Jump to content

Nellore Politics


Recommended Posts

చంద్రబాబు సూపర్ ప్లాన్‌తో.. కంచుకోటలో వైసీపీకి కష్టాలేనా..?
01-08-2018 12:18:36
 
636687227171888198.jpg
  • నాడు బొల్లినేని వర్సెస్‌ కొమ్మి
  • నేడు మేకపాటి వర్సెస్‌ బొల్లినేని
  • ఆత్మకూరులో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు
ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండల పరిధిలోని ఒక పంచాయతీ కేంద్రం మాముడూరు. ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆ పంచాయతీ సర్పంచ్‌ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే మేకపాటి గౌతం రెడ్డి మంగళవారం గ్రామంలోకి వెళ్లారు. అయితే ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్‌ అనుమతి లేనిదే ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలు ప్రారంభోత్స వాలు, శంకుస్థాపనలు చేయడానికి వీలు లేదని, అయితే అందుకు విరుద్ధంగా కలెక్టర్‌ అనుమతి లేకుండా ఈ పనులను ప్రారంభించడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పోలీసులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. దీంతో పెద్ద ఎత్తున తరలివెళ్లిన పోలీసు బలగాలు ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను అడ్డుకున్నాయి. చేసేది లేక ఎమ్మెల్యే మౌనంగా వెనుతిరిగారు.
 
ఈ ప్రహసనం వెనుక.. ఓ రాజకీయ గతం ఉంది. మాముడూరు కేంద్రంగానే గతంలోనూ తలెత్తిన మిత్రభేదాలు నియోజకవర్గ రాజకీయ స్వరూపాన్నే మార్చేసిన చరిత్ర దాగుంది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే ఊరు కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇద్దరు మంచి మిత్రులను బద్ధ శత్రువులను చేశాయి. బలాబలాలు తేల్చుకోవడం కోసం ఆ ఇద్దరూ శాసనసభ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు అదే సీన్‌ రిపీట్‌ అవుతున్న దృశ్యం అందరిక కళ్లలో మెదలాడుతోంది. నాడు బొల్లినేని వర్సెస్‌ కొమ్మి!.. నేడు మేకపాటి వర్సెస్‌ బొల్లినేని!!
 
 
నెల్లూరు: చేజర్ల మండలం... మాముడూరు. ఈ ఊరు మిత్రభేదాలు సృష్టిస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం.. ఇదే ఊరు కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇద్దరు మంచి మిత్రులను బద్ధ శత్రువులను చేశాయి. బలాబలాలు తేల్చు కోవడం కోసం శాసనసభ ఎన్నికలను వేదికగా చేసుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అదే సీన్‌ రిపీట్‌ అవుతోంది. ఈ ఊరు కేం ద్రంగా మంచి మిత్రుల మధ్య మళ్లీ శత్రుత్వానికి బీజం పడింది. రాబోయే ఎన్నికల్లో ఈ ఇద్దరు మిత్రులను ప్రత్యర్థులుగా బరిలో నిలబెట్టే అవకాశానికి దారితీస్తోంది!.
 
సరిగ్గా 20 ఏళ్ల క్రితం..
మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు మాముడూరు సొంత గ్రామం. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం బొల్లినేనిని కాదని అప్పటి ఎమ్మెల్యే కొమ్మిలక్ష్మయ్య నాయుడు ఈ గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ఒక్క కారణంతో అప్పటి వరకు మిత్రులుగా ఉన్న కొమ్మి, బొల్లినేని కుటుంబాలు శత్రువులుగా మారిపోయాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వం కూడా లెక్కచే యకుండా బొల్లినేని కుటుంబాన్ని 1999 ఎన్నికల్లో పోటీ చేసేలా చేశాయి. ఆ ఎన్నికల్లో బొల్లినేని కృ ష్ణయ్య కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి కొమ్మి లక్ష్మయ్య నాయుడును ఓడించారు. తమ గ్రామంలో తమను లెక్కచేయలేదన్న ఒకే ఒక్క కారణం ఆ మిత్రులను ప్రత్యర్థులను చేసింది. బంధుత్వాలను తెంచుకునేటంతటి పగను రగిలించింది. బొల్లినేని కృష్ణయ్యను ప్రత్యక్ష ఎన్నికల వైపుకు ప్రేరేపించింది.
 
నేడు అదే సీన్‌!
స్థలం మాముడూరే. సందర్భం.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలే.. ఒకే గ్రామం.. ఒకే సందర్భం.. 20 ఏళ్ల తరువాత అదే వాతావరణాన్ని తీసుకొచ్చాయి. మేకపాటి రాజ మోహన్‌రెడ్డి, బొల్లినేని కృష్ణయ్యలది ఎన్నో ఏళ్ల స్నేహం. వీరిద్దరి పేర్లు కలిసి వచ్చేలా కేఎంసీ (కృష్ణయ్య, రాజమోహన్‌ కన్‌స్ట్రక్షన్స్‌) పేరుతో సంస్థలను ప్రారంభించి చాలా ఏళ్లు వ్యాపారం చేశారు. మొన్నటి వరకు ఈ స్నేహం అలాగే కొనసాగుతోంది. 2014 ఎన్నికల్లో బొల్లినేని కృష్ణయ్యను పార్టీలోకి ఆకర్షించడానికి చంద్రబాబు ఎంతో ప్రయత్నించారు. అయితే మేకపాటి కుటుంబంతో ఉన్న స్నేహ సంబంధాల కారణంగా బొల్లినేని టీడీపీలో చేరడానికి నిరాకరించారు. ఆ ఎన్నికల్లో మౌనంగా ఉండిపోయారు.
 
అయితే మాముడూరు కేంద్రంగానే ఈ స్నేహ సంబంధం తెగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మాముడూరు, పక్క గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించి ముగ్గురు మంత్రులులతో భారీ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, అందుకు వీలుగా ప్రొటోకాల్‌ ప్రకారం తేది ఖరారు చేయాలని బొల్లినేని కృష్ణయ్య, ఆయన అనుచరులైన స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆ తేది ఖరారు కాకముందే హడావుడిగా సర్పంచ్‌ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి మంగళవారం ప్రారంభోత్సవాలకు ప్రయత్నించారని, ఈ క్రమంలో వీటిని అడ్డుకోవాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
 
మారనున్న రాజకీయ సమీకరణలు
మాముడూరులో ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే గౌతంరెడ్డి ప్రయత్నించడం వెనుక రాజకీయ అంశాలే కారణాలనే వాదన వినిపిస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి పార్టీ వీడిన తరువాత ఆత్మకూరులో గెలుపు కోసం టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించడం కోసం అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యతో చంద్రబాబు రెండు పర్యాయాలు మాట్లాడారు. కొమ్మి, బొల్లినేని వర్గాలు కలిసివస్తే పార్టీ బలపడుతుందనేది చంద్రబాబు ఆలోచన. అయితే ఎన్నికల్లో పోటీ చేయడం లేదా, టీడీపీకి సపోర్టు చేయడం అనే విషయాలపై బొల్లినేని కృష్ణయ్య ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయానికి రాలేదని తెలిసింది.
 
రాబోయే ఎన్నికల్లో బొల్లినేని సహకారం అందే అవకాశం లేకపోగా, ఆయనే ప్రత్యర్థి అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే అనుమానంతో మేకపాటి కుటుంబం ఆయన ప్రమేయం లేకుండా తమ వర్గానికి చెందిన పంచాయతీ సర్పంచ్‌ ద్వారా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మంగళవారం జరిగిన ఈ సంఘటన ఆత్మకూరు రాజకీయాలపై కీలక ప్రభావం చూపబోతోందని, బొల్లినేని రాజకీయంగా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తు న్నారు.
Link to comment
Share on other sites

  • Replies 219
  • Created
  • Last Reply
జగన్‌ను కలిసిన మాజీ సీఎం కొడుకు.. త్వరలో వైసీపీలోకి..
05-08-2018 13:19:02
 
636690719405916314.jpg
నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌‌ను శనివారం రోజు ఆయన కలిశారు. అయితే పార్టీలో చేరిక ఏ రోజు అనే విషయం మాత్రం తెలియరాలేదు. రాంకుమార్‌రెడ్డికి టిక్కెట్ హామీ ఇచ్చారా..? లేదా అనే విషయం మాత్రం తెలియరాలేదు.
 
 
కాగా కొద్దిరోజుల క్రితం మాట్లాడిన ఆయన.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నేదురుమల్లి జనార్దనరెడ్డి నాల్గవ వర్ధంతిని పురస్కరించుకుని కార్యక్రమంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఇకపై పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగుతానని, 2019 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీచేసి, విజయం సాధిస్తానని, ఇంత కాలం రాజకీయంగా నీరసించిన నేదురుమల్లి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతామని చెప్పుకొచ్చారు.
 
 
ఇదే కార్యక్రమంలో..
రాం కుమార్‌రెడ్డి ప్రసంగిస్తుండగా.. మధ్యలో ఓ అభిమాని మన పార్టీ ‘వైసీపీ’ అంటూ గట్టిగా అరవగా.. దీనికి స్పందించిన ఆయన మీ అభిప్రాయాలను మరో 3 నెలలు మనసులోనే ఉంచుకోవాలి. మీ అందరి మనసుల్లో ఏ పార్టీ అనుకుంటున్నారో అదే పార్టీ నుంచి వెంకటగిరిలో పోటీ చేస్తానని చెప్పారు. అనుకున్నట్లుగానే ఆయన మూడు నెలల తర్వాత జగన్‌ను కలవడంతో నేదురుమల్లి అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
Link to comment
Share on other sites

వైసీపీలో చేరాలనుకుంటున్న ఆనంకు మరో షాక్ !
06-08-2018 10:53:17
 
636691495958799702.jpg
  • వైసీపీలోకి రామ్‌కుమార్‌ ?
  • వెంకటగిరి సీటు ఖాయమనే ప్రచారం
  • ఇప్పటికే రేసులో మాజీ మంత్రి ఆనం
  • రామ్‌కుమార్ చేరికతో డైలమా
  • త్వరలో చేరిక తేదీ ప్రకటన
  • కత్తిపూడిలో జగన్‌తో భేటీ
  • ఫలించని బీజేపీ ప్రయత్నం
  • రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించిన గంటల వ్యవధిలోని హఠాత్పరిణామం
  • వెంకటగిరిలో పెరిగిన ఆశావహుల జాబితా
బీజేపీ నాయకుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన్ను పార్టీలో కొనసాగేలా చేయాలని బీజేపీ నాయకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పార్టీ పదవి ఇచ్చి, 24 గంటలు గడవకముందే రామ్‌కుమార్‌ తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో ఆదివారం జగన్‌ను కలుసుకున్నారు. త్వరలో తన అనుచరులతో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాగా ఇప్పటికే వెంకటగిరి టిక్కెట్‌ను పలువురు ఆశిస్తున్నారు. రామ్‌కుమార్‌ రాకతో ఆశావహుల జాబితా పెరిగింది.
 
