Jump to content

prakasam politics


Recommended Posts

  • Replies 123
  • Created
  • Last Reply
నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఫిక్స్ చేసేసిన వైఎస్ జగన్!?
17-12-2018 13:47:03
 
636806512248593618.jpg
  • బరిలోకి దిగే అభ్యర్థులపై గురి
  • మొదలైన సార్వత్రిక కసరత్తు
  • దృష్టి సారించిన ప్రధాన పార్టీలు
  • సగం అసెంబ్లీ స్థానాలపై టీడీపీ స్పష్టత
 
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కుస్తీ ప్రారంభించాయి. బరిలోకి సమర్థులైన అభ్యర్థులను దించంపై గురి పెట్టాయి. అందుకు సంబంధించిన పనిలో నిమగ్నమయ్యాయి. పార్లమెంట్‌ ఎన్నికలతో కలిపి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. 2014 ఏప్రిల్‌లో ఎన్నికలు జరగ్గా, ఈ పర్యాయం కూడా ఆ సమయంలోనే నిర్వహణకు సిద్ధమైనట్లు ఎన్నికల కమిషన్‌ సంకేతాలిచ్చింది. తెలంగాణ ఎన్నికల ప్రభావం కానీ, మరో ఎత్తుగడతో కానీ ఈ పర్యాయం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ముందస్తుగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
 
 
 
 
ఒంగోలు : ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు రెండ్రోజులు జిల్లాలో మకాం వేయడం, అనంతరం మూడు సర్వేల ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీ పరిస్థితులపై సమీక్ష చేసుకోవడం, విపక్ష నేత జగన్‌ గిద్దలూరు, దర్శి సమన్వయకర్తల విషయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చివరి క్షణం వరకూ అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టడం వలన తెలంగాణలో ప్రజాకూటమి అభ్యర్థులకు ఎదురైన చేదు అనుభవం, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా పరిస్థితులను చక్కదిద్దుకోగలగడాన్ని పరిగణలోకి తీసుకున్నారు. తదనుగుణంగా రాష్ట్రంలో ఇటు టీడీపీ అధినేత చంద్రబాబ, అటు వైసీపీ అధినేత జగన్‌లు అభ్యర్థుల ఎంపికను ముందస్తుగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
 
జిల్లాలో సగం స్థానాలపై స్పష్టత
 
జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇరు పార్టీలూ ఐదారు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఒక స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. అనూహ్యమైన పరిణామాలు, పార్టీ ఫిరాయింపులు వంటివి చోటుచేసుకుంటే మినహా ఆ స్థానాల అభ్యర్థులపై ఇరు పార్టీలకు ఒక స్పష్టత ఉంది. టీడీపీ అయితే ఆరు స్థానాల విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని, మరో రెండు మూడు స్థానాలపై కూడా ఒక ఆలోచనతో ఉన్నదని అంటున్నారు. మిగిలిన స్థానాల అభ్యర్థుల విషయంలో ముమ్మర కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంగోలులో నిర్వహించిన సమీక్షా సమావేశాల సందర్భంగా బహిరంగంగా నాలుగు అసెంబ్లీ స్థానాల విషయమై సమీక్షలు చేసినప్పటికీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో నిర్వహించిన సమావేశంలో మరికొన్ని నియోజకవర్గాల విషయంలో లోతైన అంశాలనే ప్రస్తావించారు. ఇప్పటికే ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డిని పేరును ప్రకటించిన చంద్రబాబు ఆయా సందర్భాల్లో మరికొందరు అసెంబ్లీ అభ్యర్థుల విషయంలోనూ స్పష్టతనిచ్చారు. ఒంగోలు, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో నాలుగైదు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఆయన పూర్తి స్పష్టతతో ఉన్నట్లు సమాచారం. పశ్చిమప్రాంతంలో ఒక నియోజకవర్గ అభ్యర్థి విషయంపై దృఢ నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చారని, మిగిలిన స్థానాల్లో మరికొంత సమాచారం కోసం తాజాగా సర్వే చేయిస్తున్నారని తెలుస్తోంది.
 
ప్రస్తుతం జిల్లాలో వైసీపీ శాసనసభ్యులున్న రెండు నియోజకవర్గాలపై ఒక అవగాహనకు వచ్చేందుకు ఆయన పార్టీ యంత్రాంగం ద్వారా ప్రత్యేక నివేదికను కూడా తెప్పించుకున్నారు. ఆమేరకు సంతనూతలపాడు, మార్కాపురం నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులపై ఇటీవల చంద్రబాబు ప్రత్యేక సమీక్ష కూడా చేశారు. ప్రస్తుతానికి ఆ రెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా ఉన్న బి.ఎన్‌. విజయ్‌కుమార్‌, కందుల నారాయణరెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు కన్పిస్తున్నప్పటికీ వచ్చే నెలలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవచ్చని చెప్తున్నారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిపై ఆవిషయంలో ఎక్కువ బాధ్యతను మోపారు. ఇద్దరు, ముగ్గురు నాయకులను పరిగణలోకి తీసుకుని వారి పేర్లను పరిశీలిస్తున్నారు.
 
 
 
సిట్టింగ్‌లలో పలువురి మార్పు వైపే మొగ్గు
సిట్టింగ్‌లో కనీసం 30శాతం మంది ఎమ్మెల్యేలను మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గాలకు అనుగుణంగా అధినేత చంద్రబాబు ఆ విషయంలో ధృఢ నిర్ణయంతో ఉన్నారని భావిస్తున్నారు. అయితే అవసరమైన చోట్ల సీట్లు ఇవ్వని సిట్టింగ్‌లకు ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి సంతృప్తిపర్చాలన్న ఆలోచనతో కూడా వ్యూహరచన చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు అలాంటి నియోజకర్గాల్లో అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి సారించి అవసరమైన నాయకులతో మాట్లాడుతున్నట్లు తెలిసింది. గత నెలన్నరలో అలా జిల్లాలో ఇద్దరు, ముగ్గురు నేతలను చంద్రబాబు పిలిపించుకొని చర్చించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలను మార్చేందుకు ప్రాధాన్యం ఇస్తే జిల్లాలో కనీసం ఇద్దరు లేక నలుగురికి అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. అయితే పార్టీ ఫిరాయింపులు, లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల ఆధారంగా ఈ సంఖ్య ఉండవచ్చని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఉద్వాసన తప్పకపోవచ్చని విశ్వసనీయ సమాచారం.
 
