Jump to content

CBN 4 Years Governance


Recommended Posts

అన్నింటా మెరిసి.. అభివృద్ధి మురిసి.. 
ప్రపంచంలో అతిపెద్ద సౌర పార్కు 
వైద్యం.. విద్యాభివృద్ధిలో కొత్త పుంతలు 
వేగంగా విమానాశ్రయ పనులు 
గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులపై కొండంత ఆశలు 
వ్యవసాయానికి పెద్దపీట 
knl-top1a.jpg

నవ్యాంధ్ర ఏర్పడి.. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేతపట్టి నాలుగు వసంతాలు పూర్తయ్యాయి. నవ నిర్మాణ దీక్ష బూని రాష్ట్రాభివృద్ధికి నేడు మహా సంకల్పం పలుకుతున్న శుభ సందర్భంగా ఈ నాలుగు వత్సరాల గమనాన్ని అవలోకిస్తే.. రాష్ట్రంతోపాటు మన కర్నూలు ఎన్నో మార్పులను సంతరించుకుంది. ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పునాదులు వేసుకుంది. రాయలేలిన రతనాల సీమ.. పసిడి పంటలతో పూర్వ ప్రాభవం పొందుతోంది. జల పరవళ్లతో ఊరూరూ సస్యశ్యామలమవుతోంది. బంగరు సీమ.. భాగ్యసీమగా కందనవోలు కదంతొక్కే వేళ ప్రగతి వీచికలను పరిశీలిస్తే...

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు

అభివృద్ధి వెలుగుల్లో.. జిల్లా ప్రగతి పరవళ్లు తొక్కుతోంది. ఊహించని విధంగా భారీ ప్రాజెక్టులు కర్నూలు చెంతకు చేరాయి. ఇప్పటికే కొన్ని కార్యరూపం దాల్చగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో విద్య, వైద్యం, వ్యవసాయంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పాలకులకు మిగిలిన ఈ ఏడాది కాలవ్యవధిలో అటు అన్నదాతలు.. ఇటు ప్రజలు కోరుతున్న వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయడానికి కసరత్తు జరుగుతోంది. కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వం 111 పథకాలను జిల్లాలో అమలుచేసి పేదలకు భరోసాను నింపింది. అర్హులైన లబ్ధిదారులకు ఆ పథకాలను చేర్చడంలో అధికారులు కీలక పాత్ర వహించారు. నవ్యాంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి జూన్‌ 8కి నాలుగేళ్లవుతున్న సందర్భంగా ‘ఈనాడు’ ప్రత్యేక కథనమిది.

పరిశ్రమల ఖిల్లాగా... 
విద్యుత్తు కొరత లేకుండా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో కీలకమైంది గని-శకునాల సౌర పార్కు. పునరుత్పాదక శక్తి వనరులను సమర్థంగా అందిపుచ్చుకోవడానికి ప్రపంచంలోనే అతిపెద్ద(ఒకేచోట) 5,811 ఎకరాల్లో దీనిని నిర్మించారు. 40 లక్షల పైచిలుకు సౌర ఫలకలు ఏర్పాటు చేసి వెయ్యి మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్‌లకు అనుసంధానం చేశారు. రూ.6 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఓర్వకల్లును ఇండస్ట్రియల్‌ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో ఏడాదికి మూడు మిలియన్ల మెట్రిక్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా జైరాజ్‌ ఇస్పాత్‌ పరిశ్రమకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం తొలి విడతలో 415 ఎకరాలు   ప్రభుత్వం భూమి కేటాయించగా, రూ.1658 కోట్ల పెట్టుబడితో ఏడాదికి ఏడు లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ఇదే ప్రాంతంలో డీఆర్‌డీవోకు 2,989 ఎకరాలు, న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌కు 896 ఎకరాలు, ప్రభుత్వం ఎంవోయూ చేసుకున్న ఐదు సంస్థలకు 1310 ఎకరాలు కేటాయించారు. కొలిమిగుండ్లను సిమెంట్‌ పరిశ్రమల హబ్‌గా తీర్చుదిద్దుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మౌలిక  సదుపాయాల కల్పన సంస్థ ఆధ్వర్యంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్లలో 882 ఎకరాలు కేటాయించగా.. 682 ఎకరాలు ఇప్పటికే సమకూర్చారు. ఇలా కర్నూలు నాలుగేళ్లలో పరిశ్రమల ఖిల్లాగా మారింది. ఒక్క ఓర్వకల్లు పరిధిలోనే పరిశ్రమలతో ప్రత్యక్షంగా.. పరోక్షంగా 80 వేల మందికి ఉద్యోగావకాశాలున్నాయి.

నాలుగు నెలల్లో ఆకాశయానం 
ఓర్వకల్లును ఇండస్ట్రియల్‌ హబ్‌గా మార్చుతున్న తరుణంలో ప్రయాణానికి వీలుగా విమానాశ్రయానికి శ్రీకారం చుట్టారు. ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచర్ల గ్రామాల పరిధిలో 1010 ఎకరాల భూసేకరణ జరిగింది. రూ.84 కోట్లతో చేపట్టిన ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో పనులు పూర్తిచేస్తామని సీఎం తెలిపారు. ప్రస్తుతం రన్‌-వే పనులు చివరి దశకు చేరుకున్నాయి. టెర్మినల్‌ భవనాలు సైతం 50 శాతం పూర్తయ్యాయి. కర్నూలు-అమరావతి, కర్నూలు-చెన్నై, కర్నూలు-హైదరాబాద్‌, కర్నూలు-బెంగళూరు విమాన సర్వీసులు తిరిగే అవకాశం కర్నూలు ప్రజల ముందుంది.

ఆ మూడు ప్రాజెక్టులపైనే... 
కర్నూలు జిల్లావాసులకు గుండెకాయగా చెప్పుకొనే గుండ్రేవుల జలాశయాన్ని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. 20 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. రూ.54.95 కోట్లకు పరిపాలనా అనుమతులు సైతం వచ్చాయి. ఈ ప్రాజెక్టు కల నెరవేరితే కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఎమ్మిగనూరు పరిధిలో రాజోలిబండ కుడికాల్వ నిర్మాణానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. దీని డీపీఆర్‌ సిద్ధం చేసేందుకు రూ.3.09 కోట్లు మంజూరు చేసిన విషయం విదితమే. ఇక వేదవతి ప్రాజెక్టుకు డీపీఆర్‌ను రూ.2.65 కోట్లతో చేపట్టి ప్రభుత్వానికి నివేదికలు పంపగా.. ఈ ఏడాది మే 5న పరిపాలనా అనుమతులు అందాయి. ఈ పథకం పూర్తయితే పశ్చిమ కర్నూలు ప్రాంతంలో కరవు మండలాల్లో పది లక్షల జనాభాకు తాగునీరు, 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రాష్ట్ర విభజన తర్వాత జీఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-1 కింద రూ.1043 కోట్లు ఖర్చు పెట్టారు.

క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌, ట్రిపుల్‌ ఐటీ 
సర్వజన వైద్యశాలలో స్టేట్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రూ.120 కోట్లతో చేపట్టిన ఈ ఆసుపత్రికి గత కొన్ని రోజుల క్రితం రూ.53 కోట్లు భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాయలసీమ రీజియన్‌లో క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ లేకపోవడంతో ఎందరో రోగులకు కిమో, వివిధ మెరుగైన వైద్యసేవలు ఇకపై అందనున్నాయి. రక్తహీనతతో జరుగుతున్న మరణాలను అరికట్టేందుకు డీఎంఎఫ్‌ నిధులతో కొర్రపాయసం పంపిణీకి కొత్తగా చేపట్టారు. జగన్నాథగట్టుపై 151 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో ట్రిపుల్‌ ఐటీ మంజూరైంది. ఈ ఏడాది తరగతులు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం నిధులు పూర్తిస్థాయిలో అందకపోవడంతో నిర్మాణాలు మందకొండిగా సాగుతున్నాయి. ఉర్దూ యూనివర్సిటీకి ఓర్వకల్లులో 143 ఎకరాల్లో రూ.58 కోట్లతో ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. శంకుస్థాపన సమయంలో రూ.33 కోట్లు భవన నిర్మాణాలకు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.

Link to comment
Share on other sites

Nellore

చతుర్ముఖ ప్రగతిరథం 
ఎన్నో సంక్షేమ పథకాలు 
ప్రతి ఒక్కరికీ అందిన ఫలాలు 
’మహా సంకల్పం‘తో నేడు జిల్లాకు సీఎం రాక 
nlr-top1a.jpg



 

అంతులేని చీకటి ముసిరి 
ఒక్క పాటున తెగిన రెక్కలు 
అలుపు లేని శ్రమతో 
రాజధానికి తాను నిర్మాతయి 
అన్ని దిక్కులకు వెలుగైన సూర్యుడు. 
గృహనిర్మాణాలు 
కొరతలేని విద్యుత్తు 
అన్నపూర్ణగా అన్న క్యాంటిన్లు 
ఎన్నో సోలార్‌ పార్కులు 
విమానాశ్రయాలు, ఓడరేవులు 
నీటి వనరులతో దాహాన్ని తీర్చి 
విద్య, వైద్యం అందరికి 
చంద్రన్న సంక్రాంతి కానుకలు 
రంజాన్‌ పండుగ తీపి వంటలు 
గురుకులాల పేరుతో చదువు ఇక అందరికి 
ఎవరెస్టు అయితే ఏమీ, మార్స్‌ అయితే ఏమీ 
లక్ష్యం ఏదైనా ఒక్క పరుగున చేరే మన విద్యార్థులు 
చక్కటి రోడ్లు, తాగునీటి వసతి 
తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌, మాతాశిశుసంరక్షణ 
సంచారవాహనాలతో మెరుగైన వైద్య సేవలు 
చంద్రన్న బీమా పేదల్లో భరోసా 
పెళ్లి కానుకతో బడుగుల ముఖాల్లో వెలుగు 
పల్లెపల్లెకు బాటలు పరుస్తూ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటూ ముందడుగు వేస్తోంది.