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీజేపీ నాయకుడు నేదురు మల్లి రామ్‌కుమార్‌రెడ్డి రాజకీయ ప్రయాణంపై గందరగోళం నెలకొంది. ఆయన్ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన 9గంటల వ్యవధిలోనే రామ్‌కుమార్‌ జగన్‌ను కలిసి ఆ పార్టీలో చేరడానికి లైన్‌ క్లియర్‌ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
 
 
ఎప్పటి నుంచో ప్రచారం
నేదురుమల్లి రామ్‌కుమార్‌ పార్టీ మారుతారనే ప్రచారం చాలారోజులుగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయనను నిలుపుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నం విఫలం కాగా, పార్టీ మారడం ఖాయం అనే విషయం తేటతెల్లమైంది. రామ్‌కుమార్‌ను పార్టీలో నిలుపుకొనే క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చింది. అయితే ఆ పార్టీలో కొనసాగడం ఇష్టంలేని రామ్‌కుమార్‌ ఆ నియామకాన్ని పట్టించుకోకుండా నేరుగా జగన్‌ శిబిరంలో చేరారు. శనివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి శిబిరంలో రామ్‌కుమార్‌రెడ్డి జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడారు. తను ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి సమ్మతించినట్లు తెలిసింది. ఇక త్వరలో తేదీలు ప్రకటించి తన అనుచరులతో కలిసి పార్టీలో చేరుతానని నేదురుమల్లి, జగన్‌కు తెలిపినట్లు సమాచారం. ఈ కలయికతో నేదురుమల్లి బీజేపీని వీడనున్నట్లు స్పష్టం అవుతోంది.
 
 
పెరిగిన ఆశావహులు
నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి చేరిక క్రమంలో వెంకటగిరి వైసీపీ అభ్యర్థుల జాబితా పెరిగింది. ఆయన జగన్‌ను కలిసిన నేపథ్యంలో ఇతనే వెంకటగిరి వైసీపీ అభ్యర్థి అవుతారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. నేదురుమల్లి అనుచరులు సైతం అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో టిక్కెట్టు కోసం ఇప్పటికే పలువురు పోటీ పడుతున్నారు.
 
ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి కేటాయిస్తారనే బలమైన ప్రచారం జరుగుతోంది. దీనికితోడు జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి నాలుగేళ్లుగా ఈ టిక్కెట్టుపైనే ఆశలు పెట్టుకున్నారు. రామ్‌ప్రసాద్‌రెడ్డికి కూడా ఆశిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ద్దీ వెంకటగిరి వైసీపీలో ఆశావహుల జాబితా పెరుగుతుండడం దేనికి సంకేతాలో... అనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్టు దక్కని పక్షంలో ఈ నేతలు ఎలా స్పందిస్తారో, కొత్తనేతల చేరిక వెంకటగిరి వైసీపీకి బలుపో, వాపో కాలమే నిర్ణయించాల్సి ఉంది.
Link to comment
Share on other sites

ఏపీలో మొదలైన ఆపరేషన్ ఆకర్ష్.. ఏ పార్టీ ఎవరికి గాలం వేస్తోందంటే...
07-08-2018 14:58:53
 
636692507328651799.jpg
  • ఆశావహులకు గాలం
  • ఆకర్షించే ప్రయత్నాల్లో ప్రధాన పార్టీలు
  • అధికార పార్టీ నేతలపై జనసేన దృష్టి
  • ఎస్సీ, బీసీ నేతలకు వైసీపీ ఎర
  • ఆత్మకూరు, వెంకటగిరిపై టీడీపీ నిఘా
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఊరూరా ప్రచారాలు.. ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు.. అరెస్టులు.. అడ్డగింపులు.. రాజకీయాలు వేడెక్కుతున్న కొద్దీ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కనిపిస్తున్న దృశ్యాలలివి. అయితే కంటికి కనిపించకుండా చాపకింద నీరులా మరి కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల కోసం ఒక పార్టీ గేలం వేస్తుంటే, గెలుపు కోసం అణగారిన వర్గాలను ప్రభావితం చేసే నాయకులకు మరో పార్టీ వల విసురుతోంది. మారుతున్న పరిణామల నేపథ్యంలో పలుకుబడి కలిగిన నాయకులను తన్నుకుపోవడం కోసం మరో పార్టీ కాపు కాచుకొని కూర్చుంది. మూడో కంటికి తెలియనివ్వ కుండా, రహస్యంగా సాగుతున్న ఈ ‘ఆపరేషన్‌ ఆకర్ష్’కు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
 
 
కొత్తగా బరిలోకి దిగుతున్న జనసేన పార్టీకి నెల్లూరు జిల్లా ప్రత్యేకమైనది. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రెండేళ్ల పాటు నెల్లూరులో చదువుకున్నారు. జిల్లాలో మెగా కుటుంబం అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతే కాదు జనసేన పార్టీ కన్వీనర్‌ మాదాసు గంగాధరం నెల్లూరుకు చెందినవారు. ఈ కోణంలో చూస్తే జనసేన పార్టీకి జిల్లా కీలకమైనదే. అయితే ఇప్పటి వరకు జిల్లా పరిధిలో పార్టీ నిర్మాణమే జరగలేదు. కేవలం అభిమానుల హడావుడి తప్ప పార్టీకంటూ ప్రత్యేకించి నాయకులు కాని, కార్యవర్గం కాని కనిపించడం లేదు. ఈ లోటు పూడ్చుకోడం కోసం, పార్టీ అధినేత నెల్లూరు పర్యటనకు వచ్చే లోపు కొత్త నేతలతో పార్టీకి కొత్త రూపు తీసుకురావడం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. పార్టీ కన్వీనర్‌ మాదాసు గంగాధరం టీడీపీ, వైసీపీల్లో టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహులపై దృష్టి సారించారు. వారికి గాలం వేసే పని మొదలు పెట్టారు.
 
 
నెల్లూరు నగర నియోజకవర్గంలో అధికార పార్టీనుంచి చాలామంది టిక్కెట్టు ఆశిస్తున్నారు. వీరిలో పార్టీ ఏదైనా సరే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందే అనే కృత నిశ్చయంతో ఉన్న వారూ ఉన్నారు. అలాంటి నాయకుల్లో ఒకరై, ఇప్పటికే క్రీయాశీల పదవిలో ఉన్న నాయకునిపై జనసేన దృష్టి సారించినట్లు సమాచారం. ఆయన్ను జనసేనలోకి ఆకర్షించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. గతంలో ఇదే నియోజక వర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ గెలిచిన సందర్భాన్ని గుర్తుకు తెస్తూ, రెండు ప్రధాన సామాజికవర్గాలు కలిస్తే గెలుపు ఖాయమని, జనసేన వైపు వచ్చే విషయం ఆలోచించమని ఆయనతో రాయబేరాలు మొదలు పెట్టినట్టు సమాచారం. 15 సంవత్సరాల పాటు నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గ రాజకీయాలను శాసించిన ఒక దివంగత నాయకుని కుమారునిపై కూడా జనసేన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో ఈ కుటుంబం తలో దిక్కుగా చీలిపోయిన క్రమంలో నెల్లూరు కేంద్రంగా రెండు నియోజకవర్గాల్లో పరిచయం, గుర్తింపు ఉన్న ఈ నాయకుడిని ఆకర్షించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
 
 
నెల్లూరు నగరం స్టోన్‌హౌస్‌పేట, పప్పులవీధి, నవాబ్‌పేట, మైపాడు గేటు ప్రాంతాల్లో వ్యాపార సామాజికవర్గంపై పట్టు కలిగిన మరో నాయకునిపై కూడా జనసేన వల విసిరినట్లు తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం అధికార పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. వీరితో పాటు నగరంలోని కొందరు ప్రముఖ కాపు నాయకులపై కూడా జనసేన దృష్టి సారించింది. శాసనమండలి ఎన్నికల్లో ఒకసారి పరాజయం పొంది, రెండో పర్యాయం టిక్కెట్టు కోసం ప్రయత్నించి విఫలమైన ఆ సామాజిక వర్గ నాయకుణ్ని పార్టీలోకి ఆకర్షించుకోవడం కోసం జనసేన పావులు కదుపుతున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతంలో భాగంగా ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న మరి కొంతమంది కాపు నాయకులతో సైతం జనసేన సంప్రదింపులు జరుపుతోంది. కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న అధికార పార్టీ నాయకునిపై కూడా జనసేన వల విసిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈయనకు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక తీవ్రంగా ఉంది. అధికార పార్టీ టిక్కెట్టు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఈయనపై జనసేన దృష్టి సారించింది.
 
 
గూడూరు డివిజన్‌ పరిధిలోని ఇద్దరు మహిళా నాయకురాళ్లతో జనసేన టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరు ప్రస్తుతం ఉన్న పార్టీలో ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ అవకాశం తాము కల్పిస్తామంటూ జనసేన పావులు కదుపుతున్నట్లు సమచారం. జిల్లా రాజకీయాలు, నేతల శక్తి సామర్థ్యాలపై అవగాహన ఉన్న మాదాసు గంగాధరం ఈ ఆపరేషన్‌ ఆకర్షకు సారథ్యం వహిస్తున్నారు.
 
