Jump to content

Kadapa steel plant


Recommended Posts

19 minutes ago, sagarkurapati said:

Bjp blaming state employees fir not giving feasibility reports to central. Oka padhathi prakaram state govt ni blame chesthunnaru

state emi chesindi free ga land isthamu ante, feasibility study chesindi valle ga, vizag steel ki eroju ki kuda ganulu levu kadapa ki a ibbande ledu.

Link to comment
Share on other sites

21 minutes ago, seenu454 said:

Admin ee thread lo kuda post eyyi okasari 

Leni ponivi seppi modi brain karaab sesaru, so egos flared up, unfortunately majority of AP BJP leaders are ysrcp paid agents. Also the 2nd rung batch around Modi not big fans of CBN, vellani kadhani Modi went with CBN for 2014 listening to Venky dude. But they striked back slowly and got everything under control. CBN side mistake enti ante he should have bought them and made them silent and should have got them more involved, anyway messed up situation right now. Only political compulsion in 2019 can bring them together, otherwise gone case.

Link to comment
Share on other sites

2 hours ago, Sree Ram said:

Leni ponivi seppi modi brain karaab sesaru, so egos flared up, unfortunately majority of AP BJP leaders are ysrcp paid agents. Also the 2nd rung batch around Modi not big fans of CBN, vellani kadhani Modi went with CBN for 2014 listening to Venky dude. But they striked back slowly and got everything under control. CBN side mistake enti ante he should have bought them and made them silent and should have got them more involved, anyway messed up situation right now. Only political compulsion in 2019 can bring them together, otherwise gone case.

Idi ekkado chadivane ?

Link to comment
Share on other sites

2 hours ago, Sree Ram said:

Leni ponivi seppi modi brain karaab sesaru, so egos flared up, unfortunately majority of AP BJP leaders are ysrcp paid agents. Also the 2nd rung batch around Modi not big fans of CBN, vellani kadhani Modi went with CBN for 2014 listening to Venky dude. But they striked back slowly and got everything under control. CBN side mistake enti ante he should have bought them and made them silent and should have got them more involved, anyway messed up situation right now. Only political compulsion in 2019 can bring them together, otherwise gone case.

ROFL

Link to comment
Share on other sites

46 minutes ago, subash.c said:

Idi ekkado chadivane ?

Exact ga aithe ikkada chadivav :D 

 

19 hours ago, Kiran said:

Leni ponivi seppi modi brain karaab sesaru, so egos flared up, unfortunately majority of AP BJP leaders are ysrcp paid agents. Also the 2nd rung batch around Modi not big fans of CBN, vellani kadhani Modi went with CBN for 2014 listening to Venky dude. But they striked back slowly and got everything under control. CBN side mistake enti ante he should have bought them and made them silent and should have got them more involved, anyway messed up situation right now. Only political compulsion in 2019 can bring them together, otherwise gone case.

 

But song edi ayina annai tune elanu ade kada ani .. ayanakenduku antha kastam ani nene copy paste chesa ?

Link to comment
Share on other sites

ఉక్కు... తుక్కులోకే!
14-06-2018 03:15:14
 
636645429264096555.jpg
  • కేంద్రం దాగుడుమూతలు
  • సుప్రీంకోర్టుకు అరకొర సమాచారం
  • ‘సాధ్యంకాదు’ అంటూ అఫిడవిట్‌
  • సెయిల్‌ ఇచ్చిన నివేదికే పరిగణనలోకి
  • మెకాన్‌ సానుకూల అభిప్రాయానికి మసి
  • టాస్క్‌ఫోర్స్‌ తీరునూ వెల్లడించని ఉక్కుశాఖ
  • ఈ ఏడాది సీమలో మెకాన్‌ పర్యటన
  • ఖనిజం అందుబాటుపై సానుకూలత
  • ఫ్యాక్టరీ పెట్టవచ్చునని ప్రాథమిక నివేదిక
  • ఇవేవీ సుప్రీంకు చెప్పని కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ/అమరావతి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): విభజన హామీల్లో ఒకటైన ‘కడప ఉక్కు’ను తుక్కులో కలపడమే తమ ఉద్దేశమని కేంద్రం చెప్పకనే చెప్పింది! అసలు విషయాన్ని దాచేసి... ఆరునెలల కిందటి అరకొర సమాచారాన్ని సుప్రీంకోర్టుకు అందించింది. పేరు గొప్పకు నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఆరునెలలుగా సమావేశం కాకున్నా పట్టించుకోని కేంద్రం... అంతకుముందు ఎప్పుడో ‘కడప ఉక్కు సాధ్యం కాదు’ అని ‘సెయిల్‌’ ప్రాథమిక నివేదికలో పేర్కొన్న అంశాన్నే సుప్రీంకోర్టుకు నివేదించింది. దీనిపై బుధవారం ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. విభజన హామీల్లో పేర్కొన్న ఏపీలో కడప ఉక్కు, తెలంగాణలో బయ్యారం స్టీల్స్‌ తదిర అంశాలపై కాంగ్రెస్‌ నాయకుడు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చిన నోటీసు మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ స్పందించింది. దరఖాస్తుదారు న్యాయస్థానానికి అసత్యాలు వెల్లడించారని పేర్కొంది.
 