 
నాలుగు స్థానాలపై వైసీపీ స్పష్టత
అభ్యర్థుల ఎంపికపై గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్న వైసీపీ అధినేత జగన్‌ చివరి క్షణం వరకూ ఎవరికీ టిక్కెట్‌ ఇస్తారో నూటికి నూరుశాతం గ్యారంటీ కాదని చెప్పిన విషయం విదితమే. ఆయన కూడా సర్వేలు, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సమన్వయకర్తలను మారుస్తుం డటం అందులో భాగమే. ప్రస్తుతం ఆ పార్టీ అధిష్ఠానం ఆలోచన ప్రకారం అయితే జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో స్పష్టత ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన సెగ్మెంట్ల విషయంలో రెండు అభిప్రాయాలతో జగన్‌ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కచ్ఛితంగా కొత్తవారికే అవకాశం ఇవ్వాలని భావిస్తూ, మరికొన్ని చోట్ల పార్టీ ఫిరాయింపులతో అనూహ్యమైన అభ్యర్థులు వస్తే తప్ప ఉన్న వారినే కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆదిమూలపు సురేష్‌ (ఎర్రగొండపా లెం), బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), మానుగుంట మహీధర్‌రెడ్డి (కందుకూరు), బుర్రా మధుసూదన్‌ (కనిగిరి) ఎంపిక విషయంలో ఢోకా ఉండకపోవచ్చని తెలుస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు, దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్‌ను రంగంలోకి దించాలన్న ఆలోచనతో ఆ పార్టీ ఉంది. మిగిలిన నియోజకవర్గాల విషయంలో మార్పు ఉండబోదని చెప్తున్ప్పటికీ తాజాగా జగన్‌ అనుసరిస్తున్న వైఖరితో ఎప్పుడేం జరుగుతుందోనన్న అనుమానాలు ఆ పార్టీ నేతలు, శ్రేణులను వెంటాడుతున్నాయి.
 
విశ్వసనీయ సమాచారం మేరకు సుమారు ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థుల విషయంలో స్పష్టతతో ఉన్న అధిష్ఠానం వీలైనంత త్వరగా మిగిలిన అభ్యర్థులకు కూడా క్లియరెన్స్‌ ఇచ్చే ఆలోచనతో కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఒంగోలు, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, ఒంగోలు మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి తదితరుల అభిప్రాయాలను విడిడివిడిగా అధినేత జగన్‌ సేకరిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల విషయమై ఇటీవల బాలినేనితో ఆయన సవివరంగా మాట్లాడారు. రేపోమాపో బాపట్ల లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై సమీక్ష చేసే అవకాశం ఉంది. ఏదిఏమైనా ఇరు పార్టీలు జనవరి ఆఖరులోపు అత్యధిక స్థానాల్లో అభ్యర్థులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు.
 
 
పలువురు నేతలతో జనసేన కోఆర్డినేటర్ల భేటీ
ఇంకోవైపు జనసేనకు సంబంధించి కోఆర్డినేటర్‌లు కూడా ఇటీవల జిల్లాలో పర్యటించారు. ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంధించిన పరిశీలన చేయడంతోపాటు కొందరు నాయకులతో మంతనాలు కూడా జరిపారు. దర్శి నుంచి వేణుగోపాల్‌ను రంగంలోకి దించాలని వారు చూడగా ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు. గిద్దలూరు నుంచి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న చంద్రశేఖర్‌యాదవ్‌ను రంగంలోకి దించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒంగోలులో కాపుయేతర వర్గానికి చెంది, ఎన్నికల్లో సామ, దాన, భేద దండోపాలు ఉపయోగించే అభ్యర్థి కోసం గాలిస్తున్నారు. కమ్మ, ఆర్యవైశ్య, కాపు సామాజికవర్గాల్లో ముగ్గురు, నలుగురు నాయకులను వారు కలిసి పార్టీ అభిప్రాయాన్ని చెప్పినట్లు కూడా తెలిసింది.
Link to comment
Share on other sites

క్యాడర్‌ను ఇబ్బంది పెట్టిన వారిని చేర్చుకుంటారా?’
19-12-2018 12:24:48
 
636808191262177068.jpg
  • సానుకూలంగా స్పందించారని ఐవీరెడ్డి వెల్లడి
 
ఒంగోలు: వాడీ వేడిగా మారిన గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో మంగళవారం మరో కీలక సంఘటన చోటు చేసుకుంది. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని గిద్దలూరు ప్రస్తుత ఆపార్టీ సమన్వయకర్త ఐవీరెడ్డి హైదరాబాదులో కలిపి మంతనాలు జరపడం ఒక ఎత్తైతే తన నాయకత్వం పట్ల వైవీ సానుకూలంగా స్పందించారని ఐవీ రెడ్డి ప్రకటించడం విశేషం. ఇటీవల ఆ నియోజకవర్గ మాజీశాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు వైసీపీలో చేరేందుకు జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రస్తుత పార్టీ సమన్వయకర్త ఐవీరెడ్డి అదే రోజు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి తన అసంతృప్తిని వ్యక్తం చేశా డు. తిరిగి మంగళవారం హైదరాబాబులో వైవీ సుబ్బారెడ్డిని కలిసి తన వాదనను వినిపించినట్లు తెలిసింది.
 
ఎమ్మెల్యేగా ఉండగా వైసీపీ శ్రేణులను అధికారంతో ఇబ్బంది పెట్టడం, అలాగే పార్టీకి అండగా ఉండే సామాజికవర్గం వారికి వ్యతిరేకంగా వుండే వారిని పార్టీలో చేర్చుకుంటే లాభమా? నష్టమా? ఆలోచించాలంటూ సూచించినట్లు తెలిసింది. ఈ విషయమై తన అభిప్రాయాన్ని జగన్‌ దృష్టికి తీసుకెళతానని వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా వైవీ సుబ్బారెడ్డితో తన కలయిక సారాంశాన్ని వెల్లడిస్తూ ఒక ప్రకటన చేశారు. కష్ట కాలంలో పార్టీ కోసం అన్ని రకాల ఇ బ్బందులను ఎదుర్కొని పనిచేసిన తనకు అన్యాయం జర గదని వైవీ హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. అంతేకాక ఆయన ఇచ్చిన హామీ మేరకు తిరిగి నియోజకవర్గంలో తాను నిర్వహిస్తున్న కా ర్యక్రమాలను కొనసాగిం చ బోతున్నట్లు తెలిపా రు. అనంతరం గత ఏడాది వలే ఐవీ రెడ్డి ముద్రించిన లక్ష క్యాలెం డర్ల ఆవిష్కరణ కార్య క్రమాన్ని వైపీ సుబ్బా రెడ్డి నిర్వహించారు.
Link to comment
Share on other sites

