Jump to content

Nellore Airport ,Dagadarthi


Recommended Posts

ఊహల్లోనే చక్కర్లు!
ఖరారు కాని శంకుస్థాపన ముహూర్తం
దశాబ్ద కాలం నుంచి నిరీక్షణ
కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియ
చివరగా ఏడాది కిందట అప్పగింత
అయినా.. ఇంకా ఎదురుచూపులే
ఇదీ దగదర్తి విమానాశ్రయం తీరు
(ఈనాడు-నెల్లూరు)
nlr-top1a.jpg

దగదర్తి విమానాశ్రయం.. జిల్లాలో రెండేళ్లుగా విమానాశ్రయం నిర్మాణం కోసం ప్రతిపాదనలు.. భూసేకరణ ప్రక్రియ జరుగుతుందని అధికారులు చెప్పటం.. విమానాశ్రయ నిర్మాణ సంస్థ అధికారులతో సంప్రదింపులు.. దగదర్తి నుంచి విమానాశ్రయాన్ని తరలిస్తున్నట్లు ఊహాగానాలు.. ఎట్టకేలకు దగదర్తి దగ్గర విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రతిపాదించి.. భూసేకరణ చేపట్టినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో  ఏ పనీ కాలేదు. ఇదే సమయంలో విమానాశ్రయం శంకుస్థాపన ముహూర్తం కూడా కుదర్లేదు. ఒక విధంగా విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదనలు ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది. మరోవైపు భోగాపురం దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయ పనులు చకచకా జరుగుతున్నాయి. మన జిల్లాలో విమానం ఎప్పుడు ఎగురుతుందో? అనే ఎదురుచూపులే మిగిలాయి.

విమానాశ్రయ నిర్మాణం కోసం మొత్తం 1,379 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో పట్టా భూములు 336.32 ఎకరాలు, డీకేటీ భూములు 169.66 ఎకరాలు, సీజేఎఫ్‌ఎస్‌ భూములు 301.9 ఎకరాలు, పోరంబోకు భూములు 434.25 ఎకరాలు, ఏడబ్ల్యూ భూములు 137.57 ఎకరాలు   సేకరించాలని గుర్తించారు. అందుకు అనుగుణంగా విమానాశ్రయ నిర్మాణ సంస్థకు భూములు అప్పగించాలని రెవెన్యూ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. గత రెండేళ్లుగా భూసేకరణ పక్రియ కొనసాగుతూనే ఉంది. దాదాపు దశాబ్ద కాలం నుంచి దగదర్తిలో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదన ఉంటే.. రెండేళ్ల నుంచి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. పనులు ప్రారంభించటానికి సూచికగా శంకుస్థాపన కార్యక్రమం తేదీ ఖరారు కావటం లేదు. గత ఏడాది జూన్‌ 30వ తేదీన చివరిగా కె.కె.గుంట గ్రామంలో 2.89 ఎకరాల పోరంబోకు భూమిని సేకరించి అప్పగించారు. అంటే చివరిసారి భూసేకరణ ప్రక్రియను నిర్వహించి కూడా ఏడాది గడుస్తోంది. కానీ, ఇప్పటి వరకు శంకుస్థాపన నిర్వహించకపోవటం గమనార్హం.

భూములు అప్పగించారు.. విమానాశ్రయ నిర్మాణానికి ప్రస్తుతం రన్‌వే, ఇతర నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన భూములను అప్పగించామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇచ్చిన భూములతో నిర్మాణం చేపట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కొన్ని భూములకు సంబంధించి న్యాయపరమైన అంశాలు ఉన్నా.. వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్త తీసుకున్నారు. ఇప్పటి వరకు అప్పగించిన 1,051 ఎకరాల్లో.. పట్టా భూములు 231.39 ఎకరాలు, డీకేటీ భూములు 151.11 ఎకరాలు, సీజేఎఫ్‌ఎస్‌ భూములు 301.91 ఎకరాలు, ఏ.డబ్ల్యూ భూములు 137.57 ఎకరాలు, పోరంబోకు భూములు 226.11 ఎకరాలను విమానాశ్రయ నిర్మాణ సంస్థకు అప్పగించారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిపోర్ట్‌ నిర్మాణ సంస్థ తరఫున అధికారుల బృందం కూడా జిల్లాకు వచ్చి సమీక్ష నిర్వహించి వెళ్లింది.

