Jump to content

kuppam


Recommended Posts

  • 1 month later...
  • 1 month later...
కుప్పం ఎయిర్‌స్ట్రిప్‌కు భూమి సిద్ధం
500 ఎకరాల సేకరణ
త్వరలో పనులు
24ap-story4a.jpg

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఎయిర్‌స్ట్రిప్‌ నిర్మాణానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్‌ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇటీవల ఆమోదం తెలపగా జిల్లా అధికారులు 500 ఎకరాల భూమిని సిద్ధం చేశారు.
ఎయిర్‌స్ట్రిప్‌ను రైతులకు ఉపయోగపడేలా కార్గో విమానాశ్రయంలా వినియోగించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో కూరగాయలు, పండ్లు, పూలు వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటిని నిల్వ చేయలేకపోవడం.. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. దూర ప్రాంతాలకు ఎగుమతి చేసుకోలేకపోతున్నారు. ఎయిర్‌స్ట్రిప్‌ ద్వారా దేశం నలుమూలలకు, విదేశాలకు వీటిని తరలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఎగుమతుల ద్వారా మార్కెటింగ్‌ సౌకర్యాన్ని విస్తరించుకోవచ్చు. దీంతోపాటు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశముంది.

రెండు మండలాల నడుమ..
రామకుప్పం మండలం కిలాకిపోడు, కదసిన కుప్పం, మనేడ్రం.. శాంతిపురం మండలం అమ్మవారిపేట గ్రామాల మధ్య ఈ ఎయిర్‌స్ట్రిప్‌ నిర్మాణం కానుంది. ఇందుకు 500 ఎకరాల భూమిని సేకరించామని, త్వరలో రైతులకు పరిహారం పంపిణీ చేస్తామని జేసీ గిరీషా ‘ఈనాడు’తో చెప్పారు. భవిష్యత్తులో మరో 500 ఎకరాలను సేకరించనున్నామని ఆయన వివరించారు. మొత్తం భూసేకరణకు రూ.45- 50 కోట్ల వరకూ ఖర్చు కానుంది.

విమానాశ్రయం స్థాయిలోనే సేవలు
కుప్పంలో ఏర్పాటు కానున్న ఎయిర్‌స్ట్రిప్‌... సాధారణ విమానాశ్రయానికి ఏమాత్రం తీసిపోదు. అన్ని రకాల సౌకర్యాలుంటాయి. ఇక్కడికి వాణిజ్య స్థాయిలో విమానాలు తిరగవు. ప్రైవేటు, చార్టర్డ్‌, కార్గో విమానాలు రాకపోకలు సాగిస్తాయి. వి.కోట, చిత్తూరు మీదుగా ప్రయాణించే ‘బెంగళూరు- చెన్నై’ ఎక్స్‌ప్రెస్‌ వేకు 20-25కి.మీ.ల దూరంలో ఎయిర్‌స్ట్రిప్‌ ఉంటుంది. చెన్నై ఓడరేవు వంటి ప్రాంతాలకు అన్ని రకాల ఎగుమతి, దిగుమతులు చేసుకునేందుకు అనుసంధానత పెరుగుతుంది. వి.కోట, శాంతిపురం మండలాలు దీని ద్వారా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...