Jump to content

#Mahanadu2018


Recommended Posts

నేటి నుంచి విజయవాడలో మహానాడు
27-05-2018 08:27:38
 
636630064613793812.jpg
పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో జరగనున్న మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చే అభిమానుల కోసం రూట్‌ మ్యాప్‌ను ప్రకటించారు. భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. సుమారు 1,200మంది సిబ్బందిని పారిశుధ్య పనులకు కేటాయించారు.
 
 
మహానాడుకు .. ఇలా రండి..
విజయవాడ (ఆంధ్రజ్యోతి): ఆహ్వానితులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ పండుగ ‘మహానాడు’కు చేరుకోవటానికి వీలుగా నిర్వాహక కమిటీ తగిన మార్గదర్శకాలను జారీచేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చే వారికి కేటాయించిన వసతి ప్రాంతంతో పాటు, గమ్యస్థానానికి చేరుకునే రూట్‌మ్యాప్‌ను ఇచ్చారు. ప్రతి జిల్లా నుంచి ఆయా నియోజకవర్గాల వారీగా బస్సులలో, ఇతర వాహనాలలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి తమకు నిర్దేశించిన రూట్‌లోనే వీరంతా తమ వాహనాలను తీసుకు రావాల్సి ఉంటుంది.
 
కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారితో పాటు రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే వారంతా బందరు రోడ్డు మీదుగా మహానాడు ప్రాంగణానికి చేరుకోవాలి.
 
నగరంలోని కళ్యాణమండపాలలో వసతి ఉండే వారంతా మహానాడు రోడ్డు మీదుగా 100 అడుగుల రోడ్డు నుంచి మహానాడు ప్రాంగణానికి చేరుకోవాలి.
 
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చే వారంతా ఎనికేపాడు దగ్గర 100 అడుగుల రోడ్డుమీదుగా, రామవరప్పాడు రింగ్‌ దగ్గర ఉన్న బల్లెం వారీ వీధి మీదుగా మహానాడు ప్రాంగణ సమీపానికి చేరుకోవచ్చు.
 
హైదరాబాద్‌ నుంచి వచ్చే వారు మాత్రం గొల్లపూడి బైపాస్‌ మీదుగా మిల్క్‌ ఫ్యాక్టరీ ఫ్లై ఓవర్‌ మీదుగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మీద నుంచి.. చేరుకోవచ్చు. ఈ ప్రాంతాలలో 40 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్‌ వసతి ఏర్పాట్లు చేపట్టారు.
 
బందరు రోడ్డు మీద నుంచి వచ్చేవారు, 100 అడుగుల రోడ్డు మీద నుంచి వచ్చే వారంతా కూడా ముందుగా మహానాడు ప్రధాన ద్వారం దగ్గర ఏర్పాటు చేసిన కౌంటర్ల దగ్గర రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలి. ప్రతి ఒక్క ఆహ్వానితుడు రూ.100 చెల్లించి రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలి. ఐడెంటిటీ కార్డు తీసుకు రాకపోతే ప్రింట్‌ చేసి ఇవ్వటానికి మరో కౌంటర్‌ కూడా ఉంది. రిజిస్ర్టేషన్‌ తర్వాత 36 తీర్మానాలకు సంబంధించి ప్రింటెడ్‌ బుక్‌, పెన్ను, ఓ నోట్‌బుక్‌తో కూడిన ఒక కిట్‌ ఇస్తారు. రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న ప్రతి ఆహ్వానితుడికీ ఒక పసుపు కండువా ఇస్తారు. పసుపు కండువా విధిగా ప్రతి ఆహ్వానితుడి మెడలో ఉండాలి.
 
 
మెరుగైన పారిశుద్ధ్యం
  • 350 రెడీమేడ్‌ టాయిలెట్స్‌
  • 1,200 మంది పారిశుధ్య కార్మికులు
  • మూడు షిప్టుల్లో విధులు
మహానాడును అత్యంత భారీగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, అంతే స్థాయిలో శానిటేషన్‌ ఏర్పాట్లను నిర్వాహక కమిటీ చేపడుతోంది. ఈ కమిటీ బాధ్యతలను తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు చూస్తున్నారు. మహానాడుకు దాదాపు మూడు రోజులు ఆహ్వానితులతో పాటు లక్షన్నర మందికి పైగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి శానిటేషన్‌ ఇరవై నాలుగుగంటల పాటు సాగేలా చర్యలు చేపట్టారు. మొత్తం 1200 మంది వర్కర్లు మహానాడులో సేవలందించబోతున్నారు. వీరంతా మూడు షిప్టులలో పనిచేయనున్నారు. ప్రాంగణంలోనూ, వేదికల దగ్గర, భోజనాల దగ్గర, పార్కింగ్‌ ప్రాంతాల దగ్గర శానిటేషన్‌ కమిటీ సేవలను అందించనుంది. శానిటేషన్‌ సిబ్బందితో పాటు ప్రధానంగా ప్రాంగణంలో 250 తాత్కాలిక టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. నగరంలోని ఏడు కల్యాణమండపాలలో ఏర్పాటు చేసిన వసతి దగ్గర కూడా మరో 100 టాయ్‌లెట్లను ఏర్పాటు చేయటం జరిగింది. మొత్తంగా 350 టాయ్‌లెట్లను ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి నాలుగు టాయ్‌లెట్స్‌కు ఒక క్లీనర్‌ను నియమించారు. ఒక డ్రమ్‌ వాటర్‌, సెంటెడ్‌ ఫినాయిల్‌, ఒక ట్యాంకర్‌ను వారికి అప్పగించారు.
 