ఈనాడు-నెల్లూరు

‘మీ కోసం’ అంటూ ప్రజల్లోకి వచ్చిన సమయంలో గుండె నిండా ఆర్థ్రత నిండింది. అప్పుడు అధికారం లేదు. ఏం చేయాలన్నా అసహాయత. ప్రజలు పడుతున్న కష్టాలు మనస్సును చలించేలా చేశాయి. అప్పుడు అనుకున్నాడు.. ప్రజలకు సేవ చేసే అవకాశం మళ్లీ వస్తే.. ప్రతి ఇంటికి ‘పెద్ద కొడుకు’ మాదిరి ఉంటానని భరోసా ఇచ్చాడు. మొదలైన ప్రయాణం. నాలుగేళ్లు గడచింది. జిల్లాలో ప్రతి ఇంటికి ఆయన్ను పెద్ద కొడుకు చేసింది. నిస్సహాయ స్థితిలో సాయం కోసం ఆర్థ్రంగా ఎదురుచూస్తున్న వారి కన్నీళ్లు తుడిస్తే చాలు. వాళ్లు కుటుంబంలో ఒక్కరు కాకుండా ఉంటారా! సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు అదే చేశారు. పేదలు.. కడు పేదలు.. సాయం కోసం ఎదురుచూసే వారి సంక్షేమం కోసం సంక్షేమ పథకాలనే రూపకల్పన చేశారు. పుట్టిన పసికందు నుంచి పండు ముదుసలి వరకు.. ఏదో ఒక ప్రయోజనం ప్రభుత్వం అందించేలా పథకాల రూపకర్తగా మారారు. పట్టెడన్నం పెట్టడానికి సబ్సిడీపై కిరాణ సరకులు ఇచ్చారు. వాటిని కొనుగోలు చేయటానికి ఎన్టీఆర్‌ భరోసా అంటూ పింఛన్లు ఇచ్చారు. ఖరీదైన కార్పొరేట్‌ వైద్యానికి ఎన్టీఆర్‌ వైద్యం అంటూ పేరు. ఇలా పేర్లు ఏవైనా సంక్షేమం అనేది ముఖ్యం అంటూ జిల్లాలో రూ.కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. నాలుగేళ్ల ప్రయాణంలో చేసిన ఖర్చు రూ.వేల కోట్లను దాటింది. నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలు.. మౌలిక వసతులను సమపాళ్లలో జిల్లాకు అందిస్తూ దార్శనికత చూపిన ధీరుడుగా నవ్యాంధ్రను నాలుగేళ్లుగా నడిపించారు. ‘మహా సంకల్పం’తో సీఎం చంద్రబాబు శుక్రవారం జిల్లాకు వస్తున్నారు.

Link to comment
Share on other sites

Srikakulam

పాలనా తపస్సు.. చంద్రోదయ ఉషస్సు!! 
నేటితో తెదేపా ప్రభుత్వ పాలనకు నాలుగేళ్లు పూర్తి 
ఆర్థిక  చీకట్లు చుట్టుముట్టినా... 
ప్రజా సంక్షేమానికే అగ్రపీఠం 
‘జలవనరుల’ పథకాలపై ప్రత్యేక దృష్టి 
ఈనాడు, శ్రీకాకుళం 
skl-top1a.jpg

వివాహం చేసుకుంటే...‘పెళ్లి కానుక’ ఇచ్చి గర్భిణిల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ... పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే ‘ఎన్టీఆర్‌ బేబీ కిట్‌’ అందించి వైద్య సేవలకు ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి.. ‘అంగన్‌వాడీ’లనూ అధునాతనంగా రూపు దిద్ది... ‘అఆ’లతో పాటే...‘ఏ బీ సీ డీ’...అవసరమంటూ ఆంగ్ల మాధ్యమానికీ ప్రాథమికంగా బీజం వేసి... ట్రిపుల్‌ ఐటీలతో సాంకేతిక విద్య చెంతకు చేర్చి... ‘ఎన్టీఆర్‌ విద్యోన్నతి’ అంటూ పేదింటి ప్రతిభావంతులకు శిక్షణిచ్చి ఉద్యోగావకాశాలకు దారులు చూపి పాలనలో దార్శనికత చూపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల్లో అన్నదాతకూ అగ్రపీఠం దక్కింది. తానే పెద్దకొడుకునంటూ వృద్ధులకు పింఛన్లు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. జలవనరుల ప్రాధాన్యం గుర్తించి రూ. వందల కోట్లు వ్యయం చేసి సిక్కోలు సాగు బడి దిగ్విజయం కావాలని తలిచారు! వంశధార...ఆఫ్‌షోర్‌ రెండు కళ్లుగా నిధులిచ్చారు! పల్లెలకు సిమెంటు దారులే వడ్డానంగా మార్చి... ప్రధాన రహదారులను రూ. కోట్లతో విస్తరించారు! పేదింటి బాధితుల జీవితాలు కన్నీళ్లమయం కాకుండా ‘చంద్రన్న బీమా’ రూపంలో అభయమిచ్చారు!! నాలుగేళ్ల పాలనలో...ఆర్థిక చిక్కులను ఒడుపుగా అధిగమించి జిల్లాలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు!! తెదేపా ప్రభుత్వం నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో...‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

* పాలనా పరమైన అనుమతుల పెంపు: 
రూ. 933.90 కోట్ల నుంచి రూ.1,616.23 కోట్లకు 
* ఈ నాలుగేళ్లలో చేసిన ఖర్చు: రూ. 700 కోట్లు(సుమారు) 
* 32 కి.మీ. ప్రధాన కాలువపై నిర్మాణాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. 
* వాహనాల రాకపోకలను ‘మళ్లింపు మార్గం’లోకి మళ్లించి.. 0.00 వద్ద జలాశయ గట్టును పూర్తి చేస్తున్నారు.

తెదేపా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకం సాహసోపేతమైన నిర్ణయంగా గుర్తింపు పొందింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీగా ప్రకటించిన ఈ పథకంలో జిల్లా రైతులకు లబ్ధి చేకూరింది. రుణ బంధనాలు తెగిపోయాయి. లక్షల మంది కళ్లల్లో సంతోషం నిండింది.

ఆశల జలాశయం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో చేరిన ‘వంశధార’ పనులు పరుగులు తీస్తున్నాయి. ప్రతి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురోగతిపై సమీక్షిస్తున్నారు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ హిరమండలం జలాశయాన్ని నింపాలన్న కృతనిశ్చయంతో పనుల్లో వేగం పెరిగింది. అందుకు అనుగుణంగా జలాశయంలో ముంపునకు గురైన గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించారు. వంశధార ట్రైబ్యునల్‌ కూడా ఈ ఏడాది మనకు అనుకూలంగానే తీర్పును వెలువరించడం మరో అనుకూల అంశం.  2008లోనే ఆకస్మికంగా ఆగిపోయిన పనులు తిరిగి చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టగానే పునఃప్రారంభానికి నోచుకున్నాయి. ముంపునకు గురయ్యే గ్రామాల్లో నిర్వాసితుల ప్యాకేజీకి ఏకంగా రూ.421 కోట్ల నిధులను కేటాయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జులైలో వచ్చే వరద నీటితో హిరమండలం జలాశయాన్ని నింపేందుకు వీలుగా పనుల్లో ఎప్పటికప్పుడు వేగాన్ని పెంచేందుకు స్వయంగా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో దాదాపు ఆయకట్టు స్థిరీకరణకు మార్గం సుగమమం అవుతుంది. పలాస వరకు శివారు ఆయకట్టుకు నీరందుతుంది. జిల్లాలో రెండోపంటకు నికర జలాలు సమృద్ధిగా లభిస్తాయి.  బీ హిరమండలానికి ముందు నిర్మించాల్సిన రెండు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల పనులను శరవేగంగా పూర్తి అవుతున్నాయి. హిరమండలం జలాశయాన్ని వంశధార వరదతో నింపి.. ఎన్నికలకు వెత్తామన్న ధీమాలో ప్రభుత్వం ఉంది. బీ పింఛన్ల పంపిణీలో చంద్రబాబు హామీని నెరవేర్చుకున్నారు. ఇంటింటికి పెద్దకొడుకై నెలనెలా పింఛన్లతో ఆదుకుంటున్నారు.చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పింఛను మొత్తం అయిదు రెట్లు పెరిగింది. అప్పట్లో రూ.200లు మాత్రమే అందేది. ఆ మొత్తం రూ.వెయ్యికి చేరింది. తెదేపా ప్రభుత్వం రాక మునుపు పింఛన్ల రూపంలో ఏటా రూ.80 కోట్ల వరకు పరిమితం అయిన మొత్తం ప్రస్తుతం రూ.383 కోట్లు దాటింది. గతంలో అనర్హులు సైతం పింఛన్లు పొందేవారు. అలాంటి వారివి తొలగించి మళ్లీ అర్హులను చేర్చారు. అందువల్లే లబ్ధిదారుల సంఖ్యల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. 
 

skl-top1b.jpg

సొంతింటి కల.. నెరవేర్చేలా.. 
సొంత ఇల్లు.. ప్రతి ఒక్కరి ఇది. దీన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పేరుతో ఇళ్లను నిర్మించగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ పేరుతో ఇళ్లను నిర్మింపజేశారు. గతంలో కేవలం రూ.75 వేల చొప్పున మాత్రమే ఇవ్వగా.. ప్రస్తుతం ఇళ్లను బట్టి రూ. 1.50 లక్షలు, రూ. 2 లక్షల వరకు మంజూరు చేశారు. పట్టణ ప్రాంతాల్లో రూ. 3.5 లక్షల వరకు మంజూరు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 268 కోట్ల నిధులు కేటాయిస్తోంది.

పల్లెకు ‘సీసీ’ కళ 
‘చంద్రన్నబాట’ పల్లెల రూపు మార్చింది. మట్టి రోడ్లకు ‘సీసీ’ కళ తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి చంద్రన్నబాట కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున సీసీ రహదారుల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018-19) రూ. 115 కోట్ల అంచనా వ్యయంతో 500 కి.మీ మే సీసీ రహదారుల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పటివరకు రూ. 12 కోట్లతో 65 కి.మీ.ల సీసీ రహదారులు నిర్మించారు. ప్రభుత్వ నిబందనలకు అనుగుణంగా పీఆర్‌ ఇంజినీరింగ్‌ అధికారుల సమన్వయంతో జిల్లాలో మూడేళ్లలో అనుకున్న లక్ష్యాల మేరకు సీసీ రహదారుల నిర్మాణం పూర్తి చేశామని.. ఈ ఏడాది లక్ష్యాలు పూర్తిచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు పీఆర్‌ ఎస్‌ఈ ఎ.మోహనమురళీ తెలిపారు.

-న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

‘చెంబు’కు కాలం చెల్లేలా.. 
పల్లెల్లో బహిరంగ మలవిసర్జన నిర్మూలించి పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 అక్టోబరు నుంచి ఈ కార్యక్రమం అమలులోకి వచ్చింది. జిల్లాలో ప్రభుత్వ లక్ష్యాల మేరకు వివిధ శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ టి.శ్రీనివాసరావు తెలిపారు.

