Jump to content

Janasena - PRP 2.0


RKumar

Recommended Posts

జనసేనలో తోట చంద్రశేఖర్‌‌కు కీలక బాధ్యతలు
22-05-2018 08:12:39
 
636625735607237686.jpg
  • పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌
  • పీఆర్పీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ఆరంగేట్రం
ఆంధ్రజ్యోతి గుంటూరు : సినీ హీరో పవన్‌ కళ్యాణ్‌ ఏర్పాటు చేసిన జన సేన పార్టీలో కీలక పదవి గుంటూరు వాసి చేపట్టారు. గతంలో మహారాష్ట్ర ఐఏఎస్‌ అధికారిగా పని చేసి రాజీనామా చేసిన తోట చంద్రశేఖర్‌ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. తోట చంద్రశేఖర్‌ 1987 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈయన మహారాష్ట్రలో 2008 వరకు పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి పీఆర్పీలో చేరారు. ఆయన్ను పీఆర్పీ గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించింది. అప్పట్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆపరాజయం తరువాత చంద్రశేఖర్‌ కొంత కాలం పాటు రాజకీయలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు గుంటూరుకు చెందిన చంద్రశేఖర్‌ పేరు రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పవన్‌ కళ్యాణ్‌ ఏర్పాటు చేసిన జనసేన పార్టీలో ఉన్నారు. ఆవిర్భావం నుంచి అందులో కీలక పాత్ర పోషిస్తూ పవన్‌కు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ వచ్చారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల లెక్కలు తేల్చేందుకు పవన్‌ ఏర్పాటు చేసిన జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యారు. ఈ పర్యాయం కూడా చంద్రశేఖర్‌ జనసేన తరుపున గుంటూరు లేదా ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది. పవన్‌ కళ్యాణ్‌తో గత పదేళ్లుగా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ ఆయన నియామకం సందర్భంగా వెల్లడించారు. చంద్రశేఖర్‌ పారిశ్రామిక వేత్తగా కూడా పేరు పొందారు. వ్యాపార రీత్యానే ఆయన గుంటూరు నుండి వెళ్లి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దీని వల్ల ఆయనకు స్థానికంగా బలమైన సంబంధాలు దూరమయ్యాయి. మళ్లీ వాటిని దగ్గరికి చేర్చుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. చంద్రశేఖర్‌ స్వస్థలం గుంటూరు. ఇక్కడే విద్యా భ్యాసం జరిగింది.
 
 
ఉద్యోగంలో ఎన్నో రికార్డులు
1987లో ఐఏఎస్‌కు ఎంపికై మహారాష్ట్ర క్యాడర్‌లో నియమితుడయ్యారు. మహారాష్ట్ర హౌసింగ్‌ అండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ సీఈవోగా పని చేశారు. అప్పట్లోనే తన హయాంలో పట్టణ పేదలకు లక్ష ఇళ్లు కట్టించి రికార్డు సృష్టించారు. ముంబై మహానగరానికి మున్సిపల్‌ కమిషనర్‌గా కూడా పని చేశారు. అక్కడా అనేక సంస్కరణలకు నాంథి పలికారు. అయితే పీఆర్పీ ఆవిర్భావంతో ఆయన చూపు రాజకీయాల వైపు మళ్లింది.
Link to comment
Share on other sites

3 hours ago, AnnaGaru said:

js = prp/10 + bjp = prp/15 ?

 

Vere chotla aemo kani... last 2 wks India trip lo nenu guntur, ponnur, tenali, bapatla vellanu... minimum interest kuda ledu PK/Janasena mida jenallo...

prp ki picha hype vundedi... dantho polisthe 5% kuda ledu

Link to comment
Share on other sites

dramalu oka range lo untayi ee candidates vi...