జనసేనలోకి చంద్రశేఖర్‌.. పవన్‌తో భేటీ
19-12-2018 12:30:31
 
636808194322012279.jpg
  • తన కార్యాలయాన్నే పార్టీ ఆఫీసుగా మార్చే వ్యూహం
ఒంగోలు: రాజకీయంగా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్‌ యాదవ్‌ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆ మేరకు పార్టీ నాయకులతో పాటు పవన్‌ కళ్యాణ్‌ని కూడా కలిసి ఆయన మాట్లాడారు. ఒంగోలు నగరం త్రోవగుంట ప్రాంతంలో ఉన్న తన కార్యాలయాన్ని కూడా జనసేన జిల్లా ఆఫీసు నిర్వహణకు ఆయన సిద్ధం చేస్తున్నారు. ఒంగోలులో వ్యాపారవేత్తగా ఉన్న చంద్రశేఖర్‌యాదవ్‌ రాజకీయంగా గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2009 ఎన్నికలలో గిద్దలూరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి అప్పటి ప్రజారాజ్యం అభ్యర్థిపై ఓడిపోయారు. అప్పటి నుంచి గిద్దలూరు నియోజకవర్గంపైనే రాజకీయంగా దృష్టిసారించారు. గిద్దలూరులోనే స్థిరపడే ఉద్దేశంతో స్వంత గృహాన్ని కూడా నిర్మించుకుంటున్నారు.
 
వచ్చే ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్న ఆయనను జనసేనకు చెందిన కొందరు ముఖ్య నాయకులు సంప్రదించారు. గిద్దలూరులో అటు కాపు సామాజికవర్గంతో పాటు ఇటు యాదవ సామాజికవర్గం ఓటర్లు కూడా గణ నీయంగా ఉన్నారు. దీంతో యాదవ సామాజికవర్గం అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ఆలోచనతో ఆ పార్టీ నాయకులు చంద్రశేఖర్‌తో మూడు నాలుగు నెలలుగా టచ్‌లో ఉన్నారు. ఇటీవల జనసేనలోనే చేరేందుకు సిద్ధమైన చంద్రశేఖర్‌యాదవ్‌ ముఖ్య నాయకులందరితో కలిసి చర్చించినట్లు తెలిసింది. పవన్‌కళ్యాణ్‌ అమెరికా పర్యటనకు వెళ్లబోయే ముందు చంద్రశేఖర్‌ ఆయనను కలిసినట్లు తెలిసింది. తదనంతరం పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకుని సన్నద్ధమవుతున్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో మిగిలిన ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు.
 
ఒంగోలులో జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పాటులో భాగంగా త్రోవగుంట ప్రాంతంలో ఉన్న ఆయన భవనాన్ని ఎంపిక చేశారు. ఆ భవనాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన చంద్రశేఖర్‌ మంగళవారం అవసరమైన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. తదనుగుణంగా త్వరలో ఆ భవనంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలని కూడా జనసేన నాయకులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. కాగా నేడో రేపో అమెరికా నుంచి పవన్‌ కళ్యాణ్‌ వచ్చిన తర్వాత మరోసారి ఆయనతో మాట్లాడి ఆయన సమక్షంలోనే పార్టీలో చేరేందుకు చంద్రశేఖర్‌ యాదవ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

ఆపరేషన్ విజయసాయి’.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..!
19-12-2018 12:40:13
 
636808201183555609.jpg
  • టీడీపీ ప్రముఖుడికి విజయసాయి రెడ్డి ఫోన్లు
  • ఇతర పార్టీల నేతలకు వైసీపీ గాలం
  • మహీధర్‌ చేరికలో విజయసాయి కీలకపాత్ర
  • ఇప్పుడు మరో ఇద్దరు నేతలకు రోజూ ఫోన్లు
  • అందులో ఓ సీనియర్‌, మరో టీడీపీ ప్రముఖుడు
  • జనవరిలో పార్టీలో చేరతారంటూ ప్రచారం
  • నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ అధిష్ఠానం
 
ఒంగోలు: జిల్లాలో ఆపరేషన్‌ విజయ్‌ కార్యక్రమాన్ని వైసీపీ ప్రారంభించింది. తెలంగాణ ఎన్నికల ముగిసిన అనంతరం దూకుడు పెంచింది. రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ద్వారా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలను రాబట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆయన ప్రమేయంతో ఇప్పటికే ఒకరిద్దరు నాయకులు వైసీపీలో చేరగా, మరో ఇద్దరు, ముగ్గురు నేతలతో ప్రస్తుతం ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి కదలికలపై టీడీపీ అధిష్ఠానం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు నాయకుల పార్టీ ఫిరాయింపులకు అవకాశం ఏర్పడింది. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో స్థానికంగా ఆ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. తదనుగుణంగా పార్టీలోకి దీటైన అభ్యర్థులను చేర్చుకునే చర్యలు చేపట్టింది.
 
అందులో భాగంగా టీడీపీతో పాటు, ఇతర ఏపార్టీలో కానీ, స్వతంత్రంగా కానీ ఉన్న బలమైన నేతల కోసం అన్వేషిస్తోంది. తొలుత ఆ బాధ్యతను జిల్లాతో సంబంధం ఉండి, వైసీపీలో కీలక నేతలుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, వై.వి. సుబ్బారెడ్డిలతోపాటు, పార్టీ పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డిలకు అప్పగించింది. అదే తరహాలో రాష్ట్ర స్థాయిలో ఇలాంటి వ్యవహారాలను రాజ్యసభ సభ్యుడు, జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి చూస్తున్నారు. ప్రముఖ ఆడిటర్‌ కూడా అయిన ఆయనకు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోపాటు, మన జిల్లాలోని కొందరి నాయకులతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. దీనికితోడు జిల్లాతో సంబంధం ఉన్న పార్టీ నాయకులకు వ్యక్తిగత రాగధ్వేషాలు ఉండొచ్చన భావనతో ఇక్కడ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కార్యక్రమ బాధ్యతను అధిష్ఠానం విజయసాయిరెడ్డికి అప్పగించినట్లు తెలిసింది. ఇప్పటి వరకూ జిల్లాలో ఒకరిద్దరు ప్రాధాన్యత కలిగిన నాయకుల వైసీలో చేరికలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైసీపీలోకి చేరికకు ముగింపు ఇచ్చింది ఆయనే. విజయసాయిరెడ్డి రంగంలోకి దిగిన తర్వాతనే మహీధర్‌రెడ్డి వైసీపీలోకి చేరికకు మార్గం సుగమమైందన్న భావన జగన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
 
తాజాగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీలో చేరేందుకు అధినేత జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంలోనూ విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. వైసీపీ ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డితో జగన్‌ చర్చించిన తర్వాత రాంబాబును పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అంతకుముందుగానే రాంబాబు ఒంటరిగా ఓ శుక్రవారం జగన్‌ హాజరయ్యే కోర్టు వద్దకు వెళ్లి ఆయన్ను పరిచయం చేసుకున్నట్లు తెలిసింది. ఆయన ఇచ్చిన సూచన మేరకు ఇటు విజయసాయిరెడ్డి, అటు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి ఆ తర్వాత బాలినేనితో భేటీ అయి ఆయన మద్దతు పొందే ప్రయత్నం చేశారు. ఇవన్నీ పైకి కన్పిస్తున్నప్పటికీ రాంబాబు విషయంలో ఆపరేషన్‌ విజయ్‌ సక్సెస్‌ అయినట్లు అర్థమవుతోంది.
 
