Jump to content

CBN 4 Years Governance


Recommended Posts

ఇదిగో అమరావతి ఆంధ్రుల ప్రగతి గీతి 
amr-top1a.jpg
రాష్ట్ర విభజన జరిగిన తరువాత పరిపాలన తరలించడానికి విజయవాడలో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరైన వసతి లేక బస్సులోనే పడుకున్నారు. బస్టాండ్‌ కన్నా అధ్వానంగా ఉందంటూ గన్నవరం విమానాశ్రయాన్ని చూసి అప్పటి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఆవేదన చెందారు. ఇరకుసందులు, గందరగోళంగా ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరులు కనిపించేవి.. ఎక్కడ ఉండాలో? పాలన ఎలా చేయాలో? అనే సందిగ్ధ పరిస్థితి.... ఇదంతా నాలుగేళ్ల క్రితం నాటి మాట...

మరి ఇప్పుడు 
అమరావతి రాజధాని పరిధిలో అభివృద్ధి పరవళ్లు తొక్కుతోంది. ప్రధానంగా విజయవాడ, గుంటూరు నగరాల కేంద్రంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు సాగుతున్నాయి. గత నాలుగేళ్లలో ప్రారంభమైనన్ని ప్రాజెక్టులు.. గత శతాబ్ద కాలంలోనూ జరగలేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రూ.వందల కోట్ల పైవంతెనలు.. వేల కోట్ల విలువైన రహదారుల పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. మౌలికవసతులు, సుందరీకరణ పనులు, పర్యాటక ప్రాజెక్టులు చకచకా పూర్తవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు, సంస్థలు పదుల సంఖ్యలో కొలువు దీరాయి. దీంతో అన్ని రంగాల్లోనూ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే రాజధాని ప్రాంతం ప్రగతి పథంలో సాగుతోంది. ఐటీ రంగం, ప్రముఖ విశ్వ విద్యాలయాలు, తయారీ రంగం, పరిశ్రమలు ఇలా ఒకటేమిటి అనేక మౌలిక వసతులూ సమకూరుతున్నాయి.

- ఈనాడు, అమరావతి జిల్లా బ్యూరో

కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం.. 
ప్రాజెక్టు వ్యయం: రూ.237 కోట్లు 
రాజధాని అమరావతి ప్రాంతానికి భవిష్యత్తులో వరద నీటి ముంపు లేకుండా ఉండేందుకు చేపడుతున్న ప్రాజెక్ట్‌ ఇది. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పనులను జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.

ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం.. 
ప్రాజెక్టు వ్యయం: రూ.1535 కోట్లు 
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయం తెలంగాణకు కేటాయించడంతో.. ఏపీ కోసం గుంటూరులో కొత్తగా నిర్మిస్తున్నారు. రూ.100 కోట్లతో ఇప్పటికే భవన నిర్మాణాలు పూర్తి చేసి.. విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. మరో రూ.200 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు.

దుర్గగుడి పైవంతెన... 
ప్రాజెక్టు వ్యయం: రూ.448 కోట్లు 
రాజధానిలో నిర్మిస్తున్న అతి పెద్ద పైవంతెన. రూ.448 కోట్లతో 2.5కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల పైవంతెన, దాని కిందన 5కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరుగుతోంది. విజయవాడలోని భవానీపురం నుంచి చేపడుతున్న రహదారి నిర్మాణం ఇప్పటికే తుది దశకు చేరింది. పైవంతెన పనులు 65శాతం పూర్తయ్యాయి. 2019 జనవరి నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి తాజాగా ఆదేశించారు.

గన్నవరం విమానాశ్రయం... 
ప్రాజెక్టు వ్యయం: రూ.320 కోట్లు 
గన్నవరం విమానాశ్రయంలో రూ.160 కోట్లతో నూతన టెర్మినల్‌ భవనం పూర్తి చేశారు. మరో రూ.2.5 కోట్లతో పాత టెర్మినల్‌ భవనాన్ని అంతర్జాతీయ సర్వీసుల కోసం సిద్ధం చేశారు. ప్రస్తుతం రూ.150 కోట్లతో రన్‌వే విస్తరణ, ఇతర అభివృద్ధి పనులను చేపడుతున్నారు.

Link to comment
Share on other sites

West Godavari

నవ శకానికి నాలుగేళ్లు 
అగ్రపథం దిశగా అడుగులు 
వ్యవసాయంలో కొత్త రికార్డులు 
weg-top1a.jpg
పోలవరం పరుగులు, పర్యటక రంగంలో ఉరుకులు, వ్యవసాయంలో వినూత్నం, ఆక్వాలో అధిక దిగుబడులు, ఉద్యానపంటల్లో పెరుగుదల... పారిశ్రామిక మెరుపులు, ఇలా ఏ రంగం చూసినా ఈ నాలుగేళ్లలో పశ్చిమ సాధించిన ప్రగతి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వచ్చి శుక్రవారం నాటికి నాలుగేళ్లు పూర్తవుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగి లోటుబడ్జెట్‌తో పాలన ప్రారంభమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారనే చెప్పవచ్చు. వ్యవసాయంలో రెండంకెల వృద్ధిరేటు, మత్స్యరంగంలో రెట్టింపుస్థాయిలో దిగుబడులు, గ్రామాల్లో వందల కిలోమీటర్లలో  సీసీ రహదారుల నిర్మాణాలు, రూ.వందల కోట్లతో రహదారుల నిర్మాణాలు, లక్షల మందికి ఉపాధి పథకం పనులు ఇలా అన్నింటా పురోగతి  కనిపిస్తోంది. దాంతోపాటు అనేక రంగాల్లోనూ మార్పు సంతరించుకుంది. కొన్నిచోట్ల రెట్టింపు స్థాయిలో అభివృద్ధి సాధిస్తే.. మరికొన్ని చోట్ల గణనీయ పురోగతి కనిపిస్తోంది.

రైతుకు రాయితీల  అండ 
జిల్లా అంటే దేశానికి అన్నపూర్ణగా పేరు. జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో వరిసాగవుతోంది. గతేడాది ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారానే 10,72,115 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో రైతురథం పథకం ద్వారా 21,883 మంది రైతులకు ట్రాక్టర్లు మంజూరు చేశారు. ఈ పథకంలో రైతులు రూ. 100 కోట్ల విలువ చేసే రాయితీ పొందారు. రెండు లక్షల హెక్టార్లకు 18,968 టన్నుల సూక్ష్మపోషకాలు మంజూరు చేశారు.

