Jump to content

Uddanam


Recommended Posts

నూజివీడులో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
04-07-2018 14:01:55
 
636663097161985096.jpg
కృష్ణా: జిల్లాలోని నూజివీడు ఏరియా ఆస్పత్రిలో పీపీపీ విధానంలో రూ. కోటిన్నర వ్యయంతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. డయాలసిస్ చేయించుకున్న వారికి ఉచిత మందులు, నెలకు రూ. 2500 పింఛన్ అందిస్తామని మంత్రి ప్రకటించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఎన్టీఆర్‌వీఎస్‌ కిడ్నీ రోగులకు 2500 పింఛన్‌
13-07-2018 03:08:44
 
అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులకు నెలకు రూ.2500 పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన్‌ పరిషత్‌ కమిషనర్‌ ప్రతిపాదన మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
3 hours ago, sskmaestro said:

Oka constuency kada.... why can’t ministers focus more on this one? Lack of funds? Or lack of prioritizing things ? Or as usual “kaarana janmulu” “pacha Notla bhakshakulu” sri sri govt employees baddakam at ground level ?

Yeah y can’t local mla of effected constituency Nd minister acham naidu or rammohan need to take spl care regarding this issues Nd hope atleast govt provide them good drinking water to remaining villages who are having issues with water plants 

Link to comment
Share on other sites

27 minutes ago, abhi said:

Yeah y can’t local mla of effected constituency Nd minister acham naidu or rammohan need to take spl care regarding this issues Nd hope atleast govt provide them good drinking water to remaining villages who are having issues with water plants 

They might have given orders to govt employees.... as usual they are in :sleep:

Link to comment
Share on other sites

కలుషిత జలమే కారణం!
16-09-2018 02:27:42
 
636726616639868938.jpg
  • ఉద్దానం కిడ్నీ సమస్యపై యువ శాస్త్రవేత్త మనోజ్‌ పరిశోధన
  • ఆరేళ్లుగా ఈ ప్రాంతంలో సర్వే
  • 75 వేల ఎకరాల్లో కందకాలు తవ్వాలి
  • దాంతో మూడేళ్లలోనే సమస్యకు పరిష్కారం!
విశాఖపట్నం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఉద్దానం కిడ్నీ సమస్యపై ఆరేళ్లుగా అధ్యయనం చేస్తున్న విశాఖకు చెందిన యువ శాస్త్రవేత్త మనోజ్‌ నలనాగుల ‘కారణం’ కనుగొన్నట్లు చెబుతున్నారు. సమస్యకు పరిష్కారాన్నీ సూచిస్తున్నారు. దాదాపు 390గ్రామాల్లో ఆయన పర్యటించారు. అక్కడి నైసర్గిక భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేశారు. ఆ వివరాలను ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ‘ఉద్దానం పరిధిలో 50 గ్రామాలు గిన్నె(బౌల్‌) ఆకారంలో ఉన్నాయి. అక్కడే కిడ్నీ రోగుల సంఖ్య అధికంగా ఉంది. భూమి ‘వి’ ఆకారంలో ఉన్న 118 గ్రామాల్లోనూ మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు అదేస్థాయిలో ఉన్నారు. మరో 39 గ్రామాల్లో భూమి ‘యు’ ఆకారంలో ఉంది. అక్కడ కూడా క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌(సీకేడీ) ఉంది. ఇంకో 22గ్రామాలు కొంత ఏటవాలు ప్రాంతంలో, 57 గ్రామాలు మెట్టవాలు ప్రాంతంలో ఉన్నాయి. ఈ 79 గ్రామాల్లో సీకేడీ బాఽధితులు ఓ మాదిరిగా ఉంటే.. మిగిలిన 40 గ్రామాలు పూర్తిగా ఎత్తయిన ప్రాంతంలో ఉన్నాయి. విచిత్రంగా అక్కడ కిడ్నీ వ్యాధి బాధితులు ఎవరూ లేరు’ అని మనోజ్‌ పేర్కొన్నారు.
 
