Jump to content

Uddanam


Recommended Posts

ఉద్ధానంపై పరిశోధన
ప్రారంభమైనట్లు ప్రభుత్వం వెల్లడి
రోగులను దెబ్బతీసేలా విమర్శలు సరికాదు
వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం సమీక్ష
ఈనాడు - అమరావతి

విశాఖపట్నం విమ్స్‌ కేంద్రంగా ఉద్ధానంలో మూత్రపిండాల వ్యాధులపై పరిశోధన ప్రారంభమైందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఉద్ధానంపై సమీక్షించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఉద్ధానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధుల విస్తృతిపై పరిశోధనలు చేసేందుకు కాంపిటీటివ్‌ గ్రాండ్‌ ఛాలెంజ్‌ విధానంలో ఆస్ట్రేలియాకు చెందిన ‘జార్జి ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌’ ఎంపిక జరిగింది. విమ్స్‌లో అధ్యయన కేంద్రం ఏర్పాటైంది. తదుపరి చర్యలు క్షేత్ర స్థాయిలో పురోగతిలో ఉన్నాయి. నామినేషన్‌పై పనులు అప్పగించాలని కోరడం, ప్రభుత్వ నిబంధనలు అంగీకరించకపోవడం వంటి కారణాలవల్ల హార్వర్డ్‌ వైద్య బృంద సేవలు అందుబాటులోకి రాలేదు. జనవరి 19 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ 1,01,593 మంది నుంచి నిపుణులు రక్త నమూనాలను సేకరించారు. వీరిలో 13,093 మందిని 4 కమ్యూనిటీ ఆసుపత్రులకు పంపారు. సోంపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో సీకేడీ కేసుల నిమిత్తం ‘ఎన్టీఆర్‌ వైద్య పరీక్షల’ కింద ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో వ్యాధి తీవ్రతను అరికట్టేందుకు 5 డయాలసిస్‌
కేంద్రాల్లో 50 యంత్రాలు రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నాయి. నెఫ్రాలజిస్ట్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రుల ద్వారానే కాకుండా చంద్రన్న సంచార చికిత్స వాహనాల ద్వారా రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి. ఉద్ధానం ప్రాంతంలో రూ.17 కోట్లతో 7 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి, సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించడం సమంజసం కాదు. ప్రభుత్వ చర్యలపై రోగుల్లో భరోసా వచ్చింది. దీనిని దెబ్బతీసేలా విమర్శలు చేసి రాజకీయ లాభం పొందాలనుకోవడం సరైన పద్ధతి కాదు’ అని ఆ ప్రకటనలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు

Link to comment
Share on other sites

Cheap fellow is just bjp puppet he will dance to whatever tunes bjp gives to him. Broker yadava nuvu chesie allegations chustey ........ siggu anedhe vadilesavu pichie xxxxxx

Link to comment
Share on other sites

Ippudu em chesina pk ki gadiki credit....ala Ani em cheyleda ante Chala chesaru...Kani janalki cheppukovatam ravatla....Loki tweets esthe saripodu ga....media lo sariga answer cheese vadu ledu....kothiki kobbari chippalaga pk gadiki idi dorikindi 

Link to comment
Share on other sites

ఉద్దానం బాధితులకు ఏం చేయడానికైనా సిద్ధం
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్య

ఈనాడు, శ్రీకాకుళం: ఉద్దానం కిడ్నీ బాధితులకు ఎంతో చేస్తున్నామని... ఇంకా అవసరమనుకుంటే ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. అసలు ఏమీ చేయడం లేదన్నట్లుగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బాధితుల మనోభావాలను దెబ్బతీసేట్లు మాట్లాడటం భావ్యంకాదన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ సరైన విధానాలను అవలంబించి ఉంటే.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఇంతటి తీవ్రతరమయ్యేదే కాదని అభిప్రాయపడ్డారు. వాస్తవాలను కూడా మరుగున పెట్టి మాట్లాడటం సబబు కాదని అన్నారు. పవన్‌ చేసిన సూచనలను కచ్చితంగా పాటిస్తామని మంత్రి చెప్పారు. ‘చంద్రబాబును చూసి రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదు అంటున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది కనుకే ప్రభుత్వం నుంచి బయటికొచ్చాం. పోరాటం చేస్తున్నాం. మొదటి సంవత్సరమే ఎందుకు బయటకు రాలేదని కొంతమంది అంటున్నారు. నాలుగేళ్ల తరవాత వస్తేనే.. ఆ వెంటనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆపేశారు. తీవ్రత ఉన్న చోట గ్రామానికి ఒక్క డయాలసిస్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని మంత్రి స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