 
 
సాంస్కృతిక కార్యక్రమాలు
మహానాడు సందర్భంగా నాయకులు, కార్యకర్తలను అలరించడానికి ఆయా కళాత్మక, సందేశాత్మక నృత్యాలను, నాటికలను సిద్ధం చేశారు. 500మంది కళాకారులు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించనున్నారు. ఈ కమిటీ నిర్వహణ బాధ్యతలను ఎంపీలు మురళీమోహన్‌, శివప్రసాద్‌లు నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు ఉదయం 8 గంటలకు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. నాయకుల ప్రసంగాలు ముగిసిన తరువాత, భోజనం వంటి విరామ సమయాలలో కళాకారులు తమ కార్యక్రమాలతో అతిఽథులను ఉత్సాహపరుస్తారు. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి చేసిన అన్యాయంపై పలు నాటికల రూపంలో హాస్యరూపంలో సందేశాత్మకంగా ప్రజలకు ఆయా కళాబృందాలు వివరించనున్నట్లు కమిటీ కన్వీనర్‌ గోపాలకృష్ణ తెలిపారు. 28వ తేదీన దివంగత ఎన్టీరామారావు జయంతి సందర్భంగా రవి మెమోరియల్‌ వారు ఎన్టీఆర్‌ నటించిన చిత్రాలలో పాటలతో గీతాలాపన చేసి కార్యకర్తలను అలరించనున్నారన్నారు.
 
 
ప్రదర్శించనున్న అంశాలు..
  • వర్తమాన రాజకీయాలను వివరిస్తూ సిద్ధార్థ కళాశాల విద్యార్థులచే నాటిక ప్రదర్శన
  • అవనిగడ్డకు చెందిన బృందం కర్రసాధనం
  • రాజస్థాన్‌కు చెందిన బృందం బాంగ్రా నృత్యప్రదర్శన
  • సిల్వర్‌స్టార్‌, విల్సన్‌ హెరాల్డ్‌ల ప్రదర్శనలు
  • తెనాలికి చెందిన పౌరాణిక రంగస్థల ప్రముఖుడు ఎ.వెంకటేశ్వరరావు బృందం ప్రదర్శన
  • గౌతంరాజు, డోర్నకల్‌ హరిబాబు, బాబురావుల మిమిక్రీ
  • దామోదర గణపతి, రాజేష్‌ల ఫోక్‌ డ్యాన్సు
  • వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు శ్రీకృష్ణ దేవరాయ వేషధారణ
Link to comment
Share on other sites

అనగనగా నాలుగోసారి...
27-05-2018 08:45:06
 
636630079013640030.jpg
విజయవాడ నగరం బంగారు ఛాయతో మెరిసిపోతోంది. రాజధాని ఏర్పడ్డాక నగరంలో జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఎక్కడ చూసినా టీడీపీ జెండాలు, పెద్దపెద్ద కటౌట్లు నగరానికి పండుగ వాతావరణాన్ని తెచ్చాయి. నగర సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన తోరణాలు ఆహ్వానం పలుకుతున్నాయి. కానూరులోని వీఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరుకానుండటంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.
 
 
ఆంధ్రజ్యోతి, విజయవాడ
మూడున్నర దశాబ్దాల్లో కృష్ణాజిల్లాలో జరిగే నాల్గో మహానాడు ఇది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా, మూడుసార్లు జిల్లాలో మహానాడు జరిగింది. విజయవాడతో పాటు నగర సమీపంలోనే ఈ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు కానూరులో మొదటి మహానాడు జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక 1983లో నగర తూర్పు ప్రాంతంలో రాష్ట్రంలోనే తొలి మహానాడు జరిగింది. ఈ మహానాడును అప్పట్లో దేవినేని రాజశేఖర్‌ (నెహ్రూ), ఆయన ప్రధాన అనుచరగణం నేతృత్వంలో నిర్వహించారు. ఈ బహిరంగ సభలో జాతీయ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఫరూక్‌ అబ్దుల్లా, ఎంజీ రామచంద్రన్‌, రామకృష్ణ హెగ్డే, బహుగుణ, చండ్ర రాజేశ్వరరావు, శరద్‌ పవార్‌, మేనకాగాంధీ, రవీంద్ర వర్మ, ఉన్నిక్రిష్ణన్‌, ఎస్‌ఎస్‌ మిత్రా, జగ్జీవన్‌రావు, మాకినేని బసవపున్నయ్య తదితర జాతీయ నేతలు ఈ బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ మహానాడుకు 5 లక్షల మందికి పైగా కార్యకర్తలు తరలివచ్చారు.
 