 

oka pakkana samajika nyayam... inko pakka cops ki reservation kavali..

oka pakkana memu separate, maaku adhikaram kaavali ani cheppadam, maro pakka avatha valladi kula pichi ani thittadam.. (u need to see the likes of kalyan dileep etc.)

oka pakkana special status vadala ledu, inko pakkana poratam emo state govt meeda!

Link to comment
Share on other sites

 

జనసేనని ఎందుకు కులసేన అంటున్నారో ఒకసారి ఆ పార్టీ నిర్మాణాన్ని చూస్తే మీకే అర్ధం అవుతుంది...

జనసేన పార్టీ అధ్యక్షడు- పవన్ కళ్యాణ్ (కాపు)

జనసేన కోర్దినేటర్ -మాదాసు గంగాధరం (కాపు)

జనసేన అధికార ప్రతినిధి-తోట చంద్రశేఖర్ (కాపు) 

జనసేనా కోశాధికారి-మారిశెట్టి రాఘవయ్య (కాపు)

జనసేనా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్
--అద్దేపల్లి శ్రీధర్ (కాపు) 
--పార్థసారథి (కాపు)

జనసేనా మీడియా ఇంచార్జ్-పసుపులేటి హరిప్రసాద్ (కాపు)

జనసేనా యువజన విభాగం ప్రెసిడెంట్-కిరణ్ (కాపు)

జనసేన కృష్ణా-గుంటూరు ఉభయాజిల్లాల ఇంచార్జీ
- ముత్తంశెట్టి కృష్ణారావు (కాపు)

ఇలా పార్టీలో ఉన్న అత్యంత ప్రాధాన్యత పదవులు, ఉన్నతస్థానాల దగ్గరి నుంచి చివరికి జిల్లా ఇంచార్జీల వరకు ప్రతిచోటా కాపు నాయకులతో నింపేశారు...

పవన్ కళ్యాణ్ ఏమో మా పార్టీ కులాలకు అతీతం అని చెప్తూ ఇలా ఒక సామాజిక వర్గానినే అందలం ఎక్కించడం దేనికి నిదర్శనం #PK గారు...

 

Link to comment
Share on other sites

1 hour ago, anil Ongole said:

 

జనసేనని ఎందుకు కులసేన అంటున్నారో ఒకసారి ఆ పార్టీ నిర్మాణాన్ని చూస్తే మీకే అర్ధం అవుతుంది...

జనసేన పార్టీ అధ్యక్షడు- పవన్ కళ్యాణ్ (కాపు)

జనసేన కోర్దినేటర్ -మాదాసు గంగాధరం (కాపు)

జనసేన అధికార ప్రతినిధి-తోట చంద్రశేఖర్ (కాపు) 

జనసేనా కోశాధికారి-మారిశెట్టి రాఘవయ్య (కాపు)

జనసేనా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్
--అద్దేపల్లి శ్రీధర్ (కాపు) 
--పార్థసారథి (కాపు)

జనసేనా మీడియా ఇంచార్జ్-పసుపులేటి హరిప్రసాద్ (కాపు)

జనసేనా యువజన విభాగం ప్రెసిడెంట్-కిరణ్ (కాపు)

జనసేన కృష్ణా-గుంటూరు ఉభయాజిల్లాల ఇంచార్జీ
- ముత్తంశెట్టి కృష్ణారావు (కాపు)

ఇలా పార్టీలో ఉన్న అత్యంత ప్రాధాన్యత పదవులు, ఉన్నతస్థానాల దగ్గరి నుంచి చివరికి జిల్లా ఇంచార్జీల వరకు ప్రతిచోటా కాపు నాయకులతో నింపేశారు...

పవన్ కళ్యాణ్ ఏమో మా పార్టీ కులాలకు అతీతం అని చెప్తూ ఇలా ఒక సామాజిక వర్గానినే అందలం ఎక్కించడం దేనికి నిదర్శనం #PK గారు...

 

veellu mallee tdp ni kulam party ani thittadam... bajaffa batch!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...