Jump to content

prakasam politics


Recommended Posts

డీపీలో సర్వేల భయం.. అంతుచిక్కని అంతరంగం
15-07-2018 14:07:20
 
636672604373761785.jpg
  • గుబులు పుట్టిస్తున్న ఐవీఆర్‌ఎస్‌లు
  • పశ్చిమ ప్రాంతంపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి
ప్రజల మనోగతంపై ఓవైపు సర్వేలు. నేతల పనితీరుపై ఐవీఆర్‌ఎస్‌ ద్వారా పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాల సేకరణ. మధ్యలో ‘మారకపోతే మార్చేస్తా’! అంటూ అధినేత చంద్రబాబు హెచ్చరికలు. వెరసి టీడీపీ నేతల్లో కలవరం సృష్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌పై ధీమాగా ఉన్న వారిని డైలమాలో పడేస్తోంది. ఇటీవల జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో ముఖాముఖిలు కూడా నిర్వహించారు. లోపాలను ఎత్తిచూపుతూ సరిదిద్దుకోవాలని పలు సూచనలు చేశారు. పనితీరు బాగోలేని, ఆరోపణలు ఉన్న నేతలకు హెచ్చరికలు జారీ చేసిన ఆయన మారకపోతే మార్చేస్తానంటూ హెచ్చరించారు.
 
 
ఒంగోలు : జమిలి ఎన్నికలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల గడువు ఏడాదిలో ముగియనుంది. దీంతో విపక్షాల హడావుడితోపాటు టీడీపీలోనూ ఎన్నికల వేడి పెరిగింది. ప్రత్యేకించి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమం త్రి చంద్రబాబు జిల్లాలు, నియోజకవర్గాల వారీ పరిస్థితులపై స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. పార్టీలోకి కొత్తవారిని తీసుకోవటం, ప్రత్యర్థి పక్షంలోకూ ఎవ్వరూ వెళ్లకుండా చూ డటానికి ఆ పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తోంది. వారిని రాబట్టుకునేందుకు పావులు కదుపుతోంది. మాజీ మంత్రి మ హీధర్‌రెడ్డి వైసీపీలో చేరిన తర్వాత మరింత అప్రమత్తమైం ది. దీంతో పార్టీ కార్యకలాపాలు, పాలనా వ్యవహారాల్లో చురుగ్గా లేకపోయినా, సర్వేలలో తమ పరిస్థితి సానుకూలంగా లేకపోయినా ఇబ్బంది తప్పదేమోనన్న ఆలోచనకు ఆపార్టీలోని నాయకులొచ్చారు. జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పిలిపించుకుని విడివిడిగా భేటీ అయి కొన్ని అంశాలపై వారి నుంచి స్పష్టత తీసుకున్నారు. ఆ తర్వాత కందుకూరు, కనిగిరి శాసనసభ్యులు పోతుల రామారావు, కదిరి బాబూరావులతో విడివిడిగా మాట్లాడారు. ఇక జిల్లాలోని నాయకులందరితో నిర్వహించిన సమావేశంలోనూ, ఆ తర్వాత విడివిడిగా భేటీ అయిన సందర్భంలోనూ పలు హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్‌లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్న సంకేతాలు ఇచ్చారు.
 
 
సర్వేలపై ప్రత్యేక ప్రస్తావన
అనునిత్యం వివిధ రూపాల్లో చేయిస్తున్న సర్వేలను ఉ టంకిస్తూ సీఎం చేసిన సూచనలు, హెచ్చరికలు టీడీపీ నా యకుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అందిన సమాచారం మేరకు ఇటీవల కాలంలో పార్టీపరమైన సర్వేలతో పాటు రెండు సంస్థలతో కూడా ముఖ్యమంత్రి వేర్వేరుగా సర్వేలు చేయించినట్లు తెలిసింది. అలాగే ఒక టీవీ చానల్‌తో అనుబంధంగా సర్వేలు నిర్వహించే ఒక జాతీయ స్థాయి సంస్థతోనూ సర్వే చేయించారు. కేవలం ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సం బంధించిన పరిస్థితులపైనే వాటి ద్వారా సర్వే చేయించినట్లు వెల్లడవుతోంది. వీటికి తోడు ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు ఇటీవల అధికమయ్యాయి. ఈ మధ్యకాలంలో తెలుగుదేశంలో వివిధ స్థాయిల్లో ఉన్న కార్యకర్తలు, నాయకులకు ‘మీ శాసనసభ్యుడు లేక మీ ఇన్‌చార్జి పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి’ అంటూ ఫోన్‌లు వస్తున్నాయి. వారి చెప్పిన సమాధానా న్ని అవతల వారు నోట్‌ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పనితీరు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపైనే ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ఎక్కువగా ప్రశ్నలు అడిగేవారు.
 
అయితే తాజాగా.. ఆయా నియోజకవర్గాల వారీ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల పనితీరుపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకునేలా ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వేలు, ఇతర పరిస్థితుల గు రించి హెచ్చరికలు చేసి పంపించిన తరుణంలోనే నియోజకవర్గాల్లో సర్వేలు జరుగుతుండటం నాయకులను ఆందోళన కు గురి చేస్తోంది. ఈ సర్వేలు ఆధారంగా పనితీరుని అంచ నా వేస్తామని వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ విషయంలో అదే కొల మానమని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆపార్టీ నేతలంతా ఆ వైపు దృష్టి సారించారు. పనిలో పనిగా సర్వేల్లో తమ పనితీరును చక్కదిద్దుకునే ప్రయత్నాలకు కూడా కొందరు శ్రీకారం పలకటం విశేషం. ప్రభుత్వ గూఢచార శాఖ కూడా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకొన్ని కొందరు నేతలు మా పరిస్థితి ఎలా ఉందంటూ ఆ శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణ లు చేయటం కూడా కనిపిస్తోంది.
 
 
పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి
టీడీపీ అధిష్ఠానం పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల జిల్లా నాయకుల తో నిర్వహించిన సమావేశాల్లోనూ, కొందరు నేతలు చంద్రబాబును వ్యక్తిగతంగా భేటీ అయిన సందర్భంలోనే ఇదే అంశం చర్చనీయాంశమైనట్లు తెలిసింది. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డితో ముఖ్యమంత్రి సమావేశమైన రెండు మూడు సందర్భాల్లోనూ పశ్చి మప్రాంత నియోజకవర్గాలపైనే ప్రధాన చర్చ నడిచినట్లు సమాచారం. గత ఎన్నికల్లో పశ్చిమప్రాంతంలోని మార్కాపురం డివిజన్‌లో ఉన్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందగా దర్శి, కనిగిరిలలో టీడీపీ బొటాబొటి ఆధిక్యంతో బయటపడింది. ఒంగోలు లోక్‌సభను సైకిల్‌ కైవ సం చేసుకోవాలంటే ఆ నియోజకవర్గాలే కీలకం. దీంతో పశ్ఛి మ ప్రాంతంలో పరిస్థితులను నియోజకవర్గాల వారీ సమీక్షించి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిస్థితిని ఎలా మెరుగుపరచుకోవాలన్న విషయంలో ఎమ్మెల్యే డేవిడ్‌రాజు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని చెప్పినట్లు తెలిసింది.
 