* ఇంకా సేకరించాల్సిన 336 ఎకరాల్లో.. పట్టా భూములు 104.9 ఎకరాలు ఉండటం గమనార్హం. డీకేటీ భూములు 23.42 ఎకరాలు, పోరంబోకు భూములు 208.14 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో న్యాయపరమైన వివాదంలో ఉన్న భూములు కూడా ఉండటంతో ఆలస్యం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న భూములను కూడా అప్పగిస్తే విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి పనులు పూర్తయినట్లు లెక్క. 1,051 ఎకరాలు సేకరించేప్పటికే రెవెన్యూ అధికారులకు రెండేళ్లకుపైగా సమయం పట్టింది. ఒకానొక దశలో భూముల సమస్య కారణంగా విమానాశ్రయానికి కృష్ణపట్నం దగ్గర పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో ఏర్పాటు చేయాలని ప్రత్యామ్నాయ ప్రతిపాదన కూడా తయారు చేశారు.

nlr-top1b.jpg

శంకుస్థాపనకు కుదరని ముహూర్తం.. శంకుస్థాపన కార్యక్రమాన్ని గత ఏడాది నిర్వహించాలని విమానాశ్రయ నిర్మాణ సంస్థ ప్రతిపాదించింది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇలా ఏడాదిగా విమానాశ్రయ నిర్మాణ పనుల్లో ఎలాంటి కదలిక లేదు. భూముల సేకరణ.. పరిహారం రైతులకు ఇవ్వటం మాత్రమే పూర్తయింది. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్‌ నెలలో సీఎం జిల్లా పర్యటన ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో దగదర్తి విమానాశ్రయానికి శంకుస్థాపన కూడా చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు. దాదాపు దశాబ్దకాలం ఎదురుచూపులకు నిరీక్షణ ఎప్పటికి ఫలిస్తుందో?

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Concession pact for Nellore airport signed

 The State government signed a concession agreement for the development of greenfield airport at Dagadarthi in Nellore district, with SCL-Turbo consortium of Nellore International Airport.

Published: 22nd June 2018 06:04 AM  |   Last Updated: 22nd June 2018 06:04 AM   |  A+A-

By Express News Service

VIJAYAWADA:  The State government signed a concession agreement for the development of greenfield airport at Dagadarthi in Nellore district, with SCL-Turbo consortium of Nellore International Airport Private Limited on Thursday. The pact was signed by M Venkateswarlu, Managing Director of Andhra Pradesh Airport Development Corporation Limited, and Vankayapati Umesh, Managing Director of Nellore International Airport Private Limited, in the presence of Principal Secretary (Energy, Investment and Infrastructure, CRDA) Ajay Jain. 

Speaking on the occasion, Ajay Jain said the commercial operations from Dagadarthi Airport are expected to commence from January 2020. “The airport will be located 25 km from Nellore city and will be a catalyst for the socio-economic, tourism and industrial development of Nellore district and the adjoining regions,” he said.

The new airport, once starts functioning, is expected to play a key role in regional air connectivity.  The foundation stone ceremony is likely to be in either July or August and the final call on the issue will be taken after consultation with Chief Minister N Chandrababu Naidu.  Dagadarthi airport is envisaged to be a low-cost no-frills airport to be developed in Nellore district on public-private-partnership basis. The airport will be developed in 1,352 acres of land at a cost of `368 crore and will be the first airport project to be developed in the new State of AP. 

Link to comment
Share on other sites

SCL-Turbo signs deal to develop Nellore airport

DECCAN CHRONICLE.
Published Jun 22, 2018, 1:47 am IST
Updated Jun 22, 2018, 1:48 am IST
The Dagadarthi airport is envisaged to be a low-cost, no-frills affair to be developed on a public-private-partnership (PPP) basis.
Representational image.
 Representational image.

