Jump to content

Arya vysya corporation


Recommended Posts

వైశ్యుల అభివృద్ధికి అండ
24-05-2018 01:28:39
 
  • రూ.30 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్‌
  • విదేశీ విద్యకు రూ.10లక్షలు ఆర్థిక సాయం
  • నైపుణ్యాభివృద్ధిలో, నూతన సాంకేతికతలో శిక్షణ
అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేద ఆర్యవైశ్యులకు అండదండలందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆర్యవైశ్య సామాజికవర్గం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే బడ్జెట్‌లో రూ.30 కోట్లు కేటాయించిన ప్రభుత్వం వారిని ఆర్థికంగా, విద్యాపరంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్యవైశ్యుల నుంచి స్వయం ఉపాధి రుణాల కోసం 16 వేల దరఖాస్తులు అందాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాలకు అందిస్తున్న తరహాలోనే పేద ఆర్యవైశ్యులకు ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్వతహాగా వ్యాపారమే వృత్తిగా ఉండే ఈ సామాజికవర్గానికి కల్పించే స్వయం ఉపాధి యూనిట్లు ప్రత్యేక తరహాలో ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఆమేరకు ఇప్పటికే ఆర్యవైశ్య వ్యాపారులు, ప్రతినిధులతో బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఉదయలక్ష్మి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎలాంటి పథకాలు వారి అభివృద్ధికి ఉపయోగపడతాయన్న దానిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వ్యాపారమే ప్రధాన జీవనంగా సాగే ఈ వర్గానికి కల్పించే ఉపాధి హామీ పథకాలు అమలులో ఉన్నవాటికి భిన్నంగా ఉండాలని ఈ సందర్భంగా పలువురు సూచించారు.
 
లబ్దిదారుల ఎంపికలో తమ సామాజికవర్గానికి చెందిన వారిని కూడా భాగస్వామ్యం చేయాలని వారు కోరారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ద్వారా అందించే సాయంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌ ద్వారా కూడా సాయం అందజేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, పెద్ద వ్యాపారస్తులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని వీరు కోరారు. ఈ సామాజిక వర్గంలో ఉన్నత చదువులకు వెళ్లేవారు తక్కువగా ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. దీనితో విదేశీ చదువుల నిమిత్తం ఇతర సామాజిక వర్గాలకు అందించినట్లే వీరికి కూడా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, సివిల్‌ సర్వీస్‌ కోచింగ్‌ ఉచితంగా అందించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఆర్యవైశ్యులు చేపట్టే వ్యాపారాల అభివృద్ధికి పీపీపీ విధానంలో సహకారం అందించాలని, ప్రణాళికల రూపకల్పనలో ఎన్‌ఆర్‌ఐల సహకారం తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
 
బ్యాంకు లింకేజ్‌తో ఏర్పాటు చేసే ప్రతి యూనిట్‌కు 50 శాతం సబ్సిడీ, వ్యాపార నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఈ-కామర్స్‌పై శిక్షణ ఇవ్వాలని భావిస్త్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించే ఆర్యవైశ్య యూనిట్లను మాల్స్‌, వాల్‌మార్ట్‌, అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఆలిబాబా, స్నాప్‌డీల్‌ తదితర సంస్థలతో వీలయినంతర వరకు అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని ఆ సామాజికి వర్గానికి చెందిన సంఘాలు భావిస్తున్నాయి.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
37 minutes ago, subbu_chinna said:

Is it true.. Today in office i had a discussion with balija friend.. He told nothing like that both are same 

if i am not wrong within the various regions of andhra pradesh, Balijas and Kapus have different thinking on this equality. 

Link to comment
Share on other sites

  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...