Jump to content

‘పశ్చిమ’ లోక్‌సభ స్థానాలకు కొత్త ముఖాలు!


Recommended Posts

నరసాపురంలో టీడీపీ తరఫున రఘురామకృష్ణంరాజు...
బీజేపీ నుంచి ఎంపీ గోకరాజు పోటీ అనుమానమే
  • ఏలూరు స్థానంపై మాగంటి బాబు నిరాసక్తత
  • బోళ్ల బుల్లిరామయ్య మనవడికి చాన్స్‌
  • ఈ రెండు చోట్ల వైసీపీ బరిలో కనుమూరి, శ్రీధర్‌?
  • టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో అత్యధికులకు మళ్లీ అవకాశం
  • తాడేపల్లిగూడెం కోసం ఆ పార్టీలో గట్టి పోటీ
  • ఇక్కడ బీజేపీ నుంచి గెలిచిన మాణిక్యాలరావు
  • కొవ్వూరు వర్గపోరులో జవహర్‌ సతమతం
ఏలూరు, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజకీయ పవనాలు ఎటు వీస్తున్నాయో స్పష్టమైన సంకేతాలిచ్చే జిల్లాల్లో పశ్చిమగోదావరి ఒకటి. జిల్లాలో ఈసారి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ జిల్లా సంపూర్ణంగా టీడీపీ వైపు నిలబడింది. వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. గతంలోలా బలం నిలుపుకోవాలని టీడీపీ తహతహలాడుతుండగా.. కొంతైనా ఆ పార్టీని దెబ్బ తీయాలన్న ప్రయత్నంలో వైసీపీ ఉంది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ మద్దతుతో నరసాపురం లోక్‌సభ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది. ఈసారి ఆ సీట్లలో కూడా టీడీపీనే పోటీ చేయనుంది. ఫలితంగా ఎంపీ సీట్లు రెంటిలోనూ రెండు పార్టీల తరఫునా కొత్త ముఖాలు రంగంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
 
ఏలూరు పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులపై స్పష్టత..
అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లలో ఈ రెండు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులపై కొంత స్పష్టత కనిపిస్తోంది. ఏలూరు అసెంబ్లీ సీటుకు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మళ్లీ పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అంతర్గత సమస్యలు కొన్ని ఉన్నా ఆయనకు నియోజకవర్గంలో పోటీ లేదు. వైసీపీ అభ్యర్థిత్వం మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మధ్యాహ్నపు ఈశ్వరికి దక్కుతుందని అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నానికి ఈ సీటుపై ఆసక్తి ఉన్నా విభేదించకుండా సర్దుకుపోతున్నారు. దెందులూరులో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మళ్లీ పోటీ చేయనున్నారు. ప్రభాకర్‌ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నా నియోజకవర్గంపై గట్టి పట్టున్న నాయకుడు కావడంతో అధినాయకత్వం కూడా మరో ఆలోచన చేయడం లేదు. వైసీపీ తరఫున కొఠారు అబ్బయ్య చౌదరిని రంగంలోకి దించనున్నారు. ఆయన అమెరికాలో ఉద్యోగం వదులుకుని తిరిగొచ్చారు. ఉంగుటూరులో టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులే మళ్లీ బరిలోకి దిగుతారు. ఆయన పార్టీ కార్యక్రమాలు తు.చ. తప్పకుండా నిర్వహిస్తుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కూడా మంచి మార్కులు పొందారు. వైసీపీ తరఫున ఈ నియోజకవర్గంలో పుప్పాల వాసుబాబు పోటీ చేయనున్నారు. చింతలపూడిలో టీడీపీ అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత మరోసారి పోటీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కానీ పార్టీలోని మరో వర్గంతో ఆమెకు సమస్యలు ఉన్నాయి. వ్యతిరేక వర్గంతో సఖ్యత కుదుర్చుకుని అందరినీ కలుపుకొని పోవాలని పార్టీ నాయకత్వం ఆశిస్తోంది. ఆమె కాని పక్షంలో తమకు అవకాశం ఇవ్వాలని డాక్టర్‌ కర్రా రాజారావు, జడ్పీ మాజీ చైర్మన్‌ జయరాజు కోరుతున్నారు. వైసీపీ తరపున ఐఆర్‌ఎస్‌ మాజీ అధికారిణి ఎలీజా పోటీ చేస్తారని అంటున్నారు. పోలవరం (ఎస్టీ)లో కూడా టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావుతో ఒక వర్గం విభేదిస్తోంది. కొన్ని ఆరోపణలు కూడా ఆయన్ను చుట్టుముట్టాయి. ఆయనకు ఇవ్వకపోతే తమకు అవకాశం ఇవ్వాలని బొరగం శ్రీనివాస్‌, కుంజా సుభాషిణి, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాస్‌ కుమార్తె కోరుతున్నారు. ఈ నియోజకవర్గంలో వర్గాల సమస్యలను ఎలా పరిష్కరించాలన్నదానిపై టీడీపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఇక్కడ వైసీపీ టికెట్‌ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకే దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
 
