Jump to content

prakasam politics


Recommended Posts

  • Replies 123
  • Created
  • Last Reply
  • 3 weeks later...
35 minutes ago, bnalluri said:

e mining univ vachedi kadhu sachedi kadhu petali anukunte entha sepu pedatharu prakasam karma anthe 

Mining corporation signs MoU with Australian varsity

A delegation of industrialists from Australia came forward to partner with Andhra Pradesh Mining Development corporation.The delegation led by senior members of industries

Published: 12th December 2017 02:37 AM  |   Last Updated: 12th December 2017 07:40 AM   |  A+A-

By Express News Service

VIJAYAWADA: A delegation of industrialists from Australia came forward to partner with Andhra Pradesh Mining Development corporation.The delegation led by senior members of industries from Australia, Sean Kelly, Consul General of India, met Chief Minister N Chandrababu Naidu at the Interim Government Complex in Velagapudi on Monday. On the occasion, the Andhra Pradesh Mining Development Corporation Ltd. signed a Memorandum of Understanding (MoU) with Curtin University, Perth.

For the development of the Institute of Mining Education and Research in Andhra Pradesh, Curtin University has agreed to establish a world class centre and participate in the analysis of mining education, occupational health, safety aspects and the needs of industrial research and development.Another MoU was signed with the Cooperative Research Centre (CRC) for water sensitive cities. APCRDA and the Municipal Administration departments will be the key partners from the state government, and help implement Australia’s world-leading water sensitive practices in Amaravati.

CRC will also start a pilot project using green technology to demonstrate how drainage infrastructure can be retrofitted in Vijayawada for sustainable urban water management. The Chief Minister lauded the efforts by Sean Kelly, for his dedication to collaborate with Andhra Pradesh. 

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

Mining corporation signs MoU with Australian varsity

A delegation of industrialists from Australia came forward to partner with Andhra Pradesh Mining Development corporation.The delegation led by senior members of industries

Published: 12th December 2017 02:37 AM  |   Last Updated: 12th December 2017 07:40 AM   |  A+A-

By Express News Service

VIJAYAWADA: A delegation of industrialists from Australia came forward to partner with Andhra Pradesh Mining Development corporation.The delegation led by senior members of industries from Australia, Sean Kelly, Consul General of India, met Chief Minister N Chandrababu Naidu at the Interim Government Complex in Velagapudi on Monday. On the occasion, the Andhra Pradesh Mining Development Corporation Ltd. signed a Memorandum of Understanding (MoU) with Curtin University, Perth.

For the development of the Institute of Mining Education and Research in Andhra Pradesh, Curtin University has agreed to establish a world class centre and participate in the analysis of mining education, occupational health, safety aspects and the needs of industrial research and development.Another MoU was signed with the Cooperative Research Centre (CRC) for water sensitive cities. APCRDA and the Municipal Administration departments will be the key partners from the state government, and help implement Australia’s world-leading water sensitive practices in Amaravati.

CRC will also start a pilot project using green technology to demonstrate how drainage infrastructure can be retrofitted in Vijayawada for sustainable urban water management. The Chief Minister lauded the efforts by Sean Kelly, for his dedication to collaborate with Andhra Pradesh. 

mari ah effort ground mida kanapadali kada

Link to comment
Share on other sites

4 hours ago, Kiran Edara said:

the District has been ignored from its inception... it has become a political playground :sleep::sleep::sleep:

entha sepu uttarandhra.. rayalaseema.. ani sollu... evadiki guntur/nellore madhyalo unna prakasam kanipinchadu.. 

political playground ledhu emi ledhu... capital raakamundu Krishna dt situation enti bro? Vijayawada was business capital of AP until mid 80s.. still after Nagarjunasagar dam, the only thing that was given was Bus stand.  no university... no medical college.. govt hospital and other things gurninchi entha takkuva cheppukunte antha better.. only good thing is water.. except that nothing was there.

same thing we are seeing in prakasam... but CBN will do some thing.. looks like he already tried for some industries but they didn't materialize..

 

at the same time... there are many rich and intelligent guys in prakasam dt... don't know why they go and invest in other places rather than investing in their own place. Locals invest chesthe bayata vallaki kuda confidence vastundhi

Link to comment
Share on other sites

10 minutes ago, katti said:

political playground ledhu emi ledhu... capital raakamundu Krishna dt situation enti bro? Vijayawada was business capital of AP until mid 80s.. still after Nagarjunasagar dam, the only thing that was given was Bus stand.  no university... no medical college.. govt hospital and other things gurninchi entha takkuva cheppukunte antha better.. only good thing is water.. except that nothing was there.

same thing we are seeing in prakasam... but CBN will do some thing.. looks like he already tried for some industries but they didn't materialize..

