Jump to content

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రోగ్రెస్ రిపోర్ట్


Recommended Posts

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రోగ్రెస్ రిపోర్ట్
24-05-2018 11:29:21
 
636627581634583584.jpg
  • సినీ తళుకులు.. ప్రగతి మెరుపులు
  • లేపాక్షికి అంతర్జాతీయ కీర్తి
  • ఓటమి ఎరుగని కోటలో బాలకృష్ణ మార్కు
  • ప్రజలకు అందుబాటులో పీఏ
  • సామాన్యులకు దూరం.. ఎమ్మెల్యే దర్శనం
అనంతపురం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి):హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటోంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీరామారావు నుంచి ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ వరకు ఓటమి ఎరుగని నియోజకవర్గంగా రికార్డులకెక్కింది. 2014 ఎన్నికల తరువాత ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అయితే సినీహీరోగా బిజీగా ఉన్న కారణంగా నియోజకవర్గ ప్రజలకు అనుకున్నంతగా ఆయన అందుబాటులో ఉండలేకపోతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత కార్యదర్శిని నియమించి అక్కడ ఉండేలా చూస్తున్నారు. ప్రజా సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం లభిస్తున్నా.. ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదనే అసంతృప్తి ఉంది. ఎంత బిజీగా ఉన్నా ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు తీసుకువచ్చి తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
 
 
అభివృద్ధి పరుగులు..
ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెట్టింది. ప్రధానంగా హిందూపురం జిల్లా ఆస్పత్రిని కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో ఉచిత డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. రూ. 20 కోట్లతో మాతాశిశు ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేశారు. దీంతో హిందూపురం ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగింది. శిల్పకళా క్షేత్రం లేపాక్షిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. రూ. 6 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టి 2016, 18లో రెండుసార్లు అత్యంత వైభవంగా లేపాక్షి ఉత్సవాలు నిర్వహించారు.
 
ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీ కళాకారులను పిలిపించి లేపాక్షి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటడంలో బాలకృష్ణ విజయం సాధించారు. హిందూపురం పట్టణానికి తాగునీరందించడానికి ఇప్పటికే పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌) పైప్‌లైన్‌ ఉండగా, మరో ప్రత్యేక నీటి సరఫరా మార్గం అన్వేషించారు. అమృత్‌ పథకం కింద రూ. 194 కోట్లతో ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి హిందూపురానికి నీటిని తీసుకు వచ్చే పనులు శీఘ్రగతిన సాగుతున్నాయి. హిందూపురం ప్రాంతంలో సాగు,తాగునీటి సమస్య శాశ్వత పరిస్కారం కోసం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా హంద్రీనీవా మడకశిర బ్రాంచ్‌ కాలువ పనులు పూర్తి చేయించి నియోజకవర్గంలోని లేపాక్షి, హిందూపురం ప్రాంతాల్లో కొన్ని చెరువులు నింపారు.
 
 
పట్టణంలో రూ. 23 కోట్లతో నిర్మించ తలపెట్టిన కూరగాయల మార్కెట్‌కు ప్రభుత్వ వాటా కింద రూ. 10 కోట్లు విడుదల చేయగా నిర్మాణం ఊపందుకుంది. పట్టణంలో ఎల్‌ఈడీ వెలుగులు విరజిమ్మేలా చేశారు. రూ. 7 కోట్ల కరువు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి తాగునీటిని ఇంటింటికీ అందించగలిగారు. అలాగే పట్టణ శివారు ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పా టు కోసం ఎమ్మెల్యే నిధుల కింద రూ. 66 కోట్లు కేటాయించారు. పట్టణంలో రూ. 940 కోట్లతో జీప్లస్‌ త్రీ ఇళ్ల సముదాయ నిర్మాణం చేపడుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామానికీ తారు రోడ్లు, ప్రతి వీధిలో సిమెంటు రోడ్లు, పక్కా ఇళ్లు నిర్మించేందుకు నిధులు తీసుకువచ్చారు. నీరు-చెట్టు కింద చెరువుల అభివృద్ధి, రైతుల భూములకు సారవంతమైన మట్టి తరలింపు కోసం రూ. 24 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు.
 
రైతు రథం కింద రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనివిధంగా 106 ట్రాక్టర్లు రైతులకు పంపిణీ చేయించారు. అలాగే 3,500 మందికి ఒకేసారి పింఛన్లు పంపిణీ చేశారు. గురుకుల పాఠశాలలు, ఎన్టీఆర్‌ గృహాలు, వైద్య రంగం అభివృద్ధికి పెద్దపీట వేశారు. రూ. రెండు కోట్లతో ఇం డోర్‌ స్టేడియం, రూ. 4 కోట్లతో బహువిధ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో జాతీయరహదారి ఏర్పాటుకు కేంద్రాన్ని ఒప్పించి రూ.320 కోట్లు మంజూరు చేయించారు. వ్యవసాయ శాఖ తరపున పంటనష్ట పరిహారం, రు ణమాఫీ, రైతుబంధు పథకం కింద రూ. 134 కోట్లు, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ కలిపి రూ. 127 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా పథకం కింద రూ. 15.84 కోట్లు, గృహనిర్మాణం కింద రూ. 37 కోట్లు, మండల పరిషత్‌ కింద రూ.67 కోట్లు ఖర్చు చేయించారు. పింఛన్ల కింద రూ. 123.37 కోట్లు, మైనార్టీల కింద రూ. 2.94 కోట్లు, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ. 1.46 కోట్లు పంపిణీ చేశారు.
 