ఆయువుపట్టుగా ఆక్వా 
జిల్లా ఆక్వాకు ఆయువు పట్టుగా మారింది. జిల్లా మొత్తం 2 లక్షల ఎకరాల్లో ఈ సాగు జరుగుతోంది. ఏటా లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తూ వేలకోట్ల విదేశీమారకద్రవ్యం సంపాదించి పెడుతోంది. గత నాలుగేళ్లలో నాలుగు లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఈ ఏడాది ధర తగ్గడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో భాగంగా విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

చేపలసాగులో ప్రథమం 
చేపల ఉత్పత్తిలో 2015-16, 2016-17 సంవత్సరాల్లో రాష్ట్రంలో జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. 2017-18 ఏడాదికి రెండోస్థానం సాధించింది. ఈ మూడేళ్లూ రొయ్యల జిల్లా  మూడోస్థానంలో నిలిచింది.

ఆక్వాలో సాధించిన పురోగతి 
* అత్యధిక ప్రగతి కనిపించిన శాఖల్లో సూక్ష్మసేద్యం ఒకటి. జిల్లాలో సగభాగం డెల్టా. మిగిలింది మెట్టప్రాంతం. ఇక్కడ భూగర్భజలాల వినియోగం లెక్కకు మిక్కిలి జరుగుతోంది. రాయలసీమ జిల్లాలతో పోల్చుకుంటే భూగర్భ జల మట్టాలు దారుణంగా పడిపోయాయి. వ్యవసాయానికి సాగునీరును విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నారు. మొదట్లో సూక్ష్యసేద్యం వినియోగించుకునేవారు తక్కువగా మందే ఉండేవారు. 2014-15 సంవత్సరంలో జిల్లాలో 3833 హెక్టార్లలో మాత్రమే వినియోగించుకుంటే తరవాత సంవత్సరం దానికి రెట్టింపు స్థాయిలో 6657 హెక్టార్లలో అమర్చారు. 2016-17 సంవత్సరంలో ఆ సంఖ్య 13740 హెక్టార్లకు పెరిగింది. 2017-18కి 14767 హెకార్టలో సాగు చేశారు. ఏటా రెట్టింపుస్థాయిలో పెరిగింది.

రెండింతలు ఉద్యానసాగు లక్ష్యం 
* డెల్టాలో వరి, ఆక్వాసాగు జరుగుతున్నట్లుగానే మెట్ట ప్రాంతంలోనూ ఉద్యాన పంటలు సాగు జరుగుతోంది. ఉద్యాన సాగు పెంచి రైతుల ఆదాయం రెండింతలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏటా రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.

2017-18   38532    రూ.41.09 కోట్లు 
* రహదారులు-భవనాలశాఖ ద్వారా ఈ నాలుగేళ్లలో ఏకంగా రూ. 1314కోట్లు ఖర్చు చేశారు. అంటే 2248 కిలోమీటర్లు మేర రహదారులు బాగు చేశారు. భారీ మొత్తంలోనే ఖర్చు చేశారు. కానీ రహదారుల పరిస్థితి మాత్రం మెరుగుపడింది లేదు. ఏటా మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. ఏటా రహదారులు గుంతలమయంగా మారిపోతూనే ఉన్నాయి. 
* ఉపాధి హామీ పథకంలో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఏటా పనిదినాల్లో మెరుగుపడుతూ వచ్చాం. 2014-15లో 57,30,050 కాగా ఈ సంఖ్య 2017-18 నాటికి 1,44,55,244గా పెరిగింది. అదే మాదిరిగా ఉపాధి పథకంలో నిధులు ఖర్చు క్రమేణా పెరుగుతూ వచ్చింది.

పరి‘శ్రమ’కు ఫలితం 
తెదేపా ప్రాధాన్య అంశాల్లో పరిశ్రమల ఏర్పాటూ అతి ముఖ్యమైంది. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే పరిశ్రమలు తక్కువగానే ఉన్నాయి. అయితే జిల్ల్లాలో ఉన్న పరిశ్రమలకూ భారీ ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. పరిశ్రమలు స్థాపనకోసం బ్యాంకుల్లో రుణాలు పొందితే దానికి అయ్యే వడ్డీలో ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. అలాగే విద్యుత్తు బిల్లులోనూ రాయితీ ఇస్తోంది. ఇలా జిల్లాలో నాలుగేళ్లలో 1614 మందికి రూ. 762.34 కోట్ల రాయితీలు మంజూరు చేశారు.

పర్యాటకంపై దృష్టి 
* జిల్లాను పర్యటకంగానూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తలచింది. కొల్లేరును అభివృద్ధి చేయాలని డీపీఆర్‌ రూపొందించి పంపించారు. ఇంకా కొన్ని ప్రాజెక్టులు నెలకొల్పడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో 46 ప్రాజెక్టులకు రూ. 23.37 కోట్లు ఖర్చు చేశారు.

పంచాయతీ రాజ్‌ రహదారులు 
* పంచాయతీ ఇంజనీరింగు శాఖ ఆధ్వర్యంలో గడచిన ఏడాదిలో రూ. 159.33 కోట్లతో 531 కిలోమీటర్ల సీసీ రహదారులు నిర్మించారు. రూ. 11 కోట్లతో 100 కిలోమీటర్ల డ్రైనేజీ నిర్మాణం జరిగింది. రూ. 25.34 కోట్లతో 362 అంగన్వాడీ భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయి. రూ. 23.55 కోట్లతో 157 పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నారు. రూ. 1.10 కోట్లతో 5 మండల మహిళాసమాఖ్య భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయి.

 
Link to comment
Share on other sites

East

ప్రసరించిన ప్రగతి కిరణం 
నాలుగేళ్లలో నవశకం 
అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో తూర్పునకు ద్వితీయ స్థానం 
విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, సంక్షేమ రంగాల్లో పరుగు 
మౌలిక వసతులు, పరిశ్రమలు, పర్యాటకానికి పెద్దపీట 
eag-top1a.jpg

రాష్ట్ర విభజన.. అందరిలో భయం. ఇక అభివృద్ధి చెందలేమన్న నిర్వేదం. యువతలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే ఆందోళన.. అన్నింటి మధ్య 2014 జూన్‌లో కొలువుదీరిన తెలుగుదేశం ప్రభుత్వం శుక్రవారంతో నాలుగేళ్లు పూర్తి చేసుకుంటోంది. నిరాశను పటాపంచలు చేస్తూ అభివృద్ధి వైపు అడుగులేస్తూ నవశకానికి శ్రీకారం చుట్టింది. విద్య, ఉపాధి, మౌలిక వసతులు, పరిశ్రమల ఏర్పాటు, సంక్షేమం కోసం ఆనేక పథకాలు అమల్లోకి వచ్చాయి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు ఉత్పాదకత వృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. జిల్లాలో 2014 నుంచి వివిధ రంగాల్లో ప్రగతి పరుగుతీస్తోంది. ఆయా శాఖల్లో ఆటంకాలను అధిగమించి ఆశాజనక ఫలితాల సాధనతో ముందడుగు వేస్తోంది.