 
బీసీలు.. ఎస్సీలపై వైసీపీ గురి!
ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రధానంగా బీసీ, ఎస్సీ నాయకులపై దృష్టి సారించింది. ఇప్పటికే రెడ్డి సామాజికవర్గ నాయకులతో నిండిపోయిన ఆ పార్టీలోకి ఇక అగ్ర కులాలకు చెందిన నాయకులు అక్కర్లేదని అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. టిక్కెట్టు ఆశించని బీసీ, ఎస్సీ వర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకులను పార్టీలోకి ఆకర్షించడం ద్వారా గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవాల్సిందిగా జిల్లా నేతలను ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ క్రమంలో గూడూరు డివిజన్‌ పరిధిలోని పై వర్గాలకు చెందిన ముగ్గురు మహిళా నాయకురాళ్లపై వైసీపీ వల విసురుతోంది. అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు వచ్చేలా పదవులు ఇస్తామని ఆశ చూపుతోంది. జిల్లా నడిబొడ్డులోని ఒక యువ శాసన సభ్యుడు ఈ ముగ్గురిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 
ఆ రెండు నియోకవర్గాలపై టీడీపీ నిఘా
అధిక నాయకులతో కిటకిటలాడుతున్న అధికార తెలుగుదేశం ప్రస్తుతం కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రం గందరగోళానికి గురవుతోంది. ఈ నియోజకవర్గాల్లో పరిస్థితులను తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడం కోసం అదను కోసం వేచి చూస్తోంది. ఆనం రామనారాయణరెడ్డికి నియోజకవర్గం కేటాయింపు జరిగితే తదనుగుణంగా పావులు కదపడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి కేటాయిస్తే ఆ నియోజకవర్గ వైసీపీలో జరిగే మార్పులను అనుకూలంగా మలుచుకోవడం కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతల వద్దకు దూతలను పంపుతోంది.
 
ఒకవేళ ఆనం ఆత్మకూరు నుంచే పోటీ చేస్తే.. ఆ నియోజకవర్గం వైసీపీలో నెలకొనే అసంతృప్తిని క్యాష్‌ చేసుకోవడానికి వ్యూహరచన చేసుకుంది. అందుకోసం ఆనం చేరిక తదనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ కాపుకాచుకొని కూర్చుంది. రాయబారుల ద్వారా రహస్య మంతనాలకు ప్రయత్నం జరుగుతోంది. ఇలా.. పైన చెప్పుకున్న నాయకులందరూ ప్రస్తుతం ఉన్న పార్టీలను వదిలి వెళ్తారని కచ్చితంగా చెప్పలేము కానీ.. వీరిని తమవైపు ఆకర్షించడానికి మూడు ప్రధాన పార్టీలు చాపకింద నీరులా తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయన్నది మాత్రం నిజం!
Link to comment
Share on other sites

మొత్తానికి తేలిపోయింది.. 13న వైసీపీలోకి ఆనం!
07-08-2018 14:31:00
 
636692490595288796.jpg
  • ఆగస్టు 13న ఆనం వైసీపీలో చేరిక? 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శుభ కార్యాలకు తగదని భావించే ఆషాఢమాసం ముగుస్తున్న దశలో.. త్వరలో వైసీపీలో చేరడానికి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. శ్రావణ మాసం మొదలయ్యాక.. విశాఖపట్నంలో జగన్‌ పర్యటన సందర్భంగా ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలిసింది. ఇటీవల ఆనం రామానారాయణరెడ్డి వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే.
 
ఆషాఢ మాసం వెళ్లిన తరువాత శ్రావణ మాసంలో వైసీపీలో చేరడానికి ఆనం నిర్ణయించుకున్నారు. ఈనెల 13వ తేదిన విశాఖపట్నంలో జగన్‌ పర్యటన ఉంది. ఈనెల 11వ తేదితో ఆషాఢమాసం పూర్తయి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. శుభ కార్యాలకు శ్రావణం మాసం మంచిది కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం 13వ తేదిన జగన్‌ పర్యటన విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖలో నిర్వహించే బహిరంగ సభా వేదికపై జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరే అంశాన్ని ఆనం రామనారాయణరెడ్డి పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

ద్దరూ రమ్మంటున్నారు.. చివరికి ఆయన ఎటువైపు మొగ్గు చూపారంటే...
09-08-2018 11:54:38
 
636694124775816106.jpg
  • వైసీపీలోకి వెళదాం!
  • అనుచరులతో నేదురుమల్లి సమావేశం
  • రాజకీయ పయనంపై అభిప్రాయ సేకరణ
  • అత్యధికులు వైసీపీకి ఓటు
  • నేడు రామ్‌కుమార్‌ విలేకరుల సమావేశం
  • జగన్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రకటన
నెల్లూరు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నేదురుమల్లి రామ్‌కుమర్‌రెడ్డి కాంగ్రెస్‌ పతనం తరువాత బీజేపీలో చేరారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆహ్వానంతో ఆయన ఆ పార్టీలో చేరారు. అయితే ఆయన్ను తమ వైపునకు ఆకర్షించడానికి టీడీపీ, వైసీపీలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ క్రమంలో టీడీపీ నేతల ఆహ్వానం మేరకు కొంతకాలం క్రితం రామ్‌కుమార్‌ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సముచిత స్థానం ఇస్తామని, టీడీపీలోకి రమ్మని చంద్రబాబు ఆహ్వానించారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా పావులు కదిపారు. ఈ నెల 4వ తేదీ రాత్రి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో రామ్‌కుమార్‌రెడ్డి జగన్‌తో భేటీ అయ్యారు. జగన్‌ నుంచి కూడా ఆయనకు సానుకూల స్పందన లభించింది.
 
 
ఎటు వెళ్దాం..?
ఈ క్రమంలో ఏ పార్టీలో చేరాలని అనే అంశంపై రామ్‌కుమార్‌ బుధవారం నెల్లూరులోని తన అతిథిగృహంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నేదురుమల్లి అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామ్‌కుమార్‌ మాట్లాడుతూ తను రెండు పార్టీల అధ్యక్షులను కలిసిన విషయం అనుచరులకు వివరించారు. ఇద్దరి నుంచి ఆత్మీయ ఆహ్వానం అందిందనే విషయాన్ని కూడా తెలిపారు. రెండు పార్టీల అధినేతల నుంచి సానుకూల స్పందన లభించిన నేపథ్యంలో ఏ పార్టీలో చేరాలో నిర్ణయించాల్సిందిగా సమావేశానికి హాజరైన అనుచరులు, అభిమానులను ఆయన కోరారు. సమావేశానికి హాజరైన అత్యధికులు వైసీపీలో చేరాలని సూచించారని సమాచారం.
 
 
వైసీపీలో చేరికపై నేడు ప్రకటన
తాను వైసీపీలో చేరనున్నట్లు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి గురువారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందుకోసం గురువారం ఉదయం 11 గంటలకు నెల్లూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తాను రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోయేది, ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తానని ఆయన తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బుధవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎక్కువ మంది వైసీపీలోనే చేరాలని కోరిన క్రమంలో ఆయన ఆ పార్టీలోనే చేరనున్నట్లు ప్రకటించనున్నారని తెలిసింది.
 
 
జగన్‌ ఏం చెప్పారు ?
తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి జగన్‌ స్పష్టమైన హామీ ఇవ్వడంతో రామ్‌కుమార్‌ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే ఆ స్పష్టమైన హామీ ఏమిటనే విషయం అంతుపట్టడం లేదు. రాబోయే ఎన్నికల్లో రామ్‌కుమార్‌ను తమ పార్టీ తరపున బరిలోకి దించాలని రెండు ప్రధాన పార్టీలు భావించాయి. అధికార తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా రామ్‌కుమార్‌ పేరును పరిశీలనకు తీసుకుంది. ఆయన జగన్‌ను కలిసిన క్రమంలో వెంకటగిరికి కాబోయే వైసీపీ అభ్యర్థిగా ఈయన పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు రామ్‌కుమార్‌ వైసీపీలో చేరుతుండటంతో ఆయనే వెంకటగిరి అభ్యర్థి అనే ప్రచారం నిజమవుతుందా..!? లేదా అనేది వేచి చూడాలి. వెంకటగిరి వైసీపీ టిక్కెట్టు కోసం ఇప్పటికే పలువురు పోటీ పడుతున్నారు. తాజాగా ఆనం రామనారాయణరెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. వీరిలో ఎవరు అభ్యర్థి అవుతారో..? వైసీపీలో రాంకుమార్‌ స్థానం ఏమిటో త్వరలో తేలిపోనున్నది.
Link to comment
Share on other sites

8 hours ago, Seniorfan said:

aaa Somi Reddy gaadu happy anukonta andaru dennsthe.....vaade KING la vundachhu party lo.... Problem with Nellore is too many strong REDDY leaders... andarini accommodate cheyadam kastam....

Somireddy pedda waste fellow. Mlc ye yekkuva is a anukunte minister kuda icharu. Veedki kanna adala 100 times better. Adala ni encourage cheskuntunaru vere la vundedhi

Link to comment
Share on other sites

  • 2 weeks later...
‘ఆనం’ టీడీపీని వీడటంతో ఈ నేతకు ఫుల్ డిమాండ్ !
19-08-2018 15:13:56
 
636702884378447007.jpg
  • పలు నియోజకవర్గాల నుంచి అభ్యర్థిగా ఆదాల ప్రభాకరరెడ్డి పేరు!
  • అంతుపట్టని ఆదాల అంతరంగం.. శ్రేణుల్లో గందరగోళం
  • దూకుడు నిర్ణయాలు.. వ్యాఖ్యలతో నేతల్లో కలవరం
నెల్లూరు జిల్లా తెలుగుదేశంలో ప్రస్తుత ‘హాట్‌ టాపిక్‌’ ఆదాల ప్రభాకరరెడ్డి. టీడీపీ నేతల్లో క్రిటికల్‌ క్యారెక్టర్‌ ఆయనే. టీడీపీ తరపున నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి ఎవరంటే ఆదాల పేరు వినిపిస్తోంది. నెల్లూరు రూరల్‌ అభ్యర్థి ఎవరంటే ఆదాల పేరే చెబుతున్నారు. కోవూరు అభ్యర్థి ఈయనే అవుతారనే కొత్త ప్రచారమూ మొదలయింది. తాజాగా కావలి నియోజకవర్గంపై దృష్టి సారించారని, రెండో విడత సర్వే చేయించుకుంటున్నారని జనం గుసగుసపోతున్నారు. ఆత్మకూరులో ఈయన చెప్పిన వారికే టిక్కెట్టు అంటున్నారు... ఇలా గత కొద్ది రోజులుగా ఏదోఒక రూపంలో ఆదాల ప్రభాకరరెడ్డి పేరు టీడీపీ శ్రేణుల్లో నానుతోంది. మరోవైపు ఆయన అంతరంగం ఏమిటో అర్థం కాక పార్టీ జిల్లా నేతల్లో తికమక. ఆయన వ్యాఖ్యలు, చర్యల కారణంగా తలెత్తున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు నేతలు సతమతం అవుతున్నారు. ఎందుకిలా జరుగుతోందో అంతుపట్టక కలవరపడుతున్నారు.
 
