Jump to content

AgriGold


Recommended Posts

  • Replies 73
  • Created
  • Last Reply
సొంతంగా ఆదుకుందాం!
01-06-2018 02:48:01
 
  • అగ్రిగోల్డ్‌ చిన్న డిపాజిటర్లకు ప్రభుత్వ నిధులతో సాయం
  • హైకోర్టుకు నివేదించనున్న సర్కారు
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ బాధితులను సొంతంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నమొత్తంలో డిపాజిట్లు చేసిన నిరుపేద వర్గాలకు ప్రభుత్వమే సొంత ఖర్చుతో సహాయం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అగ్రిగోల్డ్‌ కేసు ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉన్నందున ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించాలని, ఈ కేసులో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేక న్యాయనిపుణుడిని రప్పించి కోర్టులో వాదనలు వినిపించాలని గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది.
 
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశ వివరాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏపీలో కనీసం 19లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులున్నారు. ఏపీకి చెందిన వారికే లబ్ధిచేకూరుస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశంపై అధ్యయనం చేస్తున్న మంత్రివర్గ ఉపసంఘాన్ని త్వరగా అధ్యయన నివేదిక సమర్పించాలని మంత్రివర్గం ఆదేశించినట్లు కాలువ వివరించారు. కేబినెట్‌ ఇతర నిర్ణయాలివీ..
 
ఆటోమ్యుటేషన్‌, సాదాబైనామాలకు ఓకే
భూమి రికార్డుల మ్యుటేషన్‌లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఆటోమ్యుటేషన్‌ను చేపట్టాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం రిజిస్ట్రార్‌ ఆఫీసులో భూమి క్రయవిక్రయాలకు సంబంధించిన నకలు ప్రతిని అప్పటికప్పుడు (రియల్‌ టైమ్‌) ఆన్‌లైన్‌ ద్వారా వెబ్‌ల్యాండ్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. దీనికి సంబంధించి తహశీల్దార్‌ కార్యాలయంలో 30 రోజులపాటు పరిశీలనకు ఉంచుతారు. ఎలాంటి అభ్యంతరాలూ రాని పక్షంలో ఆన్‌లైన్‌లో ఆటోమెటిక్‌ మ్యూటేషన్‌ జరుగుతుంది. అప్పటికీ అభ్యంతరాలు వ్యక్తపరచాలనుకుంటే మరో 15 రోజులు అప్పీల్‌ గడువు ఇస్తారు. ఈ విధానం అమలుకు ఆంధ్రప్రదేశ్‌ భూమి హక్కులు, పట్టాదార్‌ పాస్‌బుక్‌ చట్టం-1971 (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ యాక్ట్‌-ఆర్‌వోఆర్‌)ను సవరించాలి. చట్టసవరణ అనంతరమే ఈ విధానం అమల్లోకి రానుంది.
 
 
మరోవైపు వివిధ కారణాల వల్ల భూముల క్రయవిక్రయాలు జరిగి వాటిని తెల్లకాగితాలు లేదా డాక్యుమెంట్లపై రాసుకున్న సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు ఎకరాల వరకూ స్టాంప్‌డ్యూటీని వసూలు చేయకూడదని తీర్మానించింది. 2014 జూన్‌ 2నాటికి ఉన్న సాదాబైనామాలనే పరిగణనలోకి తీసుకునేలా కటాఫ్ డేట్‌ పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూములకే ఈ మినహాయింపు వర్తిస్తుంది.
  • మెడికల్‌ ప్రాక్టీస్‌ చేసే వైద్యులు రిజిస్ట్రేషన్‌ పొందేందుకు ప్రభుత్వ వైద్యశాలలో తప్పనిసరిగా ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలన్న క్లాజును ఐచ్చికం చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం.
  • రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులను నిల్వచేసే శీతల గిడ్డంగుల(కోల్డ్‌స్టోరేజీ)ను భారీగా ప్రమోట్‌ చేసే కార్యాచరణకు ఆమోదం.
  • కోస్తా తీరంలో నిర్మించిన పైపులైన్ల ద్వారా పెట్రోలు సహా వివిధ ఉత్పత్తుల సరఫరాపై పైపులైన్‌ చార్జీలు విధించడానికి ఆమోదం.
  • రాష్ట్రంలో పాడిపరిశ్రమను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు బలహీనవర్గాల పేదలకు ఆయా కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా మేలిరకం పాడిపశువులను కొనుగోలు చేసి అందించాలన్న ప్రతిపాదనకు ఆమోదం.
  • పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ (ధవళేశ్వరం విభాగం)కు ప్రత్యేక ఇంప్రెస్డ్‌ నిధి రూ. 160 కోట్ల నుంచి రూ. 170 కోట్లకు పెంపు.
  • ఆహార ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం... చేతల్లో సహకరించడం లేదంటూ మంత్రివర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీకి న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది.
  • పదోతరగతి గణితంలో ఏపీ విద్యార్థులు దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు మంత్రివర్గం హర్షం వ్యక్తం చేసింది. ఉత్తమ ఫలితాలు సాధించినన విద్యార్థులు, గురువులకు అభినందనలు తెలిపింది.
Link to comment
Share on other sites

అగ్రిగోల్డ్‌ బాధితుల్లో పేదలు ఉన్నందున.. వారందరికీ సత్వర న్యాయం చేసేందుకు దిల్లీ నుంచి నిపుణులను ప్రభుత్వం తరఫున తీసుకొచ్చి హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు.
* లబ్ధిదారులనే నేరుగా ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లి వారికి నచ్చిన పాడి పశువులను కొనుగోలు చేయడానికి అవకాశం.