VIJAYAWADA: The AP government on Thursday signed a concession agreement for the development of a greenfield airport at Dagadarthi in Nellore district. The agreement was signed between representatives of the AP Airport Development Corporation Ltd (APADCL) and private developer SCL-Turbo consortium of the Nellore International Airport Pvt Ltd (NIAL).

Tollywood actor Ram Charan is one of the directors and brand ambassador of Turbo Megha Airways Pvt Ltd, the flagship company of the SCL-Turbo consortium. The Dagadarthi airport is envisaged to be a low-cost, no-frills affair to be developed on a public-private-partnership (PPP) basis. The airport will be developed on 1,352 acres at a cost of Rs 368 crore and will be the first airport project to be developed in the state on a PPP basis.

 

 

The airport will be designed to ultimately handle 1.9 million passengers and 55,000 tonnes of cargo a year.  It will have a 3,150-metre runway to handle category 4E wide-body passenger and cargo aircraft.  The date of the foundation stone laying ceremony would be decided in consultation with Chief Minister N. Chandrababu Naidu and is tentatively expected to be in July or August.

SCL seeks to tap Chennai air traffic
 
Of the two bids that Bhogapuram International Airport Corp. Ltd (BIACL) received to develop Dagadha-rthi airport, actor Ram Charan’s company offered nine per cent revenue share to the government, acco-rding to government sources.  BIACL is the state government’s nodal agency to develop airports in the state including the greenfield international airport at Bhogapuram in Vizianagaram district. BIACL was later rena-med as AP Airport De-velopment Corp Ltd.

Last year, there were reports that the state government had shelved the airport proposals at Dagadharthi due to various reasons. Turbo Megha is planning to tap air cargo traffic which has reached congestion point at Chennai on the lines of the Krishnapatnam seaport in Nellore district which tapped Chennai Port’s passenger and cargo traffic.

 

Link to comment
Share on other sites

విమానం కల నెరవేరనున్న వేళ!
దగదర్తి విమానాశ్రయానికి శ్రీకారం
2020 నాటికి రాకపోకలు ప్రారంభం
nlr-top1a.jpg

పెళ్ళకూరు: జిల్లా వాసుల విమానాశ్రయ కల ఎట్టకేలకు నెరవేరనుంది.. 2020 జనవరి కల్లా ఇక్కడ విమానం రయ్‌న దిగనుంది. ఇందుకు గాను నెల్లూరు ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టుప్రైవేటు లిమిటెడ్‌ (ఎన్‌ఐఏఎల్‌)తో  రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దగదర్తి వద్ద ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఈ ప్రైవేటు సంస్థ నిధులు వెచ్చించనుంది. విమానాశ్రయం నుంచి వచ్చే ఆదాయంలో అటు సంస్థతోపాటు రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం  కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. దీంతో రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత విమాన రాకపోకలు చేయనున్నాయి.జిల్లాలోని దగదర్తి దగ్గర దాదాపుగా 1,352  ఎకరాల్లో నిర్మాణం కానున్న విమానాశ్రయానికి అవసరమైన భూములు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. కేంద్రం ఇందుకు నిధులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్‌ పోర్టు డెవలప్‌మెంట్‌ సంస్థతో ఎన్‌ఐఎన్‌ఎల్‌  సంస్థ ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా 9 శాతం కాగా మిగిలిన సొమ్ము ప్రవేటు సంస్థ వెచ్చించనుంది. దీంతో గత ఇరవై ఏళ్ల కల ఎట్టకేలకు సాకారం కానుంది. ప్రస్తుతం ఇక్కడ వారంతా చెన్నై, తిరుపతి పట్టణాలకు వెళ్లి విమానాలు ఎక్కాల్సి వస్తోంది. జిల్లా పారిశ్రామికంగా విస్తరిస్తున్న దృష్ట్యా ఇక్కడ విమానాశ్రం అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం నిర్మాణం వేగిరం చేసింది.

