Jump to content

Kadapa steel plant


Recommended Posts

కావలసినంత భూమి ఇస్తాం...
28-06-2018 04:11:21
 
636657558820930576.jpg
  • ఇనుప గనులు కేటాయిస్తాం
  •  ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్షలు, ఆందోళనలు
  • తక్షణమే ప్రకటన చేయాలి.. కేంద్ర ఉక్కు మంత్రికి చంద్రబాబు లేఖ
అమరావతి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘కడప ఉక్కు కర్మాగారం కోసం కావలసిన భూమి ఇస్తాం. అవసరమైనన్ని ఇనుప ఖనిజం గనులు కేటాయిస్తాం. ఈ ఫ్యాక్టరీ కోసం మా ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఒక్క కడప జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రం.. ఉక్కు కర్మాగారం సాధనం కోసం ఉద్యుక్తమవుతోంది. అందుచేత ఉక్కు కర్మాగారం స్థాపిస్తామని తక్షణం ప్రకటన చేయండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్‌కు బుధవారం లేఖ రాశారు. ‘తెలుగుదేశం ఎంపీలు కడప ఉక్కుపై తాజాగా మిమ్మల్ని కలిసినప్పుడు.. కర్మాగారానికి భూమి, గనులు అందుబాటులో ఉన్నాయా అని మీరు అడిగినట్లు తెలిసింది. కడప జిల్లా ఎం.కంబాలదిన్నెలో దీని ఏర్పాటుకు అనువైన భూమిని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా గుర్తించింది. ఆ భూమి వివరాలు, టోపోగ్రా్‌ఫను ఉక్కు కర్మాగారం స్థాపన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్న మెకాన్‌ సంస్థకు అందించాం.
 
2018 జనవరిలో మెకాన్‌ ప్రతినిధులు ఆ భూమిని సందర్శించారు. అది ఉక్కు ఫ్యాక్టరీకి అనువైందని అంగీకరించారు. ఆ భూమిని మీరెప్పుడు అడిగితే అప్పుడు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంత భూమి కావాలంటే అంత కేటాయిస్తాం. ఇనుప గనుల గురించి కూడా మీరు అడిగినట్లు తెలిసింది. 30 ఏళ్లకు సరిపడా ఈ కర్మాగారానికి అవసరమైన గనులు ఉన్నాయని పదే పదే చెబుతున్నాం. అనంతపురం జిల్లాలోని ఎనిమిది గనుల లీజుల్లో మూడు లీజులు 2020కి పూర్తవుతాయి. ఆ మూడింటినీ కడప ఉక్కుకే కేటాయిస్తాం. ఈ మూడు గనుల్లో కలిపి 86 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజం ఉందని అంచనా వేశారు. కానీ వాటిలో 220 మీటర్ల లోతు వరకు ఇనుప ఖనిజం ఉందని తేలింది. తద్వారా మరో 186 మిలియన్‌ టన్నుల ఖనిజం లభిస్తుంది’ అని పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం ఢిల్లీలో ఎంపీలు, కడపలో ఉక్కు దీక్ష చేస్తున్న నేతలతో బుధవారం సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్రం నాలుగేళ్లు కావాలని తాత్సారం చేసి కడప ఉక్కు పరిశ్రమను నిలిపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
‘నీళ్లు ఇస్తామన్నాం. గనులు కేటాయించాం.. జాతీయ హైవే ఉంది.. రైల్వే లైను ఏర్పాటుకు ముందుకొచ్చాం.. కృష్ణపట్నం పోర్టును కూడా వినియోగించుకోవచ్చు.. ఇన్ని చూపిస్తుంటే ఇంకా కేంద్రానికి ఏం కావాలి? ’ అని మండిపడ్డారు. కాగా.. కడప ఉక్కు ఏపీ ప్రజల హక్కు అని, దీనిపై వైసీపీ, బీజేపీ తుక్కు రాజకీయాలు చేస్తున్నాయని శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ విమర్శించారు. టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కు మంత్రిని కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరితే.. మరింత స్పష్టత కావాలనడం కేంద్ర నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తుందన్నారు.
Link to comment
Share on other sites