Link to comment
Share on other sites

Ah pk ki cheppandi evaranna rechipitunnadu.. 

agrigold aastulu  tdp vallu takkuvaku teeskunte mana prabhutvam vaste venakku ista antunnadu :wall:

Link to comment
Share on other sites

5 minutes ago, John said:

Ah pk ki cheppandi evaranna rechipitunnadu.. 

agrigold aastulu  tdp vallu takkuvaku teeskunte mana prabhutvam vaste venakku ista antunnadu :wall:

vadi mummy le brother, case high court lo undi court anumathi lekunda govt ammaledu vadi sollu kaburlu , AP lo  ela istam vacchinattu vage batch ekkuvayyaru adi chupiche media okati.. adi namme vp lu unnaru mana karma..

Link to comment
Share on other sites

31 minutes ago, sonykongara said:

vadi mummy le brother, case high court lo undi court anumathi lekunda govt ammaledu vadi sollu kaburlu , AP lo  ela istam vacchinattu vage batch ekkuvayyaru adi chupiche media okati.. adi namme vp lu unnaru mana karma..

Mana vallu counter ivvatam lo venakabadi unnaru.Court lo case nadustunte istamochinattu matladitey emi chestunnaru 

Link to comment
Share on other sites

అగ్రిగోల్డ్‌ సమస్యను ఈ నెలలోనే పరిష్కరించేలా చూడండి: సీఎం

ఈనాడు, అమరావతి: అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారానికి ఈ నెలలోనే పరిష్కారం దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ‘‘అగ్రిగోల్డ్‌ సమస్య మళ్లీ వివాదాల్లో పడటానికి వీల్లేదు. మూడేళ్లు ట్రస్ట్‌ కోసం చూశాం. అన్ని సమస్యలపై న్యాయస్థానాన్ని ఒప్పించండి. వేలానికి మార్గదర్శకాలు రూపొందించండి. ప్రభుత్వ మార్గదర్శకాలను న్యాయస్థానానికి పంపండి. రాష్ట్ర ప్రభుత్వం కార్పస్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అగ్రిగోల్డ్‌ ఆస్తులపై బకాయిలు గురించి బ్యాంకర్లతో చర్చించండి. న్యాయస్థానం ఆధ్వర్యంలో, ప్రభుత్వ పర్యవేక్షణలో వేలం నిర్వహించడానికి అనుమతి అడగండి. 13జిల్లాల ప్రతినిధులు కూడా ఈ పరిష్కార ప్రక్రియలో భాగాస్వాములను చేయాలి...’’ అని సీఎం సూచించారు.

Link to comment
Share on other sites

అగ్రిగోల్డ్‌ కేసులో మరో కీలక మలుపు
5brk126-Hc.jpg

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయానికి సంబంధించిన కేసు అనేక మలుపులు తిరుగుతోంది. గతంలో తాము ఆ కంపెనీని టేకోవర్‌ చేసుకుంటామంటూ ముందుకొచ్చిన జీఎస్సెల్‌ గ్రూప్‌ ఆ తర్వాత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు హైకోర్టు విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు మరోసారి జీఎస్సెల్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది. గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా 10 ఆస్తులకు సంబంధించిన విలువను సీఐడీ కోర్టుకు సమర్పించింది. సీఐడీ సమర్పించిన ఆస్తుల విలువ చెప్పాలని అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే, అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదనతో ముందుకొచ్చినట్టు సమాచారం. జిల్లాల వారీగా ఉన్నతస్థాయి కమిటీలు ఏర్పాటుచేసి వాటిద్వారా అగ్రిగోల్డ్‌ ఆస్తులను వేలం వేయాలని ప్రతిపాదించింది. దీన్ని విన్న ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

మళ్లీ రేసులోకి ఎస్సెల్‌ గ్రూపు
‘అగ్రిగోల్డ్‌’ను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమని వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ ఆస్తుల స్వాధీనానికి ఎస్సెల్‌ గ్రూపు(సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌) మళ్లీ ముందుకొచ్చింది. సంస్థ ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయంటూ అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకునే ఉద్దేశం లేదని, ఆస్తి అప్పుల మదింపు ప్రక్రియను నిలిపివేస్తున్నామంటూ ఏప్రిల్‌లో హైకోర్టుకు ఎస్సెల్‌ నివేదించిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఈ ప్రక్రియ నుంచి తప్పుకోవడానికి అనుమతించాలని, తాము డిపాజిట్‌ చేసిన రూ.10 కోట్లను వాపసు ఇప్పించాలంటూ ఈ నెల 1న అఫిడవిట్‌ సిద్ధం చేసి 4న కోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్‌ గ్రూపు 5న కోర్టులో విచారణకు రాగానే ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని అభ్యర్థించింది. ఈ మేరకు ఎస్సెల్‌ గ్రూపు తరఫు సీనియర్‌ న్యాయవాది శ్రీరఘురాం అభ్యర్థనను హైకోర్టు అనుమతించింది. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఎస్సెల్‌ గ్రూపు 24 గంటల్లో మాటమార్చడం విశేషం.