 
మార్కాపురం నియోజకవర్గంలో మరికొందరిని చేర్చుకోవాలన్న ఆలోచనలో ఆపార్టీ ఉంది. గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికి పూర్తి స్వేచ్ఛనిస్తూనే గతంలో పార్టీలో ఉన్న మాజీలు కొందరిని చేరదీయాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. దర్శి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించబోమని మంత్రి శిద్దాకు ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకు అనుగుణ ంగానే ఇటీవల ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తుండటం అందుకు నిదర్శనం. కనిగిరిలో బాబూరావుకి ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు మాజీలను టీడీపీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీ కొన్ని నిర్ణయాలను ప్రకటించిన ముఖ్యమంత్రి ఒంగోలుతో పాటు కందుకూరు డివిజన్‌లోని దక్షిణ ప్రాంత నియోజకవర్గాలపై ప్రత్యేక చర్యలకు రంగం సిద్ధం చేసుకున్నారు. కందుకూరు, కొండపి అలాగే ఒంగోలు, సంతనూతలపాడు, మరోవైపు పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గాలను మూడు విభాగాలుగా ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్థులు, ఇతర నాయకులు సమన్వయంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ కరణం బలరాం కుమారుడు వెంకటే‌ష్‌ని ఎలా కలుపుకుపోవాలన్న అంశంపై అధిష్ఠానం దృష్టి సారించింది. దీంతో రానున్న రోజుల్లో ఆయా సర్వేలకు అనుగుణంగా ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతోతాయోనన్న గుబులు టీడీపీ నాయకులను వెంటాడుతోంది.
Link to comment
Share on other sites

  • Replies 123
  • Created
  • Last Reply
  • 3 weeks later...
క్లారిటీ ఇచ్చిన వైసీపీ నేత బూచేపల్లి
04-08-2018 11:09:41
 
636689777828948329.jpg
  • జగన్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటా
  • మాజీఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి
ముండ్లమూరు/ఒంగోలు : వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహ న్‌రెడ్డి దర్శి వైసీపీ అభ్యర్థిగా ఎవరు నిర్ణయించిన వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ ఎంఎల్‌ఏ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి ముండ్లమూరులోని పలువురి కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డికి అనారోగ్యంకారణం వల్ల కొంతదూరంగా ఉండవలసి వచ్చిందన్నారు. పార్టీకి సేవచేసే వ్యక్తులు ఉండవలసి ఉండడంతో, జగన్‌ మోహన్‌రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ చెప్పిన నిర్ణయాన్ని కట్టుబడి ఉండడం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రతిష్ట కోసం కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఆయన వెంట సూదిదేవర అంజయ్య, ఎం. వెంకట రమణారెడ్డి, బి.నాగిరెడ్డి, మాజీ సర్పంచ్‌ చింతా శ్రీనివాసరెడ్డి, జి.వెంకటప్పరెడ్డి, ఎస్‌.సుబ్బయ్య, డి.సుబ్బారెడ్డి, జె.హనుమంతరావు, షేక్‌ వలిబాషా తదితరులు ఉన్నారు.
 
 
ముండ్లమూరుకు చెందిన గోపనబోయిన చిన్నా కుమారుడు శ్రీరాం, పిల్లి బాలస్వామి కుమారుడు అరుణకుమారుడు గత నెలలో చిలకలేరు వాగులో ఈతకు వెళ్ళి మృతిచెందారు. శుక్రవారం ఇరువురి కుటుంబాలను పరామర్శించి గోపనబోయిన చిన్నాకు రూ.25వేలు, పిల్లి బాలస్వామికి రూ.25వేలు ఆర్థికసహాయం అందజేశారు. రాగిపిండి నాగేశ్వరరెడ్డిని పరామర్శించాడు, బీసీ కాలనీలో జె.నాగేశ్వరరావు అనేచిన్నారి చనిపోవడంతో తండ్రి మోహన్‌రావును పరామర్శించారు. వేంపాడులో ఐదు కుటుంబాలను పరామర్శించాడు. ఆయన వెంట మండల వైసీపీ కన్వీనర్‌ సూదిదేవర అంజయ్య, సోమేపల్లి సుబ్బయ్య, మేడగం వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచులు చింతా శ్రీనివాసరెడ్డి, జి.వెంకటప్పరెడ్డి, అన్నపురెడ్డి భిక్షలారెడ్డి, బి.నాగిరెడ్డి, మేడగం వెంకటరమణారెడ్డి, ఎ.అంజిరెడ్డి, ఇరుగుల కొండారెడ్డి, షేక్‌ వలిభాషా, జి. ఆదినారాయణ, గుంటుపల్లి శ్రీనివాసరావు, వసంత, సుబ్బారావు, టి. ప్రభుదాసు, బద్రి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
టీడీపీలోకి ఆయన ఎంట్రీ ఫిక్స్.. మరి బాలయ్య ఫ్రెండ్ ఏం చేయబోతున్నారు?
24-08-2018 15:10:47
 
636707202497083709.jpg
  • టీడీపీలోకి ఉగ్ర
  • పార్టీలో చేరికకు లైన్‌ క్లియర్‌
  • ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ
  • 45 నిమిషాల పాటు చర్చలు
  • కనిగిరిలోనూ పలమనేరు సూత్రం పాటించే అవకాశం
  • పరిస్థితి గమనిస్తున్న బాబూరావు
  • కృతజ్ఞతలు చెప్పేందుకే కలిశానంటున్న నరసింహారెడ్డి
కనిగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో చేరికకు లైన్‌ క్లియర్‌ అయింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య సుదీర్ఘ చర్చ సాగింది. పలు అంశాలపై స్పష్టత వచ్చిన అనంతరం ఆయన పార్టీలో చేరికకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావుతో చర్చించి ముహూర్తం ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
 
 
ప్రకాశం జిల్లాలో పార్టీ వ్యవహారాలపై స్వీయ పర్యవేక్షణ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేగంగా పావులు కదుపుతున్నారు. ముందుగా పార్టీలో ఉన్న ముఖ్య నేతలతో పలు దఫాలు భేటీ అయి పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను ప్రారంభించిన ఆ యన ఇప్పుడు కొత్తగా పార్టీలో చేర్చుకునే నాయకులపై దృష్టి సారించారు. అందులో భాగంగా గురువారం కనిగిరి మాజీ శాసనసభ్యుడు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో చర్చలు జరిపారు. అమరావతిలోని నివాసంలో తనను కలసిన డాక్టరు ఉగ్రతో సుమారు 45 నిమిషాలు ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రను పార్టీలో చేర్చుకునేందుకు ఆయన లైన్‌ క్లియర్‌ చేసినట్లు తెలిసింది. శాసనసభ్యుడు కదిరి బాబూరావుతో కూడా చర్చించి ముహూర్తం ఖరారు చేయనున్నట్లు సమాచారం.
 
ఒంగోలు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కనిగిరి మాజీ శాసనసభ్యుడైన డాక్టరు ఉగ్ర నరసింహారెడ్డి కొంతకాలం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. తొలి నుంచి కనిగిరి నియోజకవర్గంలో సేవాకార్యక్రమాలు నిర్వహించే ఆయన గత ఎన్నికల తర్వాత ఉగ్రసేన పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న మాజీ మంత్రి మహీధరరెడ్డితో పాటు ఉగ్రను కూడా పార్టీలో చేర్చుకునే విషయమై టీడీపీలో కొంతకాలం నుంచి తర్జన భర్జలను జరిగాయి. వారిద్దరు నేతలు అధికార పార్టీలో చేరే అవకాశం ఉందని, వారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారని గత ఏప్రిల్‌లో కొంత కాలం ప్రచారం కూడా సాగింది. అయితే అనూహ్యంగా నెల క్రితం మహీధరరెడ్డి వైసీపీలో చేరారు.
 
