Jump to content

Nellore Politics


Recommended Posts

అహం వీడితే అంతటా శుభమే.. నెల్లూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి !
08-06-2018 13:40:40
 
636640620495582270.jpg
నెల్లూరు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గత ఎన్నికల అనుభవం దృష్ట్యా జిల్లాలో పార్టీ బలోపేతానికి టీడీపీ అధిష్టానం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నా, ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ కైవసం చేసుకున్న స్థానాల్లో ఒకటి, రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం దీటైన పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుండటం కొంత ఊరట కలిగించే అంశం.
 
 
సూళ్లూరుపేట
సూళ్లూరుపేటలో ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ పట్టు నిలుపుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటలాంటి ఈ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో 2.11 శాతం ఓట్ల తేడాతో చేజార్చుకుంది. ఈ నాలుగేళ్ల ‘అధికార’ కాలంలోనైనా పార్టీ బలపడకపోగా అంతర్గత కుమ్ములాటలతో మరింత బలహీనపడిన వైనం కనిపిస్తోంది. నియోజకవర్గ నాయకులు మూడు వర్గా లుగా చీలిపోయారు. వాకాటి నారాయణరెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, గంగాప్రసాద్‌ వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయారు. ఈ ముగ్గురు నాయకుల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఒకరంటే ఒకరికి కాని పరిస్థితి. పార్టీ కార్యక్రమాల్లోనూ వర్గ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలో ఉంటూనే వేనాటి రామ చంద్రారెడ్డి కుమారుడు సమంత్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో జరిగిన జగన్‌ పాదయాత్రలో పాల్గొనడం విశేషం. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి పరసా రత్నం ఇక్కడి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్ని కైనా నియోజవకవర్గం మీద పట్టు సాధించలేక పోయారు. నియోజకవర్గాన్ని శాసించే అగ్రనాయకులు ఎవరూ ఈయన కంట్రోల్‌లో లేరు. వాస్తవానికి తెలు గుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో బలమైన పట్టు ఉంది. ఆ విషయం ఇప్పటికి వరకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో రుజువయ్యింది. కేవలం నియోజకవర్గ నాయకుల మధ్య కుమ్ములాటల కారణంగా క్యాడర్‌ నిర్వీర్యం అయిపోతోంది.
 
 
గూడూరు
ప్రస్తుతానికి గూడూరు నియోజకవర్గంలో తెలుగు దేశం బలంగా కనిపిస్తోంది.ఎమ్మెల్యే పాశం సునీల్‌కు మార్‌ చేరికతో తెలుగుదేశం అనూహ్యంగా పుంజుకుం ది. ఈయన పార్టీ మారిన సందర్భంగా మెజారిటీ సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్‌ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తం గా తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్‌ ఏర్పడింది. క్యాడర్‌ పరంగా బలంగా కనిపిస్తున్నా... అక్కడక్కడా అవినీతి ఆరోపణలు పార్టీ ప్రతిష్టను కొంత దెబ్బ తీస్తున్నాయి.
 
 
వెంకటగిరి
వెంకటగిరిలో ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత తెలుగు దేశం పార్టీని వెన్నాడుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కురు గుండ్ల రామకృష్ణ బలమైన నాయకునిగా ముద్రప డినా, అంతే స్థాయిలో నియోజకవర్గం పరిధిలోని నాయకుల్లో వ్యతిరేకత మూటకట్టుకున్నారు. తీవ్రస్థా యికి చేరుకున్న అంతర్గత విభేదాలు పార్టీ గెలుపోట ములను శాశించే స్థాయికి చేరుకున్నాయి. తెలుగు దేశం గెలుపునకు వెంకటగిరి మున్సిపల్‌ ఓటు బ్యాంక్‌ చాలా కీలకం. అయితే, మున్సిపాలిటీలో ప్రస్తుతం పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంతు శారదకు ఎమ్మెల్యే రామకృష్ణకు మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. క్యాడర్‌ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. నియోజకవర్గం పరిధిలో ముఖ్యులైన వెంకటగిరి రాజా కుటుంబంతో కూడా ఎమ్మెల్యేకి సఖ్యత లేదు. ప్రజలు రాజా కుటుం బీకులకు దగ్గర కావడాన్ని ఎమ్మెల్యే సహించడం లేదని, ఆ కారణంగానే వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకునిగా ఎమ్మెల్యేకి మంచి పేరు ఉన్నా పై పరిస్థితులు వచ్చే ఎన్నికల్లో చికాకు కలిగించే అవకాశం లేకపోలేదు.
 
 
సర్వేపల్లి
మంత్రి హోదాతో అభివృద్ధి పనులు, నియోజక వర్గంలో కుమారుడు రాజగోపాల్‌ విస్తృత పర్యటనలు, ఎత్తిపోతల పథకం ద్వారా పొదలకూరుకు కండలేరు జలాలు.. నియోజకవర్గ వ్యాప్తంగా పటిష్ట నాయక త్వం..! ఇవి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తున్నాయి. గత ఎన్నికల్లో కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో సీటు చేజార్చుకోవాల్సి వచ్చింది. అయితే ఎన్నికల తరువాత సోమిరెడ్డి నియోజకవర్గం మీద గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. పట్టు బిగించారు. పొదలకూరు మండల రైతుల కోసం ఎత్తి పోతల పథకం ద్వారా సాగునీటిని మళ్లించాడు. దీని వల్ల పొదలకూరు, వెంకటాచలం మండలాలకు లబ్ది చేకూరింది. నియోజకవర్గం పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త హోదాలో ఈయన కు మారుడు రాజగోపాల్‌ నిత్యం పల్లెల్లో తిరుగతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మంత్రికి సం బంధించిన బలాల మాట ఇలా ఉండగా, మంత్రికి.. ప్రజలకు మధ్య స్థానిక నాయకులు అడ్డుగోడగా నిలిచారనే అసంతృప్తి కనిపిస్తోంది. కొంత మంది నాయకులు మంత్రి చుట్టూ కోటరిగా ఏర్పడ్డారని, వారు తమను మంత్రి వద్దకు వెళ్లనివ్వడం లేదనే అసంతృప్తి ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
 
 
కోవూరు
కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి బలంగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే పోలం రెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకునిగా గుర్తింపు పొందారు. అయితే ఇక్కడ క్యాడర్‌లో అనైక్యత ప్రతికూలాంశం. ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన కార్యకర్తలకు ఇచ్చే విలువ పాత తెలుగుదేశం కార్యకర్తలకు ఇవ్వడం లేదనే అసంతృప్తి కొంత మందిలో వ్యక్తం అవుతోంది. ఆ సమస్యను అధిగమించుకోగలిగితే పార్టీ పరిస్థితి మ రింత మెరుగుపడుతుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలచిన సామాజిక వర్గాలను కాపాడుకోవడం ఒక పెద్ద సవాల్‌. తెలుగుదేశం నాయకులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలకు ఈ నియోజకవర్గంలో అనుచర వర్గం ఉంది. గెలుపు కోసం ఈ ఇద్దరి సహకారం అవసరం.
 
 
కావలి
గత ఎన్నికల్లో 2.72 శాతం ఓట్ల తేడాతో చేజారిన కావలిని ఈ సారి తమ ఖాతాలో వేసుకోవడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి బీద మస్తాన్‌ రావుకు ఉన్న మంచి పేరు, ప్రధాన ప్రతిపక్షంలో నెలకొన్న వర్గ పోరు ఈ రెండు టీడీపీకి కలిసివచ్చే అంశాలు. ఈ నియోజకవర్గంలో నాయకత్వ సమస్య లు లేవు. అయితే ఇన్‌చార్జి ప్రజలకు అందుబాటులో ఉండరు, పార్టీ కార్యక్రమాల్లో మమేకం కారు అనే చి న్న అసంతృప్తి కార్యకర్తల్లో కనిపిస్తోంది. నియోజక వర్గం పరిధిలోని అన్ని మండలాల్లో ద్వితీయ శ్రేణి నాయకుల్లో వర్గాలుగా చీలిపోయారు. కావలి మున్సి పల్‌ చైర్మన్‌ మార్పు విషయంలో నాన్పుడి ధోరణి కారణంగా కమ్మ సామాజికవర్గం అసంతృప్తిగా ఉంది. రూరల్‌ మండలంలో మత్స్య కారులు ఒక వర్గంగా, మిగిలిన సామాజికవర్గాలు మరో వర్గంగా ఉన్నారు. మస్తాన్‌ రావు సోదరుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, అభ్యర్థి అందుబాటులో లేడనే వెలితి, ద్వితీయ శ్రేణి నాయకులను ఒక తాటిపై నడిపించలేక పోతున్నారనే అసంతృప్తి కార్యకర్తల్లో గూడుకట్టుకొని ఉంది.
 
 
ఆత్మకూరు
ఆత్మకూరు నియోజకవర్గంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఇన్‌చార్జి ఆనం రామ నారాయణరెడ్డి తెలుగుదేశంలో ఉన్నారా..! లేదా..! అనే సందిగ్దలో కార్యకర్తలు కొట్టుమిట్టాడుతున్నారు. ముం దు నియోజకవర్గ నాయకత్వానికి సంబంధించిన అనుమానాలు కొలిక్కి వస్తే కాని ఇక్కడ పార్టీ పరిస్థితి మెరుగుపడదు. ఈయన టీడీపీలోనే ఉంటారా , లే దా అనే విషయంలో ఒక స్పష్టత రావాల్సి ఉంది. అధి ష్టానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోని పక్షంలో నియోజకవర్గంలో పార్టీ మరింత బలహీపనపడటం ఖాయం.
 
 
నెల్లూరు రూరల్‌
తెలుగుదేశం నాయకులు సమష్టిగా శ్రమిస్తే రాబోయే ఎన్నికల్లో ఇక్కడ అనుకూల ఫలితాలు సా ధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజక వర్గంపై మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, ప్రస్తుత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంచి పట్టు ఉంది. ఆనం కుటుంబం టీడీపీలో కొనసాగే పక్షంలో ఆ కుటుంబ అభిమానులు, అనుచరులు అదనపు బలంగా మారుతారు. ధీటైన అభ్యర్థితో పాటు పార్టీ నాయకుల సంపూర్ణ సహకారం లభిస్తే ఇక్కడ టీటీడీకి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
 
 
నెల్లూరు సిటీ
నాయకులెక్కువ... కార్యకర్తలు తక్కువ అన్న చందంగా ఉంది నెల్లూరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి. మంత్రి నారాయణ, నగర మేయర్‌, నుడ చైర్మన్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, ఆనం కుటుంబ సభ్యులు... ఇలా నెల్లూరు కేంద్రంగా చేసుకొన్న నాయకుల సంఖ్య పెద్దదిగా ఉందే కాని కార్యకర్తల హడావుడి కనిపించడం లేదు. ఉన్న నాయకులు సైతం కలిసికట్టుగా పనిచేయడం లేదు. వాస్తవానికి నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ. 1200 కోట్ల పైచిలుకు నిధులతో భూగర్భ డ్రైనేజ్‌, డ్రికింగ్‌ వాటర్‌ స్కీము పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగరంలోని పేదల కోసం 6000 పక్కా గృహాలు అధునాతన పద్దతుల్లో నిర్మిస్తున్నారు. అమృత్‌, స్మార్ట్‌సీటీ పధకాల కింద వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి జరుగుతున్నా తెలుగుదేశం నాయకులు వీటిని క్యాష్‌ చేసుకోవడంలో విఫలమవుతున్నారు. వైసీపీ సంప్రదాయ ఓటర్ల శాతం ఎక్కువగా ఉన్న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే బలమైన అభ్యర్థిని బరిలోకి దించడంతో పాటు నాయకుల సమష్టి కృషి ఎంతో అవసరం.
 
 
ఉదయగిరి
ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ప్రజలకు అందుబాటులో ఉండడనే అసంతృప్తి వ్యక్తం అవు తోంది. ఈయన కలిగిరి పార్టీ ఆఫీసుకు పరిమితం అవుతున్నారనే విమర్శలున్నాయి. మండలాలకు చుట్టపు చూపుగా వస్తారు తప్ప ప్రజలతో మమేకం కావడం లేదనే ఆరోపణలున్నాయి. అన్ని మండలాల్లో క్యాడర్‌లో అంతర్గత కలహాలు తీవ్రంగా ఉన్నాయి. జన్మభూమి కమిటీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎన్నికల లోపు ఈ సమస్యలన్నీ చక్కదిద్దుకోవాల్సి ఉంది.
Link to comment
Share on other sites

  • Replies 219
  • Created
  • Last Reply
నెల్లూరులో ప్రభంజనమెవరిది?
10-06-2018 03:42:10
 
636641989393547605.jpg
  • అభివృద్ధే తన బలమంటున్న టీడీపీ..
  • సామాజిక సమీకరణలపైనే వైసీపీ కన్ను
  •  లోక్‌సభ స్థానంలో మళ్లీ మేకపాటే
  •  టీడీపీ నుంచి ఆదాలకు చాన్సు
  •  అసెంబ్లీకే పోటీ చేస్తానంటున్న మాజీ మంత్రి
  •  మార్పు జరిగితే బరిలో బీద మస్తాన్‌రావు
  • నెల్లూరు రూరల్‌లో మంత్రి నారాయణ పోటీ?
  •  సర్వేపల్లి బరిలో సోమిరెడ్డి ఖాయం
  •  ఆయనతో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి ఢీ
  •  ఆత్మకూరులో ఆనం పోటీపై అయోమయం
  •  ఆయన కాదంటే టీడీపీ అభ్యర్థిగా కొమ్మి
  •  ఇక్కడ వైసీపీ టికెట్‌ గౌతంరెడ్డికే
  •  కావలిలో రామిరెడ్డికి గట్టి పోటీ
నెల్లూరు, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): రాయలసీమకు.. కోస్తాకు ఆనుకుని ఉన్న నెల్లూరు జిల్లాలో రాజకీయ వాతావరణం రసవత్తరంగా ఉంది. పోయిన ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం వీచిన ఈ జిల్లాలో ఈసారి గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ఉంది. సామాజిక సమీకరణల ఆసరాగా పట్టు నిలుపుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా.. అభివృద్ధి కార్యక్రమాల అమలు ద్వారా బలం పెంచుకొనే ప్రయత్నంలో టీడీపీ ఉంది. ఏతావాతా ఈసారి గట్టి పోటీ వాతావరణం నెలకొన్న జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటని పరిశీలకులు భావిస్తున్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానానికి సిటింగ్‌ వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. కొంతకాలం స్తబ్ధ్దుగా ఉన్నా ఇటీవలి కాలంలో ఆయన క్రియాశీలంగా మారి తిరిగి పోటీ చేసే సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. టీడీపీ నుంచి పోయినసారి లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి ఈసారి కూడా పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆయన చూపు అసెంబ్లీ వైపు ఉన్నట్లు కనిపిస్తోంది. నెల్లూరు రూరల్‌ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన పార్టీ అధిష్ఠానానికి తెలియజేశారు. సీఎం చంద్రబాబు మాత్రం ఆయన్ను లోక్‌సభ స్థానానికి నిలపాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా ఆయనకు తెలియజేశారు. ఏదైనా కారణం వల్ల మార్పు జరిగితే టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పోటీ చేస్తారని అంటున్నారు.
 
గౌతంరెడ్డి వర్సెస్‌ ఆనం..
ఆత్మకూరు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా ఉంది. వైసీపీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు. టీడీపీ తరపున మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కానీ ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వెలువడుతున్న సంకేతాలు పార్టీ వర్గాల్లో కొంత అయోమయం కలిగిస్తున్నాయి. ఏ కారణంతోనైనా ఆయన పోటీచేయకుంటే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు పేరు పరిశీలనకు రావచ్చని అంటున్నారు. పోయినసారి పోటీ చేసిన కన్నబాబు కూడా పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. కావలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు. ఇక్కడ ఆయనకు మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్‌ రెడ్డి, వంటేరు వేణుగోపాలరెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక్కడ టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు పోటీ చేయనున్నారు. ఆయన పోటీ చేయలేకపోతే ఆయన సోదరుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర బరిలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. పొరుగునే ఉన్న ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి పేరు కూడా ఇక్కడ టీడీపీ తరపున ప్రచారంలోకి వస్తోంది. ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావే తిరిగి పోటీ చేస్తారని అంటున్నారు. ఆయనపై అంతర్గతంగా కొంత అసంతృప్తి ఉన్నా సరైన ప్రత్యామ్నాయం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఇక్కడ టీడీపీ టికెట్‌ ఆశిస్తున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు. వెంకటగిరిలో టీడీపీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకే మళ్లీ టికెట్‌ లభించనుంది. వెంకటగిరి రాజాల కుటుంబం కూడా టీడీపీ టికెట్‌ ఆశిస్తోందని ప్రచారం జరుగుతున్నా వారెవరూ ఇంతవరకూ పార్టీ నాయకత్వాన్ని కలవలేదు. వైసీపీ నుంచి జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఇక్కడ టికెట్‌ను ఆశిస్తూ పని చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి తనయుడు రాంకుమార్‌ రెడ్డి పేరు కూడా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. రెండు నెలల్లో పార్టీ మారతానని, ఇక్కడ నుంచే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు కూడా. గూడూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్‌, పార్టీ నేత జ్యోత్స్నలత కూడా ఆశిస్తున్నా అధిష్ఠానం మొగ్గు సునీల్‌వైపే ఉందని అంటున్నారు. వైసీపీ తరపున నియోజకవర్గ ఇన్‌చార్జి మేరిగ మురళి పేరు వినిపిస్తోంది. పనబాక కృష్ణయ్య పేరు కూడా ప్రచారంలో ఉంది. సూళ్లూరుపేటలో వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య తిరిగి పోటీ చేయనున్నారు. టీడీపీ తరపున నియోజకవర్గ ఇన్‌చార్జి పరసా రత్నం పేరు వినిపిస్తున్నా.. ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ జరుగుతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ నేత సుబ్రమణ్యం పేరు కూడా ప్రచారంలో ఉంది.
 