nlr-top1b.jpg

రాష్ట్రానికి చెందిన టర్బోఎయిర్‌వేస్‌ సంస్థ ఇప్పటికే ట్రూజెట్‌ పేరుతో విమానాలు నడుపుతోంది. ఇదే సంస్థ ఇక్కడ విమానాశ్రయాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థ వేసిన బిడ్‌కు ప్రభత్వం ఒప్పుకుంది. నెల్లూరు ఎయిర్‌పోర్టు పేరుతో ఓ సంస్థను నెలకొల్పింది. దీని ద్వారా ఇక్కడ కార్యకలాపాలు జరగున్నాయి. ఆర్భాటాలు లేకుండా అవసరాలకు తగ్గట్లు నిర్మాణాలు జరగనున్నాయి. ఇక్కడే ప్రజారవాణాతోపాటు కార్గోసేవలు చేపట్టడానికి నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్గోదే బంగారు భవితని గుర్తించిన ప్రభుత్వం ఇక్కడ నుంచే దేశీవిదేశాలకు సరకు రవాణాలు సేవలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది. ఇలా ఇక్కడకు దేశీయ విమానాలతోపాటు విదేశీ విమానాలు రానున్నాయి. గత ఆరేళ్ల కిందట తిరుపతి విమానాశ్రయంలో కూడా కార్గో సేవలు విస్తరించారు. ఇక్కడ నుంచి మామిడి వంటి పండ్లు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఊరిస్తూ.. ఊరడిస్తూ:  గత ఇరవై ఏళ్లుగా జిల్లా వాసులు కలగన్న విమానాశ్రయం కల ఇప్పటికి పట్టాలెక్కింది. ఇక పనులు వేగంగా చేపట్టడానికి ఎయిర్‌పోర్టు సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్లు నిర్మాణ లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకెళ్తోంది. ఇలా నిర్మాణాలు, రన్‌వే, షాపింగ్‌, విశ్రాంతి గదులు వంటిని ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది.ఇవన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.

జులైలో ముఖ్యమంత్రి శంకుస్థాపన: వచ్చే నెల మొదటి వారంలో దీని నిర్మాణానికి అసవరమైన శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారు. ఇందుకు అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రైవేటు నిర్మాణ సంస్థలకు అప్పగించి పనులు పూర్తి చేయనున్నారు. ఇలా నిర్మాణాలకు అధునిక సాంకేతిక పద్థతుల ఉపయోగించనున్నారు. ఎంత త్వరగా పనులు చేయాలో నిర్ణయించిన సంస్థ పెద్దపెద్ద నిర్మాణ సంస్థలను ఆహ్వానించనుంది. ఇలా పనుల్లో వేగంగా చేపట్టి 2020 జనవరికి పూర్తి చేయాలని ప్రణాళిక చేశారు.

పోర్టు- దగదర్తికి అనుసంధానంగా కార్గోసేవలకు రహదారి ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం నుంచి నెల్లూరుకు ఓ రహదారి ప్రతిపాదన ఉంది. దీనిని ఆరు వరుసల రహదారి ఏర్పాటు చేయనున్నారు ఇదంతా పూర్తయితే నెల్లూరు మీదుగా విమానాశ్రయానికి సరకు రవాణా చాలా సులభం కానుంది. దీని ద్వారా ఆదాయం కూడా ఎక్కువగా సమకూరే అవకాశముంది. సరకు రవాణా ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది. ఇటు పోర్టుకు సరకు రవాణసేవలు విస్తరించనున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Nellore airport work to kick-start from August

By P V Prasad | THE HANS INDIA |   Jul 03,2018 , 12:37 AM IST
   

grabon.jpg

Nellore airport work to kick-start from August
Nellore airport work to kick-start from August
 
 
Nellore: The auspicious hours seem to have arrived for Nellore greenfield airport. The ground-breaking ceremony for the much-awaited airport is likely to take place in the first week of August.
 
The state government has already signed the concession agreement with the developer - SCL-Turbo which has formed a consortium - Nellore International Airport Private Limited for construction of the airport.
 
 
 
 
 
 
 
 
 
 
The date for ground-breaking ceremony would be finalised whenever Chief Minister Chandrababu Naidu gives time. The project works are likely to begin in January next year and the developer is planning to complete the project by 2020. As envisaged, the domestic airport is expected to get business from cargo transport since the region is known for industries. 
 