తాజాగా మరొకొన్ని వ్యూహాలు
తాజాగా విజయసాయిరెడ్డి మరికొందరు నేతలను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం స్పీడు పెంచారు. ‘జిల్లాలోని ఒకరిద్దరు సీనియర్‌ నాయకులు, మరో ఇద్దరు టీడీపీ శాసనసభ్యులకు ఆయన టచ్‌లో ఉన్నారు. జనవరిలో వారంతా పార్టీలోకి వస్తారు. జిల్లాలో మనకెలాంటి ఇబ్బంది ఉండదు’ అని విజయసాయిరెడ్డి ఆ పార్టీ శ్రేణులతో అంటున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఆ పార్టీ మైండ్‌గేమ్‌ అని కొందరు కొట్టిపారేస్తున్నా వాస్తవానికి విజయసాయిరెడ్డి జిల్లాలోని ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఓ సీనియర్‌ నాయకుడికి పదేపదే ఫోన్లు
జిల్లాతో విస్తృత పరిచయాలుండి గతంలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన ఓ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రికి విజయ్‌సాయిరెడ్డి పదేపదే ఫోన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఆయన కానీ, ఆయన కుటుంబ సభ్యులను కానీ వైసీపీ తరఫున రంగంలోకి దించే ఆలోచనలో ఆ పార్టీ ఉంది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి రోజూ ఆ నాయకుడితో సంప్రదింపులు జరపడంతోపాటు ‘పార్టీలో మీకు సముచిత గౌరవం ఉంటుంది. ఇది నేను చెప్తున్నది కాదు. జగన్‌ మాట. మీరు రండి. ఒకసారి జగన్‌ను కలవండి. ఒక స్పష్టత వస్తుంది’ అని కోరుతున్నట్లు తెలిసింది. సదరు నాయకుడు కాదనకుండా, ఔననకుండా సమాధానం చెప్తున్నట్లు సమాచారం. దీంతో జనవరిలో ఆయన రాక ఖాయమన్నట్లు విజయసాయిరెడ్డి అభిప్రాయపడటమే కాకుండా జిల్లాలోని వైసీపీ నేతలతో కూడా చెప్తున్నట్లు తెలుస్తోంది.
 
టీడీపీలోని కీలక నేతతో సంప్రదింపులు
ప్రస్తుతం టీడీపీలో ఉన్న మరో కీలక నేతపై కూడా విజయసాయిరెడ్డి దృష్టి సారించి నిత్యం ఫోన్లో మాట్లాడుతున్నట్లు తెలిసింది. గత ఎన్నికల సందర్భంగానే ఆ నాయకుడి చేరికపై వైసీపీలో రసవత్తర చర్చ జరిగింది. ప్రస్తుతం ‘అన్నీ నేను చూసుకుంటా. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది జగన్‌ మాట కూడా’ అంటూ ఆ నాయకుడిని విజయ్‌సాయిరెడ్డి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అందరివాడిగా మెలగాలని భావించే ఆ నాయకుడు ఇస్తున్న సున్నితమైన సమాధానంతో ఆయన చేరికపైనా వైసీపీ ఆశపెట్టుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఈ ఇద్దరు నాయకులపై ఆపరేషన్‌ విజయసాయి కొనసాగుతోంది. గతంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిన విజయసాయి వారి నుంచి సరైన స్పందన రాక వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
 
ప్రత్యేకించి ఒక యువ ఎమ్మెల్యే అయితే జిల్లాలో టీడీపీ వ్యవహారాలు, ఇతర కొన్ని అంశాలపై అసంతృప్తితో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయకత్వానికి అనుగుణంగా ముందుకు సాగాలన్న ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఫోన్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయితే విజయసాయి మాత్రం తన ప్రయత్నాలను ఆపకుండా ఆ ఇద్దరి ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒక స్వతంత్ర సంస్థతో చేయించిన సర్వే నివేదిక ఇది అంటూ రాష్ట్రంలో వైసీపీదే అధికారం అంటూ ఇలాంటి వారిని ఆకర్షించేందుకు విజయసాయిరెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైతే కొత్తగా ఆయన ఆపరేషన్‌లో చిక్కుకొని వైసీపీలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వారు ఎవ్వరూ లేకపోయినప్పటికీ, భవిష్యత్‌లో ఉండబోరన్న గ్యారెంటీ కూడా లేదు.
 
నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ
ఆపరేషన్‌ విజయ్‌ వ్యవహారాన్ని టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ విషయంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా దృష్టి సారించి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియజేయాలని కొందరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈ ఆపరేషన్‌ వ్యవహారాలకు అనుగుణంగా టీడీపీ కూడా ఓ వ్యూహాన్ని రూపొందించుకొంటున్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

59 minutes ago, ChiefMinister said:

aadu jump ayithe inka tdp prakasam lo bad ga vuntundi situation

Antha scene ledule bro.. vaadu pothey sagam daridram vadiliddi.. elagu addanku seat raadu so poyina aschrayam em ledu.. antha scene unte addanki lanti constituency lo 2times vodipoyadante telitledaa..

Link to comment
Share on other sites

Enti Boss ikkada anta party ki plus chese vallu evarina unnara..endukante post lu petti like kadu kavalasindi ground level lo work cheyyali Hyd lo manam fail ayyindi aa vishayam lone akkadada chillara kalyan and friday star party vallu ground level lo work chesaru 2 seats lo (Kukatpally,serlingampally) Marandi memu tdp ni vodinchali ani Ycheapi and kula sena nunchi almost 100 calls vachayi.direct ga vallu ma satruvu CBN ani chebutunnaru.

Link to comment
Share on other sites

1 hour ago, pajaykumar said:

@anil Ongole Boss Karanam marataru ani ela anukunnavu mararu ticket addanki confirm idi rasi pettuko aa vere party nunchi vachindi vadu pisala kosam endukante akkada tdp cadre ni pattinchukonedi Only Prakasam Tiger Karanam Balaram

Appatlo okasari Congress loki velli vcahduga alla anukunnale.. sare chuddam evaririki istharo tickt ivakapothey em chesathdo kudaa..

