Jump to content

Krishna Water allocation increased to Rayalaseema


RKumar

Recommended Posts

నీరెండిన కృష్ణమ్మ
వరుసగా మూడేళ్లు... కృష్ణా నదికి లేవు నీళ్లు
ఈ సారైనా కరుణించేనా
ఇబ్బందిపడ్డ తెలుగు రాష్ట్రాలు
కొత్త ప్రాజెక్టులతో కాస్త సాంత్వన
డెల్టాను ఆదుకున్న పట్టిసీమ
ఈనాడు - హైదరాబాద్‌
24ap-main1a.jpg

రుసగా మూడేళ్లు కృష్ణాబేసిన్‌లో ఖరీఫ్‌ కష్టాలు తప్పలేదు.ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నా, ఖరీఫ్‌ సాగుపై మాత్రం  అధికారులు, రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2001-02 నుంచి 2003-04 వరకు మూడేళ్లపాటు కృష్ణాబేసిన్‌లో అతి తక్కువ నీరు లభ్యమైంది. ఇప్పుడు కూడా వరుసగా 2015-16 నుంచి 2017-18 వరకు తక్కువ నీరుండటంతో పాటు కొన్ని రిజర్వాయర్లు నిండలేదు. తుంగభద్ర చరిత్రలో వరుసగా మూడేళ్లు డ్యాం గేట్లు ఎత్తలేదు. వరుసగా మూడేళ్లు నీటి లభ్యత తక్కువగా ఉండటంతో వచ్చే నీటి సంవత్సరం మెరుగ్గా ఉండొచ్చన్న ఆశాభావాన్ని రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కేటాయింపు ఉండగా, ఇందులో ఏపీకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు. దీంతోపాటు క్యారీ ఓవర్‌కు 150 టీఎంసీలు నిల్వ చేసుకొనే అవకాశం ఉంది. గత మూడేళ్లూ బచావత్‌ కేటాయించిన మేరకు కూడా నీరు రాలేదు. 2015-16లో మొత్తం కృష్ణాబేసిన్‌లో వినియోగం 205.7 టీఎంసీలు మాత్రమే కాగా, తర్వాత రెండు సంవత్సరాలు వరుసగా 434.9, 541.37 టీఎంసీలు.  మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ వినియోగం 130.875, 284.892, 360 టీఎంసీలు కాగా తెలంగాణ వినియోగం 74.828, 150.03, 181.37 టీఎంసీలు.

సాగర్‌ కింద వరుసగా కష్టాలే
నీరు లేకపోవడంతో నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువల కింద వరుసగా మూడేళ్లు ఖరీఫ్‌ సాగవ్వలేదు. కుడి కాలువ ఆయకట్టు పూర్తిగా ఏపీలో ఉండగా, ఎడమ కాలువ కింద ఉన్న 132 టీఎంసీల కేటాయింపులో తెలంగాణకు 99.75 టీఎంసీలుండగా, మిగిలింది ఆంధ్రప్రదేశ్‌కు. నీరు లేకపోవడంతో 2015-16లో ఆయకట్టుకు నీటిని ఇవ్వలేకపోయారు. 2016-17లో ఆలస్యంగా ఖరీఫ్‌లో కొంత ఆయకట్టుకు నీరిస్తే రబీలో 36 టీఎంసీలతో 3.83 లక్షల ఎకరాలకు ఇచ్చారు. 2017-18లో కూడా రబీలో 44.78 టీఎంసీల నీటిని 5.2 లక్షల ఎకరాలకు ఇచ్చారు. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, ఇంజినీర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షించడం వల్ల ఒక టీఎంసీ నీటితో 11,613 ఎకరాలు సాగు చేయగలిగారు. తెలంగాణ తనకున్న వాటా నుంచి సాగర్‌ ఎడమకాలువతో పాటు ఏఎంఆర్‌పీ కూడా నీటిని ఇవ్వగలిగింది. కుడి కాలువ కింద మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చింది.