 
కానీ... తాను మాత్రం అర్ధసత్యాలే చెప్పింది. ఈ ఫ్యాక్టరీల ఏర్పాటుపై తాజాగా టాస్క్‌ఫోర్స్‌ ఏ నిర్ణయం తీసుకున్నదనే విషయం వెల్లడించకుండా గత ఏడాది డిసెంబరు వరకు ఉన్న సమాచారాన్ని మాత్రమే అఫిడవిట్‌లో వివరించింది. రెండు రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించడానికి మెకాన్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సమాచారాన్ని అందజేయాలని గత ఏడాది డిసెంబరు 27న జరిగిన టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపింది.
 
 
మెకాన్‌తో జరిగే చర్చల్లోనే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు ఫ్యాక్టరీల నిర్మాణంపై వాస్తవ అంచనాలకు రావాల్సి ఉందని తేల్చేసింది. ‘కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాలపై 2014 డిసెంబరు 2న కేంద్ర ప్రభుత్వానికి స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఒక నివేదిక సమర్పించింది. అక్కడ 3 ఎంటీపీఏ సమీకృత ఉక్కు ఫ్యాక్టరీలను నెలకొల్పడం ఆర్థికంగా సాధ్యం కాదని ప్రాథమికంగా తెలిపింది. అయితే, ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌, జాతీయ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ, మెకాన్‌ లిమిటెడ్‌, ఎంఎస్ టీసీ ప్రతినిధులు కలిసి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రెండు రాష్ట్రాల్లో ఆసక్తిగల ఏ సంస్థ ద్వారా అయినా ఉక్కు కర్మాగారాలను నెలకొల్పేందుకు రోడ్‌ మ్యాప్‌ తయారు చేసేందుకు మరో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం. గతేడాది డిసెంబరులో జరిగిన సమావేశంలో మెకాన్‌ సంస్థ సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించేందుకు తగిన సమాచారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాం’ అని తెలిపింది. అయితే, ఈ ఆరు నెలల కాలంలో జరిగిన పురోగతిని మాత్రం కేంద్రం సుప్రీం కోర్టుకు వివరించలేదు.
 
 
మెకాన్‌ చెప్పిందిదీ...
ఈ ఏడాది జనవరి తర్వాత రాయలసీమ జిల్లాల్లో మెకాన్‌ సంస్థ పత్రినిధులు విస్తృతంగా పర్యటించారు. అనంతపురం జిల్లాలో అపారంగా ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయని... మరీ ముఖ్యంగా ఓబుళాపురంలో మంచి నాణ్యమైన ఖనిజం లభిస్తోందని స్పష్టంచేశారు. కడప, కర్నూలు జిల్లాల్లోనూ ఇనుప ఖనిజం నిక్షేపాలున్నాయని గుర్తించారు. కాబట్టి కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయవచ్చునని తమ ప్రాథమిక నివేదికలో స్పష్టంగా మెకాన్‌ తెలిపింది. ఇదీ అసలు విషయం. దీనిపై చర్చించేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఈ వివరాలేవీ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఉక్కుశాఖ చెప్పకపోవడం గమనార్హం.
 
కడపలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ ముందుకు వస్తున్నప్పటికీ... కేంద్రం మాత్రం స్టీల్‌ ప్లాంట్లు నష్టాల్లో ఉన్నాయని చెబుతోంది. దాదాపు ఆరునెలల తర్వాత మంగళవారం ఢిల్లీలో టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరిగింది. దీంతో కడప స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం సానుకూల ప్రకటన చేస్తుందేమోనని రాష్ట్ర అధికారులు ఆశించారు. అయితే... కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధికారి... తన పదవీ బాధ్యతల సమాచారం తెలిపేందుకే టాస్క్‌ ఫోర్సు భేటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
 
 
పన్ను రాయితీలు ఇచ్చేశాం: కేంద్ర ఆర్థిక శాఖ
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు పన్నుల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. 2016లో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రతులను కోర్టుకు సమర్పించింది. కొన్ని ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీల మాదిగానే రెండు తెలుగు రాష్ట్రా ల్లో పారిశ్రామికరణ, ఆర్థిక ప్రగతి సాధించేందుకు చర్యలను ప్రకటించినట్లు తెలిపింది.
 
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 32ను సవరించి కొన్ని కొత్త యంత్రాలు, పరిశ్రమలకు అత్యధిక రేట్లలో తరుగుదల వర్తింపజేసినట్లు పేర్కొంది. 2015 ఏప్రిల్‌ ఒకటి నుంచి 2020 మార్చి 31 మధ్య కాలంలో ఏర్పాటు చేసే సంస్థలకు, యంత్రాలకు ఈ ప్రోత్సాహకం లభిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, రెండు రాష్ట్రాల్లో నోటిఫై చేసిన వెనుకబడిన జిల్లాలో ఈ మధ్యకాలంలో పారిశ్రామిక సంస్థలను నెలకొల్పేందుకు అవసరమైన ప్లాంట్‌, యంత్రాల వ్యయంలో 15 శాతం మేరకు అదనపు పెట్టుబడి అలవెన్సును అందజేసేందుకు వీలుగా చట్టంలో కొత్తగా 32 (ఏడీ) సెక్షన్‌ను చేర్చినట్లు ఆర్థిక శాఖ సుప్రీం కోర్టుకు తెలిపింది.
Link to comment
Share on other sites

కడప ఉక్కు సాధ్యం కాదు 
బయ్యారంలోనూ కర్మాగారం ఏర్పాటు కుదరదు 
  ఆ విషయం ఎప్పుడో చెప్పాం 
  సాధ్యాసాధ్యాలు పరిశీలించాలనే చట్టంలో ఉంది 
  వెనకబడిన జిల్లాకు పన్ను మినహాయింపులు చేర్చాం 
  సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌ 
13ap-main3a.jpg

ఈనాడు, దిల్లీ: తెలుగురాష్ట్రాల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. కడప, ఖమ్మం జిల్లాల్లో ఉక్కు కర్మాగారాలు సాధ్యం కాదని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని హామీల అమలు జాప్యం అవుతోందని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు కేంద్ర ఉక్కు, ఆదాయపన్ను శాఖలు ఇటీవల కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని షెడ్యూలు 13లో ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పరిశీలించాలని ఉందని పేర్కొంది. అపాయింటెడ్‌ డేట్‌ 2.6.2014 నుంచి 6 నెలలులోగా నివేదిక ఇవ్వాల్సి ఉందని తెలిపింది. 2.12.2014న సెయిల్‌ ఇచ్చిన నివేదికలో ఆయా ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటు ఆర్థికంగా సాధ్యం కాదని వెల్లడించింది. అనంతరం 19.10.2016లో కేంద్ర    రాష్ట్ర ప్రతినిధులు, సెయిల్‌, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, మెకాన్‌ లిమిటెడ్‌ కలిసి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశారని, సాధ్యాసాధ్యాలపై మరోసారి పరిశీలించి ఆయా రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు రోడ్‌ మ్యాప్‌ రూపొందించాలని సూచించామని వివరించింది. 27.12.2017న చివరి సమావేశం నిర్వహించగా మెకాన్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యాసాధ్యాలపై సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని సూచించాం. ఇంతకుమించి అదనంగా కోర్టుకు అందించడానికి ఎలాంటి సమాచారం లేదని ఉక్కుశాఖ స్పష్టం చేసింది.