-న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

* నిర్మించిన మరుగుదొడ్లు: 2,97,133 
* నిధుల వ్యయం: రూ. 194.11 కోట్లు 
* వివిధ దశల్లో ఉన్నవి: 88,769 
* చెల్లించిన బిల్లులు:   రూ. 123.82 కోట్లు 
* నిర్మించాల్సినవి: 3,604 
* మొత్తం చేయాల్సిన ఖర్చు: రూ. 80 కోట్లు (సుమారు)

skl-top1c.jpg

ప్రజలకు చేరువగా ముఖ్యమంత్రి వైద్యసేవలు 
నరసన్నపేట, న్యూస్‌టుడే: ప్రజలకు వైద్యంను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు, ఇ.నేత్ర కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా జిల్లాలో 7 ఇ.నేత్ర కేంద్రాలను తెరుస్తూ గతేడాది సెప్టెంబరులో వైద్యవిధానపరిషత్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, నరసన్నపేట, ఆమదాలవలస, రాజాం, రణస్థలం ఆసుపత్రిల్లో ఇ.నేత్ర కేంద్రాలు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఇందులో నరసన్నపేట కేంద్రం నారావారిపల్లికి తరలిపోయిన విషయం తెలిసిందే. ఈకేంద్రాల్లో నేత్ర వైద్యపరీక్షలు నిర్వహించి, అంతర్జాలం ద్వారా నేరుగా రోగులకే వైద్యసమాచారం అందిస్తారు. నేత్ర వైద్యకేంద్రాల్లో రోగులకు తనిఖీలు చేసిన అనంతరం వైద్యం సాధ్యం కాకుంటే సెకండరీ కేంద్రాలు శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తారు. ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు శ్రీకాకుళంలో నాలుగు, పలాసలో ఒకటి నిర్వహిస్తున్నారు. 50వేల జనాభా పైబడిన కేంద్రాల్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేశారు. కార్పొరేట్‌ తరహాలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఈ కేంద్రాల్లో ఏడాదిక్రితం అమలులోకి తెచ్చారు. ఈ కేంద్రాల్లో రోగులకు అంతర్జాలం ద్వారా వైద్య నిపుణులతో సలహాలిస్తారు. ఇలా జిల్లాలో ప్రస్తుతం 5 కేంద్రాల్లో ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు నిర్వహణలో ఉన్నాయి.

Link to comment
Share on other sites

గమ్య నగరిపై... చంద్రకాంతులు 
ఈనాడు, విశాఖపట్నం 
నాలుగేళ్ల ప్రభుత్వ పయనం.. సంక్షేమ పథకాల్లో ఘనం.. 
అభివృద్ధిలో అమోఘం.. ఆపన్నులను ఆదుకోవటంలో మహోన్నతం.. 
హుద్‌హుద్‌ విపత్తును ఎదుర్కొనడంలో సాహసోపేతం... 
vsp-top1b.jpg

రాష్ట్రం విడిపోయింది... 2014 నుంచి కొత్తగా జీవం పోసుకోవాల్సిన పరిస్థితి.. ఆనాడు ఎన్నికలయ్యాయి. చంద్రబాబు నాయకత్వంలోని తెదేపా ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికి నాలుగేళ్లు నిండాయి. శుక్రవారం నుంచి అయిదో వత్సరంలోకి అడుగిడుతోంది. ఈ నాలుగేళ్లలో విశాఖ నగరం ఏ స్థాయిలో వృద్ధి చెందిందో.. అంతర్జాతీయంగా ఎంత ఎత్తుకు ఎదిగిందో మన కళ్లముందు కనిపిస్తున్నవే.

ఒకటా రెండా.. ఎన్నని.. అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శన, మూడు అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులు.. ఐటీలో సరికొత్త విప్లవం ఫిన్‌టెక్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలపై సదస్సులు.. విభిన్న ఉత్సవాలు.. పర్యాటక పండగలు.. 52 వేలమంది నిరుపేదలకు ఆక్రమణల క్రమబద్ధీకరణ పట్టాలు.. కేజీహెచ్‌లో అత్యంత అధునాతన వైద్య సదుపాయాలు.. 24 గంటల మంచినీటి సరఫరా.. 
నగర జీవి ఏం కోరుకుంటున్నాడో.. అవే కళ్లముందు కదలాడుతుంటే.. జీవన ప్రమాణాల స్థాయి అంతకంతకూ పెరుగుతూ ఉంటే.

vsp-top1a.jpgథకాలు, హామీలు, పర్యటనలు.. ఎపుడూ ఉండేవే. ఇవన్నీ చేస్తూనే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడికి వచ్చినపుడల్లా ఏదో ఒక అంశాన్ని గుర్తించడం.. తాను వెళ్లినచోటల్లా ప్రజల్ని గమనిస్తుండడం.. తన దృష్టికి ఏమైనా సమస్యలు రాగానే అధికారుల ద్వారా పుస్తకంలో నమోదు చేయించడం.. అధికారులతో భేటీ అయినప్పుడు తన మనసులో ఉన్నవన్నీ వారితో పంచుకోవటం.. ఆయనకు అలవాటు. ఇలా ప్రతీ పర్యటనలోనూ లెక్కలేనన్ని ఆలోచనలు.. ఆ తర్వాత అవి సాకారమయ్యే దిశగా అధికారుల ప్రయత్నం.. అదే విశాఖ ప్రగతి ఫలం. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో నగరం ఒక ప్రయోగశాల. అందుకే.. అన్ని రంగాల్లోనూ తన ఆలోచనలను అమలు చేశారు.

పరిశీలన ఎంత లోతుగా అంటే..: 2016 జూన్‌లో ఓసారి చంద్రబాబు విమానాశ్రయంలో దిగారు. కాన్వాయ్‌లో జాతీయ రహదారి మీదుగా వెళ్తుండగా కొందరు రోడ్డుమీదే ఉమ్మడాన్ని చూశారు. ఇది ఆయనకు బాధ కలిగించినట్లుంది. కాన్వాయ్‌ నుంచి దిగగానే అధికారులతో చర్చించి.. ‘విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో, జాతీయ రహదారిపై ఈ తీరు నచ్చలేదు. అలా జరగకుండా చూసుకోవాలని’ మరీమరీ చెప్పారు. గతేడాది కలెక్టరేట్‌ మార్గంలో సీఎం ఇక్కడికొచ్చారు. మార్గమధ్యలో పాడైపోయిన నడకబాటలు, మొక్కల పొదలు, రోడ్లను చూశారు. వాటిని అధికారుల వద్ద ప్రస్తావించారు.  ‘నగరాన్ని చూసుకునే విధానం ఇదా’ అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత కలెక్టర్‌ సహకారంతో రోడ్డుపక్కల ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించడం పరిపాటిగా మారింది.

ఊరంతా పచ్చగా ఉండాలి..: విశాఖ అందాల్ని ఆస్వాదించేవారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరు. ఓ సారి నగరానికి హెలికాప్టర్‌లో వస్తున్నపుడు ఇక్కడున్న కొండల్లో ఖాళీ స్థలాలను గమనించారు. అలాంటి చోట్ల మొక్కలు నాటించాలని అధికారులకు చెప్పారు. అది కార్యరూపం దాల్చింది. 
* మరోసారి ఆయన దృష్టి రైల్వేట్రాక్‌ల మీదికి వెళ్లింది. పట్టాలకు అటు ఇటు ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం, అవి ఏమాత్రం భద్రంగా లేకపోవడాన్ని గమనించారు. నగరం పరిధిలో ఎక్కడైతే పట్టాలున్నాయో.. అక్కడ ఇరువైపులా మొక్కలు నాటాలని రైల్వే, జీవీఎంసీ అధికారుల్ని ఆదేశించారు. ఆ తర్వాత అది పెద్ద కార్యక్రమంగా మొదలైంది. 
 *జాతీయ రహదారులకు అనుబంధంగా నగరంలో చాలా దారులున్నాయి. అవన్నీ బోసిపోయి ఉండటాన్ని చూసి.. ప్రతీ దారిలోనూ మొక్కలు కనిపించాలని ఆదేశాలు జారీచేశారు. ఇది కూడా కార్యరూపం దాల్చుతోంది. 
* ఎన్‌ఏడీ పైవంతెన నుంచి షీలానగర్‌ కూడలి వరకు రోడ్డు మధ్యన పచ్చదనం ఎంత బాగుంటుందో తెలిసిందే. దీనికి శ్రీకారం చుట్టిందీ చంద్రబాబే. ఈ రహదారి ఎంతో ఆహ్లాదంగా ఉండాలని చెబుతూనే ఆ మొక్కల పెంపకం ఎలా ఉండాలో కూడా ఆయనే వివరించారు. నీ ఈ మధ్యే అగ్రిటెక్‌ సదస్సుకు వచ్చినపుడు ఎన్‌ఏడీ పక్కనే ఉన్న వంతెనకు అటుఇటూ మొక్కలు కనిపించాలని.. ఇందుకోసం హాంగ్లర్‌ల ద్వారా మొక్కలతో కూడిన బకెట్‌లను పెట్టాలనీ సూచించారు. తాజాగా జీవీఎంసీ అధికారులు వాటిని ఏర్పాటుచేశారు. 
* తెలుగుతల్లి పైవంతెనపై ఏపుగా పెరిగిన మొక్కలతో కుండీలు పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుదేనని అధికారులు చెబుతున్నారు.

సాహస ఆటలు వచ్చేలా.. 
గతంలో ఓసారి చంద్రబాబు అధికారులతో భేటీ అయినప్పుడు కంబాలకొండను ఎలా వినియోగంలోకి తేవాలో చర్చించారు. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కి, రాక్‌ క్లైంబింగ్‌, ఈకో టూరిజానికి నెలవుగా ఉండేలా చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. అందరూ సరే అన్నారు. అదీ ఆవిష్కృతమైంది.

ఇంటింటికీ వంటగ్యాస్‌.. 
పైపుల ద్వారా ఇళ్లకు తాగునీరు ఎలా సరఫరా అవుతుందో వంటగ్యాస్‌ను కూడా అలాగే ఇవ్వాలన్న ఆలోచన సీఎంకు వచ్చింది. విశాఖతో పాటు కాకినాడలోనూ ఈ ప్రాజెక్టు తీసుకురావాలని రాష్ట్రస్థాయిలో అధికారులతో భేటీ అయినప్పుడు చెప్పారు. పర్యావరణానికి హాని లేకుండా వాహన ఇంధనానికి ప్రత్యామ్నాయంగా ఏయే విధానాల్ని అమలు చేయవచ్చో అధికారులతో సర్వే చేయించారు. ఇలా అనేక పర్యాయాలు భేటీ తర్వాత విద్యుత్తు వాహనాల్ని తీసుకురావాలన్న ఆలోచనకొచ్చారు. ప్రస్తుతానికి కొన్ని వాహనాల్ని ప్రవేశపెట్టారు.

హోర్డింగ్‌లు ఉండకూడదయ్యా..: 2016 డిసెంబరులో నగర పర్యటనకు వచ్చినపుడు హోర్డింగ్‌లపై ప్రత్యేక పరిశీలన చేశారు. రహదారులపై వీటిని ప్రదర్శించడం వల్ల నగరవాసులకు ఇబ్బందిగా ఉందని అధికారుల ముందుంచారు. ఈ ప్రధాన రహదారుల్లో లాలీపాప్‌లా ఉండే హోర్డింగ్‌ల ద్వారా కేవలం సంకేతాలు, ప్రభుత్వ ప్రకటనలే ఉండేలా చూడాలనీ సూచించారు. దీనికి తగ్గట్లు కొన్నిదారుల్లో జీవీఎంసీ అధికారులు కొంతవరకు నివారించగలిగారు.