నరసాపురం పరిధిలో ఆసక్తికరం...
నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమీకరణలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ ఆచంటలో తిరిగి పోటీ చేయనున్నారు. వైసీపీ తరఫున ఇక్కడ నియోజకవర్గ కన్వీనర్‌ కారు శ్రీనివాస్‌ పేరు వినిపిస్తోంది. ఇంకా బలమైన అభ్యర్థి కోసం ఆ పార్టీ అన్వేషిస్తోందని చెబుతున్నారు. నరసాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మరోసారి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో చేరినా అసెంబ్లీకి ఆయన పేరును పరిశీలించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. నరసాపురం లోక్‌సభ స్థానానికి ఏ కారణం వల్లనైనా రఘురామ కృష్ణంరాజు పేరు వెనక్కి వెళ్తే సుబ్బారాయుడిని నిలిపే అవకాశం ఉందంటున్నారు. వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు తిరిగి పోటీ చేయనున్నారు. పాలకొల్లులో సిటింగ్‌ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తిరిగి పోటీ చేయనున్నారు. ఆయనకు టీడీపీలో పెద్దగా పోటీ కూడా లేదు. వైసీపీ నుంచి సీనియర్‌ నేత నాగబాబుకు అవకాశం వస్తుందని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు కూడా బరిలో ఉన్నారు. భీమవరంపై కొంత ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే రాజ్యసభ ఎంపీ సీతారామలక్ష్మి తనయుడు జగదీశ్‌కు అవకాశం రావచ్చని అంటున్నారు. అంజిబాబు ప్రస్తుతానికి పోటీపై ఆసక్తి చూపుతున్నట్లే కనిపిస్తోంది. వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివా్‌సకు అవకాశం రావచ్చంటున్నా.. గాదిరాజు సుబ్బరాజు, ఏఎస్‌ రాజు వంటి వారు కూడా పోటీలో ఉన్నారు. ఉండిలో ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మరోసారి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని సమస్యలు ఉన్నా ఆ పార్టీలో బలమైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదని అంటున్నారు. వైసీపీలో మొదట మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కీలకంగా కనిపించారు.
 
ఆరు నెలల కింద యండగండి నరసింహరాజును నియోజకవర్గ ఇన్‌చార్జిగా పెట్టారు. టికెట్‌ ఈయనకేనని ప్రచారం జరుగుతోంది. తణుకులో టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ మళ్లీ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వంకా రాజకుమారి, ఆమె భర్త వంకా రవీంద్ర కూడా టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ టికెట్‌ కోసం త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యేగా బీజేపీకి చెందిన మాజీ మంత్రి మాణిక్యాలరావు ఉన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జిగా ఉన్న ఈలి నాని తనకే టికెట్‌ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నా.. ఆయనకు మునిసిపల్‌ చైౖర్మన్‌ బోలిశెట్టి శ్రీనివాస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. జడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు కూడా బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు టికెట్‌ వస్తుందని అంటున్నారు. వలవల బాబ్జీ కూడా పోటీదారుగా ఉన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన వద్ద పనిచేసి ప్రస్తుతం వేరే రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక ఐఏఎస్‌ అధికారి పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది. ఆయన ఆసక్తి చూపితే వైసీపీ టికెట్‌ ఆయనకే వస్తుందని అంటున్నారు.
 
మొత్తం స్థానాలు: 15
టీడీపీ: 14.. బీజేపీ: 1
వైసీపీ: 0
 
శేషారావుకు సోదరుడి నుంచే పోటీ..
 
ఈ జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు (ఎస్సీ), గోపాలపురం అసెంబ్లీ స్థానాలు రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి. టీడీపీ టికెట్‌ విషయంలో నిడదవోలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు ఆయన సోదరుడి నుంచే పోటీ ఎదురవుతోంది. ఆ సమస్య పరిష్కారమైతే శేషారావుకే తిరిగి టికెట్‌ వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కుందుల సత్యనారాయణ అనే టీడీపీ నేత కూడా పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి సీనియర్‌ నేత జీఎస్‌ రావు కుమారుడు శ్రీనివాసనాయుడికి టికెట్‌ వస్తుందని చెబుతున్నారు. ఆలపాటి నరేంద్ర కూడా రేసులో ఉన్నారు.
 