 

at the same time... there are many rich and intelligent guys in prakasam dt... don't know why they go and invest in other places rather than investing in their own place. Locals invest chesthe bayata vallaki kuda confidence vastundhi

prakasam dt ni krishna dt tho compare chesaru.. inka chalu discussion.. ? 

Link to comment
Share on other sites

1 hour ago, Kiran Edara said:

prakasam dt ni krishna dt tho compare chesaru.. inka chalu discussion.. ? 

it is not about comparing districts but talking about development.. where Krishna dt was also in the similar situation like prakasham dt.

Link to comment
Share on other sites

15 minutes ago, katti said:

it is not about comparing districts but talking about development.. where Krishna dt was also in the similar situation like prakasham dt.

Krishna ni prakasam ni compare cheyodhu asalu ma zilla lo oka river ledhu, agriculture ayithe nill fluoride problem worst than nalgonda in many areas kani andaraki backward ante matram uttarandhra n rayalseema matrame kanipisthai opukondi ppl have been ignoring it from long time.

Link to comment
Share on other sites

3 hours ago, bnalluri said:

Krishna ni prakasam ni compare cheyodhu asalu ma zilla lo oka river ledhu, agriculture ayithe nill fluoride problem worst than nalgonda in many areas kani andaraki backward ante matram uttarandhra n rayalseema matrame kanipisthai opukondi ppl have been ignoring it from long time.

Krishna zilla ki ninnati varuku vundi only river...  daniki kuda almatti vachhina daggaranunchi chala kastalu vachhayyiii

Link to comment
Share on other sites

ఉంటారో.. పోతారో... తెల్చుకోండి: చంద్రబాబు
27-06-2018 14:48:19
 
636657077004772063.jpg
  • సమయం లేదు.. పనితీరు మెరుగుపర్చుకోండి!
  • ప్రకాశం జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు
  • పార్టీ, పాలన, వ్యక్తిగత నడవడికపై చర్చ
  • ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇన్‌చార్జులతో వేర్వేరుగా భేటీ
  • డేవిడ్‌రాజుతోనే 50 నిమిషాలు
  • ఇన్ని సమస్యలు ఏమిటంటూ ప్రశ్నల వర్షం
  • సమన్వయం పెంచుకోండంటూ స్వామికి హితబోధ
  • నారాయణ రెడ్డీ.. ఏమిటా భూ వివాదం!
  • పలు అంశాలపై జనార్దన్‌తో సీఎం ఆరా
ఒంగోలు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిల చిట్టాను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విప్పారు. అం దులోని అంశాల ఆధారంగా వారితో మాట్లాడుతూ స మయం లేదు.. ఉంటారో, వెళ్తారో తేల్చుకోండి అని వ్యాఖ్యానించారు. పనితీరు బాగోలేని వారికి హెచ్చరికలు చేశారు. ప్రజల్లో సానుకూలత ఉన్న వారికి మాత్రం సూచనలు చేశారు. సమస్యలున్న నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కో నేతతో ఎక్కువ సమయం భేటీ అయిన ఆయన మిగిలిన వారితో పావుగంట మాత్రమే మాట్లాడారు. చివరగా ప్రతి ఒక్కరికీ దిశానిర్దేశం చేశా రు. జిల్లాలోని పార్టీ శాసనసభ్యులు, ఇన్‌చార్జిలతో చం ద్రబాబు సమావేశమై రాజకీయ, పాలనాపరమైన అం శాలపై సమీక్షిస్తున్న విషయం విదితమే.
 
వారం క్రితం జిల్లా నేతలతో సమావేశమైన ఆయన మరోసారి మంగళవారం సాయంత్రం అమరావతిలోని తన నివాసంలో విడివిడిగా భేటీ అయ్యారు. గతంలో ఆయన పిలిపిం చుకొని మాట్లాడిన ఎమ్మెల్సీ మాగుంట, బాపట్ల ఎంపీ మాల్యాద్రి, చీరాల, కందుకూరు, కనిగిరి ఎమ్మెల్యేలు మినహా మిగిలిన నాయకులందరితో మంగళవారం ఆయన మాట్లాడారు.. కారణాలు ఏమైనప్పటికీ మధ్య లోనే ఎమ్మెల్సీ కరణం బలరాం, పోతుల సునీత, కార్పొరే షన్‌ చైర్మన్‌ దివి శివరాం, ఎరిక్షన్‌బాబులను వెళ్లిపొమ్మ ని ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇన్‌చార్జిలతో చం ద్రబాబు భేటీ అయ్యారు. సుమారు ఐదు గంటలపాటు వారితో విడిడిడిగా మాట్లాడారు. ఎర్రగొండపాలెం, కొం డపి, ఒంగోలు ఎమ్మెల్యేలు, మార్కాపురం, సంతనూతలపాడు ఇన్‌చార్జిలతో ఎక్కువసేపు భేటీ అయిన ఆయ న మిగిలిన వారితో తక్కువ సమయం మాట్లాడారు.
 