895.jpg
గత ఎన్నికల్లో ఎవరికెన్ని స్థానాలు?
మొత్తం స్థానాలు: 10
టీడీపీ: 3, వైసీపీ: 7
(వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒకరు టీడీపీలో చేరారు)
 
 
నెల్లూరు సిటీకి పోటీదారులెక్కువ..
నెల్లూరు సిటీ సీటుకు వైసీపీ తరపున సిటింగ్‌ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ మరోసారి పోటీ చేయనున్నారు. టీడీపీ తరపున ఎవరు పోటీ చేసేదీ స్పష్టత రాలేదు. ఈ సీటు మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే నగర మేయర్‌ అజీజ్‌కు అవకాశం రావచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగింది. కానీ ఆయన చూపు నెల్లూరు రూరల్‌పై ఉందని అంటున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి కూడా రేసులో ఉన్నారు. వైసీపీ తరపున ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. సర్వేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దనరెడ్డి తిరిగి పోటీ చేయడం ఖాయం. ఆయనపై వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి టీడీపీ తరపున బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మొదట ఆయన కుమారుడి పేరు వినిపించినా తర్వాత సోమిరెడ్డి తానే బరిలోకి రావాలని నిర్ణయించుకోవడంతో ఈ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కోవూరులో సిటింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మళ్లీ పోటీ చేయనున్నారు. పార్టీ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి కూడా రేసులో ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు.
Link to comment
Share on other sites

ఆనం ప్రయత్నాలకు బ్రేక్ వేసేందుకు టీడీపీ ఏం చేస్తోందంటే...
16-06-2018 12:52:11
 
636647503442995935.jpg
  • అటు అస్మదీయులతో ఆనం చర్చలు
  • ఇటు నష్ట నివారణ చర్యల్లో టీడీపీ
  • సీఎం ఆదేశాలతో రంగంలోకి నేతలు
  • వాకాటి, పెళ్లకూరుతో సోమిరెడ్డి భేటీ
  • మెట్టుకూరు, చెన్నుతోనూ మంతనాలు
  • ఆదాలకు సీఎం భరోసా.. బాధ్యతలు
  • ఉదయగిరి, ఆత్మకూరు నేతలను బుజ్జగించే పనిలో మాజీ మంత్రి
  • పేట, గూడూరు, వెంకటగిరిపై దృష్టిపెట్టిన సోమిరెడ్డి, బీద రవిచంద్ర
 
టీడీపీని వీడి వెళ్తూ.. తన వర్గాన్ని వెంట తీసుకువెళ్లాలన్న ఆనం రామనారాయణ రెడ్డి ప్రయత్నాలకు బ్రేక్‌ వేసేందుకు టీడీపీ నేతలు సమాయత్తమయ్యారు. ఆనం చర్యల వల్ల జరగబోయే నష్టాన్ని నివారించే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, ఇన్‌చార్జి మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి గురు, శుక్రవారాల్లో పలువురు అసంతృప్త నేతలతో చర్చలు జరిపారు. అలాగే నెలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను ఆదాల ప్రభాకరరెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. మంత్రి సోమిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
 
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆనం రామనారాయణరెడ్డి కదలికలతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఆనం రామనారాయణరెడ్డి జిల్లా వ్యాప్తంగా తన వెంట పలు వురిని తీసుకెళ్లడానికి పావులు కదుపుతుండగా, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తెలుగుదేశం సన్నద్ధమ యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆది, సోమవారాల్లో జిల్లా మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి లతో సీఎం సమావేశమై ప్రస్తుత పరిస్థితిల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. నెలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను ఆదాల ప్రభాకరరెడ్డికి అప్పగించారు. దీంతో ఆదాల రంగంలోకి దిగి ఆనం చర్యల వల్ల జరగబోయే నష్టాన్ని నివారించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు మంత్రి సోమిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించే పనులు మొదలు పెట్టారు. ఒకవైపు ఆనం రామనారాయణరెడ్డి మద్దతు కూడగట్టుకునే పనిలో ఉండగా, మరోవైపు టీడీపీ నేతలు నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు.
 
 
దృష్టి సారించిన సీఎం
పార్టీ మారుతున్న దృష్ట్యా ఆనం తెలుగుదేశానికి నష్టం చేసే అవకాశం ఉందనే విషయాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి, నారాయణ, ఇన్‌చార్జి మంత్రి అమరనాథ్‌రెడ్డి, పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకరరెడ్డిని రాజధానికి పిలిపించుకొని చర్చించారు. గురువారం రోజు నెల్లూరులో ఆదాల, సోమిరెడ్డి రహస్యంగా బేటీ అయ్యారు. మంత్రి సోమిరెడ్డిపై ఆదాల అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం ఉంది. దీనిని పరిష్కరించుకోవడం కోసం సోమిరెడ్డి ఆదాల నివాసానికి వెళ్లి గంట సేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం అదే రోజు రాజధానిలో ఆదాల, మంత్రులు సోమిరెడ్డి, నారాయణ, అమరనాథరెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం అమర్‌ను, ఆదాల ప్రభాకరరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు తన వద్దకు పిలిపించుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదాల తన మనసులోని కోర్కెలను, ఆవేదనలను ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది.
 
వీటన్నింటిని సావధానంగా విన్న సీఎం ఆదాలకు పూర్తి భరోసాతో పాటు బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పార్టీ వ్యవహారాలను మీరే చక్కదిద్దాలని, పార్టీకి నష్టం జరగకుండా నిలువరించాలని చంద్రబాబు ఆదాలను కోరినట్లు తెలిసింది. ఈ భేటీ తరువాత ఆదాల ప్రభాకరరెడ్డి మంగళవారం నుంచి రంగంలోకి దిగారు. ఆనం రామనారాయణరెడ్డి ప్రభావం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్‌ పరిధిలో ఆనం వెంట నడిచే అవకాశం ఉన్న మండల, గ్రామ స్థాయి నాయకులను కలిసి వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
 
 
పశ్చిమాన సోమిరెడ్డి.. బీద బుజ్జగింపులు
మరోవైపు మంత్రి సోమిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలపై దృష్టి సారించారు. సోమవారం సూళ్లూరుపేట నాయకుడు వాకాటి ముఖ్య అనుచరుడైన హర్షవర్థన్‌రెడ్డితో సోమిరెడ్డి, అమరనాథరెడ్డి భేటీ అయ్యారు. గురువారం బెంగళూరులోని పరప్పర అగ్రహారం కారాగారంలో ఉన్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని మంత్రి సోమిరెడ్డి, బీద రవిచంద్ర, నియోజవకర్గ ఇన్‌చార్జి పరసారత్నం కలిసి సుమారు రెండు గంటల పాటు చర్చించారు. కేసు విషయంలో తనకు న్యాయం చేయలేదనే అసంతృప్తితో ఉన్న వాకాటితో ఏకాంతంగా చర్చలు జరిపారు. వైకాటి వర్గం వైసీపీలోకి వెళ్లబోతోందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారిని నిలువరించే కార్యక్రమంలో భాగంగా వాకాటిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.
 
 
శుక్రవారం ఆనం అనుచరుడు, డీసీసీబీ చైర్మన్‌ మెట్టకూరు ధనంజయరెడ్డి, రాపూరుకు చెందిన చెన్ను బాలకృష్ణారెడ్డిలతో మంత్రి సోమిరెడ్డి బెంగళూరులో సమావేశం అయ్యారు. అలాగే కోవూరు నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డినీ బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. పార్టీకి ఎంతో సేవ చేసిన తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదనే ఉద్దేశంతో పార్టీ మారడానికి నిర్ణయించుకున్న పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి మనసు మార్చే బాధ్యతను రాష్ట్ర పార్టీ మంత్రి సోమిరెడ్డికి అప్పగించింది. ఈ క్రమంలో శనివారం సోమవారం సోమిరెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డితో చర్చించి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ భేటీకి ముందు అమరనాధరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి కూడా పెళ్లకూరుతో మాట్లాడి పార్టీ మారే యోచనను విరమించుకోవాలని నచ్చజెప్పినట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

మేకపాటి’కి ‘ఆనం’ సెగ!
19-06-2018 12:29:57
 
636650082111577068.jpg
  • వైసీపీలో చేరితే.. కోరి తెచ్చుకున్న కష్టాలే!
  • ఏదో ఒక సీటు త్యాగం చేయక తప్పనిసరి
  • రాజమోహన్‌రెడ్డి వర్గీయులకూ ఇబ్బందులే!
  • వెంకటగిరికి వెళ్తే.. బొమ్మిరెడ్డి దారెటు?
 
మనకు సొంత ఇల్లు ఉండగా, మరో ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది..! ఆత్మకూరు నుంచే పోటీ చేస్తాను, ఇందులో అనుమానం అక్కర్లేదు.
అనుచరులతో ఆనం రామనారాయణరెడ్డి
 
‘మనం ఇక్కడి నుంచే పోటీ చేస్తాం.. అందులో అనుమానం ఏముంది’?
పార్టీ కార్యకర్తలతో గౌతంరెడ్డి 
 
నెల్లూరు జిల్లా వైసీపీలో చక్రం తిప్పుతున్న మేకపాటి కుటుంబానికి వచ్చే ఎన్నికల నాటికి చిక్కు సమస్యలు ఎదురుకానున్నాయి. పార్టీలోకి కోరి తెచ్చుకొంటున్న ‘ఆనం’ కుటుంబం కారణంగా మేకపాటి కుటుంబ సభ్యుల నియోజకవర్గాలు తారుమారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలోకి అడుగుపెట్టడం అంటూ జరిగితే మేకపాటి కుటుంబం ఏదో ఒక సీటు త్యాగం చేయక తప్పని పరిస్థితి ఎదురుకాబోతోంది. అదే సమయంలో మేకపాటి వర్గీయులుగా గుర్తింపు పొందిన బొమ్మిరెడ్డి, మేరిగకూ కష్టకాలం దాపురించే సూచనలు కనిపిస్తున్నాయి.
 
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘ఆనం’ కుటుంబం వైసీపీలో చేరితే మేకపాటి కుటుంబానికి, వారి అనుచరులకు కూడా కొత్త చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా వైసీపీలో మేకపాటి కుటుంబానిది తిరుగులేని ఆధిపత్యం. ఎంపీగా కుటుంబ పెద్ద మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆయన కుమారుడు గౌతం రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా తమ్ముడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి కొనసాగుతున్నారు. అలాగే వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు వైసీపీ ఇన్‌చార్జి మేరిగం మురళి మేకపాటి మనుషులుగా గుర్తింపు పొందారు. రాబోయే రోజుల్లో మేకపాటి కుటుంబంతో పాటు వీరికి కూడా టిక్కెట్టు పరంగా కష్టకాలం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
 
 
మేకపాటి వారికి త్యాగం తప్పదా.!?
ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈయన పార్టీ ఫిరాయింపు దాదాపుగా ఖరారైనట్లే. ఆనం రామనారాయణరెడ్డిని వైసీపీలోకి తీసుకొస్తున్నది కూడా మేకపాటి కుటుంబమే అనేది వైసీపీ వర్గాల ప్రచారం. ఇదే జరిగితే కోరి తెచ్చుకొంటున్న కొత్త నేత కారణంగా మేకపాటి కుటుంబం రాబోయే ఎన్నికల్లో ఒక టిక్కెట్టు త్యాగం చేయక తప్పని పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయి. ఈ త్యాగం తాలూకు సూచనలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 
 
పార్టీ మారే క్రమంలో ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని తన అనుచరులతో రెండు రోజుల పాటు సమావేశమై రాజకీయంగా తను తీసుకోబోయే నిర్ణయాన్ని వారికి వివరించారు. తెలుగు దేశంలో ఇమడలేకపోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మీరు ఎక్కడినుంచి పోటీ చేయబోతున్నారని ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు అడిగిన ప్రశ్నకు ఆయన కుండ బద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పారు. మనకు సొంత ఇల్లు ఉండగా, మరో ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది..! ఆత్మకూరు నుంచే పోటీ చేస్తాను, ఇందులో అనుమానం అక్కర్లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ఎన్నికల నాటికి ఇదే ఖరారైతే ప్రస్తుతం ఆ నియో జకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మేకపాటి గౌతంరెడ్డి ఆత్మకూరు నుంచి పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది.
 
 
‘జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా గౌతంరెడ్డి ఈ త్యాగానికి సిద్ధపడే ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీలోకి తెస్తున్నా’రని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ప్రతిగా.. గౌతంరెడ్డి నెల్లూరు ఎంపీగా లేదా ఉదయగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈయన ఎంపీగా పోటీ చేస్తే మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన ఎంపీ స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సోదరుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్టుపై ఆశ వదులుకోవాల్సి వస్తుంది. ఆనం రాకతో మేకపాటి కుటుంబం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురిలో కచ్చితంగా ఎవరో ఒకరు తమ సీటు త్యాగం చేయాల్సి రావడంతో పాటు రాజకీయంగా మిగిలిన ఇద్దరి చిరునామాలు మారాల్సి వస్తుంది.
 
 
అదేం ప్రశ్న.. మేమెక్కడికి పోతాం!?
ఆనం రామనారాయణరెడ్డి చేరిక నేపథ్యంలో మేకపాటి కుటుంబం తాము పోటీ చేయబోయే నియోజకవర్గాల గురించి తమ కార్యకర్తలకు పదే పదే వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురౌతోంది. ‘మనం ఇక్కడి నుంచే పోటీ చేస్తాం.. అందులో అనుమానం ఏముంది’? అని ఎమ్మెల్యే గౌతంరెడ్డి పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నేను ఎంపీగానే పోటీ చేస్తున్నా. ఇది నా చివరి ఎన్నిక... అని రాజమోహన్‌రెడ్డి కార్యకర్తల సమావేశంలో పదేపదే చెబుతున్నారు. ఉదయగిరి నుంచి చంద్రశేఖర్‌రెడ్డే పోటీ చేయబోతున్నారని ఆయన అనుచరులు విలేఖర్ల సమావేశాలు పెట్టి ప్రకటిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే వీరు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తిరిగి తామే పోటీ చేయ బోతున్నామనే వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీలో ఈ నియోజకవర్గాల నుంచి టిక్కెట్టు ఆశించే ధైర్యం, సాహసం మరొక నాయకుడు చేసే అవకాశమే లేదు. ఎందుకంటే పార్టీ అధినేత జగన్‌తో వీరికి ఉన్న సంబంధాలు అటువంటివి. అయితే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరబోతున్న నేపథ్యంలో వారు ‘క్లారిటీ’ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇంకా పార్టీలో చేరకముందే మేకపాటి కుటుంబానికి ‘ఆనం’ సెగ తగిలిందనే విషయం ఈ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.
 
 
మేకపాటి అనుచరులకూ కష్టకాలమే!
పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలను గుప్పెట పెట్టుకున్న మేకపాటి కుటుంబం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తమ అనుచరులను నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా నియమించుకొని జిల్లా వైసీపీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. మేకపాటి ప్రధాన అనుచరుల్లో జడ్పీ చైర్మన్‌ రాఘవేంద్రరెడ్డి, గూడూరు వైసీపీ ఇన్‌చార్జి మేరిగ మురళి ముఖ్యులు. ఆత్మకూరు నుంచి పోటీ చేస్తానని రామనారాయణరెడ్డి చెబుతున్నా, ఆయన్ను పార్టీ అధిష్టానం వెంకటగిరి నియోజకవర్గానికి పంపుతుందనే ప్రచారం జరుగుతోంది. అది జరిగితే మేకపాటి కుటుంబ సభ్యులు త్యాగం నుంచి మినహాయింపు పొందవచ్చు కానీ.. వీరి ప్రధాన అనుచరుడైన జడ్పీ చైర్మన్‌ ఆశలపై నీరు చల్లినట్టు అవుతుంది. ఈ నియోజవర్గం నుంచి పోటీ చేయాలని రఘురామిరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
 
రామనారాయణరెడ్డి గనుక వెంకటగిరికి వస్తే టికెట్‌ త్యాగం చేయడం రాఘవేంద్రరెడ్డి వంతు అవుతుంది. మరో ప్రధాన అనుచరుడైన మేరిగ మురళికి కూడా కష్టకాలం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు చేర్పులు జరిగే నియోజకవర్గాల్లో గూడురు ఒకటని, ఇక్కడినుంచి డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్యను వైసీపీ తరపున రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇలా కోరి తెచ్చుకొంటున్న కొత్త నేత కారణంగా మేకపాటి కుటుంబ ప్రాబల్యం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
Link to comment
Share on other sites

తెరలు వీడుతున్నాయ్‌!
సమన్వయం లేని నేతలతో మంతనాలు
పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు
తెదేపాను వీడకుండా పకడ్బందీగా చర్యలు
ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న మంత్రులు
కొన్ని నియోజకవర్గాల నాయకులతో చర్చలు
  అధిష్టానం సూచనలకు అనుగుణంగా కదలికలు
nlr-top1a.jpg

అధినేత ఆదేశాలను అమలు చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల నెల్లూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని నేతలతో సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారు. ఈ సమయంలో నియోజకవర్గాల వారీగా సమన్వయం  చేసే బాధ్యతను సీనియర్‌ నేతలకు
అప్పగించారు. ఎన్నికలుసుదూరంలో ఉన్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. నియోజకవర్గాల్లో చాలా చోట్ల సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇదే తీరులో ఉంటే ఇబ్బందులు ఉంటాయని భావిస్తున్నారు. సమస్య ఉన్న నియోజకవర్గాలపై నేతలు సమస్యను సర్దుబాటు చేస్తూ నేతల మధ్య సమన్వయం చేసే బాధ్యతలను చేపట్టారు.

ఈనాడు-నెల్లూరు

జిల్లాలో పార్టీని ఎన్నికలకు సమాయాత్తం చేయటంలో భాగంగా ప్రధాన నాయకులు మంతనాలు ప్రారంభించారు. మంత్రుల దృష్టిలో ఉన్న నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి సారించారు. అసంతృప్తితో ఉన్న వారిని పిలిపించుకుని మాట్లాడే పక్రియను తెదేపా ప్రారంభించింది. ఇటీవల సీఎం జిల్లా పర్యటనకు వచ్చారు. మరోసారి నెలాఖరుకు జిల్లాకు రానున్నారు. జులై నెలలో కూడా భారీ కార్యక్రమంలో పాల్గొనటానికి వస్తున్నారు. వరుసగా సీఎం జిల్లాకు రావటం.. రాజధానిలో సైతం జిల్లా రాజకీయాల గురించి ప్రత్యేక దృష్టి సారించటంతో ఎట్టకేలకు కదలిక మొదలైంది.

సమన్వయ లోపాల గుర్తింపు
జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అక్కడి నేతల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి వల్ల కార్యకర్తలు సైతం ఇబ్బంది పడుతున్నారు. వాటిని సర్దుబాటు చేయటంలో ఇప్పటికే జాప్యం జరిగింది. ఇదే తీరు కొనసాగితే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణం సర్దుబాటు చేయాల్సిన నియోజకవర్గాల Ëపై జిల్లా మంత్రులు ప్రస్తుతం దృష్టి సారించారు. అందుకు అనుగుణంగా వర్గాలను ఒకచోటకు పిలిపించి సర్దుబాటు చేసే చర్యలను ప్రారంభించారు. ఇందులో భాగంగా కార్యకర్తల్లో తీవ్ర ఆయోమయం ఉన్న నియోజకవర్గాలకు తొలుత ప్రాధాన్యత ఇచ్చారు.

