Jump to content

Vizag politics


Recommended Posts

  • Replies 83
  • Created
  • Last Reply
  • 2 weeks later...
విశాఖ ఉత్తర స్థానం టిక్కెట్‌పై వైసీపీ, టీడీపీలో చెలగాటం సాగుతోందా..?
16-06-2018 13:20:09
 
636647520218470180.jpg
విశాఖ ఉత్తరం.. ఇది రాజకీయ నాయకులను ఉరించి, ఉడికించే నియోజకవర్గంగా పరిణమించింది. ఈ నియోజకవర్గం టిక్కెట్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీలలో చెలగాటం సాగుతోంది. ఎవరికి అభ్యర్థిత్వం ఖరారవుతుందో అంచనాలకి అందటం లేదు. విశాఖ ఉత్తర స్థానం టిక్కెట్‌పై వైసీపీలో ఇంకా క్లారిటీ లేకపోయినా.. అధికారపక్షంలో మాత్రం మేమంటే మేమే అంటూ కొందరు నేతలు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో విశాఖ ఉత్తర రాజకీయాల్లో తాజా కోణాలేంటో ఈ కథనంలో చూద్దాం.
 
 
విశాఖ ఉత్తర నియోజకవర్గం. ఏపీ ప్రజలకి ఈ స్థానం సుపరిచితం. ఎందుకంటారా? ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఏపీ బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి! గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలు మిత్రపక్షాలుగా పోటీచేసిన సంగతి తెలిసిందే! ఈ తరుణంలో ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్ధిగా బీజేపీ పక్షాన విష్ణుకుమార్ రాజు పోటీచేశారు. జనసేన మద్దతు కూడా ఉండటంతో ఆయన సునాయాసంగా గెలుపొందారు. అప్పట్లో బీజేపీతో ఉన్న మైత్రీబంధం కారణంగా ఈ నియోజకవర్గానికి టీడీపీ పక్షాన కన్వీనర్‌ని కూడా నియమించలేదు. ఎన్నికల అనంతరం ఇక్కడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పక్షాన పోటీచేసిన చొక్కాల వెంకటరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొన్నాళ్లు వైసీపీ కూడా దిక్కులేని పరిస్థితి! ఈ తరుణంలో ఆ పార్టీ అప్రమత్తమై ముగ్గురు సమన్వయకర్తలను నియమించింది. ఫలితంగా ఆ ముగ్గురి మధ్య కుమ్ములాట కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇప్పుడు కొత్తగా మరో పేరు వినిపిస్తోంది. ఏంవీవీ బిల్డర్స్ అధినేత ఏంవీవీ సత్యనారాయణను విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దింపుతారంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్‌ ఇంకా నిర్ధారించలేదు.
 
 
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. స్థానికంగా ఉన్న నాయకులు కూడా అంతో ఇంతో బలమున్నవారే! బీజేపీతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న తర్వాత ఉత్తర నియోజవర్గానికి టీడీపీ అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. ప్రస్తుతం ఈ టిక్కెట్‌పై టీడీపీకి చెందిన నలుగురు నేతలు ఆశపెట్టుకున్నారు. ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షుడు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో రమేష్‌బాబు విశాఖ ఉత్తర స్థానం టిక్కెట్‌నే కావాలని అడిగారు. అయితే అధిష్టానం ఆయనకు నచ్చచెప్పి యలమంచిలి పంపించింది. ఇప్పుడు గతంలో మాదిరిగా రాజకీయ ఆబ్లిగేషన్లు లేవు కాబట్టి.. తనకే ఉత్తరం సీటు ఇవ్వాలని ఆయన ఇప్పటికే పార్టీ పెద్దల చెవిన ఒక మాట వేశారట.
 
మరోవైపు ఇదే స్థానం నుంచి మాజీ ఎంపీ సబ్బం హరి కూడా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు వినికిడి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వస్తానని ఇప్పటికే ఆయన ప్రకటించారు కూడా! అయితే ఏ పార్టీ నుంచి ఆయన పోటీచేస్తారు అనేది మాత్రం చెప్పలేదు. కానీ ఆయన టీడీపీలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. పనిలో పనిగా ఆయన విశాఖ ఉత్తరం టిక్కెట్‌నే కోరుతున్నట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
 
ఇదిలా ఉంటే, ఎప్పటినుంచో టీడీపీలో కొనసాగుతున్న స్వాతి ప్రమోటర్స్ అధినేత కృష్ణరెడ్డి కూడా విశాఖ ఉత్తరం సీటుపై కన్నేశారట. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్‌వర్క్ కూడా మొదలుపెట్టారు. అంతేకాదు- ఈ మధ్యనే రైల్వేజోన్ కోసం లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి ఉత్తర నియోజకవర్గం అంతా పాదయాత్ర చేశారు. ఇక మాజీ కార్పొరేటర్, సీనియర్‌ నేత పైలా ముత్యాలనాయుడు సైతం ఈ సీటుని టార్గెట్‌ చేసుకున్నారట. ఇటీవల జరిగిన ఉత్తర నియోజకవర్గ సమన్వయ కమిటీ భేటీలో ఆయన తన మనసులో మాట చెప్పారట. తనకు ఈ సీటు ఇచ్చే పక్షంలో ఎంత ఖర్చుచేయడానికైనా సిద్ధంగా ఉన్నానని అన్నారట. ఈ సీటు తనకే కావాలని గట్టిగా కోరారట కూడా! ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీలో గట్టి పోటీయే మొదలైంది.
 
 
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రధానంగా కాపు, వెలమ, రెడ్డి, రాజు సామాజికవర్గాలు బలంగా ఉన్నాయి. దీంతో అవసరమైన మద్దతు కూడగట్టడం కోసం ఇప్పటినుంచే ఎవరికి వారు ప్రయత్నాలు షురూ చేశారు. పైలా ముత్యాలనాయుడు అయ్యన్న వర్గీయుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఉత్తర టిక్కెట్‌ని ఆశిస్తున్నా అవకాశాలు అంతంత మాత్రమే అని విశ్లేషకులు అంటున్నారు. స్వాతి కృష్ణరెడ్డి గట్టిగా తలుచుకోవాలే గానీ.. ఆయనకు అవకాశం దక్కవచ్చు అని స్థానిక పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ మేరకు ఆయన పార్టీపరంగా మద్దతు కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ఇక సబ్బం హరి విషయానికి వస్తే.. టీడీపీలోకి ఆయన ఎంట్రీ ఇస్తేనే ఉత్తర నియోజకవర్గ టిక్కెట్‌ అడిగే అవకాశముంది.
 
 
ఈ ముగ్గురి సంగతిని అలా ఉంచితే, పంచకర్ల రమేష్‌బాబు కనుక విశాఖ ఉత్తరం టిక్కెట్‌ తనకే కావాలని పట్టుబడితే పార్టీ పెద్దలు ఆయనవైపే మొగ్గుచూపుతారన్న టాక్‌ వినిపిస్తోంది. అదే జరిగితే సబ్బం హరిని మాడుగుల నియోజకవర్గానికి పంపిస్తారంటూ పార్టీలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి తోడు స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ కూడా పంచకర్ల రమేష్‌బాబుకే మద్దతు పలుకుతారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పక్షాన విష్ణుకుమార్ రాజే పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ పక్షాన ఎవరిని అభ్యర్థిగా నిలిపినా... ఈ స్థానంలో గెలవాలంటే పంచకర్ల రమేష్‌బాబు ఒక్కరే సరైన అభ్యర్ధి అని పార్టీలో కొందరు ప్రముఖులు తలపోస్తున్నారట. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టతా ఇవ్వకపోవడంతో ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. చూద్దాం విశాఖ ఉత్తరాన రాజకీయం వచ్చే రోజుల్లో మరెంత రసవత్తరంగా మారుతుందో!
 
 
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
విశాఖ ఎంపీ అభ్యర్థిగా బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్?
01-07-2018 10:03:05
 
636660361835418684.jpg
  • ‘ముందస్తు’ ఊహాగానాల నేపథ్యంలో విశాఖ ఎంపీ అభ్యర్థుల కోసం వెదుకులాట
  • అన్ని పార్టీల్లోనూ అదే పరిస్థితి
  • మరోసారి పోటీకి హరిబాబు విముఖం?
  • పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తారంటున్న సన్నిహితులు
  • టీడీపీ నుంచి ప్రచారంలో ఎంవీవీఎస్‌ మూర్తి, ఆయన మనుమడు, మంత్రి గంటా, పల్లా శ్రీనివాస్‌ పేర్లు
  • వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి బంధువు లేదా ఎంవీవీ సత్యనారాయణ
(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)
లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రంలో అనేకమంది దృష్టి విశాఖపట్నంపై పడుతుంది. ఇది చాలా కీలకమైన నగరం. స్థానికేతరులు ఎక్కువగా ప్రాతినిథ్యం వహించిన స్థానం. గతంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, ఎన్‌టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి, దివంగత ముఖ్యమంత్రి వై.ఎ్‌స.రాజశేఖరరెడ్డి భార్య విజయలక్ష్మి తదితరులు విశాఖ నుంచి పోటీ చేశారు. మొదటి ఇద్దరూ విజయం సాధించగా, విజయలక్ష్మి ఓడిపోయారు. అంతకుముందు చూసుకుంటే...విజయనగరం రాజుల హవా నడిచింది. ఆనందగజపతిరాజు, ఆయన భార్య ఉమాగజపతిరాజు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. నెల్లూరు నుంచి వచ్చిన టి.సుబ్బిరామిరెడ్డి, కోస్తా నుంచి వచ్చిన ఎంవీవీఎస్‌ మూర్తిలు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లారు. ఇక ప్రస్తుత ఎంపీ కంభంపాటి హరిబాబు స్వస్థలం ప్రకాశం జిల్లా. చదువు, ఉద్యోగం కోసం చాలా ఏళ్ల క్రితమే విశాఖపట్నం వచ్చేశారు.
 
 
ఇప్పుడు ఎన్నికలు వస్తే...విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో దిగుతారనే దానిపై కొన్ని ఊహాగానాలు నడుస్తున్నాయి. గత ఎన్నికలను పరిశీలిస్తే ఎప్పుడూ ద్విముఖ పోటీయే కనిపిస్తుంది. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల మధ్యే ప్రధాన పోటీ నడిచింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2009 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ తరఫున విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు (ప్రస్తుతం గాజువాక ఎమ్మెల్యే) తెలుగుదేశం అభ్యర్థి ఎంవీవీఎస్‌ మూర్తి కంటే అధిక ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పురందేశ్వరికి గట్టి పోటీ ఇచ్చారు. తొలిసారి త్రిముఖ పోటీ జరిగింది. ఆ తరువాత వచ్చిన 2014 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ కనుమరుగైపోయింది. తెలుగుదేశం, బీజేపీలు మిత్రపక్షాలుగా హరిబాబును రంగంలో దించాయి. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ వెలవెలబోయింది. వైఎస్‌ఆర్‌ సీపీ ప్రధాన పోటీ పార్టీగా నిలిచింది. జగన్‌ తల్లి విజయలక్ష్మి పోటీ చేశారు. హరిబాబు విజయం సాధించారు.
 