మరోవైపు అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి సంబంధించి జిల్లా జడ్జి ఛైర్మన్‌గా, కలెక్టర్‌, జిల్లా రిజిస్ట్రార్‌ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేగాకుండా అవసరమైతే కొంత మొత్తాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అనుమతిస్తే బ్యాంకులతో ఓటీఎస్‌(ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌)కు చర్చిస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు. అత్యధిక విలువ ఉన్న 10 ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రార్‌, వాల్యువర్‌, రియల్టర్‌లు సమర్పించిన ధరలను సీఐడీ హైకోర్టుకు సమర్పించింది. అయితే ఈ ధరలు తక్కువగా ఉన్నాయని, వాస్తవ ధరలు చెప్పడానికి 10 రోజుల గడువు కావాలన్న అగ్రిగోల్డ్‌ యాజమాన్యం అభ్యర్థనపై తదుపరి విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది. కోట్ల రూపాయల డిపాజిట్‌లు స్వీకరించి చేతులెత్తేసిన అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్‌ రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ అదే రోజు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ రిపోర్టు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో ఉన్న ఆస్తులకు సంబంధించి ఏపీ సీఐడీలాగా విలువైన ఆస్తుల గుర్తించి వాటి విలువను మదింపు చేసి సమర్పించాలని తెలంగాణ సీఐడీని ఆదేశించింది.

అక్షయ్‌గోల్డ్‌కు చెందిన రెండు ఆస్తులకు బిడ్‌లు
అక్షయ్‌ గోల్డ్‌కు చెందిన 4 ఆస్తుల వేలానికి బిడ్‌లు ఆహ్వానించగా కర్నూలు, అనంతపురం జిల్లాలోని రెండింటికి వచ్చాయంటూ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణప్రకాశ్‌ హైకోర్టుకు తెలిపారు. అక్షయ్‌గోల్డ్‌ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఏజెంట్‌ల సంక్షేమ సంఘం దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

హైకోర్టుకు అగ్రిగోల్డ్‌ ఆస్తుల జాబితా
- అత్యధిక విలువ కలిగిన పది ఆస్తుల వివరాలు సమర్పించిన ఏపీ సీఐడీ
ఈనాడు, అమరావతి: అగ్రిగోల్డ్‌కు సంబంధించి అత్యధిక విలువ కలిగిన పది ఆస్తుల జాబితాను ఏపీ సీఐడీ మంగళవారం హైకోర్టుకు సమర్పించింది. ఏప్రిల్‌ 25న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దీన్ని రూపొందించింది. ఇవన్నీ ఏ బ్యాంకులోనూ తనఖాలో లేనివే. అగ్రిగోల్డ్‌ కేసులో కాంపింటెంట్‌ అథారిటీగా వ్యవహరిస్తున్న సీఐడీ అదనపు డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఈ వివరాలను హైకోర్టుకు నివేదించారు.
ఆస్తుల జాబితాలోని కొన్నింటి వివరాలు
మచిలీపట్నంలోని చల్లపల్లి జమీందార్‌ వీధిలో ఖాళీ ప్లాట్‌
విజయవాడ మొగల్రాజపురంలో 24000.92 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన జీ ప్లస్‌ 4 భవనం. విలువ రూ.10.55 కోట్లు.
విజయవాడ కండ్రికలో 4199.7 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన పారిశ్రామిక భవనం (5427.64 నిర్మితప్రాంతం). విలువ రూ.9.23 కోట్లు.
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామం అల్లూరు రోడ్డులోని వ్యవసాయ భూమి.
విజయవాడ వాంబే కాలనీలో ఖాళీ ప్లాట్‌.
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పోతెగుంట గ్రామంలో వ్యవసాయ భూమి. విలువ రూ.6.7 కోట్లు.
విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో 75.96 ఎకరాల భూమి (టేకు, చింత తదితర చెట్లున్నాయి). విలువ రూ.4.93 కోట్లు.
 
Link to comment
Share on other sites

అగ్రి ఆస్తుల వేలానికి జిల్లాల వారీ కమిటీలు!
06-06-2018 02:39:16
 
636638495646206548.jpg
  • ఏపీ అభ్యర్థనకు హైకోర్టు ఓకే
  • కమిటీ సభ్యులపై 8న నిర్ణయం
  • ఆస్తుల ధరలపై అభ్యంతరాలకు అవకాశం
హైదరాబాద్‌, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): డిపాజిటర్లకు శఠగోపం పెట్టిన అగ్రిగోల్డ్‌ సంస్థకు చెందిన ఆస్తులను జిల్లాల వారీగా గుర్తించి ఏకకాలంలో వేలం వేయడం ద్వారా ఏపీలోని 60ు మంది అగ్రి బాధితులకు ఉపశమనం కల్పించవచ్చన్న ఏపీ ప్రభుత్వ వాదనకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అగ్రిగోల్డ్‌ ఆస్తులు అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయని, ఆయా ఆస్తులను ఏకకాలంలో వేలం వేసేందుకు జిల్లా జడ్జి నేతృత్వంలో కమిటీలు వేయాలని ఏపీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను అభ్యర్థించారు.
 