 
ఉగ్రకు టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఫోన్‌
ఈ నేపథ్యంలో డాక్టరు ఉగ్రనరసింహారెడ్డికి చంద్రబాబు నాయుడును కలవాలని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో గురువారం ఉదయం ఆయన సీఎంను కలిశారు. సుమారు 45 నిమిషాల సేపు ఉగ్రతో మాట్లాడిన ముఖ్యమంత్రి అనేక అంశాలపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రారంభం నుంచి నియోజకవర్గంలో తాను చేపట్టిన సేవా కార్యక్రమాలను, శాసనసభ్యుడిగా సాధించిన అభివృద్ధిని, ప్రస్తుతం ఉగ్రసేన పేరుతో చేస్తున్న కార్యక్రమాలను, తద్వారా ప్రజలతో కొనసాగిస్తున్న సత్సంబంధాలను ముఖ్యమంత్రి దృష్టికి ఉగ్ర తీసుకెళ్లినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి వివిధ అంశాలపై అడిగి మరీ సమాచారం తెలుసుకున్నట్లు సమాచారం.
 
అలాగే నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ప్రభుత్వం చేసిన, చేయాల్సిన అభివృద్ధి పనుల విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాజకీయంగా మీ నాయకత్వంలో పనిచేయాలన్న ధృఢ నిర్ణయంతో ముందుకు వచ్చానని డాక్టరు ఉగ్ర స్పష్టం చేయగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెల్‌డన్‌ అంటూ భుజం తట్టినట్లు చెప్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పార్టీలో చేరికకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూనే అందరితో మాట్లాడి సానుకూల వాతావరణంతో ముందుకుపోదామని చెప్పినట్లు సమాచారం.
 
 
పలమనేరు సూత్రంతో ముందుకు
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పార్టీలో ఉన్న నాయకుల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు ఉపయోగించిన సూత్రాన్నే కనిగిరిలో కూడా ప్రయోగించాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. పలమనేరులో ఉన్న ముగ్గురు ముఖ్య టీడీపీ నాయకుల్లో ఒకరికి ఎమ్మెల్యే టిక్కెట్టు, మరొకరికి ఎమ్మెల్సీ పదవి, ఇంకొకరికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని కేటాయిస్తూ అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. అలాగే కనిగిరిలో కూడా ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఇటు మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిల్లో ఒకరికి ఎమ్మెల్యే టిక్కెట్టు, మరొకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే డాక్టరు ఉగ్రతో ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడగా ఈ విషయమై గతంలో ఎమ్మెల్యే కదిరి బాబూరావుతో కూడా కొంతమేర చర్చించినట్లు చెప్తున్నారు. తిరిగి పార్టీ రాష్ట్ర నాయకులు అవసరమైన సమయంలో బాబూరావుతో కూడా మాట్లాడి ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్ణీత సమయం ప్రకారం వచ్చే ఏప్రిల్‌, మేలో జరిగే అవకాశం ఉన్నందున పరిస్ధితులను చక్కదిద్దుకుని చేరికల కార్యక్రమానికి శ్రీకారం పలకాలన్న ఉద్దేశంలో టీడీపీ అధిష్ఠానం ఉంది.
 
 
పరిస్థితిని గమనిస్తున్న బాబూరావు
ముఖ్యమంత్రిని డాక్టరు ఉగ్ర కలిసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాబూరావు జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు తెలిసింది. సినీ నటుడు బాలకృష్ణతో ఉన్న స్నేహంతో తన భవిష్యత్‌ను చక్కదిద్దుకునే ఆలోచనలో ఆయన ఉన్నట్లు అనుచరులు చెప్తున్నారు. అయితే నియోజకవర్గంతో పాటు జిల్లా రాజకీయ వర్గాల్లో కూడా సీఎంను ఉగ్ర కలవటం చర్చనీయాంశమైంది.
 
 
కృతజ్ఞతలు చెప్పేందుకే కలిశా: ఉగ్ర
కృతజ్ఞతలు చెప్పేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు డాక్టరు ఉగ్ర ఆంధ్రజ్యోతి ప్రతినిధికి తెలిపారు. భేటీలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించగా తన సతీమణి డాక్టరు కవితకు ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆ మేరకు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు. టీడీపీలో చేరిక విషయాన్ని ప్రస్తావించగా తాను రాజకీయాల్లో ఉన్నందున ఇలాంటివి చర్చకు రావటం సహజమేనన్నారు.
Link to comment
Share on other sites

6 hours ago, sonykongara said:
టీడీపీలోకి ఆయన ఎంట్రీ ఫిక్స్.. మరి బాలయ్య ఫ్రెండ్ ఏం చేయబోతున్నారు?
24-08-2018 15:10:47
 
636707202497083709.jpg
  • టీడీపీలోకి ఉగ్ర
  • పార్టీలో చేరికకు లైన్‌ క్లియర్‌
  • ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ
  • 45 నిమిషాల పాటు చర్చలు
  • కనిగిరిలోనూ పలమనేరు సూత్రం పాటించే అవకాశం
  • పరిస్థితి గమనిస్తున్న బాబూరావు
  • కృతజ్ఞతలు చెప్పేందుకే కలిశానంటున్న నరసింహారెడ్డి
కనిగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో చేరికకు లైన్‌ క్లియర్‌ అయింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య సుదీర్ఘ చర్చ సాగింది. పలు అంశాలపై స్పష్టత వచ్చిన అనంతరం ఆయన పార్టీలో చేరికకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావుతో చర్చించి ముహూర్తం ఖరారు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
 
 
ప్రకాశం జిల్లాలో పార్టీ వ్యవహారాలపై స్వీయ పర్యవేక్షణ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేగంగా పావులు కదుపుతున్నారు. ముందుగా పార్టీలో ఉన్న ముఖ్య నేతలతో పలు దఫాలు భేటీ అయి పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను ప్రారంభించిన ఆ యన ఇప్పుడు కొత్తగా పార్టీలో చేర్చుకునే నాయకులపై దృష్టి సారించారు. అందులో భాగంగా గురువారం కనిగిరి మాజీ శాసనసభ్యుడు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో చర్చలు జరిపారు. అమరావతిలోని నివాసంలో తనను కలసిన డాక్టరు ఉగ్రతో సుమారు 45 నిమిషాలు ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రను పార్టీలో చేర్చుకునేందుకు ఆయన లైన్‌ క్లియర్‌ చేసినట్లు తెలిసింది. శాసనసభ్యుడు కదిరి బాబూరావుతో కూడా చర్చించి ముహూర్తం ఖరారు చేయనున్నట్లు సమాచారం.
 
ఒంగోలు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కనిగిరి మాజీ శాసనసభ్యుడైన డాక్టరు ఉగ్ర నరసింహారెడ్డి కొంతకాలం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. తొలి నుంచి కనిగిరి నియోజకవర్గంలో సేవాకార్యక్రమాలు నిర్వహించే ఆయన గత ఎన్నికల తర్వాత ఉగ్రసేన పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న మాజీ మంత్రి మహీధరరెడ్డితో పాటు ఉగ్రను కూడా పార్టీలో చేర్చుకునే విషయమై టీడీపీలో కొంతకాలం నుంచి తర్జన భర్జలను జరిగాయి. వారిద్దరు నేతలు అధికార పార్టీలో చేరే అవకాశం ఉందని, వారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారని గత ఏప్రిల్‌లో కొంత కాలం ప్రచారం కూడా సాగింది. అయితే అనూహ్యంగా నెల క్రితం మహీధరరెడ్డి వైసీపీలో చేరారు.
 