ఇప్పుడు ఎన్నికలు వస్తే...తెలుగుదేశం, బీజేపీలు విడిపోయాయి కాబట్టి రెండు పార్టీలు వేర్వేరు అభ్యర్థులను బరిలో దించుతాయి. చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ పెట్టారు. అన్ని స్థానాలకు పోటీ చేస్తామని చెబుతున్నారు. ఆయన రాజకీయ ప్రచారం ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించారు. తాను గత ఎన్నికల్లోనే కోరుకుంటే విశాఖ నుంచో, అనకాపల్లి నుంచో ఎంపీగా పోటీ చేస్తే గెలిచేవాడినని చెబుతున్నారు. అంటే ఆయనకు ఈ జిల్లాల్లో ఎంపీ స్థానాలపై కన్ను పడిందనేది అర్థమవుతోంది. వైఎస్‌ఆర్‌ సీపీ వుండనే ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా కోలుకోలేనందున లోక్‌సభ స్థానానికి చతుర్ముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది.
 
 
సిట్టింగ్‌ ఎంపీ హరిబాబు బీజేపీ తరపున మళ్లీ బరిలో దిగుతారా? లేదా? అనేది అనుమానం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఆయనకు ఒక రకమైన ఏహ్యభావం ఏర్పడిందనేది బాగా దగ్గరగా పరిశీలిస్తున్నవారి మాట. రాజకీయాలు ఇలాగే వుంటాయని, పైచేయి కోసం, అధికారం కోసం రాజకీయ నాయకులు ఏమి మాట్లాడడానికైనా వెనుకాడరని ఆయనకు బాగా అనుభవంలోకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి పోటీ చేస్తారా? అంటే చేయకపోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిష్ఠానం ఆదేశిస్తే మాత్రం మాట జవదాటకుండా రంగంలోకి దిగుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఆయన కాకపోతే...చాలాకాలంగా విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఉత్సాహపడుతున్న సాగి కాశీ విశ్వనాథరాజుకు అవకాశం వస్తుందని చెబుతున్నారు.
 
తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే...గీతం అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి టిక్కెట్‌ ఆశిస్తున్నారు. పార్టీ అవకాశం ఇస్తే సరి...లేకపోతే తన వారసుడైన మనుమడు, సినీ హీరో బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్‌ను బరిలో దించాలని యోచిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని పార్టీ పెద్దలు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఓటమి ఎరుగని సీనియర్‌ నాయకుడు, విశాఖలో అందరికీ సుపరిచితుడు అయినందున గంటా అయితే బాగుంటుందనేది పార్టీ అభిప్రాయం. అయితే ఇటీవల భీమిలిలో ఆయనపై వ్యతిరేకత పెరిగిందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో మళ్లీ అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సత్తా ఏమిటో చాటుతానని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ అభ్యర్థిగా వెళ్లరని అర్థమవుతోంది. విశాఖ లోక్‌సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఎప్పుడూ బీసీలకు కేటాయించలేదు. ఒకవేళ కేటాయించాల్సి వస్తే యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును రంగంలో దించుతారని తెలుస్తోంది. ఆయన గతంలో ఒకసారి పీఆర్‌పీ అభ్యర్థిగా పోటీచేసిన అనుభవంతో పాటు ఎక్కువ ఓట్లు తెచ్చుకుని వుండడంతో బలమైన అభ్యర్థి అవుతారని అధిష్ఠానం యోచిస్తోంది. ప్రస్తుతానికి ఈ ముగ్గురి పేర్లు తెలుగుదేశం పార్టీ తరపున అందరి నోళ్లలో నానుతున్నాయి.
 
 
వైఎస్‌ఆర్‌సీపీ విషయానికి వస్తే..మొన్నటివరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమీప బంధువు నిత్యానందరెడ్డిని విశాఖ నుంచి బరిలో దింపుతారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ప్రముఖ బిల్డర్‌ ఎంవీవీ సత్యనారాయణ పేరు వినిపిస్తోంది. ఆయన ఎంపీగా పోటీ చేస్తానంటూ పార్టీలోకి వస్తే..ముందు చేరండి...తరువాత ఎక్కడ పోటీ చేయాలో చూద్దామని అధిష్ఠానం చెప్పినట్టు ప్రచారం జరిగింది. పార్టీలో చేరాక ఆయనకు విశాఖ ఉత్తరం చూసుకోవాలని చెప్పారు. నెల రోజులు తిరగకుండానే విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. పరోక్షంగా ఎంపీ అభ్యర్థి అని పార్టీ వర్గాలకు సమాచారం అందించారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయగా జగన్‌ సమాధానపరిచినట్టు సమాచారం.
 
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సమీకరణాలు అంటూ మార్చకపోతే బిల్డర్‌ ఎంవీవీ సత్యనారాయణే అభ్యర్థిగా బరిలో ఉంటారు. ఈయనకు ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీతోను సంబంధాలు లేవు. ఇటీవలె రాజకీయ అరంగేట్రం చేశారు. జనసేన పార్టీలో ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడిపుడే ఆ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు, మాజీలు వచ్చి చేరుతున్నారు. వామపక్షాలతో కలిసి నడుస్తామని ప్రకటించినందున, విశాఖపట్నం పారిశ్రామిక నగరమైనందున... వామపక్షాల వారికి పోటీ చేసే అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవలసింది లేదు. అయితే విశాఖపట్నం కీలకమైన స్థానం కాబట్టి అందరికీ తెలిసిన వ్యక్తినే బరిలో దించాల్సి వస్తుంది. అదే ఎవరనేది తేలడానికి చాలా సమయం వుంది. కాంగ్రెస్‌ పార్టీ ఇంకా కోలుకోలేదు.
Link to comment
Share on other sites

1 hour ago, sagarkurapati said:

Vallu mp candidates anta kadha

Ee post lo raasina 4 names ithe for MLA ee MAX.. andulo MP chance and experience undi sabbam hari okkarike .. panchakarla was always a MLA and will be .. 

Inka migata 2 freshers  . So MP ivvakapovachu ..  4 lo evaraina win jujubi bro..

Link to comment
Share on other sites

4 minutes ago, Munna_NTR said:

Ee post lo raasina 4 names ithe for MLA ee MAX.. andulo MP chance and experience undi sabbam hari okkarike .. panchakarla was always a MLA and will be .. 

Inka migata 2 freshers  . So MP ivvakapovachu ..  4 lo evaraina win jujubi bro..

Naa vote yevarki veyyali kanisam candidate evaro year mundhu ayna thelusthe bavunnu asala ekkada at present manakanna ysrcp ke yekkuva followers unnaru , visareddy malla vijay prasad , kannababu raju .

Tdp aythe only panchakarla ramesh untunnaru ee area lo staying.

Link to comment
Share on other sites

1 minute ago, sagarkurapati said:

Naa vote yevarki veyyali kanisam candidate evaro year mundhu ayna thelusthe bavunnu asala ekkada at present manakanna ysrcp ke yekkuva followers unnaru , visareddy malla vijay prasad , kannababu raju .

Tdp aythe only panchakarla ramesh untunnaru ee area lo staying.

Vijay Prasad ni pattinchukovakarledu lendi... 

Ah area lo staying ante Sabbam hari kooda untunaru ga akkade... ayanaki manchi following undi ga .. 

Link to comment
Share on other sites

జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో నేతలు
02-07-2018 14:12:53
 
636661375723910060.jpg
  • వైసీపీ ఉత్తరంలో ముసలం
  • కేకే రాజు నియామకంపై మాజీ సమన్వయకర్తల అసంతృప్తి
  • పార్టీ సభ్యత్వం లేని వ్యక్తి కింద పనిచేయలేమంటూ నిరసన
  • ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తే గుర్తించలేదని ఆవేదన
  • తగిన సమయంలో స్పందిస్తామని హెచ్చరిక
  • అసంతృప్తితోనే పరిచయ కార్యక్రమానికి డుమ్మా
  • నేతల తీరుతో నియోజకవర్గంలో దిగజారుతున్న పార్టీ పరిస్థితి
  • నిస్తేజంలో పార్టీ కార్యకర్తలు
ఉత్తర నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. నియోజకవర్గం సమన్వయకర్తగా కేకే రాజుని నియమించడం పట్ల నియోజకవర్గంలోని కీలక నేతలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఏళ్ల తరబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తమను తొలగించి పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తిని సమన్వయకర్తగా నియమించారంటూ రగిలిపోతున్నారు. సమన్వయకర్తగా నియమితులైన కేకే రాజుని పార్టీ నేతలు, కార్యకర్తలకు పరిచయం చేసేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నియోజకవర్గంలోని కీలక నేతలంతా డుమ్మా కొట్టడంతో పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. సమన్వయకర్త బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ నిలదీయడంతో, తప్పుని గుర్తించిన అధిష్టానం చంద్రమౌళితోపాటు పార్టీ సీనియర్‌ నేత సత్తి రామకృష్ణారెడ్డి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పుసుపులేటి ఉషాకిరణ్‌లను సమన్వయకర్తలుగా నియమించింది. అప్పటినుంచి ముగ్గురూ కలిసి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు. ముగ్గురూ బయటికి ఒకేతాటిపై వున్నట్టు కనిపించినా, అంతర్గతంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు తాపత్రయపడుతుండేవారు. దీనిపై కొద్దిరోజుల కిందట విభేదాలు తలెత్తడంతో పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ పంచాయతీ నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. ఇదిలావుండగా ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం వున్నందున ముగ్గురు సమన్వయకర్తలలో ఎవరికో ఒకరినే కొనసాగించి మిగిలినవారికి ప్రత్యమ్నాయ పదవులు కట్టబెడతారనే అభిప్రాయం నేతల్లో ఏర్పడింది. అయితే హఠాత్తుగా కేకే రాజుని పార్టీ సమన్వయకర్తగా నియమించి, అప్పటివరకూ సమన్వయకర్తలుగా వున్న ముగ్గురు నేతలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవులు కేటాయించినట్టు అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేయడంతో పార్టీ నేతలు అవాక్కయ్యారు.
 
మాజీ సమన్వయకర్తల నిరసన గళం
పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తిని సమన్వయకర్తగా నియమించడమే కాకుండా మాటమాత్రమైనా తమను సంప్రదించ లేదంటూ మాజీ సమన్వయకర్తలు చంద్రమౌళి, ఉషాకిరణ్‌, సత్తి రామకృష్ణారెడ్డి అధిష్ఠానం తీరుపై తమ అనుచరుల వద్ద నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం.
 