కమిటీల ఏర్పాటుతో సమస్యకు సాధ్యమైనంత వేగంగా పరిష్కారం లభించే అవకాశముందన్నారు. అయితే, అదేసమయంలో అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులు అమ్మకానికి పెట్టినప్పుడు బ్యాంకర్లు అడ్డు పడుతున్నారని, ఈ అంశంలో బ్యాంకర్లతో వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద పరిష్కారం కోసం సంప్రదింపులు జరపడానికి అనుమతించాలని కోరారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం బ్యాంకర్ల అప్పులు సెటిల్‌ చేయడం ప్రధానం కాదని తేల్చి చెప్పింది.
 
 
అయితే, ఏపీ సూచించిన విధంగా జిల్లాల వారీ కమిటీలు వేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. కమిటీల్లో ఎవరెవరు సభ్యులుగా ఉండాలో ఈ నెల 8న జరిగే విచారణలో నిర్ణయిస్తామని తెలిపింది. ఇదిలావుంటే, వేలానికి సిద్ధం చేసిన అగ్రిగోల్డ్‌ సంస్థకు చెందిన 10 ఆస్తులకు సంబంధించి సీఐడీ అధికారులు పేర్కొన్న ధరలపై అభ్యంతరాలుంటే శుక్రవారంలోగా తెలపాలని అగ్రిగోల్డ్‌ సంస్థ తరఫు న్యాయవాదికి బెంచ్‌ తేల్చి చెప్పింది. ఇప్పటికే పలు అవకాశాలు ఇచ్చామని, గత వేలంలో విక్రయించిన ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలుదారులను తెస్తామన్న అగ్రిగోల్డ్‌ సంస్థ ఆ నిలబెట్టుకోలేదని ధర్మాసనం పేర్కొంది.
 
 
అధికారులు నిర్ణయించిన ధరలపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపింది. అగ్రిగోల్డ్‌ ఆస్తులకు సంబంధించి ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు సంబంధించిన వివరాలను తదుపరి విచారణ నాటికి కోర్టు ముందుంచాలని ఆదేశించింది. ఏపీ సీఐడీ అధికారులు ఆస్తులకు సంబంధించి ఎస్‌ఆర్‌వో ధర, మార్కెట్‌ ధర, రియల్టర్‌ ధరలపై నివేదిక ఇచ్చిన మాదిరిగానే తెలంగాణ డీఐజీ(సీఐడీ) ఒక నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేస్తూ.. జస్టిస్‌ రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎస్‌.వి. భట్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
 
 
అక్షయగోల్డ్‌ వ్యవహారంలో
అక్షయగోల్డ్‌ సంస్థకు చెందిన 4 ఆస్తులకు సంబంధించి వచ్చిన బిడ్డర్లు పేర్కొన్న ధరలపై అభ్యంతరాలుంటే శుక్రవారం లోగా తెలపాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అధికారులు నిర్ణయించిన కనీస ధర, బిడ్డర్లు వేసిన దానికంటే ఎక్కువ ధరకు ఆయా ఆస్తులను కొనుగోలు చేసే వారు ఎవరున్నా తెచ్చుకోవచ్చని పిటిషనర్‌కు, ఈ వ్యాజ్యంలో ఇంప్లీడ్‌ పిటిషనర్‌కు సూచించింది.
Link to comment
Share on other sites

On 6/2/2018 at 7:02 PM, minion said:

ee agrigold victims govt ni bedirinchatam baaledu. vaalla private investments lo loss ki govt bail out demand cheyyatamemiti.

I hope AP govt doesn't pay with tax payers money. 

About 50% of them will be from decoit school who believe in "Evaru tinadam ledandi" philosophy

Ilanti vallaki jaffa gaade correct - "Evaru tinadam ledandi" antadu. case close :D

Link to comment
Share on other sites

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి లైన్ క్లియర్
08-06-2018 17:25:48
 
636640755566516302.jpg
హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి లైన్ క్లియర్ అయింది. దీనికోసం త్రిసభ్య కమిటీకి హైకోర్టు ఆమోదం తెలిపింది. జిల్లా కలెక్టర్, జిల్లా రిజిస్టార్, జిల్లా లీగల్ సర్వీస్ సెక్రటరీతో కమిటీ ఏర్పాటు చేసి.. దాంతో కలిసి ఆస్తులు వేలం వేయాలని న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది. ఇదే తరహాలో అన్నీ జిల్లాల్లో వేలం వేయాలని ధర్మాసనం ఆదేశించింది. మొదట గుర్తించిన పది ఆస్తుల్లో ఐదు ఆస్తుల వేలంపై ప్రకటలిచ్చి, ఆరు వారాల్లో పక్రియ పూర్తి చేయాలని హైకోర్టు పేర్కొంది. తరుపరి విచారణను జూన్ 21కి వాయిదా వేసింది.
Link to comment
Share on other sites

గ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయానికి కమిటీ
సభ్యులుగా కలెక్టర్‌, జిల్లా రిజిస్ట్రార్‌, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి
ఉమ్మడి హైకోర్టు ఆదేశం
కృష్ణాలో 5 ఆస్తుల అమ్మకానికి సిఫారసు
ఈనాడు - హైదరాబాద్‌
8ap-main9a.jpg