ఈనాడు, కాకినాడ

జి ల్లాలో గత నాలుగేళ్లలో సాగునీటి రంగంలో గణనీయ ప్రగతి కనిపిస్తోంది. ఈ కాలంలో సాగునీటి అవసరాల కోసం సుమారు రూ.3,000 కోట్లు ఖర్చు చేసినట్లు జలవనరుల శాఖ ఎస్‌.ఇ కృష్ణారావు తెలిపారు. ఇందులో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కీలకంగా నిలుస్తోంది. రూ.1,632 కోట్ల అంచనాలతో ఈ పథకం నిర్మాణాన్ని చేపట్టారు. దీనిద్వారా ఏలేరు ఆయకట్టుకు సాగునీటి సమస్య లేకుండా చూడాలన్నది లక్ష్యం. ఏలేరు ప్రాజెక్టు రెండో దశ కోసం రూ.167 కోట్లు కేటాయించారు.పోలవరం ఎడమ కాలువ కింద సుమారు రూ.800 కోట్లు ఖర్చు చేశారు. వీటితో పాటు రాజవొమ్మంగిలో కిరాలి ఆనకట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి రూ.60 కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

గ్రామీణ వికాసం 
జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. గత ఏడాది కాలంలో 700 కిలోమీటర్ల మేరకు సిమెంటు రోడ్లు నిర్మించారు. వీటి నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక కత్తిపూడి నుంచి రాజోలు వరకు 216 జాతీయ రహదారి విస్తరణ, ఏడీబీ రోడ్డు విస్తరణకు ఆమోదం, బీచ్‌ రోడ్డు అభివృద్ధికి చర్యలు చేపట్టారు. వీటితో పాటు రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రూ.812 కోట్లతో 1,652 కిలోమీటర్ల మేరకు కొత్తగా రహదారుల నిర్మాణం జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో జిల్లా రూ.22,767 కోట్ల స్థూల ఆదాయ విలువతో తృతీయ స్థానంలో ఉండగా, పారిశ్రామిక రంగంలో రూ.20,326 కోట్ల స్థూల ఆదాయ విలువతో ద్వితీయ స్థానంలో నిలిచింది.

పర్యాటక ప్రాధాన్యం 
జిల్లాలో పర్యాటక ప్రాధాన్యం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఈ శాఖ పరిధిలో 2014-17లో రూ.69.80 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.41.50  కోట్లతో కాకినాడలో ఎన్టీఆర్‌ బీచ్‌ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రూ.80 లక్షలతో హోప్‌ఐలాండ్‌లో పర్యాటకుల కోసం మౌలిక వసతులు కల్పించారు. పాసర్లపూడి, ఆదుర్రు వద్ద బోటింగ్‌ జెటీటల నిర్మాణానికి రూ.7.77 కోట్లు ఖర్చు చేశారు. కోరింగ అభయారణ్యంలో యాత్రికుల సౌకర్యార్థం రూ.8.46 కోట్లతో 2016-17లో భవనాలు నిర్మించారు.

పేదలకు గూడు 
రాష్ట్రంలో 2022 నాటికి అందరికీ ఇళ్లు అన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో గృహ వసతి లేని నిరుపేదల కోసం 95,098 ఇళ్లు కేటాయించారు.2014-15లో రూ.63.91 కోట్లతో 8,223 ఇళ్లు, 2015-16లో రూ.89 కోట్లతో 13,131 ఇళ్లు, 2016-17లో రూ.30.54 కోట్లతో 2,876, 2017-18లో  రూ.385 కోట్లతో 42,400 ఇళ్లు, 2018-19 మే 31 వరకు రూ.96 కోట్లతో 7,470 ఇళ్లను నిర్మించారు. ఇప్పటి వరకు రూ.666.23 కోట్లతో 74,100 గృహాల నిర్మాణం పూర్తయింది.

సంక్షేమానికి పెద్దపీట 
జిల్లాలో 2014-18లో ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 17,011 మంది లబ్ధిదారులకు రూ.271.48 కోట్లు ఆర్థిక సాయంగా అందజేశారు. ఇందులో రాయితీ విలువ రూ.141.65 కోట్లు. బ్యాంకుల నుంచి 16,169 మంది లబ్ధిదారులకు రూ.248.22 కోట్లు అందించారు. ఇందులో రాయితీ విలువ రూ.130 కోట్లుగా ఉంది. బీసీ  కార్పొరేషన్‌ కింద నాలుగేళ్లలో 24,998 మంది లబ్ధిదారులకు రూ.304 కోట్లు ఖర్చు చేశారు. కాపు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 36,731 మంది లబ్ధిదారులకు రూ.520 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గిరిజన సంక్షేమం కింద 2014-15లో 197 పనులకు రూ.23 కోట్లు, 2015-16లో 212 పనులకు రూ.12 కోట్లు, 2016-17లో 65 పనులకు రూ.7.59 కోట్లు, 2017-18లో 228 పనులకు రూ.39.21 కోట్లు ఖర్చు చేశారు. 4,457 మంది గిరిజన యువతకు నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. వీరిలో  2,025 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. బీసీ సంక్షేమం కింద వసతి గృహాల్లోని ప్రీమెట్రిక్‌ విద్యార్థులకు రూ.18.10 కోట్లు, పోస్ట్‌ మెట్రిక్‌ విద్యార్థుల కోసం  రూ.14.08 కోట్లు వెచ్చించారు. .

అన్నదాతకు అండ 
జిల్లాలో 4.62 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.611 కోట్లు కేటాయించారు. 2.12 లక్షల మంది రైతులకు ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.435 కోట్లు చెల్లించారు. రెండో విడత 10 శాతం వడ్డీతో 2.5 లక్షల మంది రైతులకు రూ.192 కోట్లు జమ చేశారు.ఇక వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.42 కోట్లు, రైతు రథం కింద 1,172 ట్రాక్టర్ల కొనుగోలుకు రూ.19 కోట్లు ఖర్చు చేశారు. కౌలు రైతులకు రూ.485 కోట్లు రుణాలుగా ఇచ్చారు.

గ్రామీణ నీటి సరఫరా 
జిల్లాలో 57 సీప్డీబ్ల్యూ పథకాలు ఉన్నాయి. గత నాలుగేళ్లలో 386 నివాసాలకు కొత్తగా తాగునీరు సరఫరా చేశారు. ప్రస్తుతం జిల్లాలో 57 పథకాల కింద 1,631 గ్రామాలకు రక్షిత నీటిని అందిస్తున్నారు ఎన్టీఆర్‌ సుజల పథకం కింద నాలుగేళ్లలో 252 ప్లాంట్లు ఏర్పాటు చేశారు. శుద్ధి చేసిన 20 లీటర్ల నీటిని రూ.2 వంతున ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 1,069 పంచాయతీల్లో 3,10,000 ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఈ ఘనత సాధించిన జిల్లాగా తూర్పుగోదావరి నిలిచింది.