 
డేవిడ్‌రాజూ ఇన్ని సమస్యలా!?
తొలుత ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు డేవిడ్‌రాజుతో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాలపాటు మాట్లాడారు. ప్రతి మండలంలోనూ పార్టీ నాయకుల మధ్య విబేధాలున్నాయని, వాటిని ఎందుకు సరిద్దుకోలేకపోరంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. క్యాడ ర్‌లో నమ్మకం పెరగకపోతే ఇబ్బందే అంటూ హెచ్చరించినట్లు సమాచారం. జడ్పీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రవీంద్ర పార్టీకి దూరంగా ఉండటానికి కారణాలను అడిగి తెలుసుకు న్నట్లు తెలిసింది. తనకు సంబంధం లేదని జిల్లా నాయకత్వంతో మాట్లాడాలని డేవిడ్‌రాజు సూచించగా తన చేతిలో ఉన్న నివేదికలను చూస్తూ అవినీతి పెరిగింది, ద్వితీ య శ్రేణి నాయకుల్లో సఖ్యత లే దంటూ చంద్రబాబు వ్యాఖ్యానిం చారని చెప్తున్నారు. వీటన్నింటినీ వెంటనే సరిదిద్దుకోవాలని సూచిం చినట్లు సమాచారం. గెలుపు అవకాశం ఎంతమేరకు వచ్చిందని సీఎం సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో డేవిడ్‌రాజు తన సొంత ప్రాంతం వైపు వెళ్లే అవకాశం కల్పించాలని ఆయన్ను కోరినట్లు సమాచారం.
 
 
పోతుల, దామచర్లతో సమన్వయంతో వెళ్లాలని స్వామికి సూచన
కొండపి ఎమ్మెల్యే స్వామితో మాట్లాడిన సీఎం ఆయన పనితీరుని కొనియాడుతూనే అటు పోతుల రామారావు, ఇటు దామచర్ల జనార్దన్‌తో సమన్వయంగా ముం దుకు సాగాలని గట్టిగా సూచించారు. జనార్దన్‌తో గ్యాప్‌ ఎందుకు పెరిగిందని ఆరా తీసిన ఆయన దామచర్ల సత్య నియోజకవర్గంలో తిరుగుతున్నాడా? లేదా? అని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. ఒక దశలో ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు వ్యవహార శైలిపై కూడా ఆరా తీసినట్లు సమాచారం.
 
 
నారాయణ రెడ్డి ఆ భూవివాదం ఏంటి?
మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల నారాయణ రెడ్డితో చంద్రబాబు సూటిగా మాట్లాడినట్లు తెలిసింది. రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక భూ వివాదాన్ని ఆయన ప్రస్తావించినట్లు సమా చారం. అది తనకు సంబంధం లేని అంశమని, కొందరు పెద్దల స్థాయిలో జరిగిందని కందుల ఆధారాలతో వివరణ ఇవ్వగా సీఎం సంతృప్తి చెందినట్లు తెలిసింది. కొం దరు నాయకుల అసంతృప్తికి కారణాలపై కూడా వారి మధ్య చర్చ జరగ్గా చాలా మందికి పదవులు ఇస్తేనే సంతృప్తి పడతారని, ఆపని మీచేతుల్లో ఉందని అన్న ట్లు తెలిసింది. నన్ను నమ్మి అడిగిన సహకారం ఇస్తే గెలిచి తీరుతానని కందుల హామీ ఇచ్చినట్లు తెలిసింది.
 
 
అసంతృప్తులపై బీఎన్‌
సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బి.ఎన్‌. విజయకుమార్‌తో భేటీ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ నాయకులలో ఉన్న అసంతృప్తులను చంద్రబాబు ప్రస్తావించారు. మీరెందుకు సవరించుకోలేకపోతున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి బీఎన్‌ సమాధానం ఇస్తూ నా పరిధిలో పరిస్థితులను నేను సవరించుకుంటున్నానని.. ఇద్దరు, ముగ్గురు నాయకుల విషయంలో మాత్రం మీ జోక్యం అవసరమని అన్నట్లు తెలిసింది. మీలో లోపం రాకుండా పనిచేయండి ఆ తర్వాత నేను చూస్తానని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం.
 