Link to comment
Share on other sites

  • 2 weeks later...
దగ్గుబాటి వారసుడి పేరుతో కలకలం సృష్టిస్తున్న ఫోన్‌ సర్వే
28-12-2018 12:24:56
 
636815969656533496.jpg
  • పరిశీలన, మంతనాలలో దగ్గుబాటి
  • ఒక ఎమ్మెల్యేతో సుదీర్ఘ చర్చలు
 
రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన దగ్గుబాటి కుటుంబ వారసుడు రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారా.. ఆ మేరకు పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్‌ చెంచురామ్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉందా? అంటే తాజా పరిణామాలను పరిశీలిస్తే అందుకు అవకాశం లేకపోలేదు అన్న అంచనాను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. శ్రేయోభిలాషులతో పాటు కొందరు నాయకులు, ప్రజా ప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారు. తన మనోభావాలను బయట పెట్టకుండానే ప్రజల నాడి ఎలా ఉంది మీరు రాజకీయంగా ఎలా ముందుకు పోబోతున్నారు అంటూ వారి నుండి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
 
ఒంగోలు: సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2014 ఎన్నికల నాటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటం, ఆయన సతీమణి దివంగత ఎన్టీఆర్‌ కుమార్తె పురంధేశ్వరి బీజేపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా గత కొంతకాలం నుంచి దగ్గుబాటి కుటుంబ వారుసుడిగా హితేష్‌ చెంచురామ్‌ని పోటీలో దించే విషయంపై వెంకటేశ్వరరావు ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు విన్పిస్తున్నాయి. వైసీపీ అగ్రనాయకులలో కొందరు ఆయనను కలిసి పార్టీలో చేరమని పర్చూరు నుంచి ఆయన కుమారుడిని పోటీలో దించమని కోరారు. దగ్గుబాటి అంగీకరిస్తే ఆయన సతీమణి పురంధేశ్వరికి లోక్‌సభకు పోటీచేసే అవకాశం కూడా ఇస్తామని సూచించారు. అయితే ఈ ప్రతిపాదనపై ప్రారంభంలో సానుకూలత చూపని దగ్గుబాటి ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులపై నిశిత పరిశీలన ప్రారంభించారు.
 
నిజానికి నాలుగైదు మాసాల క్రితం కూడా ఇప్పటి డబ్బు ప్రభావిత రాజకీయాలు అవసరమా అంటూ వ్యాఖ్యానించేవారు. తన సతీమణి బీజేపీలో ఉన్నారు, జాతీయ పార్టీలో ఉంటే మంచిదే కదా అంటూ ఆయనను కలిసిన వారితో అనేవారు. క్రమేపీ ఎవరైనా సలహా అడిగితే చెప్పటం ప్రారంభించారు. వైసీపీలో చేరాలనుకుని తన సలహా అడిగిన వారిని వెంటనే చేరమని సూచించటం ప్రారంభించారు. నీ కుమారుడిని పోటీ చేయించబోతున్నారా? అంటే లేదు లేదు అని చెప్పే డా. దగ్గుబాటి ఇటీవల ఆ మాట అన్న వారితో నవ్వి ఊరుకుంటున్నారు. నాలుగు మాసాల క్రితం ఆయనతో ఈ విషయమై మాట్లాడిన ఓ నాయకుడు తిరిగి రెండు రోజుల క్రితం మాట్లాడిన తర్వాత దగ్గుబాటి స్పందనలో స్పష్టమైన తేడాని గమనించినట్లు తెలిపారు.
 
 
కార్యక్రమాలకు హాజరు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో దివంగత ఎన్టీఆర్‌ పెద్దల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చిన డా. దగ్గుబాటి ఇప్పటికీ ఐదుసార్లు శాసనసభ్యునిగా, ఒకసారి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందారు. ఒక పర్యాయం రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 1999 ఎన్నికల ముందు నుంచే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2004లో తన భార్య పురంధేశ్వరిని కూడా కలుపుకొని కాంగ్రెస్‌లో చేరి ఆయన ఎమ్మెల్యేగా, ఆమె ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 2009లోను ఇరువురూ గెలుపొందారు. 2014 నుంచి తిరిగి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. కొద్దికాలం తర్వాత పురంధేశ్వరి కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే దగ్గుబాటి మాత్రం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
 
రెండేళ్ల క్రితం ఆయన కుమారుడు హితేష్‌ చెంచురామ్‌ నిర్వహణలో నడిచే విధంగా చీరాల సముద్ర తీరంలో ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దగ్గుబాటి నియోజకవర్గంకు రాకపోకలను భారీగా పెంచారు. తనకు ఆహ్వానం అందిన ప్రతి చిన్న కార్యక్రమానికి హాజరవటం ప్రారంభించారు. ఆయన కుమారుడు వ్యాపారపరమైన పనుల పేరుతో రాకపోకలు సాగిస్తున్నారు. దీనికి తోడు టీడీపీలో లోకేష్‌ పాత్ర పెరిగిన తర్వాత దగ్గుబాటి హితేష్‌కి లోకే్‌షతో సాన్నిహిత్యం ఉన్నందున టీడీపీకి చేరువ కావచ్చని భావించారు.
 
అయితే బీజేపీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ పురంధేశ్వరి టీడీపీపైన, ప్రత్యేకించి చంద్రబాబుపైన విమర్శల దాడి పెంచారు. ఇంకోవైపు డా. దగ్గుబాటి కూడా చంద్రబాబు పాలనపై మాటల్లోను, సోషల్‌ మీడియాలోను వ్యతిరేకతను ప్రదర్శించారు. కొంతకాలం నుంచి వైసీపీ అగ్రనాయకులు ఒకరిద్దరు దగ్గుబాటికి టచ్‌లోకి వెళ్లటంతో తిరిగి రాజకీయంగా ముందుకొస్తే వైసీపీలోనే చేరతారన్న ప్రచారం జరుగుతోంది. తొలుత జిల్లాకు చెందిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మరికొందరు దగ్గుబాటిని కలిసి పార్టీలో చేరమని ఆహ్వానించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయనకు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. దగ్గుబాటి వారికి ఏమి చెప్పారో ఏమో కానీ వైసీపీ నాయకులు దగ్గుబాటి పార్టీలో చేరతారన్న ప్రచారాన్ని సాగిస్తున్నారు. అది మైండ్‌ గేమ్‌ అని కొట్టిపారేసేవారు లేకపోలేదు. అయితే తాజాగా దగ్గుబాటి వ్యవహారశైలి అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
 
 
ఆమంచితో మంతనాలు
ఈనెల 24న కారంచేడు వచ్చిన దగ్గుబాటి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో చాలాసేపు భేటి అయ్యారు. కారంచేడులో వారిరువురు కలిశారు. ఏకాంతంగా ఆమంచితో మాట్లాడిన దగ్గుబాటి రాజకీయాలపైనే సమాలోచనలు చేశారు. గతంలో తనను కలిసిన వైసీపీ నాయకులతో ఆమంచిని కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేయండని దగ్గుబాటి సూచన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి తోడు రాజకీయాలలో మంచి వ్యూహకర్తగా పేరున్న ఆమంచితో దగ్గుబాటికి 2009 ఎన్నికల ముందు నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. పైగా పర్చూరు నియోజకవర్గంలో బలమైన బంధువర్గం కూడా ఆమంచికి ఉంది.
 