కిడ్నీ బాధితులకు బీమా సౌకర్యం
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రక్తశుద్ధి చేయించుకునే వారికీ పింఛన్‌
  అభినందించకుండా... రాళ్లు వేస్తారా!
  వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం
26ap-main8a.jpg

ఈనాడు అమరావతి: ఎన్టీఆర్‌ ఆరోగ్య రక్ష పథకం ద్వారా మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారికి బీమా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.  పౌషకాహార లోపం, రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు కలిగిన ఐదేళ్లలోపు శిశువులకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ రక్తశుద్ధి చేయించుకునే బీపీఎల్‌ కుటుంబాల వారికీ రూ.2500 పింఛన్‌ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్లు వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘వైద్య సేవలు ప్రజలకు అందేలా సలహాలు ఇవ్వాలే కానీ...చేసే వారిపై రాళ్లు వేస్తారా? టీడీపీ ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున వైద్య సేవలు అందిస్తే కనీసం అభినందించరా? గత ప్రభుత్వాలు ఈ మేరకు వైద్య సేవలు అందించాయా? చేసే వారినే విమర్శిస్తే ఏ విధమైన సంకేతాలు ప్రజల్లోకి పంపుతున్నారు? వ్యతిరేక ధోరణులు అభివృద్ధికి నష్టాన్ని కలిగిస్తాయి. సంక్షేమానికి విఘాతాన్ని కలిగిస్తాయి...’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సమీక్షలో చర్చకు వచ్చిన అంశాలను అధికారులు ఒక ప్రకటనలో వివరించారు. ‘‘మూత్రపిండాల వ్యాధిగ్రస్తులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటోంది. పింఛన్ల సౌకర్యాన్ని కల్పించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉండగా 2.5 లక్షల మంది నివసిస్తున్నారు. 120 గ్రామాల్లో దాదాపుగా 20% మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. ప్రజల ఆహార అలవాట్లు, తాగునీరులో సిలికాన్‌ ఉండటం, వాతావరణ పరిస్థితుల రీత్యా కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని తేలింది. గత 10 ఏళ్లుగా నాలుగుసార్లు శాస్త్రవేత్తలు ఇక్కడ పరిశోధనలు జరిపారు. తుది ఫలితాలు మాత్రం తెలుపలేదు. వైఎస్సార్‌ హయాంలో ప్రకాశం జిల్లా కనిగిరి కిడ్నీ బాధితుల విషయంలో నిర్లక్ష్య వైఖరిని అవలంబించింది. ఫోర్లైడ్‌ అధిక స్థాయిలో ఉందని తెలిసినా ఒక వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వాల హయాంలో శ్రీకాకుళంలో ఒక్క సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి లేదు. ఒక నెఫ్రాలజిస్ట్‌ కూడా లేరు. డయాలసిస్‌ కేంద్రాలు లేవు. ఆర్వో ప్లాంట్‌ లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం 172 గ్రామాలకు మొదటి విడతలో, మిగిలిన 122 గ్రామాలకు మరో విడతలో సురక్షితమైన తాగునీటిని ఇచ్చేందుకు ఏర్పాట్లు జరిగాయి. ప్రకాశం జిల్లాకు 56 ప్లాంట్లు, కనిగిరికి 45 వాటర్‌ ప్లాంట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా కనిగిరి నియోజకవర్గ వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబాలను ఆదుకున్నాం. ఉద్ధానం ప్రాంతంలో 1,01,539 మంది నుంచి సీరమ్‌క్రియాటిన్‌, బ్లడ్‌ యూరియా పరీక్షల నిమిత్తం రక్త నమూనాల సేకరణ జరిగింది. 13,093 మంది వ్యాధిబారిన పడినట్లు గుర్తించి 4 సామాజిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అవసరమైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. పలాస, సోంపేట, పాలకొండ, శ్రీకాకుళం రిమ్స్‌, టెక్కలిలో ప్రత్యేకంగా రక్త శుద్ధికరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 798 రోగులకు 64,816 సెషన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాల ద్వారా సేవలు పొందుతున్న 2761 మంది సీకేడీ రోగులకు నెలకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2500 పింఛన్‌ పంపిణీ జరుగుతోంది’’ అని వివరించారు.