 
సాఫీగా అద్దంకి, పర్చూరు.. గిద్దలూరు ఎమ్మెల్యేలతో సమీక్ష
అద్దంకి, పర్చూరు, గిద్దలూరు శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, ఎం. అశోక్‌ రెడ్డిలతో భేటీలు సాఫీగా సాగాయి. ఒక్కొక్కరితో పది నుంచి పదిహేను నిమిషాలు మాత్రమే చంద్రబాబు మాట్లాడారు. తొలుత గిద్దలూరు ఎమ్మెల్యేతో భేటీ అయిన అధినేత మీతోపాటు పార్టీలో చేరిన నాయకులు, పాత టీడీపీ నేతలకు మధ్య మరికొంత సమన్వయం పెరగాలని సూచించారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో మీ పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. మీ పనితీరులో మరింత మెరుగుదలను, ఉజ్వల భవిష్యత్తుని కోరుకుంటున్నానంటూ ముగించిన ట్లు సమాచారం. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో మాట్లాడుతూ రాజకీయంగా, పాలనాపరంగా మీదో మోడల్‌ నియోజకవర్గం.
 
అన్ని సర్వేలు మీకు అనుకూలంగానే ఉన్నాయి, కానీ రాజకీయాల్లో కక్షసాధింపు పనికిరాదు, ఆ విషయాన్ని సవరించుకోండంటూ కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. అదే సందర్భంలో నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు, తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గురించి ఆరా తీసినట్లు సమాచారం. అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌తో మాట్లాడుతూ ‘రవి వెల్‌డన్‌. విస్తృతంగా తిరగండి ఇంకా మంచి ఫలితం వస్తుంది’ అని ప్రోత్సహిస్తూ మాట్లాడారు. సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో పరిస్థితిలపై కొంత సేపు చర్చించినట్లు తెలిసింది. అటు పర్చూరు, ఇటు అద్దంకి ఎమ్మెల్యేలిద్దరూ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా మాట్లాడి పలు పనులకు సంబంధించిన నిధులు కూడా రాబట్టుకున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

టీడీపీ వెంటే నడుద్దాం.. మనం బలపడాలి.. పార్టీ బాగుండాలి’
07-07-2018 12:15:19
 
636665625206464328.jpg
  • మోపాడులో ‘ఇరిగినేని’ వర్గీయుల సమావేశం
  • తిరుపతినాయుడు కుమారులిద్దరూ హాజరు
  • సమన్వయం చేసిన ఏఎంసీ చైర్మన్‌ దారపనేని
ఒంగోలు: కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత నేత ఇరిగినేని తిరుపతినాయుడు వర్గీయులు రాజకీయంగా వేగం పెంచాలని నిర్ణయించుకున్నారు. తమ గ్రూపును బలోపేతం చేసుకోవడంతోపాటు, టీడీపీకి మరింత పట్టుపెంచాలని తీర్మానించుకున్నారు. ఆమేరకు వారానికో మండలంలో సమావేశాలు నిర్వహించనున్నారు. శుక్రవారం తిరుపతినాయుడు స్వగ్రామమైన మోపాడులో వీరంతా సమావేశమయ్యారు. ఇరిగినేని ఇద్దరు కుమారులు రవి, రాజా హాజరయ్యారు. నియోజకవర్గంలో ఇరిగినేని వారసుడిగా కొనసాగుతున్న కనిగిరి ఏఎంసీ చైర్మన్‌ దారపనేని చంద్రశేఖర్‌ సమావేశ నిర్వహణలో కీలకపాత్ర పోషించా రు. పామూరు, పి.సి.పల్లి మండలాలకు చెందిన వారు ఎక్కువగా హాజరైనట్లు తెలిసింది. రాజకీయంగా టీడీపీతోనే పయనించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత శాసనసభ్యుడు కదిరి బాబూరావు నాయకత్వాన్ని బలపరుస్తూనే తమకు పట్టున్న రెండు మండలాల్లో వేరేవారిని ఇన్‌చార్జిలుగా నియమించి పెత్తనం అప్పగించడంపై సమావేశానికి హాజరైన వారిలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 
అనంతరం భవిష్యత్‌ కార్యక్రమంపై వారు చర్చించుకున్నారు. ముందుగా ఇటీవల కాలంలో తమవర్గం వారు కాస్తంత చురుగ్గా లేని గ్రామాలలో పర్యటించి వారందరినీ యాక్టివ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేకించి మోపాడు బాధ్యతను చంద్రశేఖర్‌కి అప్పగించారు. త్వరలో ఆ పంచాయతీలో టీడీపీలో చేరేందుకు ముందుకొచ్చిన కొన్ని కుటుంబాల వారిని ఎమ్మెల్యే బాబూరావు సమక్షంలో పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరిగినేని కుమారులిద్దరూ తాము నిత్యం అందుబాటులో ఉంటామని, తమ అవసరం ఎప్పుడున్నా నియోజకవర్గానికి వస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌, బొట్లగూడూరు సర్పంచ్‌ కుమారుడు, పారిశ్రామిక వేత్త జనార్దన్‌, పి.సి.పల్లి మండలానికి చెందిన సీనియర్‌ నాయకుడు బాలసుబ్బయ్య, ఇతర పలువురు మండల, గ్రామస్థాయి నాయకులు, వందలాది మంది అభిమానులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

