Jump to content

తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా) ప్రోగ్రెస్ రిపోర్ట్


Recommended Posts

  • నామమాత్రంగా మారిన ప్రతిపక్ష ఎమ్మెల్యే పదవి
  • అంతా అధికారపక్షానిదే హవా
  • అందుబాటులో ఉండరన్న ఆరోపణలు
  • నిధులు దక్కకుండా చేశారన్న ఎమ్మెల్యే
  • ఇదీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా) ప్రొగ్రెస్‌
తుని(తూర్పుగోదావరి జిల్లా): నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవి నామమాత్రమైంది. వైసీపీ నుంచి ఎంపికైన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేరుకే ఎమ్మెల్యే అన్నట్టు ఉన్నారు. అంతా అధికార పక్షం కనుసన్నల్లోనే కార్యక్రమాలు సాగుతుండటంతో ఎమ్మెల్యే ఉనికి ప్రశ్నార్థకమైంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ అధికార పక్ష నేతల సూచనలతోనే అమలవుతున్నాయి. అధికార కేంద్రంగా జనం కూడా టీడీపీ నాయకులనే కలుస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే పరామర్శలు, పలకరింపులకే పరిమితమయ్యారు. .అప్పుడప్పుడు ప్రజా సమస్యల పైన, కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటూ ఆందోళనలు చేపడుతున్నప్పుడు పాల్గొంటున్నారు.
 
ముఖ్యంగా ఇది ఆర్థికశాఖ మంత్రి సొంత నియోజకవర్గం కావడంతో జిల్లా అధికార యంత్రాంగ మంతా ఆగమేఘాల మీద హాజరై అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక ఎమ్మెల్యే రాజా కూడా తన పార్టీ కార్యకర్తలతో కూడా పూర్తిగా అందుబాటులో ఉండని పరిస్థితి ఉందనే విమర్శలున్నాయి. ఇది ఆ పార్టీ కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోంది. ఈలోపు టీడీపీ నేతల వ్యూహంతో ఒకొక్కరు ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. చాలామంది కార్యకర్తలు కూడా టీడీపీలోకి వెళ్లి పోవడంతో గ్రామాల్లో వైసీపీ నామమాత్రంగా మిగిలిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలు, అభిమానులు ఎవరు పిలిచినా వారిళ్లల్లో శుభకార్యాలకు వెళుతుంటారని అంటారు.
 
 
నిధులు కేటాయించకపోవడం దారుణం
ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించకపోవడం దారుణమని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యేలకు రావాల్సిన నిధులను సైతం దారి మళ్లించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌లకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
 
 
ఏడుసార్లు అసెంబ్లీలో ప్రస్తావించా!
అసెంబ్లీలో నియోజకవర్గం సమస్యలపై ఏడుసార్లు ప్రస్తావించి పోరాడగా ఏ ఒక్కటి అమలు చేయలేదని వాపోయారు. ముఖ్యంగా తాండవలో ఇసుకతవ్వకాలు, చెరువులలో అక్రమంగా మట్టి తవ్వకాలు, పట్టణంలో తాండవ నదికి రిటర్నింగ్‌ వాల్‌ ఏర్పాటుపై తన గొంతును అసెంబ్లీలో వినిపించానని వివరించారు. తొండంగిలో దివిస్‌ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడ ప్రజలు మనోభాలకనుగుణంగా ఆ కంపెనీ పెట్టకూడదని, ప్రజలతో కలిసి పోరాటం చేశాను. చివరికి వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని కూడా తీసుకువచ్చా. దీంతో అక్కడ ఫార్మా కంపెనీ వెనుతిరిగింది. నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ తనకెప్పుడూ అండగా ఉన్నారని అన్నారు. నియోజకవర్గానికి సీఎం ఒక్కసారి కూడా రాలేదని ఎమ్మెల్యే రాజా ఆవేదన వ్యక్తం చేశారు.
 
 
ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదు
ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. పార్టీకి సంబంధిం చిన కార్యక్రమాల సమయంలో తప్ప గ్రామాలకు రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నాం. సమస్యలు చెబుదామని కార్యాలయానికి వెళితే అందుబాటులో ఉండటం లేదు.
దొగ్గ రమణ, కోటనందూరు
ఉపాధి అవకాశాలు కల్పించాలి: కర్రి నాగరాజు
ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలు సజావుగానే జరుగుతున్నా నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోయింది. ఉపాధి అవకాశాలపై ప్రభుత్వదృష్టి సారించాలి. ప్రభుత్వం అందిస్తున్న రుణాలు అర్హులకు అందించడంలో బ్యాంకులు సహకరించకపోవడంతో అవకాశాలను యువత రుణాలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తుని మండలం
 
ఎన్నికల సమయంలో కనిపించారు
ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. నెగ్గిన తర్వాత నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులు చెప్పుకుందామన్నా కనిపించడం లేదు. కనీసం పింఛన్‌ కోసం వెళ్ళి ఎమ్మెల్యేను కలుసుకోవాలన్నా.. ఏ సమయంలో ఉంటున్నారో.. తెలియడం లేదు.
కె.చంటిబాబు, తొండంగి మండలం 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...