గ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను జిల్లా కమిటీ ద్వారా విక్రయించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది. జిల్లా కలెక్టర్‌, జిల్లా రిజిస్ట్రార్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిలతో కూడిన కమిటీ వేలం ప్రక్రియ నిర్వహించాలని, వీరికి సీఐడీ అధికారి ఒకరు సహకారం అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మొదటి విడతలో కృష్ణా జిల్లాలో గుర్తించిన అయిదు ఆస్తుల వేలానికిగాను కమిటీకి సిఫారసు చేసింది. రూ.కోట్ల డిపాజిట్‌లు స్వీకరించి చేతులెత్తేసిన అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్‌ రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. గత విచారణలో.. జిల్లా కమిటీల ద్వారా ఆస్తులను విక్రయించాలన్న ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ ప్రతిపాదనకు ధర్మాసనం ఆమోదం తెలిపింది. అయితే జిల్లా జడ్జి స్థానంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉంటారని వెల్లడించింది. మొదటి విడతగా కృష్ణా జిల్లా గాంధీనగర్‌లోని వాణిజ్య షెడ్‌, స్థలం కలిపి 1712 చదరపు గజాలు, మచిలీపట్నంలో ప్లాట్‌, విజయవాడ మొగల్రాజపురంలో భవనం, మచిలీపట్నంలో ప్లాట్‌, వీర్లపాడు మండలంలో వ్యవసాయ భూమి, విజయవాడ పాయకాపురంలో ఖాళీ ప్లాట్‌లను వేలం వేయాలని కమిటీకి సూచించింది. దీనిపై రెండు వారాల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని, రెండు తెలుగు పత్రికల జిల్లా ఎడిషన్‌లలో వేలం గురించి తక్కువ ఖర్చుతో సంక్షిప్త ప్రకటన ఇవ్వాలని, పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచి అదే విషయాన్ని ప్రకటనలో తెలియజేయాలని సూచించింది. కరపత్రాలతోపాటు స్థానిక పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాల్లో వేలం నోటీసులు ఉంచాలని, దండోరా వేయించాలని ఆదేశించింది. ఈ-వేలంలో పేర్కొన్న నిబంధనలే ఇక్కడా వర్తిస్తాయని తెలిపింది. సీఐడీ మొత్తం 10 ఆస్తులను సిద్ధం చేసి విలువలను కోర్టుకు సమర్పించగా, అవి తక్కువగా ఉన్నాయంటూ అగ్రి యాజమాన్యం తెలిపింది. 10 ఆస్తుల్లో రెండు ఆంధ్రాబ్యాంకు తాకట్టులో ఉన్నాయని, ఒకటి ఇప్పటికే అమ్మివేసినట్లు వారి తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ చెప్పారు. ఆస్తుల జప్తు జరగకముందే విక్రయించినట్లు చెప్పారు. అది రిజిస్టర్‌ కాలేదని ఏపీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ విక్రయ దస్తావేజును సమర్పించాలంటూ యాజమాన్యం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ప్రభుత్వం, యాజమాన్యం సమర్పించిన ఆస్తుల విలువలు రెండు మినహా మిగిలినవి దగ్గరగా ఉండటంతో వాటి విక్రయానికి అనుమతించింది. ధరలో వ్యత్యాసం ఎక్కువగా ఉన్న వాటి గురించి వచ్చే విచారణలో పరిశీలిస్తామని పేర్కొంటూ విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ రిపోర్టును ఏజీ కోర్టుకు అందజేస్తూ కేవలం కోర్టు పరిశీలనకు మాత్రమే ఇస్తున్నామని చెప్పారు.

అక్షయ్‌గోల్డ్‌ వ్యవహారంలో బిడ్‌దారు హాజరుకు ఆదేశం
అక్షయ్‌ గోల్డ్‌కు చెందిన గుర్తించిన 4 ఆస్తుల్లో రెండింటికి మాత్రమే బిడ్‌లు రాగా, ఒకదానికి రెండు బిడ్‌లు వచ్చిన విషయం విదితమే. ఇందులో కర్నూలులోని ఒక భవనం రూ.1.31 కోట్లు బిడ్‌ రాగా, పిటిషనర్లు రూ.1.51 కోట్లు దాకా చెల్లించడనికి సిద్ధంగా ఉన్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కరణం శ్రావణ్‌కుమార్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా బిడ్‌ దాఖలు చేసిన వ్యక్తితోపాటు, పిటిషనర్‌ సూచించిన వ్యక్తి కూడా ఈ నెల 25న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఒకే బిడ్‌ వచ్చిన ఆస్తి వేలం ప్రక్రియను నిలిపివేస్తూ అగ్రిగోల్డ్‌ వ్యవహారంలోలాగా అక్షయ్‌గోల్డ్‌కు చెందిన ఆస్తులనూ విక్రయించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో అక్షయ్‌ గోల్డ్‌కు చెందిన 10 ఆస్తుల వివరాలను, వాటి విలువలను ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌ అందజేశారు. వీటికి సంబంధించి అంచనా విలువలను సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది.