జిల్లాలో రెండో మహానాడు 1988లో కృష్ణాతీరంలో జరిగింది. ఈ మహానాడులో ఎన్‌టీఆర్‌ తోడుగా ప్రస్తుత పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా కార్యకర్తలతో భారీ పాదయాత్రగా కృష్ణాతీరానికి చేరుకున్నారు. ఈ మహానాడులో కూడా దేవినేని నెహ్రూ కీలకపాత్ర పోషించారు. బహిరంగ సభకు 7 లక్షల మందికి పైగా కార్యకర్తలు తరలివచ్చారు.
 
నగరంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌ కళాశాలలో మూడో మహానాడు జరిగింది. ఈ మహానాడు సందర్భంగా ఎన్‌టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఒక కుటీరాన్ని నిర్మించారు. అప్పట్లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
ప్రస్తుతం జరిగేది నాల్గో మహానాడు. విజయవాడ సమీపంలోని కానూరులో జరగబోతోంది. ఈ మహానాడుకు రోజుకు 15వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి రానున్నారు. మూడు రోజులకు ఆహ్వానితులు కాకుండా మరో 80వేల మంది వరకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా విజయవాడలో నిర్వహించే మొదటి మహానాడుగా ఇది చరిత్రలో నిలవనుంది.
 
 
నలభీములు
మహానాడుకు కృష్ణాజిల్లా ఆతిథ్యం ఇస్తోంది. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా టీడీపీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం వారిద్దరూ వంటశాలను పరిశీలించారు. అంతేకాదు కాసేపు గరిటె తిప్పి ఆహార ఏర్పాట్లను పరిశీలించారు.
 
 
నాటి డొంకరోడ్డే.. నేటి మహానాడు రోడ్డు
పటమట: 1983లో జరిగిన మహానాడుకు గుర్తుగా నగరంలోని మహానాడు రోడ్డు కీర్తి గడించింది. టీడీపీ ఆవిర్భవించాక తొలి మహానాడును విజయవాడ తూర్పు ప్రాంతంలో నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో ఓ రోడ్డుకు మహానాడుగా నామకరణం చేశారు. సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి ఎదురుగా ఉన్న సుమారు 150-200 ఎకరాల పొలాలను అప్పట్లో మహానాడుకు వేదికగా నిర్ణయించారు. ఈ పొలాలు పటమట, కానూరు, యనమలకుదురు, గుణదలకు చెందిన యలమంచిలి, ముప్పవరపు, నల్లూరి కుటుంబాలకు చెందినవి. ఆ సమయంలో ఇటువైపు రావాలంటే డొంకరోడ్డు తప్ప వేరే మార్గం ఉండేది కాదు. దీంతో మహానాడు కోసం ప్రత్యేకంగా రోడ్డు వేశారు. అలా అప్పుడు మహానాడు జరిగిన సమయం నుంచి ఈ రోడ్డుకు మహానాడు రోడ్డు అనే పేరు స్థిరపడిపోయింది. అప్పుడు మహానాడు జరిగిన ప్రాంతాల్లో ఇప్పుడు కామినేని నగర్‌, గణేష్‌ కాలనీ, శ్రీరామచంద్ర నగర్‌ వంటి కాలనీలు ఏర్పడ్డాయి.
 
 
వాహ్వా.. డ్వాక్రా
హస్తకళల కాణాచిగా ‘మహానాడు’ నిలవబోతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే డ్వాక్రా మహిళలు హస్త కళా ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించనున్నారు. మహానాడుకు ఇది ప్రధాన ఆకర్షణ కానుంది. మొత్తం 23 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేటగిరీకి రెండేసి స్టాల్స్‌ చొప్పున కేటాయిస్తారు. చీరలు, హస్తకళలు, చిత్రకళలు, స్వీట్లు, పచ్చళ్లు, బొమ్మలు, బాతిక్‌ పెయింట్స్‌, వెదురు ఉత్పత్తులు, అలంకరణ వస్తువులు ఈ స్టాళ్లలో ఉంటాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...