వైసీపీలో ఆయన చేరుతున్నట్లు తెలియడంతో.. అప్పుడే...
08-07-2018 13:26:37
 
636666531961598463.jpg
  • వైసీపీలోకి మహీధర్‌రెడ్డి
ఒంగోలు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి, కందుకూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు మానుగుంట మహీధర్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఈనెల 11న ఆయన పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ పరిణామంపై ఆ నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్‌లో హర్షం వ్యక్తమవుతుండగా, అక్కడ పార్టీ సమన్వయకర్తగా ఉన్న మాధవరావు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
 
 
కందుకూరు నియోజకవర్గంలో 1989లో తండ్రి వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మహీధర్‌రెడ్డి మూడు పర్యాయాలు ఆ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో పురపాలక శాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో గత ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.
 
ఏడాదిన్నరగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక దశలో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమై నట్లు ప్రచారం జరిగింది. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ను చేర్చుకునే విషయంలో వెనకడుగు వేసినట్లు తెలిసింది. దీంతో మాజీ ఎంపీలు రాజమోహన్‌రెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి, పార్టీ పరిశీలకుడు రామకృష్ణారెడ్డి తదితరులు మహీధర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని అధినేత జగన్‌పై ఒత్తిడి పెంచారు. అయితే కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో మహీధర్‌రెడ్డికి, జిల్లాలో ప్రస్తుతం వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న బాలినేనికి సత్సంబంధాలు లేని విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్‌ వేచి చూసే ధోరణి అనుసరించారు.
 
 
ఈ నేపథ్యంలో గత శుక్రవారం జగన్‌ను బాలినేని కలిసిన సమయంలో మహీధర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం తనకూ సమ్మతమేనని చెప్పినట్లు తెలిసింది. దీంతో విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. శనివారం తిరుపతిలో మహీధర్‌రెడ్డితో మాట్లాడారు. ఆ ప్రకారం ఈ నెల 11వ తేదీన జగన్‌ పాదయాత్ర ఎక్క డ ఉంటే అక్కడికి వెళ్ళి పార్టీలో చేరాలని మహీధర్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కందుకూరు నుంచి వైసీపీ టెక్కెట్‌ హామీతోనే మహీధర్‌రెడ్డి ఆ వైపు అడుగు వేసినట్లు తెలిసింది.
 
 
తూమాటి, ఆయన వర్గీయుల అసంతృప్తి
తాజా పరిణామాలతో కందుకూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న తూమాటి మాధవరావు, అతని అనుచరులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మాధవరావుతో ఆపార్టీ నాయకులు కొందరు ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. అయితే ఇటు ఒంగోలు అటు నెల్లూరు లోక్‌సభల పరిధిలో పార్టీ తరపున పోటీ చేయనున్న ఏకైక కమ్మ సామాజిక వర్గ అభ్యర్థిని తానేనని, తనను మార్చితే మొత్తం ఆ సామాజికవర్గంలో మరింత ద్వేషం పెరుగుతుందని మాధవ్‌ ఫోన్‌ చేసిన నాయకులతో చెప్పినట్లు తెలిసింది. టికెట్‌ విషయంలో పాదయాత్ర యాత్ర సందర్భంగా జగన్‌ ఇచ్చిన హామీపై తనకు ఇంకా విశ్వాసం ఉందని తొందర పడవద్దని ముఖ్య అనుచరులకు సూచించినట్లు సమాచారం.
 