 
తమకంటే సీనియర్‌ లేదా ప్రజాభిమానం కలిగిన వ్యక్తిని నియమిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని, కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తి, ప్రజలకు అతని పేరు కూడా తెలియని కేకే రాజుని సమన్వయకర్తగా నియమించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. దీనివల్లే పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన కేకే రాజు పరిచయ కార్యక్రమానికి వారంతా డుమ్మా కొట్టారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆ కార్యక్రమానికి వారిని ఆహ్వానించేందుకు పార్టీ నేతలు ప్రయత్నించినా వారంతా మాట్లాడేందుకు నిరాకరించినట్టు సమాచారం. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తే తమకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ తమకు ఫోన్‌ చేసిన పార్టీలోని కీలక నేతని వారంతా నిలదీసినట్టు తెలిసింది. సమయం వచ్చినపుడు తామేంటన్నది చూపిస్తామని... అంతవరకూ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయబోమని హామీ ఇచ్చినట్టు సమాచారం.
 
 
నియోజకవర్గంలో దిగజారుతున్న పార్టీ పరిస్థితి
ఉత్తర నియోజకవర్గం నాయకత్వం విషయంలో పార్టీ అధిష్ఠానం మొదటి నుంచి అయోమయ ధోరణిలో వ్యవహరిస్తుండడంతో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందంటూ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థిని గుర్తించి అతనికే సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తే నియోజకవర్గంలోని సమస్యలపై అవగాహన ఏర్పడడంతోపాటు ప్రజలతో పరిచయాలు, అనుబంధం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. ఈ పరిణామం ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. కానీ పార్టీ అధిష్ఠానం ఎందుచేతనో ఆ విషయాన్ని విస్మరిస్తున్నదో తెలియడం లేదంటూ నిట్టూరుస్తున్నారు. పార్టీ ధోరణి కారణంగానే నియోజకవర్గంలో నేతల మధ్య అభిప్రాయబేధాలు, వర్గాలు తయారవుతున్నాయని ఇది పార్టీ పరిస్థితిని దిగజార్చుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు పార్టీ మరింత బలహీనపడిందని, ఇప్పటికైనా మేల్కోకపోతే పార్టీ పరిస్థితి నామమాత్రంగా మిగిలిపోయే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు.
Link to comment
Share on other sites

టీడీపీ నుంచి ఏడుగురు.. వైసీపీ నుంచి ఒక్కరు!
11-07-2018 11:15:42
 
636669045417235960.jpg
  • మాడుగుల నియోజకవర్గ టికెట్ కోసం నేతల పట్టు
  • తెలుగుదేశం పార్టీలో పెరుగుతున్న ఆశావహులు
  • ఇప్పటికే రంగంలో ఏడుగురు
  • టిక్కెట్‌పై ఎవరి ధీమా వారిదే!
 
మాడుగుల నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో బరిలో దిగేందుకు టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే ఏడుగురు ఎవరి ప్రయత్నాల్లో వారుండగా... తాజాగా మరిన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ఈ స్థానంలో త్రిముఖ పోటీ అనివార్యమనే సూచనలున్నా... టీడీపీలో గెలుపు ధీమా కనిపిస్తోంది. దీంతో ఈ సారి టిక్కెట్‌ దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
 
మాడుగుల: విశాఖ జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే మాడుగుల శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. ఇప్పటికే ఇక్కడ టిక్కెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య ఏడుగురికి చేరింది. కాగా వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. పార్టీ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడు మరోసారి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే స్థానం నుంచి ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాదరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
 
2009లో ప్రజారాజ్యం టిక్కెట్‌పై పోటీ చేసి ఓటమిపాలైన పైలా, తర్వాత తెలుగుదేశంలో చేరారు. 2014లో పోటీకి యత్నించినా అధిష్ఠానం గవిరెడ్డికి టిక్కెట్‌ ఇచ్చింది. ఈసారి ముందుగానే టిక్కెట్‌ సాధించాలన్న పట్టుదలతో నియోజకవర్గంలో కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌తో ఉన్న పరిచయాలు, రాష్ట్ర జన్మభూమి కమిటీ సమన్వయకర్తగా పనిచేస్తున్న పైలా పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. చీడికాడ మండలం తురువోలుకి చెందిన డాక్టర్‌ ముర్రు జయచంద్రనాయుడు తన ప్రయత్నాల్లో తానున్నారు. విజయనగరంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న ఈయన కొంతకాలంగా చంద్రబాబు సభలతో పాటు, మహానాడులో పాల్గొన్నారు. వైద్యులతో కలిసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
 
ఇక మాజీమంత్రి, గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రెడ్డి సత్యనారాయణ కూడా పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. గత పరిచయాల ఆధారంగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్‌ గూనూరు మల్లు నాయుడు కూడా పోటీలో ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లోనే టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు చేశారు. షుగర్స్‌ చైర్మన్‌గా ఉన్నకాలంలో పరిచయాలు, ఆ నియోజకవర్గంలో ఉన్న బంధుత్వాల కారణంగా గెలుపు ఖాయమన్న ధీమాతో ప్రయత్నాలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు. దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యురాలు గాలి వరలక్ష్మి, చీడికాడ జడ్పీటీసీ సభ్యురాలు పోలుపర్తి సత్యవతి భర్త పీవీజీ కుమార్‌ కూడా టిక్కెట్‌ రేసులో ఉన్నారు. కాగా తమకున్న పరిచయాలు, ఇతర అంశాల ఆధారంగా టిక్కెట్‌ తమకే వస్తుందనే ధీమాలో వీరంతా ఉన్నారు.
 
 
వైసీపీలో ఒకే ఒక్కడు?
ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీ విషయానికి వస్తే ప్రస్తుతానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పేరు మాత్రమే వినపడుతోంది. ఆ పార్టీ నుంచి ఇంతవరకూ మరెవరూ పోటీకి ఆసక్తి కనిపించకపోవడంతో ఈసారీ ముత్యాలనాయుడే బరిలో దిగుతారనే ప్రచా రం సాగుతోంది. అయితే మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత గవిరెడ్డి రామానాయుడు సోదరుడు గవిరెడ్డి సన్యాసినాయుడు వైసీపీ టిక్కెట్‌ ఆశిస్తున్నట్ట తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
 
కాంగ్రెస్‌ పార్టీ విషయంలో...
2009 ఎన్నికల్లో పోటీచేసిన అవుగడ్డ రామ్మూర్తినాయుడు కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నారు. 2014లో పోటీచేసిన కురచా నారాయణమూర్తి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం మాడుగుల కాంగ్రెస్‌ టిక్కెట్‌ జాబితాలో పీసీసీ అధికార ప్రతినిధి పి.సతీష్‌వర్మ, చీడికాడ మండలానికి చెందిన బొడ్డు శ్రీను, మాడుగులకు చెందిన సేనాపతి గంగాధర్‌ పేర్లు వినిపిస్తున్నాయి.
 
 
జనసేనాని ఎవరో?
నియోజకవర్గంలో ఈ మూడు పార్టీల నుంచి పోటీ ఉంటుందనే స్పష్టత వస్తున్నప్పటికీ జనసేన నుంచి ఎవరి పేరూ వినిపించడం లేదు. పార్టీపరంగా స్థానిక యువకులే కార్యక్రమాలు నిర్వహించడం మినహా, పెద్ద నేతలెవరూ జనసేనపరంగా ముందుకు అడుగు వేయలేదు. దీంతో మాడుగులలో జనసేనాని ఎవరనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
Link to comment
Share on other sites

దాడి వీరభద్రరావును పవన్‌ కలవడం వెనుక కారణం ఇదేనా?
11-07-2018 11:17:51
 
636669046708744997.jpg
దాడి వీరభద్రరావును పవన్‌ కలవడం వెనుక కారణమేంటి? కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న దాడి మనస్సులో ఏముంది? పవన్‌ ఆహ్వానానికి దాడి ఎందుకు పెద్దగా స్పందించలేదు? ఎందుకు సమయం అడిగారు? విశాఖలో సాగుతోన్న చర్చలపై ప్రత్యేక కథనాన్ని తెలుసుకోండి.
 
 
      దాడి వీరభద్రరావు పేరు ఉత్తరాంధ్ర ప్రజలకు సుపరిచితమే! ఎన్టీఆర్‌ తెలుగుదేశంపార్టీని స్థాపించిన సమయంలోనే అందులో చేరారు దాడి వీరభద్రరావు.. ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీగా.. మంత్రిగా పనిచేశారాయన! ఉత్తరాంధ్రలో ఎర్రన్నాయుడు తర్వాత దాడి పేరే వినిపించేది. టీడీపీలో ఆయన మాటకు చంద్రబాబు ఎంతో విలువ ఇచ్చేవారు. దాడి ఇప్పటికీ మాస్టర్‌గానే బాగా సుపరిచితం.. అయితే రాష్ట్ర విభజనకు ముందు ఎమ్మెల్సీ పదవిని తనకు కాదని.. తనతో కనీసం ప్రస్తావించకుండానే యనమల రామకృష్ణుడికి ఇచ్చారన్న కోపంతో పార్టీని వదిలిపెట్టారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు దాడి రత్నాకర్‌ కూడా బయటకు వచ్చేశారు. దాడి రత్నాకర్‌ అంటే చంద్రబాబుకు మంచి అభిప్రాయం ఉంది.. కాకపోతే దాడి వీరభద్రరావుతో పాటే రత్నాకర్‌ కూడా టీడీపీని వీడాల్సి వచ్చింది. ఆ సమయంలో దాడి వీరభద్రరావు కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అటు పిమ్మట ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. సీట్ల సర్దుబాటులో భాగంగా దాడి రత్నాకర్‌కు అనకాపల్లి నియోజకవర్గం కాకుండా విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని కేటాయించారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని కొణతాల రామృష్ణ సోదరుడికి కేటాయించారు జగన్‌.. ఆ ఎన్నికల్లో దాడి రత్నాకర్‌ ఓటమిపాలయ్యారు.. తర్వాతి కాలంలో జగన్‌ వ్యవహారశైలి నచ్చక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు కూడా గుడ్‌బై చెప్పారు తండ్రి కొడుకులు!
 