 
ఉగ్రకు టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఫోన్‌
ఈ నేపథ్యంలో డాక్టరు ఉగ్రనరసింహారెడ్డికి చంద్రబాబు నాయుడును కలవాలని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో గురువారం ఉదయం ఆయన సీఎంను కలిశారు. సుమారు 45 నిమిషాల సేపు ఉగ్రతో మాట్లాడిన ముఖ్యమంత్రి అనేక అంశాలపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రారంభం నుంచి నియోజకవర్గంలో తాను చేపట్టిన సేవా కార్యక్రమాలను, శాసనసభ్యుడిగా సాధించిన అభివృద్ధిని, ప్రస్తుతం ఉగ్రసేన పేరుతో చేస్తున్న కార్యక్రమాలను, తద్వారా ప్రజలతో కొనసాగిస్తున్న సత్సంబంధాలను ముఖ్యమంత్రి దృష్టికి ఉగ్ర తీసుకెళ్లినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి వివిధ అంశాలపై అడిగి మరీ సమాచారం తెలుసుకున్నట్లు సమాచారం.
 
అలాగే నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ప్రభుత్వం చేసిన, చేయాల్సిన అభివృద్ధి పనుల విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాజకీయంగా మీ నాయకత్వంలో పనిచేయాలన్న ధృఢ నిర్ణయంతో ముందుకు వచ్చానని డాక్టరు ఉగ్ర స్పష్టం చేయగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెల్‌డన్‌ అంటూ భుజం తట్టినట్లు చెప్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పార్టీలో చేరికకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూనే అందరితో మాట్లాడి సానుకూల వాతావరణంతో ముందుకుపోదామని చెప్పినట్లు సమాచారం.
 
 
పలమనేరు సూత్రంతో ముందుకు
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పార్టీలో ఉన్న నాయకుల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు ఉపయోగించిన సూత్రాన్నే కనిగిరిలో కూడా ప్రయోగించాలన్న ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. పలమనేరులో ఉన్న ముగ్గురు ముఖ్య టీడీపీ నాయకుల్లో ఒకరికి ఎమ్మెల్యే టిక్కెట్టు, మరొకరికి ఎమ్మెల్సీ పదవి, ఇంకొకరికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని కేటాయిస్తూ అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. అలాగే కనిగిరిలో కూడా ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఇటు మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిల్లో ఒకరికి ఎమ్మెల్యే టిక్కెట్టు, మరొకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే డాక్టరు ఉగ్రతో ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడగా ఈ విషయమై గతంలో ఎమ్మెల్యే కదిరి బాబూరావుతో కూడా కొంతమేర చర్చించినట్లు చెప్తున్నారు. తిరిగి పార్టీ రాష్ట్ర నాయకులు అవసరమైన సమయంలో బాబూరావుతో కూడా మాట్లాడి ముందుకు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్ణీత సమయం ప్రకారం వచ్చే ఏప్రిల్‌, మేలో జరిగే అవకాశం ఉన్నందున పరిస్ధితులను చక్కదిద్దుకుని చేరికల కార్యక్రమానికి శ్రీకారం పలకాలన్న ఉద్దేశంలో టీడీపీ అధిష్ఠానం ఉంది.
 
 
పరిస్థితిని గమనిస్తున్న బాబూరావు
ముఖ్యమంత్రిని డాక్టరు ఉగ్ర కలిసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాబూరావు జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు తెలిసింది. సినీ నటుడు బాలకృష్ణతో ఉన్న స్నేహంతో తన భవిష్యత్‌ను చక్కదిద్దుకునే ఆలోచనలో ఆయన ఉన్నట్లు అనుచరులు చెప్తున్నారు. అయితే నియోజకవర్గంతో పాటు జిల్లా రాజకీయ వర్గాల్లో కూడా సీఎంను ఉగ్ర కలవటం చర్చనీయాంశమైంది.
 
 
కృతజ్ఞతలు చెప్పేందుకే కలిశా: ఉగ్ర
కృతజ్ఞతలు చెప్పేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు డాక్టరు ఉగ్ర ఆంధ్రజ్యోతి ప్రతినిధికి తెలిపారు. భేటీలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించగా తన సతీమణి డాక్టరు కవితకు ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆ మేరకు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు. టీడీపీలో చేరిక విషయాన్ని ప్రస్తావించగా తాను రాజకీయాల్లో ఉన్నందున ఇలాంటివి చర్చకు రావటం సహజమేనన్నారు.

Endhuku eyana waste akkada elagu TDP ki veyaru reddies no point in taking him 

Link to comment
Share on other sites

  • 4 weeks later...

పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారు హాయ్ ల్యాండ్ లో నియోజకవర్గానికి చెందిన 56 మంది ద్వితీయ శ్రేణి నాయకులతో రహస్య సమావేశం నిర్వహించారు తనకు టిక్కెట్టు రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయం మీదనే సమావేశం జరిగింది

Link to comment
Share on other sites

2 minutes ago, AndhraBullodu said:

ikkada aa addanki mla ravi kumar parama corrupt antaga, oka 1-2 nelala kritham vaadi avineethi bayata pettinandhuku evaro journalist meedha vaadi anno/tammudo hatya yatnam kooda chesaadu anukunta.

But he is very smart,  he can manage the issue 

Link to comment
Share on other sites

4 minutes ago, AndhraBullodu said:

em sachundo, baaga avineethi parudani choosa, ycp nundi tdp loki dhookaadu anukunta. monna vaartha vachindhi cbn ticket ichaelaa ledhu, malli ycp loki choosthunnadu ani.

elaanti avineethi parulani protsahinchakoodadhu. paiga, evaru etu gelistae atu velle rakam.

Annai nuv ekkada chusav aa vaartha ni..Cbn first nundi ravi ke addanki seat ani  antante..

Link to comment
Share on other sites

15 minutes ago, Saichandra said:

He’s not ravi kumar hes ananchi krishna mohan,

avunavunu correct ga chepparu, thanks.

ee vaarthalu anni chadhivinappudu post chedham anukunte DB lo, appatiki naaku DB access ivvala. ee lopala peru marchipoyaa.

2014 lo independent ga kooda gelichaadanta, antha paluku badi undha ? vaarthallo choostunte, baaga corrupt and bad ani undhi.

 

Link to comment
Share on other sites

టీడీపీ వైపు చూస్తున్న ఆయన ఎవరు?
25-09-2018 15:25:07
 
636734859092279537.jpg
  • టీడీపీ వైపు ఐఏఎస్ చూపు
  • ప్రకాశం జిల్లా నుంచి పోటీ ఉత్సాహం
  • బాపట్ల పార్లమెంట్, రిజర్వుడు అసెంబ్లీ స్థానంపై ఆసక్తి
ఒంగోలు: టీడీపీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు ఓ ఐఏఎస్ అధికారి ఉత్సాహం చూపుతున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా ఆయన విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఆ మేరకు ఆయనను రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న అంశంపై కొన్ని నియోజకవర్గాల్లో సర్వే కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. దళిత సామాజికవర్గానికి చెందిన సదరు అధికారి టీడీపీ రాష్ట్ర ముఖ్యుల్లో ఒకరికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అందువలనే ఆయన పదవీకాలం పూర్తయినా పొడిగించడంతో ఇంకా కొనసాగుతున్నారు. ప్రకాశం జిల్లాలోని రాజకీయ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ముందుగా పార్లమెంట్ స్థానాలకు వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపే అభ్యర్థులపై పరిశీలన ప్రారంభించారు.
 