పరిశ్రమల్లో ముందంజ 
జిల్లాలో 2014-15లో రూ.229 కోట్లతో 210 చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేశారు. దీనిద్వారా 3,529 మందికి ఉపాధి లభించింది. 2015-16లో రూ.399 కోట్లతో 11,676 మందికి ఉపాధి కల్పించారు. 2016-17లో రూ.287 కోట్లతో 376 పరిశ్రమల ద్వారా 5,768 మందికి, 2017-18లో రూ.335 కోట్లతో 6,962 మందికి ఉపాధి లభించింది. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా 2016లో రూ.11,005 కోట్లతో ఎంవోయూలు, 2017లో 26 ఎంవోయూల ద్వారా రూ.4,371 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. వీటిలో 23 ఎంవోయూలు ఆహార శుద్ధికి సంబంధించినవే. 2018-19లో రూ.2,918 కోట్ల విలువైన ఎంవోయూలు కుదిరాయి.

Link to comment
Share on other sites

Krishna

కృష్ణం చంద్ర ఫలం 
kri-top1a.jpg

కృష్ణా.. వ్యవసాయ పరమైన ఈ జిల్లాలో కొన్నేళ్లుగా కర్షకులు కష్టాల సాగు సాగించారు. తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు. ఇక పంట విరామం పాటిద్దామన్న తరుణంలో పట్టిసీమ పంట సిరులు కురిపించింది.. 
గోదారమ్మ.. కృష్ణమ్మతో మమేకమై.. పట్టిసీమ నీరు పరవళ్లు తొక్కింది.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అన్నదాత ఇంట బంగారు సిరులు కురిపించింది. సాగుపై ఆశలు నిలిపింది.. భవితపై భరోసా కల్పించింది. లక్షల ఎకరాల కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసింది. మత్స్య సంపదలో జిల్లా ముత్యమై మెరిసింది. అధిక ఆదాయాలను తెచ్చిపెట్టింది.  పథకాల్లో ప్రథమం.. అడుగడుగునా సహాయపడుతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. అన్ని రంగాల్లో అభివృద్ధి మంత్రం జిల్లా ప్రజలను ముందుకు నడిపింది.. రాష్ట్ర ప్రభుత్వ నాలుగేళ్ల పాలన ప్రజల్లో ఆశలు నింపింది.

ఆక్వా వేదిక.. 
రాష్ట్రంలో మొదటి స్థానం జిల్లాదే 
కేకపుట్టిస్తున్న కైకలూరు 
కైకలూరు, న్యూస్‌టుడే 
kri-top1b.jpg
చేప పిల్ల చిద్విలాసం చేస్తోంది. రొయ్య మీసం మెలేస్తోంది. కొల్లేరు ప్రాంతపు మట్టి సారం ఆక్వాకు అనుకూలంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం తెచ్చిపెడుతోంది.. మత్స్యశాఖ సూచనలు అందుకొని సాగుకు దిగిన వారింట సిరులు కురిపిస్తోంది.  కైకలూరు నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ముందువరుసన నిలబెట్టింది. .

రాష్ట్రంలో ఆక్వా కేక పుట్టిస్తోంది. జిల్లాలో కలిదిండి, కైకలూరు ప్రాంతాలు ప్రగతి సూచీలో అగ్రభాగాన నిలుస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఆక్వా అభివృద్ధిపై వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆర్థికాభివృద్ధిలో ఏఏ రంగాలు పురోభివృద్ధిని సాధించాయనే అంశాలను పరిశీలించిన సందర్భంలో గత ఏడాది మాదిరిగానే ఆక్వా రంగం వృద్ధిరేటులో అగ్రపథాన నిలిచింది. ప్రభుత్వం  నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక పురోగతిలో మత్స్యశాఖను అత్యంత ప్రధాన వనరుగా భావించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి చేసేందుకు ఆక్వాహబ్‌గా తీర్చిదిద్దడానికి గ్రోత్‌ఇంజిన్‌గా గుర్తించి ప్రణాళికలు చేశారు.

ఉత్పత్తుల్లో ఇలా..: 2014 - 15లో ప్రపంచ మత్స్య సంపద 1672.00 లక్షల టన్నులు. మన దేశంలో 95.80 లక్షల టన్నులుగా ఉంది. రాష్ట్రంలో 19.78 లక్షల టన్నుల ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రం నుంచి 3.38 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీన్ని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యరంగానికి అనేక రాయితీలను ప్రకటించింది. చెరువుల తవ్వకాల మొదలు, ఆక్వా రైతులకు ఆధునాతన పరికరాలు, మత్స్యకారులకు రాయితీలను అందిస్తోంది. 
* మత్స్య ఉత్పత్తుల్లో రాష్ట్రంలోని ఈ ఆర్థిక సంవత్సరంలో 40 శాతం వృద్ధి రేటును సాధించింది. జిల్లాలో 34.07 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది.   రాష్ట్ర వ్యాప్త ఉత్పత్తుల్లో 75 శాతం ఈ జిల్లా నుంచే అదీ కైకలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ, బంటుమిల్లి, కృత్తివెన్ను, నాగాయలంక మండలాల నుంచే సాధిస్తున్నారు.

పెరుగుతున్న సాగు విస్తీర్ణం : జిల్లాలో గత కొన్నేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దీనికి అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. డెల్టా ప్రాంతంలో నేల ఆక్వా సాగుకు అనుకూలంగా ఉంది. నీరు అందుబాటులో ఉండటంతో రైతులు ఆక్వా సాగువైపు మళ్లుతున్నారు. వరి ఇతర పంటల నుంచి వచ్చే ఆదాయం అంతంతమాత్రమే కావడడంతో ప్రత్యామ్నాయంగా రైతులు చేపలు, రొయ్యల సాగుకు ఎంచుకుంటున్నారు. వరి ఇతర పంటల సాగులో కూలీల సమస్య కూడా కారణం అయ్యింది. ఒక ప్రాంతంలో ఆక్వా సాగు ప్రారంభిస్తే ఆ పక్కనుండే భూముల్లో కూడా ఇతర పంటలు పండే పరిస్థితులు లేవు. పక్కనున్న రైతులు కూడా ఈ సాగువైపు మళ్లుతున్నారు. రొయ్యల, చేపల చెరువులను లీజుకు ఇస్తే ఏడాదికి ఎకరాకు రూ. 60వేల నుంచి 70వేలకుపైగా ఇస్తున్నారు. అన్నదాతలు కూడా ఇతర పంటల కంటే ఆక్వా సాగే ఉత్తమనే పరిస్థితికి వచ్చారు. వరిసాగు భూములు దాదాపుగా ఆక్వా చెరువులుగా మారుతŸున్నాయి.

పెరిగిన వృద్ధి రేటు : ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు మరింత పెరుగుదల చూపినట్లు మత్స్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 2017 - 18లో రాష్ట్రంలో 32.50 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిద్వారా రూ. 56.585 వేల కోట్ల గ్రాస్‌ వాల్యు అడేడ్‌(జీవీఏ) రాబట్టనుంది. రాబోయే కాలంలో రెండంకెల వృద్ధి సాధించడానికి ప్రభుత్వం మత్స్య మంత్రాన్ని జపిస్తోంది.