ఈ నేపథ్యంలో ఆమంచితో దగ్గుబాటి భేటి కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీ తరపునే పోటీకి సిద్ధమైన ఆమంచి ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన రాజకీయ ఆలోచన, తన కుమారుని రాజకీయ ఆరంగ్రేటం తదితర విషయాలపై దగ్గుబాటి ఆమంచికి ఏమేర స్పష్టత ఇచ్చారనేది తెలియాల్సి ఉంది. కానీ ఆ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకునే దగ్గుబాటి ఆమంచితో మంతనాలు చేసినట్లు తెలుస్తోంది.
 
 
ఫోన్‌ సర్వే కలకలం..
రెండు రోజుల నుంచి ఫోన్‌లో జరుగుతున్న ఒక సర్వే నియోజకవర్గ రాజకీయ వర్గాలలో కలకలాన్ని సృష్టిస్తోంది. పర్చూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నను వేస్తున్నారు. గొట్టిపాటి భరత్‌, దగ్గుబాటి హితేష్‌ చెంచురామ్‌లలో ఎవరు ధీటైన అభ్యర్థి అని ఆ ఫోన్‌ వాయిస్‌లో అడగటం విశేషం. అలా నియోజకవర్గంలోని పలువురు వైసీపీ శ్రేణులకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. అయితే అందులో ప్రస్తుత పార్టీ సమన్వయకర్త రంగనాథబాబు పేరు లేకపోవటం విశేషం.
 
పైగా వైసీపీలో ఇలాంటి సంప్రదాయం లేదని కూడా అంటున్నారు. దీంతో ఆ సర్వేపై పలురకాల అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ ప్రజలలో చర్చనీయాంశమై రాజకీయంగా కలకలానికి కారణమైంది. రాజకీయంగా ఆచితూచి వ్యవహరిస్తూ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే డా. దగ్గుబాటి ఈ తాజా పరిణామాల మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది వేచిచూడాలి. కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొస్తే ఆయన సతీమణి రాజకీయ విషయంలో ఎలాంటి ముందడుగు వేస్తారనేది కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

వైసీపీలో చేరికకు మద్దిశెట్టి ఓకే.. దర్శి నుంచే పోటీ!
05-01-2019 09:11:03
 
636822762648124311.jpg
  • వైఎస్ జగన్‌తో భేటీ
  • దర్శి నుంచి పోటీకి సిద్ధమని వెల్లడి
  • వెంటనే రంగంలో దిగాలన్న అధినేత
  • సంక్రాంతి తర్వాత వస్తానన్న వేణుగోపాల్‌
  • తొలుత సజ్జలతో చర్చలు
  • జిల్లా నేతలు లేకపోవడం చర్చనీయాంశం
ఒంగోలు: దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విషయంపై ఒక స్పష్టత ఏర్పడింది. తాను పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని వ్యాపారవేత్త మద్దిశెట్టి వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆపార్టీ అధినేత జగన్‌ను కలిసి ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. వెంటనే రంగంలోకి రావాలని జగన్‌ ఆయనకు సూచించగా సంక్రాంతి తర్వాత పార్టీ కార్యక్రమాలను ప్రారంభిస్తానని వేణుగోపాల్‌ బదులిచ్చినట్లు సమాచారం. వివిధ కారణాలతో దర్శి నియోజకవర్గ వైసీపీ సమ న్వయకర్త పదవి కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున దర్శి నుంచి పోటీ చేసిన వేణుగోపాల్‌ అంగీకరిస్తే ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించాలని నెల క్రితమే జగన్‌ నిర్ణయించుకున్నారు.
 
 
ఆవిషయాన్ని ఒంగోలు లోక్‌ సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరె డ్డిద్వారా వేణుగోపాల్‌కు తెలియజేశారు. అయితే కొం త వ్యవధి అడిగిన వేణుగోపాల్‌ చెప్పిన సమయం ప్రకారం శుక్రవారం తన సోదరుడు, ఒంగోలులోని పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నిర్వాహకుడు శ్రీధర్‌తో కలిసి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వెళ్లారు. తొలుత సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయిన ఆయన ఆతర్వాత జగన్‌ను కలిశారు. వెంటనే పార్టీ బాధ్యతలు చేపట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు జగన్‌ సూచించగా అందుకు వేణు గోపాల్‌ అంగీ కా రం తెలిపారు. అ యితే కొన్ని కారణాల వలన సం క్రాంతి తర్వా త ప్రత్యక్షంగా అరంగేట్రం చేస్తానని చెప్పినట్లు తెలి సింది. సమయం తక్కువ ఉన్నందున మరోసారి వాయిదా వేయవద్దని జగన్‌ ఆయనకు సూటిగా చెప్పినట్లు సమాచారం. అయితే ముందుగానే అన్ని విషయాలను స్పష్టంగా చర్చించిన సజ్జల రామకృ ష్ణారెడ్డి అవసరమైన సూచనలు చేసినట్లు సమాచారం.
 
 
వైసీపీ దర్శి బాధ్యతలు చేపట్టేందుకు వేణు గోపాల్‌ సన్నద్ధం కావడంతో నియోజకవర్గంలోని అభిమానులు, వైసీపీకి చెందిన మరికొందరు నాయ కులు ఆయనకు ఫోన్లు చేసి అభినందనలు తెలిపా రు. జగన్‌తో వేణుగోపాల్‌ భేటీ పార్టీపరంగా కీలక పరిణామంగా భావిస్తుండగా ఆ సమయంలో జిల్లా కు చెందిన ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డికానీ, మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డికానీ ఆ సమయంలో అక్కడ లేకపోడం చర్చనీయాంశమైంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్ర సాద్‌రెడ్డి వైఖరి ఎలా ఉండబోతుందన్నది అర్థంకావడం లేదు. గతంలో పార్టీ సమన్వయకర్తగా నియమితులైన బాదం మాధవరెడ్డిని బూచేపల్లి వ్యతిరేకిం చారు. వేణుగోపాల్‌ విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.
Link to comment
Share on other sites

జగన్‌ ఆదేశిస్తే చీరాల నుంచి పోటీకి సిద్ధం: మాజీ ఎంపీ
05-01-2019 09:26:49
 
636822773670564043.jpg
చీరాల/ఒంగోలు : వైసీపీ అధినేత జగన్‌ ఆదేశిస్తే చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు సిద్ధమని మాజీ ఎంపీ చిమటా సాంబు అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు ఉన్నారనే ఆలోచనతో జగన్‌ యాదవ సామాజికవర్గానికి చెందిన వారికి సీటు కేటాయించే ఆలోచనలో ఉన్న తరుణంలో తాను సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మొదట్లో జగన్‌, పవన్‌లు ప్రత్యేకహోదా కోసం మాట్లాడుతుంటే.. ప్రత్యేక హోదా కన్నా, ప్రత్యేక ప్యాకేజి ముఖ్యమని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు.
 