ఒంగోలు లోక్‌సభ స్థానానికి సంబంధించి ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డిని తిరిగి పోటీకి దించాలన్న యోచనతో పలుమార్లు ఆయనతో చర్చలు జరిపారు. అదే సమయంలో బాపట్ల లోక్‌సభ స్థానంపై కూడా పరిశీలన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ అధికారి పేరును పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలిసింది. దళిత సామాజిక వర్గానికి చెందిన సదరు అధికారి ఇటీవల వరకూ ప్రాధాన్యత కలిగిన ఒక శాఖకు కమిషనర్‌గా పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో టీడీపీ నేతల్లో ముఖ్యులైన ఒకరికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఇటీవల ఆయన పదవీకాలం పూర్తవడంతో పొడిగించి సమాచార శాఖ బాధ్యతలు అప్పగించారు. టీడీపీ తరపున పోటీకి ఆయన ఉత్సాహం ప్రదర్శించడంతో సదరు ముఖ్య నేత కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
 
 
ప్రకాశం జిల్లాతో పాటు, మరో జిల్లాలో కూడా రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేయాలని ఆ అధికారి భావిస్తున్నారు. అయితే ఆ జిల్లాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ప్రకాశంకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. ఈ సమయంలోనే లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీడీపీ ఒక సర్వే నిర్వహించింది. బాపట్ల లోక్‌సభ స్థానానికి సంబంధించి ప్రస్తుత ఎంపీ మాల్యాద్రితో పాటు, సదరు ఐఏఎస్ అధికారి, ఉన్నతాధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మరో వ్యక్తి పేరును కూడా పరిగణనలోకి తీసుకుని సర్వే చేసినట్లు సమాచారం. జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు ఎస్సీలకు రిజర్వుడు అయి ఉన్నందున ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించేందుకు కూడా ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొండపి నుంచి తిరిగి పోటీకి ఎమ్మెల్యే స్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్ఠానం, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోయింది. ఈ నేపథ్యంలో సదరు అధికారి తనకు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకైనా అవకాశం ఇవ్వాలని పార్టీ ముఖ్య నాయకుడిని కోరినట్లు తెలిసింది.
 
సదరు అధికారి పేరును అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకుని సర్వేలో చేర్చడం రాజకీయ వర్గాల్లో, ప్రత్యేకించి అధికార పార్టీ ముఖ్య నాయకుల్లో చర్చనీయాంశమైంది. కొందరు ఇటు బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రెండు జిల్లాలకు చెందిన కొందరు నాయకులు, జిల్లాలోని ఒకరిద్దరు నేతలు కూడా సదరు అధికారితో ఇటీవల సత్సంబంధాలు పెంచుకుంటుండటం విశేషం. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సదరు అధికారి మరింత సన్నిహితంగా మెలుగుతున్నారు. దీంతో ఆ అధికారి జిల్లా నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయన్న భావన వ్యక్తమవుతోంది. ఇది అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేందుకే చంద్రబాబు ఈ ప్లాన్ చేశారా..?
13-10-2018 12:46:40
 
636750316736897791.jpg
ఒంగోలు: జిల్లాలో పార్టీ వ్యవహారాలను స్వీయ పర్యవేక్షణ చేస్తున్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంగోలు లోక్‌సభ స్థానంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. ఆమేరకు ఈనెల 15వతేదీ ఆయన ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నాలుగైడు అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేక సమీక్ష చేయనున్నారు. ఆ మేరకు అధిష్ఠానం నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా శుక్రవారం ఒంగోలులో జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు శుక్రవారం పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్‌ ఆస్తులపై ఐటీ దాడులు చేయడం నేతల్లో మరింత కలకలం రేకెత్తించింది. రెండ్రోజుల క్రితమే సీఎం జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలకు ఐటీ దాడులపై అధైర్యపడొద్దని చెప్పి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రమేష్‌ ఆస్తులపై జరిగిన దాడి టీడీపీకి చెందిన వ్యాపారులను ఆందోళనకు గురి చేస్తోంది.
 
సమీక్షకు ఏర్పాట్లు
ఒంగోలులో సోమవారం జరిగే ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరవుతున్న విషయం విదితమే. ఆ కార్యక్రమ అనంతరం రాత్రికి ఆయన ఒంగోలులోనే బస చేస్తారని, కొన్ని నియోజక వర్గాల పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని పార్టీ జిల్లా నాయకులకు సమాచారం అందింది. దీంతో ఇక్కడ ఏ-1 కన్వెన్షన్‌ హాలులో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర పార్టీ నుంచి ఒంగోలు లోక్‌సభ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల సమీక్షకు ఏర్పాట్లు చేయాలని జిల్లా నాయకులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఆమేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడైన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకర్గాల సమీక్షకు ఏర్పాట్లు చేయాలని జిల్లా నాయకులు తీర్మానించారు. శుక్రవారం అమరావతిలో జరగాల్సిన ఎస్‌.ఎన్‌.పాడు నియోజకవర్గ సమావేశాన్ని కూడా సోమవారం నిర్వహించాలన్న అంశంపై నాయకుల మధ్య చర్చ జరిగింది.
 
అయితే అక్కడి ఇన్‌చార్జి బి.ఎన్‌. విజయ్‌కుమార్‌ మా నియోజకవర్గ సమావేశాన్ని అమరావతిలోనే ఏర్పాటు చేసుకుంటామని, సీఎం సమయం ఎక్కువ కావాల్సి ఉందని తెలిపారు. దీంతో రాష్ట్ర పార్టీ నుంచి అందిన సూచన మేరకు ఒంగోలు లోక్‌సభ పరిధిలోని ఆ నాలుగు నియోజకవర్గాల సమీక్షకు నిర్ణయం తీసుకున్నారు. ఈ దశలో మార్కాపురం ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి జోక్యం చేసుకుని మా నియోజకవర్గాలపైనే సమీక్ష ఎందుకు? మాకు ఎక్కువ నిధులు ఇచ్చారనా.. మరేదైనా కారణం ఉందా? అంటూ జిల్లా అధ్యక్షుడిని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో అధిష్ఠానం సూచన మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని, మరోసారి మాట్లాడి వారు సూచించిన అసెంబ్లీ నియోజకవర్గాల వారికి సమాచారం ఇస్తామని దామచర్ల సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
 