కేంద్రం కాకపోతే ప్రైవేటుకైనా సై!
30-06-2018 03:03:30
 
  •  కడప ఉక్కుపై రాష్ట్రం యోచన
  •  అంతర్జాతీయ శ్రేణి సంస్థలకు చాన్స్‌
  •  పూర్తి రాయితీలు ఇచ్చే అవకాశం
  •  కడప ఉక్కు, ఉద్యోగాల కల్పనే లక్ష్యం
  •  అవే సంకేతాలు పంపిన కేంద్రం!?
  •  ‘క్యాప్టివ్‌’లో గనులు ఇచ్చేందుకు సిద్ధం!?
అమరావతి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘కడప ఉక్కు’పై కేంద్రం వరుస కొర్రీలు, ఏదీ తేల్చకుండా నాన్చుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) కడపలో స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయకపోతే.... ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించాలనే యోచనలో ఉంది. ఇందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలకు అవకాశమిచ్చే దిశగా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రూ.20వేల కోట్ల దాకా పెట్టుబడి అవసరం. దాదాపు 1800 ఎకరాల భూమి కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో 2000 ఎకరాలున్నాయి. వీటిని ఎకరా రూ.4 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రపంచ శ్రేణి ఉక్కు పారిశ్రామిక సంస్థలేవైనా ముందుకొస్తే ఎకరా రూ.2 లక్షలకైనా ఇచ్చేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే... విద్యుత్తు, నీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిని కూడా ఇచ్చేందుకు సన్నద్ధంగా ఉంది. సమీపంలోనే రైలు మార్గం ఉంది. ఇన్ని వనరులున్నప్పటికీ నాలుగేళ్లుగా కేంద్రం కడపలో స్టీల్‌ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు కొర్రీల మీద కొర్రీలు, ప్రశ్నల మీద ప్రశ్నలతో కాలం వెల్లదీస్తోంది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే రాష్ట్రం తన వాటాగా కనీసం రూ.5000 కోట్లు పెట్టుబడి పెట్టాలంటూ 2015లో మెలిక పెట్టింది. తమకు ఆ స్థోమతతో లేదని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే కేంద్రానికి స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉక్కు పరిశ్రమ స్థాపిస్తే.. రాయితీతో 2000 ఎకరాలిస్తాస్తామని, మౌలికవసతులు కల్పిస్తామని తెలిపింది.
Link to comment
Share on other sites

కేంద్రం కాదంటే మేమే పెడతాం
కడప ఉక్కుపై ముఖ్యమంత్రి స్పష్టీకరణ
మోదీ ముందు మూడు మార్గాలు
కేంద్ర సర్కారుకు రెణ్నెల్ల గడువు
ఎంపీ రమేష్‌తో దీక్ష విరమింపజేసిన సీఎం
ఉక్కు పరిశ్రమ రాకుండా గాలి, జగన్‌ కలిసి  నాటకాలాడుతున్నారని ఆగ్రహం
ఉత్తరాంధ్ర ఉద్యమం తెస్తానని  పవన్‌ చెప్పడం సరికాదని వ్యాఖ్య
ఈనాడు - కడప
30ap-main5a.jpg

కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రాకపోతే తామే నెలకొల్పి రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశంపై ఓ కమిటీ వేస్తామని.. పోరాటాన్ని కొనసాగిస్తూ పార్లమెంటులో నిలదీస్తామన్నారు. ‘కడప ఉక్కు మా హక్కు.. తప్పించుకోవాలనుకుంటే వీల్లేదు.. పెద్దన్నపాత్ర పోషించాల్సిన కేంద్రం.. అన్యాయం జరిగినప్పుడు అక్కున చేర్చుకోవాల్సిన కేంద్రం.. మోసగిస్తానంటే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు. కడప కన్నా అనుకూలమైన ప్రాంతం ఏది ఉందో సమాధానం చెప్పాలని కేంద్రానికి సవాలు విసిరారు. ‘‘ఐదుకోట్ల మంది ఆంధ్రుల తరఫున కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నా.. మీ ముందు మూడు మార్గాలున్నాయి.. ఒకటి మీరు కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు ముందుకు రండి మేం పూర్తిగా సహకరిస్తాం.. లేనిపక్షంలో రెండోమార్గంగా 50శాతం కేంద్రం, 50శాతం రాష్ట్ర భాగస్వామ్యంతో పరిశ్రమ ఏర్పాటు చేద్దాం. అదీకాదంటే మూడోమార్గంగా మేమే ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు ముందుకొస్తాం.. అందుకు వీలుగా ఎంఎండీఆర్‌(మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) నిబంధనలను సవరించాలి.. ఏదైనా రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. కడపలో 11 రోజులుగా ఆమరణదీక్ష చేస్తోన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను ఆయన శనివారం పరామర్శించారు. తన ప్రసంగం పూర్తి చేసిన అనంతరం ఆయనకు నిమ్మరసం ఇచ్చి ఆమరణదీక్ష విరమింపజేశారు. మున్ముందు మనసులో సంకల్పాన్ని ఉంచుకుని రాజీలేని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కడప ఉక్కు పరిశ్రమపై మెకాన్‌ సంస్థను అధ్యయనానికి వేశాక ప్రాథమిక నివేదికలో ఫీజుబులిటీ(ఆర్థికంగా అనుకూలత) ఉందని పేర్కొన్నా కేంద్రం లెక్కపెట్టకుండా పనిచేస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా వైకాపా నాయకుడు జగన్‌ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. అంతటితో ఆగకుండా ఆ పార్టీ నాయకులు దీక్షలను తప్పుబడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

* ఉక్కు పరిశ్రమ కడపకు వస్తుంది. సాధించి తీరుతా. నేను ఒకసారి సంకల్పిస్తే నా జీవితంలో వదిలి పెట్టను.
* మీరు (కేంద్రం) అవినీతి వైకాపాను చంకనబెట్టుకుని తిరగండి. నాకు అభ్యంతరం లేదు.. కానీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఖబడ్దార్‌!
* కడపలో ఉక్కు పరిశ్రమపై కేంద్రం పూటకోమాట చెబుతోంది. నీతి ఆయోగ్‌ దేశవ్యాప్తంగా ముందడుగు వేస్తున్న 108 వెనుకబడిన జిల్లాలను గుర్తించగా అందులో కడప ప్రస్తుతం 5వస్థానంలో నిలిచింది. ఇలాంటి స్థితిలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఏంటి అభ్యంతరం?

తిరుమల వేంకటేశ్వరుడితోనూ కేంద్రం ఆటలు!
ఆఖరుకు తిరుమల వేంకటేశ్వరస్వామితోనూ కేంద్రం ఆటలాడుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘‘పురావస్తుశాఖ ద్వారా నోటీసు పంపి పెత్తనం చేసేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు ఓ పూజారితో స్వామి ఆభరణాలపై విమర్శలు చేయిస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారానికి వందిమాగధులను ఏర్పాటు చేసుకున్నారు. వేంకటేశ్వరస్వామి ఆభరణాలపై ఓ జడ్జిని నియమించి రెండేళ్లకోమారు మదింపు చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నా’’ అన్నారు. ‘‘అన్నదమ్ములుగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి కలసి కడప ఉక్కు పరిశ్రమపై నాటకాలు అడుతున్నారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమ పెడితే గాలికి నష్టం వస్తుందనే ఉద్దేశంతో రాకుండా చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఆయన క్రియాశీలంగా వ్యవహరించడాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే కుట్ర జరిగింది. బ్రహ్మిణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తప్పుడు లెక్కలతో ఖనిజం, భూములు ఇచ్చారు. ఆ భూములు బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొంది.. ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆఖరుకు పదాలను మార్చేసి అధికారులనూ కేసుల్లో ఇరికించిన పరిస్థితి ఉంది. అలాగే ఉత్తరాంధ్ర ఉద్యమం తెస్తానని పవన్‌ చెబుతుండటం సరికాదు. విశాఖను నేనే అభివృద్ధి చేశా. మరోపక్క కేంద్రం రాష్ట్రం పట్ల అహంభావాన్ని ప్రదర్శిస్తోంది’’ అన్నారు.