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నెల్లూరు జిల్లా తెలుగుదేశంలో ప్రస్తుతం ఆదాల ప్రభాకరరెడ్డి హాట్‌ టాపిక్‌గా మారారు. కొన్ని నెలల క్రితం వరకు నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ కార్యకలాపాలకు మాత్రమే పరిమి తమైన ఆదాల ఒక్కసారిగా పార్లమెంట్‌ స్థానం పరిధిలో ని పలు నియోజకవర్గాలకు అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు. అయితే ఆదాల విషయంలో జరుగుతున్న ప్రచారం పార్టీకి మంచి చేస్తోందో, చెడు చేస్తోందో అర్థం కాక పార్టీ శ్రేణులు సతమతం అవుతున్నారు.
 
 
ఆదాలకు పెరిగిన డిమాండ్‌
ఆనం రామనారాయణరెడ్డి నిష్క్రమణ తరువాత టీడీపీలో ఆదాలకు డిమాండ్‌ పెరిగింది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈయన పేరు పార్టీలో మార్మోగిపోతోంది. గత ఎన్నికల్లో ఆదాల ప్రభాకరరెడ్డి నెల్లూరు పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే ఆ తరువాత పార్టీ నాయకులు తనకు విలువ ఇవ్వలేదనే మనస్తాపంతో పార్టీ వ్యవహారాల్లో అంటిముట్టనట్టు వ్యవహరించారు. నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా, అదే సమయంలో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నా రూరల్‌ నియోజకవర్గం వరకే పరిమితమయ్యారు. అయితే ఆనం రామనారాయణరెడ్డి పార్టీని వీడాక ఈయనకు పార్టీలో విలువ పెరిగింది. ఇది జరగడానికి కొద్ది రోజుల ముందు వరకు ఆనం, ఆదాల అత్యంత సన్నిహితులుగా మెలిగారు. ఆత్మకూరు మినీ మహానాడు, రూరల్‌ నియోజకవర్గ మినీ మహానాడుల్లో ఆదాల మంత్రి సోమిరెడ్డిని టార్గెట్‌గా చేసుకొని మాట్లాడగా, ఆనం రామనారాయణరెడ్డి ఏకంగా ప్రభుత్వాన్నే టార్గెట్‌ చేశారు. ఆనం పార్టీ మారుతారనే ప్రచారం జరిగిన సందర్భంగా ఆదాల కూడా అదే దారిలో పయనిస్తారనే ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై జిల్లా మినీ మహా నాడులో ఆదాల స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. తను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆనం అనుభవాల నేపథ్యంలో ఆదాలను చేజార్చుకోకూడదనే ఉద్దేశంతో అధిష్ఠానం ఆదాలకు విలువ పెంచింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదాలను పిలిపించుకొని మాట్లాడారు. పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించమని కోరారు. పార్లమెంట్‌ నియోజకవర్గంలో పార్టీని సమన్వయం చేసుకోమని సూచించారు. ఆ తరువాత కూడా మూడు, నాలుగు సార్లు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో పాటు ఆదాల చంద్రబాబును కలిసి పార్టీ వ్యవహారాలపై చర్చించారు. ఇవన్నీ పార్టీలో ఆదాల పేరును విపరీతంగా ప్రచారంలోకి తెచ్చాయి. గత నాలుగున్నరేళ్లుగా పెద్దగా ప్రచారానికి నోచుకోని ఆదాలను ఒక్కసారిగా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే కీలక నాయకునిగా గుర్తించేలా చేశాయి.
 
 
పోటీ విషయంలో గందరగోళం
వ్యక్తిగతంగా ఆదాల పేరు విస్తృత ప్రచారంలో ఉన్నా ఆయన ఎక్కడినుంచి పోటీ చేస్తారనే విషయంలో మాత్రం తీవ్ర గందరగోళం నెలకొంది. ఆర్థిక కారణాల దృష్ట్యా ఎంపీగా పోటీ చేయను, అసెంబ్లీకి పోటీ చేస్తానని ఆయన జిల్లా ముఖ్యుల సమక్షంలో సీఎంకు వివరించారు. ఈ క్రమంలో ఆదాల ఎంపీ స్థానానికి పోటీ చేయరనే విషయం జనంలోకి వెళ్లింది. దీంతో ఆయన ఇన్‌చార్జిగా ఉన్న నెల్లూరు రూరల్‌ నుంచి పోటీ చేస్తారని అంచనా వేసుకున్నారు. అయితే తాజాగా ఆయన అక్కడి నుంచి పోటీ చేయడం లేదనే ప్రచారం ఊందుకుంది. ఆత్మకూరు నియోజకవర్గం సమన్వయానికి వెళ్లడంతో అక్కడి నుంచి పోటీ చేస్తారని.. ‘ఆశీర్వదిస్తే కోవూరు ప్రజల రుణం తీర్చుకుంటా’నని ప్రకటించడంతో అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారాలు జరిగాయి. వీటన్నిటినీ మించి తాజాగా కావలి నియోకవర్గం నుంచి కూడా ఆదాల పేరు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో తన బలంపై ఆదాల సర్వే చేయించుకొంటున్నారనే వార్త కావలిలో గుప్పు మనడంతో రకరకాల ఊహాగానాలు చోటు చేసు కొంటున్నాయి. ఇన్ని నియోజకవర్గాల నుంచి ఆదాల పేరు అభ్యర్థిగా ప్రచారం జరుగడం వెనుక ఆయా నియోజకవర్గాల్లో ప్రజలతో ఆయనకున్న సంబంధాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకున్న ప్రత్యేకతలే కారణంగా తెలు స్తోంది. అయితే.. ఈ ప్రచారాలు తెలుగుదేశం నాయకులు, శ్రేణుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.ఆదాల ఎంపీగా పో టీ చేస్తారో చేయరో తెలియని నేపథ్యంలో ఆ స్థానంలో టీడీపీ అ భ్యర్థి విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. రూరల్‌ నియోజకవ ర్గం విషయంలోనూ ఇదే పరిస్థితి. దీనికి తోడు తాజా వ్యవహా రశైలి, వ్యాఖ్యలు ఆత్మకూరు, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
 
 
దూకుడు తెస్తున్న వివాదాలు
ఆత్మకూరు ఇన్‌చార్జిగా ప్రకటించిన ఒకటి రెండు రోజుల్లోనే ఆ నియోజకవర్గ టీడీపీలో తీవ్ర దుమారం చెలరేగింది. పూర్వ ఇన్‌చార్జి కన్నబాబు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆమరణ దీక్షకు పూనుకున్నారు. దీనిని పరిష్కరించడానికి జిల్లా నేతలు నానా యాతన పడ్డారు. నియోజకవర్గ నాయకులైన కన్నబాబు, ధనంజయరెడ్డిలను పక్కన పెట్టి ఆదాల మండలస్థాయి నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారనే ఆగ్రహం అక్కడ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమయింది. శనివారం నాటి పరిణామాలు బొల్లినేని కృష్ణయ్య అభ్యర్థిత్వంపై సూచనలు వ్యక్తం చేసేవరకు అక్కడ అదే గందరగోళం కొనసాగుతోంది.
 
 
కోవూరులో ఇలా...
మీరు ఆశీర్వదిస్తే రుణం తీర్చుకుంటా అని కోవూరు ప్రజలను ఉద్దేశించి ఆదాల అన్న మాటలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డిని తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. ఆదాల తన నియోజకవర్గంలో పార్టీని, క్యాడర్‌ను డిస్ట్రబ్‌ చేస్తున్నారని, కొంత మందిని ఉద్దేశపూర్వకంగా తనపైకి ఉసి గొల్పుతున్నారని, ఇక్కడి నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో తనపై పరోక్షంగా కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే పోలంరెడ్డి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన అధిష్టానం పోలం రెడ్డికి సర్దిచెప్పమని ఇన్‌చార్జి మంత్రి, పార్టీ అధ్యక్షుణ్ని ఆదేశించింది. దీంతో ఈనెల 14వ తేది రాత్రి మంత్రి అమరనాథరెడ్డి, బీద రవిచంద్ర పోలంరెడ్డిని కలిసి బుజ్జగించారు. మరో వైపు ఒక పత్రికకు ఇచ్చిన ఇంట ర్వ్యూలో ఉదయగిరి ఎమ్మెల్యే పరిస్థితి ఏమి బాగోలేదని ఆదాల అన్నట్లు ప్రచురితమైన వార్తా కథనం పార్టీలో కల కలం సృష్టించింది. దీనిపై కూడా ఆ ఎమ్మెల్యే అధిష్ఠానా నికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
 
 
టార్గెట్‌.. సోమిరెడ్డా.!?
మంత్రి సోమిరెడ్డిని టార్గెట్‌ చేసుకొనే ఆదాల ఈ చర్యలు, వ్యాఖ్యలకు పూనుకుంటున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని జిల్లా నాయకులు సైతం విశ్వసిస్తున్నారు. ఆత్మకూరులో కన్నబాబు, ధనంజయరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మంత్రి సోమిరెడ్డికి సన్నిహితులుగా ముద్రపడ్డారు. అందువల్లే ఆదాల వీరి విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది.
 