చక్కదిద్దే బాటలో ‘ఆత్మకూరు’
* సీనియర్‌ నేతగా గుర్తింపు ఉన్న ఆనం రామనారాయణరెడ్డి తెదేపాకు దూరంగా వెళ్తున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆయన ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంలోని కార్యకర్తలకు ప్రస్తుతం దిక్కుతోచని విధంగా ఉంది. పార్టీ నుంచి బయటకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న ఆనం  మొదటి నుంచి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. కార్యకర్తలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వర్గాలుగా విడిపోయారు. ఇదే తీరులో ఉంటే ఎన్నికల్లో పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ పరిధిలో ఉన్న నాయకులను పిలిపించి సమన్వయం చేసే పక్రియకు శ్రీకారం చుట్టూరు. గతంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించి, గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కన్నబాబును ఇటీవల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలిపించి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. ఇదే సమయంలో నియోజవకర్గంలో ఆనం వర్గంగా ముద్రపడిన డీసీసీబీ ఛైర్మన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి తెదేపాలోనే కొనసాగాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆనం పార్టీ వీడినా.. ఆయనకంటే ముందుగా పార్టీలో చేరినట్లు కార్యకర్తలకు ఇప్పటికే సంకేతాలను పంపుతున్నారు. ఇదే సమయంలో పార్టీకి చెందిన ముఖ్య నాయకులు కూడా ధనుంజయరెడ్డి పార్టీని వీడకుండా మంతనాలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆర్థికంగా బలమైన అభ్యర్థి కోసం పార్టీ ప్రయత్నిస్తోంది. ఇది కూడా తనకు కలిసొస్తుందన్న ఆలోచనలో ధనుంజయరెడ్డి ఉన్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో ఇద్దరూ కలిసి పార్టీకి ఎలాంటి నష్టం లేకుండా చూడాలని ఇద్దరు నేతలతో సోమిరెడ్డి మంతనాలు చేశారు.

గూడూరు ..ఇద్దరి మధ్య సయోధ్య
* గూడూరు నియోజకవర్గంలో కూడా మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే సునీల్‌ మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ వ్యవహారం కూడా రాష్ట్ర పార్టీ దృష్టికి వెళ్లింది. దీన్ని సర్దుబాటు చేసే విధంగా మంత్రులు చర్యలు చేపట్టారు. ఇద్దరినీ పిలిపించి పరిస్థితిని చక్కదిద్ది పంపారు. రేషన్‌ దుకాణం దగ్గర ఇద్దరి మధ్య కొన్ని సమస్యలు తలెత్తాయి. ఎన్నికల నాటికి కలిసి పనిచేసే విధంగా ఒప్పందం చేసి పంపినట్లు తెలిసింది.
* గత ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసిన ఒక ముఖ్య నేతను(మాజీ ఎమ్మెల్యే) తిరిగి పార్టీలోకి తీసుకునే విధంగా వ్యూహాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలపై కొంత పట్టు ఉంది. దీంతో ఆయన్ను పార్టీలోకి ఆహ్వానిస్తే.. ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో కొంత ఓటు బ్యాంకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే సదరు నేతతో సంప్రదింపులు పూర్తయ్యాయి. త్వరలో అధికారికంగా మళ్లీ సొంత పార్టీలోకి రానున్నారు.

కోవూరు..పెళ్లకూరుకు బుజ్జగింపు
కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి మధ్య వివాదం సర్దుబాటు కాలేదు. ఆనం రామనారాయణరెడ్డితో కలిసి పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు పెళ్లకూరు ఇప్పటికే సంకేతాలను పంపారు. జిల్లా నాయకులు మొత్తం ఒక్కసారి అప్రమత్తమయ్యారు. పెళ్లకూరుతో సంప్రదింపులు చేశారు. మంత్రి సోమిరెడ్డికి సన్నిహితుడు కావటంతో ఆయన్నే ప్రయోగించారు. పెళ్లకూరును పార్టీ వదలి వెళ్లకుండా చేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి వెంట పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఎవరూ వెళ్లకుండే రచించిన వ్యూహంలో భాగంగా పెళ్లకూరును ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ వీడకుండా చూడాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయనకు కీలకమైన హామీని కూడా ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

గ్రామీణం..తొలగుతున్న అంతరాలు
* నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డి, కొందరు నియోజకవర్గంలోని ముఖ్య నేతల మధ్య గత ఎన్నికల నుంచి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రంథాలయ సంస్థల ఛైర్మన్‌గా ఉన్న కిలారి వెంకటరత్నంనాయుడును ఇటీవల నిర్వహించిన నెల్లూరు గ్రామీణ మహానాడుకు కూడా ఆహ్వానించలేదన్న స్పర్థలు అలాగే ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు ముందు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ముఖ్య నేతలు అందరితో సమన్వయం తీసుకువచ్చే విధంగా దిద్దుబాటు చేస్తున్నారు. అలాగే ఆదాల, సోమిరెడ్డి మధ్య ఉన్న విభేదాలను సర్దుబాటు చేసుకోటానికి ఇటీవల ఇద్దరు నేతలు నేరుగా పలుమార్లు కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి పనిచేస్తే నెలూరు పట్టణ, గ్రామీణ, సర్వేపల్లి నియోజకవర్గాల పరిధిలో ఫలితాలు ప్రభావితం అవుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

సూళ్లూరుపేట..నలుగురూ కీలకమే
* మంత్రి నారాయణ సైతం ప్రధానంగా నెల్లూరు పట్టణ, గ్రామీణ నియోజకవర్గాల పరిధిలో నేతల మధ్య సమన్వయంపై ప్రధానంగా దృష్టి సారించారు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. సూళ్లూరుపేటలో వేనాటి రామచంద్రారెడ్డి కుమారుడు, కౌన్సిలర్‌ సుమంత్‌రెడ్డి వైకాపావైపు చూస్తున్నారు. వేనాటి పార్టీలోనే ఉంటున్నా గతంలో మాదిరి వ్యవహరించటం లేదన్న ఊహాగానాలు ఉన్నాయి. ఇదే తీరులో గంగాప్రసాద్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పరసా రత్నం, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వర్గాలు ఉన్నాయి. నలుగురినీ సమన్వయం చేసే బాధ్యతను మంత్రులు చూస్తున్నారు. మంత్రి నారాయణ తరచూ సూళ్లూరుపేట నియోజకవర్గం నేతలతో మంతనాలు చేస్తున్నారు. వేనాటిని ఎలాంటి పరిస్థితుల్లో పార్టీకి అనుకూలంగా వ్యవహరించేలా చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సీఎం దగ్గర ప్రత్యేకంగా సమావేశమయ్యేలా చేశారు. సీఎం నుంచి మంచి హామీ లభించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఆర్థిక నేరానికి పాల్పడినట్లు నమోదైన సీబీఐ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వాకాటి నారాయణరెడ్డిని బెంగళూరులో కలిసి పార్టీకి మద్దతుగా వర్గాన్ని ఉంచేలా ప్రయత్నాలు చేశారు.
ః కీలకమైన సమస్యలను సర్దుబాటు చేసుకోవటం ద్వారా రానున్న ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. మంత్రులు ఇద్దరూ ఇందులో నిమగ్నం కావటం గమనార్హం. జిల్లాకు వచ్చిన సందర్భంలో ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
చంద్రబాబు ఈ మాటలు అన్నందుకే ఎన్నికల బరిలోకి నారాయణ..?
05-07-2018 10:34:50
 
636663836914765614.jpg
నెల్లూరు జిల్లాలో సిటీ పాలిటిక్స్ ఎందుకు హాట్‌హాట్‌గా మారాయి? సిటీ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్టుని ఎంతమంది ఆశిస్తున్నారు? మంత్రి నారాయణ ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మేయర్ అబ్దుల్ అజీజ్‌పై ఎలాంటి ప్రచారం సాగుతోంది? జిల్లా అధినాయకులపై టీడీపీ శ్రేణులు ఎందుకు గుర్రుగా ఉన్నాయి? రాబోయే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల ప్లస్‌లు, మైనస్‌ల సంగతేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
 
 
    నెల్లూరు సిటీ నియోజకవర్గం. హస్తిన వరకు కూడా ఈ పేరు ఫేమస్. అయితే, మొదటినుంచి తెలుగుదేశం పార్టీ ఈ స్థానాన్ని అశ్రద్ధచేస్తూనే ఉంది. జిల్లా కేంద్రంపై పట్టులేకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్ పాయింట్‌! 1983లో ఆనం రామనారాయణరెడ్డి, 1994లో తాళ్లపాక రమేశ్‌రెడ్డి మాత్రమే టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. 1994 తర్వాత టీడీపీకి ఇప్పటివరకూ ఇక్కడ విజయమే దక్కలేదు. బీజేపీ, వామపక్షాలతో పొత్తుపెట్టుకున్న ప్రతిసారీ టీడీపీ ఈ స్థానాన్ని మిత్ర పక్షాలకే కేటాయిస్తూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితికి ఇది కూడా ఒక కారణమట. పోనీ టీడీపీ పట్ల స్థానిక ప్రజల్లో వ్యతిరేకత ఉందా అంటే అదీలేదు. కేవలం ఆ పార్టీ ఈ స్థానం పట్ల మొదటినుంచి అశ్రద్ధ వహించడం వల్లే స్వపక్షంలోనే వెన్నుపోటుదారులు తయారయ్యారు. దీంతో ఇక్కడ ప్రత్యర్ధులకి విజయం సులభమయ్యింది.
 
 
    అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం మంత్రి నారాయణ కన్ను ఈ స్థానంపై పడింది. నిజానికి నారాయణ మొదట్లో రాజకీయాల పట్ల ఆసక్తి చూపలేదు. గత ఎన్నికల సమయంలో మూడు జిల్లాల్లో టీడీపీకి బ్యాక్ బోన్‌గా పనిచేశారు. విజయనగరం, ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు రాబట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అందుకే, సీఎం చంద్రబాబు నారాయణకి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి తన క్యాబినెట్‌లో చోటిచ్చారు.
 
 
     తదనంతర కాలంలో ఇదే జిల్లాకి చెందిన బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలకు కూడా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. అయితే సీఎం చంద్రబాబు అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారట. "ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచి వస్తే తెలుస్తుంది రాజకీయం అంటే ఏంటో? ఎమ్మెల్సీలు తీసుకుంటే ఏమి తెలుస్తుంది?'' అని అంటుంటారట. ఈ వ్యాఖ్యలు ప్రత్యేకించి నారాయణని ఉద్దేశించి అనకపోయినా.. ఆయన మాత్రం ఒకింత బాధపడుతుంటారట. అందుకే ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందాలని నారాయణ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి రంగం సిద్ధంచేసుకుంటున్నారు.
 
 
      గతంలో ఇక్కడినుంచి టీడీపీ తరఫున పోటీచేసిన ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి కూడా మార్పుకి అంగీకారం తెలిపారట. "సారే పోటీచేస్తామంటే ఇక ఇబ్బంది ఏముంది?'' అంటున్నారట. పైకి ఇలా అంటున్నప్పటకీ, జనసేన అగ్రనేతలతో ముంగమూరు సంప్రదింపులు జరుపుతున్నారనీ, ఆ పార్టీలోకి జంప్‌చేసే అవకాశాలు లేకపోలేదనీ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ముంగమూరుకి గతంలో చిరంజీవి ప్రజారాజ్యంలో టిక్కెట్టు ఇచ్చారు. అప్పట్లో ముక్కోణ పోటీవల్ల ముంగమూరు గెలుపొందారు. కాబట్టి జనసేనలోకి ఆయన వెళ్లినా ఆశ్చర్యపోనక్కరలేదనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
 
 
      ఇక మేయర్ అబ్దుల్ అజీజ్ కూడా సిటీ లేదా రూరల్ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. నారాయణ అజీజ్‌కి గురువు. ఆయన దగ్గరే చదువుకున్నాడు. సిటీలో నలభై వేలకి పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయనీ.. తనకు టిక్కెట్‌ ఇస్తే కచ్చితంగా గెలుపొందుతాననీ ఆయన అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అజీజ్‌ అనుచరులు సామాజిక మాధ్యమాల్లో ముస్లింలకి ప్రాధాన్యం కల్పించాలనీ, అబ్దుల్ అజీజ్‌కి టిక్కెట్‌ ఇవ్వాలనీ డిమాండ్ చేస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఒకవేళ సిటీ నుంచి నారాయణ పోటీకి దిగితే.. రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఎంపీగా పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయట. ఈ తరుణంలో రూరల్ టిక్కెట్టు అయినా దక్కించుకోవాలని మేయర్‌ అజీజ్‌ ఆలోచిస్తున్నారట.
 
 
      జిల్లా టీడీపీ నాయకత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నేతలు కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారనీ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచినా, ఓడినా తమకేమీ పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు టీడీపీలోని ద్వితీయ, తృతీయశ్రేణి నేతలు గుర్రుగా ఉన్నారు. "పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి, పడరాని పాట్లు పడ్డాం. పార్టీ కోసం, ప్రజల కోసం పోరాటాలు చేశాం. తీరా అధికారంలోకి వచ్చాక మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేద''ని పార్టీ నేతలు అంతర్గతంగా ఆవేదన చెందుతోంది. ఈ పరిణామాలను గమనించిన వైసీపీ నేతలు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో తమకు అనుకూల గాలులు వీస్తాయని అంచనా వేసుకుంటున్నారు.
 
 
       నెల్లూరు సిటీ నుంచి నారాయణ బరిలోకి దిగుతారన్న సంకేతాలు రావడంతో స్థానిక టీడీపీలో రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సిటీలో వెన్నుపోటుదారులు కాచుకుని ఉండే ప్రమాద ముందని కొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మంత్రి నారాయణ ఇక్కడినుంచి పోటీచేసి గెలుపొందితే వచ్చే రోజుల్లో తమ ఉనికికి ప్రమాదం అన్న భావనతో కొందరు వెన్నుపోట్లకి దగవచ్చునన్నది విశ్లేషకుల అభిప్రాయం.
 
 
     నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌కి జగన్ దగ్గర మంచి ఇమేజే ఉంది. అయితే కొన్ని దుందుడుకు చర్యలు ఆయనకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇటీవల ఎన్‌టీఆర్ పక్కా గృహాల నిర్మాణంపైన, టీడీపీ చేపట్టిన అభివృద్ధి పనులపైనా పసలేని ఆరోపణలు చేయడం ప్రజల్లో చర్చకి దారితీసింది. ఈ మధ్య విజయవాడ- చెన్నై రూటులో మూడవ రైలుమార్గం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నగరంలోని పడుగుపాడు, వెంకటేశ్వరపురం ప్రాంతంలో కొన్ని ఇళ్లు తొలగించాల్సిన పనిపడింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు హడావుడిగా ఆ ఇళ్లు తొలగించాలని ప్రయత్నించారు. ఈ విషయం మంత్రి నారాయణ దృష్టికి రావడంతో వెంటనే రైల్వే ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ ఇళ్లు నిర్మిస్తున్నామనీ, ఇక్కడి వారందరికీ ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఇళ్లు తొలగించాలని నచ్చచెప్పడంతో వారు ఓకే అన్నారు. ఇంతలో షడన్‌గా వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సీన్‌లోకి ఎంటరయ్యారు. తాను జిల్లా కలెక్టర్‌తో చర్చించ బట్టే.. ఇళ్లు కూల్చే పని ఆగిందని చెప్పుకోవడం మొదలెట్టారట. అయితే అసలు విషయం తెలుసుకున్న ప్రజలు "ఇదేం బడాయి'' అంటూ చెవులు కొరుక్కున్నారట.
 
 
     ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సీటీలో పరిస్థితి అధికారపక్షానికి అనుకూలంగా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. పెన్నా బ్యారేజీ, ఎన్‌టీఆర్ ఇళ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ స్కీం, కార్పొరేట్ కాలేజీలు, ప్రీ ప్రైమరీ అంగన్‌వాడీ స్కూల్స్ వంటి అభివృద్ధి పనులు మంత్రి నారాయణ చేపట్టడంతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నది నేతల కథనం. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ప్రజలకి చేరువగా ఉన్నా సమస్యలు పరిష్కరించలేకపోవడం మైనస్‌ పాయింట్‌ అని చెప్తున్నారు. చూద్దాం వచ్చే ఎన్నికల్లో గాలి ఎటు వీస్తుందో..
Link to comment
Share on other sites

ఎవరైనా రావొచ్చు.. కానీ, గ్యారెంటీ ఇవ్వలేం: వైసీపీ ఎమ్మెల్యే
07-07-2018 13:49:05
 
636665681464222936.jpg
ఆత్మకూరు(నెల్లూరు జిల్లా): ‘‘ఆత్మకూరు నుంచి పోటీ చేసేది నేనే. ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇచ్చే ప్రసక్తే లేదు.. ఎవరూ పార్టీలోకి వచ్చినా చేర్చేకునేందుకు సిద్ధంగా ఉన్నాం. రామనారాయణరెడ్డే కాదు. ఎవరు పార్టీలో చేరుతామన్నా ఆహ్వానిస్తాం. వచ్చిన వారందరికీ ఎమ్మెల్యే సీటు ఇస్తామని గ్యారెంటీ ఇవ్వలేం. తొమ్మిదేళ్లుగా వైసీపీ పటిష్టతకు పాటుపడిన వారికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తరువాతే ఎంతటివాళ్లైనా. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు గుర్తించుకోవాలి. ఆత్మకూరును వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. అపోహాలు వీడి ఐక్యంగా ముందుకు కదిలి పార్టీ పటిష్టతకు కృషిచేయండి’’ అని ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
ఆత్మకూరు పట్టణంలోని ఆయన నివాసగృహంలో శుక్రవారం పార్టీ ముఖ్యనేతలతో గౌతంరెడ్డి సమావేశమయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని, ఆసక్తితో వచ్చే ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. పరిస్థితులను బట్టి నియోజకవర్గంలో తమ వర్గాన్ని నిలబెట్టుకునేందుకు ఆనం రామనారాయణరెడ్డి చెబుతున్న మాటలను తాను తప్పుపట్టడం లేదన్నారు. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసే ప్రసక్తే లేదన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు 2019లో జరగబోయే ఎన్నికల్లో కూడా ఆత్మకూరు నుంచే పోటీచేస్తానని గౌతంరెడ్డి ప్రకటించారు.
 
ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ పటిష్టంగా ఉందని, ఎవరూ వచ్చినా అంతకుమించి ఒరిగేది ఏమీ లేదన్నారు. తొమ్మిదేళ్లు కష్టకాలంలో పార్టీని పటిష్టపరిచేందుకు కష్టపడిన వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని వైసీపీ శ్రేణులు గుర్తుంచుకోవాలన్నారు. ఈ క్రమంలో ఆత్మకూరు సీటు ఎవరికో ఎందుకు కేటాయిస్తారని ప్రశ్నించారు. ఎవరు పార్టీలోకి వచ్చినా చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామే కానీ, వచ్చినవారందరికి సీట్లు ఇస్తామని గ్యారెంటీ ఇవ్వబోరనేది నగ్నసత్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణాధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి, యువత అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షులు కొండా వెంకటేశ్వర్లు, పలు మండలాల వైసీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

పెద్దారెడ్లకు పరీక్షా కాలం.. 2019 ఎన్నికల్లో గెలవకపోతే..
08-07-2018 13:05:04
 
636666519030725596.jpg
  • రాజకీయ పోరులో ప్రముఖుల వారసులు
  • రేపటి ఎన్నికలు వీరికి జీవన్మరణాలు
  • కొత్తగా వచ్చి చక్రం తిప్పుతున్న నేతలు
  • పాత తరానికి నూతన తరం సవాళ్లు
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఐదు ప్రముఖ కుటుంబాల వారసులకు పరీక్షా కాలం ఆసన్నమయింది. ఐదారు దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన ఈ కుటుంబాలకు 2019 ఎన్నికలు జీవన్మరణ సమస్య కానున్నాయి.
 
 
ఆనం రామనారాయణరెడ్డి
ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేనిది ఆనం కుటుంబం. ఒకే కుటుంబం నుంచి నలుగురు వ్యక్తులు మంత్రులుగా పనిచేసిన ఘనత ఆ కుటుంబానిది. ఆనం చెంచు సుబ్బారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరెడ్డి, ఇంకో సోదరుడు సంజీవిరెడ్డి పలు శాఖల మంత్రులుగా పనిచే శారు. వెంకటరెడ్డి కుమారుడు ఆనం రామనారా యణరెడ్డి ఆర్‌ అండ్‌ బీ, పంచాయితీరాజ్‌, మున్సిపల్‌, సమాచార, ఆర్థికశాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆనం వివేకానందరెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. దశాబ్దాల కాలం జిల్లాపై ఈ కుటుంబం పట్టు కొనసాగింది. వీరి మాట శాసనమై చెల్లుబాటయింది. అలాంటి కుటుంబం ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం మరోసారి బలపరీక్షకు సిద్ధమయింది.
 
 
కాంగ్రెస్‌ పార్టీ పతనంతో పాటే ఆనం కుటుంబ పరపతి సకబారింది. కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరినా అక్కడ ఇమడలేక బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేడో రేపో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరినా ఆయన కోరిన టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. సుమారు దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసిన ఒక ప్రముఖ నాయకుడు ప్రస్తుతం ఎటు వెళ్లాలో.. ఎక్కడ నిలబడాలో తెలియక నాలుగు రోడ్ల కూడలిలో నిలబడాల్సి రావడం విధి వైచిత్య్రం. 2019 ఎన్నికలే ఈ కుటుంబ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఈ ఎన్నికల్లో రామనారాయణరెడ్డి గెలుపు ఓటములతో పాటు చేరబోయే కొత్త పార్టీ అధినేత ఈయనకు ఇచ్చే విలువపైనే ఆనం కుటుంబ పరపతి ఆధారపడి ఉంటుంది.
 
 
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
పెద్ద పదవులు చేపట్టకపోయినా, జిల్లాలో బలమైన నాయకునిగా గుర్తింపు పొందారు సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఆనం కుటుంబానికి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గాన్ని నడిపారు. ఆయన కుమారుడు, ప్రస్తుత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా రాజకీయ జీవితాన్ని ఆరంభించి మంత్రి స్థాయికి ఎదిగారు. చంద్రబాబు క్యాబినెట్‌లో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. అయితే గత నాలుగు ఎన్నికలుగా ఈయన్ను దురదృష్టం వెంటాడుతూ వస్తోంది. వరుస పరాజయాలు పొందుతున్నారు. ఈ సారి మంత్రి హోదాలో సర్వేపల్లె నియోజకవర్గం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఈయనకు గెలుపు అనివార్యం. 2019 ఎన్నికల్లో ఫలితాలే ఈయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు. ఒక మాటలో చెప్పాలంటే 2019 ఎన్నికలు సోమిరెడ్డి కుటుంబానికి జీవన్మరణ పోరాటమే.
 
 
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
రాష్ట్ర రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించిన కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం. నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి 1957 నుంచి 1970 వరకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. 1983లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. ఆయన సోదరుడు నల్లపరెడ్డి శ్రీనివా సులు రెడ్డి కోట సమితి చైర్మన్‌గా, 1972 నుంచి 1993 వరకు వరుసగా ఆరు పర్యాయాలు గూడూరు, వెంకటగిరి, కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంజయ్య, ఎన్టీఆర్‌, చెన్నారెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతూ 1993లో మృతి చెందారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఈయన కుమారుడు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడానికి నిరాకరిస్తే, ఎన్టీఆర్‌ మానవతా దృక్పథంతో టిక్కెట్టు ఇచ్చారు. ఆ ఉప ఎన్నికల్లో ప్రసన్న కుమార్‌రెడ్డి గెలిచారు. 1999లో మళ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో పార్టీ మారి వైసీపీ నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. ఈ నేపథ్యంలో నల్లపురెడ్డి కుటుంబ రాజకీయ భవిష్యత్తుకూ 2019 ఎన్నికల ఫలితాలే కీలకం కానున్నాయి.
 
 
నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి
హేమాహేమీల్లాంటి ప్రత్యర్థుల మధ్య నిలదొక్కుకుని, ముఖ్యమంత్రి స్థాయిదాకా ఎదిగి జిల్లా ప్రజలకు పెద్దాయనగా మారిన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుటుంబం ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం సతమతం అవుతోంది. రాజకీయ కురువృద్ధుడుగా పేరుపొందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి ప్రస్తుతం రాజకీయ సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో నేదురుమల్లి జనార్థనరెడ్డిది ప్రత్యేక స్థానం. రెవెన్యూ మంత్రిగా ఆ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆరేళ్ల పాటు పీసీపీ అధ్యక్షునిగా, మూడు పర్యాయాలు ఎంపీగా, ఆ తరువాత రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఈయన సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి వెంకటగిరి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ కుటుంబ రాజకీయ వారసునిగా రంగంలోకి దిగిన నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి గత ఎన్నికల్లో వెంకటగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. ఆ తరువాత వెంకయ్యనాయుడు ప్రభావంతో బీజేపీలో చేరారు. బీజేపీ- తెలుగుదేశం తెగదెంపులతో ప్రస్తుతం డైలమాలో పడ్డారు. తెలుగుదేశంలో చేరుతారని, వైసీపీలో చేరుతారని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏ పార్టీలో చేరినా రాబోయే ఎన్నికల్లో గెలుపు ఈయనకు అనివార్యం. ఆ ఫలితాలే రాష్ట్ర రాజకీయాల్లో ఘన చరిత్ర కలిగిన నేదురుమల్లి కుటుంబ భవిష్యత్తును నిర్ణయించబోతాయి.
 
 
మాగుంట శ్రీనివాసులు రెడ్డి
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలమైన రాజకీయ కుటుంబంగా గుర్తింపు పొందిన మాగుంట వంశానికీ 2019 ఎన్నికలు ప్రధాన సవాల్‌గా మారనున్నాయి. మాగుంట సుబ్బరామిరెడ్డి ఒంగోలు ఎంపీగా కొనసాగుతున్న కాలంలోనే హత్యకు గురయ్యారు. 1996 ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి మాగుంట పార్వతమ్మ విజయం సాధించారు. ఆ తరువాత కావాలి ఎమ్మెల్యేగా పనిచేశారు. మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి 1998, 2004లో రెండుసార్లు ఒంగోలు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో ఓడిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ పతనంతో 2015లో టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా ఒంగోలు ఎంపీ స్థానానికి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. ఈయనకు కూడా రాబోయే ఎన్నికల్లో గెలుపు అనివార్యం. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారని పక్షంలో మాగుంట కుటుంబ ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉంది.
 
 
తరుముకొస్తున్న కొత్త తరం
కాలచక్రం ఎవరికోసమో ఆగదు. రాజకీయాల్లోనూ పాతనీరు పోయి కొత్తనీరు వస్తూనే ఉంటుంది. దశాబ్దాల పర్యంతం జిల్లాను శాసించిన కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా అదే వర్గంనుంచి, ఇతర సామాజికవర్గాలనుంచి ఎందరో నేతలు శరవేగంగా తెరపైకి వస్తున్నారు. గడచిన ఐదేళ్ల కాలంలోనే వీరు అనూహ్యంగా బలపడ్డారు. జిల్లాలపై పెత్తనం చెలాయించిన అగ్రనేతలను పక్కకు నెట్టి తమ ఆధిపత్యాన్ని చాటుకొంటున్నారు. విద్యావ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పొంగూరు నారాయణ మంత్రి పదవి పదవితో పాటు అంతకన్నా విలువైన పార్టీ అధినేత అభిమానాన్ని చూరగొన్నారు. ముఖ్యంత్రి చంద్రబాబుకు అత్యంత ముఖ్యుల్లో ఒకరిగా ఎదిగిపోయారు. జిల్లా రాజకీయ, పాలన రంగాలపై పట్టు సాధించుకున్నారు. బీసీ వర్గాల నుంచి బీద సోదరులు బలపడుతున్నారు. సోదరుల్లో ఒకరు ఎమ్మెల్సీ అయ్యారు. జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టారు.
 
 
మస్తాన్‌రావును రాజధాని నిర్మాణకమిటీ సభ్యునిగా నియమించి గౌరవించారు. జిల్లాపై రాజకీయంగా వీరి పట్టు పెరుగుతోంది. మరోవైపు బలమైన ఆర్థిక శక్తిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ప్రముఖ పారిశ్రామిక, వ్యాపారవేత్తగా ఎదిగిన వేమిరెడ్డి రాజకీయంగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆరాటపడ్డారు. చివరికి రాజ్యసభ సభ్యుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శరవేగంగా పుట్టుకొస్తున్న ఈ కొత్త తరం పాత తరం నాయకుల రాజకీయ మనుగడను ప్రశ్నిస్తోంది. ఆర్థిక, సామాజిక కోణాల్లో పరవళ్లు తొక్కుతూ వస్తున్న కొత్త నేతలను తట్టుకొని నిలబడాలంటే పాత తరానికి చెందిన పెద్దారెడ్లకు రాబోయే ఎన్నికల్లో గెలుపు అనివార్యం.
Link to comment
Share on other sites

రామనారాయణపై శేఖర్‌రెడ్డి విసుర్లు
09-07-2018 08:36:26
 
636667221856959946.jpg
  • వైసీపీలో రచ్చ ప్రారంభం
  • రామనారాయణపై శేఖర్‌రెడ్డి విసుర్లు
  • మాజీ మంత్రికి వ్యతిరేకంగా కరపత్రాలు
  • ఉదయగిరి, ఆత్మకూరులలో వేడెక్కిన రాజకీయం
  • పార్టీలో చేరకముందే అసమ్మతి కుంపట్లు
  • ఉదయగిరి టిక్కెట్టు నాకే : చంద్రశేఖర్‌రెడ్డి
  • రాజమోహన్‌రెడ్డి, గౌతమ్‌లూ పోటీలో ఉంటారని వెల్లడి
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న నానుడి నెల్లూరు రాజకీయాల్లో మరోసారి రుజువయ్యింది. వైసీపీలో చేరనున్న ఆనం రామనారాయణరెడ్డికి, ఇప్పటికే ఆ పార్టీలో తిరుగులేని నాయకులుగా చెలామణి అవుతున్న మేకపాటి కుటుంబానికి మధ్య అగ్గి రాజుకుంది. ఈ క్రమంలో మీడియాలో ఆనంపై విసుర్లు, ఆనం రాజకీయ జీవితంపై కరపత్రాలు పంచుతున్నారు. రామ నారాయణరెడ్డి వైసీపీలో చేరే క్రమంలో ఆ పార్టీ అధినేత జగన్‌ను కలిసిన నేపథ్యంలో ఒక్కసారిగా మేకపాటి కుటుంబీకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆనం రామనారాయణరెడ్డి ఇంకా వైసీపీలో చేరకముందే ఆయనపై అదే పార్టీ నుంచి పరోక్ష దాడి ఊపందుకుంది. అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి.
 
కాగా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఉదయగిరిలో మాట్లాడుతూ ఉదయగిరి టిక్కెట్టు తనకేనని, గెలుపొందడం కూడా ఖాయమని పేర్కొన్నారు. నెల్లూరు ఎంపీగా మా అన్న రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు నుంచి గౌతమ్‌రెడ్డి పోటీ చేయడం తథ్యమని ఆయన వివరించారు. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ ఆనం రామ నారాయణరెడ్డి చేరికను పరోక్షంగా వ్యతిరేకించారు. జగన్‌ మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఆనం సోదరులు గతంలో చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. 
 
 
రాజకీయ నాయకులకు సిగ్గు లేదనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నారని, వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శిలాఫలకాల్లో ఎమ్మెల్యేగా తన పేరు కూడా లేకుండా ఆనం చేశారని పేర్కొన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే టిక్కెట్టు విషయంలో ఆయన తనను ఉపయోగించుకున్నాడు తప్ప, ఏనాడు రామనారాయణ రెడ్డి సహాయం మేకపాటి కుటుంబం తీసుకోలేదన్నారు. ఆయన వైసీపీలో చేరినంత మాత్రాన కౌగిలించుకునేది ఏమి లేదని, ఎవరి దారుల్లో వారు పనిచేసుకొని వెళతామన్నారు. ఈ వ్యాఖ్యలు రామ నారాయణ రెడ్డికి మేకపాటి చంద్రశేఖరరెడ్డికి మధ్య ఉన్న విభేదాలను స్పష్టం చేస్తుండగా, శుక్రవారం మేకపాటి గౌతంరెడ్డి ప్రెస్‌మీట్‌ ఆయనలో ఉన్న అసహనాన్ని వ్యక్తం చేసింది. ఆత్మకూరు నుంచి తానే పోటీ చేస్తున్నానని, తొమ్మిదేళ్లు పార్టీలో కష్టపడినవారిని కాదని నిన్న మొన్న పార్టీలోకి వచ్చే వారికి టిక్కెట్టు ఇచ్చే సంస్కృతి వైసీపీలో లేదని ఆయన స్పష్టం చేశారు.
 
 
ఆనంపై కరపత్రాలు
ఇదిలా ఉండగా ఆనం రామనారాయణరెడ్డిపై మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెల్లెలి కుమారుడు బిజివేముల రవీంద్రనాథ్‌రెడ్డి పేరుతో ఆత్మకూరు నియోజకర్గంలో పంచిన కరపత్రాలు సంచనం సృష్టించాయి. మేకపాటి కుటుంబానికి రామ నారాయణరెడ్డికి మధ్య ఆధిపత్య పోరు రగులుకుంది అనే వాదనకు ఇవి బలం చేకూర్చుతున్నాయి. నారాయణా.... ఆనం రామనారాయణా..! తగునా నీకిది..!? అనే శీర్షికన రెండు పేజీల కరపత్రాన్ని ఆత్మకూరు నియోజకవర్గంలో పంచి పెట్టారు. ఇందులో ఆనం రామనారాయణరెడ్డి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన తీరు, ఆ తరువాత తెలుగుదేశంలో చేరిక, జగన్‌ కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలు, తదితర వివరాలను ముద్రించి ఉదయగిరి నియోజకవర్గంలోనూ పంపిపెట్టారు. ఆనం రామ నారాయణరెడ్డిని నైతికంగా బలహీన పరచడమే ధ్యేయంగా మేకపాటి అభిమానులు, అనుచరులు ఇలా కరపత్రాల యుద్ధం ప్రారంభించారని తెలుస్తోంది.
 
 
ఎందుకింత అసహనం?
మూడు రోజులుగా మేకపాటి కుటుంబంలో అసహనం, కలవరపాటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి అసలు కారణం ఏమిటో అంతుపట్టడం లేదు. ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరినంత మాత్రాన మేకపాటి కుటుంబానికి వచ్చే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. భవిష్యత్తులో కూడా వైసీపీలో మేకపాటి కుటుంబానికి పరపతి తగ్గే అవకాశం కూడా లేదు. జగన్‌తో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధం అటు వంటింది. మరి ఆనం రాక సందర్భంగా వీరు ఎందుకు కలవర పాటుకు గురవుతున్నారనేది అంతుపట్టని ప్రశ్న. దీనికి సమాధానాలుగా పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
 
రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు టిక్కెట్టు విషయంలో క్లియరెన్స్‌ వచ్చిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మకూరు టిక్కెట్టు చేజారితే మేకపాటి కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురిలో ఎవరో ఒకరు పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. బహుశా ఇలాంటి పరిస్థితి తప్పదనే విషయం స్పష్టం అవడంతో మేకపాటి కుటుంబం అసహనానికి గురవుతోందా..! అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏవైనా కాని ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలోకి అడుగు పెట్టకముందే ఆ పార్టీలో అసమ్మతి కుంపటి రాజుకుందన్నది వాస్తవం.
 
 
నెల్లూరు ఎంపీ, ఆత్మకూరు, ఉదయగిరి అసెంబ్లీ టిక్కెట్లు మాకే
నెల్లూరు పార్లమెంట్‌, ఆత్మకూరు, ఉదయగిరి అసెంబ్లీ స్థానాల నుంచి వైసీపీ అభ్యర్థులుగా నా అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, నేను పోటీచేస్తామని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయగిరిలో జరిగిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిలో ఆయన మాట్లాడుతూ తమను కాదని ఆ నియోజకవర్గాల్లో మరెవరికీ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టిక్కెట్‌ ఇవ్వరని పేర్కొన్నారు. వైఎస్‌ మరణానంతరం వారి కుటుంబానికి అండగా నిలిచింది మేకపాటి సోదరులేనన్నారు. ఎవరెవరో వస్తారని, వారికే టిక్కెట్లు దక్కుతాయన్న అపోహలు నమ్మవద్దని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మేకపాటి సోదరులు చేసిన అభివృద్ధి మరెవ్వరూ చేయలేదన్నారు. ఫైబర్‌ చెక్‌డ్యాంల్లో తెలుగు తమ్ముళ్లు రూ.కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. అధికారులు టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారన్నారు.
 