30ap-main5b.jpg

మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ జగన్‌ పాదయాత్ర దిల్లీలో చేయాలని.. దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రాన్ని నిలదీయాలన్నారు. రాజీనామాల పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కడప ఉక్కుపై జగన్‌ ఎందుకు ట్వీట్లు పెట్టడం లేదన్న లోకేష్‌.. వైకాపా స్క్రిప్టు, స్క్రీన్‌ప్లే అంతా అమిత్‌షా నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి, విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి, రామసుబ్బారెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

2 నెలలు డెడ్‌లైన్‌!
01-07-2018 01:29:40
 
636660053817779671.jpg
  • కడప ఉక్కుపై తేల్చి చెప్పండి
  • పెడతారా... పెట్టుకోమంటారా?
  • రాష్ట్రమే ఏర్పాటు చేసేందుకూ రెడీ: చంద్రబాబు
కడప, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): ‘కడప ఉక్కు’పై కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు 2 నెలలు డెడ్‌లైన్‌ విధించా రు. ‘మీరు పెడతారా.. మమ్మల్నే పెట్టుకోమంటారా’ తేల్చిచెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏదిఏమైనా కడప ఉక్కు సాధించి తీరుతామన్నారు. కడప ఉక్కు కోసం 11 రోజులుగా దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోగ్యం విషమిస్తుండటం, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో... చంద్రబాబు శనివారం ఆయనచేత దీక్ష విరమింప చేశారు. ‘‘రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన సీఎం రమేశ్‌ ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. మన కోసం పోరాడుతున్న వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని తెలిపారు. ‘కడప ఉక్కు.. మన హక్కు’ అని నినదించారు. ఈ విషయంలో కేంద్రం కావాలనే జాప్యం చేస్తోందని విమర్శించారు. ‘‘ఒక సంకల్పం చేసి గట్టిగా పట్టుబట్టానంటే వదిలే ప్రసక్తే లేదు. కడప ఉక్కు వస్తుంది. తెచ్చే బాధ్యత నాదే! ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రానికి రెండు నెలలు గడువు ఇస్తున్నాం. ఆ లోగా కేంద్రం పెడితే సరే, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతుంది’’ అని ప్రకటించారు.
 
 
మూడు మార్గాలున్నాయి...
కడప ఉక్కు సాధించుకునేందుకు మూడుమార్గాలున్నాయని చంద్రబాబు తెలిపారు. ‘‘ఒకటి... కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవడం. రెండు... కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం వాటాగా పెట్టుబడి పెట్టి ప్లాంటు ఏర్పాటు చేయడం. మూడు... ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పడం!’’ అని చంద్రబాబు తెలిపారు. ఇవేవీ కాదంటే... సొంతంగానైనా పరిశ్రమ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
 
 
ఆందోళన వద్దు...
ఉక్కు పరిశ్రమ కోసం రాయలసీమ కమ్యునిస్టు పార్టీ (ఆర్‌సీపీ) చేస్తున్న రిలే దీక్షలు కూడా విరమించాలని చంద్రబాబు కోరారు. ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితిలో నెలకొల్పుతామని, ఎవరూ అధైర్యపడవద్దని కోరారు. ‘‘సీఎం రమేశ్‌, బీటెక్‌ రవిల దీక్ష దేశం మొత్తం ఆకర్షించింది. వీరి పోరాట ఫలితం కడపలో చారిత్రాత్మక నిర్ణయంగా మారుతుంది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే రాయలసీమను రతనాల సీమగా మారుతుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
 
 
తెరపైకి గాలి జనార్దన్‌రెడ్డి
వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో గాలి జనార్దన్‌రెడ్డి చేత బ్రహ్మణి స్టీల్‌ నెలకొల్పేలా నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ‘‘ఆ రోజు పరిశ్రమ ఏర్పాటు సాధ్యమేనని నాటి కేంద్రం అనుమతి ఇచ్చింది. వైఎస్‌, గాలి పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరైనా కలిసిపోయారు. లాలూచీ పడి 2600 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఐరన్‌ఓర్‌ను విదేశాలకు తరలించి కోట్లు గడించారు. ప్రభుత్వ భూమిపై బ్యాంకు లోన్లు పొంది కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ దోపిడీ విలువ రూ.10,500 కోట్లు’’ అని చంద్రబాబు వివరించారు. ‘జగన్‌ నా తమ్ముడు’ అని గాలి జనార్దన రెడ్డి ఎన్నోసార్లు చెప్పారని... వారిచేత నాటకాలు ఆడించింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...