Jump to content

BJP Government main reason for current TN Issue (Tuttukudi-Vedanta)


RKumar

Recommended Posts

వేదాంతకు మిన హాయింపు! 
కేంద్రం ‘వివరణ’ కలిసొచ్చిందంటున్న నిపుణులు 
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా విస్తరణకు అవకాశం 
ఉద్యమించిన స్థానికులు 
24ap-main17a.jpg

వేదాంత కర్మాగారానికి వ్యతిరేకంగా తమిళనాడులోని తూత్తుకుడి అట్టుడుకుతోంది. ఈ రాగి పరిశ్రమ కాలుష్యం వల్ల తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటూ స్థానికులు చాలా ఏళ్లుగా తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. అయితే తాము పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే.. విస్తరణ పనులు చేపడుతున్నామని వేదాంత చెబుతోంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ... కర్మాగారానికి అనుమతుల విషయంలో కేంద్రం కొన్ని ‘మినహాయింపులు’ ఇచ్చిన మాట వాస్తవమేనని పర్యావరణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు, పలు కోర్టు రికార్డుల్ని విశ్లేషించిన నిపుణులు విశదీకరిస్తున్నారు. హరిత నిబంధనలకు భాష్యం చెబుతూ 2014 డిసెంబరులో ఇచ్చిన ఓ ఉత్తర్వు వేదాంత స్టెరిలైట్‌తో పాటు.. ఇలాంటి మరికొన్ని పరిశ్రమలకు వరమయిందని వారు విశ్లేషిస్తున్నారు.

వివరణ పేరుతో మినహాయింపు 
ప్రాజెక్టుల్ని నిర్మించాలంటే తొలుత చట్ట ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందేనంటూ 2014 మే నెలలో అప్పటి యూపీఏ సర్కారు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఎన్డీయే సర్కారు- పరిశ్రమల నుంచి వచ్చిన విజ్ఞాపనల మేరకు.. పర్యావరణ భద్రతా నిబంధనలకు ‘వివరణ’ ఇచ్చే పేరిట ‘మినహాయింపులు’ ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఈ వివరణ ప్రజాభిప్రాయ సేకరణను మినహాయించింది. ఈ ఉత్తర్వులు చట్ట వ్యతిరేకమని 2016లో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ గుర్తించి పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులకు గట్టి హెచ్చరిక చేసింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకుంటే చాలా ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని మంత్రిత్వశాఖ అధికారులు బదులిచ్చారు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వుల్ని హరిత ట్రైబ్యునల్‌ రద్దుచేసింది. ఎన్‌జీటీ ఆదేశాల మేరకు.. పర్యావరణ అనుమతుల్లేని పారిశ్రామిక పార్కుల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి తప్పకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిందేనంటూ పర్యావరణ మంత్రిత్వశాఖ తాజా ఉత్తర్వులిచ్చింది. అప్పటికే.. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ట్యుటికోరిన్‌లోని పరిశ్రమ విస్తరణకు హరిత అనుమతుల్ని వేదాంత సంపాదించిందని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

పర్యావరణ అనుమతులు తప్పనిసరి 
భారీ ప్రాజెక్టులు ఏవైనా సరే తొలుత పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు పొంది తీరాల్సిందే. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణంపై, అక్కడి ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే సమగ్ర వివరాల్తో ప్రాజెక్టు డెవలపర్‌ నివేదికను తయారుచేసి సమర్పించాల్సి ఉంటుంది. దీనిని సంబంధిత శాఖ- రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణతో ప్రాజాభిప్రాయ సేకరణకు పంపుతుంది. పర్యావరణ శాఖ నిపుణులు సంప్రదింపులు జరిపి, ప్రభావాల్ని అంచనా వేసిన తర్వాత అనుమతులు ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు. సంప్రదింపుల సమయంలో ప్రజలు ప్రాజెక్టును తిరస్కరించలేరు కానీ.. తమ ఆందోళనల్ని వ్యక్తీకరించవచ్చు. వీటిని సంబంధిత కంపెనీ, కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంటుంది.