 
టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, అవినీతిపై ఉదయగిరిలో బహిరంగచర్చకు సిద్ధమన్నారు. ఇసుక, మట్టి, చివరికి నీటిని కూడా దోచుకొంటున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అలాగే నెల్లూరు ఎంపీగా రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యేగా నేను, ఆత్మకూరు ఎమ్మెల్యేగా గౌతమ్‌రెడ్డి గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ను ఉదయగిరికి రప్పించి వెలుగొండను పూర్తి చేసి చూపుతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై చేస్తున్న దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడే రోజులు దగ్గరపడ్డాయన్నారు.
Link to comment
Share on other sites

ఆనం ఎపిసోడ్‌ను చివరికిలా ముగించిన టీడీపీ
11-07-2018 11:47:01
 
636669064207950200.jpg
  • ఆనం వర్గంపై త్వరలో వేటు
  • ఆత్మకూరులో టీడీపీ ప్రక్షాళనకు రంగం సిద్ధం
  • త్వరలో మండల అధ్యక్ష, కార్యదర్శుల మార్పు
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌ను కలిసి పార్టీ మారేందుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఆయన ఇన్‌చార్జిగా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ ప్రక్షాళనకు తెలుగుదేశం పార్టీ రంగం సిద్దం చేసుకుంది. రామనారాయణ రెడ్డి ఇక పార్టీలో కొనసాగే అవకాశం లేదని తేలిపోవడంతో ఆయన అనుచరులుగా ముద్రపడి పార్టీ పదవుల్లో కొనసాగుతున్న వారిని పక్కన పెట్టి కొత్త వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం పార్టీ పదవుల్లో ఉన్న పలువురికి త్వరలోనే ఉద్వాసన పలికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 
 
గత కొంత కాలంగా ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంలోని పలువురు మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దళితతేజం మహాసభలో కూడా వీరి భాగస్వామ్యం కనిపించ లేదు. ఆనం మనసు మార్చుకుంటారనే ఉద్దేశంతో ఆయన వర్గీయులుగా చెలామణి అవుతున్న కొంతమంది మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శుల విషయంలో జిల్లా పార్టీ చూసి చూడనట్లు వ్యవహరించింది. అయితే ఆనం ఇక పార్టీలో ఉండరనే విషయం స్పష్టం కావడంతో నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రక్షాళన అనివార్యమయింది.
 
 
మండల కార్యవర్గాల్లో మార్పులు..
ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏడాది క్రితం నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల పరిధిలో పార్టీ కార్యవర్గంలో మార్పులు చేర్చులు చేశారు. ఆత్మకూరు మండల టీడీపీ అధ్యక్షుడు డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య, ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి రవీంద్రారెడ్డి, సంగం మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి, అనంతసాగరం మండల పార్టీ అధ్యక్షుడు మెట్టుకూరు కృష్ణారెడ్డి, ఏ.ఎస్‌.పేట మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, చేజర్ల మండల పార్టీ అధ్యక్షుడు మోదేపల్లి నవకృష్ణ చౌదరి ఆనం అనుచరులుగా ముద్రపడ్డారు. వీరిలో అధికులు ఆనం వెంట తెలుగుదేశం పార్టీలోకి వచ్చినవారే. ఆనం టీడీపీ కార్యకలాపాలకు దూరం అయిన రోజు నుంచి వీరు పార్టీ వ్యవహారాలకు అంటీ ముట్టనట్లు ఉంటున్నారు.
 
 
ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారే సందర్భంలో వీరంతా కూడా అటు వైపు వెళ్లే ప్రమాదాన్ని టీడీపీ జిల్లా పార్టీ పసిగట్టింది. ఈ క్రమంలో వీరికి అంత అవకాశం ఇవ్వకుండా ముందే పార్టీ పదవుల నుంచి సాగనంపాలని జిల్లా పార్టీ నిర్ణయించుకుంది. ఎన్నికల గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో పార్టీ విధేయులను, సమర్థులను మండల అధ్యక్ష, కార్యదర్శుల పదవుల్లో నియమించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా కొత్త నేతకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
 
ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన వైసీపీ అధినేత జగన్‌ను కలిసి చర్చించిన క్రమంలో పార్టీ మారడం ఖాయమని నిశ్చయానికి వచ్చిన రాష్ట్ర పార్టీ కొత్త వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించాలని తీర్మానించుకున్నట్లు తెలిసింది. ఆనం బాధ్యతల నుంచి తప్పుకునే వరకు ఆగకుండా పార్టీయే ఒక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జిగా కన్నబాబు, ధనంజయులు నాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

మంత్రి నారాయణ 2019లో పోటీ చేసే అవకాశం లేనట్టేనా?
12-07-2018 15:37:59
 
636670066789773337.jpg
  • నెల్లూరు నగర టికెట్టుపై రకరకాల ఊహాగానాలు
  • మంత్రి పోటీ చేయరనే అంచనాతో ఇతరుల్లో ఆశలు
  • రంగంలో అజీజ్‌.. కోటం.. ముంగమూరు.. తాళ్లపాక
  • ప్రజల మద్దతు కూడగట్టేందుకు వ్యూహాలు
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాలు లేవనే అంచనాలు బలపడటంతో ఆ స్థానం కోసం నగర టీడీపీలో పోటీ మొదలయింది. సిటీ టికెట్‌ కోరుకుంటున్న నలుగురు ఆశావహులు ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లడానికి ఎవరికి వారు ప్రణాళికలు సిద్ధం చేసుకొంటున్నారు.
 
 
వ్యక్తిగత ప్రణాళికలు
నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి మంత్రి నారాయణ పోటీ చేస్తారని గత ఏడాదిన్నర కాలంగా ప్రచారం బలపడింది. ఆ క్రమంలోనే ఆయన నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, కోట్లాది రూపాయల పథకాలు నెల్లూరుకు తీసుకువస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా మంత్రి నారాయణ పోటీచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అంచనాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో ఈయన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అవసరం అవుతాయి కాబట్టి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంచాలని అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమాచారం నగర టీడీపీ నేతల్లో ఆశలు పెంచింది. మంత్రి నారాయణ పోటీ చేయని పక్షంలో నెల్లూరు సిటీ తాము పోటీలోకి దిగేందుకు ప్రధానంగా నలుగురు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు అనువుగా రంగం సిద్ధం చేసుకొంటున్నారు.
 
 
మైనారిటీ కోటాపై అజీజ్‌ ధీమా
టిక్కెట్ల కేటాయింపులో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో నెల్లూరు సిటీని మైనారిటీ వర్గాలకు కేటాయించే అవకాశం ఉందన్నది ఓ అంచనా. సిటీ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ కారణంతోనే నెల్లూరు టిక్కెట్టు తనకు కేటాయించాలని నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ కోరుతున్నారు. ఈయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా కాలంగా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారు కూడా. మంత్రి నారాయణ పోటీ చేయని పక్షంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈయన పావులు కదుపుతున్నారు. ఈయన రా ష్ట్ర మంత్రులు నారా లోకేష్‌, నారాయణలకు సన్నహితం గా ఉంటున్నారు. టిక్కెట్టు విషయంలో ఈ పరిచయాలు ఉపయోగపడతాయని ఈయన భావిస్తున్నారు. అదే సమయంలో ప్రజల్లో పట్టు పెంచుకోవడం కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా సిటీ పరిధిలోని అన్ని కార్పొరేషన్‌ డివిజన్లలో విస్తృత పర్యటనకు ఈయన ప్రణాళిక రచిస్తున్నారు.
 
 
బాలకృష్ణపై కోటంరెడ్డి ఆశలు
పోటీ నుంచి మంత్రి తప్పుకునే పక్షంలో సిటీ టిక్కెట్టు తను దక్కించుకోవాలని నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆశిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ల పాటు పార్టీ వైపు నిలబడి పోరాటాలు చేయడం, నగర కార్యకర్తలకు అందుబాటులో ఉండడం ఈయనకు ప్లస్‌ పాయింట్‌లు. ముఖ్యంగా సినీ నటుడు బాలకృష్ణకు ఈయన సన్నిహితుడు. బాలకృష్ణ ఆశీస్సులతోనే కోటంరెడ్డికి నుడా చైర్మన్‌ పదవి దక్కింది. రాబోయే ఎన్నికల్లో సైతం బాలకృష్ణ ఆశీస్సులు తనకు ఉంటాయని ఈయన భావిస్తున్నా రు. ఇదే సమయంలో అందివచ్చిన ‘అమృత్‌ పథకం’ ద్వారా పలు పథకాలు చేపట్టి ప్రజల్లో పట్టు సంపాదించుకోవడానికి వ్యూహరచన చేస్తున్నారు. సిటీ పరిధిలోని వివిధ డివిజన్లలో అమృత్‌ పథకం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మెప్పు పొందాలని చూస్తున్నారు.
 
 
పాత అనుభవంపై ముంగమూరు నమ్మకం
సిటీ టిక్కెట్టుపై ముంగమూరు శ్రీధర్‌ కృష్ణారెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి సీటీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. నగరంలో పార్టీ తరపున జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పోటీలో తన ఉనికిని చాటుతూ వస్తున్నా రు. మంత్రి నారాయణ పోటీనుంచి తప్పుకునే క్రమంలో తనకే అవకాశం దక్కుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలోనే పరోక్షంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
 
 
విధేయతపై అనురాధ ఆశలు
నెల్లూరు సిటీ నుంచి మహిళ కోటా కింద తనకు అవకాశం కల్పించాలని మాజీ కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ తాళ్లపాక అనురాధ కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తాళ్లపాక కుటుంబం ఆ పార్టీ వెన్నంటే ఉంది. ఎన్టీఆర్‌ వీరాభిమానిగా తాళ్ళపాక రమేష్‌రెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. పార్టీపట్ల ఉన్న విధేయత, మేయర్‌గా పని చేసిన అనుభవం, మంత్రి నారాయణ ఆశీస్సులు తన కు లాభిస్తాయని ఈమె ఆశిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మహిళా సంఘాల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు.
 
 
సమైక్యతే అసలు సమస్య
మంత్రి నారాయణ పోటీ చేయని పక్షంలో నెల్లూరు సిటీ నేతల మధ్య సమన్వయం, సమైక్యత కుదర్చడమే పార్టీ అధిష్టానం ముందున్న అతిపెద్ద సవాల్‌. ఇక్కడి నుంచి తాను పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో మంత్రి నారాయణ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ నాయకులందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చారు. ఒకవేళ ఈయన పోటీ నుంచి తప్పుకుంటే వీరందరూ ఒకటిగా ఉంటారనే గ్యారెంటీ లేదు. ఇప్పటికే బహునాయకత్వంతో బలహీనంగా కనిపిస్తున్న నగర తెలుగుదేశం టికెట్‌ ఆశావహుల మధ్య పోటీతో మరింత నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. పార్టీ అగ్రనేతలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది.
Link to comment
Share on other sites

జగన్‌తో ఆనం భేటీ..!? ఏం జరగబోతోంది?
12-07-2018 15:20:54
 
636670056541145191.jpg
  • జగన్‌తో ఆనం భేటీ..!?
  • లోటస్‌పాండ్‌లో చర్చలు
  • ఆత్మకూరా.. వెంకటగిరా?
  • పోటీ ఎక్కడి నుంచో స్పష్టత వచ్చే అవకాశం
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌తో మరోసారి భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో గురువారం జగన్‌తో తన భవిష్యత్‌ రాజకీయాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘ఆనం’ వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం నేటి భేటీలో తేలిపోనుంది. వైసీపీలో చేరాలనే ఉద్దేశంతో కొద్ది రోజుల క్రితం ఆనం రామనారాయణరెడ్డి హైదరాబాద్‌ విమానాశ్రయంలో జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే సమయాభావం కారణంగా ఆ రోజు అన్ని విషయాలు మాట్లాడుకునే వీలు లేకపోయింది. ఈ క్రమంలో ఏకాంతంగా మాట్లాడటానికి మరో అవకాశం ఇవ్వాలని రామనారాయణ రెడ్డి కోరిన క్రమంలో 12వ తేదీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆనం నేడు లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలవనున్నారు.
 
 
ఆత్మకూరా...! వెంకటగిరా..!?
వైసీపీ నుంచి ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో పలు రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నుంచే పోటీ చేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ పేరు చెప్పలేదు కానీ రాబోయే ఎన్నికల్లో తను ఆత్మకూరు నుంచే పోటీ చేయనున్నట్లు ఆనం తన అనుచరులతో అన్నారు. అయితే ఇది వైసీపీలో కీలక నేతలుగా కొనసాగుతున్న మేకపాటి కుటుంబంలో పెద్ద దుమారం లేపింది.
 
ఈ క్రమంలో ఆత్మకూరు నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయమని జగన్‌ కోరినా అందుకు ఆనం సిద్ధపడినట్లు సమాచారం. ఆత్మకూరు కాని పక్షంలో వెంకటగిరి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా వెంకటగిరి నియోజకవర్గంలో ఈ తరహా ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. నేటి జగన్‌ భేటీలో ఆనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో స్పష్టం అయ్యే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

గన్‌ను కలిసిన ఆనం.. టికెట్ సంగతేంటి..!?
14-07-2018 13:57:39
 
636671734586569796.jpg
  • రంగమయూర్‌తో కలసి లోటస్‌పాండ్‌కు..
  • షరతులు లేకుండా చేరికకు అంగీకారం!
  • రాజకీయ భవితకు అధినేత భరోసా?
 
నెల్లూరు: ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పినట్లు శుక్రవారం సాయంత్రం ఆనం రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూరిరెడ్డి వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ జగన్‌ నివాసంలో సాయం త్రం 5గంటలకు తండ్రీ కుమారులు జగన్‌ను కలిసి వైసీపీలో చేరికపై చర్చించారు. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరుతున్నట్టు గత కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన హైదరాబాద్‌ విమానాశ్రయంలో జగన్‌ను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే కొంతసేపు ఏకాంతంగా మాట్లాడే అవకాశం కల్పించాలని రామనారాయణరెడ్డి ఈ సందర్భంగా జగన్‌ను కోరారు. దీంతో ఆయనకు ఈ రోజు అపాయింట్‌మెంట్‌ దొరికింది. వాస్తవానికి గురువారమే ఈయన జగన్‌తో భేటీ కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం సాయంత్రం రామనారాయణరెడ్డి, రంగమ యూర్‌రెడ్డి జగన్‌ను కలవగా, ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరడానికి ఆనం రామనారాయణరెడ్డి అంగీకరించినట్టు సమాచారం.
 
 
ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని ఆశ పడుతున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో తన అనుచరుల ముందు వ్యక్తం చేశారు. అయితే ఆత్మకూరును వదులుకోవడానికి మేకపాటి గౌతంరెడ్డి నిరాకరిస్తున్నారు. ఆత్మకూరు సీటు వదులుకుంటే ఆ కుటుంబంలో ఎవరో ఒకరు రాబోయే ఎన్నికలకు కచ్చితంగా దూరం కావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదనను మేకపాటి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదే విషయాన్ని అధిష్ఠానం ముందు కూడా తెలియజేసింది.
 
ఈ నేపథ్యంలో శుక్రవారం జగన్‌తో భేటీలో రామనారాయణరెడ్డి కూడా షరతులు లేకుండా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు తెలిసింది. అయితే తమ కుటుంబ రాజకీయ భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలని రామనారాయణరెడ్డి గట్టిగా కోరినట్లు తెలిసింది. తన అన్న వివేకానందరెడ్డి మరణంతో ఆయన కుమారుడైన ఆనం రంగమయూర్‌రెడ్డి కూడా రాజకీయంగా అవకాశం కల్పించాలని రామనారాయణరెడ్డి కోరారు. దీనికి జగన్‌ సమ్మతించినట్లు తెలిసింది. ఈ క్రమంలో పార్టీలో చేరడానికి ఆనం రామనారాయణరెడ్డి, రంగమయూర్‌రెడ్డి అంగీకరించారు. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరికతో ఇక జిల్లాలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఆయనకు ఏదో ఒక అసెంబ్లీ టికెట్‌ తప్పక ఇస్తారు. ఆ నియోజకవర్గం ఏదనేది ఇప్పుడు చర్చనీయాంశం. ప్రస్తుతం ఆ నియోజక వర్గంలో వైసీపీ టికెట్‌ కోసం ఆశ పడుతున్న నాయకుల భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్ధకం. ఈయన రాకతో నష్టపోయే వైసీపీ నాయకులు ప్రత్యామ్నాయ పార్టీలను చూసుకునే అవకాశం లేకపోలేదు.
Link to comment
Share on other sites

జగన్‌ను కలిసిన ‘ఉత్తమ్‌’ ధనుంజయరెడ్డి.. వైసీపీలో చేరేందుకు సిద్ధం!
17-07-2018 13:37:57
 
636674314778534760.jpg
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రముఖ వ్యాపారవేత్త, హోటల్‌ డి.ఆర్‌. ఉత్తమ్‌ చైర్మన్‌ కె. ధనుంజయరెడ్డి ఆదివారం రాత్రి కాకినాడలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. గూడూరు నియోజకవర్గంలో వైసీపీకి సేవలందించడానికి సిద్ధంగా ఉన్నానని జగన్‌కు స్పష్టం చేసినట్లు ధనుంజయరెడ్డి తెలిపారు. ఆయన 1981 నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభిమానిగా ఉన్నారు. 2013 నుంచి రెండేళ్ల పాటు డీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు.
 
నేదురుమల్లి, వైఎస్‌ రాజశేఖరెడ్డి, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆరంభం నుంచి ఆనం కుటుంబం వెంటే నడిచారు. ఆనం సోదరులతోపాటు ఏడాదిన్నర క్రితం టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో ఆయనా ఆ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. పార్టీలో చేరి గూడురు, వెంకటగిరి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని తెలిపానని, జగన్‌ సంతోషంగా అంగీకరించారని ధనుంజయరెడ్డి తెలిపారు.
Link to comment
Share on other sites

ఆనం జయకుమార్‌రెడ్డికి పదవి ఇవ్వాలని టీడీపీ నిర్ణయం
17-07-2018 13:31:26
 
636674310874474050.jpg
  • అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌
  • విశ్వసనీయత, పూర్వానుభవాలే ప్రామాణికం
  • కీలక సామాజిక వర్గాలతో నూతన కమిటీ
  • నేడో..రేపో జాబితాతో రాజధానికి బీద..
  • త్వరలో కొత్త కార్యవర్గం ఏర్పాటు
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిగా ఆనం జయకుమార్‌రెడ్డిని నియమితులు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు తెలిసింది. టీడీపీ పట్ల అభిమానం, నగర రాజకీయాలపై అనుభవాలు ప్రధాన అర్హతలుగా జయకుమార్‌రెడ్డిని ఈ పదవికి ఎంపిక చేశారు. బీసీ, ఎస్సీ, కమ్మ సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త నగర కమిటీ ఏర్పాటు కు కసరత్తు జరుగుతోంది. ఈ జాబితాతో నేడోరేపో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర రాజధానికి వెళ్లనున్నారు. త్వరలో నగరానికి కొత్త కమిటీని అధికారికంగా ప్రకటించనున్నారు.
 
