Jump to content

Lokesh Mass Tweets


Recommended Posts

Guest Urban Legend
1 hour ago, Bolineni Tiger said:

Vadu public ga recchi pothunte ee tweets evaru chustharu asalu Twitter lo enni retweets ayyay ika media sangathi devudu erugu

yes no just tweets ..pressmeet lo gattiga samadhanam cheppali ... local MLA MP kuda 

Link to comment
Share on other sites

పవన్‌ కల్యాణ్‌కు లీగల్‌ నోటీసులు
24-05-2018 09:22:29
 
636627505515674842.jpg
  • ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు
  • పవన్‌ కల్యాణ్‌కు లీగల్‌ నోటీసులు: ఎమ్మెల్యే శివాజీ
పలాస(శ్రీకాకుళం జిల్లా): తాను సర్దార్‌ గౌతు లచ్చ న్న కుమారుడినని, ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను, తన కుటుంబం ఏనాడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని ఎమ్మెల్యే గౌతు శివాజీ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎవరో ఇచ్చిన స్ర్కిప్ట్‌ చదివి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మా కుటుంబ వ్యక్తి పై ఆరోపణలు చేయడం తగదన్నారు. అవినీతి ఆరోపణలు చేసిన పవన్‌కు ఇప్పటికే లీగల్‌ నోటీసులు పంపించామని చెబుతూ వాటి ప్రతులను విలేకరులకు అందించారు. నియోజకవర్గం లో తానంటే ఏమిటో అందరికీ తెలుసని, జిల్లా లో సీనియర్‌ ఎమ్మెల్యేగా జిల్లాలో ఏ కార్య క్రమంలోనైనా ముక్కు సూటిగా మాట్లాడుతూ స్వపక్షంలో విపక్ష నేతగా గుర్తింపు పొందానన్నారు.
 
కుమారుడైనా, అల్లుడైనా యార్లగడ్డ వెంకన్న చౌదరి అండగా ఉన్నారని, తమ కుటుంబీకుల అభీష్టం మేరకు ఆయనకు అన్ని పగ్గాలు అప్పగించామన్నారు. కిడ్నీ వ్యాధులపై స్పందించడం లేదని నినదించడం తగదని, విశాఖపట్నానికే పరిమితమైన డయాలసిస్‌ కేంద్రాలను పలాస, సోంపేటకు తీసుకువచ్చామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలకు కట్టుబడి నిలబడి నిరూపించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలన్నారు. పలాస టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి మాట్లాడుతూ లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు.
 
 
పవన్‌ వ్యాఖ్యలకు నిరసనగా రోడ్డు శుద్ధి
జనసేన అధ్యక్షుడు పవన్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బుధవారం ఆందోళన చేశారు. పవన్‌ వెళ్లిన రోడ్లను పేడ నీళ్లతో కడిగారు. అంబేద్కర్‌, మహాత్మాగాంధీ, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పసుపునీటితో సంప్రోక్షణ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శివాజీ, పలాస కన్వీనర్‌ వై.వెంకన్న చౌదరి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కామేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పి.విఠల్‌, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...