2006 నాటి నిబంధనలు ఏం చెబుతున్నాయి? 
కొన్ని కేసుల్లో మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలంటూ 2006 నాటి పర్యావరణ నిబంధనలు మినహాయింపులు ఇస్తున్నాయి. పర్యావరణ అనుమతి ఉన్న ఒక పెద్ద పారిశ్రామిక పార్కులో చిన్న పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నట్లయితే.. ఆ నిర్దిష్ట పరిశ్రమకు ప్రజాభిప్రాయ సేకరణ అక్కర్లేదన్నది ఆ మినహాయింపుల సారాశం. అయితే ఆ పారిశ్రామిక పార్కు 2006 కన్నా ముందు ఏర్పాటైనది అయి ఉండి.. దానికే పర్యావరణ అనుమతుల్లేకపోతే.. వాటిలో ఏర్పాటుచేసే పరిశ్రమల వల్ల ప్రజలు నష్టపోతే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలు ఆ తర్వాత ఉత్పన్నమయ్యాయి. దీంతో 2014 మే 16వ తేదీన యూపీఏ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పర్యావరణ అనుమతులున్న పారిశ్రామిక పార్కులో పరిశ్రమల్ని ఏర్పాటుచేస్తున్నట్లయితే మాత్రమే.. అప్పటికే అక్కడ పరిశీలనలు పూర్తయి ఉంటాయి కాబట్టి.. ప్రజాభిప్రాయ సేకరణ నిబంధనను పట్టించుకోనక్కర్లేదన్నది ఆ వివరణ సారాంశం. పర్యావరణ భద్రతా నిబంధనల కింద అంచనా వేయని పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమల్ని ఏర్పాటుచేసినట్లయితే తప్పకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందేనని స్పష్టంగా పేర్కొంది.

ఆ తర్వాతే నీరు గార్చారు 
ఆ తర్వాత గద్దెనెక్కిన ఎన్డీయే సర్కారు ‘సులభతర వాణిజ్య’ నినాదాన్ని అందుకుంది. ఇదే సమయంలో నిబంధనలు సడలించాలంటూ పలు పరిశ్రమలు ప్రభుత్వానికి వినతులు పెట్టుకున్నాయి. దీంతో 2014 డిసెంబరు 10వ తేదీన పర్యావరణ మంత్రిత్వశాఖ ‘వివరణ’ ఇచ్చింది. అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ఆమోదంతో కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువరించింది. ఆ జోన్లకు ఎన్నడూ పర్యావరణ అనుమతుల్లేనప్పటికీ... నిర్దిష్ట పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలు ప్రజల్ని సంప్రదించాల్సిన అవసరం లేదన్నది ఆ వివరణ సారాశం. దీనివల్ల వేదాంత లాంటి కంపెనీలెన్నో లాభపడ్డాయి.

వేదాంత ఎలా లాభపడింది? 
వేదాంత రాగి పరిశ్రమ ట్యుటికోరిన్‌లోని సిప్కాట్‌(తమిళనాడు పారిశ్రామిక ప్రోత్సాహక కార్పొరేషన్‌ లిమిటెడ్‌) పారిశ్రామిక కాంప్లెక్సులో ఏర్పాటయింది. ఈ కాంప్లెక్సు 2006లో పర్యావరణ ఆమోద నిబంధనలు అమల్లోకి రాకముందే ఏర్పాటయింది. వేదాంత తొలుత 2009లో రాగి పరిశ్రమ విస్తరణకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి కోరింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే విస్తరించడానికి అప్పటి యూపీఏ సర్కారు అనుమతించింది. ఈ అనుమతికి కాలం చెల్లిపోయిన తర్వాత, పొడిగింపు కోసం 2013లో వేదాంత మరోమారు కేంద్ర మంత్రిత్వశాఖ వద్దకు వెళ్లింది. ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందేనంటూ 2014 మేలో ప్రభుత్వం తెగేసి చెప్పింది. 2014 డిసెంబరులో ఆ ఉత్తర్వులకు చెల్లుచీటీ పలకడంతో.. 2018 డిసెంబరు వరకు పర్యావరణ అనుమతుల్ని పొడిగిస్తూ 2015 మార్చిలో పర్యావరణ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా నిర్మాణాల్ని కొనసాగించడానికి వేదాంతకు అవకాశం వచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణపై వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్న సమయంలోనే వేదాంతకు అనుమతి రావడం గమనార్హం.

-ఈనాడు ప్రత్యేక విభాగం
Link to comment
Share on other sites

Expansion cheyyadaaniki try cheyyadaaniki main reason BJP govt. at center.

Previous UPA government prajabhiprayasekarana lekunda expansion vaddu ani chepthe Baffas vachhi exemption ichhi expansion plan chesaru ippudu idi pedda issue ayyindi.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...