తుంగభద్ర మరీ దయనీయం
తుంగభద్ర ప్రాజెక్టు కింద ఎగువ కాలువ, దిగువ కాలువ, ఆర్డీఎస్‌కు 70 టీఎంసీలు అందాల్సి ఉంది.గత మూడేళ్లలో నీటి లభ్యత సరాసరిన 30 టీఎంసీలు మాత్రమే. అనంతపురం, కడప, కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తుంగభద్ర ఆయకట్టు ఉంది. వచ్చిన నీటిలో కూడా ఎక్కువ భాగం తాగునీటి అవసరాలకే పోయాయి. దీంతోపాటు కర్నూలు, కడప జిల్లాల్లో ఆయకట్టుకు నీరిచ్చే కేసీ కాలువకు కూడా మూడేళ్లలో నీటి లభ్యత తక్కువే.

ఆదుకున్న గోదావరి
కృష్ణాబేసిన్‌లో సాగర్‌ తర్వాత అత్యధిక ఆయకట్టు ఉన్న కృష్ణాడెల్టాను పట్టిసీమ ద్వారా మళ్లించిన గోదావరి నీరు ఆదుకొంది. కృష్ణాడెల్టాకు 181 టీఎంసీల కేటాయింపు ఉండగా, ఆధునికీకరణ ద్వారా ఇతర ప్రాజెక్టులకు చేసిన కేటాయింపు పోనూ 152 టీఎంసీలు ఉంది. ఇంకా ఆధునికీకరణ పూర్తి కాకపోవడంతో ఆయకట్టు పూర్తిగా సాగు చేయడానికి ఎక్కువ నీటిని వినియోగిస్తున్నారు. గత మూడేళ్లలో వరుసగా 40 నుంచి 70 టీఎంసీల వరకు కృష్ణాబేసిన్‌ నుంచి తీసుకోగా, మిగిలిన నీటిని గోదావరి నుంచి మళ్లించారు.

కొత్త ప్రాజెక్టుల కింద..
బచావత్‌ కేటాయింపులు లేని కొత్త ప్రాజెక్టుల కింద ఈ మూడేళ్లు నీటి వినియోగం జరిగింది. ఏపీలో హంద్రీనీవా, తెలుగుగంగ, తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులున్నాయి. ఆయా రాష్ట్రాలు తమకున్న మొత్తం కేటాయింపుల నుంచి ఈ నీటిని తీసుకొన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2017-18లో అత్యధికంగా 26.785 టీఎంసీల నీటిని మళ్లించి చెరువులు నింపారు. నెట్టెంపాడు ద్వారా 6.68 టీఎంసీలిచ్చారు. హంద్రీనీవా ద్వారా 31.558 టీఎంసీల నీటిని మళ్లించి కర్నూలు, అనంతపురం జిల్లాలోని చెరువులకు సరఫరా చేశారు. హంద్రీనీవా మొత్తం సామర్థ్యం 40 టీఎంసీలు కాగా, రెండవ దశ పూర్తికాక ముందే ఇంత ఎక్కువ నీటిని మళ్లించారు. అయితే ఈ ప్రాజెక్టు కింద సాగులోకి తేవాలని నిర్ణయించిన ఆయకట్టుకు మాత్రం ఇంకా అందలేదు. తుంగభద్ర హెచ్చెల్సీ ద్వారా అందాల్సిన నీరు రాకపోవడంతో హంద్రీనీవా నుంచి మళ్లించిన నీరు ఉపయోగపడింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా ఈ ఏడాది 91.1 టీఎంసీలు మళ్లించారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగతో పాటు కేసీ కాలువకు కొంత నీటిని సరఫరా చేశారు. సోమశిలకు కూడా కొంత మళ్లించారు. 2015-16తో పోల్చితే తర్వాత రెండు సంవత్సరాలు కొంత మెరుగని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

24ap-main1b.jpg
24ap-main1c.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...