Link to comment
Share on other sites

అగ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయానికి కమిటీ
సభ్యులుగా కలెక్టర్‌, జిల్లా రిజిస్ట్రార్‌, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి
ఉమ్మడి హైకోర్టు ఆదేశం
కృష్ణాలో 5 ఆస్తుల అమ్మకానికి సిఫారసు
ఈనాడు - హైదరాబాద్‌
8ap-main9a.jpg

గ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను జిల్లా కమిటీ ద్వారా విక్రయించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది. జిల్లా కలెక్టర్‌, జిల్లా రిజిస్ట్రార్‌, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిలతో కూడిన కమిటీ వేలం ప్రక్రియ నిర్వహించాలని, వీరికి సీఐడీ అధికారి ఒకరు సహకారం అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మొదటి విడతలో కృష్ణా జిల్లాలో గుర్తించిన అయిదు ఆస్తుల వేలానికిగాను కమిటీకి సిఫారసు చేసింది. రూ.కోట్ల డిపాజిట్‌లు స్వీకరించి చేతులెత్తేసిన అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్‌ రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. గత విచారణలో.. జిల్లా కమిటీల ద్వారా ఆస్తులను విక్రయించాలన్న ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ ప్రతిపాదనకు ధర్మాసనం ఆమోదం తెలిపింది. అయితే జిల్లా జడ్జి స్థానంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఉంటారని వెల్లడించింది. మొదటి విడతగా కృష్ణా జిల్లా గాంధీనగర్‌లోని వాణిజ్య షెడ్‌, స్థలం కలిపి 1712 చదరపు గజాలు, మచిలీపట్నంలో ప్లాట్‌, విజయవాడ మొగల్రాజపురంలో భవనం, మచిలీపట్నంలో ప్లాట్‌, వీర్లపాడు మండలంలో వ్యవసాయ భూమి, విజయవాడ పాయకాపురంలో ఖాళీ ప్లాట్‌లను వేలం వేయాలని కమిటీకి సూచించింది. దీనిపై రెండు వారాల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని, రెండు తెలుగు పత్రికల జిల్లా ఎడిషన్‌లలో వేలం గురించి తక్కువ ఖర్చుతో సంక్షిప్త ప్రకటన ఇవ్వాలని, పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచి అదే విషయాన్ని ప్రకటనలో తెలియజేయాలని సూచించింది. కరపత్రాలతోపాటు స్థానిక పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాల్లో వేలం నోటీసులు ఉంచాలని, దండోరా వేయించాలని ఆదేశించింది. ఈ-వేలంలో పేర్కొన్న నిబంధనలే ఇక్కడా వర్తిస్తాయని తెలిపింది. సీఐడీ మొత్తం 10 ఆస్తులను సిద్ధం చేసి విలువలను కోర్టుకు సమర్పించగా, అవి తక్కువగా ఉన్నాయంటూ అగ్రి యాజమాన్యం తెలిపింది. 10 ఆస్తుల్లో రెండు ఆంధ్రాబ్యాంకు తాకట్టులో ఉన్నాయని, ఒకటి ఇప్పటికే అమ్మివేసినట్లు వారి తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ చెప్పారు. ఆస్తుల జప్తు జరగకముందే విక్రయించినట్లు చెప్పారు. అది రిజిస్టర్‌ కాలేదని ఏపీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ విక్రయ దస్తావేజును సమర్పించాలంటూ యాజమాన్యం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ప్రభుత్వం, యాజమాన్యం సమర్పించిన ఆస్తుల విలువలు రెండు మినహా మిగిలినవి దగ్గరగా ఉండటంతో వాటి విక్రయానికి అనుమతించింది. ధరలో వ్యత్యాసం ఎక్కువగా ఉన్న వాటి గురించి వచ్చే విచారణలో పరిశీలిస్తామని పేర్కొంటూ విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ రిపోర్టును ఏజీ కోర్టుకు అందజేస్తూ కేవలం కోర్టు పరిశీలనకు మాత్రమే ఇస్తున్నామని చెప్పారు.

అక్షయ్‌గోల్డ్‌ వ్యవహారంలో బిడ్‌దారు హాజరుకు ఆదేశం
అక్షయ్‌ గోల్డ్‌కు చెందిన గుర్తించిన 4 ఆస్తుల్లో రెండింటికి మాత్రమే బిడ్‌లు రాగా, ఒకదానికి రెండు బిడ్‌లు వచ్చిన విషయం విదితమే. ఇందులో కర్నూలులోని ఒక భవనం రూ.1.31 కోట్లు బిడ్‌ రాగా, పిటిషనర్లు రూ.1.51 కోట్లు దాకా చెల్లించడనికి సిద్ధంగా ఉన్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కరణం శ్రావణ్‌కుమార్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో అత్యధికంగా బిడ్‌ దాఖలు చేసిన వ్యక్తితోపాటు, పిటిషనర్‌ సూచించిన వ్యక్తి కూడా ఈ నెల 25న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఒకే బిడ్‌ వచ్చిన ఆస్తి వేలం ప్రక్రియను నిలిపివేస్తూ అగ్రిగోల్డ్‌ వ్యవహారంలోలాగా అక్షయ్‌గోల్డ్‌కు చెందిన ఆస్తులనూ విక్రయించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో అక్షయ్‌ గోల్డ్‌కు చెందిన 10 ఆస్తుల వివరాలను, వాటి విలువలను ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌ అందజేశారు. వీటికి సంబంధించి అంచనా విలువలను సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది.