రబ్బరు బ్రేకర్లే మంచివి..: వేగ నిరోధకాల సీఎం చంద్రబాబు మీద కూడా పడింది. పలు మార్గాల్లో ప్రయాణించినపుడు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నానని అధికారులకు చెప్పారు. నగరానికి ఇవి తగవని తేల్చి చెప్పారు. గతేడాది వచ్చినప్పుడు అన్ని ప్రధాన రహదారుల్లో రబ్బరు స్పీడ్‌బ్రేకర్లు పెట్టాలని ఆదేశాలు జారీచేశారు. ఇప్పుడు చాలా రహదారుల్లో అవే కనిపిస్తున్నాయి.

ఎల్‌ఈడీ దీపాల నిర్వహణపై..: నగరంలోని వీధి దీపాల ఇబ్బందులపై గతంలో ‘ఈనాడు’లో వరస కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో నగరానికి వచ్చిన సమయంలో ఈ విషయం చంద్రబాబు దృష్టికీ వెళ్లింది. వెంటనే ఆ వివరాలు కూడా తెప్పించుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతున్న సమస్యల్ని ఎందుకు పరిష్కరించలేకున్నారని అధికారులను ప్రశ్నించారు. వార్డులవారీగా సిబ్బందిని పెంచుకుని మరీ ప్రజలకు సేవ చేయాల్సిందేనని ఆయన ఖరాఖండీగా చెప్పినట్లు పలువురు అధికారులు ‘ఈనాడు’కు తెలిపారు.

సముద్రజలాలు నల్లగా ఉన్నాయెందుకు?: చంద్రబాబు నగరానికి వచ్చినపుడల్లా.. బీచ్‌రోడ్డులో ప్రయాణిస్తుంటారు. ఓసారి కాన్వాయ్‌లో వెళ్తూ సముద్ర ఉపరితల రంగు మారడాన్ని గమనించారు. ఎందుకలా అవుతోందని అధికారులను అడిగారు. మురుగు, ఇతర ఇబ్బందుల కారణమని వారు చెప్పారు. చిన్నస్థాయి ఎస్టీపీల్ని ఉంచి నీటిని శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టాలని ఆయన చెప్పారు. దీనిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు..

Link to comment
Share on other sites

ఒడుదొడుకులెదురైనా..! అభివృద్ధి పయనాన.. 
ప్రభుత్వం ఏర్పాటై నేటితో నాలుగేళ్లుపూర్తి 
ఎల్‌ఈడీ  వీధిదీపాలు, సిమెంటు రహదారులు, ఊరూరా శ్మశానాల అభివృధ్ధి 
ఇంటింటికీ  మరుగుదొడ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు 
నాలుగేళ్లుగా గ్రామగ్రామాన గణనీయమైన మార్పులు 
ఈనాడు, విజయనగరం 
viz-top1a.jpg

పల్లె చల్లగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందంటారు. ప్రస్తుతం ఏ పల్లె చూసినా సిమెంటు రహదారులు మెరిసిపోతున్నాయి. ఊళ్లకు ఊళ్లే ఎల్‌ఈడీ కాంతులతో ధగధగలాడుతున్నాయి. ఇంటింటికో మరుగుదొడ్డి దర్శనమిస్తుంది. దాదాపుగా అందరికీ తాగునీరందుతుంది. చెత్తనంతా కంపోస్టుగా తయారుచేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. పంచాయతీలు ఈ-పంచాయతీలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఆఖరికి శ్మశానాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లె కొత్తరూపు సంతరించుకుంటోంది. నాలుగేళ్లుగా పాలనలో వచ్చిన సంస్కరణల కారణంగా గ్రామాలన్నీ కొత్త రంగులు సింగారించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం..

వీధి దీపాలు వెలగకపోవడంతో పాటు భారీ విద్యుత్తు బిల్లులు గ్రామ పంచాయతీల్ని వేధించే ప్రధాన సమస్య. అయితే గత నాలుగేళ్లుగా పంచాయతీల్లో వెలుగుల రూపు మారిపోయింది. విజయనగరం పార్లమెంటు సభ్యులు పూసపాటి అశోక్‌గజపతిరాజే 467 పంచాయతీల్లో, అరకు  ఎంపీ గీత 125 పంచాయతీల్లో ఎల్‌ఈడీ దీపాల కోసం ఆర్థిక సహకారమందించారు. దీనివల్ల దాదాపు 53 శాతం విద్యుత్తు బిల్లులు ఆదా కావడంతో పాటు నిర్వహణ భారం తగ్గిపోయినట్లుగా గుర్తించారు.

పల్లెబాటలు.. : నాలుగేళ్ల కిందట వరకూ రాష్ట్ర రహదారులే అతుకుల బొంతలతో దర్శనమిచ్చేవి. ఇక గ్రామీణ రహదారులైతే మట్టి రోడ్లే గతి. వర్షమొచ్చిదంటే గ్రామాల్లో బురద బురదే.. అక్కడే మురుగునీరు ఆగిపోయి దోమలకు ఆవాసాలయ్యేవి. అలాంటిది గత మూడేళ్లలో ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధుల్ని ఉపయోగించుకుని జిల్లావ్యాప్తంగా 952 కి.మీ. మేర సీసీ రహదారులు వేయడంతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి.

గ్రామగ్రామాన తాగునీరు: గతంతో పోల్చి చూస్తే గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా వరకూ తగ్గింది. ప్రస్తుతం చేతిబోరు లేని ఆవాస ప్రాంతాలు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆఖరికి కొండ ప్రాంతాల్లోను చేతిబోరుకి మోటారు బిగించి సింటెక్స్‌ ట్యాంకులు నింపి దాని ద్వారా తాగునీరందిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఎస్‌.కోట, అలమండ, బొబ్బిలిల్లో కొత్తగా తాగునీటి పథకాలు తీసుకురావడంతో పాటు ఉన్న పథకాల్ని బలోపేతం చేశారు. 2013లో ఒక వ్యక్తికి 40 లీటర్ల నీరు ఇచ్చేవారు. 2014 నుంచి 55 లీటర్లకు పెంచారు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరికి రోజుకి 70 లీటర్ల చొప్పున నీరివ్వడానికి గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. 
కంపోస్టు తయారీతో చెత్త మాయం: చెత్తని వదిలించుకోకపోతే గ్రామాలే డంపింగ్‌యార్డులన్నది జిల్లావాసులకు బాగా తెలుసు. గత మూడేళ్లుగా పల్లెని చెత్త బారి నుంచి కాపాడేందుకు ప్రయత్నాలు జరగడమే కాదు అవి సత్ఫలితాల్నిస్తున్నాయి. ఊరి చెత్తనంతా తీసుకెళ్లి వర్మీకంపోస్టుగా మార్చి ఆదాయంగా మార్చుకోవడమే లక్ష్యంగా పంచాయతీకో చెత్త నుంచి సంపద కేంద్రం ఏర్పాటుకి ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లాలో 647 పంచాయతీల్లో పనులు ప్రారంభం కాగా 120 పూర్తయ్యాయి. ఇప్పటికే కర్లాం, ద్వారపూడి, గజపతినగరం, పెదభోగిలి, దన్నానపేట, ఆరికతోట, భోగాపురం తదితర 48 కేంద్రాల్లో తయారైన 120 టన్నుల వర్మీకంపోస్టుని విక్రయించారు.

రికార్డు స్థాయిలో మరుగుదొడ్లు: తరతరాలుగా పల్లెల్ని పట్టి పీడీస్తున్న సమస్య బహిరంగ మలవిసర్జన. దానివల్ల మానవ విసర్జిత పదార్థాలు నీటివనరుల్లో కలిసి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. నాలుగేళ్ల కిందట వరకూ జిల్లాలో మరుగుదొడ్లు కలిగిన కుటుంబాలు 87,396 మాత్రమే.. ప్రస్తుతం ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించి  ఆ సంఖ్యని 4,26,948కి చేరిందంటే జిల్లాలో స్వచ్ఛతకు ఇచ్చిన ప్రాధాన్యం అర్థమవుతుంది. జిల్లావ్యాప్తంగా రూ.475 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 100 గంటల్లో నిర్మించిన 10,000 మరుగుదొడ్ల కార్యక్రమం దేశంలోనే ఖ్యాతిగాంచింది.

శ్మశానాలు స్వర్గధామాలు: శ్మశానాల్లో అరకొర వసతుల కారణంగా మృతుల బంధువులు మనోవేదనకు గురవుతూనే ఉన్నారు. దానికి పరిష్కారంగా ప్రభుత్వం శ్మశానాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రూ.10 లక్షల నిధులతో ఎత్తుపల్లాల్ని చదును చేయడంతో పాటు ప్రవేశద్వారం, ప్రహారీలు నిర్మిస్తున్నారు. దహన సంస్కారాలకు వీలుగా ప్లాట్‌ఫాం నిర్మిస్తున్నారు. జిల్లాలో రూ.73 కోట్ల ఖర్చుతో 731 స్మశానాల్ని అభివృద్ధి చేశారు.

920జిల్లాలో మొత్తం పంచాయతీలు 709 
ఎల్‌ఈడీలు దీపాలు   అమర్చిన పంచాయతీలు 211 
ప్రస్తుతం పనులు   జరుగుతున్నవి 56,000

ఇప్పటివరకూ అమర్చిన ఎల్‌ఈడీ దీపాలు 
3,17,059 జిల్లాలో నాలుగేళ్లలో నిర్మించిన మరుగుదొడ్లు 
రూ.475 కోట్లు చేసిన ఖర్చు 
731జిల్లాలో అభివృద్ధి చేసిన శ్మశానాలు 
రూ.73 రూ.కోట్లు చేసిన ఖర్చు 
647 మంజూరైన చెత్త నుంచి సంపద కేంద్రాలు 
120 ఇప్పటికే పూర్తయినవి 
48 వర్మీకంపోస్టు తయారు చేస్తున్నవి 
జిల్లాలో సీపీడబ్ల్యూ పథకాలు - 32  పీడబ్ల్యూడీ పథకాలు - 1139  చేతిబోర్లు - 16,526

Link to comment
Share on other sites

Prakasam

కోత తరుగు.. పంపిణీ మెరుగు 
తీరిన విద్యుత్తు కష్టాలు 
pks-brk5a.jpg

ఒంగోలు అర్బన్‌, న్యూస్‌టుడే: నాలుగేళ్లలో విద్యుత్తు కోతలు బాగా తగ్గాయి. ఉత్పత్తి వ్యవస్థలు మెరుగుపడ్డాయి. కావాల్సినంత కరెంటు లభ్యమవుతోంది. సాంకేతికత అందిపుచ్చుకొని.. వివిధ రకాల లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌, యాప్‌ల ద్వారానే అమలు చేస్తున్నారు. థర్మల్‌, హైడల్‌ విద్యుత్తు కాకుండా జిల్లాలోనూ సౌర విద్యుదుత్పత్తి యూనిట్లు అందుబాటులోకి  వస్తున్నాయి. బీ జిల్లావ్యాప్తంగా 25 ప్రాంతాల్లో 95.03 ఎండబ్ల్యూ(మెగా వాట్స్‌) విద్యుదుత్పత్తి చేయడానికి వివిధ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. చెరువుకొమ్ముపాలెంలో 1.03 ఎండబ్ల్యూ, తర్లుపాడులో 21 ఎండబ్ల్యూ ఉత్పత్తి జరుగుతోంది. బీ 40,032 కొత్త వ్యవసాయ సర్వీసులిచ్చారు. రూ.200 కోట్ల విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా  అందిస్తోంది. 
* ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు రూ.277 కోట్లతో 182 కాలనీలకు విద్యుత్తు సదుపాయం కల్పించారు. దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ గ్రామజ్యోతి యోజన కింద రూ.55 కోట్లతో 73,921 కుటుంబాలకు ఉచితంగా సరఫరా          చేస్తున్నారు.