 
 
Hence, Nellore International Airport Private Limited is also planning a cargo hub to benefit from the huge demand from local industries and also from nearby cities like Chennai.
 
As per the concession agreement, a revenue share of 9 pc will be allowed to the government. The consortium has tied up with a French airport operator for operations and maintenance and it will have capacity to handle up to 2 million passengers a year and handle 55,000 tonnes of cargo.
 
Tirupati’s main source is cargo rather than passenger traffic. But, Visakhapatnam, Vijayawada and Rajahmundry airports are witnessing encouraging growth in both passenger and cargo traffic. The Airports Authority of India also anticipated a huge potential service and industry sectors in Nellore district which are flourishing.
 
Another factor that would work in airport’s favour is that the national highway is close to the airport and Nellore city only 30 km away from where rail connectivity is available. The Nellore airport might dip into the cargo business of Tirupati.
 
“Chennai seaport, Chennai and Tirupati airports are facing severe pressure with huge cargo traffic and possibly some traffic would be diverted to Dagadarthi because Nellore is close to both the cities. There will, therefore, be good future to the domestic airport in the district,” said a senior official connected to the project. 
 
The Dagadarthi airport will be a low-cost, no-frills airport being developed on public-private-partnership (PPP) basis and it will come up in an area of 1,352 acres at a cost of Rs 368 crore. The airport will have a 3,150-metre long runway to handle category 4E wide body passenger flights, and cargo aircraft, the official said.
 
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...

Groundbreaking ceremony for Nellore Airport likely on August 24

THE HANS INDIA |   Aug 12,2018 , 03:24 AM IST
   
 

grabon.jpg

Groundbreaking ceremony for Nellore Airport likely on August 24
Groundbreaking ceremony for Nellore Airport likely on August 24
 
 
Nellore: Groundbreaking ceremony of Nellore airport is tentatively to be held on August 24 and the Chief Minister has to finalise the date. Managing Director of Turbo Aviation Private Limited Vankayalapati Umesh visited the project site on Saturday and interacted with the project staff. Umesh, interacting with the mediapersons who met him, said that the cargo flights are going to be started from the airport for the first time as part of improving logistics from the region. 
 
The domestic airport is being constructed under PPP mode and the State government had earmarked 1,350 acres of lands for the facility in Dagadarthi mandal. Both cargo and passenger traffic are handled here and said they were expecting more cargo business by virtue of huge industrial activity in the region. Currently, cargo flights are being operated from Chennai and Kolkata airports and the proposed airport at Dagadarthi would cater to the huge needs of the area.
 
 
 
 
 
 
 
 
 
 
He said Krishnapatnam Port, NH-16, railway and road connectivity, and industrial zones are advantages to the airport in the district. Aqua products, bulk drugs, flowers, vegetables, marine products, and others will be exported to other parts of country and globe. Passenger flights would also be operated to various countries as soon as the facility is stabilised. He said they would require Rs 350 crore for taking up works initially and they would expand basing on the need, he explained. He exuded confidence that the works would be completed by 2020.
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
17 minutes ago, katti said:

money ivvakunda works cheyyatam too much... I hope courts will once for all give a good judgement on such activities...

a lands edo problem undi bro, adi sainkula ki ketayinchina bhumi aukunta, chatta prakaram kontha problem undi undi akkada

Link to comment
Share on other sites

  • 4 weeks later...
గఘన విహారమే
దగదర్తి విమానాశ్రయ పనులకు వచ్చేనెల 11న శంకుస్థాపన
సీఎం చంద్రబాబు రాక
2020 నాటికి పనులు పూర్తి లక్ష్యం
nlr-top1a.jpg

దగదర్తి దగ్గర విమానాశ్రయం ఏర్పాటు కల తీరనుంది. ఏళ్లుగా గగన విహారం చేయాలన్న జిల్లా ప్రజల కోరిక నెరవేరనుంది. భూసేకరణ అడ్డంకులను అధిగమించి పనులు ప్రారంభించటానికి వీలుగా విమానాశ్రయ ఏర్పాటు సంస్థ ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్ల వ్యవధిలో సేవలను అందించటానికి కసరత్తు చేస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. అక్టోబరు 11న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించటానికి ఏర్పాట్లు చేశారు.