లక్ష్యాలు.. ఫలితాలు.. 
జిల్లాలో ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యం: 10,70,094 టన్నులు 
సాధించిన ప్రగతి: 13,33,437 టన్నులు. జిల్లా తలసరి ఆదాయం సాలీనా రూ. 1,89,121. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1.42 లక్షలు, జాతీయ తలసరి ఆదాయం రూ. 1.12 లక్షలు, దేశంలో హరియాణా తరువాతి స్థానం ఈ జిల్లాదే. వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి రూ. 36,073 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది మొత్తం ఆదాయంలో 40.61 శాతం. 
* నియోజకవర్గాల్లో కైకలూరు ప్రథమం: రాష్ట్రంలోని నియోజకవర్గాల ప్రగతి విషయానికి వస్తే కైకలూరు మొదటి స్థానంలో నిలిచింది. నియోజకవర్గ స్థూల ఉత్పత్తిలో మొదటిస్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో అవనిగడ్డ, విజయవాడ పశ్చిమం, గన్నవరం, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్‌, మైలవరం, గుడివాడ, నూజివీడు, పెడన నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లా తలసరి ఆదాయం రూ. 1.89 లక్షలు ఉంటే దీనికంటే రెట్టింపు ఆదాయం కైకలూరు నియోజకవర్గంలో ఉంది. దీనికి కారణం రొయ్యల సాగు ద్వారా వచ్చే ఆదాయమే. ఇక్కడ రికార్డు స్థాయిలో రూ. 3.46 లక్షలుగా నమోదు అయ్యింది. అవనిగడ్డ, పెడన నియోజకవర్గంలో రొయ్యలు, చేపల సాగు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి. జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో ఆరింటిలో జిల్లా సగటు కంటే అధిక ఆదాయాన్ని అర్జించాయి. 
* మండల స్థాయిలో... మండల స్థూల ఉత్పత్తిని పరిశీలిస్తే విజయవాడ అర్బన్‌ 19,805 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే దీనితరువాత మచిలీపట్నం, విజయవాడ గ్రామీణ, కలిదిండి, పెనమలూరు మండలాలు నిలిచాయి. ఆక్వా రంగం ద్వారా నాగాయలంక, కృత్తివెన్ను, కలిదిండి, మండవల్లి, మండలాలు జిల్లా సగటును అధికమించాయి. కొల్లేరు భూములు పంపిణీ చేస్తే ఈ మార్పు మరింత అధికంగా ఉంటే అవకాశాలు ఉన్నాయి.

రైతులకు తగు సూచనలు అందిస్తున్నాం 
ఆక్వా రైతులకు క్షేత్రస్థాయిలో నేల, నీరు పరీక్షలను ఎప్పటికప్పుడు చేస్తూ  సూచనలు, సలహాలు అందిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే రాయితీ పథకాలను రైతులకు, మత్స్యకారులకు, గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ పేదలకు అందజేస్తున్నాం. చెరువులు తవ్వుకొనేందుకు చేస్తున్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరిస్తున్నాం. తాజాగా ఆక్వాసాగును ఆరోగ్యకరంగా చేసేందుకు, నిషేధిత యాంటీబయాటిక్స్‌ వాడటం వల్ల కలిగే నష్టాలపై  అవగాహన కల్పిస్తున్నాం. కైకలూరులోని మత్స్యశాఖ ప్రయోగశాల ద్వారా చేపలు, రొయ్యల్లో వచ్చే వ్యాధులను గుర్తించి నివారణకు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే ఆక్వా రంగంలో ఇంతటి పురోగతి సాధ్యమయ్యింది.

- డి.సాల్మన్‌సుధాకర్‌, మత్స్యశాఖ సహాయ సంచాలకుడు, కైకలూరు
సాగుకు అండగా 
తిరువూరు, న్యూస్‌టుడే
రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ జిల్లాలో విజయవాడ కేంద్రంగా పనిచేస్తోంది. ఎత్తిపోతల పథకాలను నిర్మించి ఆయకట్టు భూములకు సాగునీరు అందించే పర్యవేక్షణ నిమిత్తం విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట కేంద్రాలుగా మూడు ఉపకార్యాలయాలు పనిచేస్తున్నాయి. మెట్ట ప్రాంతాల సన్న, చిన్నకారు, ఇతర రైతుల భూములకు సాగునీటి వసతి కల్పించటానికి నిర్మించి, పూర్తయిన తరువాత నీటి సంఘాలకు అప్పగించటం ఈ సంస్థ ప్రధాన ధ్యేయం.

జిల్లాలో మార్చి 31 నాటికి రూ.283.98 కోట్ల అంచనా వ్యయంతో 1,29,630 ఎకరాలకు సాగునీటిని అందించటానికి 135 ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఇటీవల మంజూరు చేసిన నిధులతో మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. రైతుల విజ్ఞప్తి మేరకు కొత్తగా చేపట్టే వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 
జిల్లాలో వ్యవసాయ భూములు: 7.37 లక్షల హెక్టార్లు 
నికరపు సాగు విస్తీర్ణం: 5.66 లక్షల హెక్టార్లు 
దీనిలో మెట్ట, మాగాణీ పంటల సాగు విస్తీర్ణం: 3.44 లక్షల హెక్టార్లు 
ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం: 1,07175 హెక్టార్లు 
అటవీభూమి విస్తీర్ణం: 49,960.65 హెక్టార్లు

జిల్లాలో రైతులు మొత్తం 
సన్నకారు రైతులు: 1.07 లక్షలు 
చిన్నకారు : 3.08 లక్షలు 
పెద్ద : 1.39 లక్షలు

kri-top1d.jpg
ప్రతిపాదిత ఎత్తిపోతల పథకాలు 
* పరిపాలనపరమైన అనుమతులు లభించి త్వరలో పనులు ప్రారంభించే పథకాలు: బ్రహ్మయ్యలింగం చెరువు, ములకలమ్మ చెరువు 
ఆయకట్టు: 3405 ఎకరాలు 
అంచనా విలువ రూ.లక్షల్లో: రూ.1437 
కొత్తగా నిర్మించటానికి సర్వే చేసి వివిధ దశల్లో ఉన్న ప్రతిపాదనల ఎత్తిపోతల పథకాలు: 17 
ఆయకటు: 88,156.38

చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద లబ్దిపొందే మండలాలు 
పశ్చిమగోదావరి: గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, చీలుగుమిల్లి, టి.నర్సాపురం, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, పెద్దవేగి, దెందులూరు, పెదపాడు, 
కృష్ణాజిల్లా: చాట్రాయి, ముసునూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, వీరులపాడు, గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు, నూజివీడు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, ఆగిరిపల్లి, విజయవాడ రూరల్‌

లాభించే అసెంబ్లీ నియోజకవర్గాలు 
పశ్చిమగోదావరి: పోలవరం, గోపాలపురం, చింతలపూడి, దెందులూరు 
కృష్ణాజిల్లా: తిరువూరు, మైలవరం, గన్నవరం, నూజివీడు, నందిగామ 
చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సముద్రంలో వృథాగా కలుస్తున్న గోదావరి జలాలను మళ్లించటానికి నిర్మించ తలపెట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకంతో పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల పరిధిలో మెట్ట, మాగాణి పంటలు సాగుకు నోచుకున్నాయి. సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ పథకం ద్వారా పశ్చిమకృష్ణాకు ఎక్కువ లబ్ధి చేకూరనుంది.  పనులు వడివడిగా జరుగుతున్నాయి.