మాగుంట సూచన మేరకే..
గతంలో రెండుమూడు పర్యాయాలు సీఎంని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కలిశారు. ఆ సందర్భంగా ఒకట్రెండ్రోజులు జిల్లాల్లో ఉండి అన్ని నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడాలని కోరారు. ప్రత్యేకించి పశ్చిమప్రాంతంలోని నియోజకవర్గాల రాజకీయ, సామాజిక అంశాలను ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గాల వారీ సమీక్ష చేయాలని కోరి ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అవసరమైన నియోజకవర్గాల సమీక్షలను రాజధాని లోనే నిర్వహిస్తున్నారు. అయితే మాగుంట గతంలో చేసిన సూచనను దృష్టిలో ఉంచుకొని సోమవారం రాత్రికి ఒంగోలులోనే బస చేసి సమీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీ పరిస్థితులపై కూడా ఒక అవగాహనతో ఉన్న పార్టీ అధిష్ఠానం అందుకు అనుగుణంగానే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్షకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
అయితే ఈ సమీక్షా సమావేశాల్లో కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ప్రాధాన్యం ఇస్తారని, వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై ఇక్కడ ఎలాంటి సమీక్షకు తావుండదని తెలిసింది. కార్యకర్తలు చెప్పే అంశానికి కూడా ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, ఇన్‌చార్జిలు సమీక్షా సమావేశానికి సన్నద్ధమవుతున్నారు. కాగా, ప్రతి నియోజకవర్గం నుంచి ఏ స్థాయి హోదాలో ఉన్న వారు హాజరు కావాలో కూడా రాష్ట్ర పార్టీ సూచిస్తుందని, ఆప్రకారమే హాజరు కావాల్సి ఉంటుందని చెప్తున్నారు.
 
ఐటీ దాడులపై ధైర్యం చెప్పిన సీఎం
రాజ్యసభ సభ్యుడు సి.ఎం. రమేష్‌ ఆస్తులపై శుక్రవారం ఐటీ దాడులు నిర్వహించడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో ప్రధానంగా టీడీపీ వర్గీయుల్లో అలజడి సృష్టించాయి. టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ దాడులు మరింత ముందుకు సాగితే జిల్లాలోని టీడీపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపార శ్రేణులపై కూడా దృష్టి సారించవచ్చన్న ఆందోళన కన్పిస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం మంత్రి శిద్దా రాఘవరావు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయి. అప్పట్లో సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ దాడులు చేశారు. ఒకసారి తనిఖీలు జరిగినందున తిరిగి వారివైపు ఐటీ అధికారులు దృష్టి సారిస్తారా? లేదా? అన్నది అటుంచితే మిగిలిన టీడీపీ ఎమ్మె ల్యేలలో నలుగురు లేక ఐదుగురు ఆస్తులపై కావాలనుకుంటే దాడులకు అవకాశం ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ఇటీవల కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామరావు మేనల్లుడికి చెందిన సంస్థపై, ఇప్పుడు సీఎం రమేష్‌ ఆస్తులపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని టీడీపీ శాసనసభ్యుల్లో కొందరిపై ఐటీ కన్ను వేసే అవకాశం ఉందన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ దాడులపై టీడీపీ శ్రేణులతోపాటు, సాధారణ ప్రజలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును ఇతర జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు, జిల్లాకు చెందిన కందుకూరు, అద్దంకి, ఒంగోలు శాసనసభ్యులు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్‌, దామచర్ల జనార్దన్‌ తదితరులు కలిశారు. ఆ సందర్భంగా రామారావును చూడగానే ఆయన బంధువుల కంపెనీలపై ఐటీ దాడుల గురించి చంద్రబాబు ఆరా తీశారు. ఏమైనా ఆందోళన చెందుతున్నారా? అని చంద్రబాబు అడగ్గా ‘మనకేం ఇబ్బంది లేదు. అన్నీ సక్రమంగానే ఉన్నాయి’ అని రామారావు చెప్పినట్లు తెలిసింది. వెంటనే రామారావు తోపాటు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలనుద్దేశించి చంద్రబా బు మాట్లాడుతూ ‘ఈదాడులు ఇంకా కొనసాగవచ్చు. ధైర్యంగా ఉండండి’ అంటూ కొన్ని సూచనలు చేసిన ట్లు సమాచారం.
Link to comment
Share on other sites

జగన్ రారమ్మంటుంటే.. చంద్రబాబు మీరిక్కడే ఉండాలంటున్నారు!
17-10-2018 12:52:21
 
636753776962707018.jpg
  • ఆ ఇద్దరిపై అందరి దృష్టి 
  • మాగుంట, ఆమంచి వైపు ప్రధాన పార్టీల చూపు
  • ఈ ఇద్దరే లక్ష్యం
  • రా..రమ్మంటున్న జగన్‌..
  • ఉండాలి.. పోటీ చేయాలంటున్న బాబు
శాసనమండలి సభ్యుడు మాగుంట, చీరాల ఎమ్మెల్యే ఆమంచిపై ప్రధాన పార్టీలు కన్నేశాయి. దీంతో ఆ ఇద్దరి నేతల రాజకీయ గమనంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టీడీపీ, వైసీపీ అధినేతలు వారిద్దరిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. మధ్యలో జనసేన వారు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్‌ రా... రమ్మంటూ వారికి సంకేతాలు పంపుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు మీరిక్కడే ఉండాలి, తిరిగి పోటీ చేయాలంటున్నారు. ఇంకోవైపు వైసీపీ పక్షాన ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ ఇద్దరు నేతలతో టచ్‌లో ఉన్నారు. మధ్యలో జనసేన నేత తోట చంద్రశేఖర్‌ కూడా వీరితో మాటామంతీ కలిపేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇటు మాగుంట, అటు ఆమంచి వైపు యావత్తు రాజకీయ పార్టీలే కాక ప్రజానీకం కూడా దృష్టిసారించింది.
 
ఒంగోలు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర విభజన నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో మాగుంట టీడీపీలో చేరి ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసిన విషయం విదితమే. స్వతంత్ర అభ్యర్థిగా చీరాల అసెంబ్లీకి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్‌ సంచలన విజయం సాధించారు. ఎన్నికలకు ముందు ఇద్దరూ నాయకులు వైసీపీలో చేరేందుకు అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. కొంతమంది వారిని వైసీపీలో చేర్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఆనాడు జగన్‌ వైఖరి వలనే అది సాధ్యం కాలేదనేది జగమెరిగిన సత్యం. అనంతరం టీడీపీలో చేరి ఒంగోలు లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన మాగుంట పట్ల ప్రత్యేక ఆదరణతో చంద్రబాబు వెంటనే శాసనమండలికి వెళ్లే అవకాశం కల్పించారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ లోక్‌సభ అభ్యర్థికి పరోక్షంగా సహకరించిన ఆమంచిని టీడీపీకి చెందిన జిల్లాలోని కొందరు నాయకులు కాదూ కూడదు అన్నా చంద్రబాబు దరిచేర్చుకున్నారు. ఇదంతా గతమైతే తిరిగి వచ్చే ఎన్నికల వైపు దృష్టిసారించిన పార్టీలకు మళ్లీ ఈ ఇద్దరు నాయకులు టార్గెట్‌ కావడం విశేషం.
 