 
ఆనం జయకుమార్‌రెడ్డిని నగర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆయన పార్టీ పట్ల చూపుతున్న విశ్వసనీయత. రెండు నగర రాజకీయాలపై ఆయనకు ఉన్న అను భవం. జయకుమా ర్‌రెడ్డి ఆనం వివేకా, రామనారాయణ రెడ్డిల కన్నా ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి వెంట ఆయన తెలుగు దేశంలోకి అడుగుపెట్టారు. తాజా గా ఆనం రామనారా యణరెడ్డి టీడీపీ వీడిపోతున్న తరుణంలో సైతం జయకుమార్‌రెడ్డి తెలుగుదేశంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఆదాల ప్రభకర్‌రెడ్డి వెంట రాగా రెండు సార్లు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తన నిర్ణయాన్ని వెల్లడించారు. పార్టీ పట్ల ఆయన చూపుతున్న అభిమానం చంద్రబాబును ఆకర్షించింది. అలాగే నగర రాజకీయాలపై ఆయనకు ఉన్న అనుభవం కూడా అధ్యక్షపదవికి అర్హత సంపాదించి పెట్టింది.
 
ఆనం వివేకానందరెడ్డి సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా కొనసాగిన రోజుల్లో నగర పార్టీ బాధ్యతలను జయకుమార్‌రెడ్డే చూసేవారు. ఈ క్రమంలో నగరంలో ఈయనకు విస్తృత మైన ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో నగరంపై పూర్తి స్థాయి అవగాహన కలిగిన వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని అధిష్ఠానం ఆలోచించింది. ఈ క్రమంలో జయకుమార్‌రెడ్డిని నగర అధ్యక్షుడిగా నియమించమని పార్టీ అధినేత జిల్లా పార్టీ అధ్యక్షునికి, మంత్రులకు సూచించినట్లు తెలిసింది. ఆ క్రమంలో ఆనం జయకుమార్‌రెడ్డిని నగర పార్టీ అధ్యక్షున్ని చేసేందుకు చర్యలు మొదలయ్యాయి.
 
 
రెండో సారి ప్రతిపాదన
వాస్తవానికి నగర పార్టీ అధ్యక్షపదవి కోసం జయకుమార్‌రెడ్డి పేరు చాలా కాలంగా నానుతోంది. ఏడాదిన్నర క్రితమే ఆయనకు ఆ పదవి దక్కాల్సింది. జిల్లా నాయకులు ఆయన పేరు ప్రతిపాదించగా, ఆనం కుటుంబంలో నుంచే దీనికి అభ్యంత రం వ్యక్తమ య్యింది. ఏసీ సుబ్బారెడ్డికి నగర అధ్యక్షపదవి ఇవ్వాలని ఆనం వివేకానందరెడ్డి, రామనారా యణరెడ్డిలు కోరడంతో ఈ ప్రతిపాదన ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి ఈయన పేరు తెరపైకి వచ్చింది. అయితే పార్టీ అధినేత ఆశీస్సులు ఉండటంతో ఈసారి తప్పక పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
 
 
కీలక వర్గాలతో కొత్త కమిటీ
సిటీ, రూరల్‌ నియోజకవర్గాల పరిధిలోని కీలక వర్గాలతో నగర పార్టీ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయనున్నారు. బీసీ, ఎస్సీ, కమ్మ సామాజిక వర్గాలతో ఇద్దరు లేదు ముగ్గురు కార్యదర్శులను, ఇతర పదవుల్లో మిగిలిన కీలక సామాజికవర్గాల నేతలతో కొత్త కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సమీపిస్తుండటం, నగర కమిటీ సీటీ, రూరల్‌ నియోజకవర్గాలకు విస్తరించి ఉన్న క్రమంలో ముఖ్యమైన సామాజికవర్గాలకు చెందిన నాయకులకు ఈ కమిటీలో స్థానం కల్పించడం ద్వారా ఎన్నికలకు సమాయత్తం కావాలని జిల్లా పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. ఈ జాబితాతో నేడో, రేపో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర రాజధానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఆమోదముద్ర పడగానే కార్యవర్గాన్ని ప్రకటించనున్నారు.
Link to comment
Share on other sites

జగన్‌తో భేటీ వార్తలపై ఆనం వివేకా కుమారుడి సంచలన వ్యాఖ్యలు
17-07-2018 13:49:51
 
636674321922228305.jpg
  • మేము జగన్‌తో మాట్లాడలేదు
  • కార్పొరేటర్‌ ఆనం రంగమయూర్‌రెడ్డి
సౌత్‌రాజుపాళెం(నెల్లూరు రూరల్‌): మా కుటుంబం టీడీపీని వీడుతుందని, జగన్‌ పార్టీలోకి వెళ్తున్నామని, ఆయనతో మాట్లాడినట్లు వస్తున్న పుకార్లు వాస్తవం కాదని 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆనం రంగమయూర్‌రెడ్డి అన్నారు. సోమవారం తన డివిజన్‌ పరిధిలోని సౌత్‌రాజుపాళెంలో నిర్వహించిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్‌తో మేము ఎవరూ టచ్‌లో లేమని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి మేయర్‌ పదవులు ఇస్తారంటూ వస్తున్న కథనాల్లోనూ వాస్తవం లేదని తేల్చి చెప్పారు. మాకు పార్టీ మారే ఆలోచన లేకపోయినా ఆత్మీయులతో సంప్రదించాక ముందుస్తు నిర్ణయాన్ని వెల్లడించి ఆపై తుది అడుగు వేస్తామన్నారు. కొన్ని రోజుల క్రితం ఆనం జగన్‌తో భేటీ అయ్యారన్నది వాస్తవం కాదన్నారు. అనంతరం ఆయన పనులు పరిశీలించి తనిఖీ చేశారు.
Link to comment
Share on other sites

జగన్‌తో ఆనం భేటీ తర్వాత వైసీపీలో ఊహించని పరిణామం
21-07-2018 11:27:09
 
636677692306871366.jpg
  • జగన్‌తో భేటీ తర్వాత వేడెక్కిన రాజకీయం
  • వెంకటగిరి నుంచే ఆనం పోటీ అని ప్రచారం
  • ఆ సీటునే నమ్ముకున్న నేతల విచారం
  • బొమ్మిరెడ్డి, కలిమిలి ఆశలు అడియాసలేనా?
  • నేదురుమల్లికీ రాజీపడక తప్పని పరిస్థితి
 
జగన్‌తో ఆనం రామనారాయణ భేటీ తర్వాత జిల్లా చూపంతా వెంకటగిరి వైపు మళ్లింది. ఇప్పుడు అందరి విశ్లేషణలు అక్కడి వైసీపీ అభ్యర్థిత్వం గురించే. ఆత్మకూరు కాదంటే.. రామనారాయణరెడ్డికి వెంకటగిరి టిక్కెట్టు ఇవ్వడం అనివార్యం అవుతుందనే అంచనాలతోపాటు ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న ప్రస్తుత వైసీపీ నాయకుల భవిష్యత్తు ఏమిటన్నదే ప్రస్తుతం ‘టాక్‌ ఆఫ్‌ ది డిస్ట్రిక్ట్‌’గా మారింది.
 
 
నెల్లూరు: ‘ఆనం’ కదలికలతో నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల చూపులు వెంకటగిరి వైపు మళ్లాయి. ఇప్పుడు అందరి విశ్లేషణలు వెంకటగిరి కేంద్రంగానే జరుగుతున్నాయి. ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి వైసీపీ టిక్కెట్టు ఇవ్వడం అనివార్యం అవుతుందనే అంచనా లతో.. పాటు ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న ప్రస్తుత వైసీపీ నాయకుల భవిష్యత్తు ఏమిటన్నదే ‘టాక్‌ ఆఫ్‌ ది డిస్ట్రిక్ట్‌’గా మారింది. వైసీపీ అధినేత జగన్‌తో ఆనం రామనారాయణరెడ్డి భేటీతో వెంకటగిరి రాజకీయ ఊహాత్మక చిత్రం టాక్‌ ఆఫ్‌ ది డిస్టిట్‌గా మారింది.
 
 
 
‘ఆనం’కు వెంకటగిరే శరణ్యం!
వై.ఎస్‌.జగన్‌తో ఆనం రామనారాయణరెడ్డి గురువారం భేటీ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య జరిగిన అంతరంగిక చర్చల్లో ఆనంకు ఏ నియోజకవర్గ టిక్కెట్టు ఇస్తారనే విషయం ఖరారు కాలేదు. దీనికి సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం, విశ్లేషకుల అంచనాల ఆధారంగా గమనిస్తే రామనారాయణరెడ్డికి వెంకటగిరి నియోజకవర్గమే శరణ్యమనే వాదన బలంగా వినిపి స్తోంది. ఆత్మకూరు కావాలని ఆనం మనసులో ఉన్నా, సిట్టింగ్‌ ఉన్నారు కదా ఎలా వీలవుతుందన్న జగన్‌ వ్యాఖ్యల ఆధారంగా చూస్తే వెంకటగిరి తప్ప రామ నారాయణరెడ్డికి మరో దారి లేదనే వాదనకు బలం చేకూ రుతోంది. ఆనం కుటుంబానికి పాత పరిచయాలున్న ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్‌, సర్వేపల్లె నియోజకవర్గాల్లో వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు.
 
ఇక ఆయనకు పరిచయం ఉన్న నియోజకవర్గాల్లో వెంకటగిరిలో మాత్రమే వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే లేరు. వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని రాపూరు, సైదాపు రం, కలువాయి మండలాలు పూర్వ రాపూరు నియోజక వర్గం పరిధిలో ఉండేవి. రామనారాయణరెడ్డి గతంలో రాపూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ మూడు మండలాల్లో ఆనం కుటుంబానికి మంచి పరిచయా లతో పాటు బలమైన వర్గం కూడా ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే లేకపోవ డం, పాత పరిచయాలు ఉండ టం అనుకూలాంశాలుగా వెంకట గిరి టిక్కెట్టు రామనారాయణరెడ్డికి ఇస్తారని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. ఆనం వెంకటగిరి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతున్నా, గురువారం భేటీ తరువాత మరింత ఊపందుకుంది.
 
బొమ్మిరెడ్డి, కలిమిలి పరిస్థితి ఏమిటో!
ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి టిక్కెట్టు ఇస్తే.. ఇప్పటిదాకా దానిపైనే ఆశలు పెట్టుకున్న ఆ ఇద్దరు నాయకుల పరిస్థితేమిటనే చర్చ ఊపందుకుంది. గురువారం నుంచి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోనూ ఆ ఇద్దరి రాజకీయ భవిష్యత్తు గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. వెంకటగిరి టిక్కెట్టుపై జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2014 ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే రాబోయే ఎన్నికల్లో టిక్కెట్టు తనదే అనే ధీమాతో ఉన్నా రు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా ఈయన్నే నియమించడంతో టిక్కెట్టు తమ నాయకునికేనని, చివరి క్షణంలో మాటమార్చే గుణం జగన్‌కు లేదని బొమ్మిరెడ్డి వర్గం గట్టిగా నమ్ముతూవచ్చింది. అందుకు అనుగుణంగా గత నాలుగున్నరేళ్లుగా బొమ్మిరెడ్డి వెంకటగిరి నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పరపతి పెంచుకోవడం కోసం కృషి చేస్తూ వచ్చారు.
 
టిక్కెట్టు ఆశతో ఇదే నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి సేవా కార్యక్రమాల పేరుతో భారీగా ఖర్చు పెట్టారు. టిక్కెట్టు రేసులో వెనకడుగు వేయకూడదనే ఉద్దేశంతో బొమ్మిరెడ్డికి సమాంతరంగా పార్టీ కార్య కలాపాలు నిర్వహించారు. ఇప్పుడు ఆనం చేరికతో వీరిద్దరి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారయింది. ఆనంకు టిక్కెట్టు ఇస్తే మా నాయకుల గతేమిటని ఆ ఇద్దరి అనుచరులు ఆందోళన చెందు తున్నారు. కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థులు గా మానసికంగా సిద్ధపడిన ఈ ఇద్దరు సాధారణ కార్యకర్తల్లా రామనారాయణ రెడ్డికి పనిచేయాలా.. ఇది సాధ్యమేనా..!? అనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.
 
‘తగిన గుర్తింపు’తో రాంకుమార్‌ రాజీ!
వెంకటగిరి కేంద్రంగా మారుతున్న పరిణామాలు రాజకీయ ఘన చరిత్ర కలిగిన నేదురుమల్లి కుటుంబం వారసుడు రాజీపడాల్సిన స్థాయికి తీసుకొచ్చాయి. రాబో యే ఎన్నికలపై కోటి ఆశలు పెట్టుకున్న నాయకుల్లో మా జీ ముఖ్యమంత్రి నేదురుమల్లి తనయుడు రాంకుమార్‌ రెడ్డి ఒకరు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తు కోసం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రభావంతో బీజేపీలో చేరారు. బీజేపీ ప్రాభవం రాష్ట్రంలో తగ్గుముఖం పట్టడంతో మరో పార్టీని వెదుక్కునే క్రమంలో వైసీపీ పట్ల మొగ్గు చూపారు. టిక్కెట్టు వస్తుందని ఆశించారు. అయితే ఆ ఆశలు సన్నగిల్లినట్లు తెలుస్తోంది.
 
ఈ క్రమం లో ఆయన శుక్రవారం సాయంత్రం అందుబాటులో ఉన్న అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరి టిక్కెట్టు మాటేమిటి అని అభిమానులు అడిగితే టిక్కెట్టు విషయం వది లేయండి, పార్టీలో మనకు గుర్తింపు ఇస్తామన్నారు. మ నం పార్టీలో చేరుతున్నాం..! అని స్పష్టం చేసినట్లు తెలిసింది. వైసీపీలోకి ఆనం ప్రవేశం నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిని ఇలా రాజీ ధోరణికి తీసుకొచ్చింది.
Link to comment
Share on other sites

నెల్లూరు జిల్లాలోని ఆ మూడు సీట్లపై టీడీపీలో సేమ్ సీన్ రిపీట్ !
22-07-2018 11:05:54
 
636678543528992069.jpg
  • తెలుగుదేశంలో నాయకత్వ సమస్య
  • గత ఎన్నికల పరిస్థితే పునరావృతం
35 ఏళ్ల చరిత్ర కలిగి.. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేనంత పటిష్టమైన యంత్రాంగం ఉండి.. కోట్లాది మంది పార్టీ సభ్యులను కలిగి ఉండి కూడా.. కొన్ని నియోజక వర్గాల్లో ఎన్నికల చివరి నిమిషంలో కాని అభ్యర్థులెవరో ఖరారు చేయలేని ఉదాసీన వైఖరి తెలుగుదేశం పార్టీకి శాపంలా పరిణమిస్తోంది. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా పరిధిలోని మూడు నియోజక వర్గాల్లో ఇదే జరిగిందని, ఈ పరిణామాలకు పార్టీ అధిష్ఠానం నిర్లక్ష్యమే కారణమనే వాదన ఉంది. గత ఎన్నికల సందర్భంగా ఆత్మకూరు, నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గాల అభ్యర్థిత్వంపై చివరి నిమిషం వరకు ఇదేతరహా అనిశ్చితి కొనసాగగా, నాలుగున్నరేళ్ల కాలం తరువాత.. ప్రస్తుతం కూడా ఆ మూడు నియోజకవర్గాల్లో తిరిగి అదే సీన్‌ రిపీట్‌ అవుతోంది. తరుముకు వస్తున్న ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులు ప్రచారాలతో దూసుకుపోతుండగా, తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులెవరో అంతుపట్టక తెలుగుదేశం కార్యకర్తలు తలలు పటుకొంటున్నారు.
 
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఎంత మంది పోటీ చేసినా గెలిచేది మాత్రం ఎవరో ఒక్కరే. ఇది జగమెరిగిన సత్యం. పార్టీ విధి విధానాలు, అభ్యర్థుల బలా బలాలపై గెలుపోటములు ఆధారపడటం సహజం. అయితే వీటితో సంబంధం లేకుండా కోరి ఓటమి తెచ్చుకోవడాన్ని ‘స్వయంకృతం’ అంటారు. అదేమి చిత్రమో రాజకీయ చాణుక్యునిగా అందరూ పేర్కొనే టీడీపీ అధినేత చంద్రబాబును కొన్ని చోట్ల చేజేతులా ఓటమి కొని తెచ్చుకొనే నేతగా కొందరు ఉదహరిస్తారు. గత ఎన్నికల్లో జిల్లా పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ఇదే జరిగిందని, ఈ పరిణామాలకు చంద్రబాబు నిర్లక్ష్యమే కారణమనే వాదన ఉంది. విశేషమేంటే ఆ మూడు నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల ఏడాదిలోనూ తెలుగుదేశం పార్టీలో అదే రకమైన అనిశ్చితి కొనసాగుతోంది. గత ఎన్నికల సందర్భంగా ఆత్మకూరు, నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజక వర్గాల్లో చివరి నిమిషం వరకు ఇదే తరహా అనిశ్చితి కొనసాగగా, నాలుగున్నరేళ్ల కాలం తరువాత కూడా ఆ మూడు నియోజక వర్గాల్లో అదే సీన్‌ రిపీట్‌ అవుతోంది.
 
 
ఆత్మకూరు
పదేళ్లుగా ఆత్మకూరు టీడీపీలో నైరాశ్యం రాజ్యమేలుతోంది. 2009 నుంచి అక్కడ మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు పార్టీ ఇన్‌ చార్జిగా ఉన్నారు. ఆ ఎన్నికల ఫలితాల తరువాత కూడా రెండేళ్ల పాటు ఆయన నాయకత్వం కిందనే పార్టీ నడించింది. వివిధ కారణాల నేపథ్యంలో 2011 ప్రాంతంలో ఆ నియోజకవర్గానికి త్రిసభ్య కమిటీ వేశారు. ఆ కమిటీలో కొమ్మిని ఒక సభ్యుడ్ని చేశారు. దీనిని జీర్ణించుకోలేని లక్ష్మయ్యనాయుడు పార్టీకి దూరమయ్యారు.
 