 
అనుచరుల అభీష్టం మేరకే నిర్ణయం: మహీధర్‌
నియోజకవర్గంలోని తన అనుచరుల అభీష్టాన్ని గౌరవించి వైసీపీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చినట్లు మహీధరెరెడ్డి తెలిపారు. తిరుపతి నుంచి ఫోన్‌లో ఆయన ఆంధ్రజ్యోతి ప్రతినిధితోమాట్లాడారు. 11న జగన్‌ సమక్షంలో పార్టీలో చేరతానని చెప్పారు. అనంతరం నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల సమరానికి సిద్ధం చేస్తానన్నారు. తనకు ఇతరత్రా ఏ నాయకులతోనూ విభేదాలు లేవని, తన పని తాను చేసుకుపోతానని అన్నారు.
Link to comment
Share on other sites

వైసీపీలో చేరిన మహీధర్‌రెడ్డి
12-07-2018 03:29:34
 
636669629739208798.jpg
  •  కండువా కప్పి ఆహ్వానించిన జగన్‌
  • బాలినేనితో కలిసి పనిచేస్తే జిల్లాలో తిరుగే ఉండదని వ్యాఖ్య
  • ప్రకాశం జిల్లా రాజకీయాలపై చర్చ
  • అనపర్తి చేరుకున్న పాదయాత్ర
అనపర్తి/కందుకూరు, జూలై 11: మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైసీపీలో చేరారు. ప్రకాశం జిల్లా నుంచి వందల మంది అనుచరులతో కలిసి తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ దగ్గరకు ఆయన బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి మహీధర్‌రెడ్డిని జగన్‌ వైసీపీలో చేర్చుకొన్నారు. మరో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు నియోజకవర్గ ఇంచార్జి మాధవరావులతో కలిసి జగన్‌ కాసేపు సమావేశం అయ్యారు. జిల్లా రాజకీయాలపై మాట్లాడుకొన్నారు.
 
ఆ సమయంలో మహీధర్‌ను ‘అన్నా’ అంటూ పలకరించిన జగన్‌..‘బాలినేని, మీరు ఈ మధ్య కాలంలో కలవటం ఇదేకదా?’ అని ప్రశ్నించారు. ‘మీరిద్దరూ కలిసి ముందుకు సాగితే జిల్లాలో వైసీపీకి తిరుగే ఉండదు’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. మాధవరావుతో మహీధర్‌ చేతులు కలిపిన జగన్‌.. ‘పార్టీ కోసం మాధవరావు ఎంతో కష్టపడ్డారని, అధికారంలోకి వచ్చాక ఆయనకు న్యాయం చేయాల్సిన బాధ్య త ఉంది’ అని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే పార్టీ కండువా కప్పి మహీధర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం జగన్‌ చేయగా.. ఉదయం 9-10 మధ్య ముహూర్తం బాగుందని మహీధర్‌రెడ్డి బదులిచ్చారు. 10 గంటల వరకూ పాదయాత్ర ప్రారంభించకుండా ఉండటం కష్టమన్న జగన్‌.. 2 కి.మీ. దూరంలో మీరు వెళ్లి ఉంటే ఆలోపు పాదయాత్ర అక్కడికి చేరుకుంటుందని చెప్పారు. అలాగే జగన్‌ పాదయాత్రలో ఉండగా మహీధర్‌రెడ్డి వైసీపీలో చేరారు. అనపర్తి నియోజకవర్గం రాయవరం నుంచి ఉదయం మొదలైన పాదయాత్ర బిక్కవోలు మండలం కొమరిపాలెం, తొస్సిపూడి, పందలపాక, ఊలపల్లిలంక వరకూ సాగింది. మధ్యాహ్నం 2 గంటలకే యాత్ర ముగించారు. పలువురు వినతి పత్రాలు సమర్పించారు. ప్రారంభ సమయంలో జగన్‌ వెంట అధిక సంఖ్యలో అభిమానులు ఉండగా పాదయాత్ర ముగిసే సమయానికి పలచబడటం నాయకులను కలవరపరిచింది.
Link to comment
Share on other sites