నవ్యాంధ్ర ఏర్పడక ముందు విద్యుత్తు కోటా లోటులో ఉండేది. నాడు నాలుగు లక్షల యూనిట్లు కొరత ఉండగా.. 10.735 ఎంయూ(మిలియన్‌ యూనిట్లు) తగ్గకుండా సరఫరా అవుతోంది.

 

రహదారి.. ప్రగతి దరి చేరి 
రూ.1,800 కోట్లతో పనులు

ఒంగోలు అర్బన్‌,: రహదారుల అభివృద్ధి, విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ర.భ.శాఖ ఆధీనంలోని రహదారులే కాకుండా గ్రామీణ రోడ్ల మెరుగుకూ చర్యలు చేపట్టింది. అనుసంధాన మార్గాల బాగుకు చర్యలు తీసుకుంటోంది. ర.భ.శాఖలో రూ.1,300 కోట్లు, పీఆర్‌ పరిధిలో రూ.500 కోట్లతో పనులు ప్రారంభించింది. గ్రామీణ రోడ్లను ర.భ.శాఖ ప్రమాణాల స్థాయిలో తీర్చిదిద్దడానికి 1,300 కి.మీ.లను ఆధీనంలోకి తీసుకున్నారు. నాలుగేళ్లలో రహదారుల అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. నాబార్డు, ఆర్డీఎఫ్‌, గ్రామీణ రోడ్డు, ఎండీఆర్‌ ప్రణాళికలు, ఎస్‌ఆర్పీ కింద 125 పనులు చేపట్టారు.

వంతెనల నిర్మాణం 
జిల్లాలో దెబ్బతిన్న వంతెల బాగుకు చర్యలు తీసుకున్నారు. ఒంగోలు పోతురాజు కాలువపై వంతెన పనులు నెలరోజుల్లో పూర్తికానున్నాయి. కొత్తపట్నంలో దెబ్బతిన్న వంతెనలను అభివృద్ది చేశారు. ఈతముక్కలలో పనులు సాగుతున్నాయి. వివిధ పథకాల కింద 16 వంతెనల మరమ్మతులకు రూ.62 కోట్లు కేటాయించారు. రైల్వేట్రాక్‌లపై రోడ్డు వంతెనల పనులనూ ప్రతిపాదించారు. టంగుటూరు- అనంతవరం, కారుమంచి- ఈతముక్కల- మోటుమాలరోడ్డు, ఒంగోలులోని అగ్రహారం గేటు, చీరాల, సింగరాయకొండ వద్ద తిరుమల పట్టాభినగర్‌ వద్ద ఆర్వోబీలను ప్రతిపాదించారు. ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

 

ఉద్యానానికి రైతు దన్ను 
నాలుగేళ్లలో పండ్ల తోటల విప్లవం 
  సూక్ష్మసేద్యానికి పెద్దపీట 
pks-brk1a.jpg

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: గడిచిన నాలుగేళ్లలో ఉద్యానసాగు విస్తరించింది. సాంప్రదాయ పంటలువల్ల రైతులకు గిట్టుబాటు ధర రాక నష్టపోతుండటంతో రైతుల్ని ఉద్యానపంటల దిశగా ప్రభుత్వం ప్రోత్సహించింది. రక్షిత వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి షేడ్‌నెట్లు, పర్మినెంట్‌ పెండాల్స్‌ లాంటి ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. నీరు తక్కువుగా ఉన్న ప్రాంతాల్లో సైతం పండ్లతోటల సాగు చేపట్టడానికి వీలుగా ఏపీఎంఐపీ ద్వారా సూక్ష్మసేద్య విధానాన్ని ప్రోత్సహించారు. దీనితో క్యాబేజీ, క్యాప్సికం, క్యారెట్‌, బీట్‌రూట్‌ లాంటి పంటల సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు.శీతల గిడ్డంగులతోబాటు, పంట నిల్వచేసుకోడానికి అవసరమైన ఫాం హౌస్‌లు నిర్మాణానికి పెద్దఎత్తున రాయితీలు అందిస్తున్నారు. సూక్ష్మసేద్యంలో రాయితీలు 90 శాతానికి పెంచారు. మొత్తం మీద ఉద్యానశాఖ ద్వారా గడిచిన నాలుగేళ్లలో రూ.79.33 కోట్లు నిధులతో, 47078మంది రైతులకు ప్రయోజనం కల్పించారు.

 

Link to comment
Share on other sites

2 hours ago, Saichandra said:

Eenadu played crucial role in 14 elections,bale rasevadu articles,19 lo kuda chala imp 

2014 Election roju eenadu paper unforgettable... Dilema lo vunnollani ethi tdp lo vesaadu aa roju paper tho... 

Link to comment
Share on other sites

ఐదులోకి అడుగు!

విభజన ఉత్పాతం... హుద్‌హుద్‌ ఉపద్రవం.. బాలారిష్టాలను దాటుకుని.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ఈ నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. అమరావతి, పోలవరం, పట్టిసీమ.. ఇప్పుడీ ఎన్నికల ఏడాదిలో.. ఈ ప్రణాళికలు, పథకాలే అజెండాగా ప్రజల ముందుకు వెళ్లటం తథ్యం! అందుకే తెదేపా సర్కారు ఐదో ఏట అడుగుపెడుతున్న ఈ తరుణంలో కీలక పథకాలు, ప్రణాళికలేమిటి? వీటి విశిష్టతలేమిటన్న దానిపై లోతైన సమీక్ష..

ఎన్నికల ఏడాది.. 
పథకాల బాట మీదే.. పయనం!
7ap-main1b.jpgఅప్పుడంతా అయోమయం! విభజన ఉత్పాతం.. అది మోసుకొచ్చిన అనిశ్చితి.. ఈ బాలారిష్టాల్లోనే హుద్‌హుద్‌ వంటి ఉపద్రవాలు.. అయినా ‘అవశేషాంధ్ర’లా విలవిల్లాడకుండా..  విశ్వాసంతో నిబ్బరంగా నిలబడింది నవ్యాంధ్రప్రదేశ్‌! అంతేకాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలన్న లక్ష్యంతో పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. రాజధానిని అందమైన, అత్యాధునిక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్‌ ప్రణాళిక సిద్ధం చేశారు. పట్టిసీమతో వడివడిగా జలకళ తెచ్చారు. చిరకాల స్వప్నమైన పోలవరం వేగం పెంచారు. ఈ-పాలనతో, మరెన్నో పథకాలతో ప్రజలందరినీ ప్రతిక్షణం పలకరిస్తున్నారు. ఇప్పుడీ ఎన్నికల ఏడాదిలో.. ఈ ప్రణాళికలు, పథకాలే అజెండాగా ప్రజల ముందుకు వెళ్లటం తథ్యం! దీంతో విపక్షాల చర్చోపచర్చలూ ఈ ఏడాదంతా వీటి చుట్టూనే తిరగటం సహజం! అందుకే తెదేపా సర్కారు ఐదో ఏట అడుగుపెడుతున్న ఈ తరుణంలో ఈ కీలక పథకాలు, ప్రణాళికలేమిటి? వీటి విశిష్టతలేమిటన్న సమీక్ష సముచితం, సందర్భోచితం!!
# 1: చంద్రన్న బీమా..నిరుపేదకు ధీమా
ఒకప్పుడు ఇంటి పెద్ద మరణిస్తే నిరుపేద కుటుంబాలు కుదేలయ్యే పరిస్థితి. చదువుకునే పిల్లలు అనాథలుగా మారి కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి. అలాంటి బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ‘చంద్రన్న బీమా’తో ధీమా నింపుతోంది. యజమాని మరణంతో కుంగిపోయిన కుటుంబానికి అండగా నిలుస్తోంది. అసంఘటిత రంగంలోని కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు పది రోజుల్లోనే రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి నిలదొక్కుకునేలా చేస్తుంది.  రాష్ట్రంలో 2.47 కోట్ల మంది అంటే దాదాపు సగం జనాభా ఈ పథకం పరిధిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటిలో అత్యంత విజయవంతమైన పథకమిది. బాధిత కుటుంబాల్లోని పిల్లలకు రూ.444 కోట్లు ఉపకార వేతనాలుగా అందాయి. 2015లో రవాణా రంగంలోని కార్మికుల కోసం ప్రారంభించిన ఈ పథకం అనంతరం అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ వర్తించేలా ప్రభుత్వం మార్పులు చేసింది. 
* చంద్రన్న బీమా పథకంలో చేరాలంటే.. రూ.15 వేల కన్నా తక్కువ జీతం వచ్చే 18-70 ఏళ్ల మధ్య వయసున్న అసంఘటిత రంగంలోని కార్మికులంతా ఈ పథకానికి అర్హులు. ప్రజా, సాధికార సర్వేలో నమోదుచేసుకొని ఉండాలి. 
* 18-50 ఏళ్ల మధ్య పాలసీదారుల సహజ మరణానికి రూ.2 లక్షలు, 51-60 ఏళ్ల మధ్య వారికి రూ.30 వేలు సహాయంగా అందుతాయి. 
* ప్రమాద బాధితుల కుటుంబాల్లోని చదువుకునే పిల్లలకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకార వేతనం ఇస్తోంది. రెండేళ్లలో 37 లక్షల మందికి రూ.444 కోట్ల ఉపకార వేతనం అందింది. 
* పూర్తి అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.2.50 లక్షలు ఇస్తున్నారు. 
చంద్రన్న బీమా కింద గత రెండేళ్లలో 1.52 లక్షల కుటుంబాలకు రూ.2 వేల కోట్ల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

ఎక్కడా మధ్యవర్తుల్లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా పరిహారం చెల్లింపు మొత్తం పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తుండటం ఈ పథకం ప్రత్యేకత.

# 2: పోలవరం..నవ్యాంధ్రకు జీవనాడి 
7ap-main1c.jpg
2014 జూన్‌ 
బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించే ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని 10 గిరిజన గ్రామాలు అక్కడ ఉన్నాయి. సరైన పునరావాసం, ప్యాకేజీ ఇస్తేనే ఊరు వదులుతామని గిరిజనులు తెగేసిచెబుతున్నారు. పనులు ఎలా చేస్తామని గుత్తేదారు ప్రశ్న. అవకాశం ఉన్నంతే చేయండి అంటూ అధికారుల నుంచి సమాధానం. ప్రాజెక్టు పనులు సాగకపోవడానికి ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్న దృశ్యం అది. పోలవరం పూర్తవుతుందనే నమ్మకం ఏ కోశానా లేని రోజులవి.