 
అందుబాటులో పీఏ..
హిందూపురంలో బాలకృష్ణ స్థానికంగా లేకపోవడంతో పీఏను ప్రజల కోసం అందుబాటులో ఉంచారు. అయితే పీఏగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన శేఖర్‌ ఎమ్మెల్యేకి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దీంతో ఆయనను తొలగించి ఆ స్థానంలో కృష్ణమూర్తిని, వీరయ్యను నియమించారు. కృష్ణమూర్తి నియోజకవర్గమంతా తిరిగి పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చిన తరువాత వెళ్లిపోగా, ఇప్పటికీ వీరయ్య కొనసాగుతున్నారు. హిందూపురంలోని చౌడేశ్వరికాలనీలో బాలకృష్ణ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వచ్చిన ప్రతిసారీ రెండుమూడు రోజులు హిందూపురంలోనే ఉండి ప్రజా సమస్యలు ఆలకిస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
 
 
నెరవేరని హామీలు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధానమైన హామీల్లో కొన్ని నేటికీ నెరవేరలేదు. హిందూపురం ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామన్న హామీ నేటికీ ఆచరణలోకి రాలేదు. నిరుద్యోగ యువత కోసం ఎన్టీఆర్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు, ప్రతి ఇంటికీ ఎన్టీఆర్‌ సుజల స్రవంతి శుద్ధజలం, ప్రభుత్వ బాలుర జూనియర్‌, డిగ్రీ కళాశాల, పట్టణంలో రోడ్ల విస్తరణ వంటివాటిని ఇంకా నెరవేర్చలేదు. హిందూపురం నుంచి బెంగళూరుకు ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌, మార్కెట్‌ యార్డులో రైతుల కోసం సౌకర్యలు ఏర్పాటు చేయలేదు. ప్రతి మండలానికీ గార్మెంట్‌ పరిశ్రమ ఏర్పాటు అంశం కూడా ఎమ్మెల్యే హామీల్లో ప్రధానమైనది.
 
ఆదర్శ సెగ్మెంట్‌గా తీర్చిదిద్దుతా
రాష్ట్రంలోనే హిందూపురాన్ని ఆదర్శ సెగ్మెంట్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం. హంద్రీనీవా నీటితో ప్రతి చెరువూ నింపాలనే సంకల్పంలో భాగంగా లేపాక్షి ఉత్సవాలప్పుడు కొన్ని చెరువులు నింపాం. నియోజకవర్గంలో తాగునీటి సమస్య లే కుండా చేస్తాం. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తాం. హిందూపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. తాగు, సాగునీరు తీసుకువచ్చేందుకు తొలి ప్రాధాన్యమిస్తాం. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చెరువులనూ కృష్ణా జలాలతో నింపేస్తాం. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి సంతృప్తినిచ్చింది. నేను ఎక్కడ ఉన్నా హిందూపురం అభివృద్ధిపైనే ఆలోచన ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా హిందూపురం అభివ ృద్ధి కోసం అడిగిన వెం టనే అన్నీ ఇస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే, హిందూపురం
శాశ్వత సమస్యలు పరిష్కారం కాలేదు
ప్రధానంగా రోడ్ల విస్తరణ అలాగే ఉండిపోయింది. పట్టణంలో వా హనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్‌, సిగ్నల్‌ వ్యవస్థ అధ్వానంగా ఉ న్నాయి. విద్యాపరంగా బాలుర జూనియర్‌, డిగ్రీ కళాశాల ఏర్పాటు నేటికీ కలగానే మిగిలింది. ఆదర్శ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినా దాని నిర్వహణలో విఫలమయ్యారు. హిందూపురాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఎమ్మెల్యే బాలకృష్ణలో బలంగా ఉంది. ఆయన స్థానికంగా ఉంటే ఇక్కడి పరిస్థితి మరింత బాగా తెలుస్తుంది.
శ్రీనివాసులు, ఉపాధ్యాయుడు, హిందూపురం
ఊహించని విధంగా లేపాక్షి అభివృద్ధి
మేము కలలో కూడా ఊహించని రీతిలో లేపాక్షిని ఎమ్మెల్యే బాలకృష్ణ అభివృద్ధి చేశారు. ఆయన తప్ప మరెవరూ ఇంతటి అభివృద్ధి చేసి ఉండేవారు కాదు. లేపాక్షి చెరువుకు నీరు తీసుకురావడంతో పాటు, లేపాక్షి విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత బాలకృష్ణకే దక్కుతుంది. అయితే ఆయన అందుబాటులో లేనందున సమస్యలు చెప్పుకునేందుకు ఆయనను కలవలేక పోతున్నాం.
వెంకటేష్‌, లేపాక్షి
Link to comment
Share on other sites

11 minutes ago, Siddhugwotham said:

He did some work on filling water into canals. The main drawback to point out Hero in Hindupur is unavailability to access MLA directly.

YSRCP hits Balayya on this point.

I believe it's not a big concern for public as long as they are happy with the works ..... 

Bala visited and spent many more days than chiru and Lot of celebrity and  business MLAs if you compare.... 

Output is more important than physical presence....

Link to comment
Share on other sites

5 minutes ago, nbk@myHeart said:

I believe it's not a big concern for public as long as they are happy with the works ..... 

Bala visited and spent many more days than chiru and Lot of celebrity and  business MLAs if you compare.... 

Output is more important than physical presence....

 

Link to comment
Share on other sites

3 hours ago, Siddhugwotham said:

He did some work on filling water into canals. The main drawback to point out Hero in Hindupur is unavailability to access MLA directly.

YSRCP hits Balayya on this point.

aasa ki anthu leyni vaadu manisi anni malli provveddd

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...