 
       ఇది జరిగి దాదాపు నాలుగేళ్లు అవుతుంది.. అప్పటి నుంచి దాడి ఫ్యామిలీ రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తోంది.. రెండు తరాలుగా రాజకీయాలలో ఉన్న దాడి కుటుంబం ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతోంది.. రాజకీయాలకు దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతోంది.. వ్యక్తిగతంగా దాడి వీరభద్రరావుకు అనకాపల్లిలో గట్టి పరపతే ఉంది. మళ్లీ టీడీపీలోకి వెళ్లాలన్న ఉద్దేశం ఆయనలో ఉందని అనుచరులు అంటున్నారు. కానీ పార్టీలోంచి బయటకు వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబును కలిసిన దాఖలాలు లేవు. టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు కూడా పంపారట! చంద్రబాబు పిలిస్తే పార్టీలోకి వెళ్లాలని ఆయన అనుకుంటున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఏదో కోపంలో అప్పుడు ఏదేదో అనేశానని.. అలా అనుకుండా ఉండాల్సిందని దాడి చెబుతున్నారట! చంద్రబాబు కూడా ఒక్కమాట కూడా తనతో చెప్పకుండా చేశారనే కోపం తప్పితే మరేం లేదని అంటున్నారట! తన కోపమే ఈరోజు తనను రాజకీయాలకు దూరం చేసిందని మధనపడుతున్నారట!
 
 
    అయితే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నేరుగా అనకాపల్లిలోని దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లడమే ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయ్యింది.. అది కూడా ఆయన పుట్టినరోజు నాడు కలవడం చర్చగా మారింది.. దాడి వీరభద్రరావుతో కలిసి లంచ్‌ చేసిన పవన్‌కల్యాణ్‌ ఆయనపై ప్రశంసలు కురిపించారు.. మీలాంటి వాళ్ల సలహాలు సూచనలు మాకెంతో అవసరమని ..మీరు మా వెంట ఉంటే బాగుంటుందని పవన్‌ కోరారట! దాడి మాత్రం త్వరలో తన నిర్ణయం చెబుతానంటూ అన్నారే తప్ప చేరికపై ఓ స్పష్టత ఇవ్వలేదు.. టీడీపీ నుంచి ఆహ్వానం అందుతుందేమోనన్న ఆశతో దాడి ఉన్నట్టు తెలుస్తోంది.. పార్టీని వదిలిపెట్టి వెళ్లినవారినెందరినో మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు.. అలాగే తనను కూడా పిలుస్తారన్న నమ్మకంతో దాడి వీరభద్రరావు ఉన్నారట!
 
 
     ఇప్పడు పవన్‌కల్యాణ్‌ ఆహ్వానంతో మళ్లీ డైలమాలో పడ్డారట! టీడీపీ నుంచి ఆహ్వానం అందుతుందో లేదో.. ఎప్పటి వరకు వేచిచూడాలో ఏమో..! అన్న మీమాంసలో పడిపోయారట! జనసేనలోకి వెళితే గెలుస్తామన్న గ్యారంటీ లేకపోయినా... ఖాళీగా ఉండటం కంటే ఏదో ఒక పార్టీలో చేరడమే బెటరనే నిర్ణయానికి వచ్చారట! ఇప్పటి వరకు జనసేనలో జనాలకు తెలిసిన ఉత్తరాంధ్ర నాయకులు పెద్దగా లేరు.. చేరితో పార్టీలో తనే పెద్ద దిక్కు అవుతానని అభిప్రాయపడుతున్నారట దాడి వీరభద్రరావు.. అయితే అనుచరులు.. సన్నిహితులు. అభిమానులతో చర్చించిన మీదటనే ఓ నిర్ణయం తీసుకుంటానని దాడి అంటున్నారట!
Link to comment
Share on other sites

సబ్బం హరి టీడీపీలో చేరితే...
11-07-2018 11:03:30
 
636669038100247382.jpg
  • విశాఖ ఉత్తర నియోజకవర్గంపై నేతల ఆసక్తి
  • టీడీపీ నుంచి పోటీకి పెరుగుతున్న ఆశావహులు
  • ఇప్పటికీ నియోజకవర్గ ఇన్‌చార్జిని నియమించని పార్టీ అధిష్ఠానం
  • అయినా పోటీకి పలువురు సై !
  • రేసులో పంచకర్ల, సబ్బం హరి, కృష్ణారెడ్డి?
ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం
విశాఖ జిల్లాలో ఉత్తర నియోజవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ ఆశిస్తున్న ఆశావహులు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీకి ఇప్పటికే పలువురు ఆసక్తి చూపుతుండగా ఎన్నికల సమయానికి ఆ జాబితా మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రమంతటా రానున్న సాధారణ ఎన్నికల్లో త్రిముఖ పోటీపై విశ్లేషణలు ఊపందుకుంటుండగా, విశాఖ ఉత్తరంలో ప్రస్తుతానికి వాతావరణం స్తబ్దుగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీకి ఇన్‌చార్జ్‌ లేకపోవడమేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ సీటును మిత్రబంధంలో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున విష్ణుకుమార్‌రాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత సుమారు నాలుగేళ్లపాటు మిత్రబంధం కొనసాగడంతో పార్టీ ఇక్కడ ఇన్‌చార్జ్‌ని నియమించలేదు.
 
 
నైరాశ్యంలో టీడీపీ శ్రేణులు
విశాఖ నగర పరిధిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఉత్తర నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు ఎక్కువే. 2009 ఎన్నికల ముందే ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జ్‌గా భరణికాన రామారావును నియమించారు. ఆ ఎన్నికల్లో రామారావు భార్య జయ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తైనాల విజయ్‌కుమార్‌ విజయం సాధించగా, డాక్టర్‌ షిరిన్‌ రెహ్మాన్‌ ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయ 18.92 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఆ తరువాత కొన్నేళ్లపాటు భరణికాన రామారావే ఇన్‌చార్జ్‌గా కొనసాగినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడంతో కేడర్‌ నైరాశ్యంలో కూరుకుపోయింది. 2014 ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించినప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీకి సీటు కేటాయించడంతో ఆయనా సైలెంట్‌ అయిపోయారు. అయితే ఆ తరువాత ఇన్‌చార్జిని నియమించకపోవడంతో పార్టీ తరఫున ఏ అవసరం వచ్చినా, సంక్షేమ పథకాల లబ్ధిని పొందేందుకు ఎవరిని సంప్రదించాలో తెలియక పార్టీని నమ్ముకుని ఉన్నవారంతా చెల్లాచెదురైపోయారు. వార్డుల్లో బీజేపీ నాయకులదే పైచేయి కావడంతో చేసేది లేక మిన్నకుండిపోయారు.
 
 
పోటీకి పలువురి ఆసక్తి..
ఉత్తర నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఇన్‌చార్జ్‌గా ఎవరినీ నియమించకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఇప్పటినుంచే పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఇదే నియోజకవర్గంలో నివసిస్తుండడంతో పోటీకి మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని అధినాయకత్వం దృష్టిలో ఉంచినట్టు వార్తలు వస్తున్నాయి.
 
మాజీ ఎంపీ సబ్బంహరి కూడా పోటీకి ఆసక్తి చూపిస్తే ఆయనకు ఉత్తర నియోజకవర్గం కేటాయించేందుకు టీడీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మార్గదర్శనంలో ముందుకు సాగుతున్న స్వాతి ప్రమోటర్స్‌ అధినేత మేడపాటి కృష్ణారెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఏదిఏమైనా విశాఖ ఉత్తరంలో పాగా వేసేందుకు బలమైన నేతను బరిలోకి దించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.
Link to comment
Share on other sites

టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరిని వెంటాడుతున్న సెంటిమెంట్ !
11-07-2018 11:26:46
 
636669052053857895.jpg
  • మూడుసార్లు గెలిచిన తమర్భ చిట్టినాయుడు
  • రెండుసార్లు ఎన్నికైన కొట్టగుళ్లి చిట్టి నాయుడు
  • ఆ తరువాత ఒక్కసారికే ఛాన్స్‌
పాడేరు... ఈ ఏజెన్సీ శాసనసభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి రెండోసారి పోటీకి దిగిన వారెవరూ గెలవరనేది నానుడి. కానీ గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఇద్దరు నాయుడులు ఆ నానుడిని తుడిచేశారు. తమర్భ చిట్టినాయుడు మూడుసార్లు శాసనసభకు ఎన్నికకాగా, కొట్టగుళ్లి చిట్టినాయుడు రెండుసార్లు విజయం సాధించారు. అయితే ఆ తరువాత మళ్లీ ఎవరికీ ఆ ఖ్యాతి దక్కలేదు. దీంతో పాడేరులో నాయుళ్లదే ప్రభ అని ముద్రపడింది.
 
 
పాడేరు(విశాఖ జిల్లా): జిల్లాలో పాడేరు శాసనసభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్థానం నుంచి పోటీ చేసిన వారెవరైనా ఒక్కసారికే పరిమితం. రెండో సారి గెలుపొందడం అసాధ్యమని నానుడి. అయితే దీనిని తిరగరాసి నాయుళ్లు తమ ప్రభ చాటుకున్నారు. దివంగత తమర్భ చిట్టినాయుడు ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు శాసనసభకు ఎన్నిక కాగా, దివంగత కొట్టగుళ్లి చిట్టినాయుడు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. అయితే వారిద్దరు మినహా ఇప్పటివరకు మరెవరూ రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన దాఖలాలు లేవు. దీంతో పాడేరు అసెంబ్లీ స్థానంలో ఇద్దరు చిట్టినాయుడుల పేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి నట్టయింది.
 
 
తొలి ఎమ్మెల్యే తమర్భ చిట్టినాయుడు
పాడేరు మండలం డోకులూరు గ్రామానికి చెందిన తమర్భ చిట్టినాయుడు పాడేరుకు తొలి ఎమ్మెల్యే. 1967లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తమర్భ చిట్టినాయుడు పోటీ చేశారు. అప్పట్లో మొత్తం 75,885 ఓట్లకు 9,728 ఓట్లు పోలవగా 8,916 ఓట్లు చెల్లుబాటయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి తమర్భ చిట్టినాయుడు 4,104 ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 1972, 1983లో జరిగిన ఎన్నికల్లోనూ తమర్భ చిట్టినాయుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా మన్యంలో ప్రత్యేకతచాటుకున్నారు.
 