 
మాగుంట కోసం యత్నాలు
ఒంగోలు లోక్‌సభ స్థానంలో మాగుంట కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు. సామాజిక, అభివృద్ధి కార్యక్రమానను పక్కన పెడితే ఆ గుర్తింపును కాపాడుకోవడంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి సఫలీకృతులయ్యారు. పైగా గత ఎన్నికలలో లోక్‌సభకు పోటీ చేయడం ప్రత్యేకించి కొన్ని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులకు కలిసి వచ్చిందనేది అంచనా. మరోవైపు చూస్తే టీడీపీకి అంతకన్నా బలమైన అభ్యర్థి ప్రస్తుతానికి లేనట్లే. ఇంకోవైపు వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ ప్రముఖులు మాగుంటను పార్టీలోకి తీసుకెళ్లాలన్న ఉబలాటంతో ఉన్నారు. వైసీపీ అంతర్గత వ్యవహారాల ఫలితంగా ఈసారి తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇక్కడ పోటీకాకుండా మరో రూపంలో ఆయన సేవలు వినియోగించుకోవాలని జగన్‌ భావిస్తున్నట్లు విస్తృత ప్రచారంలో ఉంది. దీనికి తోడు జగన్‌ కూడా సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టారు. దీంతో సహజంగానే వైసీపీ నాయకులు మాగుంట కోసం వల వేశారు. టీడీపీలో తగిన గుర్తింపులేదని బాధపడుతున్న మాగుంటను హక్కున చేర్చుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. పూర్వకాలం నుంచి ఉన్న పరిచయాలతో వైసీపీ రాష్ట్ర నాయకుడు, జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ బాధ్యతను తీసుకున్నట్లు వినికిడి.
 
 
పలుదఫాలు మాగుంటతో మాట్లాడటమే కాక ఆయనకు సన్నిహితంగా కుటుంబసభ్యులుగా మెలిగే సహిచరులతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారాలను చూస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మాట్లాడారన్న ప్రచారం ఉంది. అలాగే జిల్లాలో కీలక నేత అయిన బాలినేని పార్టీశ్రేణులతో బహిరంగంగానే ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పడం విశేషం.
 
ఇదే సమయంలోనే గత మూడు, నాలుగు నెలల కాలంలో సీఎం చంద్రబాబు మాగుంటను పిలిపించుకొని ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఒకటి రెండుసార్లు బాబుతో భేటీ అయినప్పటి నుంచి మాగుంట మాటతీరులో మార్పు వచ్చిందనేని జనం మాట. అటు ముఖ్యమంత్రి, మాగుంటల భేటీల నేపథ్యంలోనే వైసీపీ నాయకులు హైదరాబాదు మాగుంట ఇంటికి వెళ్లి కలిసే ప్రయత్నం కూడా చేశారు. మధ్యలో సినీ సంబంధాలు నెమరువేసుకుంటూ మీకోసం జనసేన తలుపులు తెరచుకున్నాయని పవన్‌కల్యాణ్‌ కబురు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితి చూస్తే మాగుంట బాబుకే ఓటేసినట్లు కనిపిస్తుంది. ఆ మేరకు తెలుగుదేశం ముఖ్య నాయకులలో ధీమా కనిపిస్తుండగా ఏమో వేచిచూద్దాం అన్న భావన వైసీపీ నేతలలో కనిపిస్తుంది.
 
 
వ్యక్తిగత పట్టు.. టచ్‌లో పార్టీలు
చీరాల అసెంబ్లీలో వ్యక్తిగతంగా పట్టు పెంచుకోవడమే ఆమంచికి ఆయుధమైంది. తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆయన ఎక్కడా బహిరంగంగా మాట్లాడకపోయినా కొన్ని అంతర్గత విషయాలపై ఆయన అసంతృప్తితో ఉన్నమాట నిజం. దీనికి తోడు జిల్లా పార్టీ వ్యవహారాలలో ఆయన చురుగ్గా పాల్గొనకపోవడం కూడా అనుమానాలకు తావిచ్చింది. ఈ దశలో వైసీపీ అధిష్టానం కాపు సామాజికవర్గానికి చెందిన కొందరు నాయకులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అలాంటి నాయకులలో ఆమంచితోపాటు మరికొందరున్నారు. వారిలో ఆమంచిని కీలకంగా ఎంచుకొని ఆయన ద్వారా మరికొందరిని రాబట్టాలని వైసీపీ ప్రయత్నించినట్లు వినికిడి. ఇటు విజయసాయిరెడ్డికితోడు అటు బొత్సా ఆమంచిపై ఒత్తిడి పెంచారు. ఈ ఇద్దరు నాయకులు పలు దఫాలు ఆమంచితో ఫోన్‌లో మాట్లాడారు. ఒక్కసారి జగన్‌ను కలవండని కోరినట్లు తెలిసింది. మరో వైపు జనసేన పవన్‌కల్యాణ్‌ దూతలు ఆమంచిని కలిసినట్లు సమాచారం. ప్రధానంగా ఆపార్టీ కీలక నేతల్లో ఒకరైన తోట చంద్రశేఖర్‌ ఆమంచికి టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల తోట న్యూస్‌ చానల్‌ను తీసుకున్న సందర్భంలోనూ ఆమంచికి టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ దశలో పలు రకాల ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమంచిని పిలిపించుకొని ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
 
 
ఒకటి రెండుసార్లు ఆమంచితో పాటు తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులును కూడా పిలిపించుకొని సీఎం మాట్లాడినట్లు తెలిసింది. ఈ వ్యవహారం జరుగుతున్న దశలోనే ఆమంచి బీఫాం ఇస్తే టీడీపీ తరపున పోటీ చేస్తా, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ ప్రకటనతో ఆమంచి రాజకీయ భవితవ్యంపై అనుమానాలు పెనుభూతాలయ్యాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రెండుసార్లు ఆమంచిని పిలిపించుకొని భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చివరకు మీరు ఇంట్లో కూర్చొని గెలవగలరు, మీకు బీ ఫాం ఇవ్వకపోవడం ఏమిటంటూ భరోసాగా మాట్లాడారు. పార్టీలో ఎదురైన చేదు అనుభవాలపై ఆమంచికి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారా లేదా, భవిష్యతులో ప్రోత్సాహంపై ఎలాంటి క్లారిటీ ఇచ్చారనే విషయాన్ని పక్కనపెడితే ఆమంచి మనతోనే ఉంటాడన్న నమ్మకం టీడీపీలో పెరిగింది. జనంలో పట్టున్న ఈ ఇద్దరు నేత రాజకీయ గమనంపై ఇలా సాగుతున్న చర్చకు ముగింపు ఎప్పుడు అనేందుకు మాత్రం ఇంకా వేచిచూడాల్సిందే.
Link to comment
Share on other sites

  • 1 month later...
దేవుడి సాక్షిగా.. చంద్రబాబుతో టికెట్ల గురించి మాట్లాడలేదు!
25-11-2018 12:59:41
 
636787475795660040.jpg
  • కొండపి మలి
  • అడుగు జయప్రదం
  • మనసు విప్పిన దామచర్ల సోదరులు
  • కొత్త ఉత్సాహంలో మాగుంట
  • ఇక పోతుల వర్గంతోనే పంచాయితీలు
 
నియోజకవర్గాల వారీ అసమ్మతి రాగాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు తెలుగుదేశం అధిష్టానం అనుసరిస్తున్న వ్యూహం ఫలించే సూచనలు ప్రారంభమయ్యాయి. అందుకు కొండపి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రయత్నాలు దిక్సూచిగా ఉన్నాయి. శనివారం జరిగిన కొండపి నియోజకవర్గ టీడీపీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం దిగ్విజయం కావటం అందుకు నిదర్శనం. నియోజకవర్గంలోని పార్టీశ్రేణులు భారీగా తరలిరావటంతో పాటు కొండపితో అనుబంధం ఉన్న ముఖ్యమైన నాయకులందరూ హాజరుకావటం, గతం కన్నా ఆత్మీయంగా మనసు విప్పి మాట్లాడటం కార్యక్రమం విజయవంతాన్ని తెలియజేస్తోంది. ఈ విషయంలో యువ నాయకుడు దామచర్ల సత్య, శాసనసభ్యుడు స్వామిని కలుపుకొని చేసిన సమన్వయ ప్రయత్నాలకు తొలి విజయంగా పరిశీలకులు ఈ కార్యక్రమాన్ని అభివర్ణిస్తున్నారు.
 