 
నెల్లూరులో ఎన్టీఆర్‌ ఇళ్లకు లాటరీ కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘటన ఆదాల.. సోమిరెడ్డిని టార్గెట్‌ చేసుకున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూర్చుతోంది. వాస్తవానికి ఈ లాటరీ కార్యక్రమం సోమిరెడ్డి నివాసం పరిసరాల్లో జరిగింది. రూరల్‌ నియోజకవర్గంలో సోమిరెడ్డికి బలమైన పట్టు ఉంది. పైగా జిల్లా మంత్రి. ఈ కోణాల్లో గమనిస్తే ఆయన్ను ఇళ్ల కేటాయింపు కార్యక్రమానికి ఆహ్వానించి ఉండాల్సింది. అయితే తను ఇన్‌చార్జిగా ఉన్న రూరల్‌ నియోజకవర్గంలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి సోమిరెడ్డిని ఆహ్వానించడానికి వీలు లేదని ఆదాల అల్టిమేటం ఇచ్చారని, ఆ కారణంగానే సోమిరెడ్డిని ఆహ్వానించలేదని పార్టీ నాయకులు అంటున్నారు. అదే సమయంలో ఈ పరిణామాలు పార్టీకి నష్టం కలుగజేస్తాయనే ఆందోళన జిల్లా పార్టీ నాయకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆదాల అంతరంగం ఏమిటో అర్థం కావడం లేదని, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, కొంత మంది విషయంలో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారో అంతుచిక్కడం లేదని పార్టీ ముఖ్యులు తలలు పట్టుకొంటున్నారు.
Link to comment
Share on other sites

సెప్టెంబర్‌ మొదటి వారంలో వైసీపీలో చేరిక
19-08-2018 15:34:26
 
636702896682394984.jpg
  • నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ప్రకటన
వెంకటగిరి(నెల్లూరు జిల్లా): చేయిచేయి కలిపి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి అనుయాయులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని నేదురుమల్లి బంగ్లాలో కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటగిరి నియోజకవర్గంలో బలంగా ఉన్న వైసీపీని మరింత పటిష్టం చేయడానికి ప్రతి ఒక్కరూ ఓ సైనికుడిలా పని చేయాలని సూచించారు.
 
 
సెప్టెంబర్‌ మొదటి వారంలో వైసీపీలో చేరిక
సెప్టెంబర్‌ మొదటి వారంలో జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతానని నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఆత్మీయ సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 8వ తేది నెల్లూరులో నేదురుమల్లి అభిమానులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చర్చించి వారి అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వై.ఎస్‌. జగన్‌ విధివిధానాలు నచ్చే పార్టీలో చేరుతునట్లు తెలిపారు. వెంకటగిరి అసెంబ్లీ టికెట్‌ వారి గెలుపునకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో నాయకులు ఎల్‌. కోటేవ్వరావు, పులి ప్రసాద్‌ రెడ్డి, పులికొల్లు రామారావు తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

ఫలించిన చంద్రబాబు ప్రయత్నం.. ఆయన పేరు దాదాపుగా ఫిక్స్!
19-08-2018 15:26:05
 
636702891676840355.jpg
  • ఆత్మకూరుకు బీకే!?
  • బొల్లినేని కృష్ణయ్య వైపు టీడీపీ చూపు
  • ఫలించిన చంద్రబాబు ప్రయత్నం
  • బీద, సోమిరెడ్డితో నెల్లూరులో భేటీ
  • నేడు నియోజకవర్గ నేతలతో మంతనాలు
  • 23 నుంచి ఆత్మీయ సమావేశాలు
‘‘ఆత్మకూరు బాధ్యతలు తీసుకోమని సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నారు. అయితే 20 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయలకు దూరంగా ఉన్న నా నాయకత్వం గురించి పార్టీ శ్రేణులు, అభిమానులు ఏమనుకొంటున్నారో తెలుసుకొని ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని అనుకొంటున్నా. ఈనెల 23వ తేది నుంచి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులతో సమావేశం అవుతా!’’
 
 
ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్య పేరు దాదాపుగా ఖరారైనట్టేనా!? అవుననిపించే పరిణామాలు శనివారం చోటుచేసుకున్నాయి. నెల్లూరులోని ఓ అతిథి గృహంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, మంత్రి సోమిరెడ్డి సమక్షంలో ఆ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కృష్ణయ్య భేటీ అయ్యారు. వారందరి మద్దతు కోరారు. ఈనెల 23వ తేది నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులు, అభిమానుల మద్దతు కూడగట్టేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
 
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్య పేరు ఖరారైందా?. అవుననిపించే పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి నిష్క్రమణ తర్వాత దీటైన అభ్యర్థి కోసం అన్వేషించిన తెలుగుదేశం బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దించాలని ప్రయత్నాలు చేపట్టింది. ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే రెండు పర్యాయాలు బొల్లినేనిని పిలిపించుకొని చర్చలు జరిపారు. ఈ చర్చలు శనివారం నుంచి కార్యరూపం దాల్చాయి. శనివారం మధ్యాహ్నం నెల్లూరులోని ఓ అతిథిగృహంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, మంత్రి సోమిరెడ్డి సమక్షంలో బొల్లినేని కృష్ణయ్య నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నాయకులతో అంతరంగిక సమావేశం నిర్వహించారు. వారందరి మద్దతు కోరారు. ఈనెల 23వ తేది నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులు, అభిమానుల మద్దతు కూడగట్టుకోనున్నారు.
 
 
మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. వివాద రహితుడు, వర్గాలకు అతీతుడుగా ఈయనకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆత్మకూరు తెలుగుదేశంలో పరిస్థితులు ఏమంత బాగాలేవు. టిక్కెట్టు కోసం ఆశించే నాయకుల పోటీ, ఆనం నిష్క్రమణ తదనంతర పరిణామాల క్రమంలో పార్టీ శ్రేణులు వర్గాలుగా చీలిపోయాయి. అదే.. బొల్లినేని అభ్యర్థి అయితే వీరందరూ సహకరించే అవకాశం ఉందని, మరో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు కూడా ఆయనకు సహకరిస్తారని భావించారు. జిల్లా నాయకత్వం ఈ మేరకు అన్నివిధాలా ఆలోచించి పావులు కదిపింది. విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో చంద్రబాబు రెండు పర్యాయాలు బొల్లినేనితో మాట్లాడారు. బుధవారం కృష్ణయ్య కుటుంబ సభ్యులతో మరోసారి చంద్రబాబు భేటీ అయ్యారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని, ఆత్మకూరు బాధ్యతలు తీసుకోవాలని కోరారు. జిల్లా పార్టీ నాయకులు సైతం బొల్లినేనితో మంతనాలు జరిపారు. అయితే ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా.. లేదా అనే అనుమానాలు కొనసాగుతున్న తరుణంలో బొల్లినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన శనివారం నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, కంభం విజయరామిరెడ్డి హాజరయ్యారు.
 
 
మరోసారి క్రీయాశీల రాజకీయాల్లోకి దుమికే ముందు పార్టీ శ్రేణులు, ఆత్మీయులు, అనుచరుల మద్దతు కూడగట్టుకునేందుకు బొల్లినేని రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 23వ తేదీన చేజర్ల మండలం నుంచి ఈ ఆత్మీయ సమావేశాలు ఆరంభం కానున్నాయి. శనివారం జరిగిన ముఖ్యుల సమవేశంలో బొల్లినేని మాట్లాడుతూ ఆత్మకూరు బాధ్యతలు తీసుకోమని సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నారన్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయలకు 20 సంవత్సరాల పాటు దూరంగా ఉన్న క్రమంలో తన నాయకత్వం గురించి పార్టీ శ్రేణులు, అభిమానులు ఏమనుకొంటున్నారు, వారి మనోగతాలను తెలుసుకొని ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని అనుకొంటున్నానని అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగానే 23వ తేది నుంచి నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులతో సమావేశం అవుతానని, చేజర్ల మండలం నుంచి ఆత్మీయ సమావేశాలు ఆరంభం అవుతాయని బొల్లినేని సమావేశానికి హాజరైన ముఖ్య నాయకులతో అన్నట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

సెప్టెంబర్ 2న వైసీపీలో చేరబోతున్న ఆనం తనతో పాటు..
27-08-2018 13:03:28
 
636709718092999390.jpg
  • ఆహ్వానిస్తున్న ఆనం... వద్దంటున్న టీడీపీ
  • సంకటస్థితిలో ఆత్మకూరు కేడర్‌
  • ఎవరికివారుగా రహస్య మంతనాలు
  • ద్వితీయశ్రేణి నేతలపై ‘దేశం’ నిఘా
  • 2న వైసీపీలో చేరనున్న రాంనారాయణ
  • అందరి మద్దతు కూడగట్టుకునే యత్నం
  • నేటి సాయంత్రం నెల్లూరులో ఆత్మీయ సమావేశం
ఓ వైపు తమను ఉన్నత స్థాయిలో నిలిపిన పార్టీ.. మరోవైపు తమ అభిమాన నాయకుడు.. ఎవరి మాట వినాలి. ఎవరితో నడవాలి. ఇలా ఆత్మకూరు నియోజవర్గ కేడర్‌ అంతర్మథనంలో పడింది. సెప్టెంబరు రెండవ తేదీన వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్న ఆనం రామనారాయణరెడ్డి తనతోపాటు తన వర్గీయులనూ వెంటబెట్టుకుని వెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టారు. గత మూడు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో బిజీగా గడిపిన ఆనం ఆదివారం తను మొన్నటివరకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి సారించారు. సోమవారం నెల్లూరులోని తన నివాసంలో ఆత్మకూరులోని తన అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. ఆనంతో సన్నిహిత సంబంధాలు కలిగిన నాయకులను ప్రత్యక్షంగా కలుస్తూ ‘‘మీకు మేమున్నాం.. వెళ్లొద్దంటూ’’ ఒత్తిడి చేస్తోంది. దీంతో ఆత్మకూరు రాజకీయం వేడెక్కింది.
 