Link to comment
Share on other sites

అగ్రిగోల్డ్‌’ వేలానికి ప్రత్యేక కమిటీ
09-06-2018 02:18:03
 
  • కలెక్టర్‌, రిజిస్ట్రార్‌, లీగల్‌ అథారిటీ కార్యదర్శులకు స్థానం
  • కృష్ణా జిల్లాలోని 5ఆస్తులపై 2 వారాల్లోగా నోటిఫికేషన్‌
  • వేలంపై విస్తృత ప్రచారం చేయండి:హైకోర్టు ఆదేశం
 
హైదరాబాద్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ సంస్థలకు చెందిన ఆస్తులను ప్రత్యేక కమిటీ ద్వారా వేలం వేయాలని హైకోర్టు నిర్ణయించింది. కలెక్టర్‌, జిల్లా రిజిస్ట్రార్‌, జిల్లా లీగల్‌ 
సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులు. సీఐడీ ఇప్పటికే కృష్ణాజిల్లాలో గుర్తించిన ఐదు ఆస్తుల వేలానికి రెండు వారాల్లోగా నోటిఫికేషన్‌ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ కమిటీకి హైకోర్టు నిర్దేశించింది. కమిటీకి సీఐడీ డీఎస్పీ స్థాయి అధికారి సహకరించాలని ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టం చేసింది. డిపాజిటర్లను మోసం చేసిన అగ్రిగోల్డ్‌ యాజమాన్యంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ డిపాజిటర్ల అసోసియేషన్స్‌ తరఫున రమేశ్‌బాబు, తిరుపతిరావులు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీల ద్వారా విక్రయించాలని ఏపీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ నివేదించారు. ఇందుకు పిటిషనర్ల తరఫు న్యాయవాది కూడా అంగీకరించడంతో ధర్మాసనం ప్రత్యేక కమిటీని నియమించింది. వేలం వేయాలంటూ సీఐడీ సమర్పించిన 10 ఆస్తుల్లో రెండు ఆస్తులు ఆంధ్రాబ్యాంకులో మార్టిగేజ్‌ కింద ఉన్నాయని, ఒక ఆస్తిని ఇప్పటికే విక్రయించారని అగ్రిగోల్డ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచంద్ర నివేదించారు. అలాగే మరో రెండు ఆస్తులకు సీఐడీ నిర్ధారించిన ధర కన్నా ఎక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... ఈ ఐదు ఆస్తులను పక్కనబెట్టి, మిగతా ఐదు ఆస్తుల వేలానికి ఆదేశాలు జారీచేసింది.
 
అక్షయగోల్డ్‌ కేసులో..
అక్షయగోల్డ్‌ ఆస్తుల వేలానికి సంబంధించి అత్యధిక మొత్తంలో బిడ్లు వేసిన వారిని ఈ నెల 25న హాజరుపర్చాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. కర్నూలు పట్టణంలోని అక్షయగోల్డ్‌ బిల్డింగుకు రూ.1.31 కోట్లకు ఓ వ్యక్తి బిడ్‌ దాఖలు చేయగా... రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఓ బిడ్డర్‌ సిద్ధంగా ఉన్నాడని పిటిషనర్‌ రామమద్దయ్య తరఫున న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ నివేదించారు.
 
వేలం వేసే ఆస్తులివే
అగ్రిగోల్డ్‌కు విజయవాడలోని గాంధీనగర్‌లో ఉన్న కమర్షియల్‌ షెడ్డుతోపాటు కలిపి ఉన్న 1712 చదరపు గజాల వాణిజ్య స్థలం, మచిలీపట్నంలో ఉన్న ప్లాట్‌, విజయవాడ మొగలరాజపురంలో భవనం, పాయకరావుపేటలో ఖాళీ ప్లాట్‌లు, వీర్లపాడు మండలంలో వ్యవసాయ భూమిని వేలం వేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఆస్తుల వేలానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రెండు తెలుగు దినపత్రికల్లో ప్రకటించాలని, పూర్తి వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచాలని స్పష్టం చేసింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం
24-06-2018 02:12:29
 
636654031642353310.jpg
  • 1న నోటిఫికేషన్‌.. బాధితులకు అండగా తొలి అడుగు
  •  కృష్ణాలో ఐదు ఆస్తుల విక్రయం
  •  బెజవాడలోనే మూడు గుర్తింపు
  •  8న విక్రయించే ఆస్తుల తనిఖీ
  •  15 వరకు టెండర్లకు గడువు
  •  16న పరిశీలన.. ఆస్తుల అప్పగింత
అమరావతి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు అమల్లోకి వస్తున్నాయి. బాధితులకు న్యాయంచేసే దిశగా చర్యలు వేగంగా ఉండాలని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. అందులోభాగంగా తొలి విడతగా జూలై ఒకటో తేదీన కృష్ణా జిల్లా పరిధిలోని అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల విక్రయానికి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. కొన్నిరోజుల క్రితం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్‌ ఆస్తుల విక్రయంపై ముఖ్యమంత్రి నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేశారు. రెండు వారాల్లోగా స్పష్టమైన పురోగతి, ఫలితం ఉండాల్సిందేనని అధికారులకు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఆస్తుల విక్రయ ప్రక్రియకు కృష్ణాజిల్లా నుంచి శ్రీకారం చుట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ జిల్లాలోని ఐదు ఆస్తుల వేలానికి వచ్చేనెల ఒకటో తేదీన టెండర్లు పిలుస్తారు. జూలై 8న టెండరుదారులకు ఆ ఆస్తులను చూపిస్తారు. టెండర్ల గడువును 15వ తేదీగా ఖరారు చేయాలనే ఉద్దేశంతో అధికారులు గడువు ముగియగానే 16వ తేదీన టెండర్లను తెరుస్తారు. అత్యధిక ధరకు కోట్‌ చేసినవారికి ఆ ఆస్తులను విక్రయిస్తారు. ఈ వేలం ప్రక్రియ మొత్తాన్ని ఎప్పటికప్పుడు హైకోర్టుకు నివేదిస్తారు. ప్రభుత్వం, హైకోర్టు ఆశించిన స్థాయిలో ధర వస్తేనే విక్రయించాలన్న ఉద్దేశంతో అధికారులు ఉన్నారు.
 