 
కొట్టగుళ్లికి రెండుసార్లు అవకాశం
నియోజకవర్గంలో రెండుసార్లు విజయం సాధించిన ఘనత దివంగత నేత కొట్టగుళ్లి చిట్టినాయుడుకు దక్కింది. తెలుగుదేశం పార్టీ నుంచి కొట్టగుళ్లి 1985లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. అప్పట్లో నియోజకవర్గంలో మొత్తం 1,05,284 ఓట్లకు గానూ 35,376 ఓట్లు పోలవగా,33,768 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ఈ ఎన్నికల్లో కొట్టగుళ్లి చిట్టినాయుడు 11,342 ఓట్లు పొంది విజయం సాధించారు. ఆ తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లో కొట్టగుళ్లి చిట్టినాయుడు మళ్లీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మొత్తం 1,46,340 ఓట్లకు 80,003 ఓట్లు పోలవగా, 76,563 ఓట్లు చెల్లుబాటయ్యాయి. కొట్టగుళ్లి 27,923 సాధించి రెండోసారి విజయం సాధించారు. ఆ తర్వాత ఎవరూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన దాఖాలాలు లేవు.
Link to comment
Share on other sites

సమర్థించిన వారిపైనే కత్తులు దూసి అవాక్కయ్యేలా చేసిన పవన్ !
11-07-2018 10:35:47
 
636669021462204465.jpg
  • విశాఖ జిల్లాలో ముగిసిన జనసేన అధినేత మలి విడత పర్యటన
  • టార్గెట్‌ తెలుగుదేశమే
  • సీఎంతో పాటు లోకేశ్‌, మంత్రి గంటా, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి, పెందుర్తి ఎమ్మెల్యేపై పవన్‌కల్యాణ్‌ తీవ్ర విమర్శలు
  • ‘మోదీ’ మాటే లేదు
  • తుమ్మపాలపై ఆరు వారాల అల్టిమేటం
  • రైల్వేజోన్‌కు నలుగురు చాలంటూ డైలాగులు
  • ఉత్తరాంధ్ర మేధావులకు పెద్దపీట
  • ఇప్పటికైతే చింతలపూడి, బొలిశెట్టి, గుంటూరు నరసింహమూర్తిలే ప్రథమ శ్రేణి నేతలు
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)
విశాఖ జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పర్యటన నదీ ప్రవాహంలా ఉరకలెత్తింది. ఎక్కడికక్కడ యువతరం ఆదరణ లభించింది. స్థానికులకే పెద్దపీట వేస్తామని ఆయన చేసిన ప్రకటన అందరినీ ఆకట్టుకుంది. అభిమానులు, కార్యకర్తల ఉత్సాహం చూసిన ఆయన రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుచుకునే తొలి స్థానం పాయకరావుపేటే అంటూ ప్రకటించారు.
 
 
రుషికొండ రిసార్ట్‌లో బస చేస్తే నగరానికి దూరంగా ఉన్నారని, రోజుకు మూడు నాలుగు గంటలే పర్యటిస్తున్నారని, గుసగుసలాడిన వారికి ఆయన వివిధ వర్గాలతో మంతనాలు సాగిస్తున్నారని, పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. అయితే ఆ ప్రయత్నాలు పెద్దగా సఫలం కాలేదు. అయితే ఇప్పటివరకు అధికారికంగా పార్టీలో చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, కాంగ్రెస్‌ నాయకులు బొలిశెట్టిసత్య, గుంటూరు భారతిలకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. మిగిలిన వారంతా ఆశావహులే. ద్వితీయ శ్రేణి నాయకులని చెప్పదగినవారు కూడా కొద్దిమందే.
 
 
అనకాపల్లిలో మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నాయకులు దాడి వీరభద్రరావు ఇంటికి పవన్‌కల్యాణ్‌ స్వయంగా వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఆలోచించుకుని చెబుతానన్నారు. విశాఖ పశ్చిమం నుంచి డాక్టర్‌ సునీత, ఉత్తర నియోజకవర్గంలో గుంటూరు నరసింహమూర్తి దంపతులు, విశాఖ దక్షిణం నుంచి గంపల గిరిధర్‌, గాజువాకలో చింతలపూడి, పెందుర్తి నుంచి మండవ రవికుమార్‌, భీమిలి నుంచి అలీవర్‌ రాయ్‌ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. విశాఖ తూర్పులో ఇంకా ఎవరూ గంట కట్టుకోలేదు. విశాఖ ఎంపీ స్థానం వరకు చూసుకుంటే బొలిశెట్టి సత్య ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో చోడవరంలో పీఎస్‌ఎన్‌ రాజు ముందు వరుసలో ఉన్నారు. ఈ టీమ్‌తో ఆయన ఎంతవరకు ముందుకు వెళతారనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే తొలి విడత పర్యటనే కావడం, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధి వున్నందున మరింత బలపడతామని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ తొలి కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయగా, ఆ తరువాత కార్యాలయం విశాఖలోనే ప్రారంభించారు. ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలకు సంబంధించి కోర్‌ కమిటీ సమావేశాలు అక్కడే నిర్వహిస్తామని వెల్లడించారు.
 
 
సమర్థించిన వారిపైనే కత్తులు
పవన్‌కల్యాణ్‌ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కానీ, ఆ తరువాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినప్పుడు కానీ తన అన్నయ్య చిరంజీవికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలిలో, అవంతి శ్రీనివాసరావుకు అనకాపల్లిలో విస్తృత ప్రచారం చేశారు. విచిత్రంగా ఆయన విశాఖ పర్యటనలో ఆ ఇద్దరిపైనా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావుకు విశాఖ రైల్వేజోన్‌ అంటే ఎగతాళిగా ఉందని, జోను లేదు...గీను లేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఆరోపించారు. ఇక మంత్రి గంటా శ్రీనివాసరావుపైన అయితే ఆర్థిక ఆరోపణలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో మత్స్యకారులకు పాడైపోయిన బోట్లు ఉంటే గంటాకు మాత్రం ఖరీదైన బోట్లు ఉన్నాయని విమర్శలు గుప్పించారు. విశాఖలో రూ.కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగితే దానిపై సిట్‌ ఇచ్చిన నివేదిక బయటపెట్టడం లేదని, అందులో జిల్లా నేతలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వాటా ఉందని ఆరోపించారు. రాజకీయాల్లో దశాబ్ద కాలంగా సన్నిహితంగా ఉంటున్న వారిపైనే ఆయన విమర్శలు గుప్పించి తనకు తర తమ భేదం లేదని నిరూపించారు.
 
 
పెందుర్తి ఎమ్మెల్యే బండారుపై విమర్శలు
పెందుర్తి నియోజకవర్గంలోని ముదపాకలో పర్యటించినప్పుడు ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట జరుగుతున్న బాగోతం వెనుక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడి హస్తం ఉందంటూ నిప్పులు చెరిగారు. తీవ్రస్థాయిలో వారి తీరును ఎండగట్టారు. ఎమ్మెల్యేలు, వారి కొడుకులు అయినా సరే తప్పు చేస్తే చొక్కా పట్టుకొని ప్రశ్నిస్తామని, చట్టానికి అంతా లోబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు.
 
 
ఉత్తరాంధ్ర మేధావులకు పెద్దపీట
జిల్లాలో మలి విడత పర్యటనలో పవన్‌కల్యాణ్‌ ఉత్తరాంధ్ర మేధావులకు పెద్దపీట వేశారు. తొలిరోజే మూడు జిల్లాలకు చెందిన మేధావులతో సమావేశమయ్యారు. దశాబ్దాలుగా జరుగుతున్న దోపిడీ గురించి, జల వనరులు, భూగర్భ ఖనిజాలు, బాక్సైట్‌, మూతపడుతున్న షుగర్‌, జ్యూట్‌ పరిశ్రమలపై వారు వివరించగా జనసేనాని ఆసక్తిగా విన్నారు.
 
 
తుమ్మపాలపై అల్టిమేటం
పవన్‌కల్యాణ్‌ తన పర్యటనలో భాగంగా మూతపడిన పరిశ్రమలను సందర్శించారు. అనకాపల్లి సమీపానున్న తుమ్మపాలను సందర్శించి రూ.30 కోట్లు కేటాయించి ఆ ఫ్యాక్టరీని తె రిపించలేరా? అంటూ ప్రశ్నించారు. ఆరు వారాల్లోగా ఆ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. తగరపువలసలో తొమ్మిదేళ్ల క్రితం మూతపడిన జూట్‌ ఫ్యాక్టరీని, రుషికొండలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు కేటాయించిన స్థలాన్ని, విశాఖలో విమ్స్‌ ఆస్పత్రిని, ముడసర్లోవ రిజర్వాయర్‌ను పరిశీలించారు. వన్‌టౌన్‌ కోటవీధిలో పర్యటించి పోర్టు కాలుష్యాన్ని తెలుసుకున్నారు.
 
ఉత్తరాంధ్రలో అన్ని ప్రమాదకరమైన పరిశ్రమలు పెడుతున్నారని, వీటి వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల 23 రకాల చేపజాతులు అంతరించిపోయాయని వెల్లడించారు. విశాఖ ఏజెన్సీలో అరకులోయ మండలంలో గిరిజన గ్రామాలను కాలినడకన సందర్శించారు. ఓ గ్రామంలో బురదనీటినే తాగడాన్ని చూసి ఆవేదన చెందారు. పిల్లలకు చర్మవ్యాధులపై మధనపడ్డారు. ప్రజల నుంచి భూములు తీసుకుని సరైన పరిహారం ఇవ్వడం లేదని గాజువాకలో పర్యటించినపుడు ప్రశ్నించారు. విశాఖలో భూ దోపిడీ లేకుండా చేస్తామని చెప్పిన తెలుగుదేశం అదే పని చేస్తోందని దుయ్యబట్టారు.
 
 
రైల్వేజోన్‌పై సెటైర్‌
విశాఖ రైల్వేజోన్‌ సాధనకు అంత మంది అవసరం లేదని కేవలం నలుగురు చాలని ప్రకటించారు. తనతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, జగన్‌ కలిసి వస్తే విశాఖలో రైళ్లను ఆపేసి కేంద్రం దిగి వచ్చేలా చేస్తామన్నారు.
 
 
బీజేపీ పేరు ప్రస్తావించని పవన్‌
ఈ పర్యటనలో ఆయన ఎక్కడా కేంద్రాన్ని కాని, ప్రధాని నరేంద్ర మోదీని కానీ, బీజేపీని గురించి పెద్దగా ప్రస్తావించలేదు. వారు చేసిన మోసాన్ని విమర్శించలేదు. మోదీ అంటే తననకేమీ భయం లేదని మాత్రమే అన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌పైనే విమర్శనాస్ర్తాలు సంధించారు.
Link to comment
Share on other sites

ఉద్దండులు ఎటువైపు? జగన్ స్వయంగా పిలిస్తే వెళ్తానంటున్నదెవరు?
12-07-2018 11:41:05
 
636669924649554653.jpg
  • ‘దాడి’కి జనసేనాని ఆహ్వానం
  • ఆలోచించి చెబుతానన్న వీరభద్రరావు
  • ‘కొణతాల’తో వైసీపీ సంప్రదింపులు
అనకాపల్లి(విశాఖ జిల్లా): జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా పేరొందిన మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులు ఏ పార్టీలో చేరతారనే చర్చ సర్వత్రా సాగుతోంది. వీరిరువురూ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే మంచి గుర్తింపుపొందిన నాయకులు. అనకాపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఫలితాన్ని శాసించగల సత్తా వున్నవారు కావడంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు?...అనే విషయమై ఎక్కడచూసినా చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన ఎన్‌టి రామారావుకు వీరాభిమాని. ఆయన 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ 1983 ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నాలు చేయలేదు. అయితే అప్పటి రాజకీయ పరిణామాల్లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన రాజా కన్నబాబు నాదెండ్ల వర్గంలో చేరడంతో పార్టీకి దూరమయ్యారు. అనంతరం 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాడి వీరభద్రరావు టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆయన వరుసగా నాలుగు పర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది, రెండు పర్యాయాలు మంత్రి పదవులు కూడా నిర్వహించారు.
 