Link to comment
Share on other sites

కిడ్నీ రోగులకూ పింఛను ఇస్తున్నది మనమే
27-05-2018 02:11:11
 
  •  ప్రతి రోజూ 13 వేల మందికి వైద్య సేవలు
  •  రూ.17 కోట్లతో 7 ఆర్వో ప్లాంట్ల నుంచి తాగునీరు
  •  పని చేసే వారిపై గెడ్డలేస్తే... రాష్ట్ర అభివృద్ధికి నష్టం
  •  ఉద్దానం కిడ్నీ సమస్యపై అధికారులతో సీఎం చర్చ
అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తొలిసారిగా కిడ్నీ రోగులకూ పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఉదయం ఉద్దానం కిడ్నీ సమస్యలపై ఆరోగ్యశాఖ అధికారులతో చర్చించారు. ప్రతి నెలా 2761 మంది కిడ్నీ రోగులకు రూ.2,500 చొప్పున పింఛన్లు అందిస్తున్నామన్నారు. దీంతో పాటు ఉద్దానంలో కిడ్నీ సమస్యల పరిష్కారానికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి రోజూ 13 వేల మందికి పైగా కిడ్నీ రోగులకు క్రమం తప్పకుండా చికిత్స చేస్తున్నామని చెప్పారు. ప్రతి 15 రోజులకు నెఫ్రాలజిస్ట్‌ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. 5 డయాలసిస్‌ కేంద్రాలు, 60 డయాలసిస్‌ మిషన్లు రోజుకు 3 సెషన్లు పని చేస్తున్నాయన్నారు. పలాస, సోంపేట, పాలకొండ, శ్రీకాకుళం రిమ్స్‌, టెక్కలిలో పై కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. సీకేడీ కేసుల కోసం సోంపేటలో ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకూ లక్షకు పైగా రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించామన్నారు. ఉద్దానం ప్రాంతంలో ఇప్పటి వరకూ రూ.17 కోట్లతో 7 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని వివరించారు. మరిన్ని ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఏనాడైనా ఈ విధంగా వైద్యసేవలు అందించాయా? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున వైద్యసేవలు అందిస్తే కనీసం అభినందించరా? అని ఆయన నిలదీశారు. ‘‘పని చేసే వారిపైగెడ్డలు వేస్తారా? నెగటివ్‌ ధోరణులు అభివృద్ధికి నష్టం చేస్తాయి. సంక్షేమానికి విఘాతం కలిగిస్తాయి’’ అని సీఎం అన్నారు. పని చేసే వాళ్లనే విమర్శిస్తూ ప్రజల్లోకి ఏ విధమైన సంకేతాలు పంపుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా సలహాలు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు.
Link to comment
Share on other sites

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రక్తశుద్ధికీ పింఛన్లు
అదనంగా మరికొన్ని రక్తశుద్ధి కేంద్రాలు
ఉద్దానం, కనిగిరి, ఎ.కొండూరులలో కిడ్నీ వ్యాధులపై సీఎం సమీక్ష
ఈనాడు - అమరావతి
30ap-main5a.jpg