కొవ్వూరు(ఎస్సీ)లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కేఎస్‌ జవహర్‌ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో రెండు టీడీపీ వర్గాల మధ్య నెలకొన్న వైరం ఆయన తలకు చుట్టుకొంది. ఆయన తటస్థంగా ఉండకుండా ఓ వర్గం వైపు ఉంటున్నారన్న విమర్శ ఎదుర్కొంటున్నారు. ఈ గొడవల నేపథ్యంలో ఆయన ఈసారి కృష్ణా జిల్లా తిరువూరు (ఎస్సీ) వెళ్లిపోతారని ప్రచారం మొదలైంది. ఆయన మాత్రం ఖండిస్తున్నారు. తాను కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని గట్టిగా చెబుతున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వనిత పోటీ చేయనున్నారు. గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యేగా ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇతర రిజర్వుడు నియోజకవర్గాల మాదిరిగా ఇక్కడ గొడవలు లేవు. కానీ ఆయన నియోజకవర్గంపై పట్టు సాధించలేదన్న అభిప్రాయంలో కొందరు నేతలు ఉన్నారు. ఏ కారణం వల్లనైనా వెంకటేశ్వరరావుకు అవకాశం రాకపోతే మద్దిపాటి వెంకట్రాజు పేరు పరిశీలనకు రావచ్చని అంటున్నారు. వైసీపీ నుంచి తలారి వెంకట్రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముప్పిడి సంపత్‌కుమార్‌ కూడా పోటీలో ఉన్నారు.
 
 
నరసాపురంలో కొత్తవారే! 23.jpg
బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ఇటీవల పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఇటీవల టీడీపీలో చేరారు. ఆయన ఈ స్థానంలో పోయినసారి బీజేపీ టికెట్‌ ఆశించారు. కాని అనూహ్యంగా గోకరాజుకు లభించి ఆయన గెలిచారు. ఈసారి గోకరాజు పోటీ చేయడం నమ్మకం తక్కువేనని అంటున్నారు. టీడీపీ టికెట్‌ ఈసారి రఘుకు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ కూడా ఈసారి కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. కాంగ్రె్‌సలో ఉన్న మాజీ మంత్రి కనుమూరి బాపిరాజును పార్టీలోకి తీసుకొచ్చి నిలపాలని ఆ పార్టీ నేతలు కొందరు ప్రయత్నిస్తున్నారు.
 
 
యువ నేతల బరి.. ఏలూరు1212.jpg
ఏలూరు సిట్టింగ్‌ టీడీపీ ఎంపీ మాగంటి బాబు ఈసారి ఎంపీగా పోటీ చేస్తారా అన్నది అనుమానంగా కనిపిస్తోంది. ఎంపీ పోటీ ఆర్థికంగా తలకు మించిన భారం కావడం, కొన్ని నియోజకవర్గాల్లో వర్గాల సమస్యలు ఎదురు కావడంతో ఆయన కొంత నిరాసక్తత కనబరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎంపీగా పోటీ చేయకపోతే ఆయన కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే లోక్‌సభ సీటు యువ నేత బోళ్ల రాజీవ్‌కు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈయన కేంద్ర మాజీ మంత్రి, దివంగత టీడీపీ సీనియర్‌ నేత బోళ్ల బుల్లిరామయ్య మనవడు. రాజకీయాలపై తనకున్న ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన తోట చంద్రశేఖర్‌ ఆ పార్టీకి దూరమై ఇటీవల జనసేనలో చేరారు. దీంతో వైసీపీ నుంచి మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు పోటీ చేయడం ఖాయమేనని చెబుతున్నారు.
Link to comment
Share on other sites

59 minutes ago, Siddhugwotham said:

Kanumuri into YCP? Strange!

Even though he is Congress, Kanumuri has some reputation in Narsapuram.

Reputation madichi pettukomane days ivi..  Power retain cheskovatam important politics lo. 

Link to comment
Share on other sites

4 hours ago, koushik_k said:

Reputation madichi pettukomane days ivi..  Power retain cheskovatam important politics lo. 

kanumuri have good name ....his wife also have very good name....raghuramakrishnarajuki sontha caste support cheyakpovachi kanumuri candidate aythe  :dream: valla voting less than 5% so lite emo

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...