 
ఆ తరువాత 2014 ఎన్నికల్లో అభ్యర్థి కోసం వెదుకులాడారు. నామినేషన్ల గడువు ఇక మూడు- నాలుగు రోజుల్లో ముగుస్తుందనంగా కన్నబాబును అభ్యర్థిగా ప్రకటించారు. చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించిన ఫలితంగా ఆ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ తరువాత రెండేళ్ల పాటు కన్నబాబే ఇన్‌చార్జిగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి తనవంతు ప్రయత్నం చేశారు. ఆ తర్వాతి పరి ణామాల్లో ఆనం రామ నారాయణరెడ్డి పార్టీలో చేరారు. ఆయన వచ్చీ రాగానే నియోజకవర్గ వ్యాప్తంగా మండల కమిటీలను రద్దుచేసి తన వారితో భర్తీ చేసుకున్నారు. దీంతో సంక్షోభం మొదలయింది. ఆనం సీనియర్‌ నాయకుడు కదా సర్దుకుంటారులే అనుకుంటే తీరా ఆయన వైసీపీలో చేరాలనే ఉద్దేశంతో ఏడాది ముందు నుంచే పార్టీని బలహీనపరచడం ప్రారంభించారు. పార్టీలో ఉంటారో, వెళతారో అంతుచిక్క కుండా ఎనిమిది నెలల కాలం గడిపి చివరికి వైసీపీ అధినేత జగన్‌ను కలిసి ఆ పార్టీలో చేరడానికి అనుమతి సంపాదించుకున్నారు. దీంతో ఆత్మకూరు తెలుగుదేశంలో మళ్లీ నాయకత్వ సంక్షోభం తలెత్తింది. అభ్యర్థి కోసం మళ్లీ గాలింపు చర్యలు మొదలయ్యాయి. ఈ గాలింపు ఎప్పటికి పూర్తవుతుందో. అభ్యర్థిని ఎప్పటికి ప్రకటిస్తారో అంతుబట్టడం లేదు. ఆత్మకూరు నియోజకవర్గం లో గత రెండు దశాబ్దాల కాలంగా ఒక బలమైన నాయకుణ్ని తయారు చేసుకోలేక పోవడం ఒక తప్పిదం కాగా, బలవంతులని నమ్మి ఇతర పార్టీల వారికి పెత్తనమివ్వడం మరో తప్పిదం. కారణాలు ఏమైతేనేం ఆత్మకూరులో టీడీపీ నాయకత్వ సంక్షోభంలో కూరుకు పోయింది. ఈసారి కూడా ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు వరకు అభ్యర్థి ఎవరో ప్రకటించే అవ కాశాలు లేవేమో అనే ఆవేదన ఆత్మకూరు టీడీపీ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
 
 
నెల్లూరు సిటీ
జిల్లాలో అత్యంత కీలకమైన నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా ఎన్నికల్లో బీజేపీకి సీటు ధారాదత్తం చేయడంతో తెలుగుదేశం క్యాడర్‌, నాయకత్వం నిర్వీర్యమైంది. గత ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బరిలోకి దిగారు. ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో తెలియక చివరి సమయంలో పక్క పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకుణ్ని తెచ్చుకొని టిక్కెట్టు ఇచ్చారు. అయినా గెలువలేకపోయారు. 2019 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా తెలుగుదేశం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అభ్యర్థిగా బరిలోకి దిగలానే ఉద్దేశ్యంతో మంత్రి నారాయణ నగరంలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టారు. అన్ని వర్గాలను, ప్రత్యేకించి మైనారిటీ వర్గాలను ఆకట్టుకోవడం కోసం పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. నగర పేదల కోసం 8 వేలకు పైగా పక్కా గృహాలు నిర్మిస్తున్నారు. పార్టీలో ఉన్న నాయకులను ఏకతాటిపైకి తెచ్చుకోవడం కోసం వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూర్చారు. ఈ ఎన్నికల్లో సిటీ నుంచి తెలుగుదేశం దీటైన పోటీ ఇస్తుందని అనుకునే సమయంలో బరిలోకి దిగే అభ్యర్థి విషయంలో సంశయం మొదలయింది. ఇంత కాలం మంత్రి నారాయణ పోటీ చేస్తారని అనుకుంటుండగా ఇప్పుడు పోటీ చేయరనే ప్రచారం మొదలయ్యింది. మంత్రి బరిలోకి దిగకపోతే తమకే ఆ సీటంటూ అర డజను మంది నాయకులు తలొకదిక్కున లోలోపల ప్రచారం చేసుకొంటున్నారు. దీంతో సిటీ తెలుగుదేశంలో మళ్లీ గందరగోళం ఏర్పడింది. ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి ఎవరు అనే విషయం ఇప్పట్లో బహిర్గతం అయ్యే సూచనలు కనిపించడం లేదు.
 
 
నెల్లూరు రూరల్
నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం విశేషం. 2009 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ మూడో స్థానానికి పరిమితం కాగా, గత ఎన్నికల్లో పొత్తుల క్రమంలో బీజేపీకి టిక్కెట్టు ఇవ్వడంతో నియోజకర్గ ప్రజలు సైకిల్‌ గుర్తును మరచిపోయే పరిస్థితి వచ్చింది. ఎన్నికల ఫలితాల తరువాత నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఆదాల ప్రభాకరరెడ్డిని నియమించారు. అయితే ఆయనను నియోజకవర్గ కార్యక్రమాలకు దూరంగా పెడుతూ వచ్చారు. దీంతో ఆయన అలిగి పట్టించుకోవడం మానేశారు. ఈ మధ్య పరిస్థితులు మారిన నేపథ్యంలో ఆయన రూరల్‌ నియోజకవర్గ టిక్కెట్టును ఆశించారు. కానీ ఆయనను ఎంపీ స్థానానికి పోటీ చేయమని అధిష్టానం కోరుతున్నట్టు చెబుతున్నారు. మరోవైపు గత కొద్ది రోజులుగా కొత్త ప్రచారం మొదలయింది. రూరల్‌ నుంచి పోటీ చేయడానికి ఆదాల వెనకడుగు వేస్తున్నారని, ఆయన మరో నియోజకవర్గం మీద ఆశ పడుతున్నారనేది ఒక ప్రచారం కాగా, మంత్రి నారాయణ రూరల్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఉందనేది మరో ప్రచారం. ఇన్నిరకాల ప్రచారాల మధ్య రూరల్‌ టీడీపీ అభ్యర్థి ఎవరనే విషయం అంతుపట్టక పార్టీ అభిమానులు తలలు పట్టుకొంటున్నారు.
 
 
అభ్యర్థులను ముందే ప్రకటించే సంస్కృతి తెలుగుదేశంలో లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్టు వస్తుందనే విషయంలో మాత్రం ముందే స్పష్టత ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మిగిలిన ఏడు నియోజకవర్గాల పరిధిలో తెలుగుదేశం అభ్యర్థుల విషయంలో ప్రస్తుతానికి స్పష్టత ఉన్నట్టే కనిపిస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రం రోజుకో ప్రచారంతో గందర గోళం నెలకొంది. ఒకవైపు ఈ మూడు నియోజకవర్గాల నుంచి వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏడాదికి ముందు నుంచే ఇంటింటి ప్రచారం మొదలు పెట్టగా, తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం తమ దిక్కు చూసే నాయకుడు లేక సతమతమౌతున్నారు. ఈ మూడు నియో జకవర్గాల పరిధిలో గత ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకత్వ విషయంలో కనిపించిన గందరగోళమే ఇప్పుడూ కనిపించడంతో అధిష్టానం చేజేతులా నష్టం తెచ్చుకొంటోందేమోనన్న భయం టీడీపీ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
Link to comment
Share on other sites

ఆనంకు టికెట్ విషయంలో తేల్చి చెప్పిన వైసీపీ అధిష్టానం!
25-07-2018 12:03:59
 
636681170384279712.jpg
  • వెంకటగిరిలో వేడెక్కుతున్న వైసీపీ రాజకీయం
  • సర్వే ఆధారంగానే టికెట్‌ అంటున్న అధిష్టానం
 
వెంకటగిరి, డక్కిలి(నెల్లూరు జిల్లా): జిల్లాలోనే వెంకటగిరి రాజకీయాలు విభిన్నంగా వుంటాయి. ఇక్కడి ఓటర్లకు నచ్చితే సామాన్యుడికైనా ఓటువేస్తారు. నచ్చకపోతే ఎంతటి హేమాహేమీలనైనా ఓడిస్తారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన నాయకుడికైనా.. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సాదాసీదా వ్యక్తికైనా ఒకే రకం గుర్తింపు ఇవ్వడం వెంకటగిరి ఓటర్ల ప్రత్యేకత. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డిని, రాజకీయాలకు దూరంగా వున్న వెంకటగిరి రాజా వివివి ఆర్‌కే యాచేంద్రను భారీ మెజార్టితో ఓడించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మిని 2009 ఎన్నికల్లో సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన టీడీపీ నాయకుడు కురుగొండ్ల రామకృష్ణ ఓడించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇలా విభిన్న తీర్పు ఇచ్చే వెంకటగిరి ఓటర్ల ఎదుట ఈ దఫా సరికొత్త రాజకీయ ముఖచిత్రం ఆవిష్కృతం కానుంది.
 
 
గత నాలుగేళ్లుగా వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వెంకటగిరి టికెట్‌పై గంపెడు ఆశలతో ముందుకు సాగుతున్నారు. ఈ దశలో మాజీ మంత్రి ఆనం రామయనారాయణరెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధపడడంతో వెంకటగిరి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆత్మకూరును తమకు బలమైన నియోజకవర్గంగా ఆనం భావిస్తున్నా, అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డికి తిరిగి టికెట్‌ ఇచ్చే అవకాశాలు ఉండటంతో ఆనం ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ మొదలైంది. ఆయనకు ప్రత్యామ్నాయంగా వెంకటగిరి సీటు కనిపిస్తున్నా, ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ముగ్గురు నాయకులు ఈ టికెట్‌ ఆశిస్తున్నారు.
 
నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ టికెట్‌ ఆశిస్తున్నారు. మరోవైపు బెంగుళూరులో పారిశ్రామిక వేత్తగా స్థిరపడిన డక్కిలి మండలం చాపలపల్లి గ్రామానికి చెందిన కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అటు నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా వైసీపీ టికెట్‌ను పలువురు ఆశిస్తుండంతో వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి.
 
 
సర్వేల ఆధారంగానే వైసీపీ టికెట్‌లు
గత అసెంబ్లీ ఎన్నికల్లో తొందరపడి టికెట్లు కేటాయించడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్న ఆలోచన వైసీపీ అధిష్ఠానంలో వుంది. గతంలో పలు టికెట్లు నియోజకవర్గ ఇన్‌చార్జిలకే ఇవ్వడం వల్ల అధికారం కోల్పోయామన్న భావన ఆ పార్టీలో వుంది. అందుకే ఈ దఫా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రకాల సర్వేలు, సామాజిక వర్గాల సముతుల్యత వంటి అంశాలు ఆధారం చేసుకొని టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటగిరి వైసీపీ టికెట్‌ ఎవరికి ఇస్తారన్నది ముందు గానే ఊహించలేమని, సర్వే ఫలితాల ఆధారంగానే టికెట్ల పంపిణీ జరగడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా ఆగస్టు 11 లోపు అభ్యర్థిత్వం తేలిపోతుందని భావిస్తున్నారు.
 
 
ఆనం రామనారాయణరెడ్డికి టికెట్‌ ఇవ్వాల్సి వస్తే.. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం ప్రాంతాల్లో అనుచరవర్గం వుంది. వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాల్లో వైసీపీ క్యాడరు బలహీనంగా కనిపిస్తున్నా పాత కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఆయన ఏ మేరకు తన వైపు తిప్పుకోగలుగుతారన్న రాజకీయ చర్చ జరుగుతోంది. రాపూరులో బలమైన నాయకుడు, రాపూరు మాజీ ఏఎంసీ చైర్మన్‌ చెన్నుబాలకృష్ణారెడ్డి ఒకప్పుడు ఆనంకు ముఖ్య అనుచరుడు. ఆయన ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతూ ఎమ్మెల్యే రామకృష్ణకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఇక రాపూరులోని ఆయన అనుచరుల్లో ఎక్కువ మంది టీడీపీ వైపు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సైదాపురం మండలంలో ఉన్న కొంత మంది నాయకులు ఆనంకు దగ్గరగా వున్నా ప్రస్తుత రాజకీయాలను బట్టి ఆయనకు దూరంగా వుంటున్నారు.
 
 
కలువాయి మండలంలో ఆయనకు అంత పట్టు లేదన్న వాదన వుంది. వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాల్లో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ నాయకులతో పాటు కొత్తవారిని ఏమేరకు రాబట్టుకో గలుగుతారన్న సంశయం వైసీపీ వర్గాల నుంచి వినవస్తోంది. మరోవైపు వెంకట గిరి వైసీపీ టికెట్‌ ఆశిస్తున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి కలువాయి మండలంలో మంచి పట్టువుంది. అయితే ఈ పట్టును ఎన్నికల వరకు ఏ విధంగా కొనసాగిస్తారో వేచిచూడాలి. అలాగే వెంకటగిరి మండలంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నా కార్యకర్తలు, నాయకులను ఒకే తాటిపైకి తేలేకపోతున్నారు. దీంతో అన్ని వార్డుల్లో వర్గ విబేధాలు స్పష్టంగా కపిస్తున్నాయి. ఇక సైదాపురం, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, వెంకటగిరిరూరల్‌ మండలాల్లో వైసీపీ క్యాడర్‌లో తగినంత ఉత్సాహం నింపలేకపోతున్నారు.
 
 
నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డికి వెంకటగిరిలోని నాయకులతో పాత పరిచయాలు వున్నాయి. అంతేగాక ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరినా తన అనుచరులను కాపాడుకొంటూ వస్తున్నారు. నేదురుమల్లి కుటుంబానికి వెంకటగిరి నియోజకవర్గంలో మంచి పట్టువుంది. దీని ఆధారంగానే ఆయన వైసీపీ టికెట్‌ ఆశిస్తున్నారు.
 
 
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నేదురుమల్లి అనుచరులు పలు పార్టీల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ విశాల నియోజకవర్గంలో గెలుపునకు తగినంత బలం ఆయనకు ఉందా అన్నది సందేహమే. మరోవైపు స్థానికుడైన కలిమిలి రాంప్రసాద్‌ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన తనకు పార్టీ అధిష్ఠానంలో సన్నిహితంగా కొందరు ముఖ్య నాయకుల ద్వారా టికెట్‌ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకటగిరిలో తనకంటూ ఒక వర్గం ఏర్పరుచుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఈ నలుగురిలో వైసీపీ అధిష్టానం ఎవరిని ఆశీర్వదిస్తుదో వేచి చూడాలి.
Link to comment
Share on other sites

2019 ఎన్నికల్లో మాజీ ఎంపీ మేకపాటికి ఎదురీత తప్పదా!?
28-07-2018 13:14:12
 
636683804518295984.jpg
  • మేకపాటిపై ఓటర్లలో తగ్గుతున్న మోజు
  • గత ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో సరి!
  • ఈసారి కనిపించని ఆనాటి అనుకూలతలు
  • మరోమారు గెలుపు నల్లేరుపై నడక కాబోదు!
‘‘ 2019 ఎన్నికల్లో కూడా నెల్లూరు పార్లమెంట్‌ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నాను. ఇవి నా చివరి ఎన్నికలు. ఆశీర్వదించండి’’.. గత కొంత కాలంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి కార్యకర్తల సమావేశాల్లో అంటున్న మాటలివి. అయితే.. గత ఎన్నికల్లో పదమూడున్నర వేల స్వల్ప మెజారిటీతో బయటపడిన మేకపాటికి ఈసారి ఎదురీత తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల్లూరు పార్లమెంట్‌ స్థానం నుంచి మూడుసార్లు ఎన్నికై అత్యధిక.. అత్యల్ప ఆధిక్యత రికార్డులు రెండూ కైవసం చేసుకున్న మేకపాటికి 2019 ఎన్నికలు ఏమంత ఈజీ కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. లోక్‌సభా స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బలాబలాల్లో వచ్చిన మార్పులు, గత ఎన్నికల సమయంలో రాజకీయంగా కనిపించిన అనుకూలతలు ఈసారి కనిపించకపోవడం, ఎంపీగా గత నాలుగేళ్ల కాలంలో సాధించిన విజయాలు చెప్పుకోదగ్గవి ఏమీ లేకపోవడం రాబోయే ఎన్నికల్లో రాజమోహన్‌రెడ్డికి ప్రతిబంధకాలుగా మిగులుతాయని పరిశీలకులు భావిస్తున్నారు.
 
 
నెల్లూరు: సౌమ్యుడు. మితభాషి. సీనియర్‌ నాయకుడు. పెద్దాయన...గా ప్రజానీకం అభివర్ణించే నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డికి మరోమారు గెలుపు నల్లేరుపై నడక అవుతుందా? ఎదురీత తప్పదా??. గత మూడు ఎన్నికల్లో వరుసగా గెలవడంతో జనంలో తగ్గిన క్రేజ్‌, పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో బలాబలాల్లో వచ్చిన మార్పులు చూస్తే.. ఎదురీత తప్పదనే భావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో రాజకీయంగా కనిపించిన అనుకూలతలు ఈసారి కనిపించకపోవడం, ఎంపీగా గత నాలుగేళ్ల కాలంలో సాధించిన విజయాలు గట్టిగా చెప్పుకొనేందుకు ఏమీ లేకపోవడం రాబోయే ఎన్నికల్లో రాజమోహన్‌రెడ్డికి ప్రతిబంధకాలుగా మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 
 
2014 ఎన్నికలకే తగ్గిన ప్రాభవం
వైసీపీకి జిల్లాలో తొలి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి. వైసీపీ ఆవిర్భావం తరువాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా 2,91,745 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దానికి ముందు 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా 54,993 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జగన్‌ పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరి ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి భారీ మెజారిటీతో గెలు పొందారు. అయితే ఆ రెండేళ్ల తరువాత 2014లో జరిగిన ఎ న్నికల్లో గెలిచారు కానీ.. మెజారిటీ భారీగా తగ్గిపోయింది. కేవ లం 13,478 ఓట్ల ఆఽధిక్యంతో అతి కష్టం మీద గెలుపొందారు.
 
విశేషమేమంటే నెల్లూరు ఎంపీ ఎన్నికల చరిత్రలో అత్యంత భారీ మెజారిటీ, అత్యంత స్వల్ప మెజారిటీ సాధించిన ఎంపీగా మేకపాటి చరిత్ర సృష్టించారు. గత ఎన్నికల మెజారిటీని గమనిస్తే 2014 నాటికే ప్రజల్లో ఆయన పరపతి కొంత తగ్గిందనిపిస్తుంది. ఇదే నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ ఎమ్మెల్యేలకు మొత్తం 73,500 ఓట్ట మెజారిటీ వచ్చింది. వాస్తవానికి కొంచెం అటు ఇటుగా ఎంపీ అభ్యర్థికీ ఇదే మెజారిటీ రావాలి. అయితే ఎంపీ విషయానికి వచ్చే సరికి 60వేల ఓట్లు తగ్గాయి. 2012 ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మేకపాటికి రెండేళ్ల తేడాతో జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల కన్నా 60వేల ఓట్లు తక్కువ రావడం గమనిస్తే అప్పటికే మేకపాటిపై జనానికి మోజు తగ్గినట్లు స్పష్టమవుతోంది.
 