2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొణతాల రామకృష్ణపై పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కలేదు. ఆ తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాడి వీరభద్రరావు పోటీ చేసినప్పటికీ ఓటమి చెందారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆ తరువాత కాలంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్‌ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో విభేదించి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తటస్థంగా ఉన్నారు.
 
ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్వయంగా దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని దాడి వీరభద్రరావు ప్రకటించారు. ఆయన జనసేనలో చేరతారా?, అవకాశం వస్తే టీడీపీలో చేరతారా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనున్నది.
 
ఇక మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తండ్రి కొణతాల సుబ్రహ్మణ్యం బెల్లం వ్యాపారి. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్‌ అభిమాని. తండ్రి అడుగుజాడల్లో సుబ్రహ్మణ్యం రెండో తనయుడైన రామకృష్ణ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 1989లో అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పెతకంశెట్టి అప్పలనరసింహంపై గెలుపొందారు. మళ్లీ 1991లో కూడా లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా రామకృష్ణ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి అప్పలనరసింహంపై గెలుపొందారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు. 1996తో పదవీ కాలం పూర్తయిన తరువాత మళ్లీ 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దాడి వీరభద్రరావుపై గెలుపొందారు. ఆ సమయంలో ఒకేసారి మూడు కేబినెట్‌ మంత్రి పదవులు నిర్వహించారు. అనంతరం 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు.
 
వైఎస్‌ మరణానంతరం ఆయన జగన్‌ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో ఆయన తమ్ముడు రఘునాథ్‌ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలలో వైసీపీ నుంచి బహిష్కరించబడిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఏ పార్టీలోనూ చేరకుండా ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఏర్పాటుచేసి సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. ఒకానొక దశలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో ఆగిపోయారు. ప్రస్తుతం ఆయన్ను మళ్లీ వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అయితే జగన్‌ నుంచి స్వయంగా పిలుపు వస్తే పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
Link to comment
Share on other sites

ఏపీలోని ఆ నియోకవర్గంలో ఒకసారి ఓడితే ఇక అంతే సంగతులు!
13-07-2018 14:02:12
 
636670873320524719.jpg
  • ‘పేట’ ఓటర్ల విలక్షణ తీర్పు
నక్కపల్లి/విశాఖపట్నం: ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనైనా సరే ఒకసారి ఓటమి పాలైన వారు ఆ తరువాత గెలిచిన సందర్భాలున్నాయి. కానీ జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన పాయకరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఒకసారి ఓటమి పాలైన వారు మళ్లీ ఇదే నియోజకవర్గంలో గెలిచిన సందర్భాలు ఇప్పటి వరకూ లేవనే చెప్పాలి. దాదాపు 50 ఏళ్ల నుంచీ ఇదే సెంటిమెంట్‌ కొనసాగుతూ వస్తోంది. 1967లో అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి గంట్లాన సూర్యనారాయణపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బి.నాగభూషణం కేవలం 1,639 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మళ్లీ 1972లో గంట్లానపై రెండోసారి పోటీ చేశారు. అప్పుడు 18,252 ఓట్ల తేడాతో ఓటమి పాలై డిపాజిట్‌ కోల్పోవాల్సి వచ్చింది. 1983లో టీడీపీ అభ్యర్థినిగా గంటెల సుమన, కాంగ్రెస్‌ అభ్యర్థి నెలపర్తి రామారావుపై 23,778 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత 1989, 1994, 1999, 2004, 2012లో ఇదే నియోజకవర్గం నుంచి గంటెల సుమన పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.
 
 
ఇక స్థానికుడైన కాకర నూకరాజు 1985, 1989, 1994లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ విజయం సాధించారు. ఇప్పటికీ ఆయన హ్యాట్రిక్‌ రికార్డును గానీ, మెజార్టీని గానీ ఎవరూ అధిగమించకపోవడం విశేషం. 1985లో కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షకుమార్‌పై కాకర 29,768 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటివరకూ నియోజకవర్గంలో ఇదే అత్యధిక మెజార్టీ. ఆ తరువాత 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున కాకరబరిలో నిలిచినప్పటికీ విజయం సాధించలేకపోయారు.
 
 
1999, 2004లో రెండుసార్లు టీడీపీ నుంచి చెంగల వెంకట్రావ్‌ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2009, 2014 సార్వత్రిక ఎన్నికలు, 2012 ఉపఎన్నికల్లో చెంగల పోటీ ఓటమిపాలయ్యారు. ముచ్చటగా మూడోసారి గెలిచి కాకర రికార్డును బ్రేక్‌ చేద్దామనుకున్న చెంగల సాధించలేకపోయారు. 2009 సార్వత్రిక ఎన్నికలు, 2012 ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌, వైసీపీ తరఫున గొల్ల బాబూరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2014లో ఆయన పాయకరావుపేట నుంచి కాకుండా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
 
ఈయన పాయకరావుపేట నుంచి పోటీ చేసి ఒక్కసారి కూడా ఓడిపోలేదని, ఈ సెంటిమెంట్‌ ఆయనకు వర్తించదని ఆయన అభిమానులు అంటున్నారు. 1985లో టీడీపీ అభ్యర్థి కాకర నూకరాజు చేతిలో ఓడిపోయిన అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి జీవీ హర్షకుమార్‌ అమలాపురం ఎంపీగా గెలుపొందారు. దీన్నిబట్టి పాయకరావుపేట నియోజకవర్గంలో ఒకసారి ఓటమి పాలైన వారు ఇప్పటి వరకూ రెండోసారి గెలవలేదని చరిత్ర చెబుతోంది. మరి రానున్న ఎన్నికల్లో ఈ సెంటిమెంట్‌ బ్రేక్‌ అవుతుందా ? లేక కొనసాగుతుందా? అనేది చూడాల్సిందే.
Link to comment
Share on other sites

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం
15-07-2018 13:54:44
 
636672596818472982.jpg
విశాఖపట్టణం: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రాజకీయాలు జోరందుకుంటున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. నిన్న మొన్నటి వరకు మిన్నకున్న రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ బలాన్ని, బలగాన్ని పెంచుకునే పనిలో నిమగ్నమయ్యాయి. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ కమిటీలను నియమిస్తున్నాయి. కమిటీల్లో కుల ప్రాతిపదికన పదవులను కట్టపెడుతున్నాయి. అంతేకాక ఒటర్లును తమవైపు తిప్పుకునేందుకు ఇప్పటి నుంచే విశ్వ ప్రయత్నాలు ప్రారంభించాయి.
 
 
దక్షిణ నియోజకవర్గంలో రెండు లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల నాటికి 1,97,423 మంది ఒటర్లు ఉండగా, కొత్త ఓటర్లు నమోదు నేపథ్యంలో 2018 ఎన్నికల నాటికి 2.2 లక్షలకు పైగా ఉంటారని అంచనా. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు మత్స్యకారులు, ముస్లింలు, ఎస్సీ వర్గాలకు చెందినవారే. వారితో పాటు క్రిష్టియన్‌, వైశ్యులు, రెడ్డిలు, విశ్వ బ్రాహ్మణ, శెట్టిబలజ, మార్వాడీ, కాపు తదితర సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సర్వమతాల వారు ఇక్కడ కలిసికట్టుగా జీవనం సాగిస్తున్నారు. కులమతాలకు అతీతంగానే ఇక్కడ ఓటర్ల తీర్పూ ఉంటుంది.
 
 
చతుర్ముఖ పోటీ?
దక్షిణ నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్మఖ పోటీ జరిగేలా కనిపిస్తుంది. తెలుగుదేశం, వైకాపా, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పోటీ ఉంటుంది. కాగా చాపకిందనీరులా కాంగ్రెస్‌ ఇక్కడ రోజురోజుకు బలపడుతుందని చెప్పవచ్చు. అందువల్ల చతుర్ముఖ పోటీ గట్టిగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా పార్టీపై, ఎమ్మెల్యేపై పార్టీలోని ఒక వర్గం అసంతృప్తిగా ఉంది. పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా ఇక్కడ టీడీపీ బలంగా ఉంది.
 
టీడీపీ హయాంలో మత్స్యకారులకు అన్నివిధాల లబ్ధి కల్పించారు. నియోజకవర్గంలో అధిక సామాజిక వర్గం ఉన్న మత్స్యకారుల ఓటు బ్యాంకు అధిక శాతం టీడీపీ వైపు ఉండడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ అవి తమకు పూర్తిస్థాయిలో అందడం లేదని పలువురు ముస్లింటు టీడీపీ పట్ల గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మిగతా సామాజికవర్గ ఓటర్ల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
 
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు వార్డు స్థాయిలో బలహీనంగా ఉన్న వీసీపీపై రాష్ట్ర స్థాయి నేతలు దృష్టిసారించారు. ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి నియోజకవర్గంలో పార్టీ కేడర్‌ను బలోపేతం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అయితే పార్టీలో వార్డు స్థాయిలో చురుకైనా నాయకులు లేకపోవడం, నాయకుల్లో వర్గ పోరు పార్టీకి మింగుడపడడం లేదు.
 
 
కాగా జనసేన పార్టీ ప్రభావం నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ పవన్‌కల్యాణ్‌ అభిమానులు అధికంగా ఉన్నారు. అంతేకాక కాపు సామాజికవర్గ నాయకులు కొంతమంది జనసేనలో చేరాలని ఇప్పటికే మూడు పర్యాయాలు సమావేశమయ్యారు. అయితే పార్టీని దిగువ స్థాయి నుంచి కమిటీలు వేసి బలోపేతం చేయాల్సి ఉంది. పవన్‌కు రాజకీయ అనుభవం లేదని, అభ్యర్థిని బట్టి పార్టీ ప్రభావం నియోజకవర్గంలో ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విభజన తర్వాత ప్రజల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్‌ ఈ పర్యాయమూ అసెంబ్లీ బరిలోకి దిగనున్నది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వార్డుల్లో పర్యటిస్తున్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ గెలిపించాలన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.
 