రెండు వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో రూపకల్పన చేసిన పథకాన్ని రెండో విడతలో 6,875 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచారు. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిలో 38 టీఎంసీల నీటిని 90 రోజుల్లో తీసుకునేలా ప్రణాళిక రూపొందించారు. జల్లేరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను 8 టీఎంసీ సామర్థ్యం నుంచి 20 టీఎంసీలకు పెంచారు. పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల పరిధిలో కాలువ ప్రవహించే మార్గంలో ఉన్న 410 గ్రామాలకు చెందిన రెండు లక్షల మంది తాగునీటి అవసరాలను తీర్చనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 70 వేల ఎకరాలు స్థిరీకరిస్తారు. అదనంగా రెండు లక్షల ఎకరాలు సాగులోకి రానుంది. 14 కిలోమీటర్ల మేర లింక్‌ ఛానల్‌ తవ్వి వేంపాడు మేజర్‌ ద్వారా 117వ రెగ్యులేటర్‌ నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు జోన్‌-3 ఆయకట్టు పరిధిలో గల 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రెండు జిల్లాల పరిధిలో మొత్తం 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందటానికి అవకాశం ఉంది.

పట్టిసీమ ధాన్యపు రాశులు... 
న్యూస్‌టుడే, గొడుగుపేట (మచిలీపట్నం) కలెక్టరేట్‌ 
kri-top1c.jpg
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌, రబీలతోపాటు మూడో పంటగా అపరాలు కూడా సాగు చేసేవారు. కొన్నేళ్లుగా సాగునీటి  సమస్యతో ఒక పంట పండించడానికే కష్టమవుతుంది. రాష్ట్ర విభజన తరువాత పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఈ సమయంలో ఎగువనుంచి వచ్చే నీరు కూడా తగ్గిపోయింది. నాగార్జునసాగర్‌ నుంచి వచ్చే జలాలు కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. అవి కూడా పశ్చిమకృష్ణాలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైపోయాయి. ఈ సమస్యను ముందుగానే గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ  నిర్మించి తద్వారా డెల్టా ప్రాంతాన్ని ఆదుకున్నారు. 
* గత ఖరీఫ్‌ జిల్లాలో 2.35 లక్షల హెక్టార్లలో వరి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనాలు సిద్ధం చేసింది. ప్రారంభంలో  ఒడుదొడుకులు ఎదుర్కొన్నా శివారు వరకు కూడా సాగు నీరు అందించడంతో 2,34 లక్షల హెక్టార్లలో వరిసాగు అయ్యింది. 
* 3.28 లక్షల సాధారణ విస్తీర్ణంగా నిర్ణయించగా ఒక్క మిర్చి పంట మినహా మిగిలిన అన్నీ లక్ష్యంమేర సాగయ్యాయి. 
* 2016లో ఎకరాకు సగటున 30 బస్తాలు పండేవి. 2017 ఖరీఫ్‌లో ఎకరాకు 32 నుంచి 40 బస్తాల వరకు దిగుబడులు వచ్చాయి. 
* గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా సాగైన 2.34 లక్షల హెక్టార్ల వరి పంటకు  13.62 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడులు వచ్చాయి. ఈ దిగుబడుల ద్వారా  2,166 కోట్ల ఆదాయం సమకూరింది. 
రబీలో జిల్లా వ్యాప్తంగా 2,09,292 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి  2,04,725 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. 
* జిల్లావ్యాప్తంగా సాగు చేసిన మినుముపంట 1.70 లక్షల మెట్రిక్‌టన్నుల దిగుబడి వచ్చి రైతులను ఆశ్చర్యానికి గురి చేసింది.

40 బస్తాల దిగుబడి 
మాకున్న పొలంతోపాటు మరికొంత కౌలుకు తీసుకొని మొత్తం ఏడెకరాలు  సాగు చేస్తున్నాం. ఈ ఖరీఫ్‌లో పట్టిసీమ జలాలు సకాలంలో రావడంతో గతం కంటే ముందుగా సాగు చేయగలిగాం. పంట చేతికొచ్చేవరకు నీటికి ఇబ్బందులు పడలేదు. పొలం మొత్తం బీపీటీ వరి  సాగు చేశాం. 40 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. మంచి ధర కూడా రావడంతో బస్తా రూ.1500 చొప్పున విక్రయించాం. పట్టిసీమే రైతులను ఆదుకుంది.

- అనిశెట్టి నరేష్‌, కమలాపురం, పెడన మండలం
Link to comment
Share on other sites

Ananthapur

సంకల్ప సిద్ది..సుస్థిర వృద్ధి 
నాలుగేళ్లలో ప్రగతి సుమాలు... 
దరి చేరుతున్న అభివృద్ధి ఫలాలు 
atp-top1a.jpg

విభజన కష్టాల నుంచి ప్రేరణ పొందారు. తిరుగులేని విజయాలు సాధించాలని సంకల్ప దీక్ష బూనారు. త్రికరణ శుద్ధిగా ముందడుగు వేశారు. మేటిగా తీర్చిదిద్దాలని కసిగా శ్రమించారు. ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి.. ప్రజాప్రతినిధుల ప్రయత్నానికి.. అధికారుల కృషి తోడైంది. సుస్థిర వృద్ధి దరి చేరుతోంది. అనంతలో జలసిరుల వైభవంతో సాగుకు వెలుగొచ్చింది. కియా, అనుబంధ పరిశ్రమల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెన్నంటి వస్తున్నాయి. అన్ని వర్గాల సంక్షేమం.. అంతటా ప్రగతే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఐదో వసంతంలోకి అడుగిడుతోంది.

అనంతకు పుష్కల నిధులు 
- పరిటాల సునీత, మంత్రి 
ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరులపై శ్రద్ధతోనే జిల్లాకు మునుపెన్నడూ లేనివిధంగా కృష్ణా జలాలు వచ్చాయి. తొలిసారిగా హంద్రీనీవా ద్వారా చెరువులను నింపితే ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పేరూరు, బీటీపీకి  నిధులు మంజూరు చేసి, టెండర్లు పిలిచారు. వీటికి త్వరలో శంకుస్థాపనచేసి, వచ్చే ఏడాదికి నీటిని నింపేలా చూస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నాం.