 
ఇప్పుడేమో ప్రత్యేకహోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్‌టీ రామారావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతర పక్షాలను కూడగట్టారన్నారు. 1989లో బోఫోర్స్‌ కుంభకోణం నేపథ్యంలో 105 మంది ఎంపీలను రాజీనామా చేయించి కాంగ్రె‌స్‌కు వణుకు పుట్టించారన్నారు. ఆ 105 మంది ఎంపీలలో తాను ఒకడినని గుర్తుచేశారు. అలాంటి నేపథ్యం ఉన్న టీడీపీని వ్యక్తిగత ప్రయోజనాల కోసం మరలా కాంగ్రె‌స్‌తో జతకట్టడం దారుణమన్నారు.
Link to comment
Share on other sites

On 12/19/2018 at 3:51 AM, pajaykumar said:

@anil Ongole Boss Karanam marataru ani ela anukunnavu mararu ticket addanki confirm idi rasi pettuko aa vere party nunchi vachindi vadu pisala kosam endukante akkada tdp cadre ni pattinchukonedi Only Prakasam Tiger Karanam Balaram

Addanki ZPTC ticket Kooda doubt yeee..

Link to comment
Share on other sites

1 minute ago, nbk@myHeart said:

Karanam may go to darsi ani talk.... sidha will be considered for mlc

Sidha ithe dabbutho gelustadu Karanam ithe inko seat bokka..

Elagu akkada ayaniki unna 2000 votes ki every elections ki bagane gittubatu avuthundi lee...

Link to comment
Share on other sites

33 minutes ago, nbk@myHeart said:

Karanam may go to darsi ani talk.... sidha will be considered for mlc

Anni MLA seats kams ki ela isthaaru? malli prakasam lo 50-60% ee vesthaaru max. to TDP.

That's why TDP never dominates prakasam district despite Kams are biggest community in district.

This time if TDP doesn't get good voting in all communities difficult to win in any district.

Link to comment
Share on other sites

2 hours ago, ramntr said:

At present elections jarigithe only టిడిపి n Ycp sure ga గెలిచే seats enti Prakasam lo.. 

Addanki 

Chirala— Amanchi ithe 

Ongole

Kondepi

Parchuru

Darsi — Opp Buchepalli family kakapothe Easy lagutharu vallu ithe kastapadali 50-50

TDP ki anukuntunna 

Link to comment
Share on other sites

2 hours ago, KvrReddy said:

Addanki 

Chirala— Amanchi ithe 

Ongole

Kondepi

Parchuru

Darsi — Opp Buchepalli family kakapothe Easy lagutharu vallu ithe kastapadali 50-50

TDP ki anukuntunna 

Santhanuthala padu- kuda easy ne ee sari kottesthadi anukuntunna..

Kandukur- mahidhar Reddy ycp kabatti pothula and divi iddaru kalisi work chesthe kottochu ...

Yerragondapalem, giddalur , marakapuram-  doubte..

Kanigiri- manake lead untudi emole sitting unnadu ga ..

Link to comment
Share on other sites

టీడీపీలో చేరిన తర్వాత తొలిసారి చంద్రబాబును కలిసిన గొట్టిపాటి
10-01-2019 13:50:30
 
636827261833124940.jpg
  • బహిరంగ సభలు కాదు
  • క్షేత్రస్థాయిపై దృష్టి పెట్టండి
ఒంగోలు: జిల్లాను అమరావతి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అందుకు అవసర మైన చర్యలు ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్‌ బం గారంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేసమయంలో కీలకమైన రాజకీయ వ్యవహారాలపైనా ఆరా తీశారు. ప్రధానంగా ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంపై దృష్టి సారించిన ఆయన కొండపి నేతలతో సూటిగా మాట్లాడి కొన్ని సూచన లు, హెచ్చరికలు చేశారు. చంద్రబాబు ఆలోచనను, ఆవేశా న్ని గమనించి కాబోలు వెనువెంటనే ఒంగోలు లోక్‌సభ రాజకీయ వ్యవహారాలపై పార్టీ నేతలు మాగుంట నివాసం లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఈనెల 12 నుంచి చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా నిర్ణయించు కున్నారు. మరోవైపు రామాయపట్నంలో జరిగిన జన్మభూమి సభ విజయవంతం కావడంతో ఎమ్మెల్యే పోతుల రామా రావును ముఖ్యమంత్రి అభినందించారు. అక్కడ హుషారు గా మాట్లాడారు. గత మూడేళ్లలో ఎన్నడూ లేని విధంగా అద్దంకి, పర్చూరు శాసనసభ్యులు కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి సాగర్‌ నీటి సమస్యను ప్రస్తావించారు. మ రోసారి నీరు ఇచ్చి తమ ప్రాంత రైతులను ఆదుకోవాలని వి జ్ఞప్తి చేశారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పాదాభివందనం చేసి తన కృతజ్ఞత ను తెలియజేసుకున్నారు.
 
 
సభ జయప్రదంతో ఉత్సాహం
జన్మభూమి పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం పట్ల ఆయన మరింత ఉత్సాహాన్ని ప్రదర్శించారు. శాసనసభ్యుడు పోతుల రా మారావు సారథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా క లెక్టర్‌ వినయ్‌చంద్‌ సంక్రాంతి పర్వదినం ఉట్టిపడే రీతిలో అ క్కడ కొన్ని ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. కొద్ది మాసాల క్రితం కందుకూరులో నిర్వహించిన బహిరంగ సభను కూడా శాసనసభ్యుడు పోతుల రామారావు దిగ్విజ యం చేసి ముఖ్యమంత్రి మన్ననలు పొందారు. అదేతరహా లో రామాయపట్నం సభ కూడా విజయవంతమైంది. సభ కు తరలి వచ్చిన జనాన్ని చూసిన తర్వాత విమర్శకులు సైతం సైలెంట్‌ అయ్యారంటే అతిశయోక్తి కాదు. ముఖ్య మంత్రి చంద్రబాబు కూడా పోతుల రామారావును అభినందించి భుజం తట్టారు.
 
