Jump to content

ఉద్యోగాలు ఊడతాయ్‌


Recommended Posts

KCR warning to RTC unions.

  • ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ వార్నింగ్‌
  • ఆర్టీసీ చరిత్రలో చివరి సమ్మె అని వ్యాఖ్య
  • సంస్థ మూతపడుతుందని హెచ్చరిక
  • సంఘాల నేతలు సంస్థను ముంచుతున్నారు
  • వారిని నమ్మి కార్మికులు మోసపోవద్దు
  • సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
  •  యూనియన్‌ నేతల డిమాండ్లు అసమంజసం
  •  వాటిని అంగీకరిస్తే సంస్థపై 1400 కోట్ల భారం
  •  కార్మికులకు ప్రభుత్వం 44ు ఫిట్‌మెంట్‌ ఇచ్చింది
  •  4 వేల మంది కార్మికులను క్రమబద్దీకరించింది
  •  అయినా మార్పులేదు.. సంస్థ లాభాల్లోకి రాలేదు
  •  ఆర్టీసీ మునిగితే బాధ్యులు యూనియన్‌ నేతలే
  •  యూనియన్‌ ఎన్నికల్లో గెలవడం కోసమే ఇదంతా
  •  ఇక్కడా ఆర్టీసీని విభజించక తప్పదేమో: సీఎం
హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ‘‘నాయకుల మాటలు విని కార్మికులు మోసపోవద్దు. తక్షణమే సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. సమ్మెలో పాల్గొంటే తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుంది. ఉద్యోగాలు పోగొట్టుకోదల్చుకున్న కార్మికులు మాత్రమే సమ్మెలోకి దిగండి. సమ్మెకంటూ వెళితే, టీఎ్‌సఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుంది. ఆర్టీసీని మూసివేయాల్సి వస్తుంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సమ్మెలో పాల్గొనదలచుకోని ఉద్యోగులు తమ నిర్ణయాన్ని యాజమాన్యానికి తెలియజేయాలని సూచించారు. తెలంగాణ అంటే నాలుగు కోట్ల ప్రజలని, కేవలం 53 వేల మంది ఆర్టీసీ కార్మికులు మాత్రమే కాదని, యావత్‌ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సమ్మె అన్న ఆలోచనే ఆత్మహత్యా సదృశమని, ఈ విషయాలన్నీ ఉద్యోగులు ఆలోచించుకోవాలని స్పష్టం చేశారు. తమ డిమాండ్ల సాధనకు ఆర్టీసీ యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వపరంగా చేయాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, డిమాండ్లు నెరవేర్చే విషయమై సాధ్యాసాధ్యాలపై ప్రగతి భవన్‌లో గురువారం సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ఆర్టీసీలో సమ్మె చేయడాన్ని నిషేధించినా కొందరు స్వలాభం కోసం సమ్మె నోటీసు ఇవ్వడంలోని ఔచిత్యాన్ని కార్మికులు ఆలోచించాలి. యూనియన్‌ నాయకులు మొత్తం ఆర్టీసీని ముంచే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాట విని కార్మికులు మోసపోవద్దు’’ అని సూచించారు.
 
మరో రూ.1400 కోట్ల భారం
ప్రభుత్వరంగ సంస్థలను కాపాడటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని, కానీ, రూ.3 వేల కోట్ల అప్పు, అప్పుపై రూ.250 కోట్ల వడ్డీ, సాలీనా రూ.700 కోట్ల నష్టంతో మనుగడ సాగిస్తున్న ఆర్టీసీపై ఏటా మరో రూ.1400 కోట్ల భారం పడేలా యూనియన్‌ నాయకులు సమ్మెకు నోటీసివ్వ డం అసమంజసం, బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. అప్పులు, నష్టాలు కలుపుకొంటే ఆర్టీసీ మనుగడ సాగించగలదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే నష్టా ల్లో ఉన్న ఆర్టీసీని కాపాడటం ఎలా అని ప్రభుత్వం ఆలోచిస్తుంటే.. అదనంగా రూ.1400 కోట్ల మేర జీతాలు పెంచాలనడం సరికాదన్నారు. నష్టాలను పూడ్చుకోవడానికి ఆర్టీసీ చా ర్జీలు పెంచడానికి తమకు అనుమతి ఇవ్వాలని యానియన్‌ నాయకులు అడగటం కూడా అసమంజసమని, భవిష్యత్తులో ఆర్టీసీ మునిగిపోతే దానికి బాధ్యులు సమ్మెకు దిగిన యూనియన్‌ నాయకులే అని సీఎం స్పష్టం చేశారు. డిమాండ్లన్నీ నెరవేర్చాలంటే మొత్తం ఆర్టీసీని ప్రభుత్వమే భరించాలని, దీనికి ఐదారు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, ఆ స్థోమత ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించుకోవాలన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ తదితర సంక్షేమ కార్యక్రమాలకు నిధులు పెద్దఎత్తున కేటాయించి ఖర్చు చేయాల్సిన నేపథ్యంలో ఆర్టీసీ భారాన్ని భరించడం కష్టమని స్పష్టం చేశా రు. ఇతర ఆర్టీసీ ఉద్యోగులతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ ఇస్తున్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
 