పన్ను మినహాయింపులు 35 శాతానికి పెంచాం 
ఆదాయ పన్ను చట్టం, 1961 (43 ఆఫ్‌ 1961)లోని సెక్షన్‌ 32 సవరించి సెక్షన్‌ 32 డీ చేర్చామని అఫిడవిట్‌లో పేర్కొంది. దీంట్లో  తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలు... ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు పన్ను మినహాయింపులు చేర్చామని వివరించింది. ఏప్రిల్‌ 1, 2015 నుంచి మార్చి 31, 2020 వరకు ఆయా రాష్ట్రాల్లో గుర్తించిన వెనకబడిన జిల్లాల్లో పన్ను మినహాయింపు 20 నుంచి 35 శాతానికి పెంచామని తెలిపింది. అదనపు పెట్టుబడి భత్యం 15శాతం ప్రకటించామని ఆదాయపన్ను శాఖ పేర్కొంది.

Link to comment
Share on other sites

ఆశలు సమాధులైతే! 
కడప ఉక్కుపై కేంద్రం నీళ్లు చల్లడంతో సర్వత్రా అసంతృప్తి

ఈనాడు, అమరావతి, కడప: కడప జిల్లా హక్కుగా పేరొందిన ఉక్కు పరిశ్రమపై ఆశలు ఆవిరయ్యాయి. కేంద్రం నిర్ణయంపై అన్ని వర్గాల ప్రజల నుంచీ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విభజన చట్టంలో పేర్కొన్న హామీని అమలు చేస్తామని ఏళ్ల తరబడి కాలయాపన చేసి, ఎట్టకేలకు దానిని పాడెక్కించారంటూ కడప జిల్లా వాసులు మండిపడుతున్నారు. ఒకానొక దశలో ఉక్కు పరిశ్రమ సాధిస్తున్నామంటూ తెదేపా చెప్పగా.. చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పొత్తు కొండెక్కడం సమస్యగా మారింది. ఈ విషయమై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. కమిటీలతో కాలయాపన చేసి చివరకు కేంద్రం కడపకు మొండిచెయ్యి చూపిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం నిర్ణయం దగా చేయడమేనని, తెదేపా దీనిపై పోరాటానికి దిగుతుందని స్పష్టం చేశారు.

తొలుత కాదన్నారు! 
ఏడాదికి 3 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అనుకూలం (వయబుల్‌) కాదని పేర్కొంటూ సెయిల్‌ 2015 జూన్‌ 17న కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు సాధ్యాసాధ్యాల నివేదిక ఇచ్చింది. దీన్ని పునఃపరిశీలించేందుకు.. 2015 ఆగస్టు 4న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యదళ బృందాన్ని పునఃనియమించింది. మార్కెట్‌ పరిణామాలు ఎంత మాత్రమూ అనుకూలంగా లేవని, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు నిర్ణయం ఏ కోణంలోనూ సరైనది కాదని పునరుద్ఘాటిస్తూ 2016 మే, జూన్‌ నెలల్లో ఈ బృందం కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఇదే విషయాన్ని జులై 19న కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలిపింది.

మరో కార్యదళం ఏర్పాటు! 
సాధ్యాసాధ్యాల పునఃపరిశీలనకు 2016 డిసెంబరు 7న కేంద్రం మరోమారు కార్యదళ బృందాన్ని పునఃనియమించింది. కేపీఎంజీ సహకారంతో మెకాన్‌ సంస్థ పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపైన అధ్యయనం చేయాలని, రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిక్షేపాల లభ్యత వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ధరించాలని కార్యదళ బృందం సమావేశంలో నిర్ణయించారు. పరిశ్రమ ఏర్పాటు అనుకూలమయ్యేందుకు (వయబుల్‌) వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమకు పలు ప్రొత్సాహాకాలు ఇవ్వాలని తీర్మానించారు. 2017 డిసెంబరు 27న జరిగిన సమావేశంలో చర్చించిన దాని ప్రకారం నలుగురు సభ్యుల కార్యదళ బృందం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించింది. మెకాన్‌ సంస్థ ప్రతినిధుల బృందం అనంతపురం జిల్లాలో ఇనుప ఖనిజాలున్న ప్రాంతాల్ని, పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన కడప జిల్లాలో కంబలదిన్నె, కోపర్తి ప్రాంతాల్ని సందర్శించింది.

