ న పార్టీ మారే సందర్భంగా అనుచరులు, అంతరం గీకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
 
 
నియోజకవర్గాల వారీగా సమావేశాలు
రాజకీయంగా తాను తీసుకోబోయే నిర్ణయానికి అనుచరుల నుంచి మద్దతు సమీకరించుకునే పనిలో ఆనం రామరానారాయణ రెడ్డి బిజీగా ఉన్నారు. మంగళవారం సూళ్లూరు పేట నియోజకవర్గంలో పర్యటించి అనుచరులు, అభిమానులతో మాట్లాడారు. బుధవారం నెల్లూరులోని తన నివాసంలో ఆత్మకూరు నియోజకవర్గ అనుచరులతో సమాలోచనలు జరి పారు. ఇలా వరుసగా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో పర్యటించి ఆనం కుటుంబ అభిమానుల మద్దతు కూడ గట్టుకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 
జూలై 8న వైసీపీలోకి..?
జూలై 8వ తేదీ వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆనం రామరానా యణరెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 2వ తేదీ నెల్లూరులో జరిగిన నయ వంచన దీక్ష వేదికపైనే ఆనం రామనా రాయణరెడ్డి వైసీపీకి సంఘీభావం ప్రకటిం చాల్సి ఉండేదని, అయితే రోజులు బాగా లేదనే ఉద్దేశంతో ఆ చేరికను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అయితే టీడీపీని వీడటానికి, వైసీపీలో చేరడానికి మధ్య కీలక మైన ఘట్టానికి మాత్రం 2వ తేదీ ఉదయమే జరిగిందని సమాచారం. వంచన దీక్షకు హాజ రైన బొత్స సత్యనారాయణ, సజ్జల రామ కృష్ణారెడ్డిలు రైలు దిగిన వెంటనే నేరుగా ఆనం రామనారాయణరెడ్డి నివాసానికి వెళ్లా రు. అక్కడే అల్పాహారం స్వీకరించి వంచన దీక్ష వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలోనే వైసీపీలో చేరడానికి సంబంధిం చిన కీలక నిర్ణయం జరిగినట్లు సమాచారం.
 
 
వైసీపీలో ఆనం చోటెక్కడ..!?
వైసీపీలో చేరనున్న ఆనం రామనారా యణరెడ్డి రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే అంశంపై పలు రకాల ప్రచారం జరగుతోంది. ఈయన 2009, 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం వైసీపీ నుంచి మేకపాటి గౌతంరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. పార్టీ అధినేత జగన్‌ సూచనల మేరకు గౌతంరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గాన్ని త్యాగం చేస్తారని, రాబోయే ఎన్నికల్లో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థిగా అక్కడి నుంచి పోటీ చేయనున్నా రనే ప్రచారం జరుగుతోంది. వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా ఉంది. పూర్వ రాపూరు నియోజకవర్గం లోని పలు మండ లాలు ప్రస్తుతం వెంకటగిరిలో ఉన్నాయి. పూర్వ రాపూరు నియోజకవర్గం నుంచి రామనారాయణరెడ్డి మూడు సార్లు పోటీ చేశారు. విస్తృత పరిచయాలు కలిగిన నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని ఆనంకు కేటాయిస్తారని మరో ప్రచారం ఉంది. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఆనం కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేసే అవకా శాలు లేకపోలేదనే ప్రచారాలు ఉన్నాయి.
 
 
పార్టీ మారడం నాలుగోసారి..
ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారడం అంటూ జరిగితే అది నాల్గవ సారి అవుతుంది. ఈయన ఇప్పటికి మూడు సార్లు పార్టీలు మారారు. 1983 నుంచి 1989 వరకు టీడీపీలో ఉన్నారు. నెల్లూరు, రాపూరు నియోజకవర్గాల నుంచి మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. 1988లో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 1994లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటి నుంచి 2017 వరకు ఆ పార్టీలో కొన సాగారు. రాపూరు, ఆత్మకూరు నియోజక వర్గాల నుంచి ఐదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచారు. కాంగ్రెస్‌ హయాంలో పదేళ్లపాటు వరుసగా మంత్రిగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో మౌనంగా ఉండి 2017లో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏడాదిన్నర కాలం వ్యవధిలో మళ్లీ పార్టీ మారబోతున్నారు. ఇది జరిగితే ఆనం రామనారాయణరెడ్డి నాలుగోసారి పార్టీ మారినట్లు అవుతుంది.
 
 
ఫలించని బుజ్జగింపులు
ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తిని గమనించిన టీడీపీ అధిష్ఠానం ఆయన్ను బుజ్జగించడానికి పలు విధాలా ప్రయత్నించి విఫలమయ్యింది. ఈ విషయంలో సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే ఆనం సోదరులతో ప్రత్యేకంగా చర్చించారు. పార్టీలో సముచిత స్థానంతోపాటు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని, కొద్ది కాలం ఆగమని చంద్రబాబు ఆనం రామనారాయణ రెడ్డికి నచ్చజెప్పారు. ఆ కుటుంబాన్ని వదులుకోవడం ఇష్టం లేక అవకాశం ఉన్న ప్రతిసారి ఆ కుటుంబ సభ్యులను నేరుగా కలవడానికి ప్రయత్నించారు.
 
తీవ్ర ఆనారోగ్యానికి గురై మంచం పట్టిన ఆనం వివేకానందరెడ్డిని చంద్రబాబు, నారా లోకేష్‌లు ఇద్దరు వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆయన అంతిమయాత్రకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. సుమారు 45 నిమిషాల సేపు కుటుంబ సభ్యులతో ఏకాంతంగా చర్చించారు. అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితం మంత్రి నారాయణ ఆనం రామనారా యణరెడ్డి నివాసానికి వెళ్లి ఏకాంతంగా చాలా సేపు చర్చలు జరిపారు. పార్టీ బుజ్జగింపులతో సర్దుకున్నట్లు కనిపించిన రామనారాయణరెడ్డి నిశ్శబ్దంగా తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకున్నారు.
 
 
 
Link to comment
Share on other sites

టీడీపీ మోసం చేసిందని చెప్పలేదు కానీ తమను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని తాము ఎప్పుడూ చెప్పలేదని ఆనం రామనారాయణ అన్నారు. తమ సోదరుడు ఆనం వివేకానంద కూడా ఎప్పుడూ అలా చెప్పలేదన్నారు. అయితే సరైన గుర్తింపు ఇవ్వలేదనే భావన మాత్రం తమలో ఉందని తేల్చి చెప్పారు.

 

Link to comment
Share on other sites

రాజకీయాల్లో ఉన్నప్పుడు పోటీ చేయాలి వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని ఆనం రామనారాయణ స్పష్టం చేశారు. అధికార పార్టీయా, ప్రతిపక్ష పార్టీయా అన్నది ముఖ్యం కాదని, రాజకీయాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా పోటీ చేయాలన్నారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...