Jump to content

రంగంలోకి సీబీఐ!


Recommended Posts

రంగంలోకి సీబీఐ!
07-06-2018 01:53:15
 
  • ‘ఎయిర్‌ ఏషియా’పై కేసు, దర్యాప్తు
  • సీఈవోల మాటల్లో బాబు ప్రస్తావన
  • రాజకీయాలు చేస్తే కేంద్రం నిధులివ్వదు
  • అవినీతిపై ఫిర్యాదులొస్తున్నాయ్‌! : జీవీఎల్‌ హెచ్చరిక
అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి):ఎయిర్‌ ఏషియా సంస్థ మలేసియా, భారత్‌ సీఈవోల మధ్య జరిగిన సంభాషణలో చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చిందని.. దీనిపై సీబీఐ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మా ట్లాడారు. ‘‘ఎయిర్‌ ఏషియా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంకా వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది. దీనిపై సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగి తమ పని తాము చేస్తున్నాయి’’ అని తెలిపారు.
 
 
‘ఏపీ సీఎంతో మంచిగా మాట్లాడుకోండి. ఆయన పార్టీకి చెందిన వ్యక్తే విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అలా కలిసేందుకు అవకాశం ఉంది’ అని సీఈవోల మధ్య సంభాషణ జరిగిందంటూ ఒక ఆంగ్లపత్రికలో వచ్చిన కథనాన్ని చదివి వినిపించారు. హెచ్‌ఎన్‌ఆర్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి సింగపూర్‌ నుంచి ముడుపులు అందాయని, అవి ఎవరికి చేరాయో సీబీఐ, ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వస్తాయన్నారు.
 
 
రాజకీయాలతో నిధులు రావు
‘‘కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పరు. కనీసం కరువు ప్రాంతాల్లో ఎక్కడ పనులు చేశారో వివరించరు. నిధులు ఇస్తాం తీసుకోవాలని కోరితే ఎస్పీవీ పెట్టి తీసుకోరు. రాజకీయాలు మాత్రం చేస్తారు’’ అంటూ చంద్రబాబుపై జీవీఎల్‌ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వస్తున్నాయని టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజకీయాలు కాకుండా పాలనపై దృష్టి పెడితేనే కేంద్రం నుంచి నిధులు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హితవు పలికారు.
 
 
షేర్‌ మార్కెట్‌ వ్యాపారం చేసుకునే కుటుంబరావును ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారని, ఆయన్ను దుష్ప్రచార సంఘానికి అధ్యక్షుడిగా నియమిస్తే న్యాయం చేసేవారని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు. కుటుంబరావు వల్ల ఏపీలో సరిగా వ్యాపారం జరగడంలేదని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం, బీజేపీపై నిందలు వేస్తే ఎదురుదాడి చేసి ప్రజల ముందు నిజాలు పెట్టేందుకు తాము ఏ మాత్రం వెనుకాడబోమని హెచ్చరించారు.
 
 
 
 
Link to comment
Share on other sites

ఆ సంభాషణ’తో నాకు సంబంధమేంటి?: అశోక్‌
07-06-2018 01:41:11
 
636639324794325704.jpg
విజయనగరం, జూన్‌ 6: ‘ఎయిర్‌ ఏసియా కంపెనీలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణతో నాకేమిటి సంబంధం? దీనిపై నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన పనిలేదు’’ అని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు స్పష్టం చేశారు. దేశంలో విమానయాన రంగం అభివృద్ధే ధ్యేయంగా పనిచేశానని ఆయన గుర్తు చేశారు. విజయనగరంలో బుధవారం అశోక్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైసీపీతో బీజేపీ రాజీనామా డ్రామాలు అడిస్తోందని విమర్శించారు. పవన్‌కల్యాణ్‌ గురించి ప్రస్తావిస్తూ... ‘‘విజయనగరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడకు ఎవరైనా రావచ్చు. అతని సోదరుడు సీఎం అయిపోదామని పార్టీ పెట్టారు? ఏమైంది?’’ అని ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...