 
ఆనాటి అనుకూలతలేవీ.!?
2014 ఎన్నికల్లో వైసీపీకి నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో కనిపించిన అనుకూలతలు ప్రస్తుతం కనిపించడం లేదు. అప్పుడు వైసీపీ గాలి బలంగా వీస్తోంది. పార్లమెంట్‌ నియో జకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదింటిలో వైసీ పీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాల్లో ఆ విధమైన వాతావరణం కనిపించడం లేదు. వైసీపీ నుంచి గెలిచిన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు టీడీపీలో చేరిపోయారు. మేకపాటి కోరి తెచ్చుకున్న మహిధర్‌రెడ్డి చాలాకాలంగా వైసీపీ క్యాడర్‌కు దూరంగా ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మహీధర్‌రెడ్డి వైసీపీ క్యాడర్‌ పట్ల కాస్త కటువుగానే వ్యవహరించారు. 2014 ఎన్నికల తరువాత గత నాలుగేళ్లు ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయించుకోలేక దూరంగా ఉండిపో యారు. చివరికి ఎనిమిదేళ్ళ తరువాత వైసీపీలోకి వచ్చిన ఆయన పట్ల ఆ పార్టీ క్యాడర్‌లో ఏమంత ఆసక్తి కని పించ డం లేదు. మంత్రిగా చేసిన అభివృద్ధి పనులతో మహిధర్‌ రెడ్డికి ప్రజల్లో మంచి పేరు ఉన్నా, పార్టీ క్యాడర్‌ మాత్రం ఈయన పట్టుకిందకు రావడం లేదు.
 
ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి మేకపాటి పెద్దగా ఆశించడానికి ఏమీ ఉండదు. గత ఎన్నికల్లో మేకపాటికి బలమిచ్చిన నియోజకవర్గాల్లో ఆత్మకూరు ఒకటి. చివరి నిమిషంలో టీడీపీ అభ్యర్థి ఖరారు కావడం, బలమైన పోటీ ఇవ్వలేకపోవడం మేకపాటికి గెలుపునకు అనుకూలించిన ప్రధానాంశం. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. నాయకుల మోసంతో ఆ నియోజకవర్గ టీడీపీ క్యాడర్‌ కసిగా పనిచేయడానికి సిద్ధమవుతోంది. అభ్యర్థి విషయం లోనూ టీడీపీ అధిష్టానం ఆచితూచి అడుగేస్తోంది. వీలైనంత త్వరలో నియోజకవర్గ ఇన్‌చార్జిని ప్రకటించ నుంది. ఈ పరిస్థితుల్లో గత ఎన్నికల నాటి మెజారిటీని మరోసారి ఊహించడం కష్టమే.
 
 
ఇక రాజమోహన్‌రెడ్డి సోదరుడు పోటీ చేయనున్న ఉదయగిరి నియోజకవర్గంలోనూ పోటీ హోరాహోరీగా ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ‘సైకిల్‌’ సింబల్‌ లేదు. పొత్తుల్లో భాగంగా ఈ సీటును బీజేపికి ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో రూరల్‌లో తెలుగుదేశం అభ్యర్థి బరిలో ఉంటారు. ఇటు నెల్లూరు సిటీలోనూ కచ్చితంగా గత ఎన్నికల కన్నా టీడీపీ బలమైన పోటీనే ఇస్తుంది. ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన అభ్యర్థి ఇక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం పక్కనున్న రూరల్‌ నియోజకవర్గం పైనా పడుతుంది. ఈ లెక్కన ఇక్కడా అప్పటి మెజారిటీలు కష్టమే. ఇక కావలి నియోజకవర్గంలో కూడా సీన్‌ మారింది. వైసీపీలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ రోజు పరిస్థితులతో అంచనా వేస్తే ఇక్కడి నుంచి మెజా రిటీ ఆశించడం అత్యాశే అవుతుంది. కోవూరు నియోజక వర్గంలోనూ టీడీపీ బలంగానే కనిపిస్తోన్న నేపథ్యంలో భారీ మెజారిటీలో కష్టమే!.
 
 
సొంత బలం అంతంత మాత్రంగానే..
అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఇలా ఉండగా.. మేక పాటి రాజమోహన్‌రెడ్డి సొంత ఇమేజ్‌ కలిసొస్తుందా అంటే అలాంటి సూచనలూ కనిపించడం లేదు. వైసీపీ అధినేత పిలుపు మేరకు పార్లమెంట్‌ స్థానానికి రాజీనామా చేయడం, ప్రత్యేక హోదా కోసం కొన్ని గంటలు నిరాహార దీక్ష చేయడం మినహా ఈ నాలుగేళ్ల కాలంలో గుర్తుంచుకొని, చర్చించుకు నేంతటి సాధన ఏమీ లేదనే విమర్శలున్నాయి. మూడు పర్యాయాల పదవీ కాలంలో గట్టిగా చెప్పుకోవడానికి ఏ అభివృద్ధి పని మిగలలేదు. ఇప్పటి వరకు ఈయనకు కనిపిస్తున్న అనుకూలత ఏదైనా ఉందా అంటే అధికార పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థి విషయంలో స్పష్టత కనిపించకపోవడం ఒక్క టే.
 
టీడీపీ అభ్యర్థి విషయంలో చివరి నిమిషం వరకూ ఇదే నాన్చుడు ధోరణి కొనసాగిస్తే.. ఆ పరిస్థితి మేకపాటికి ఎంతో కొంత అనుకూలించే అవకాశం లేకపోలేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మరోసారి ఎంపీ స్థానానికి పోటీకి దిగుతున్నారు. ఇదే తన చివరి ఎన్నికగా చెప్పుకొంటున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అను భవించిన మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ఈ చివరి ఎన్నికలు ఎలాంటి ఫలితాలను రుచి చూపించబోతాయో వేచి చూడాలి.
Link to comment
Share on other sites

డీపీకి రాజీనామా చేసే యోచనలో కన్నబాబు?
30-07-2018 13:28:08
 
636685540889257721.jpg
  • నేడు ఆదాల పర్యటన
  • కన్నబాబు వర్గం ఆగ్రహం
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నాయకత్వ లేమితో కునారిల్లుతున్న ఆత్మకూరు తెలుగుదేశం పార్టీలో తాజాగా అంతర్గత పోరు పురుడుపోసుకుంది. పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకరరెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారనే ప్రచారం ఆత్మకూరు స్థానిక నాయకులను ఆవేదనకు గురిచేస్తోంది. అదే సమయంలో సోమవారం ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటనకు ఆదాల రంగం సిద్దం చేసుకోవడం, ఆ పర్యటన గురించి మాటమాత్రమైనా తమకు సమాచారం ఇవ్వలేదని కన్నబాబు వర్గం ఆగ్రహా వేశాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి నిష్క్రమణ తరువాత నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తున్న తరుణంలో జిల్లా టీడీపీ నాయకుల వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఆత్మకూరు వేదికగా చేసుకొని బల ప్రదర్శనకు దిగడం పార్టీ శ్రేణులను ఆవేదనకు గురిచేస్తోంది. ఆత్మకూరు తెలుగుదేశం బలోపేతం విషయంలో అధిష్ఠానం ఆలోచనలు, దానికి విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు, ఈ వైఫల్యంలో జిల్లా మంత్రులను భాగస్వామ్యులను చేస్తూ ప్రచారం సాగుతోంది.
 
 
ఆచితూచి అడుగులు
ఆత్మకూరు నుంచి గెలుపు సాధించాలనే లక్ష్యంతో టీడీపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలనే ఉద్దేశంతో పావులు కదుపుతోంది. ఈ క్రమంలో సమర్థులైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలయ్యింది. నియోజకవర్గం పరిధిలోని మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, బొల్లినేని కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతోంది. కొమ్మి, బొల్లినేనిల మధ్య మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో వీరిద్దరు కలిస్తే బలమైన అభ్యర్థి అవుతారనేది పార్టీ ఉద్దేశం. దీంతో పాటు ప్రత్యర్థి పార్టీల నుంచి కొత్త నాయకులు పార్టీలోకి వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తోంది. వైసీపీలో చేరుతున్న ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేయబోయే నియోజక వర్గాన్ని ఆధారంగా చేసుకొని పావులు కదపడానికి అధిష్ఠానం వేచి చూస్తోంది.
 
 
ఆనంకు వెంకటగిరి కేటాయించే పక్షంలో ఆ నియోజకవర్గ వైసీపీలో ఊహించని పరిణామాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది టీడీపీ అధిష్ఠానం ఆలోచన. ఈ కారణాల నేపథ్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకాన్ని కొంత కాలం వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలోని ముగ్గురు, ఐదుగురు నాయకులతో కమిటీ వేయాలనే ప్రతిపాదనను అక్కడి పార్టీ శ్రేణులు వ్యతిరేకించడంతో ఒకే సరి బలమైన అభ్యర్థిని ఇన్‌చార్జిని నియమించాలని, అతనినే అభ్యర్థిగా ప్రకటించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించుకుంది. ఇన్‌చార్జి విషయంలో కొత్త నేతల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించని పరిస్థితుల్లో ప్రస్తుతం నియోజకవర్గంలో కీలక నాయకులుగా ఉన్న కన్నబాబు, డీసీసీబీ చైర్మన్‌ మెట్టుకూరు ధనంజయరెడ్డిల పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయి. మొత్తంపై వైసీపీలో ఆనం సస్పెన్స్‌కు తెర పడే వరకు ఆత్మకూరు టీడీపీ ఇన్‌చార్జిని ప్రకటించే ఆలోచనలు లేవు.
 
 
ఐదుగురితో కమిటీ
అప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు, పార్టీ బలోపేతం తదితరాలను పర్యవేక్షించడానికి ఐదుగురు నాయకులతో అధిష్ఠానం ఒక కమిటీ వేసింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అమరనాథ్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, పార్లమెంట్‌ పరిశీలకులు ఎరిక్సన్‌బాబు, పార్లమెంట్‌ పార్టీ వ్యవహారాల కార్యదర్శి ఆమంచి కృష్ణమోహన్‌, నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకరరెడ్డిలతో రాష్ట్ర పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను చూస్తున్న కన్న బాబు, ధనంజయరెడ్డిలను సమన్వయపరుచుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఈ కమిటీకి అధిష్ఠానం సూచించింది. వాస్తవాలు ఇలా ఉండగా మూడు నాలుగు రోజులుగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఆదాల ప్రభాకరరెడ్డిని నియమించారనే ప్రచారం ఊపందుకుంది. సోషల్‌ మీడియాలో ఆ ప్రచారం హల్‌చల్‌ చేసింది. ఆత్మకూరు నుంచి ఆదాల పోటీ చేస్తారనే స్థాయి వరకు రకరకాల ప్రచా రాలు ఊపందుకున్నాయి. ఇవి ఆత్మకూరు ఇన్‌చార్జి పదవి పై ఆశలు పెట్టుకున్న కన్నబాబు, ధనంజయరెడ్డి వర్గాలను కలవరపాటుకు, అసహనానికి గురిచేసినట్లు తెలుస్తోంది.
 
 
రాజీనామాల ప్రచారం
సోమవారం ఆత్మకూరులో ఆదాల పర్యటించనున్నారనే సమాచారం కన్నబాబు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఈ పర్యటనకు సంబంధించి మాజీ మంత్రి ఆదాల మాట మాత్రంగా కూడా తమకు సమాచారం ఇవ్వలేదని, ఇది తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, ఉద్దేశపూర్వకంగానే తనను నిర్లక్ష్యం చేశారని కన్నబాబు ఆంధ్రజ్యోతితో ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాల వ్యవహారశైలికి నిరసనగా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకొంటున్నట్లు కన్నబాబు వర్గం తెలిపింది. అసలు ఆదాలను నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎవరు ప్రకటించారు..? పార్టీ అలాంటి ఉత్తర్వులు ఏవి ఇవ్వన్నప్పుడు తమ నియోజకవర్గంలో, తమను వెలివేసి నట్లు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటీ, వీటికి మంత్రి నారాయణ హాజరు కావడం ఎంత వరకు న్యాయమని కన్నబాబు వర్గం ప్రశ్నిస్తోంది.
 
 
మంత్రులపై నిందలు
ఆత్మకూరు వ్యవహారంలో తెలిసో తెలియకో జిల్లా మంత్రులు సోమిరెడ్డి, నారాయణలు పార్టీ అభిమానుల ముందు దోషులుగా నిలబడుతున్నారు. మంత్రి సోమిరెడ్డి కన్నబాబును వెనకేసుకొని వస్తున్నారని, ఆయనను వెంటబెట్టుకొని పర్యటిస్తున్నారని జిల్లా పార్టీలో ఒక వర్గం ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన కొన్ని సంఘటనల నేపధ్యంలో ఆదాలకు కన్నబాబు అంటే ఇష్టం లేదని, ఆ కారణం గానే కన్నబాబును ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో ఆదాలకు మంత్రి నారాయణ సపోర్టు ఉందనే ప్రచారం కూడా జిల్లా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఈ ప్రచారాలు, వాదనల్లో వాస్తవాలు ఉన్నా లేకున్నా, జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మాత్రం నిందలు మోయాల్సి వస్తోంది. ఇప్పటికే చితికిపోయిన ఆత్మకూరు తెలుగుదేశం క్యాడర్‌ను బతికించుకునే విధంగా సమిష్టిగా శ్రమించాల్సిన అవసరం ఉంది.
Link to comment
Share on other sites

మంత్రి నారాయణ ఎంట్రీతో ఆత్మకూరు వివాదం సుఖాంతమైంది.. కానీ...!!
31-07-2018 13:26:40
 
636686404011219546.jpg
  • గెలుపే ధ్యేయం
  • త్వరలో ఆత్మకూరు ఇన్‌చార్జి నియామకం
  • అప్పటి వరకు ఆదాల పర్యవేక్షణ
  • మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బీద
ఆత్మకూరు: ‘ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు కొదవలేదు. అలాగే నాయకత్వానికీ లోటు లేదు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ శ్రేయస్సు కోసమే. ముందుగా త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించుకున్నాం. అందుకు ఆత్మకూరు నేతలు అంగీకరించకపోవడంతో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. అందరికి ఆమోద యోగ్యమైన వ్యక్తిని త్వరలో నిర్ణయిస్తాం. అప్పటి వరకు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని చూసుకుంటారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ కార్య క్రమాలు కొనసాగుతాయి. 2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజక వర్గంలో తిరిగి టీడీపీ జెండాను ఎగరేసేం దుకు సమష్టిగా కృషి చేద్దాం’ అని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అన్నారు.
 Untitled-20.jpg
 
సోమవారం ఆత్మకూరులో జరిగిన పార్టీ కార్య కర్తల సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలోని రవితేజ కల్యాణ మండపంలో సోమవారం నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జి గూటూరు మురళీ కన్న బాబు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడుతూ ఆత్మకూరు నియోజక వర్గా నికి శాశ్వత ఇన్‌చార్జిని నియమించే వరకు ముగ్గురు రాష్ట్ర మంత్రులు, జిల్లా అధ్యక్షుడి సమన్వయంతో పార్లమెంటు ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, స్థానిక నేతలు గూటూరు మురళీకన్నబాబు, మెట్టుకూరు ధనుంజయరెడ్డిని కలుపుకొని కార్యక్ర మాలను కొనసాగిస్తారన్నారు. సీఎం తీసు కున్న నిర్ణయానికి ప్రతిఒక్కరూ కంకణ బద్ధులు కావాలని కోరారు.
 
 
మున్సిపల్‌ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ త్వరలో సీఎం చంద్ర బాబు సర్వే నిర్వహించి అందరికి అమోద యోగ్యమైన వ్యక్తిని నియోజకవర్గ ఇన్‌ చార్జిగా నిర్ణయిస్తారని తెలిపారు. ఈ లోపు ఆదాల ప్రభాకర్‌రెడ్డిని పరిస్థితులను చక్క దిద్దనున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్ని కల్లో అభ్యర్ధిని గెలుపొందించే దిశగా పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు కదలాలని కోరారు.
 
 
పార్టీ పటిష్టతకు కృషి
నియోజకవర్గంలో టీడీపీ పటిష్టతకు అందరి సమన్వయంతో ముందుకెళ్తామని పార్లమెంటు ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో టీడీపీకి మెజార్టీ ఉందని, మరో రెండు మండలాల్లో సరిదిద్దాల్సి ఉందన్నారు. పార్టీలో చిన్న చిన్న విభేదాలున్నా వీధి కెక్కకుండా పరిష్కరించుకోవాల్సి ఉందని తెలిపారు. డీసీసీబీ ఛైర్మన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో దీర్ఘ కాలిక సమ స్యలు పరిష్కారం కావాలంటే ఆ త్మకూరు ప్రాంతీయుడు ఎమ్మెల్యే అయితేనే పరి ష్కారం అవుతాయన్నారు.
 
 
సభ విజయవంతం
టీడీపీ నాయకుడు గూటూరు మురళీ కన్నబాబు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నిరాహారదీక్ష చేపట్టిన నేపథ్యంలో ఆత్మకూరులో జరిగిన సమావేశం విజయవంతం అయింది. ఈ సభ విజయవంతా నికి మెట్టుకూరు ధనుంజయరెడ్డి, ఆదాల వర్గీయులు వ్యూహాత్మకంగా పనిచేశారు. అధిష్ఠానం ఆదేశాల మేర జిల్లా నేతలు గూటూరు మురళీకన్నబాబుతో సంప్రదిం పుల్లో నిమగ్నమయ్యారు. దాంతో ఉదయం 10.30 గంటలకు జరగాల్సిన సమావేశం ఆలస్యమైంది. ఎట్టకేలకు మురళీకన్నబాబు నిరసనను విరమింపజేసి సమావేశానికి తీసుకురావడంతో కన్నబాబు వర్గీయులు సైతం హాజరయ్యారు.
 
 
ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టీడీపీ జిల్లా ఉపాధ్యాక్షుడు ఆనం జయకుమార్‌రెడ్డి, చండ్రా వెంకటసుబ్బానాయుడు, జీ లక్ష్మినరసయ్యయాదవ్‌, సోమశిల ప్రాజెక్టు చైర్మన్‌ రాపూరు సుందరరామి రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాగి వనమ్మ, వైస్‌ చైర్మన్‌ తుమ్మల చంద్రారెడ్డి, దర్గా కమిటీ అధ్యక్షుడు హయ్యద్‌బాషా నుడా డైరెక్టర్‌ షేక్‌.ఖా జావలి, బీసీ సెల్‌ అధ్యక్షురాలు పెరుమాళ్ల పద్మజాయాదవ్‌, జిల్లా కార్యదర్శులు గంగపట్నం చంద్రశేఖరయ్య, అన్నలూరు శ్రీనివాసులు నాయుడు, డబ్బుగుంట వెంకటేశ్వర్లు, అల్లంపాటి జనార్దన్‌ రెడ్డి, పాళెం పోలయ్య, విజయ డెయిరీ ఛైర్మన్‌ కే రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...