2018 జూన్‌ 8 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సగానికి పైగా పూర్తయింది. ఎంతో సవాలుతో కూడుకున్న గోదావరి అంతర్భాగ డ్యాంల నిర్మాణం కొలిక్కి వచ్చేసింది. దేశంలో ఇంతవరకూ ఎక్కడా నిర్మించనంతటి డయాఫ్రం వాల్‌ నిర్మాణం ఇక నాలుగు రోజుల్లో పూర్తి కానుంది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలలో పునాది పనులుగా పేర్కొనే జెట్‌ గ్రౌటింగ్‌ పనులు మూడొంతులకు పైగా పూర్తయ్యాయి. గడిచిన మూడేళ్లలో పోలవరంలో సాధించింది అంతా ఇంతా కాదు. స్పిల్‌ వే పనులు ఊపందుకున్నాయి. సమాంతరంగా ప్రాజెక్టుకు తలుపుల తయారీ కొలిక్కి వచ్చేసింది. మట్టి పని భారీ ఎత్తున జరిగింది.

* ఇక పోలవరం ఒక భరోసా. 2020 నాటికైనా ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు కాలువల్లో ప్రవహించడం ఖాయమనే నమ్మకం ఏర్పడుతోంది. 194.66 టీఎంసీల నీటిని నిల్వచేసే స్థాయిలో పునరావాసం పూర్తి కాకపోవచ్చేమో కానీ... 42.5 మీటర్ల స్థాయికి అన్ని పనుల్ని పూర్తిచేసి పోలవరంలో నీళ్లు నిలబెట్టి కాలువల ద్వారా మళ్లించే కల ఒక ఏడాది, రెండేళ్లలో సాకారమవుతుందనే నమ్మకాన్ని ఈ పనులు కల్పిస్తున్నాయి. 
* పోలవరంపై ఇప్పటి వరకు చేసిన ఖర్చు  రూ.13,466 కోట్లు 
* 2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రాష్ట్రం చేసిన ఖర్చు రూ.8330.55 కోట్లు 
* కేంద్రం రాష్ట్రానికి తిరిగి ఇచ్చింది రూ.5342.26 కోటు 
(మరో రూ.1400 కోట్లు తిరిగి ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం)

ఇదీ ప్రాజెక్టు... 
* నిల్వ సామర్థ్యం- 194.60 టీఎంసీలు  
* లైవ్‌ స్టోరేజీ- 75.20 టీఎంసీలు 
* విద్యుదుత్పత్తి- 960 మెగావాట్లు  
* కృష్ణాకు నీటి మళ్లింపు- 80 టీఎంసీలు 
* కొత్తగా నీరిచ్చేది- విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో 15.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు  
* విశాఖకు తాగు నీరు - 23.44 టీఎంసీలు 
* ఆయకట్టు స్థిరీకరణ- 8 లక్షల ఎకరాలు(ఉభయ గోదావరి, కృష్ణా డెల్టాల్లో 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగం) 
* తాగునీటి సౌకర్యం- 540 గ్రామాల్లోని 28.5 లక్షల మందికి 
* ఇతర రాష్ట్రాలకు నీటి మళ్లింపు- ఒడిశాకు 5 టీఎంసీలు, ఛత్తీస్‌గఢ్‌కు 1.5 టీఎంసీలు

# 3: పరిశ్రమలు.. కొత్త ఒరవడి
పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. విభజన తర్వాత- గత నాలుగేళ్లలో ఏపీకి అనేక పరిశ్రమలు వచ్చాయి. కియా మోటార్స్‌, అపోలో టైర్స్‌, హీరో మోటార్స్‌.. ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఒక చరిత్ర. దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌ భారత్‌లో తన మొట్టమొదటి కార్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్రానికి రావటం విశేషం. ఈ యూనిట్‌ను కియా అనంతపురం జిల్లాలో రూ13,500 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ప్రభుత్వం ఎకరా రూ.6 లక్షల చొప్పున 580 ఎకరాలకుపైగా భూమిని కేటాయించింది. మౌలిక సదుపాయాలు, ఇతర రాయితీల కింద మరో రూ.650 కోట్లను ఖర్చు చేసింది. కియా మోటార్స్‌ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 11,000 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. అపోలో టైర్స్‌, హీరో మోటార్స్‌తోనూ ఇలాంటి ప్రయోజనమే చేకూరనుంది. 
కియా కార్ల యూనిట్‌ కోసం ఇతర రాష్ట్రాలూ ప్రయత్నించినా... చివరికి ఏపీనే నెగ్గింది.
# 4: పట్టిసీమ.. కరవు సీమలో నీటి కళ

కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంలో కీలక అధ్యాయం పట్టిసీమ ఎత్తిపోతల పథకం. నీళ్లు వృథాగా పోతున్న చోట నుంచి కరవుతో అల్లాడుతున్న చోటికి మళ్లించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. ఒక్క కృష్ణా డెల్టాలోనే రూ.18 వేల కోట్ల పంటను రైతుల ఇళ్లకు చేర్చింది. గోదారమ్మకు రాయలసీమతో బంధమేసింది. రాయలసీమకు రూ.7,400 కోట్ల ప్రయోజనాన్ని అందించింది. గడిచిన మూడేళ్లలో కృష్ణా డెల్టాకు 138 టీఎంసీల నీళ్లిచ్చింది. శ్రీశైలం నుంచి దిగువకు నీరు వదలనవసరం లేకుండానే నేరుగా సీమ జిల్లాలకు నీటిని తరలించే భరోసా ఇచ్చింది. రెండేళ్లలో సీమకు ఏకంగా 200 టీఎంసీలను మించిన నీళ్లు ఇచ్చింది. చెరువులను నీళ్లతో నింపింది. వేసవి ఎద్దడిని తీర్చింది.

పట్టిసీమ ఇచ్చింది 160 టీఎంసీలు 
గోదావరి వరదను 160 టీఎంసీలుగా పట్టిసీమ ఎత్తిపోసింది. పోలవరం కుడి కాలువ మార్గంలో పంటలకు, తాగునీటికి కొంత పోగా కృష్ణా డెల్టా పొలాల్లో 138 టీఎంసీలు పారింది. కృష్ణ నుంచి ప్రవాహాలే నామమాత్రమై శ్రీశైలంకూ చుక్కనీరూ దక్కని రోజుల్లో 10 లక్షలకు పైగా ఎకరాల్లో ఈ పథకం జీవం పోసింది. ఖర్చు పెట్టింది దాదాపు 1600 కోట్ల పైమాటే అయినా.. రూ.వేల కోట్ల పంటను ఇళ్లకు చేర్చింది. 2015-16 నుంచి గోదారమ్మ ఈ ఎత్తిపోతల రూపంలో ఎలా ఆదుకుందో గమనిస్తే....

రాయలసీమకూ ప్రాణాధారమై... 
కృష్ణమ్మలో ప్రవాహాలు తగ్గిపోతున్న తాజా వాస్తవంలోనూ పట్టిసీమ రాయలసీమకు జీవాధారమవుతోంది. ఈ నీటి వల్ల రాయలసీమలోని అనేక చెరువులు, కాలువలు జలకళను సంతరించుకున్నాయి. జలాశయాల్లో నీటిని నింపగలిగారు. గత రెండు సంవత్సరాలుగా 100 టీఎంసీలకు పైగా నీటిని రాయలసీమకు శ్రీశైలం నుంచి ఇవ్వగలిగారు. 2016లో రూ.3060 కోట్ల పంట సాధించారు. 2017లో రూ.4300 కోట్ల వరకు దిగుబడులు వచ్చాయని ఒక అంచనా. తాగునీటి పథకాలకు రెండేళ్లలో నీటిని ఎత్తిపోయకుండా ఏటవాలుగా సరఫరా చేయడమూ వ్యయాన్ని తగ్గించి ప్రయోజనం కల్పించింది. 
201718లో కృష్ణా డెల్టా కింద 1081608 ఎకరాలు సాగవ్వగా దానికోసం 118.01 టీఎంసీల నీరు అవసరమైంది. అందులో 85.66 టీఎంసీల నీరు ఒక్క పట్టిసీమ ద్వారానే అందటం విశేషం.