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు కూడా ఉచిత రక్తశుద్ధి (డయాలసిస్‌) సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వారికి పింఛన్లు కూడా అందజేయాలని సూచించారు. కొత్తగా పాడేరు, రంపచోడవరం, తుని, అమలాపురం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసరావుపేట, మాచర్ల, ఆత్మకూరు, మదనపల్లి, కుప్పం, కదిరి, రాయచోటి, ఆదోనిలో డయాలసిస్‌  కేంద్రాలను ఏర్పాటుచేయబోతున్న సందర్భంగా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. బుధవారం ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ప్రకాశం జిల్లా కనిగిరి, కృష్ణా జిల్లా ఎ.కొండూరు ప్రాంతాల్లో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు (సీకేడీ) ప్రబలకుండా ప్రణాళికలను సిద్ధంచేసి, యుద్ధప్రతిపాదికన అమలుచేయాలని సూచించారు. మూడు ప్రాంతాల్లో 100 శాతం రోగులకు పరీక్షలు జరపాలని, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసి, శుద్ధిచేసిన నీటినే స్థానికులకు అందచేయాలని తెలిపారు. నూజివీడు ప్రాంతీయ ఆస్పత్రిలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆయా ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిగస్తులకు అందిస్తున్న సేవల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఎ.కొండూరులో ఇటీవల ఒక వ్యక్తి మృతి గురించి మీడియాలో వచ్చిన విషయాన్ని సీఎం ప్రస్తావించగా అతనికి డయాలసిస్‌ జరగలేదని, సీకేడీ వ్యాధితో ఇబ్బందిపడినట్లు రెండు నెలల కిందట తేలిందని అధికారులు సమాధానమిచ్చారు. ఉచిత మందులతోపాటు రోగులకు పోషకాహారం కింద జూన్‌ 1 నుంచి అటుకుల లడ్లు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, సీఎంఓ కార్యదర్శి గిరిజా శంకర్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.

తెదేపా గెలుపు చారిత్రక అవసరం:
కుప్పం నియోజకవర్గ ప్రజలతో ముఖ్యమంత్రి
వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపు చారిత్రక అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వంద పనుల్లో 98 చేసి, రెండు పనులు చేయకపోయినా అదే ప్రజల్లోకి వెళుతుందని, కాబట్టి నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ మొత్తం అన్ని పనులూ పూర్తయ్యేలా శ్రద్ధ వహించాలని సూచించారు. కుప్పం నియోజకవర్గం నుంచి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజలతో ఆయన బుధవారం ఉండవల్లిలోని ప్రజా దర్బారు హాల్‌లో సమావేశమయ్యారు. ‘కుప్పం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చాలావరకు పూర్తి చేశాం. మిగిలినవీ డిసెంబరుకు పూర్తి చేస్తాం. ఇంకా నాలుగైదు వేల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. అవీ పూర్తయితే కుప్పంలో అందరికీ ఇళ్లు సమకూరినట్లే. త్వరలోనే వాటినీ నిర్మిస్తాం. హంద్రీ- నీవా ప్రాజెక్టు ఏడాదిలోగా పూర్తి చేస్తాం. కుప్పం నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు అందిస్తాం. 30 ఏళ్లుగా వరుసగా గెలిపిస్తున్న కుప్పం ఓటర్ల రుణం తీర్చుకోలేనిది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి వివరించారు. కేంద్రం సహకరించి ఉంటే మరింత అభివృద్ధి సాధించేవారమని తెలిపారు. ‘నాలుగేళ్లలో మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాం. చెప్పనినీ 38 చేశాం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మనం పూర్తి స్థాయిలో ప్రజాదరణ పొందాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ శ్యామ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఉద్దానం’పై దృష్టి పెట్టండి
10-06-2018 02:29:52
 
  • కిడ్నీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించండి: సీఎం
అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ప్రబలడానికిగల ప్రధాన కారణాన్ని గుర్తించి, శాశ్వత నివారణ మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సమస్యపై శనివారం సచివాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు సాధికార మిత్రాలను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందంటూ... రోగులకు డయాలసిస్‌ యూనిట్లు, ఆర్థిక సహకారం కింద పింఛన్లు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉద్దానంలో కిడ్నీ రోగాలు ప్రబలడానికి గల కారణాలు ఆన్వేషించేందుకు ప్రభుత్వం నియమించిన జార్డ్‌ గ్లోబల్‌ హెల్త్‌ సంస్థ సీఈవో వివేకనందజాతోపాటు వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆరోగ్యశాఖ సలహదారు జితేంద్రశర్మ, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ అరుణ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...