కర్ణాటకలో సగటున ప్రతి 4.6 మంది కార్మికులకు ఒక బస్సు నడుపుతున్నారని, టీఎ్‌సఆర్టీసీలో ప్రతి 5.6 మంది కార్మికులకు ఒక బస్సు నడుస్తోందని, కర్ణాటక పద్ధతిని మనం అవలంబిస్తే.. అంటే, ఉద్యోగులను తగ్గిస్తే నష్టాలు రూ.600 కోట్లు తగ్గుతాయని సీఎం అన్నారు. కర్ణాటకలో 226 డిపోలతో విజయవంతంగా నడపగలుగుతున్నారని, అందులో మూడో వంతు కూడా లేని 97 డిపోలతో మనం లాభాల్లో ఉండలేకపోతున్నామని తప్పుబట్టారు. తక్షణమే సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. ఒకసారి సమ్మెకు పోవడమంటూ జరిగితే ఇప్పుడున్న నష్టాలకు అదనంగా రోజుకు రూ.4 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తుందని వివరించారు. యూనియన్‌ నాయకుల అసమంజసమైన కోరికలైన 25ు ఐఆర్‌, 50ు ఫిట్‌మెంట్‌ ఇస్తే ఇప్పుడున్న నష్టాలకు సాలీనా మరో రూ.1400 కోట్ల అదనపు భారం ఆర్టీసీపై పడుతుందని, సమ్మెకు పోయి కార్మికుల గొంతు కోసే కంటే సంస్థను ఎలా బలోపేతం చేసుకోవాలో యూనియన్‌ నాయకులు ఆలోచించాలని హితవు పలికారు. ‘‘దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ పెంచని విధంగా గతంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను 44ు మేరకు పెంచాం. 4000 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాం. భవిష్యత్తులో సంస్థ ను లాభా ల బాటలో నడిపించాలని సూచించాను. ఇప్పటికీ ఫలితం కనిపించలేదు’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. రెండేళ్ల కిందట ఆర్టీసీ ఉద్యోగులతో విస్తృత స్థాయి సమావేశం జరిపినప్పుడు 96 డిపోల్లో 9 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయని, ఇప్పటికీ వాటిలో ఏ మార్పూ రాలేదని చెప్పారు. ‘‘చాలా రాష్ర్టాల్లో ఆర్టీసీ కార్పొరేషన్లను ఎత్తివేయడమో, నామమాత్రంగా నడపడమో, లేదా పునర్య్వవస్థీకరించడమో జరిగింది. ఇదే పద్ధతి తెలంగాణలో కూడా అవలంబించాల్సిన పరిస్థితులు రావచ్చు.’’ అని సీఎం అన్నారు. యూనియన్‌ ఎన్నికల్లో గెలవాలనే ఒకే ఒక కారణంతో స్వార్థపూరిత ఆలోచనలతో ప్రభుత్వాన్ని, కార్మికుల కుటుంబాలను ఇబ్బందికి గురిచేసే ప్రయత్నం చేయడం సరికాదని సీఎం హితవు పలికారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, సీఎంవో అధికారులు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, ఆర్టీసీ ఎండీ రమణారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈనెల 11 నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు ప్రకటించిన నేపథ్యంలో ఎన్‌ఎంయూ నేతలతో మంత్రి మహేందర్‌ రెడ్డి శుక్రవారం సచివాలయంలో సమావేశమై చర్చించనున్నారు.
 
ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు
సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ప్రస్తావించిన సీఎం కేసీఆర్‌.. ప్రస్తుతం ఆర్టీసీ నడుపుతున్న 2200 అద్దె బస్సులకు అదనంగా ఇతర సంస్థలు, రాష్ర్టాల సహకారం తీసుకుని ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రైవేటు, పదవీ విరమణ చేసిన డ్రైవర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఒకసారి సమ్మె జరిగి బస్సులు నడవకపోతే ప్రజలు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారని, ప్రైవేటు వాహనాలు మార్కెట్లోకి వస్తాయని, ఒకసారి మార్కెట్లోకి వచ్చిన వాహనాలను తిరిగి వెనక్కు తీసుకోవడం కష్టమని వివరించారు. ఒక విధంగా యూనియన్‌ చర్యతో ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు వాహనాలను వారే ప్రవేశపెట్టినట్లు అవుతుందని సీఎం అన్నారు.
Link to comment
Share on other sites

Karnataka city bus fare too much when compared with TN and AP/TG.

I went to chennai ( 2004-2005 ) once and the conductor took Rs.2 as ticket from me, I thought the stop is close by and stood near the door.  It took 45 mins ( more than 5-6 stops ) to reach.  TN is dead cheap and AP/TG is also not bad.   But Karnataka is very expensive and day light robbery by Govt.

Link to comment
Share on other sites

34 minutes ago, krishna_a said:

Karnataka city bus fare too much when compared with TN and AP/TG.

I went to chennai ( 2004-2005 ) once and the conductor took Rs.2 as ticket from me, I thought the stop is close by and stood near the door.  It took 45 mins ( more than 5-6 stops ) to reach.  TN is dead cheap and AP/TG is also not bad.   But Karnataka is very expensive and day light robbery by Govt.

I agree with u but it’s almost 18months back ..

 

Chennai lo ippudu min ticket 8 or 10 ane vinnanu ..baagha increase chesaaru sudden ghaaa

Link to comment
Share on other sites

Guest Urban Legend
4 hours ago, Naren_EGDT said:

Eedu cm kurchi kosam telangana udyamam perutho enni sammelu cheyaledu ?

 

Ipudu neetulu ?

appudu govt eedidhi kaadhu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...