9uddanamFFeee.jpgనీరు ఇలా కలుషితం!
భూములు కొంత ప్రాంతం ఎత్తుగాను, మరికొంత ప్రాంతం పల్లంగాను ఉంటే.. వాటిని ‘హుగ్గెల్యాండ్‌’(మడత భూములు) అంటారు. ‘ఇలాంటివి జర్మనీలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అదంతా అటవీ ప్రాంతం కావడం, వ్యవసాయానికి వీల్లేకపోవడంతో కిడ్నీ వ్యాధుల సమస్య తలెత్తలేదు. శ్రీలంకలో కొన్నిచోట్ల మడత భూములుండగా అక్కడ కూడా కిడ్నీ బాధితులు ఉన్నారు. మనదేశంలో ఇలాంటి భూములను మొదట గుర్తించింది ఉద్దానంలోనే’ అని తెలిపారు. కాంటూరు మ్యాపుల ద్వారా వాటిని ఆయన విశ్లేషించారు. ‘వందేళ్ల క్రితం ఉద్దానం అంతా అటవీ ప్రాంతం. గంజాం గెజిట్‌లో ఈ విషయం స్పష్టంగా ఉంది. అక్కడికి వలస వెళ్లిన కొన్ని జాతులు కొబ్బరి, జీడిమామిడి తోటలు వేసుకొని జీవనం ప్రారంభించాయి. ఎత్తైన ప్రాంతంలో తోటలు వేసుకొని.. పల్లపు ప్రాంతాల్లో నీరు లభిస్తుందని అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఎక్కువ దిగుబడి కోసం రైతులు ఎరువులు, రసాయనాలు ఉపయోగించారు. వాటి అవశేషాలు పల్లపు ప్రాంతాల్లోకి నీటితోపాటు వచ్చి పేరుకుపోయాయి. ప్రజలు ఆ నీటిని తాగడం వల్లే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి’ అని మనోజ్‌ విశ్లేషించారు.
 
మరి పరిష్కారం?
ఉద్దానంలో ఎక్కువగా బావులు, బోరుబావుల నీటినే తాగుతున్నారు. అది కలుషితమైందని గుర్తించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా శుద్ధిచేసిన తాగునీటిని సరఫరా చేస్తోంది. అయితే అది సాధారణ శుద్ధి మాత్రమేనని మనోజ్‌ చెబుతున్నారు. అందువల్ల అక్కడ వ్యాధులు పూర్తిగా నివారించే అవకాశం లేదనేది ఆయన వాదన. ‘అక్కడ భూగర్భ జలాలను పెంచగలిగితే.. రసాయన అవశేషాల సాంద్రత క్రమంగా తగ్గుతుంది. అప్పుడు అక్కడి నీరు తాగినా ప్రమాదం ఉండదు. భూగర్భ జలాలు పెంచడానికి ఉద్దానంలోని 75 వేల ఎకరాల్లో ‘కాంటూరు కందకాల’ను యుద్ధ ప్రాతిపదికన తవ్వాలి’ అని మనోజ్‌ పేర్కొన్నారు. దీనికోసం పైలట్‌ ప్రాజెక్ట్‌గా మందస మండలం బేతాళపురంలో కొన్ని ప్రాంతాల్లో కాంటూరు కందకాలను ఆయన తవ్వించారు.
 
 
9uddan54.jpgమూలానికే చికిత్స కావాలి
సీకేడీ బాధితులకు ఎంత మెరుగైన చికిత్స అందించినా అది తాత్కాలిక ఉపశమనమే. అసలు కిడ్నీ వ్యాధులే రాకుండా చేయాలంటే.. అక్కడి మంచినీటి వనరుల్ని శుద్ధి చేయాలి. వ్యవసాయ భూములన్నింటిలోను కందకాలు తవ్విస్తే.. మూడేళ్లలో రసాయన అవశేషాల ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు కొత్తగా కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఎక్కడా నమోదుకారు.
- మనోజ్‌ నలనాగుల, యువ శాస్త్రవేత్త
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 weeks later...
ఉద్దానంలో కిడ్నీ పరిశోధన కేంద్రం
20-10-2018 02:24:19
 
  • సీఎం సూచన మేరకు ముందుకొచ్చిన ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల యాజమాన్యం
అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉద్దానంలో కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రంతోపాటు 200 పడకల ఆస్పత్రిని నిర్మించేందుకు ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కళాశాలల యాజమాన్యం హామీ ఇచ్చింది. తితలీ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రైవేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్యం శుక్రవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలిసారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన చంద్రబాబు... ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉన్న రెండు, మూడు గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని వారిని కోరారు.
 
ఉద్దానంలో వెంటనే 200 పడకలతో ప్రత్యేక ఆస్పత్రి, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మెడికల్‌ కళాశాలల యాజమాన్యాలు పూనుకోవాలని సూచించారు. సీఎం సూచనకు వారు ఓకే చెప్పారు. ఉద్దానంలో రూ.10 కోట్ల వ్యయంతో కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రంతోపాటు దానికి అనుబంధంగా 200 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ప్రైవేటు మెడికల్‌ - డెంటల్‌ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు నరసరాజు, లక్షణరావు, శాంతిరాముడు, కృష్ణప్రసాద్‌ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Advertisement

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...