Jump to content

జై బాలయ్య


Maha Natudu

Recommended Posts

మా బంగారు బాలయ్య కు జన్మదిన శుభాకాంక్షలు...

గడచిన 6 సంవత్సరాలలో ఎవడెవడో వచ్చి ఎవేవో మట్లాడారు.. ఎందరితోనో గొడవలు, ఎన్నో నిదురలేని రాత్రులు, ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేలనలు, అప్పటి వరకు అభిమానిని అని చెప్పుకు తిరిగినవారిలొ కొందరు ఇంక బాలయ్య పని అయిపోయింది అంటు వారి వారి వ్యక్తిగత igo satisfaction కోసం హిట్స్ ఇస్తున్న యువ కధానాయకుల వెంట పడ్డారు..అరే అభిమానానికి అపజయాలకి ఇంత ముడిపడి ఉందా అనుకుంటూ ఎంతో మానసిక సంఘర్షన, ఇది పద్దతి కాదు అని ఎదో చెప్పాలనే తపన, ఈ క్రమంలో ఎందరో శత్రువులు అయ్యారు మరెందరో మిత్రులు అయ్యారు.. నా ఆవేశాన్ని, అభిమానాన్ని, అంతరంగ మదనాన్ని వ్యక్తపరిచినా కొందరు Pessimist, Essay writer అన్నారు fire brand ముద్ర వేసారు ఎన్ని జరిగినా ఏమి జరిగినా ఆ అవేశాన్ని అనుచుకోలేదు, అభిమానాన్ని చంపుకోలేదు... I always felt proud for being a Fan of NBK....

ఎందుకంటే ఎదైన నమ్మి చేయాలి నమ్మకంతో చేయాలి అనే సూత్రాన్ని బాలయ్య బాబుకి అభిమానిగా ఏకలవ్య శిష్యుడిగా నరనరానా జీర్ణించుకున్నాను, నా అవేశానికి అర్దం, నా భావోద్వేగానికి వేగం బాలయ్య...అందుకే  అభిమానం చావలేదు, ఆశ అడుగంటిపోలేదు, ఎదురు చూపులు ఆగలేదు..

అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయించక పోతాడా?
అమావస్య వచ్చిందని ఎందుకు బాదపడటం పున్నమి వచ్చి వెలుగులు విరజిమ్మదా?

నా నమ్మకం నిలబడింది, నా ఎదురు చూపులు ఫలించాయి...
నందమూరి నట తేజస్వి ప్రచండ భానుడిలా రగిలాడు...
సిం హా నాదంతో బాక్సాఫీస్ సిం హాసనాన్ని అధీష్టించాడు..
పరాజయాల పద్మవ్యుహంలో చిక్కుకున్న అలుపెరుగని అభిమన్యుడిలా పోరాడి గెలిచాడు..
అడ్డుపడిన అపజయాలకి సమదానం చెప్పాడు, పరాజయల పై ప్రతీకారం తీర్చుకున్నాడు..

కోట్ల ఖర్చుకన్నా, కల్లుచెదిరే గ్రాఫిక్ విన్యాసాల కన్నా పౌరుషాగ్నితో రగిలే ఆయన నటనే మిన్న అని మరోమారు నిరుపించాడు...

నా గుండే నిండింది, నా కళ్ళు చల్లబడ్డాయి..

ఒక్క హిట్ వస్తే ఎన్నో లెక్కలు సరి చేయాలి అని ఎదురుచుసాను... కాని తీరా వచ్చాక ఎమి సరి చేయాలో అర్దం కావడంలేదు ఈ వారం రోజులుగా గమనిస్తూనే ఉన్నాను....

చాలా మర్పులు... సంతోషం... ఒక్క ఉదాహరణ ఎంటంటే మొన్నటి వరకు ఒకడు వాడికి నచ్చిన ఒక కధానాయకుడు ని వెనకెసుకు రావడం కోసం బాలయ్య బాబు & CO ని పందులు అని నీచంగ పక్క DBలొ మాట్లాడిన వాడు ఈ రోజు C inegoer కార్టూన్ వేసి ఎదో సాధించేసినట్టు గంతులేస్తున్నాడు....... అవును మరి విజయానికి అందరూ చుట్టాలే...

నిజమైన అభిమానులు జయమైనా అపజయమైనా
బాలయ్య అభిమానిగా గర్విస్తారు...
బాలయ్య మార్గంలో పయనిస్తారు...
బాలయ్య అదేశాన్ని పాటిస్తారు...

బాలయ్య అభిమానిగానే జీవిస్తారు.. ఎన్ని జన్మలకైన ఆయన అభిమానిగానే జన్మించాలనుకుంటారు..

ఈ రోజున మనలో ఒకడిగా మనకోసం ఒకడిగా ఆగిన మన గుండె చప్పుడుని విజయ జేగంట మ్రోగించి కదిలించి ఆడించిన శ్రీ బోయపాటి శ్రీనుగారికి.....

సిం హా గణ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి కృతగ్ఞతలు తెలియజేసుకుంటున్నాను...

సిం హ గురించి నా అనుభవాన్ని, అనుభూతినీ ఎంతో చెప్పాలని ఉంది కాని రాసే ఒపిక నాకున్నా చదివే ఊపిక మీకు ఉండాలిగా అందుకే ఇంకొసారి రాస్తాను....

తలలు మారినా, తరాలు మారినా తరగని అభిమానంతో బాలయ్య అడుగులో అడుగేస్తూ ఆయన మాటే బాటగా జీవన పయనం సాగించే...
సగటు బాలయ్యబాబు అభిమాని....jai balayya... jai jai balayya

మా బాలయ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు

balayya-still-585x350.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...