వైసీపీ నేతల్లో అభద్రతా భావం.. ఆ ఏడుగురికి టికెట్లు కష్టమే!?
14-07-2018 14:11:11
 
636671742708466183.jpg
  • పాత సమన్వయకర్తలను పక్కనపెట్టి..
  • కొత్త వారికి బాధ్యతలు
  • సగానికిపైగా నియోజకవర్గాల్లో అదే పరిస్థితి
  • ఎవరికీ టిక్కెట్‌పై లేని గ్యారంటీ
  • సగానికి పైగా నియోజకవర్గాలలో అదే పరిస్థితి
ప్రకాశం జిల్లాలోని వైసీపీ నాయకులలో అభద్రతాభావం నెలకొంది. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలుగా పనిచేస్తున్న వారిలో ఇది మరింతగా పెరిగిపోయింది. గెలుపు గుర్రాలే లక్ష్యంగా ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఆపార్టీ అధినేత జగన్‌ ఆయా నియోజకవర్గాల వారీ ఫిరాయింపులకు ప్రాధాన్యమివ్వటమే గాక కొత్తగా వచ్చిన వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వటానికి కూడా సిద్ధపడటం అందుకు కారణ ం. రమారమి జిల్లాలో సగం అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆపరిస్థితి నెలకొంది. ఒకరకంగా గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరేటప్పుడు టీడీపీ నాయకులలో నెలకొన్న పరిస్థితికి రెట్టింపు అభద్రత ఇప్పుడు వైసీపీ నాయకుల్లో నెలకొనటం విశేషం.
 
 
ఒంగోలు: జిల్లాలో వైసీపీ నాయకుల్లో అభద్రతా భావం నెలకొంది. పార్టీ అధిష్ఠానం కొత్తనేతలను చేర్చుకుని పాతవారిని పక్క నపెడుతుండటంతో క్యాడర్‌ కూడా గందరగోళానికి గురవుతోంది. జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సమన్వయకర్తలుగా ఉన్న వా రిలో ఎందరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో, ఎందరిని తప్పిస్తారో అర్థంకాకుండా ఉంది. ఒకరకంగా గతంలో వైసీ పీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిక సమయంలో అధికార పార్టీ నాయకుల్లో ఎలాంటి అభ్రతా భావం నెలకొందో అలాంటి పరిస్థితే ఇప్పుడు వైసీపీలో కనిపిస్తోంది. ఇప్పటికే కందుకూరులో మాజీమంత్రి మహీధర్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకోగా, మరో ఐదారు నియోజకవర్గాల్లో అలాంటి వాతావరణం కన్పిస్తోంది. ఇతర పార్టీలకు చెందిన నాయకులు కొందరు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆపార్టీ నాయకులు ప్రకటించటం కూడా పార్టీలో ఉన్న నేతలను కలవరానికి గురి చేస్తోంది.
 
 
జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉం డగా ఒంగోలు లోక్‌సభతో పాటు బాపట్ల, నె ల్లూరు లోక్‌సభ స్థానాలకు జిల్లాతో సంబం ధం ఉంది. నెల్లూరు లోక్‌సభ పరిధిలో జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం భాగంగా ఉంది. అక్కడి నుంచి తిరిగి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పోటీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బాపట్ల లోక్‌సభ అభ్యర్థిపై ఆపార్టీలో స్పష్టత లేదు. గత ఎన్నికల్లో పోటీచేసిన జిల్లాకు చెందిన డాక్టర్‌ అమృతపాణి అభద్రతాభావంతోనే కొనసాగుతున్నారు. ఇక ఒంగోలులో తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. మేధావు లు, తటస్థుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన్ను పార్టీపనులకు పరిమితం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. తిరిగి పోటీకి సన్నద్ధమై కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న వైవీ కూడా తనకు టిక్కెకై పూర్తి స్థాయిలో నమ్మకంతో లేరని ఆయన సన్నిహితులే అంటున్నారు.
 
pksm-014.jpg 
pksm-02.jpgఏడుగురి విషయంలో ఊగిసలాట.. 
 
ఏడు నియజకవర్గాల సమన్వయకర్తల విషయంలో వైసీపీ ఊగిసలాట ధోరణిని అనుసరిస్తోంది. కొండపి వ్యవహారమైతే శ్రుతిమించి రాగాన పడింది. ఒకవైపు నియోజకవర్గ సమన్వయకర్త అశోక్‌బాబు మద్దతుదారులు ఆయన ఏం తప్పు చేశాడో చెప్పాలంటూ అధిష్ఠానాన్ని నిలదీస్తున్నారు. ఇంకోవైపు తనను కలుస్తున్న ఆశావహులను జగనే స్వయంగా ప్రోత్సహిస్తున్నారు. పర్చూరు, చీరాల విషయంలో అయితే దీటైన అభ్యర్థులు దొరికితే ప్రస్తుత సమన్వయకర్తలను పక్కనపెట్టి వారికే టిక్కెట్లు ఇస్తామని ఆపార్టీ నాయకులు బహిరంగంగా చెప్తున్నారు. చీరాలలో ప్రస్తుత ఇన్‌చార్జి యడం బాలాజీని గౌరవిస్తూనే యాదవ సామాజికవర్గ అభ్యర్థిని రంగంలోకి దించుతామని ఆపార్టీ నాయకులు చెప్తున్నారు. పర్చూరులో కమ్మ సామాజికవర్గం నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న బలమైన కుటుంబ వారసుడి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గిద్దలూరులో ఇన్‌చార్జ్‌ ఐవీ రెడ్డిని ప్రోత్సహిస్తూనే ఇంకా బలమైన అభ్యర్థి దొరకితే చూస్తామన్న చందంగా అధిష్ఠానం వ్యవహరిస్తోంది. ఇటు ఐవీ రెడ్డితో పాటు, పిడతల రంగారెడ్డి కుటుంబ వారసురాలు, మాజీఎమ్మెల్యే సాయికల్పన రెడ్డికి కూడా అధిష్ఠానం ఆశలు కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది.
 