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆత్మకూరులో రాజకీయ డ్రామా మొదలయింది. సెప్టంబరు 2వ తేదీన వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్న ఆనం రామనారాయణరెడ్డి తనతో పాటు తన వర్గీయులను వెంటబెట్టుకుని వెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆనం కుటుంబానికి రాజకీయంగా జిల్లాలో ఉన్న పేరు ప్రఖ్యాతులు తెలిసినవే. అయితే ఆ పలుకుడి ఇప్పుడుందా..!? అనే అంశంపైనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆనం కుటుంబం పరపతి తగ్గిపోయిందని కొందరంటే...! నిలకడగానే ఉందని మరి కొందరు అంటున్నారు. ఈ భిన్న వాదనల్లో ఏది నిజమో కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా, ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వమైనా చివరికి నేడో రేపో చేరబోతున్న వైసీపీ అయినా ఆనం కుటుంబానికి విలువ ఇస్తోందంటే దానికి కారణం వారికి జిల్లా ప్రజల్లో ఉన్న పరపతే. ఆనం చేజారిపోకూడదని తెలుగుదేశం తీవ్ర ప్రయత్నాలు చేయడం వెనుక కారణం కూడా ఇదే. బలమైన నాయకుడ్ని దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ అధిష్ఠానం ఆనం నిష్క్రమణను నిలుపుదల చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. దీనికి కారణం ఆ కుటుంబానికి ప్రజల్లో బలం ఉందనే అభిప్రాయమే. అయితే ఇటీవల కాలంలో ఆనం కుటుంబ పరిపతి తగ్గిందనే ప్రచారం ఊపందుకుంది.
 
ముఖ్యంగా వివేకానందరెడ్డి మరణం ఆ కుటుంబానికి తీరని లోటుగా భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆనం కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండటంతో బలం తగ్గిందా, నిలకడగా ఉందా అనే విషయం అంతుపట్టలేదు. ఇప్పుడు సమయం ఆసన్నమయ్యింది. సెప్టెంబరు 2న ఆయన వైసీపీలో చేరడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా మొన్నటి వరకు తను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రజామద్దతు కోసం తొలి సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి మొన్నటివరకు ఆనం వర్గీయులుగా గుర్తింపు పొందిన నాయకుల్లో ఎంత మంది వస్తారో చూడాల్సి ఉంది. ఆనం బలం నిలకడగా ఉందా లేదా..! అని తేల్చుకోవడానికి నేడు జరగబోయే ఆత్మకూరు ఆత్మీయ సమావేశం కొలమానం కానుంది. ఆశించిన స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తరలివస్తే ఆనం ప్రభావం ఉన్నట్లే. పదేళ్లపాటు ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరులోనే ఆనంకు చుక్కెదురైతే జిల్లా వ్యాప్తంగా కూడా ఆ కుటుంబ ప్రభావం సన్నగిల్లినట్లే భావించాల్సి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.
 
 
రా.. రమ్మంటున్న ఆనం
నేడు నెల్లూరులోని ఆనం నివాసంలో జరిగే ఆత్మకూరు ఆత్మీయ సమావేశానికి రావాల్సిందిగా రామనారయణరెడ్డి ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులను స్వయంగా ఫోన్‌ చేసి పిలుస్తున్నారు. తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు. నియోజకవర్గంలో మొన్నటి వరకు రామనారాయణరెడ్డికి బలమైన వర్గం ఉండేదనడంలో అనుమానం లేదు. తెలుగుదేశం మండల, గ్రామస్థాయి కమిటీల్లో అత్యధికులు ఇన్‌చార్జి హోదాలో ఆనం రామనారాయణరెడ్డి నియమించినవారే. వీరిలో కాంగ్రెస్‌ హయాం నుంచి ఆనం వెంట వచ్చిన ఉన్న వారు ఎక్కువ మందే ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కూడా ఈయనకు పట్టుంది. అలాగే నియోకవర్గంలోని ప్రతి గ్రామంలో రామనారాయణరెడ్డికి వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. వీరందరినీ ఆయన నేటి ఆత్మతీయ సమావేశానికి స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ప్రతి మండలంలో తనకు తెలిసిన నాయకులకు, క్రియాశీల కార్యకర్తలకు సమావేశానికి రమ్మని కోరుతున్నారు. నియోజకవర్గం నుంచి తన వర్గీయులుగా భావించే వారందరిని సమావేశానికి రప్పించి వారందరిని తన వెంట వైసీపీలోకి వచ్చేలా ఒప్పించాలనే వ్యూహంతో ముందుకు కదులుతున్నారు.
 
 
వేడెక్కిన ఆత్మకూరు
అటు ఆనం ఆహ్వానాలు, ఇటు తెలుగుదేశం బుజ్జగింపులతో ఆత్మకూరు నియోజకవర్గం వేడెక్కింది. ఆదివారం ఉదయం నుంచి ఎక్కడ చూసినా ఈ అంశంపైనే ప్రజ లు చర్చించుకున్నారు. ఆనం వెంట వెళ్లేవారెవరూ, తెలుగుదేశంలోనే కొనసాగేవారెవరూ అనే అంశంపై ఎవరికి తోచినట్లు వారు ఊహాగానాలు చేసుకొంటున్నారు. సోమ వారం సాయంత్రం 4 గంటలకు నెల్లూరులోని ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో జరిగే ఆత్మీయ సమావేశం, తదనంతర పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకొంటున్నారు.
 
 
మేమున్నాం.. వెళ్లొద్దంటున్న దేశం
ఆనం కదలికలను గమనించిన తెలుగుదేశం కొద్ది రోజుల ముందు నుంచే పావులు కదపడం మొదలు పెట్టింది. ఆయన వైసీపీలో చేరే తేదీ ఖరారు కావడంతో కేడర్‌ చేజారిపోకుండా కార్యాచరణ మొదలు పెట్టింది. ఆనంతో పరిచయం ఉన్న నాయకులను టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. మేమున్నాం.. ఆనం వెంట వెళ్లొద్దని భరోసా కల్పిస్తున్నారు. కొమ్మి లక్ష్మయ్యనాయుడు, బొల్లినేని కృష్ణయ్య, ఆయన మేనల్లుడు గిరి నాయుడు, నియోజకవర్గ పూర్వ ఇన్‌చార్జి కన్నబాబులు గత రెండు రోజులుగా ఇదే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ పరిణామాలను జిల్లా పార్టీ నిశితంగా గమనిస్తోంది. మండల పార్టీ పదవుల్లో కొనసాగుతున్న ఆనం వర్గీయులపై ప్రత్యేక నిఘా ఉంచింది. వీరితో గతంలోనే జిల్లా పార్టీ చర్చలు జరిపింది. మరో ఆలోచన పెట్టుకోవద్దని, టీడీపీని వీడివెళ్లవద్దని కోరింది. ఇప్పుడు ఆనం వైసీపీలో చేరే సమయం దగ్గరపడుతుండటంతో మరోసారి మండల పార్టీ కేడర్‌పై దృష్టి సారించింది. అనుమానం ఉన్న వారితో మరోసారి మాట్లాడుతోంది. పార్టీ ఆదేశాలను కాదని అటుగా వెళ్లి వారి విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా నిర్ణయించుకుంది.
Link to comment
Share on other sites

ల్లూరు జిల్లాపై భారీ ఆశలు పెట్టుకున్న వైసీపీకి షాక్ !
28-08-2018 15:13:24
 
636710660053267003.jpg
  • వైసీపీకి తగ్గిన మైనారిటీ ఓటర్ల ఆదరణ 
  • రాజకీయ వర్గాల్లో ఆసక్తి
  • ప్రస్తుత పరిణామాలతో మారిన పరిస్థితులు
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కులాలు, మతాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఏ వర్గం ఎటు వైపు అనే విశ్లేషణలకు ప్రాధాన్యం పెరిగింది. ఆ కోణంలో చూస్తే మొత్తం జనాభాలో 9 నుంచి 11 శాతం ఉన్న మైనారిటీ ఓటర్లు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు... ఎలాంటి ప్రభావం చూపబోతున్నారు అనే చర్చ మొదలయింది. ఈ వర్గాలను అక్కున చేర్చుకోవడం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ తాజాగా నారా హమారా... తెలుగుదేశం హమారా..! అనే నినాదంతో మంగళవారం రాజధానిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. అధికార పార్టీలోని మైనారిటీ నాయకులు ఈ సభ నిర్వహణకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో మైనారిటీల బలమెంత, ఏ నియోజకవర్గాల్లో వీరు జయాపజయాలను ప్రభావితం చేస్తారు, గత ఎన్నికల్లో వీరు ఏ వైపు నిలిచారు, తాజాగా వీరి మనోభావాలేమిటి..!? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు ఊపందుకున్నాయి.
 
 
ఓటింగ్‌లో కులాల ప్రభావం కనిపించని రోజుల్లోనే మైనారిటీ ఓటర్లలో ఐక్యత కనిపించేది. ఏదో ఒక రాజకీయ పక్షం వైపు నిలిచేవారు. మత పెద్దల ఆదేశాల మేరకు ఓట్లు వేసేవారు. ఈ ఓటింగ్‌ కూడా దేశం అంతా దాదాపు ఒకే విధంగా ఉంటుంది. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు ఆ వర్గాలు కాంగ్రెస్‌ను సొంత పార్టీగా భావించేవి. ఎన్టీఆర్‌ ప్రభావంతో పరిస్థితి మారింది. ఆ తరువాత కాలంలో కూడా తెలుగుదేశానికికంటూ ఒక వర్గం బలంగా నిలబడిపోయింది. అయితే, గత ఎన్నికల్లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తాలూకు సానుభూతి, రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌పై కోపం, బీజేపీతో తెలుగుదేశం పొత్తు.. ఈ మూడు ప్రధాన కారణాలతో ముస్లిం ఓటర్లందరూ సమైక్యంగా మారిపోయారు. అత్యధికులు వైసీపీని బలపరిచారు. ముస్లిం ఓటర్లకు సంబంధించి ఆ వర్గ నాయకుల లెక్కల ప్రకారం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వీరి సంఖ్య గణనీయంగానే ఉంది. నెల్లూరు జిల్లాలో.. అత్యధికంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ వర్గాల బలం ఎక్కువగా కనిపిస్తోంది. 41, 42, 43 డివిజన్లలో పెద్ద సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఉన్నారు. సిటీ నియోజకవర్గంలో 43వేల మందికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నట్లు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ అంటున్నారు. రూరల్‌ నియోజకవర్గంలో 29వేలు ఉన్నట్లు అంచనా. కోవూరులో 26,800, ఆత్మకూరులో 28వేలు, ఉదయగిరిలో 25వేలు, కావలిలో 18,500, గూడూరులో 15వేలు, సర్వేపల్లెలో 14వేలు, వెంకటగిరిలో 8,500, సూళ్లూరుపేటలో 8వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నట్లు ఈయన లెక్కలు చెబుతున్నారు. ఓటర్ల జాబితాలో ముస్లిం ఓటర్లను మాన్యువల్‌గా లెక్కించామంటున్నారు. ఈ లెక్కల్లో హెచ్చుతగ్గులున్నా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రమారమిగా 10 శాతం వరకు మైనారిటీ ఓటర్లు ఉన్నారనడంలో సందేహం లేదు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో వీరి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ ఓట్లలో అత్యధిక శాతం వైసీపీ పరం అయ్యాయనడంలో సందేహం లేదు.
 