ఈనాడు-నెల్లూరు

దగదర్తి దగ్గర విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా ఆలోచన ఉంది. విమానాశ్రయం ఏర్పాటు కోసం సుమారు 1,350 ఎకరాల భూమి అవసరం ఉంటుందని తేల్చారు. ఇంత పెద్ద మొత్తంలో భూములను సేకరించాలంటే అధికారులకు తీవ్ర  ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇందులో ప్రభుత్వ, సీజేఎఫ్‌ఎస్‌ భూములు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో భూములు ఒకరి పేరిట రికార్డుల్లో ఉంటే.. క్షేత్రస్థాయిలో మరొకరు సాగు చేసుకుంటున్నారు. వివాదాల మయంగా మారింది. దీన్ని సరిదిద్దటమే అధికారులకు పెద్ద సమస్యగా మారింది. కొందరు కోర్టును ఆశ్రయించటంతో భూములను విమానాశ్రయ ఏర్పాటు సంస్థకు అప్పగించటానికి అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు విమానాశ్రయ రన్‌వే, పరిపాలన భవనాల నిర్మాణానికి అవసరమన భూములను సేకరించి సంస్థకు అప్పగించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ, సీజేఎఫ్‌ఎస్‌, పట్టా భూములు కలిపి 1,051 ఎకరాలను సంస్థకు ఇప్పటికే స్వాధీనం చేశారు. అవసరమైన భూముల్లో ఎక్కువ శాతం రావటంతో పనులను ప్రారంభించటానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి.

అంతర్జాతీయ ప్రమాణాలతో..
ప్రధానంగా అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాన్ని నిర్మించాలని సంస్థ భావిస్తోంది. సరకు రవాణాకు ప్రస్తుతం చెన్నై విమానాశ్రయంపై విపరీతమైన ఒత్తిడి ఉంది. చెన్నై నగరాన్ని ఆనుకుని ఉండటంతో దగదర్తి విమానాశ్రయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు సరకు రవాణా విమానాలను నడిపే విధంగా నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్టు డి ప్యారిస్‌ సంస్థ ఇప్పటికే రెండు ప్రధాన విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. అదే సంస్థ దగదర్తి విమానాశ్రయానికి సాంకేతిక సాయాన్ని అందిస్తుంది. సంస్థ పర్యవేక్షణలోనే నిర్మాణం జరుగుతుంది. కేవలం సరకు రవాణాకే పరిమితం కాకుండా ప్రయాణీకుల కోసం విమానాలను కూడా ఇక్కడి నుంచి నడపనున్నారు. ప్రధానంగా బెంగుళూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం నగరాలను అనుసంధానం చేసే విధంగా సర్వీసులను నడపాలని సంస్థ భావిస్తోంది. ఈ మేరకు పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు.

* సీఎం చంద్రబాబుచే అక్టోబరు 11న శంకుస్థాపన చేపట్టడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం నుంచి ఆమోదం కూడా లభించినట్లు సమాచారం. ఇక పనులు ప్రారంభించే అవకాశం ఉంది. పనులను వేగంగా పూర్తి చేసి 2020 మార్చి నాటికి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. అప్పటికి పూర్తి కాకుంటే మాత్రం 2020 డిసెంబరు నాటికి కచ్చితంగా అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ఎండీ వంకాయలపాటి ఉమేష్‌ చెప్పారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ ఇండిగో విమానయాన సంస్థ తమ వాహనాలను ప్రస్తుతం శ్రీలంక తీసుకెళ్లి నిర్వహణ చేయిస్తుంది. ఇండిగో సంస్థతో ఇప్పటికే సంప్రదింపులు జరిపాం. దగదర్తి దగ్గర విమానాశ్రయం ఏర్పాటైన తర్వాత నిర్వహణకు ఇక్కడికే రావటానికి అంగీకరించారన్నారు. ఇక్కడి నుంచి పలు విమానాలను ఇండితో సంస్థ నడుపుతుందని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...