ప్రతి ఆస్తి రిజిస్ర్టేషన్‌ విలువ ఎంత, వాల్యూయర్‌ నిర్ణయించిన ధర ఎంత, అక్కడ రియల్టీ ప్రకారం ధర ఎంత అనే వివరాలను ప్రభుత్వం రూపొందించింది. మార్కెట్‌ ధర ప్రకారం టెండర్లు కోట్‌ అయితేనే ఆస్తుల విక్రయం చేస్తారు. తక్కువకు కోట్‌ చేయడం, రింగవడం వంటివి జరగకుండా ముందుగానే వాటి విలువలను సుమారుగా నిర్ణయించారు. వాటికంటే ఎక్కువగా కోట్‌ చేసిన టెండరుదారుకు ఆస్తులను అప్పగిస్తారు. మరోవైపు తొలి విడతలో బ్యాంకు అప్పుల కింద తనఖా లేని భూములనే వేలానికి ఉంచుతారు. హైకోర్టు, ప్రభుత్వ పర్యవేక్షణలో వేలం జరిగి ఆస్తులను ఇస్తారు. దీనివల్ల ఎలాంటి టైటిల్‌ వివాదాలు లేని భూములు, స్థలాలను పొందేందుకు టెండరుదారులకు అవకాశం లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. బ్యాంకులకు తాకట్టుపెట్టిన ఆస్తులు, ఇతర ఆస్తుల వేలాన్ని..వివాదరహిత ఆస్తుల వేలం పూర్తయ్యాక చేపడతారు.
 
 
వేలం వేసే ఆస్తులివే...
తొలి విడతలో ఐదు అగ్రిగోల్డ్‌ ఆస్తులను వేలం వేయనున్నారు. ఇవన్నీ కృష్ణా జిల్లాలోనే ఉన్నాయి. విజయవాడలో మూడు స్థలాలు, మచిలీపట్నంలో వాణిజ్యస్థలం, వీర్లపాడు మండలంలో భూమి ఉన్నాయి. అవి..
విజయవాడలో..
  • డీబీ మేనర్‌ హోటల్‌ వెనక 630గజాల్లో 24వేల చదరపు అడుగుల భవనం. రిజిస్ర్టేషన్‌ విలువ రూ.4.74కోట్లు. వాల్యూయర్‌ అంచనా విలువ రూ.10.23కోట్లు.
  •  గాంధీనగర్‌లో రాజ్‌ యువరాజ్‌ థియేటర్‌ సమీపంలో సాంబమూర్తి రోడ్డులో ఉన్న 3,767చదరపు గజాల వాణిజ్య స్థలం. రిజిస్ర్టేషన్‌ విలువ 15.97కోట్లు. వాల్యూయర్‌ విలువ 28.25 కోట్లు.
  •  పాయకాపురం ప్రాంతం వాంబే కాలనీకి సమీపంలో 3247.77చదరపు గజాలు. రిజిస్ర్టేషన్‌ విలువ రూ.3.21కోట్లు. వాల్యూయర్‌ అంచనా రూ.6.48కోట్లు. రియల్టర్ల అంచనా రూ.7.13కోట్లు.
మచిలీపట్నంలో..
చల్లపల్లి జమిందార్‌ స్ట్రీట్‌లో 4103చదరపు గజాల స్థలం. రిజిస్ర్టేషన్‌ విలువ రూ.8.87కోట్లు. వాల్యూయర్‌ విలువ రూ.11.07కోట్లు.
వీర్లపాడు మండలంలో..
చట్టన్నవరంలో 56.27ఎకరాల భూమి. రిజిస్ర్టేషన్‌ విలువ రూ.3.65కోట్లు. వాల్యూయర్‌ విలువ రూ.6.75కోట్లు. రియల్టర్ల విలువ రూ.7.31కోట్లు.
Link to comment
Share on other sites

అగ్రిగోల్డ్‌ ఆస్తులు కేంద్రంతో కొనిపించండి: కుటుంబరావు
28-06-2018 02:44:47
 
  • కన్నా లక్ష్మీనారాయణకు కుటుంబరావు సూచన
అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంతో పోలిస్తే ఆర్థికంగా మం చి స్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో అగ్రిగోల్డ్‌ ఆస్తులు మార్కెట్‌ ధరకు కొనిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్‌ కుటుంబరావు సూచించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబుకు కన్నా రాసిన లేఖపై కుటుంబరావు బుధవారం స్పందించారు. కన్నా ఈ లేఖను ప్రధాని నరేంద్ర మోదీ లేదా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి రాస్తే బాగుండేదని ఆయన అన్నారు. కేంద్రం ఆస్తులు కొనుగోలు చేస్తే ఆయా రాష్ట్రాలన్నింటిలో బీజేపీ ప్రతిష్ఠ పెరుగుతుందని ఆయన అన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...