మౌలిక వసతుల కల్పనకు ముందుకొచ్చినా! 
ఈ ఏడాది జనవరి 6న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారుల బృందంతో మెకాన్‌ సంస్థ ప్రతినిధులు మరోమారు భేటీ అయి పరిశ్రమ ఏర్పాటుపై పలు అంచనాలతో కూడిన ప్రతిపాదనలను వివరించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వమూ అంగీకారం తెలిపింది. ఆ వివరాలను జనవరి 12న మెకాన్‌కు పంపించింది. వాటిని పరిగణనలోకి తీసుకుని ఫిబ్రవరి 14న మెకాన్‌ సంస్థ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు పరిశ్రమ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల నివేదికను సమర్పించింది. మార్చి 15న పార్లమెంటులోని తన కార్యాలయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. మెకాన్‌ సంస్థ నివేదిక ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు.

2017 డిసెంబరు 27న జరిగిన చివరి సమావేశంలో మెకాన్‌ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల ప్రాథమిక నివేదికలోని ప్రధానాంశాలు.. 
* అనంతపురం జిల్లాలో లభ్యమయ్యే 110 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉక్కు పరిశ్రమను 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల పాటు నిర్వహించేందుకు సరిపోతాయి. 
* ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఆ ఖనిజ నిక్షేపాలను పూర్తిగా ఆ సంస్థకే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. 
* ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేస్తే ఖనిజ నిక్షేపాల కేటాయింపునకు నిర్దుష్టమైన విధానాన్ని అవలంభించాలి. గనులు, ఖనిజ నిక్షేపాల చట్టం ప్రకారం ఎక్కువ శాతం ఖనిజ నిక్షేపాలను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకే కేటాయించాలి. 
* ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో కూడిన ఉమ్మడి సంస్థ (జాయింట్‌ వెంచర్‌ కంపెనీ) ద్వారా ఏర్పాటు చేస్తే అందులో 74 శాతం వాటా ప్రభుత్వరంగ సంస్థకే ఉండేలా చూడాలి 
* లభ్యమయ్యే ఇనుప ఖనిజం నాణ్యత (ఎఫ్‌ఈ కంటెంట్‌) 58.5 శాతం ఉందని మెకాన్‌ నివేదిక చెప్పగా.. అది 60 శాతంపైనే ఉంటుందని పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం మెకాన్‌ను కోరింది.

Link to comment
Share on other sites

‘కడప ఉక్కు’ సాధనకు ఆమరణ నిరాహార దీక్ష 
తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ప్రకటన 
ఉనికి చాటుకునేందుకే కన్నా విమర్శలని మండిపాటు 
13ap-main5a.jpg

ఈనాడు, దిల్లీ: కడప ఉక్కు కర్మాగారం సాధనకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ప్రకటించారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం ఉక్కు కర్మాగారం విషయమై ఆ శాఖ పరిధిలో సమావేశం నిర్వహించారని, ఆ భేటీలో సానుకూలత వ్యక్తం కానట్లు రాష్ట్ర అధికారులు తెలిపారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఈ నెల 17, 18 తేదీల్లో ప్రధాని మోదీని సమయం కోరానని చెప్పారు. ఆయన అవకాశం ఇస్తే.. ఉక్కు కర్మాగారం నెలకొల్పాల్సిన అవసరాన్ని తెలియజేస్తానన్నారు. ఆశించిన స్పందన లేకపోతే కడప జిల్లాలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఎంపీ రమేశ్‌ చెప్పారు. కర్ణాటకకు చెందిన ముగ్గురు ఎంపీల రాజీనామాలు స్థానికంగా లేకున్నా వెంటనే ఆమోదించిన స్పీకర్‌.. వైకాపా ఎంపీలు ఏప్రిల్‌ ఆరున చేసిన రాజీనామాలను ఆమోదించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దీనిని బట్టే వైకాపా ఎంపీల రాజీనామాలు డ్రామాలని అందరికీ తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. త్వరలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక ఉందని అందులో తెదేపా సత్తా చూపిస్తామన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్రంలో పనులు కావట్లేదని బాధ ఉన్నా.. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉనికి చాటుకునేందుకు విమర్శలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగితే చంద్రబాబుకు పేరు వస్తుందన్న భయంతో కేంద్రం పనులు చేయడం లేదని సీఎం రమేశ్‌ ఆరోపించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...