 
 
సంగమేశ్వరం/ఒంగోలు: కార్తీక వనభోజన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను చూస్తుంటే ఈ సారి 25 వేల మెజారిటీ కొండపి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులకు వచ్చేలా ఉందని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. పొన్నలూరు మండలంలోని సంగమేశ్వరం ఆలయ ఆవరణలో కొండపి ఎమ్మెల్యే డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అధ్యక్షతన కార్తీక వన భోజన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మామాగుంట మాట్లాడుతూ జిల్లాలోనే కొండపి నియోజకవర్గంలో ఉద్దండులైన నాయకులు ఉన్నారని, 80 శాతం ప్ర జల మద్దతు టీడీపీకే ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా టీడీపీ యూత్‌ నాయకుడు దామచర్ల సత్యన్నారాయణ ఆధ్వ ర్యంలో, ఎమ్మెల్యే స్వామి నాయకత్వంలో టీడీపీ మరింత బలో పేతం అవుతుందని ఆకాంక్షించారు.
 
 
టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ మా కుం టుంబంలో అంతరాలు లేవని, అందరం ఒక్కటేనన్నారు. అభి ప్రాయ బేధాలు తొలగిపోయాయన్నారు. నియోజకవర్గం దామ చర్ల కుటుంబానికి పెట్టిన రాజకీయ భిక్షతో తామంతా నాయ కులమయ్యామని అన్నారు. అందరం కలిసి గ్రామస్థాయిలో మాట్లాడుకుని టీడీపీ విజయానికి సమష్టిగా పాటుపడదామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కరణం బలరాం మాట్లాడుతూ అ భిప్రాయ బేధాలను పక్కనపెట్టి పార్టీ అభివృద్థికి పనిచే యాలని సూచించారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామా రావు మాట్లాడుతూ సంగమేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తికి ఎమ్మెల్యే స్వామి పట్టుదలగా పనిచేస్తున్నారన్నారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు మాట్లాడుతూ భవిష్యత్‌ తరాల కోసం చం ద్రబాబు మరోసారి సీఎం కావాలన్నారు. శిద్దా సుధీర్‌ మా ట్లాడుతూ తన తండ్రి వేరే కార్యక్రమంలో ఉన్నందున తాను వచ్చానని, తాను కార్యకర్తలను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. టీడీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బీఎన్‌ విజయకుమార్‌ చంద్రబాబు రా ష్ట్రాభివృద్ధికోసం అహర్నిశలు శ్రమిస్తు న్నారన్నారు.
 
 
కార్యక్రమంలో కొండపి మాజీ ఎమ్మెల్యేలు గుండపనేని అచ్యు త్‌ కుమార్‌, కసుకుర్తి ఆదెన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్య క్షుడు వైవీ సుబ్బారావు, టంగు టూరు మండల నాయకులు కామని విజయకుమార్‌, బెజ వాడ వెంకటేశ్వర్లు, బెల్లం జ యంత్‌బాబు, మర్రిపూడి మం డల టీడీపీ నాయకుడు య ర్రమోతు శ్రీనివాసులు, జరుగు మల్లి ఎంపీపీ పోటు పద్మావతి, ఒంగోలు ఏఎంసీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తొ లుత నాయకులు సంగమేశ్వరునికి పూజలు నిర్వహించారు. దివంగత ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీబీఎన్‌ ఆర్మీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామకృష్ణ ఆధ్వ ర్యంలో 100 మందికి పైగా యువకులు సభాస్థలి ని పర్యవేక్షించారు.
 
అతిథులను టీడీపీ యువ నాయకుడు ఆకట్టుకున్న ప్రసంగాలు
సభలో టంగుటూరు మండల టీడీపీ నాయకులు ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. మండల అధ్యక్షుడు కామని విజయకుమార్‌ మాట్లాడుతూ రైలు ప్రయాణంలో ముఖ పరిచయం లేని వ్యక్తితో ఆప్యాయంగా మాటులు కలుపుతాం. ముప్పై ఏళ్లు ఒకే పార్టీలో, ఒకే గ్రామంలో కలిసి పనిచేసినా ఎడమొఖం, పెడమొఖంగా ఉంటాం ఎందుకనో? అన్నారు. రాజకీయాల్లో ఓర్పుగా పనిచేస్తే ఉన్నత పదవులు వస్తాయన్నారు. తనకు సమకాలికులు ఉన్నత పదవులు పొందరన్నారు. పనిచేయడంతోపాటు డబ్బు, అదృష్టం అవసరమన్నారు. మరీ ఉన్నత పదవులకు డబ్బు, అదృష్టం అవసరమైనా, పనిచేస్తే గుర్తింపు కలిగే పదవులు వస్తాయని విజయకుమార్‌ అన్నారు. టంగుటూరు మండలం మరో నాయకుడు బెల్లం జయంత్‌బాబు మాట్లాడుతూ అద్దాలమేడ లాంటివి రాజకీయాలు, ఎదుటివాడు రాయి విసిరినా, ఇంటిలో వాడు రాయి విసిరినా పగిలిపోయేది మన అద్దాల మేడే అనేది అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అందరూ ఐకమత్యంగా పనిచేస్తే పార్టీ విజయం సాధిస్తుంద న్నారు.
 
 
magunta.jpgసభలో చమక్కులు - చురుక్కులు
  • టిక్కెట్లు విషయం తాను సీఎం చంద్రబాబుతో ప్రస్తావించ లేదని మాగుంట సంగమేశ్వరుడి సాక్షిగా చెప్పారు. పత్రికా సోదరులు ఎందుకో పదేపదే ఈ విషయాలను రాస్తున్నారన్నారు.
  • తనకు ఎమ్మెల్సీ అనే పిలిపించుకోవడం కంటే మాజీ ఎంపీ అని పిలిపించుకోవాలనిపిస్తున్నదని బలరాం అన్నారు.
  • అమరావతి తర్వాత మన జిల్లాలనే వేగంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు తెలిపారు.
  • తమ కుటుంబంలో పొరపొచ్చాలు లేవని, సీఎం సమావేశం తర్వాత వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే జనార్థన్‌ .
  • ఎమ్మెల్యే స్వామి, తమ్ముడు సత్య పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారని, అలాగే ముందుముందు కూడా సమావేశాలు నిర్వహించి పార్టీ అభివృద్ధిని కొనసాగిస్తారన్నాని జనార్దన్‌ పేర్కొన్నారు.
  • సంగమేశ్వరం ఎడమ కాల్వ పనులు చేపడితేనే పొన్నలూరు మండలానికి ప్రయోజనకరమని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నట్టు దామచర్ల సత్య తెలిపారు.
  • జనార్దన్‌కు శాలువా కప్పుతుండగా, మిగతా అతిథులకు కప్పాలని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అయినా సత్య జనార్దన్‌కు శాలువా కప్పడంతో.. నాయకులు సత్య పట్టువదలడని వేదికపైనే చలోక్తి విసిరారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...