అనంత రూపు మారుతోంది 
- కాలవ శ్రీనివాసులు, మంత్రి 
అనంత ప్రగతికి ఎన్టీఆర్‌ ఆశయం పేరుతో ముఖ్యమంత్రి ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో ఒకటి, రెండు మినహా అన్నీ చేపట్టాం. బిందు సేద్యానికి ప్రాధాన్యం నేపథ్యంలో దేశంలోనే మన జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. నిరుడు రైతులకు పంటల బీమా, పెట్టుబడి రాయితీ రూపంలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.1500 కోట్లు ఇచ్చాం. కియా  రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి రూపురేఖలు మారుతున్నాయి.

కియా.. వచ్చేసిందయ్యా 
* రూ.13 వేల కోట్ల పెట్టుబడి 
* 11 వేల మందికి ఉపాధి

అన్నదాత హ్యాపీ 
* 8.01 లక్షల మందికి లబ్ధి 
* రూ.2,033 కోట్ల మేర రుణమాఫీ

వెలుగుల ‘సౌర’భం 
* 555.3 మెగావాట్ల ఉత్పత్తి 
* రూ.3,609  కోట్ల పెట్టుబడి

పవన విజయం 
* 2,337 మెగావాట్ల ఉత్పత్తి 
* రూ.15,191 కోట్ల పెట్టుబడి

చంద్రన్న పెళ్లికానుక 
* దరి చేరిన లబ్ధి: 524 మందికి 
* అందిన నిధులు: రూ.1.23 కోట్లు

చంద్రన్న బీమా 
* దరి చేరిన లబ్ధి: 10,501 మందికి 
* అందిన సాయం: రూ.97.48కోట్లు

చంద్రన్న పసుపు కుంకుమ 
* 5.35 లక్షల మందికి సాయం 
* మూడు విడతల్లో రూ.422  కోట్లు

కృష్ణమ్మ దీవెన 
*  రెండేళ్లలో 51 టీఎంసీల రాక.. 
*  2018లోనే 80 చెరువులకు నీరు

సుజలాం.. సుఫలాం 
* జల వనరులకు రూ.5,247 కోట్లు 
* హెచ్చెల్సీ, హంద్రీనీవా పనులకు

నీరు-చెట్టు.. ప్రగతి విరిసేట్టు 
* జల వనరుల సంరక్షణ 
* రూ.456.07 కోట్లతో 6,711 పనులు

Link to comment
Share on other sites

Guntur

బుడిబుడి అడుగులే.. వడివడిగా... 
పాలనలో నాలుగేళ్లు.. ప్రగతి పరుగులు 
ఉప్పొంగిన జల సిరులు 
అన్నదాతకు ఆపన్నహస్తం 
పారిశ్రామిక బాట.. ఉపాధికి తోవ 
పశు పోషణ, మత్స్య రంగాల్లోనూ వృద్ధి 
gnt-sty1a.jpg

వ్యవసాయ, వాణిజ్య, ఉద్యానపంటల ఖిల్లాగా పేరొందిన జిల్లాలో నాలుగేళ్లలో గణనీయమైన ప్రగతి సాధించింది. సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో దిగుబడులు మెరుగుపడ్డాయి. ప్రపంచంలోనే మేలైన మిర్చి పంటకు గుంటూరు కేంద్ర బిందువైంది. పల్నాడు ప్రాంతంలో కొత్తగా నాలుగు సిమెంటు పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పులిచింతల ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కృష్ణా డెల్టా, సాగర్‌ కాలువల ఆధునికీకరణ తుదిదశకు చేరుకుంది. ఫలితంగా చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. స్పిన్నింగ్‌, జిన్నింగ్‌, ప్లాస్టిక్‌ వస్తువుల తయారీలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. జల వనరులు సమృద్ధిగా ఉండటంతో సాగుభూమిలో 83 శాతం విస్తీర్ణానికి సాగునీరు అందుతోంది. రహదారుల విస్తరణ, రవాణారంగంలో సంస్కరణలు ఇలా ప్రతి రంగంలోనూ నాలుగేళ్ల కాలంలో కీలకమైన మార్పులతో ప్రగతి సాధ్యమైంది. ఇంకా కొన్ని నిర్మాణదశలో ఉండగా, పట్టాలెక్కాల్సిన ప్రాజెక్టులు ప్రతిపాదనల దశలో ఉన్నాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే జిల్లాలో ఉపాధి అవకాశాలు యువతకు మరింత మెరుగుపడనున్నాయి. ఆ దిశగా జిల్లా ప్రజాప్రతినిధులు, యంత్రాంగం కృషి చేయాల్సి ఉంది. ఆంధ్రుల అందరి స్వప్నం రాజధాని అమరావతి నగరం జిల్లాలో నిర్మిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.

- ఈనాడు, గుంటూరు
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి
Link to comment
Share on other sites

సంకల్ప సిద్ది..సుస్థిర వృద్ధి 
నాలుగేళ్లలో ప్రగతి సుమాలు... 
దరి చేరుతున్న అభివృద్ధి ఫలాలు 
atp-top1a.jpg
విభజన కష్టాల నుంచి ప్రేరణ పొందారు. తిరుగులేని విజయాలు సాధించాలని సంకల్ప దీక్ష బూనారు. త్రికరణ శుద్ధిగా ముందడుగు వేశారు. మేటిగా తీర్చిదిద్దాలని కసిగా శ్రమించారు. ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి.. ప్రజాప్రతినిధుల ప్రయత్నానికి.. అధికారుల కృషి తోడైంది. సుస్థిర వృద్ధి దరి చేరుతోంది. అనంతలో జలసిరుల వైభవంతో సాగుకు వెలుగొచ్చింది. కియా, అనుబంధ పరిశ్రమల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెన్నంటి వస్తున్నాయి. అన్ని వర్గాల సంక్షేమం.. అంతటా ప్రగతే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఐదో వసంతంలోకి అడుగిడుతోంది.

అనంతకు పుష్కల నిధులు 
- పరిటాల సునీత, మంత్రి 
ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరులపై శ్రద్ధతోనే జిల్లాకు మునుపెన్నడూ లేనివిధంగా కృష్ణా జలాలు వచ్చాయి. తొలిసారిగా హంద్రీనీవా ద్వారా చెరువులను నింపితే ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పేరూరు, బీటీపీకి  నిధులు మంజూరు చేసి, టెండర్లు పిలిచారు. వీటికి త్వరలో శంకుస్థాపనచేసి, వచ్చే ఏడాదికి నీటిని నింపేలా చూస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తున్నాం.