7ap-main1dd.jpg
 పరిశ్రమల పురోగతి
ఇప్పటికే ప్రారంభమైనవి  
* రూ.38,919 కోట్ల పెట్టుబడులతో.. 334 పరిశ్రమలు వచ్చాయి! 
* 1,32,332 మందికి ఉపాధి దక్కింది. 
 ప్రారంభానికి సిద్ధం 
* రూ.1,512 కోట్లతో.. 14 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధం! 
* వీటితో మరో 2,634 మందికి ఉపాధి తథ్యం! 
 త్వరలో రానున్నవి 
* మరో 153 పరిశ్రమల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 
* ఇవి ప్రారంభమైతే 1,73,618 మందికి ఉపాధి లభిస్తుంది. 
 మున్ముందు 
* 691 పరిశ్రమలు నెలకొల్పేందుకు ఇటీవలే సివిల్‌ పనులు మొదలయ్యాయి 
మొత్తం నాలుగేళ్లలో 
* రూ.4,55,692 కోట్లతో 1193 పరిశ్రమలు నెలకొల్పేందుకు ఒప్పందాలు జరిగాయి. 
* వీటితో 13,53,655 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా
# 5: అమరావతి ఆంధ్రకు చుక్కాని 
7ap-main1d.jpg
రాజధాని అమరావతి రూపంలో ఒక మహా నగరాన్ని నిర్మించే అవకాశం ఆంధ్రప్రదేశ్‌కు లభించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో కొత్తగా నిర్మిస్తున్న అతి పెద్ద నగరం ఇదే..! 217 చ.కి.మీ.ల విస్తీర్ణం(53,748 ఎకరాలు)లో అమరావతి నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలోని ఆధునిక నగరాలతో పోలిస్తే అత్యంత వేగంగా నిర్మాణం జరగడం అమరావతి ప్రత్యేకత. భూ సమీకరణ మొదలుపెట్టిన మూడున్నరేళ్లలోనే వివిధ ప్రణాళికలు, ఆకృతులు సిద్ధంచేసుకుని నిర్మాణాలూ ప్రారంభించారు. మరో ఆరు నెలల్లో రాజధానిలో నిర్మాణాలన్నీ పూర్తిస్థాయిలో మొదలవుతాయి. ప్రస్తుతం రూ.24 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. వచ్చే కొన్ని నెలల్లో మరో రూ.ఆరేడు కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అమరావతిని నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 
* రైతులకు పదేళ్ల కౌలు చెల్లించడం, భూమిలేని పేదలకు నెలకు రూ.2500 చొప్పున పదేళ్లపాటు పింఛను, గూడులేని నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం వంటివి ఇక్కడి ప్రత్యేకతలు. 
* మొత్తం సీఆర్‌డీఏ ప్రాంతానికి, రాజధాని అమరావతికి, సీడ్‌ కేపిటల్‌కు సింగపూర్‌ ప్రభుత్వం వేర్వేరుగా ప్రణాళికలు రూపొందించి ఇచ్చింది. ఇవన్నీ వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పకడ్బందీగా రూపొందించిన ప్రణాళికలు. 
* 45.129 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాలను ప్రభుత్వం ఏడు నెలల్లో నిర్మించింది. 2017 మార్చిలో బడ్జెట్‌ సమావేశాలు మొదలుకొని శాసనసభ సమవేశాలూ ఇక్కడే నిర్వహిస్తోంది. 
* రాజధానిలో 9 థీమ్‌ సిటీలు, 29 టౌన్‌షిప్‌లు ఉంటాయి. గ్రిడ్‌ ప్యాటర్న్‌లో టౌన్‌షిప్‌లను డిజైన్‌ చేశారు. కార్యాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్‌, వినోద కేంద్రాలు వంటి వసతులన్నీ... 10-15 నిమిషాల నడక దూరంలోనే ఉండేలా తీర్చిదిద్దడం విశేషం.
7ap-main1e.jpg
భేషుగ్గా భూ సేకరణ 
* రైతుల నుంచి స్వచ్ఛందంగా భూములు తీసుకోవడానికి అమలుచేసిన భూ సమీకరణ విధానం దేశంలోనే వినూత్నం. 
* 34 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. ఇంత భారీఎత్తున భూ సమీకరణ దేశంలో ఎక్కడా జరగలేదు. 
* రైతులతో  స్వయంగా ముఖ్యమంత్రే పలు దఫాలు సంప్రదింపులు జరిపి మెరుగైన ప్యాకేజీ ఇచ్చారు. 
* రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇస్తున్నారు. 28-29%  భూమి రైతులకు తిరిగి వెళుతోంది. 
* అమరావతి నిర్మాణానికి సింగపూర్‌, జపాన్‌, జర్మనీ, ఇంగ్లండ్‌ వంటి దేశాల ఆసక్తి!
7ap-main1f.jpg
# 6: విద్యుత్తు రంగం.. సంక్షోభం నుంచి ‘వెలుగుల’ వైపు 
7ap-main1g.jpg
గంటల తరబడి విద్యుత్తు కోతలు.. పరిశ్రమలకు పవర్‌ హాలీడేలు..రోజుకు 22 మిలియన్‌ యూనిట్ల కొరత- రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ రంగ పరిస్థితి ఇది. తెదేపా అధికారం చేపట్టిన ఆరు నెలల వ్యవధిలోనే ఈ సంక్షోభం నుంచి రాష్ట్రం పూర్తిగా గట్టెక్కింది. మిగులు విద్యుత్తు సాధించే స్థాయికి చేరుకుంది. పవర్‌ హాలీడేల మూలంగా పరిశ్రమలు మూతపడటం, ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం, పెట్టుబడి దారులు రావడానికే భయపడే పరిస్థితి నుంచి దిగ్గజ పరిశ్రమల యూనిట్లు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పే స్థాయికి విద్యుత్తు సరఫరా మెరుగుపడింది. కోతల్లేకుండా వినియోగదారులకు నిరంతర విద్యుత్తు అందించే స్థాయికి ఎదిగింది. 
* కాలుష్య రహిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపు రాష్ట్రంలో పెద్ద ఉద్యమంలా సాగింది. ఐదురెట్ల మేర సామర్థ్యాన్ని పెంచుకుంది. గత నాలుగేళ్ల వ్యవధిలో 5310 మెగావాట్ల సౌర, పవన విద్యుదుత్పాదక సామర్థ్యం సాధించిన ఘనత ఏపీ సొంతమైంది. 
* దేశంలోనే అన్ని చోట్లా ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటుచేసిన తొలి జిల్లాగా తూర్పుగోదావరి ఘనతకెక్కింది. 
* భవిష్యత్తులో విద్యుత్తు ఛార్జీలు పెంచ బోమని ప్రకటించిన తొలి రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. 
* 2016 జూన్‌ నాటికి రాష్ట్రంలోని అన్ని గృహాలకు విద్యుత్తు కనక్షెన్లు ఇచ్చిన మూడో రాష్ట్రంగా గుర్తింపు పొందింది. 
* ఎల్‌ఈడీ బల్బులు: ఇంధన పరిరక్షణ, సామర్థ్య చర్యల పెంపులో భాగంగా రూ.218 కోట్ల విలువైన 2.18 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను రాష్ట్రవ్యాప్తంగా అమర్చారు. 
* సౌర విద్యుత్తు పంపుసెట్లు: ఒక్కోటి రూ.5 లక్షల విలువైన పంపుసెట్టును రూ.55 వేలకే అంది స్తున్నారు. ఇప్పటివరకూ 25 వేల పంపుసెట్లు పంపిణీ చేశారు. 
* గత నాలుగేళ్లలో కృష్ణపట్నం క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్తు, నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ జల విద్యుత్తు, ఆర్‌టీపీపీ నాలుగో దశ విద్యుత్కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 
* 2017-18లో విద్యుత్తు కొనుగోలులో 17 శాతం పునరుత్పాదక విద్యుత్తు రంగం నుంచే సేకరించగా.. 2014-15లో ఇది 5 శాతం మాత్రమే.
7ap-main1h.jpg
 #7: రియల్‌టైం గవర్నెన్స్‌.. పరిపాలనలో అత్యాధునికత 
7ap-main1i.jpg
ఐటీ, ఆధునిక పరిజ్ఞానాల్ని ఉపయోగించి ప్రజలకు ఆన్‌లైన్‌లో సేవలందించే ప్రక్రియల్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు మెరుగైన, పారదర్శక పాలన, సత్వర సేవలందించేందుకు, దుబారాను, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రియల్‌టైం గవర్నెన్స్‌, ఇ-ప్రగతి, ఇ-ఆఫీసు  వంటి వినూత్న విధానాల్ని దేశంలోనే మొదటిసారిగా అమల్లోకి తెచ్చింది.

రియల్‌టైం గవర్నెన్స్‌ 
అది విజయవాడ సమీపంలోని ఒక భవనం. కార్పొరేట్‌ కార్యాలయాన్ని, బీపీఓ కేంద్రాన్ని తలపిస్తుంది. షిఫ్ట్‌కి 700 మంది చొప్పున 2 వేల మంది పనిచేస్తుంటారు. ఫోన్లు చేస్తూ.. సమాచారం తీసుకుంటూ.. దాన్ని విశ్లేషిస్తూ బిజీగా కనిపిస్తారు. ఇక్కడ్నుంచి రోజూ సుమారు 15.50 లక్షల మందికి ఫోన్లు వెళతాయి. ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన తెలుసుకోవడం, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, ఎవరైనా ప్రమాదంలో ఉంటే వెంటనే స్పందించడం, సంబంధిత విభాగాల్ని అప్రమత్తం చేయడం, నేర నియంత్రణ, ట్రాఫిక్‌, వాతావరణ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం నిరంతరం చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘పరిష్కార వేదిక’(రియల్‌టైం గవర్నెన్స్‌(ఆర్టీజీ)) కార్యాలయం. రోజూ అన్ని లక్షల మందిని సంప్రదించే వ్యవస్థ దేశంలో ఇంకెక్కడా లేదు.ఇంతటి వినూత్న, భారీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌కే ప్రత్యేకం. 
* మీకు సకాలంలో రేషన్‌ అందకపోవచ్చు. మీ ఇంటి ముందు రోడ్డు గుంతలు పడి ఉండొచ్చు. ఏ ప్రభుత్వ ఉద్యోగో మిమ్మల్ని లంచం అడిగి ఉండొచ్చు. సమస్య ఏదైనా.. 1100 నెంబర్‌కి ఫోన్‌చేసి మీ సమస్య చెబితే... దాన్ని పరిష్కరిస్తారు. రోజూ ఇలాంటి ఫోన్లు 25 వేల వరకు వస్తాయి. సమస్య పరిష్కారమైందీ లేనిదీ పరిష్కార వేదిక వాళ్లే మీకు ఫోన్‌ చేసి తెలుసుకుంటారు. ఇలాంటి విధానం దేశంలోనే మొదటిసారి. 
* మీరో కొత్త వాహనం కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం దళారులకు కమీషన్లు ఇచ్చుకోవడం, గంటల తరబడి క్యూల్లో నిలబడడం గతంలో మామూలే. ఇప్పుడా అవసరం లేదు. వాహనం కొనుక్కున్న షోరూంలోనే రిజిస్ట్రేషన్‌ జరిగిపోతుంది. 
* కొత్త ఇంటిని కట్టుకోవడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే చాలు, కొన్ని రోజుల్లోనే ప్లాన్‌ అప్రూవల్‌ వచ్చేస్తుంది. 
* ప్రభుత్వ సిబ్బంది, అధికారుల అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల్ని సంబంధిత జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు పంపించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎవరైనా డబ్బులు తీసుకుంటే వెనక్కి ఇప్పించిన సంఘటనలున్నాయి. అవినీతిపై ఇంత వరకు 3297 ఫిర్యాదులు వచ్చాయి. 
* ‘మీ కోసం’ వెబ్‌సైట్‌, ఏపీ సీఎం కనెక్ట్‌ యాప్‌, సామాజిక మాధ్యమాలు, ముద్రణ, ప్రసార మాధ్యమాల ద్వారాను, జన్మభూమి, ఇంటింటికీ తెలుగుదేశం వంటి కార్యక్రమాల్లోను వచ్చిన ఫిర్యాదులు, అర్జీల పరిష్కారాన్ని ఆర్టీజీ పర్యవేక్షిస్తుంది. ఇలాంటి ఫిర్యాదులు ఇంత వరకు 1.5 కోట్ల వరకు వచ్చాయి. 
* ప్రత్యేక సెన్సర్ల ద్వారా రైతుల పొలాల్లో తేమను, రిజర్వాయర్లలో జల మట్టాలను, భూగర్భ జలాలను పర్యవేక్షించడం వంటి వినూత్న కార్యక్రమాలనేకం ఆర్టీజీ ద్వారా చేస్తున్నారు. డ్రోన్‌లు, నిఘా కెమేరాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్‌ తరగతులు వంటివి దీనిలో భాగం.