 
అభివృద్ధికే ఓటరు పట్టం
ఇప్పటివరకు ఇక్కడి ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతూ వచ్చారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభివృద్ధిలో, ఇచ్చిన మాటల్లో, చేసే పనుల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఆ తర్వాత జరిగే ఎన్నికలో ఆ పార్టీని, అభ్యర్థిని ఓడిస్తారు. నియోజకవర్గ చరిత్రలో ద్రోణంరాజు శ్రీనివాసరావు మినహా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన వారు లేకపోవడానికి ఓటర్ల తీర్పే కారణమని చెప్పవచ్చు.
Link to comment
Share on other sites

ఎమ్మెల్యే అనిత నియోజకవర్గంలో టీడీపీ ఎన్నిసార్లు గెలిచిందో తెలిస్తే...
15-07-2018 13:32:59
 
636672583766027935.jpg
నక్కపల్లి(విశాఖ జిల్లా): తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కేవలం ఐదేళ్ల కాలం మినహాయిస్తే రెండున్నర దశాబ్దాల పాటు టీడీపీకే పాయకరావుపేట నియోజకవర్గ ఓటర్లు పట్టం కట్టారు. ప్రత్యర్థులు టీడీపీని ఈ నియోజకవర్గంలో ఓడించేందుకు వేసిన ఎత్తులను ఓటర్లు చిత్తు చేస్తున్నారు. 1983, 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని ఆధిక్యంతో గెలుపొందింది.
 
 
1989లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ... పాయకరావుపేటలో మాత్రం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాకర నూకరాజే విజయం సాధించారు. అలాగే 2004లో రాష్ట్రంలో వైఎస్‌ ప్రభుత్వం (కాంగ్రెస్‌) ఏర్పాటైనప్పటికీ ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావును ఓటర్లు గెలిపించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీ విజయానికి, సైకిల్‌ జోరుకు బ్రేక్‌ వేయాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం దివంగత వైఎస్‌ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. జిల్లా, రాష్ట్రంలోని ముఖ్యనేతలను రంగంలోకి దించారు. అప్పటివరకూ ఉన్నతాధికారిగా పనిచేస్తున్న గొల్ల బాబూరావును కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఇక్కడ నిలిపారు. దీంతో 2009లో కాంగ్రెస్‌ చేతిలో తొలిసారిగా టీడీపీ ఓటమిపాలైంది.
 
 
దీంతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలన్న చెంగల ఆశలు అడియాశలయ్యాయి. ఆ తర్వాత వైఎస్‌ మరణం, జగన్‌ వైసీపీ ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన బాబూరావు వైఎస్‌ కుటుంబంపై వున్న గౌరవంతో తృణపాయంగా ఎమ్మెల్యే పదవిని త్యజించారు. దీంతో 2012లో ఉప ఎన్నికలోనూ టీడీపీ ఓడిపోగా... వైసీపీ తరపున పోటీ చేసిన గొల్లబాబూరావు గెలుపొందారు. అయితే 2014లో టీడీపీ ఈ స్థానాన్ని దక్కించుకోవడంలో సఫలీకృతమైంది. ఈ నియోజకవర్గం ఓటర్లు ఏడోసారి టీడీపీని గెలిపించి... సైకిల్‌ జోరుకు పాయకరావుపేట కేరాఫ్‌ అడ్ర్‌సగా నిరూపించారు.
 
 
అభ్యర్థి కంటే గుర్తు కీలకం
పాయకరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి కంటే సైకిల్‌ గుర్తే కీలకమని చెప్పాలి. ఎందుకంటే పలుమార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారికి రెండోసారి టిక్కెట్‌ ఇవ్వొద్దని నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసేవారు. అయినప్పటికీ అధిష్ఠానం పార్టీ నాయకులు వద్దన్న వారికి టిక్కెట్లు ఇచ్చినా, ఓటర్లు మాత్రం సైకిల్‌ గుర్తునే ఆదరించేవారు. ఈ కారణంగానే రెండోసారి, మూడోసారి కాకర నూకరాజు ఎమ్మెల్యేగా గెలుపొందగా, చెంగల వెంకట్రావ్‌ కూడా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అభ్యర్థులకు ఇక్కడ టీడీపీ అభిమానులు, ఓటర్లు ప్రాధాన్యమివ్వరు. బ్యాలెట్‌ పేపరుపై సైకిల్‌ ముద్ర ఉందా? లేదా? అన్నదే చూస్తారు. అందుకే దశాబ్దాల కాలంగా పాయకరావుపేట టీడీపీకి చెక్కుచెదరని కోటగా ఉందని చెప్పవచ్చు.
Link to comment
Share on other sites

వైసీపీకి గబ్బర్‌సింగ్ భయం..మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా..?
16-07-2018 10:26:53
 
636673336134092200.jpg
విశాఖ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు గబ్బర్‌సింగ్‌ భయం పట్టుకుంది. తమకు పవన్‌కల్యాణ్‌ చెక్‌ పెట్టేలా ఉన్నారని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల విశాఖలో పవన్ పర్యటనలోనూ... సాగరతీరంలో జరిగిన కవాతులోనూ యువత చెప్పుకోతగ్గ స్థాయిలో హాజరుకావడాన్ని వైకాపా జీర్ణించుకోలేకపోతోంది. అసలు వైకాపా భయానికి కారణమేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
      వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ఊహాల్లో తేలియాడారు విశాఖపట్నం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు! జగన్‌ పాదయాత్రతో మొత్తం విశాఖ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వశమవుతుందని తీపి కలలు కన్నారు. ఇప్పుడేమో తమ సుందర స్వప్నాలకు గబ్బర్‌సింగ్‌ బ్రేక్‌ వేస్తారేమోనని భయపడుతున్నారు. అసలు విషయానికి వస్తే.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తొలి మలి విడత పర్యటనలు ఉత్తరాంధ్రలో ముగిశాయి. పవన్‌ పర్యటించిన కొన్ని చోట్ల ప్రజలు పలుచగా కనిపించినా మరికొన్ని చోట్ల ఫర్వాలేదనిపించారు. ఇక సాగరతీరంలో జనసేనాధిపతి కవాతుకు యువత నుంచి మంచి స్పందన వచ్చిందని.. అది తమ కొంప ముంచుతుందేమోనని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు.. ఆ భయమే వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.. ఆర్కే బీచ్‌లో నిర్వహించిన కవాతుకు ఓ స్థాయిలో జనం వచ్చారంటే అది కేవలం పవన్‌ మీద ఉన్న ప్రేమాభిమానాలే! ఇదే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలకు మింగుడుపడటం లేదు..
 
     ఎందుకంటే గత ఎన్నికలలో టీడీపీ....బీజేపీతో జత కట్టిన జనసేన ఇప్పుడు కమ్యూనిస్టులు.. ఇతర పక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలని భావిస్తోంది. 2014 ఎన్నికలలో తాము అధికారంలోకి రాకపోవడానికి పవన్‌కల్యాణే కారణమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికీ అనుకుంటున్నారు.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. తమకు ఉన్న సహజసిద్ధమైన ఓటు బ్యాంకుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకే వస్తాయని గంపెడాశాలు పెట్టుకుంది వైకాపా.. అయితే తమ ఆశలపై పవన్‌ నీళ్లు చల్లేట్టుగా ఉన్నారని భయపడుతున్నారు.
 
        ప్రభుత్వ వ్యతిరేక ఓటును జనసేన ఎంత చీలిస్తే టీడీపీకి అంత లాభమని వైకాపా భావిస్తోంది..విశాఖలో కొన్ని చోట్ల పవన్‌ పర్యటనకు చెప్పుకోదగ్గ స్థాయిలో జనం రావడంతో వైకాపా నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.. అంతేకాదు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోనూ కొందరు పవన్‌ వీరాభిమానులు ఉన్నారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేని చోట తాము పవన్‌కు మద్దతు ఇస్తామని చెబుతున్నారట! ఇలా ఏ కోణంలో చూసినా వైకాపా ఓట్లకు గండి గొట్టడానికి గబ్బర్‌సింగ్‌ రెడీ అయిపోయారని.. ఇది తమ కొంప ముంచుతుందని వైకాపా వర్గాలు అనుకుంటున్నాయి.
 
 
       ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ఉత్తరాంధ్రలో టీడీపీకి-వైకాపాకు మధ్య ఓట్ల తేడా దాదాపు నాలుగుశాతం పైగా ఉంది.. అదే సమయంలో జనసేన కూడా గణనీయంగా ఓట్లను సాధిస్తుందని సర్వే తేల్చింది. అయితే జనసేన చీల్చే ఓట్లు ఏ పార్టీవి అయితే ఆ పార్టీకే నష్టమన్నది స్పష్టం.. ఇక ఈ నెలలోనే విశాఖలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ప్రజా సంకల్ప యాత్ర మొదలుకానుంది. ఆది నుంచి ఉత్తరాంధ్రలో కాస్తో కూస్తో పట్టు ఉంది. ఈ పట్టును నిలుపుకుంటూ జగన్‌ పర్యటన విజయవంతం చేయడానికి పార్టీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. జన సమీకరణ మీద కూడా దృష్టి పెట్టారు. పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండేందుకు జగన్ పర్యటనను సక్సెస్‌ చేయాలని క్యాడర్‌ అనుకుంటోంది.. వవన్ కవాతుకు వచ్చిన జనం కంటే ఎక్కువ జనాన్ని సమీకరించడానికి కృషి చేస్తోంది.. ఇందులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు ఏ మేరకు విజయవంతం అవుతారో చూడాలి...
Link to comment
Share on other sites

భీమిలిలో గెలవాలంటే వాళ్ల ఓట్లే కీలకం
16-07-2018 11:32:08
 
636673375287051993.jpg
  • జయాపజయాలు నిర్ణయించేది ఇక్కడి ఓటర్లే
  • ప్రధాన పార్టీల దృష్టంతా ఇక్కడే
భీమిలి నియోజకవర్గంలో అతి కీలకమైనది... అభ్యర్థుల జయాపజయాలు నిర్ణయించేది మధురవాడే. మొత్తం ఓటర్లలో మూడో వంతు ఇక్కడే ఉండటంతో రాజకీయ పార్టీల నేతల కళ్లన్నీ మధురవాడ ప్రాంతంపైనే ఉన్నాయి. ఇక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే గట్టెక్కవచ్చనే భావన వారిలో కనిపిస్తోంది. కాగా ఇక్కడి వారిలో అధికశాతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారే కావడంతో కుల, మతాలకు అతీతంగా ఓటింగ్‌ జరుగుతుందని ఎన్నికల విశ్లేషకులు చెబుతుంటారు.
 
