Jump to content

డీకే శివకుమార్ సన్నిహితుల ఇళ్లపై సీబీఐ దాడులు


Recommended Posts

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ సన్నిహితుల ఇళ్లపై సీబీఐ దాడులు బెంగళూరులో కలకలం రేపాయి. డీకే శివకుమార్‌కు సంబంధించిన వ్యక్తుల నివాసాలపై బుధవారం రాత్రి సెర్చ్ వారెంట్‌తో సీబీఐ ఆకస్మిక తనిఖీలు చేసింది. ఈ పరిణామాలతో కంగుతిన్న డీకే శివకుమార్.. తన సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్‌తో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. బీజేపీ ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను తమకు నచ్చని వారిపై ఉసిగొల్పుతోందని ఆయన చెప్పారు. తన సన్నిహితుల ఇళ్లపై సీబీఐ దాడులు కూడా అందులో భాగమేనన్నారు. ఇప్పుడు తనకు సంబంధించిన ఆస్తులను కూడా బీజేపీ టార్గెట్ చేసిందన్నారు. ఇదిలా ఉంటే, డీకే శివకుమార్ ప్రెస్‌మీట్ ముగించిన గంటల వ్యవధిలోనే ఆయనకు సంబంధించిన ఐదు ప్రాంతాల్లో సీబీఐ దాడులు జరిగినట్లు తెలిసింది. అయితే సీబీఐ మాత్రం.. శివకుమార్, ఆయన సోదరుడు సురేష్‌ల ఆస్తులకు సంబంధించి సెర్చ్ వారెంట్ జారీ చేయలేదని స్పష్టం చేసింది.
 
 
నోట్ల రద్దు సమయంలో రామనగరలోని కార్పొరేషన్ బ్యాంకు విషయంలో జరిగిన మోసానికి సంబంధించి ఈ దాడులు చేసినట్లు సీబీఐ చెబుతోంది. ఈ వ్యవహారంలో సీబీఐ ఆ బ్యాంకు చీఫ్ మేనేజర్ ప్రకాష్‌పై అప్పట్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆర్‌బీఐకి ఎలాంటి పత్రాలు సమర్పించకుండా 10లక్షల రూపాయల విలువైన కొత్త 5వందలు, 2వేల నోట్లను మార్చుకున్నారనేది సీబీఐ ప్రధాన అభియోగం. ఈ నగదు పొందిన వారిలో డీకే శివకుమార్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి పద్మనాభయ్యతో పాటు, అతని బంధువర్గం ఉన్నట్లు భావించి సీబీఐ ఈ మెరుపు దాడులకు దిగింది. అయితే 2017నాటి కేసులో ఇప్పుడు దాడులు చేయడంపై కాంగ్రెస్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బీజేపీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగానే దాడులు చేసినట్లు శివకుమార్ ఆరోపించారు.
Link to comment
Share on other sites

27 minutes ago, ramntr said:

Cbn ఇంటికి ఎప్పుడు, why they scared of Cbn.. Time z going but no action.. 

Tondaraga chesthe sweep chyyochhu ani plan aa?

Link to comment
Share on other sites

21 hours ago, Urban Legend said:

Bjp ki evadu anti vuntey vaadi intiki CBI veltundhi... 

Dheeniney DLM antaru 

unfortuntely ...

evadu adhikaram lo unte vaadi xxxxx naakatam ee cbi ki alavate ... veellakante local constable ki integrity untundemo ...

intha lapdogs la ela ayyaru veellu ... cbi leadership ki conscience antu emi undadaa?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...