pksm-01125.jpgఐదుగురు ఖాయం.. 
అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికొస్తే ఆపార్టీకి కీలకనేత అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో తన రాజకీయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తిరిగి పోటీకి సిద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎర్రగొండపాలెం నుంచి ఆదిమూలపు సురేష్‌, కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, తాజాగా దర్శి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన బాదం మాధవ రెడ్డి, కందుకూరు నుంచి రంగంలోకి వచ్చిన మానుగుంట మహీధర్‌ రెడ్డిలకు సీటు గ్యారంటీ అన్న పరిస్థితి ఉంది.
 
 
టీడీపీ అసమ్మతివాదుల వైపు చూపు
టీడీపీలో అసంతృప్తివాదుల వైపు వైసీపీ దృష్టి సారించింది. ఇద్దరు ముగ్గురు నాయకులను ప్రత్యేకంగా ఎంచుకుని వారి రాకకోసం వేచిచూసే ధోరణిలో ఉంది. ఒకరిద్దరికి పోటీచేసే అవకాశం టీడీపీ ఇవ్వలేదని, అందువలన వారు తమ పార్టీవైపు వస్తారని వైసీపీ నాయకులు వేచి చూస్తున్నారు. ఆ కోవలోనే బలమైన నాయకుడు డాక్టర్‌ గరటయ్య రంగంలో ఉన్నప్పటికీ అద్దంకి విషయంలో అయోమయం నెలకొందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి రెండున్నర సంవత్సరాల క్రితం వైసీపీ శాసనసభ్యులు టీడీపీ చేరే సమయంలో అధికార పార్టీ నాయకుల్లో ఎలాంటి అభద్రతా భావం నెలకొన్నదో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గాల వారీ ప్రత్యామ్నాయ మార్గాలతో పరిస్థితిని చక్కదిద్దుకుంటుండగా, వైసీపీ అత్యుత్సాహంతో టీడీపీ వాళ్ల కోసం ఎదురుచూస్తూ పరిస్థితిని గందరగోళంగా మార్చుకుంటున్నదన్న భావన పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. .
 
ఎస్‌ఎన్‌పాడు విషయంలో పునఃపరిశీలన
సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల గుంటూరు జిల్లా నుంచి సుధాకర్‌బాబు అనే నాయకుడిని దిగుమతి చేసుకున్నారు. గత ఎన్నికలలో పార్టీ అభ్యర్థిని గెలిపించిన నియోజకవర్గంలో స్థానిక నాయకుడు, కనీసం జిల్లాకు చెందిన నాయకుడు దొరకలేదా అన్న ప్రశ్న ఉత్పన్నం కావటంతో పునఃపరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. సుధాకర్‌బాబు మాత్రం స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకుని పార్టీ నాయకులను సమన్వయం చేసుకునే పనిలో ఉన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పట్ల పార్టీ అధిష్ఠానం పూర్తి సానుకూలతతో ఉంది. ప్రలోభాలకు అతీతంగా పార్టీతో ఉండటం, ఎలాంటి ఆరోపణలు లేకపోవటం పట్ల జగన్‌ ప్రత్యేక ఆసక్తితో ఉన్నారు. కానీ సీనియర్‌ నాయకుడు కె.పి. కొండారెడ్డి, ఆయన వియ్యంకుడు ఉడుముల శ్రీనివాసులరెడ్డి మద్ధతు లేకపోతే గెలవలేమని ఒకసారి వారికి అవకాశం ఇవ్వాలని కొందరు పట్టుబడుతున్నారు. ఈ విషయంపై కూడా జగన్‌ నుంచి స్పష్టత రాకపోవటంతో వైసిపి నాయకులలో అయోమయం నెలకొంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...