మధురవాడ(విశాఖ జిల్లా): భీమిలి... ఈ నియోజకవర్గంలో విజయావకాశాలను నిర్ణయించేది మధురవాడ ఓటర్లేననడంలో అతిశయోక్తిలేదు. అభ్యర్థుల గెలుపు.. ఓటములపై ప్రభావం చూపే స్థాయిలో ఓటర్ల సంఖ్య మధురవాడలో ఉండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలూ మధురవాడపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. గత సాధారణ ఎన్నికల నాటికి భీమిలి నియోజకవర్గం ఓటర్లు 2,69,258. ప్రస్తుతం సుమారు 39,000 మంది ఓటర్లు పెరిగి ఈ సంఖ్య 3,08,260కి చేరింది. ఇందులో కేవలం జీవీఎంసీ 4, 5 వార్డులకు చెందిన ఓటర్లే లక్షకు పైగా ఉన్నారు. దీంతో భీమిలి నియోజకవర్గంలో అభ్యర్థి విజయావకాశాలు తేల్చే కీలకంగా మధురవాడ మారింది. ఈ క్రమంలో ఇటు అధికార పార్టీ, అటు కాంగ్రెస్‌, వామపక్షాలు, బీజేపీ, జనసేన, వైసీపీ మధురవాడపై దృష్టి సారించాయి. మధురవాడలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన వారు వందకుపైగా కాలనీల్లో నివాసం ఉంటున్నారు. వివిధ పబ్లిక్‌, ప్రైవేటు సెక్టార్లలో పనిచేస్తున్న ఉద్యోగులున్నారు.
 
అక్షరాస్యులు ఎక్కువ. ఇక్కడి ఓటర్లు ఏ పార్టీపై మొగ్గుచూపుతారో తెలియక అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. మధురవాడ వాంబేకాలనీ, స్వతంత్రనగర్‌ పునరావాసకాలనీ, పీఎంపాలెం పునరావాసకాలనీ, మారికివలస రాజీవ్‌గృహకల్ప కాలనీ, సాయిరామ్‌ కాలనీ, కొమ్మాది వన్‌ కాలనీ, పీఎం పాలెం రత్నగిరి హౌసింగ్‌బోర్డు కాలనీ, తదితర ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.
 
ముఖ్యంగా మధురవాడ, పీఎంపాలెం పరిసరాల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చి, ఇక్కడ స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న వందలాది కుటుంబాలున్నాయి. వీరిలో అధిక శాతం మందికి ఇక్కడే ఓటు హక్కు ఉంది. దీంతో వీరి ఓట్లపై పార్టీల నాయకులు దృష్టిపెట్టారు. మధురవాడ పరిసరాల్లో కులాలు..మతాలు ఓటు బ్యాంకులు లేవు. ఈ ప్రాంతం అభివృద్ధికి దోహదపడతారని భావించే వ్యక్తికే ఓట్లు వేసే ఆనవాయితీ ఉంది. గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. స్థానిక సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న నాయకులను అందలం ఎక్కించడం గతంలోనూ జరిగింది. భీమిలి నియోజకవర్గంలో మధురవాడ ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో ఈ ప్రాంతంపై ఇప్పటినుంచే రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి.
Link to comment
Share on other sites

రకు లోయలో ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతిపక్షంలో కూర్చోవడం ఖాయమా!
16-07-2018 11:38:57
 
636673379381752871.jpg
  • అరకులోయలో విచిత్ర పరిస్థితి
అరకులోయ... ప్రకృతి అందాలకు నెలవైన ఈ ప్రాంతం నియోజకవర్గంగా 2009లో రూపుదిద్దుకుంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే ఇక్కడి ఓటర్లు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఎన్నుకున్నారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఐదేళ్లలో తాము ఆశించిన అభివృద్ధి జరగకపోవడంతో రెండో దఫా 2014లో వైసీపీ అభ్యర్థికి పట్టం కట్టారు. మళ్లీ ఆశాభంగమే . తెలుగుదేశం అధికారంలో వచ్చింది. అయితే 2016లో ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరిపోవడంతో ఇప్పుడిప్పుడే ప్రగతి కనిపిస్తుండగా... నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే.. అనే సెంటిమెంట్‌ బలపడుతోంది. మరి ఈ దఫా ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో!
 
అనంతగిరి: అరకులోయ... ఈ పేరు వినగానే ప్రకృతి అందాలు గుర్తుకువస్తాయి. అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్న ఆంధ్రా ఊటీ అరకు ప్రాంత ఓటర్లు మిగతా వారి కంటే భిన్నంగా ఉంటారు. 2009 అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన అరకులోయకి ఇప్పటికి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించగా, రెండు సార్లూ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వచ్చింది. 2009 వరకు అరకులోయ, అనంతగిరి మండలాలు శృంగవరపుకోట ఎస్టీ నియోజకవర్గంలో ఉండేవి. పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన అరకులోయ నియోజకవర్గం పరిధిలోకి అరకు, డుంబ్రిగుడ, అనంతగిరి, హుకుంపేట, ముంచింగ్‌పుట్‌, పెదబయలు మండలాలు వచ్చాయి. ఈ నియోజక వర్గానికి 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాం గ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అరకులోయ అప్పటికే టీడీపీకి కంచుకోటగా ఉండటంతో ఆపార్టీకి చెందిన సివేరి సోమ విజయం సాధించారు. పదవీ కాలమంతా తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఎమ్మె ల్యే ప్రతిపక్షంలో ఉండటంతో నియోజకవర్గ స్థాయిలో చెప్పుకోదగ్గ అభివృద్ధి చేసేందుకు అవకాశం దక్కలేదు. మన్యంలోని ఆరు మం డలాలు ఒక నియోజకవర్గం పరిధిలోకి రావడంతో అభివృద్ధి పనులు ఊపందుకుంటాయ ని భావించిన మన్యం వాసుల అంచనా తప్పింది.
 
 
రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రమంతటా తెలుగుదేశం ప్రభంజనం కనిపించి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాగా... నియోజకవర్గం ఏర్పడిన తొట్టతొలి ఎమ్మెల్యే సివేరిసోమ ఏమీ సాధించలేకపోయారనే భావంతో అరకులోయ వాసులు మిగతా ప్రాంతాలకు భిన్నంగా వైసీపీ నుంచి పోటీ చేసిన కిడారి సర్వేశ్వరరావును సుమారు 50వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపించారు. అయితే మన్యం వాసుల అంచనాలు మళ్లీ తప్పాయి.
 
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో, ఎన్నో ఆశలతో గెలిపించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రెండేళ్లపాటు ఏమీ చేయలేకపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే నియోజకవర్గం వెనుకబడిపోవడంతో పాటు, తనకు రాజకీయ భవిష్యత్‌ ఉండదని భావించిన ఎమ్మెల్యే 2016 ఏప్రిల్‌లో అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అనంతరం ఈ రెండేళ్లపాటు నియోజకవర్గంలో రహదారులు, రక్షిత నీటిపథకాలు, విద్యుత్‌ సదుపాయం కల్పించడం వంటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఈ దఫా అరకులోయ ప్రాంత ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. దీంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నాయకులు ప్రజలతో మమేకమవుతూ నిత్య పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు.
Link to comment
Share on other sites

ఎమ్మెల్యే కాక ముందు అనిత ఏం చేసేవారో చూడండి!
16-07-2018 11:19:43
 
636673367843490837.jpg
  • కొలువునొదిలి... పదవి పట్టి
  • పాయకరావుపేటలో ముగ్గురు ఉద్యోగులకు దక్కిన ఎమ్మెల్యే అవకాశం
  • కాకరకు మూడుసార్లు ఛాన్స్‌
  • రెండు సార్లు ఎన్నికైన బాబూరావు
  • ఉపాధ్యాయ ఉద్యోగం వదిలిన అనిత
పాయకరావుపేట నియోజకవర్గంలో స్థానికేతరులే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇది ఓ ప్రత్యేకం. కాగా ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు శాసనసభకు ఎన్నికయ్యారు. వారిలో కాకర నూకరాజు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, గొల్ల బాబూరావు రెండుసార్లు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే వంగలపూడి అనిత కూడా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని త్యజించి శాసనసభకు ఎన్నికయ్యారు.
 
 
నక్కపల్లి(విశాఖ జిల్లా): పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఎక్కువ మంది రాజకీయ నాయకులైతే, ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగా లు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చీరావడంతోనే మొదటిసారి ఎన్నికల్లోనే వీరు ఎమ్మెల్యేలుగా గెలుపొంది రికార్డు సృష్టించారు. వారిలో మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు ఒకరు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, హాస్టల్‌ వార్డెన్‌గా పనిచేశా రాయన. విజయనగరం జిల్లాలో వార్డెన్‌గా పనిచేస్తున్నప్పుడు బదిలీ కోసం కాకర ఒక ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. బదిలీ చేయడం మాటలు కాదని ఆ ఎమ్మెల్యే చెప్పడంతో, ఆ కసితో తానే ఎమ్మెల్యే కావాలని కాకర నిశ్చయించుకున్నారు. వార్డెన్‌గా పనిచేస్తున్న సమయంలో 1985లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చా యి. ఈ సమయంలో పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ టిక్కెట్‌ కోసం లెక్కకుమిక్కిలి దరఖాస్తు చేశారు. అయితే ఎస్‌.రాయవరం చినగుమ్ములూరుకు చెందిన స్థానికుడైన కాకర నూకరాజుకు ఎన్టీఆర్‌ పార్టీ టిక్కెట్‌ ఇచ్చారు. దీంతో ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత 1989, 1994లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు.
 
2009 అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేటలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చాలా వ్యూహాలు రూపొందించారు. కాంగ్రెస్‌ టిక్కెట్‌ కు చాలా మంది ప్రయత్నించినప్పటికీ పంచాయతీరాజ్‌శాఖలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారిగా పనిచేస్తున్న గొల్ల బాబూరావుకు పాయకరావుపేట టిక్కెట్‌ ఇచ్చారు. అంతకుముందు విశాఖ జిల్లాలో గొల్ల బాబూరావు సెట్విజ్‌ అ ధికారిగా, జడ్పీ సీఈవోగా పనిచేశారు. 2009 లో వైఎస్‌ ఆశీస్సులతో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి కేవలం 656 ఓట్ల తేడాతో ఎమ్మె ల్యేగా గెలుపొందారు. అనంతరం 2011లో పదవికి రాజీనామా చేయడంతో పాయకరావుపేటకు ఉప ఎన్నిక వచ్చింది. అందులో వైసీపీ నుంచి పోటీ చేసి రెండోసారి కూడా బాబూరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 
 
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంగలపూడి అనిత ఎన్నికల ముందు వరకూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆమె 2013లో టీడీపీ క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో పోటీ చేశారు. దీంతో తొలిసారి ఆమె 2,828 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటివరకూ ముగ్గురు ఉద్యోగులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడం విశేషం. ఇందులో కాకర మూడుసార్లు, గొల్ల బాబూరావు రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఎమ్మెల్యే అనిత తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...