అనంత రూపు మారుతోంది 
- కాలవ శ్రీనివాసులు, మంత్రి 
అనంత ప్రగతికి ఎన్టీఆర్‌ ఆశయం పేరుతో ముఖ్యమంత్రి ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో ఒకటి, రెండు మినహా అన్నీ చేపట్టాం. బిందు సేద్యానికి ప్రాధాన్యం నేపథ్యంలో దేశంలోనే మన జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. నిరుడు రైతులకు పంటల బీమా, పెట్టుబడి రాయితీ రూపంలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.1500 కోట్లు ఇచ్చాం. కియా  రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి రూపురేఖలు మారుతున్నాయి.

కియా.. వచ్చేసిందయ్యా 
* రూ.13 వేల కోట్ల పెట్టుబడి 
* 11 వేల మందికి ఉపాధి

అన్నదాత హ్యాపీ 
* 8.01 లక్షల మందికి లబ్ధి 
* రూ.2,033 కోట్ల మేర రుణమాఫీ

వెలుగుల ‘సౌర’భం 
* 555.3 మెగావాట్ల ఉత్పత్తి 
* రూ.3,609  కోట్ల పెట్టుబడి

పవన విజయం 
* 2,337 మెగావాట్ల ఉత్పత్తి 
* రూ.15,191 కోట్ల పెట్టుబడి

చంద్రన్న పెళ్లికానుక 
* దరి చేరిన లబ్ధి: 524 మందికి 
* అందిన నిధులు: రూ.1.23 కోట్లు

చంద్రన్న బీమా 
* దరి చేరిన లబ్ధి: 10,501 మందికి 
* అందిన సాయం: రూ.97.48కోట్లు

చంద్రన్న పసుపు కుంకుమ 
* 5.35 లక్షల మందికి సాయం 
* మూడు విడతల్లో రూ.422  కోట్లు

కృష్ణమ్మ దీవెన 
*  రెండేళ్లలో 51 టీఎంసీల రాక.. 
*  2018లోనే 80 చెరువులకు నీరు

సుజలాం.. సుఫలాం 
* జల వనరులకు రూ.5,247 కోట్లు 
* హెచ్చెల్సీ, హంద్రీనీవా పనులకు

నీరు-చెట్టు.. ప్రగతి విరిసేట్టు 
* జల వనరుల సంరక్షణ 
* రూ.456.07 కోట్లతో 6,711 పనులు

 
Link to comment
Share on other sites

Kadapa

కడప గడపన చంద్రకాంతులు 
నాలుగేళ్లలో ఎన్నో మైలురాళ్లు అభివృద్ధికి ఆలంబనగా పనులు 
kdp-top1a.jpg
ఫ్యాక్షన్‌ గడ్డ ప్రశాంతంగా మారింది.. సాంకేతిక ఒరవడితో శాంతి భద్రమైంది.. కరవుకు అడ్డాగా మారిన జిల్లా కృష్ణమ్మ పరవళ్లతో సస్యశ్యామలంగా మారుతోంది.. పాతాళానికి చేరిన జలాలు పైపైకి వస్తున్నాయి.. పూలు.. పండ్ల తోటలతో ఉద్యాన ఖిల్లాగా కడప జిల్లా మార్పు చెందింది. రైలు, బస్సు ప్రయాణాలే కాదు విమానయాణం కూడా జిల్లాలో సులభతరంగా మారింది. అన్నదాతకు అండగా అనేక సంక్షేమాలు అమల్లో ఉండడంతో వ్యవసాయం లాభసాటిగా మారుతోంది. ఒకటా.. రెండా నాలుగేళ్లలో జిల్లాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా జూన్‌ 8వతేదీకి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు. ఇప్పటి వరకు 17 సార్లు జిల్లాలో పర్యటించిన సీఎం ప్రగతి పూలు పూయించారు. మరిన్ని హామీలు వివిధ దశల్లో అమలు కోసం ఎదురు చూస్తున్నాయి.

ఎన్జీవో కాలనీ (కడప), న్యూస్‌టుడే

* గండికోటలో 9 టీఎంసీల నీటిని నిలపడం జిల్లా చరిత్రలో మైలురాయి.. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను కరవు జిల్లాలకు తరలించి ముఖ్యమంత్రి జల బాంధవుడయ్యారు. ఈ ఏడాది జిల్లాలోని అన్ని జలాశయాలు, చెరువుల్లో 40 టీఎంసీల నీటిని నిల్వ చేసి చరిత్ర సృష్టించారు. 
* జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం 3.52 లక్షల మంది రైతులకు గాను రూ.1285.55 కోట్లు మాఫీ జరిగింది. ఇందులో మొదటి విడతలో రూ.462.87 కోట్లు.. రెండో విడతలో రూ.205.68 కోట్ల చొప్పున మాఫీ అయింది. 
* జిల్లాలో చంద్రన్నబాట కింద సీసీరోడ్ల నిర్మాణానికి మూడేళ్ల కాలంలో రూ.125 కోట్ల మేర వ్యయం చేశారు. రూ.12 కోట్లతో చెన్నూరు సమీపంలో ముస్లిం సోదరుల కోసం హజ్‌హౌస్‌ నిర్మిస్తున్నారు. 
* ముద్దనూరు-జమ్మలమడుగు రహదారి విస్తరణ కోసం రూ.143.87 కోట్లు కేటాయించగా.. చిత్తూరు-కర్నూలు ప్రధాన రహదారిలో ఊటుకూరు వద్ద రైల్వేవంతెనకు రూ.82.73 కోట్లు కేటాయించారు. 
* 2014వ సంవత్సరం నుంచి 2017 వరకు ఉద్యానవనశాఖ ద్వారా ప్రవేశ పెట్టిన పథకాలు, కార్యక్రమాలకు రూ.66.80 కోట్లు వెచ్చించారు. దీని ద్వారా వేల సంఖ్యలో రైతులు శాఖ అమలు చేసే 22 పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందారు. 
* జిల్లాలో ఉన్న పశు, జీవాల సంరక్షణకు, రోగ నివారణకు, వైద్యం చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపిస్తోంది. 2014 నుంచి 2018 వరకు 1208 మెట్రిక్‌ టన్నుల పశుదాణాను 75 శాతం రాయితీతో రూ.5.11 కోట్లు వెచ్చించి అందజేసింది. 
* రాయచోటి నుంచి కడప వరకు రూ.340.40 కోట్లతో రహదారుల అభివృద్ధి కార్యక్రమం సాగుతోంది. 
* సూక్ష్మనీటిసాగు పథకం కింద నాలుగేళ్లలో జిల్లాకు రూ.550 కోట్ల మేర వెచ్చించగా.. గతేడాదిలోనే రూ.176 కోట్ల మేర వెచ్చించారు. 
* ఒక్కో ప్రాజెక్టుకు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలో మొత్తం 10 చోట్ల క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. 
* నీరు-చెట్టు పనుల కోసం జిల్లాలో రూ.773.44 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది.
 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...