 
కొత్త పరిణామాలు.. మారుతున్న అభిప్రాయాలు
గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో మళ్లీ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తాలూకు సానుభూతి ఇప్పుడు పెద్దగా లేదు. నాలుగున్నరేళ్ల అధికారంలో టీడీపీ మైనారిటీలను దూరం చేసుకున్న సందర్భాలు లేవు. గత ఎన్నికల్లో వీరు పార్టీ గుర్తుకు దూరంగా జరిగినా తెలుగుదేశం వీరిని దగ్గరకు తీసుకునే ప్రయత్నమే చేసింది. పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా వీరికి దగ్గరకావడానికి ప్రయత్నించింది. ఇది ఒక ఎత్తు అయితే బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవడం చాలా వరకు కలిసి వచ్చింది. 2014 ఎన్నికలకు పూర్వం వరకు తెలుగుదేశం వెంట ఉన్న ఆ వర్గం సంప్రదాయ ఓటర్లను బీజేపీతో విడిపోవడం ద్వారా టీడీపీ మళ్లీ సమీకరించుకుంది. కేవలం ఈ ఒక్క పరిణామంతో సుమారు 20 శాతం మంది ముస్లిం ఓటర్లు మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారని ఆ వర్గ నాయకులు అంటున్నారు. టీడీపీ, బీజేపీతో వేరుపడటమే కాదు, ఆ పార్టీ వైఖరిని వైసీపీ విమర్శించకపోవడం కూడా ముస్లిం వర్గాల మార్పుకు మరో కారణంగా చెబుతున్నారు.
 
నాలుగున్నరేళ్ల కాలంలో తెలుగుదేశం ఎంత మంది ముస్లిం ఓటర్లను ఆకర్షించింది అనే లెక్కలు చెప్పలేకపోవచ్చు కానీ, గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేసిన మైనారిటీలందరూ ఈసారి ఓట్లు వేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పు రాబోయే ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి ప్రభావం చూపబోతుందోనని ప్రస్తుత చర్చనీయాంశం. మూడు నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల వైసీపీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. రెండు నుంచి ఐదు వేలకు మించి మెజారిటీ సాధించలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మారుతున్న ముస్లిం ఓటర్ల మనోగతం రాబోయే ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందో స్పష్టం అవుతోంది.
Link to comment
Share on other sites

ఆనం వైసీపీలో చేరడం వాళ్లకు ఇష్టం లేదా?
03-09-2018 11:04:14
 
636715694532373636.jpg
  • ఎట్టకేలకు వైసీపీలో చేరిన ఆనం
  • కండువా కప్పి ఆహ్వానించిన జగన్‌
  • మేకపాటి వర్గం గైర్హాజరు
  • రామనారాయణకు వెంకటగిరి పగ్గాలు ?
  • రేపు తిరుపతి పార్లమెంటరీ వైసీపీ సమావేశం
  • మారునున్న సమీకరణలు
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మార్పుపై రెండు మూడు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. ఎట్టకేలకు ఆనం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంలో కూడా దాదాపు స్పష్టమైంది. ఆయన వెంకటగిరి నుంచి బరిలోకి దిగనున్నట్లు పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కార్యక్రమానికి మేకపాటి వర్గం హాజరుకాలేదు. మాజీ మంత్రి ఆనం వైసీపీలో చేరడంతో జిల్లాలోని రాజకీయ సమీకరణలు మారనున్నాయి.
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం సాయం త్రం 4 గంటల సమయంలో విశాఖ జిల్లా దేవరాయపల్లె సమీపంలోని వ్యాసనం చెరకు కాటా సెంటర్‌ వద్ద ఆ పార్టీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆత్మకూరు, నెల్లూరు నుంచి తరలివెళ్లిన ఆనం అభిమానులు అన్నవరం నుంచి వాహనాల్లో ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో జగన్‌ పాదయాత్ర అక్కడకు చేరుకుంది. ఇక్కడి నుంచి వెళ్లిన ఆనం అనుచరులు జగన్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్‌ ఆనం రామనారాయణరెడ్డి, రంగమయూర్‌రెడ్డిలను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనం వెంట వెళ్లిన అనుచరులను సైతం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, గోవర్థన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
 
అనుకున్నట్టే గైర్హాజరు
ఆనం చేరిక కార్యక్రమానికి మేకపాటి వర్గం గైర్హాజరు అయింది. ఈ కార్యక్రమానికి మేకపాటి వర్గం హాజరు కావడం లేదని ‘ఆనం చేరిక.. మేకపాటి కినుక’ అనే శీర్షికన ఆదివారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన విషయం తెలిసిందే. అలాగే మేకపాటి వర్గం ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, ఉదయగిరి ఇన్‌చార్జి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, వెంకటగిరి ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు ఇన్‌చార్జి మేరిగ మురళి, కోవూరు ఇన్‌చార్జి ప్రసన్నకుమార్‌ రెడ్డిలు ఈ కార్యక్రమానికి హజరు కాలేదు.
 
 
 
ఆనం చేతికి వెంకటగిరి పగ్గాలు..?
రామనారాయణరెడ్డి వైసీపీలో చేరబోతున్నారనే విషయంలో జిల్లా ప్రజలకు అనుమానం లేదు. కాని ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అనే విషయంలో మాత్రం చివరి నిమిషం వరకు సస్పెన్స్‌ కొనసాగింది. అయితే పార్టీలో చేరిక సందర్భంగా ఆ విషయంలోనూ క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో ఆనం వెంకటగిరి నుంచి బరిలోకి దిగనున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇకపై వెంకటగిరి విషయంలో ఆనం రామనారాయణరెడ్డితో కో ఆర్డినేట్‌ చేసుకొని ముందుకు వెళ్లమని పార్టీ అధినేత జగన్‌ జిల్లా ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డికి సూచింనట్లు విశ్వసనీయ సమాచారం. ఆనం పార్టీలో చేరిక అనంతరం జగన్‌ ఈ మేరకు సజ్జలను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఆనం వెంకటగిరి నుంచి పోటీ చేయనున్నట్లు స్పష్టమవుతోంది.
 
 
రేపు తిరుపతి పార్లమెంట్‌ సమావేశం
వైసీపీలో ఆనం రామనారాయణరెడ్డి పాత్రను తెలియజేయడం కోసం మంగళవారం తిరుపతి పార్లమెంటరీ కో- ఆర్డినేటర్ల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆనం చేరిక శిబిరంలో పార్టీ నేతలకు తెలిపారు. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, ఇతర ముఖ్య నాయకులు జగన్‌ పాదయాత్ర శిబిరంలో నిర్వహించే ఈ సమావేశానికి హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఈ సమావేశంలో పార్టీలో ఆనం రామ నారాయణరెడ్డి పాత్ర ఏమేరకు ఉంటుందో తెలియజేయనున్నారు. ప్రస్తుతం తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కొనసాగుతున్నారు. ఈయన స్థానంలో పార్లమెంట్‌ బాధ్యతలను ఆనంకు అప్పగిస్తారా..!? లేక పార్లమెంట్‌ పరిధిలో పార్టీ బలోపేతానికి ఆనం సూచనల మేరకు పనిచేయాలని ప్రస్తుత అధ్యక్షునికి ఇతర నాయకులను ఆదేశిస్తారా వేచి చూడాల్సి ఉంది.
 
వెంకటగిరి బాధ్యతలు ఆనంకు అప్పగించిన పక్షంలో ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడి, నేడో రేపో పార్టీలో చేరబోతున్న నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. అలాగే తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని సూళ్లూరుపేట, గూడూరు నియోజకర్గం పరిధిలోని మేకపాటి వర్గీయులు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఆనం పెత్తనంపై ఎలా స్పందిస్తారో..? వేచి చూడాలి. ఏది ఏమైనా ఆనం చేరికతో జిల్లా వైసీపీలో కొత్త పరిణామాలు, సమీకరణలకు బీజం పడింది.
Link to comment
Share on other sites

ఆశలు గల్లంతు.. జగన్‌పై పెట్టుకున్న నమ్మకం వమ్ము!
04-09-2018 12:19:21
 
636716603601273194.jpg
  • బొమ్మిరెడ్డి దారెటు!?
  • ఆనం చేరికతో ఆశలు గల్లంతు?
  • వెంకటగిరిలో నాలుగేళ్లపాటు పర్యటనలు
  • అధినేతపై నమ్మకంతో చేజారిన అవకాశాలు
  • రామనారాయణరెడ్డితో నడుస్తారా!?.. మరోదారి వెతుక్కుంటారా!?
  • నాయకులతో నేడు జగన్‌ కీలక సమావేశం
  • జడ్పీ చైర్మన్‌ హాజరవుతారా.. కారా!?
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పార్టీలకు అతీతంగా నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం సానుభూతి పొందుతున్న వ్యక్తి జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంధ్రరెడ్డి. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడంతో ఒక్క రోజులోనే రాజకీయ భవిష్యత్తుపై ఈయన పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. జగన్‌ మీద ఈయన పెట్టుకున్న నమ్మకం ఒమ్మయ్యింది. జడ్పీ చైర్మన్‌ రాఘవేంద్రరెడ్డి వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా నాలుగన్నర ఏళ్లపాటు ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను, నాయకులను ఇరుకున పెట్టడం కోసం దొరికిన అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. వెంకటగిరి టికెట్‌ తనకే వస్తుందన్న ఆశతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆశీస్సులు కూడా ఉండటంతో ధీమాతో గడిపారు. కానీ.. ఒక్క రోజులో ఆయన కట్టుకున్న రాజకీయ మేడలు పేక మేడల్లా కూలిపోయాయి. వెంకటగిరిని ఆనం రామనారాయణరెడ్డికి అప్పగిస్తూ వైసీపీ అధినేత జగన్‌ తీసుకున్న నిర్ణయం బొమ్మిరెడ్డి రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంలోకి నెట్టింది. ఆనం వైసీపీలో చేరుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఆయనకు ఏ స్థానం ఇస్తారనేది అందరి లో చర్చనీయాంశంగా మారింది. వెంకటగిరి కేటాయించే అవకాశం లేదని బొమ్మిరెడ్డి వర్గీయులు గట్టిగా విశ్వసించారు. జగన్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న మేకపాటి కుటుంబ సభ్యుల అభిష్టానికి వ్యతిరేకంగా ఆనంకు నియోజకవర్గం కేటాయించరని, ఆ కోణంలో వెంకటగిరి టికెట్‌ తన పరిధి దాటి వెళ్లదని బొమ్మిరెడ్డి అంచనా వేసుకున్నారు. అయితే ఆనం పార్టీలో చేరిన రోజే ఆ సస్పెన్స్‌కు తెరపడింది. వెంకటగిరి విషయంలో ఆనంతో కో-ఆర్డినేట్‌ చేసుకోమని జిల్లా ఇన్‌చార్జి సజ్జలకు జగన్‌ ఆదేశాలు జారీ చేయడంతో వెంకట గిరి టిక్కెట్టు ఆనం పరమయిందనే విషయం బొమ్మిరెడ్డితో సహా పార్టీ వర్గాలందరికీ స్పష్టమయింది.
 