 
కొండపిపై చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్తంత అవకాశం దొరికిన సమయంలో జిల్లాలో పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించి సమీక్ష చేశారు. ప్రధానంగా కొండపి అసెంబ్లీ నియోజక వర్గంలో పార్టీ వ్యవహాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తొలుత ఎమ్మెల్యే స్వామి, యువనాయకుడు సత్య వద్ద ప్ర స్తావించిన ఆయన అనంతరం ఆ నియోజకవర్గానికి చెంది న కందుకూరు, ఒంగోలు శాసనసభ్యులు పోతుల రామా రావు, దామచర్ల జనార్దన్‌ను పిలిపించుకొని కొండపిపై సమీక్షించారు. మధ్యాహ్న సమయంలో బస్సులో ఆయన్ను ఎమ్మెల్యే స్వామి, దామచర్ల సత్య కలిసి ఒకరికి సీఎం సహా య నిధి రుణాన్ని మంజూరు చేయాలని కోరారు. ఓకే అన్న ఆయన ‘ఇంతకీ కొండపి ఎలా ఉంది? అంతా సెట్‌ అయిందా. మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు’? అని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన స్వామి, సత్య అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని, ముఖ్య నాయకులతో సమావేశం కావడంతోపాటు సంగమేశ్వరంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించామని వారు చెప్పినట్లు తెలిసింది.
 
 
దీనిపై స్పందించిన చంద్రబాబు ‘ఇక్కడ మనకు కావాల్సింది బహిరంగ సభలు కాదు. అవసరమైన వ్యక్తుల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం కావాలి. మనస్పర్థలు పోవాలి. ఆ రకమైన సమీక్షలు జరగాలి. తద్వారా మరింత ఫలితం సాదించాలి. అలా ముందుకు నడవండి’ అని సూచించినట్లు తెలిసింది. మేమే గొప్ప అన్న వైఖరిలో ఎవరైనా ఉంటే విడనాడండి అని కూడా సూచించినట్లు తెలిసింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంగోలు ఎమ్మెల్యే జానార్దన్‌, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావును అక్కడికి పిలిపించుకున్నారు. పరిస్థితి ఏమిటి? అని వారిని ప్రశ్నించారు. వెంటనే దామచర్ల జోక్యం చేసుకొని కొన్ని చోట్ల మండల స్థాయి, మరికొన్ని చోట్ల గ్రామస్థాయిలో కొందరు నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాల్సి ఉందని, ఆదిశగా అడుగు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి నట్లు తెలిసింది. పోతుల మాట్లాడుతూ ఓసారి తన వద్దకు వచ్చి ఆత్మీయ సమ్మేళనానికి రావాలని కోరారని, ఆ తర్వాత ఓ మిత్రుడి ద్వారా కలిసి మాట్లాడుకుందామని సమాచారం పంపగా తాను ఓకే చెప్పానన్నారు. కానీ, ఆవిధంగా కాకుండా మరొకరితో కలిసి వచ్చారని చెప్పినట్లు తెలిసింది. తాను ఒక ప్రతిపాదన చేయగా ఆలోచించి చెప్తామన్న వారు తిరిగి తన వద్దకు రాలేదని తెలియజేసినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి ‘ఏది ఏమైనా ఒంగోలు లోక్‌సభ పరిధిలో కొండపి కీలకమైన నియోజకవర్గం. మీరందరూ కలిసి పని చేస్తే కనీసం 40వేల ఓట్ల ఆధిక్యం వస్తుంది. నేను సేకరించుకున్న సమాచారానికి అనుగుణంగానే ఈ మాట చెప్తున్నా. మీరంతా కలిసి పని చేసి దాన్ని సాధించాల్సిందే. అందుకు అవసరమైన చర్యలు తీసుకోండి’ అని అందరికీ సూటిగా చెప్పినట్లు తెలిసింది.
 
 
మాగుంట నివాసంలో ప్రత్యేక భేటీ
ముఖ్యమంత్రి జిల్లా నుంచి వెళ్లిన రెండు గంటలకే పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావుతోపాటు మాగుంట, కరణం బలరాం, దామచర్ల జనార్దన్‌, ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు దివి శివరాం పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు వారి మధ్య ప్రధానంగా ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అ సెంబ్లీ సెగ్మెంట్‌లలో పరిస్థితులపై చర్చించుకున్నారు. ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి తదితర నియోజక వర్గాలపై ప్రత్యేకంగా వారు సమీక్షించుకున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మాగుంట గెలుపే ధ్యేయంగా చేపట్టాల్సిన చర్యలపై తాత్కాలికంగా ఒక నివేదిక రూపొందించుకున్నారు. అందుకు అనుగుణం గా ఈనెల 12 నుంచి ముఖ్యనేతలంతా కలిసి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే రామాయపట్నంలో ముఖ్యమంత్రి వీరికి ప్రత్యేకంగా ఏమైనా హెచ్చరికలు చేశారా? లేక కొండపి సమీక్ష రూపంలో ఇచ్చిన సూచనతో వీరు వెంటనే భేటీ అయ్యారా? అన్నది తెలియరా లేదు.
 
 
తొలిసారి గొట్టిపాటి, ఏలూరి కలిసి సీఎంకు వినతి
పక్కపక్క నియోజకవర్గాలైన అద్దంకి, పర్చూరు శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు తొలిసారి ఒక ప్రజా సమస్యపై కలిసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం విశేషం. ఎమ్మెల్యే రవికుమార్‌ టీడీపీలో చేరిన తర్వాత నుంచి కూడా వివిధ కారణాల వలన ఈ ఇద్దరు కలిసిన దాఖలాలు లేవు. అదేసమయంలో ఒకరినొకరు వ్యతిరేకించుకోవడం, విభేదించుకోవడం కానీ జరగలేదు. గత కొంతకాలం నుంచి ఎక్కడ వారు తటస్థ పడినా రవికుమార్‌ను ముందుగా ఏలూరి పలుకరించడం జరుగుతోంది. మరోవైపు రవికుమార్‌ కూడా తన స్వగ్రామ మైన యద్దనపూడి వారు కానీ, పర్చూరు నియోజకవర్గం లోని తన అనుచరులు కానీ కలిసినప్పుడు ‘నేను ఇప్పుడు టీడీపీలో ఉన్నా. నియోజకవర్గం వేరైనా మీరు టీడీపేకే చేయాలి’ అని చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బుధ వారం సీఎం చంద్రబాబు రామాయపట్నంలో కార్యక్రమాల అనంతరం తిరిగి అమరావతికి వెళ్లే సమయంలో హెలిప్యా డ్‌ వద్ద వారిద్దరూ కలిసి రెండు నియోజకవర్గాలకూ సమస్యగా మారిన సాగునీటి విషయాన్ని ప్రస్తావించారు. మరోసారి సాగర్‌ నీరు విడుదల చేయించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘నీటి సమస్య ఎలా ఉందో మీకూ తెలుసు. ఏమాత్రం అవకాశం ఉన్నా నీరిచ్చి రైతులను ఆదుకుందాం’ అని చెప్పారు. ఆ ఇద్దరూ కలిసి రావడం చూసి చిరునవ్వుతో బుజాలపై చేతులు వేసి అభినందించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...