#8:విదేశీ విద్య.. పేదలకు కొత్త ఆశ 
7ap-main1j.jpg
ప్రతిభ ఉన్నా విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్య చదవాలంటే ఆర్థికంగా సహకరించని కుటుంబ నేపథ్యం. ఏం చేయాలో అర్థంకాక ఉన్న దాంతో సంతృప్తి పడే పరిస్థితి. బడుగు, బలహీన వర్గాలకు విదేశీ విద్య అంటే అందని ద్రాక్ష అనుకునే స్థితి. అలా భావించిన వారే ఇప్పుడు ధైర్యంగా విదేశీ గడ్డపై ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదవాలన్న కలలను నిజం చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దన్ను ఇస్తుండడమే ఇందుకు కారణం. దాదాపు 15 దేశాల్లోని వర్సిటీల్లో వివిధ కోర్సులు అభ్యసించే అవకాశం ఏపీలోని పేద విద్యార్థులకు కలుగుతోంది. అంబేద్కర్‌ ఓవర్సీర్‌ విద్యా నిధి, ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు ప్రభుత్వం నేరుగా డబ్బు అందిస్తోంది. ఇందుకోసం ఒకొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఇస్తోంది. వీరి కోసం ప్రభుత్వం రూ.160 కోట్లకు పైగా ఖర్చుచేసింది. ఆయా వర్గాల నుంచి ఏటా 5 వేల మందిని విదేశాలకు పంపేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకూ 2300 మందికి పైగా విద్యార్థులు విదేశాలకు వెళ్లారు.
#9: నిరుద్యోగ భృతి.. యువతకు భరోసా

సామాజిక భద్రతా చర్యల్లో భాగంగా అరకోటి మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... తాజాగా నిరుద్యోగులకు చేయూత అందించేందుకు శ్రీకారం చుట్టింది. దాదాపు 10 లక్షల మంది యువతకు నెలకు రూ.వెయ్యి చొప్పున భృతిని చెల్లించనుంది. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో అతి పెద్ద సంక్షేమ పథకంగా రూపుదాల్చనుంది. డిగ్రీ/డిప్లమో పూర్తిచేసుకున్న యువత ఉద్యోగ దరఖాస్తులు కొనుగోలుకు, పోటీ పరీక్షలు రాయడానికి వెళ్లేటప్పుడు ప్రయాణ ఖర్చులకు, ఉద్యోగాల సాధన కోసం అవసరమైన శిక్షణ పొందేందుకు...ప్రభుత్వం చెల్లించే భృతి సొమ్ము ఎంతో కొంత ఉపయోగపడనుంది. ఓ అయిదేళ్లు తర్వాత నిరుద్యోగ భృతి పొందే వారి సంఖ్య 13.75 లక్షలకు, పదేళ్ల తర్వాత 17.50 లక్షలకు చేరనున్నట్లు అంచనా. ఇదే జరిగితే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే అతి పెద్ద వర్గం యువతే కానుంది.

ఇ-ప్రగతి
దైనందిన సేవలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టే పని ఇకపై లేదు. అన్ని ప్రభుత్వ విభాగాల్ని, సేవల్ని డిజిటైజ్‌ చేసేందుకు ఇ-ప్రగతి పేరుతో ప్రత్యేక ఇ-గవర్నెన్స్‌ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మొదట 14 సెక్టార్లను, 800 సేవల్ని ఆన్‌లైన్‌లోకి తేవాలని నిర్ణయించారు. ఇంతవరకు రవాణా శాఖలో 60 సేవలు, పురపాలక శాఖలో 70-80 సేవల వరకు ఆన్‌లైన్‌లోకి తెచ్చారు. ప్రభుత్వ సేవలన్నీ ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో పొందేలా చేయడమే ఇ-ప్రగతి అంతిమ లక్ష్యం. వివిధ శాఖల అవసరాలకు తగ్గట్టుగా ఐటీ సేవలు, డిజిటైజేషన్‌ ప్రక్రియకు అవసరమైన తోడ్పాటునందించేందుకు ఇ-ప్రగతి యాంకర్‌ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఐటీ అప్లికేషన్లను సిద్ధం చేస్తోంది. తొలి విడతలో విద్య, పంచాయతీరాజ్‌, మౌలిక వసతుల విభాగాల డిజిటైజేషన్‌ ప్రక్రియ జరుగుతోంది.
భూధార్‌
మనుషులకు ఆధార్‌లానే భూములకు, స్థలాలకు ‘భూధార్‌’ పేరుతో ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వడం దీని ఉద్దేశం. మొత్తం భూముల్ని పక్కాగా సర్వేచేసి, శాటిలైట్‌ ఇమేజెస్‌ రూపొందిస్తారు. ప్రతి ఒక్కరి భూమికి 11 అంకెల భూధార్‌ నెంబరు కేటాయిస్తారు. కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు చేపట్టారు. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే భూ వివాదాలకు, మోసాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఆన్‌లైన్‌లో నెంబరు కొడితే చాలు అన్ని వివరాలూ క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియా సాఫీగా జరుగుతుంది.
ఇ-ఆఫీసు
ప్రభుత్వ కార్యాలయాల్ని కాగిత రహితంగా చేయడం, దస్త్రాలన్నీ ఆన్‌లైన్‌లోనే(ఇ-ఫైల్‌) పరిష్కరించడం ఇ-ఆఫీసు లక్ష్యం. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లోని దస్త్రాలన్నీ ఆన్‌లైన్‌ చేశారు. జిల్లాస్థాయి వరకు ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఏ ఫైలు ఎవరి దగ్గర పెండింగ్‌లో ఉంది? ఏ దస్త్రాన్ని పరిష్కరించడానికి ఎవరు ఎన్ని   రోజులు సమయం తీసుకున్నారు?   వంటి వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ప్రజలందరి డేటా సిద్ధం
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని  కుటుంబాలు, పౌరుల సమాచారంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక డేటా బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. 4,37,43,837 మందికి సంబంధించిన సమాచారం ఇప్పుడు సిద్ధంగా ఉంది. దీన్ని వివిధ ప్రభుత్వ పథకాలతో  అనుసంధానం చేస్తున్నారు.
ఐటీ, ఔళి, ఆహార శుద్ధి, పర్యాటక రంగాల్లో ఒప్పందాలు:
గత నాలుగేళ్లలో 1657 ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ఒప్పందాలు జరిగాయి. వీటి విలువ రూ. 11,27,871 కోట్లకు పైగా ఉంటుంది. వీటితో 23 లక్షల మందికి పైగా ఉపాధి లభించనుంది.

ప్రారంభమైనవి: 
రూ.4,53,887 కోట్లతో ఇప్పటి వరకూ 1065 ప్రాజెక్టులు ప్రారంభమై 8.27 లక్షల మందికిపైగా ఉపాధి చూపాయి. మిగతా ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. 
ప్రభుత్వం గత మూడేళ్ల వ్యవధిలో రూ.3,233.53 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించింది. మరో రూ.2 వేల కోట్ల పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తోంది.

పరిశ్రమలకు అంతా అనుకూలం 
* సుదీర్ఘ తీరప్రాంతం  
* నౌకాశ్రయాలు 
 విమానాశ్రయాల విస్తరణ, కొత్తవాటి నిర్మాణం 
* నిరంతర విద్యుత్‌ సరఫరా 
* నీటిలభ్యత  
* మౌలిక సదుపాయాల కల్పన 
* అందుబాటులో సరిపడా భూములు

7ap-main1k.jpg
Link to comment
Share on other sites

4 hours ago, rk09 said:

Nellore

చతుర్ముఖ ప్రగతిరథం 
ఎన్నో సంక్షేమ పథకాలు 
ప్రతి ఒక్కరికీ అందిన ఫలాలు 
’మహా సంకల్పం‘తో నేడు జిల్లాకు సీఎం రాక 
nlr-top1a.jpg



 

అంతులేని చీకటి ముసిరి 
ఒక్క పాటున తెగిన రెక్కలు 
అలుపు లేని శ్రమతో 
రాజధానికి తాను నిర్మాతయి 
అన్ని దిక్కులకు వెలుగైన సూర్యుడు. 
గృహనిర్మాణాలు 
కొరతలేని విద్యుత్తు 
అన్నపూర్ణగా అన్న క్యాంటిన్లు 
ఎన్నో సోలార్‌ పార్కులు 
విమానాశ్రయాలు, ఓడరేవులు 
నీటి వనరులతో దాహాన్ని తీర్చి 
విద్య, వైద్యం అందరికి 
చంద్రన్న సంక్రాంతి కానుకలు 
రంజాన్‌ పండుగ తీపి వంటలు 
గురుకులాల పేరుతో చదువు ఇక అందరికి 
ఎవరెస్టు అయితే ఏమీ, మార్స్‌ అయితే ఏమీ 
లక్ష్యం ఏదైనా ఒక్క పరుగున చేరే మన విద్యార్థులు 
చక్కటి రోడ్లు, తాగునీటి వసతి 
తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌, మాతాశిశుసంరక్షణ 
సంచారవాహనాలతో మెరుగైన వైద్య సేవలు 
చంద్రన్న బీమా పేదల్లో భరోసా 
పెళ్లి కానుకతో బడుగుల ముఖాల్లో వెలుగు 
పల్లెపల్లెకు బాటలు పరుస్తూ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటూ ముందడుగు వేస్తోంది.


ఈనాడు-నెల్లూరు

‘మీ కోసం’ అంటూ ప్రజల్లోకి వచ్చిన సమయంలో గుండె నిండా ఆర్థ్రత నిండింది. అప్పుడు అధికారం లేదు. ఏం చేయాలన్నా అసహాయత. ప్రజలు పడుతున్న కష్టాలు మనస్సును చలించేలా చేశాయి. అప్పుడు అనుకున్నాడు.. ప్రజలకు సేవ చేసే అవకాశం మళ్లీ వస్తే.. ప్రతి ఇంటికి ‘పెద్ద కొడుకు’ మాదిరి ఉంటానని భరోసా ఇచ్చాడు. మొదలైన ప్రయాణం. నాలుగేళ్లు గడచింది. జిల్లాలో ప్రతి ఇంటికి ఆయన్ను పెద్ద కొడుకు చేసింది. నిస్సహాయ స్థితిలో సాయం కోసం ఆర్థ్రంగా ఎదురుచూస్తున్న వారి కన్నీళ్లు తుడిస్తే చాలు. వాళ్లు కుటుంబంలో ఒక్కరు కాకుండా ఉంటారా! సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు అదే చేశారు. పేదలు.. కడు పేదలు.. సాయం కోసం ఎదురుచూసే వారి సంక్షేమం కోసం సంక్షేమ పథకాలనే రూపకల్పన చేశారు. పుట్టిన పసికందు నుంచి పండు ముదుసలి వరకు.. ఏదో ఒక ప్రయోజనం ప్రభుత్వం అందించేలా పథకాల రూపకర్తగా మారారు. పట్టెడన్నం పెట్టడానికి సబ్సిడీపై కిరాణ సరకులు ఇచ్చారు. వాటిని కొనుగోలు చేయటానికి ఎన్టీఆర్‌ భరోసా అంటూ పింఛన్లు ఇచ్చారు. ఖరీదైన కార్పొరేట్‌ వైద్యానికి ఎన్టీఆర్‌ వైద్యం అంటూ పేరు. ఇలా పేర్లు ఏవైనా సంక్షేమం అనేది ముఖ్యం అంటూ జిల్లాలో రూ.కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. నాలుగేళ్ల ప్రయాణంలో చేసిన ఖర్చు రూ.వేల కోట్లను దాటింది. నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలు.. మౌలిక వసతులను సమపాళ్లలో జిల్లాకు అందిస్తూ దార్శనికత చూపిన ధీరుడుగా నవ్యాంధ్రను నాలుగేళ్లుగా నడిపించారు. ‘మహా సంకల్పం’తో సీఎం చంద్రబాబు శుక్రవారం జిల్లాకు వస్తున్నారు.

Mana jilla life Raaya rmtaaniki kooda emi levvu anamata hmmm kaluvLu cover cheysi savachu gaa

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...