 
చేజార్చుకున్న అవకాశాలు
ఆనం పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారన్న స్పష్టమైన సంకేతాలు అందిన వెంటనే తెలుగుదేశం అప్రమత్తమైంది. బొమ్మిరెడ్డికి గేలం వేసింది. టీడీపీలోకి వస్తే తక్షణం ఆత్మకూరు ఇన్‌చార్జిగా ప్రకటి స్తామని, రాబోయే ఎన్నికల్లో టిక్కెట్టు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆత్మకూరు బొమ్మిరెడ్డికి సొంత నియోజకవర్గం కావడం, ఆయన తండ్రి డాక్టర్‌ బి.సుందరరామిరెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవ డం, ఈ కుటుంబానికి ఆత్మకూరు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో బొమ్మిరెడ్డి కోసం టీడీపీ నాయకులు ప్రయత్నిం చారు. అయితే జగన్‌ మీద ఉన్న నమ్మకంతో అధికార పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని బొమ్మిరెడ్డి వదులుకున్నట్లు చెబుతున్నారు. ఆ నమ్మకం ఒమ్మయిన క్రమంలో మరో అవకాశం కోసం చూద్దామన్నా వీలులేని పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఆత్మకూరు నుంచి బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దించుతోంది. ఒకవేళ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మనసు మార్చుకుని మరో దారి చూసుకోవలన్నా ఆత్మకూరుకు వెళ్లే దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు బొమ్మి రెడ్డికి ఆనంతో కలిసి పనిచేయడమా..! లేక.. రాజకీయంగా కొత్త దారి వెతుక్కోవడమా..! ఈ రెండు మార్గాలు మాత్రమే మిగిలాయని పరిశీలకులు భావిస్తున్నారు.
 
 
నేటి తిరుపతి పార్లమెంట్‌ సమావేశానికి వెళతారా!?
వెంకటగిరి విషయంలో తీసుకున్న కొత్త నిర్ణయాన్ని తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని నాయకులతో చర్చించడానికి మంగళవారం పాదయాత్ర శిబిరంలో జగన్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెంకటగిరి ఇన్‌చార్జి హోదాలో బొమ్మిరెడ్డి హా జరవుతారా..!? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన దగ్గరి బంధువును పరామర్శించడానికి బొమ్మిరెడ్డి చెన్నై వెళ్లినట్లు సమాచారం. అక్కడి నుంచి విశాఖపట్నం వెళతారా..! లేక బంధువు అనారోగ్య కారణాలతో హాజరు కాలేనని సంకేతాలు పంపుతారా!? అనేది అంతుపట్టడం లేదు. ఈ సమావేశంలో వెంకటగిరి గురించి జగన్‌ చెప్పబోయే నిర్ణయాల ఆధారంగా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ప్రతిస్పందన ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
Link to comment
Share on other sites

8న వైసీపీలోకి నేదురుమల్లి!
05-09-2018 12:43:08
 
636717481876953256.jpg
  • విశాఖలో జగన్‌ సమక్షంలో చేరిక
వాకాడు(నెల్లూరు జిల్లా): వైసీపీలో చేరికకు నేదురుమల్లి రాంకుమార్‌ ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 8వ తేదీన ఆయన విశాఖపట్నంలో జగన్‌ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. గత కొంతకాలంగా రాజకీయ సంశయంలో కొట్టుమిట్టాడిన నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి చివరికి వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కొద్దిరోజు ల క్రితం ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మంచి రోజు చూసుకొని పార్టీలో చేరే తేదీని ప్రకటించిన రాంకుమార్‌ 8వ తేదీన చేరడానికి నిర్ణయించుకున్నారు. పార్టీలో చేరిక సందర్భంగా వెంకటగిరి, గూడూరు నియోజక వర్గాల నుంచి నేదురుమల్లి కుటుంబ అభిమా నులను విశాఖకు తీసుకెళ్లడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం వాకాడులోని తన స్వగృహంలో కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల నాయకుల తో ఆయన సమావేశమయ్యారు.
 
గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల నుంచి 20 ప్రత్యేక వాహనాలలో సుమారు 2 వేల మందితో తరలి వెళ్లి జగన్‌ సమక్షంతో వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 7వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వాకాడు నుంచి వాహనాలు బయలుదేరుతాయి. వైసీపీలో చేరాలని నేదురుమల్లి నిర్ణయం తీసుకున్న క్రమంలో ఇంతకాలం స్తబ్దుగా ఉన్న ఆయన వర్గీయుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే నేదురు మల్లి వైసీపీ టిక్కెట్టు ఆశిస్తారా, లేక పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు గూడురు, వెంకటగిరి వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తారా? లేక విశాఖ ఎంపి అభ్యర్థి అవుతారా అనే విషయం తేలాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సి ఉంది.
Link to comment
Share on other sites

ఒక్కసీటు కోసం వైసీపీలో ఇంతమంది మధ్య పోటీనా ?
05-09-2018 13:15:54
 
636717501541487035.jpg
  • వెంకటగిరి.. టికెట్‌ ఎవరిదో మరి!
  • వైసీపీలో పెరుగుతున్న ఆశావహులు
  • టికెట్‌పై ఎవరిధీమా వారిదే!
గూడూరు(నెల్లూరు జిల్లా): వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ టికెట్‌ కోసం పోటీ ఎక్కువవుతోంది. నాలుగేళ్లుగా స్తబ్దుగా ఉన్న వెంకటగిరి రాజకీయం ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఒక్కసారిగా వేడెక్కింది. ఒకరో ఇద్దరో మధ్య నెలకొన్న పోటీ ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీలో చేరుతుండటంతో రంజుగా మారింది. వెంకటగిరిలో 2014లో కొమ్మి లక్ష్మయ్యనాయుడు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందారు. అనంతరం కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత స్తబ్దుగా ఉండిపోయారు. ఈ క్రమంలో జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించేలా కార్యక్రమాలు రూపొందించారు. నియోజకవర్గంలో బంధువర్గం ఉండటం తనకు ప్లస్‌ పాయింట్‌ అని, టికెట్‌ రేసులో తనకు ప్రాధాన్యం ఉంటుందని ధీమాగా సాగుతున్నారు. మరోవైపు వైసీపీ ఆవిర్భావం నుంచి యువతను చేరదీసి వైఎస్ఆర్‌ ట్రస్ట్‌ జిల్లా అధ్యక్షుడిగా, కేఆర్‌పీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి టికెట్‌ బరిలో తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు రాంకుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరి ఆ పార్టీలో రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అయితే తన రాజకీయ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందరి మద్దతు కూడగట్టుకుని జగన్మోహన్‌రెడ్డితో మంతనాలు సాగించారు. సెప్టెంబరు 8వ తేదీన పార్టీలో చేరేందుకు అనుచరగణాన్ని సన్నద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటగిరి టికెట్‌ రాంకుమార్‌కు వస్తుందన్న ధీమా ఆ వర్గంలో నెలకొంది.
 
 
ఆనం చేరికతో..
అదే సమయంలో జిల్లాలోని మరో బలీయమైన రాజకీయ కుటుంబం ఆనం రంగ ప్రవేశంతో వెంకటగిరి రాజకీయాలు వేడెక్కాయి. గతంలో రాపూరు నియోజకవర్గం ఉన్నప్పుడు రాపూరు, కలువాయి మండలాలతోపాటు సైదాపురం కొంతభాగం ఉండేది. ఇక్కడ నుంచి ఆనం చెంచుసుబ్బారెడ్డి, ఆనం సంజీవరెడ్డి గెలుపొందారు. మూడు పర్యాయాలు ఆనం రామనారాయణరెడ్డి గెలుపొందారు. ఆనం ఓటమి పాలైనప్పుడు కండలేరు జలాల కోసం పది రోజులు ఆమరణ దీక్ష చేపట్టారు. రాపూరులో ఆనం వర్గం పట్టు ఇప్పటికి కొనసాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఆదివారం విశాఖ జిల్లాలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరడంతో వెంకటగిరి టిక్కెట్‌ ఖరారు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే టికెట్ల వేట తుదకు పార్టీని ఏ మేరకు గట్టెక్కిస్తుందో అన్న సందిగ్ధంలో రాజకీయ పరిశీలకులు ఉన్నారు.
 
నిన్నటిదాక ఎవరికివారుగా ఉంటున్న బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలిమిలి రాంప్రసాద్‌రెడ్డిలు కలిసి ఆదివారం వైఎస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం చర్చానీయాంశంగా మారింది. ఈ కలయిక ఏ రాజకీయ ప్రయోజనాలకు నాంది వాచకం పలుకుతుందోనని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్‌ ఖరారు తేదీ దగ్గర పడే సమయానికి ఏకతాటిపై నిలుస్తారా, వర్గ రాజకీయాలకు ఆజ్యం పోస్తారా!? అనే చర్చ సాగుతోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...