Jump to content

American Consulate in AP


Recommended Posts

ఏపీలో కాన్సులేట్‌ పెట్టండి
08-06-2018 03:20:46
 
636640248550111471.jpg
  • యూఎస్‌ కాన్సూల్‌ జనరల్‌కు యనమల విజ్ఞప్తి
  • బెజవాడలో తొలిసారి అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం
  • పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల హాజరు
విజయవాడ, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌లో అమెరికా కాన్సులేట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అమెరికా కాన్సూల్‌ జనరల్‌(హైదరాబాద్‌) కేథరిన్‌ హడాకు విజ్ఞప్తి చేశారు. గురువారం విజయవాడలోని ఫార్చ్యూన్‌ మురళీ హోటల్‌లో అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేథరిన్‌ హడా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ‘హలీవుడ్‌ టు టాలీవుడ్‌’ అనే కాన్సె్‌ప్టతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో యనమల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిభావంతులైన యువతకు కొదవ లేదని, వీరిలో అధికశాతం మంది అమెరికా వెళ్తుంటారని అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీలో కాన్సులేట్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు. వీసా నిబంధనలు కూడా సరళతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్లకు యనమల స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
 
 
కేథరిన్‌ మాట్లాడుతూ.. ఇది 242వ స్వాతంత్య్ర దినోత్సవమన్నారు. హైదరాబాద్‌లో కాకుండా ఏపీలో వేరేచోట నిర్వహించడం ఇది రెండోసారి కాగా, విజయవాడలో నిర్వహించడం ఇదే తొలిసారి. ఏపీతో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని, ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్’లో అగ్రస్థానంలో ఉన్న ఏపీలో చాలా అమెరికా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కేథరిన్‌ చెప్పారు. అలాగే ఏపీకి చెందిన పలువురు అమెరికాలో ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆమె తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్‌ తమకు ఎంతో ముఖ్యమైన రాష్ట్రమన్న కేథరిన్‌... హైపర్‌లూప్‌ ఒప్పందాన్ని ప్రస్తావించారు. తన ప్రసంగంలో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి పేర్లను ఆమె ప్రస్తావించారు. కేథరిన్‌తోపాటు ఆమె భర్త మైకేల్‌ ఆండ్రూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీజీపీ మాలకొండయ్య, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, విజయవాడ పోలీసు కమిషనర్‌ గౌతం సవాంగ్‌, ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు, ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు పాల్గొన్నారు. వీరిలో చాలా మంది సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...